కార్తీకమాసంలో శివ కేశవులకు చేసే పూజలు ఎంతో విశిష్ట మైనవి ....ఎక్కువ పుణ్యాన్ని తెచ్చిపెడతాయు .శ్రీ మహావిష్ణువు విశ్వరూపము వేయు శిరస్సులు ,వేయు చేతులు ,వేయు కాళ్ళు ఇలా విశ్వా0త రాళము అంతా వ్యాపించి వున్నాడు ..అందుకే విష్ణువు అని పేరు ..అలా అర్జునునికి ..శ్రీ కృష్ణ భగవానుడు ..తన విశ్వరూపము ప్రదర్శించి వున్నాడు .స్వామి స్వరూపం ఇంత అని లెక్కించలేము ..ఊహకు కూడా అందలేదు ..ఆయనలోనే అందరూ దేవతలు దిక్పాలకులు నవగ్రహాలు పదునాలుగు లోకాలు ఇలా చాలా వున్నాయి .అంత పెద్ద గొప్పనైన స్వామి రూపం ఆరాధన చేయడం ఎలా ? అందు కే మనలాంటి సామాన్యులకోసమే పండితులు ..అలా వేయునామాలతో ..స్వామివారిని పిలుచుకుంటూ ...అనుభూతి చెందుతూ మనస్సు ఊయలలు ఊగితే అది నిజమైన భక్తి ..ఆ మహావిష్ణువే ..లక్ష్మీ అమ్మవారితో కల్సి. మానవులను కలియుగములో తరింప చేయుటకు తిరుమలతిరుపతి క్షేత్రములో వేంచేసి శ్రీదేవి.. భూదేవి తో మనకు దర్శనం ఇస్తూ పూజలు అందుకుంటున్నారు ...
మీరుకూడా చూడండి ..తరించండి ..మీకు వీలు ఉంటే మీరుకూడా చదువుతూ కొన్ని పువ్వులుదోసిలి తో మీ ఇంట్లో స్వామివారి పాదాలపై ఉంచండి ...కనీసం విన్నా... చూసినా కూడా ఎంతో మేలు జరుగుతుంది
చూడండి ...వినండి ....తరించండి
🙏🌹🌹 ఓం నమో వే0కటేశాయ....ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ🌹🌹🙏
0 comments:
Post a Comment