Pages

🥀🥀🥀🥀పార్ట్6....part..6 నిరీక్షణ ..shortstory🥀🥀🥀🥀

Part 6
కాలేజీ కి చేరుకున్నారు ......అరుణకుమారి శివనారాయణ లు ..మార్కుల షీట్ లు ..చూసుకున్నారు ..ఇద్దరికి మంచి పర్సెంటేజ్ మార్కులు వచ్చాయి ..స్టాఫ్ మీటింగ్  కి ఆహ్వానించారు సబ్జెక్టు లెక్చరర్స్ ...ప్రిన్సిపాల్ వాళ్ళు ఇద్దరిని అభినందిస్తున్నారు ..కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీళ్ళు ను కర్చీఫ్ తో అద్దుకుంటూ ఉంది అరుణ కుమారి ...మాకు చెప్పిన లెక్చరర్ లు వారి బోధన వల్లే మాకు ఇంత పర్సెంట్ మార్కులు వచ్చాయి ..ఇంకా మాతల్లి తండ్రులు ప్రోత్సాహం చెప్పలేనిది కానీ ఈ విషయం చెప్పాలంటే మా నాన్నగారు లేరు ..అంటూ కర్చీఫ్ లో ముఖం దాచుకొని బిగ్గరగా బాధ పడుతోంది ..అరుణ కుమారి ..ప్రిన్సిపాల్ లేచి దగ్గరగా వచ్చాడు ..ఇంతలో లేడీ లెక్చరర్స్ ఆమెను దగ్గరకు తీసుకొని ఓదార్చారు ..ఇంతలో ..చూడు తల్లీ ..నీ వు కష్టపడటం ..చదువుకోవడం ..అప్పట్లోనే మీ నాన్న గారు నాతో చెప్పారు ..మా అమ్మాయి కాలేజ్ కి మంచి పేరు తెస్తుందని ..మంచి మార్కులు సాధించి పదిమందికి ఆదర్శప్రాయం గా నిలుస్తుంది అని చెప్పేవారు.. ఏదిఏమైనా శివ ..అరుణ ఇద్దరు కాలేజీ కి మంచి ర్యా0కు లు తెప్పించిపెట్టారు ..ఇద్దరు ఢీ అంటే ఢీ అని పోటీపడి కష్ట పడి ఇద్దరు మార్కులు సమానం గా సాధించారు మీకు .మీ తల్లిదండ్రులు కు మేము అందరం అభినందనలు తెలుపుతున్నాము కాబట్టి అప్పట్లోనే మీ నాన్నగారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలిపావు ఇక బాధపడవద్దు ..ఇక మీరు ఇంకా పై చదువులు చదివి ఇంకా గొప్ప మంచి పేరు ను మీ ఊరికి మన కాలేజీకి తెప్పించాలని అంటూ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఉంటే అందరూ చప్పట్లుకొడుతూవున్నారు..........
*                                          *                                      *                               *

తనకు జరిగిన అనుభవాలు ,చూసిన కొన్ని సందర్భాలు ..తన కూతురు జీవితంలో రాకూడదని ..ఆమె జీవితాన్ని మంచిగా స్థిరపరచాలని ..ముఖ్యంగా వైవాహికజీవితం బాగుండా లని ఎన్నో కలలు కంటున్నాడు డాక్టర్ రమణ .సంపాదించిన ఆస్తి పాస్థులు ఉన్నాయి  ..అవి చూసుకుంటూ అనుభవిస్తూ కళ్ళ ముందు కూతురు అల్లుడు కనిపిస్తూవుంటే చాలు అని భగవంతుని ఎప్పుడూ ప్రార్ధన చేస్తూ ఉంటాడు ..ఒక మంచి కుర్రాడు దొరికాడు నేను అనుకునే అన్ని మంచి లక్షణాలు అతనిలో ఉన్నాయి పైగా మన లాంటి సంప్రదాయ కుటుంబం ..అని అనుకుంటే ..అత గాడు ప్రేమ దోమ అంటూ పగటి కలల్లో బతుకుతూ వున్నాడు ఎలా ఆలోచనల్లో పడ్డాడు రమణ ..తన స్నేహితుడు గోపాలరావు ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న  కాలేజీ కి వెళ్ళాడు డాక్టర్ రమణ ..ఇద్దరు కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు ..పిల్లల విషయం వచ్చి 0ది ..మా అమ్మాయి ది చదువుఅయిపోయి0ది ..నీకుతెలుసుగా డెంటల్ డాక్టర్ ..ఇక పెళ్లిచేసేయాలని .అనుకుంటున్నాను ..అని రమణ చెప్పే0తలో..దానికేముందిరా మా మేనల్లుడు ..వున్నాడు కార్డియాలజిస్ట్ ..మాట్లాడమంటావా ..ఇద్దరూ కలిసి ఒక హాస్పిటల్ పెట్టుకుంటారు ..బ్రతుకుతారు ..తడుముకోకుండా చెప్పేశాడు గోపాలరావు.. .అదీకాదయ్య..బాబు నాకు కొన్ని అనుభవా లు దృష్ట్యా నేను మా అమ్మాయి కి ఒక మంచి అబ్బాయి ని వెతికాను కానీ ..ఇంతలోనే నిరాశ వచ్చి పడింది ..ఆ అబ్బాయి తో ఒక స్నేహితుడు గా తిరిగి అతని గురించి అన్నివిషయాలు రాబట్టాను ..అతగాడు ఆరోజుల్లో వున్న ఒక జమీందారి కుటుంబ0 ..తండ్రి గారు లేరు ..తల్లి గారు ఉంది .ఒక చెల్లెలు పెళ్లి కి ఉంది ..ఈ అబ్బాయి ఇక్కడ సైకాలజీ లో పరిశోధన మంచి జీనియస్..మంచి ప్రవర్తన .కాకపోతే ఇక్కడ సిటీ లో వాళ్ళ చుట్టాల అమ్మాయి ని లవ్ చేస్తున్నాడు ..అది కూడా వాన్సైడ్ లవ్  ఆ అమ్మాయి అస్సలు ఈయనను  పట్టుంచుకోదు ....ఈ సా..రు లొట్టలు ఏసుకుంటూ తిరుగుతూవున్నాడు ..ఏం చేద్దాం ..ప్రశ్న గా ముఖ0 పెట్టాడు డాక్టర్ గారు ..అబ్బా ఏం లవ్ లండి ..మన చిన్నతనం లో అమ్మాయి ..లేక అబ్బాయి ఎవరికి ఎవరో పెద్దోళ్లే సెలెక్ట్ చేసేవారు ..మనం పెళ్లిపీటలు ఎక్కి కూర్చోడమే ..అస్సలు ఈ జాతకాలు కలవాలి వాస్తు బాగుండాలి ..ఈ పిచ్చి ఎక్కడ ఉంది ..అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న మనతాతలు తొంభై.. వంద బ్రతికేటోళ్లు ..పైగా ఒకొక్క ఇంట్లో పదిమంది ..పన్నెండుమంది  ని కంటానే వుండేవో ళ్ళు ..మరి ఇప్పుడు పెళ్ళి చేసుకోవడమే ముప్పై యేళ్ల కు అది కూడా జాతకాలు కలవాలి ...ఆ కలసిన దానిలో ఎక్కువ మార్కులు రావాలి ..ఏమిటో ఈ గోల ..మళ్ళీ పిల్లల కలగటం లేదని టెస్ట్ లు మందులు ..పూజలు వ్రతాలు ..కాలం అంతా మారిపోయింది ..ఒకప్పుడు చిన్న పిల్లలు తాత లు మామ్మ లను చూసి వాళ్ళతో ఆడుకొనేవారు ...ఇప్పటివాళ్లకు ..తల్లిదండ్రులు ..తాత బామ్మ లు ఆయుతేగాని పిల్లలు రావడం లేదు పిచ్చాపాటి మాట్లాడుకొంటూ నవ్వుకొంటున్నారు ...అది కాదురా ..బాబూ ..డబ్బు ఫుల్లుగా గా ఉంటే అన్నీ కొట్టుకపోతాయు ..అనుకో ఇక అప్పుడు జాత కాలు ..మార్కులు ఏ గోల ఉండదు ..అంటూ పెద్దగా నవ్వాడు ఇంకో కాయన .. ..వదిలేవోయ్ ..బోలేడు మంది వున్నారు ..మంచి సంభంధం చూసి  చేద్దాము ....కొంచం సీరియస్ గా చెప్పాడు మిత్రుడు గోపాలరావు ..సరే అది వదిలేయ్ ..కానీ ఆ గాంధీనగర్ కాలేజీ లో నీకు తెల్సిన వాళ్ళు ఎవరైనా వున్నారా ..కొంచెము గట్టి గా అడిగాడు డాక్టర్ రమణ ..సర్లే ..కాలేజీ కి పోతే ఎవడో ఒకడు తెల్సిన వాళ్ళు ఉంటారు . ఏముంది ..ఒకసారి పోయిద్దాం ప్రిన్సిపాల్ ని ఊరికే కలుద్దాము .బయలుదేరి కాలేజీ కి చేరుకున్నారు ..అందరూ .
*                          *                           *                          *                           *
పెళ్ళి చేసుకున్న అమెరికా లో సెటిల్ అయిన సుధ కు అత్తింటి వారితో కష్టాలు మొదలయ్యాయి ..పిల్లలు కలగడం లేదని ..ఇంకోపెళ్ళి చేయాలని అనుకుంటున్న మాటలు ..ఆమె ను మరీ బాధకు గురిచేస్తున్నాయు ..పైగా గర్ల్ ఫ్రెండ్స్ ను వేసుకొని  తిరిగి ఎప్పటికో ఇంటికి రావడం .తాను ..ఇంటి విషయాలు ఎవరికైనా చేరవేస్తుందేమో ..అని ఎవర్నీ కలవనీయకుండా ఆంక్షలు పెట్టి మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు ..ఆమె అత్తింటి వారు ..సుధ ఎవరికి చెప్పు కోలేక..మానసిక ఒత్తిడి కి గురిఅవుతోంది ...ఫోన్ లో అప్పుడప్పుడు తల్లిదండ్రులు తో మాట్లాడుతోంది కానీ ..అది కూడా వాళ్ళ పెత్తనం తోనే నడిపిస్తున్నారు ..దానితో అక్కడ ఏం జరుగుతుందో స్పష్టంగా అర్థం చేసుకోలేక ..సతమతమవుతున్నారు.పోనీలే మన తో మాట్లాడ క పోయినా పర్వాలేదు ..వాళ్ళు చక్కగా ..హాయిగా ఉంటే చాలు ..అనే ఆలోచనలో ఉండిపోయారు ..సుధ తల్లిదండ్రులు ******
*                                      *                                 *                                     *
కాలేజీ నుంచి బయలుదేరి ఇంటికి చేరుకున్నారు .అరుణ.. శివనారాయణ లు ..అమ్మయుగారు ....నేను మీ ఇంటి దాకా వస్తే ..మీ బాబాయి లు ..ఇంకా మీచుట్టాలు నాపని బడతారు ..పైగా కొంచెం చీకటి పడుతోంది కదా ..మీరే ఎలాగో అలా వెళ్ళండి ..నమస్కారం పెట్టాడు శివనారాయణ ..మరి ఏం కాదు నేను ఒక్క దానినే నడుచుకుంటూ వెళ్ళాలా? అదేం కుదరదు ..నువ్వు ఇంటి కాస్త దూరం లో వదిలేసి వెళ్ళు ..పట్టుబట్టింది అరుణ కుమారి .అబ్బా మీకు నా బాధ అర్థం కాదు అంటూ మెల్లగా అన్ని వైపులా చూస్తూ అడుగులు వేస్తున్నాడు శివ ..సరే బాబు మళ్ళీ మనం ఎలా కలుసుకోవడం ..పై చదువులు చదవాలి మనం ..పరిశోధన రంగం లో మనం ప్రవేశించాలి ..అది ఆలోచించు కాస్త ..గట్టిగా చెప్పింది అరుణ. అబ్బా అది తరువాత ..ఇప్పుడు ఈ గండం గట్టె క్కితే అదే పదివేలు... మనస్సులో గొణుక్కుంటూ ..నే ఇంకోపక్క వూ ..కొడుతూ వున్నాడు ...ఎలాగో అలా ఒళ్ళు బిగబట్టుకొని .వాళ్ళ ఇంటి దగ్గర లో దింపి వచ్చేశాడు ..శివ ..ఎలా కలుద్దాం ..మళ్ళీ మీ గుడి దగ్గరకే వస్తూవుండండి మేడమ్ ..మా అమ్మ నాన్న గారు కూడా వుంటారుగా ..ఇక ఉంటానండీ ..మీరు జాగ్రత్తగా వెళ్ళండి శివా ..
మీరు కూడా అంటూ వేగంగా అడుగులు వేస్తూ ఇంటికి చేరిపోయాడు శివ ..గేట్ దగ్గర బాబాయి శేఖర0 ఎదురయ్యాడు ..ఇంత సేపు ఎక్కడి కి వెళ్ళావు ....మేం వస్తాం కదా తోడు రమ్మంటే ..ఏం పనులు ఇవి ..కొద్దిగా మొహం చిట పట లాడిస్తున్నాడు శేఖరం ...ఏం మాట్లాడకుండా మెల్లిగానడుస్తూ  ఇంటి క్యాంప్ స్ లోకి వెళ్ళిపోయి0ది అరుణ ..***
*                                     *                               *                                        *
                                                         
                                                                 (ఇంకా ఉంది ..to be continued..........)








 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online