శ్రీమహావిష్ణువు కి సంబంధించిన పూజ అనగానే సాలగ్రామ పూజ గుర్తుకువస్తుంది ...సాలగ్రామ రూపములో శ్రీమహావిష్ణువు ఎక్కడ ..ఎందుకు ఉద్భవించాల్సివచ్చిందో ...ఎన్ని రకాల సాలగ్రామ రూపాలు ఉంటాయో పై
పై పోస్టు లో చదువుకున్నాము కదా ..అటువంటి సాలగ్రామం ..కొన్ని విశేష పండుగలకు ..ఆచార్యుల వారు భక్తులు తీసుకురమ్మన్న చోటికి తీ సుకువస్తూవుంటారు .. ఆ పూజలు ..ఉత్సవాలు జరిపింది తీర్థ ప్రసాదాలు ఇస్తూవుంటారు విష్ణుసహస్రనామాలు పారాయణం ఇళ్ళలో చేయుంచుకున్నప్పుడు ...గోదాదేవి అమ్మవారి తిరుప్పావై ఉత్సవాలుధనుర్మాసంలో ను ..విష్ణు సంబంధమైన అన్ని దేవాలయాల్లో ను ఈ సాల గ్రామం చూస్తూవుంటాము అయితే పూర్వం ఆచార్యుల వారి అందరి ఇళ్లలో వుంటూ ఉండేవి తరువాత తరువాత కాలం లో ఆ మడి.. నిష్ట లు కుదరక ..వాళ్ళ పెద్దలు తీసుకొని వెళ్ళి దేవాలయం లో ఇచ్చేశారు ..ఇంట్లో సాలగ్రామం ఉంటే చాలా నిష్ఠ ..మడి నియమాలు పాటించాలి ..ప్రతిరోజు తలస్నానం చేసి పూజాధి కాలు జరిపి నైవేద్యం పెట్టాలి ..అలా వీలుకుదిరిన వారే తెచ్చి ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోవాలి .....మా నాయనమ్మ గారు దేవాలయంలో ఇచ్చిన విషయం నాకు బాగా గుర్తు ఉంది ..అంత మహిమాన్వితమైన సాలగ్రామ పూజ విన్నా ...చూసినా కూడా ఎంతో పుణ్యం చూసి తరిద్దాం
🙏🙏🌷ఓం నమో నారాయణాయ ..ఓం నమోభగవతేవాసుదేవాయ.. ఓం నమో విష్ణవే 🌷🌷🙏🙏
🙏🌹🌹🌹🌹ఓం నమో వే0 కటేశాయ 🌹🌹🌹🌹🙏
0 comments:
Post a Comment