ప్రతీ పూజలో ..పూజా ద్రవ్యాలులో తమలపాకు లు వక్కలు ..మొత్తం గా తాంబూలం ఉండాల్సిందే అటువంటి
తమలపాకులు గురించి పండితులు ఏం చెబుతున్నారో చూద్దాం .......
హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో(1. పూలు 2. అక్షింతలు, 3. ఫలాలు,4,అద్దం, 5. వస్త్రం, 6. తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8. కుంకుమ) ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసేటప్పుడు తమలపాకుని వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు.పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం. భారత దేశం లో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదల లోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు.
📌తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం?
తమలపాకు యొక్క మొదటి భాగం లో కీర్తి, చివరి భాగం లో ఆయువు, మధ్య భాగం లో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.
📌 తమలపాకు లోని ఏయే భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాం
తమలపాకు పైభాగం లో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.
📌సరస్వతీదేవి మధ్యభాగం లో ఉంటుంది.
📌తమలపాకు చివరలలో మహాలక్ష్మీ దేవి ఉంటుంది.
📌జ్యేష్టా దేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది.
📌విష్ణుమూర్తి తమలపాకు లో ఉంటాడు.
📌శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగం లో ఉంటారు.
📌తమలపాకు లోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు.
📌భూమాత తమలపాకుకి కుదిభాగం లో ఉంటుంది.
📌సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు అని శాస్త్రంలో ఉంది.
శివపార్వతులకు లక్ష్మీనారాయణ లకు వాణి హిరణ్యగర్భునికి జరిగే పూజలు ఏవైనా తమలపకుతా0బూలం లేకుండా జరగవు ..అస్సలు ఏ పూజ అయినా పెద్దలకు ఇచ్చే దక్షిణ వరకు తమలపాకులు వక్కలు అరటిపండు వరకు ఉంటేనే అవి పూర్తి అయినట్లు ..సఫ లం అయినట్లు గా భావిస్తారు ....కొన్ని దేవతారధన లో తొడిమ ను త్రుంచే సి ..ఆకుని వాడతారు ...ఇక ఆంజనేయ స్వామి వారికి . తమలపాకులు దండలు ..తమలపాకులు తో పూజలు మొక్కనివారు కానీ ..చూడని వారు కానీ ఎక్కడా వుండరు ...🌹🌹🌹🙏🙏🙏(సేకరణ...........
0 comments:
Post a Comment