Pages

The chanting of Govind namas part2 🙏 🌹🌹🌹🌹గోవింద నామాలు 2part🌹🌹🌹🌹🙏

 🌼🌿సర్వరోగాస్త్రానికి విరుగుడు నమత్రేయాస్త్రం..!!🌼🌿

శ్రీ అచ్యుతాయ నమః, 

శ్రీ అనంతాయనమః,

 శ్రీ గోవిందాయనమః

ఈ కలియుగంలో మనల్ని పడద్రోయడానికి కలిపురుషుడు అనేక రూపాలతో మనమీద దాడికి దిగుతాడు.

వీటిలో అనేకరకాలు..

వాటిలో ముఖ్యంగా శారీరకంగా కూడా అనేక రోగాలను సృష్టిస్తాడు.

ఆ రోగాలన్ని ఒక ఆయుధంగా మలిచి సంధిస్తాడు. 

దానిపేరు సర్వారోగాస్త్రం.

దీనికి విరిగుడు మనకి తెలిసినంతలో ఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్లి వేలు, లక్షలు వదిలించుకోవడం.

కాని మన శాస్త్రంలో ఈ అస్త్రానికి విరుగుడుగా లలితామాతా ఒక శస్త్రం సంధించింది

దానిపేరు నామత్రేయాస్త్రం.

నామత్రయం అంటే మూడు నామాలు.

అవి..

శ్రీ అచ్యుతాయ నమః,

శ్రీ అనంతాయ నమః,

శ్రీ గోవిందాయ నమః

ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి 

కలి ప్రేరితమైన రోగాలు రావు

జబ్బులు ఏమైనా ఉంటే అనతికాలంలోనే తగ్గిపోతాయి. 

ఈ నామాలు ఒక దివ్యౌషధం మీరు స్మరించండీ 

అచ్యుత, అనంత, గోవింద నామాలలో ఉన్న అద్భుత మహిమ:-

సాధు పరిత్రాణం కొరకుా, 

దుష్టవినాశం కొరకుా, 

ధర్మసంస్థాపన కొరకుా 

పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తుా ఉంటానని చెప్పాడు.


భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది.

అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. 

అట్టి విశిష్ట నామాలలో మరీ విశిష్ట నామాలు 

అచ్యుత, అనంత, గోవింద ఉన్నవి.           

సంధ్యావందనం మెుదలుకొని ఏ వైదీక కర్మ చేసినా 

ఓం అచ్యుతాయ నమః, 

ఓం అనంతాయ నమః, 

ఓం గోవిందాయ నమః 

అని ఆచమించి ఆరంభిస్తాం.

        

క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేదవైద్య విద్యకు రాయనే ప్రధమ స్థానం.

అచ్యుతానంత గోవింద

నామెాచ్ఛారణ భేషజాత్

నశ్యంతి సకలారోగాః

సత్యం సత్యం వదామ్యహ.!

ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి. 

ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను". 

ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా 

శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట. 

వైద్యవిద్యా గురువైన ధన్వంతరి వచనం కంటే 

ఇంకొక ప్రమాణం అవసరమా" !.

ఇది పరమ ప్రమాణం. 

పద్మపురాణంలో ఈ నామ మహిమ మిక్కలి గొప్పగా వర్ణించబడింది.

పార్వతీదేవి అడుగగా శంకరులవారు శ్రీమన్నారయణుని లీలలను వివరిస్తుా, కుార్మావతార సందర్భంలో క్షీరసాగరమథన గాథ వినిపిస్తుా ఇలా అన్నారు. 

పార్వతీ! పాలకడలిలో లక్ష్మీ దేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీనారాయణుని స్తుతింస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది.

ఆ హాలాహలం చుాసి దేవతలుా, దానవులుా భయపడి తలో దిక్కుకి పారిపోయారు. 

పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకుాటాన్ని 

నేను మ్రింగుతానని ధైర్యం చెప్పాను. 

అందరుా నా పాదాలపై బడి నన్ను పుాజించి స్తుతించ సాగారు. అపుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వదుఃఖహరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన ముాడు నామాల్ని -- 

అచ్యుత, అనంత, గోవింద  

అన్న మహా ముాడు మంత్రాల్ని స్మరించుకుంటుా  

ఆ మహా భయంకరమైన కాలకుాట విషాన్ని త్రాగివేశాను. సర్వవ్యాపి అయిన విష్ణుభగవానుని యెుక్క 

ఆ నామత్రయం యెుక్క మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను. 

ఆ విషం నన్నేమి చెయ్యలేక పోయింది.

కనుక ఈ మంత్రములతో ఆచమించేటపుడు లేదా జపం చేసుకొనేటప్పుడు

ఈ మహిమంతా జ్ఞాపకముంచుకుని, 

విశ్వాసం పెంచుకుని అందరుా భగవత్ కృపకు పాత్రులగుదురు గాక !.

🌷🌷🌷🌷 కాబట్టి శివ కేశవులకు భేదం లేదు ..అని ఒక తత్త్వం తెలుస్తోంది🌷🌷🌷🌷🙏

ఈ గోవింద నామాలు జపం చేసుకుందాం ..అన్నిరకాల బాధలు పోగుట్టుకుందా0

                      🌹🌹🌹🌹🙏ఓం నమో వేంకటేశాయ🌹🌹🌹🌹🙏















0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online