Pages

.............🌷🌷🌷......నిరీక్షణ ....5 పార్ట్ ....NIRIKSHNA shortstory .........🌷🌷🌷

Part ...5
ఏమిటయ్యా ..బాబు చాలా రోజులు అయ్యింది ..మీరు ఇటు రాక ...
సరే ..రండి నేను కొద్దిసేపు బైట పనిమీద వెళ్తున్నాను ...కారు ఎక్కి కిరణ్ ని ఆహ్వానించాడు ..డాక్టర్ రమణ ....ఇద్దరు కల్సి  ,మంచి గా చెట్లు పచ్చగా ఉన్న పార్క్ లోకి వెళ్ళారు ...కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు ..అస్సలు చాలారోజుల అయ్యింది మీరు కనపడక ..ఏమిటయ్యా బాబూ విశేషాలు ..సార్ . ..ఏముంది కిరణ్ ..మాకు కూడా ఈ మానసిక బాధితులు ,డిప్రెషన్ వాళ్ళ ను చూసి ,చూసి మా బుర్ర కూడా చిరాకుగా అయిపోతుంది ..మీ లాంటి యంగర్ జనరేషన్స్ వాళ్ళు అయితే  పబ్బులో నో ,లేకపోతే రెండు దమ్ములు సిగరెట్ పొగ లాగి రిలాక్స్  అవుతారు ..మరిమాలాంటి వాళ్ళ పరిస్థితి .ఇదిగో ..ఇలా కొద్దిసేపు రీలాక్స్ కోసం
బైటకు వస్తూ ఉంటాము ...నవ్వుతూ చెప్పాడు డాక్టర్ రమణ  .. బాగుంది సార్ మీరు అనేది ..నేను ఇంతవరకు సిగరెట్టు ఎప్పుడూ తాగ లేదు సార్ కొంచెము సిగ్గుపడుతూ చెప్పాడు కిరణ్.. .సరే అది కాకపోతే మందు కొట్టడం ,లేకపోతే ఏదో ఒకటి పేకాట  అయునా ...బ్యాచులర్స్ ,యూనివర్సిటీ  హాస్టల్స్ అంటే తప్పవు అవన్నీ మామూలే కదా ..ఏదో ఒకటి  మరి ఎలా ఈ స్ట్రెస్ అదే వత్తిడి నుంచి బైటపడాలి ..డాక్టర్ రమణ అనగానే ..బలేవారు సార్ .. మన్ని0చాలి  అటువంటివి నాకు ఏవి అలవాట్లు లేవు ..భవిష్యత్తు లో కూడా కావు .కొంచం గట్టిగా చెప్పాడు కిరణ్ .! ఆ మాటలు తన చెవి లో  అమృతం పోస్తున్నట్లు గా  అనుభూతి చెందుతూవున్నాడు ..ఇటువంటి వాడు నా అల్లుడు అయితే బాగుండును ..అస్సలు కావాలనే కిరణ్ ని రెచ్చగొట్టి  విషయం రాబట్టినట్లుగా కూడా అనుకోవచ్చు .అందుకే ఎంత మంచి వాడు కుర్రాడు ఇటువంటి ..ఈ రోజుల్లో ఇలా ఎంతమంది ఉంటారు ? అవును ..కిరణ్ ..నిన్ను ఈ..పరిస్థితులలో
కొంచెం ఏవేవో ..మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నాను అనుకో .నిన్ను...మీ నాన్న గారు ..కొన్ని బాధ్యతలు ఇచ్చి వెళ్ళారు ...అవి తీర్చితే ఆయన.. నిజంగా సంతోషపడతారు ..మేము అలా వచ్చిన వాళ్ళమే బాబు ...తప్పదు జీవిత పోరాటం ..కొంచెం వేదాంత ధోరణిలో చెప్పుకుపోతున్నాడు  డాక్టర్ గారు .
నేను మా నాన్నగారు ఇలా వదిలేసి వెళ్ళిపోతారు అనుకోలేదు సార్ ..చాలా సార్లు
చెప్పాను ..మీరు హైదరాబాద్ రండి ..నా దగ్గర ఉండండి ...ఆ పల్లెటూరులో ఇప్పుడు అన్ని రాజకీయాలు ..అను బంధాలు ..ఆత్మీయత లు ఎప్పుడో పోయాయి ..అని చెప్పాను .అక్కడే ఉండి మనస్సు పాడుచేసుకుని ఆరోగ్యం పై
శ్రద్ద పెట్టలేదు సార్ ..కొంచం కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు కిరణ్ ..బాబు అది కాదండి ..పుట్టి పెరిగిన  ఊరు ..బంధువులు అందరూ ఉన్న ఊరు అంత తొందరగా వదిలి రాలేరు అది సహజం ..అందులో మీ నాన్న గారు ఊరు సర్పంచ్ గా చాలా కాలం పనిచేశారు కదా ..ఓకే ..ఊరికే బాధ పడకండి కిరణ్ ..మీరు ధైర్యం గా ఉండి ..మీ అమ్మగారి కి చెల్లి గారికి మీరు పక్కన ఉండాలి .మీరు ఇలా డీలా పడిపోతే .వాళ్ళను ఎవరు చూస్తారు ..అలా కిరణ్  ని  ఓదార్చుతూవున్నాడుడాక్టర్ గారు .

*                                         *                                      *                                  *                                        *

ఒకరోజు. సాయంత్రం బ్యాంకు లో పని చేస్తున్న శివనారాయణ ను కలుసుకోవాలని చాలా ఆతృత తో బయలు దేరి బ్యాంక్ కు వెళ్ళి0ది అరుణకుమారి .బ్యాంక్  మూసే టైం కావడంతో ..అందరూ బైటకు వచ్చేస్తున్నారుతాళా లు అన్ని లాగి చెక్ చేసుకొని తన సైకిలి దగ్గరకివచ్చాడు ..శివనారాయణ ..సైకిల్ పట్టుకొని నిలబడి ఉన్న అరుణకుమారి ని చూసి ..అమ్మయుగారు ..మీరు ఎప్పుడు వచ్చారు ? లోపలికి రావచ్చుగా కొంచెము ఆత్మీయంగా  అన్నాడు ...ఇంకా నేను లక్కీ ఫెలో ని.. నన్ను ఎవరు అని అడుగుతావే మో అనుకున్నా....అస్సలు నీకు నేను గుర్తు ..ఉన్ననా ?....తెలుస్సా మా నాన్న గారి గురించి ...కళ్ళలో నీళ్ళు వత్తుకుంటూ .అడిగింది అరుణ ..నాకు తెలుస్సు ..మీరు అలా బాధపడటం నేను చూడలేను .మీ నాన్నగారు అంటే నాకు ఎంతో ఇష్టం ..ఆయనగారి లోటు ఎవరూ తీర్చలేరు ..నేను వచ్చి మీ దగ్గర కూర్చొని  ..మిమ్మలిని ఓదార్చాలి అని ఎంతో అనుకున్నాను ..కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతూవుంటే ..జీరబోయు న కంఠంతో కళ్ళ కు చేతులు అడ్డ0 పెట్టుకున్నాడు శివనారాయణ ...అన్నీ అనుకోవడమే గా నీ పని ఏదీ చేయవు ...మా నాన్నగారి విషయం చిన్నదా ..నిన్ను ఎంతో గౌరవించేవారు ..మా అమ్మ ను  నన్ను ఇంకా ఎవరు ఓదార్చేవాళ్ళు వున్నారు ...అంతా నటించే వాళ్ళే కదా ..నీకు తెలియదా ? ....అబ్బా అమ్మయుగారు మీకు నేను ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు ..సరే ముందు పదండి ..మా దగ్గర టీ స్టాల్ మూసేస్తున్నారు ..కొంచం టీ తాగి మాట్లాడుకుందాం ..వినయంగా అడిగాడు శివనారాయణ ..ఏమి వద్దు నువ్వు. నేను అనుకున్నంత  మంచివాడివి కాదు .నేను రాను ..వెక్కి వెక్కి ఏడుస్తూవుంది ..అరుణ ..ఎవరైనా చూస్తే మీరు ఎందుకు బాధ పడుతూవున్నారో ...అనుకుంటారు ...కొంచెము మెల్లగా చెప్పాడు శివ ..కొద్దిసేపటికీ ఏదో విధముగా నచ్చచెప్పి టీ స్టాల్ కు వచ్చారు ....ఇంకే చదువు ..అంతా అయిపోయింది ..నీకేమో ..బంట్రోత్తు వ్యుద్యోగం ..నాకేమో వెనుకాల నన్ను ప్రోత్సహించే వాళ్ళు లేరు ....ఉన్న మా నాన్నగారు వెళ్లిపోయారు ..మా అన్నయ్య కు ఎంత చెప్పినా వేస్ట్ ....మన ఇద్దరం కలిసి పై  చదువులు చదవాలి ..పరిశోధన చేసి కొత్త విషయం కను క్కోవాలి ..ఎంతో కలలు కన్నాను ..కనీసం నువ్వు అయునా చదువుతావుఅనుకున్నాను... అరుణ మాటలు పూర్తి కాకుండా నే ఊరుకోండి అమ్మాయి గారు మీరు మహారాజులు ...రాణులు ..మీ పై ఆధారపడి ఉన్నవాళ్ళం మేము ఏం సాధించగలం ..అంటూ ఉంటే ..కాదు నువ్వే ..కాదు మీరే ..ఇలా ఇద్దరు వాదించుకుంటూ ఉంటే ..టీ లు  తెచ్చి చేతికి అందించాడు ..టీ కొట్టువాడు ..ముందు కాస్తంత టీ త్రాగండి ..మెల్లగా చెప్పాడు శివ .నువ్వు నన్ను వదిలేశావు ..మా కుటుంబం పట్ల జాలి కూడా లేదు ..నాకు టీ వద్దు ...ఏమి వద్దు
నా దారి నేను చూసుకుంటాను ...తల వంచి కళ్ళు తుడుచుకుంటూ ఉంది అరుణ.
చూడండి ..అమ్మాయి గారు నేను మొత్తం అన్ని విషయాలు చెబుతాను ...ముందు మీరు టీ త్రాగండి ...కొద్దిసేపు మౌనం ...చూడండి ..నేను మీ ఇంటికి వస్తూవున్న రోజుల్లో ..మీ బాబాయి గారు ..మీ అత్తయ్య పిల్లలు నన్ను బెదిరించారు ..నువ్వు ఎందుకురా రోజూ ఇక్కడికి వస్తూన్నావు ..ఈసారి వస్తే నీ గుడ్లు పీకి నీ చేతిలో పెడతాం తెలుస్సా ..అని నా కళ్ళ జోడు పీకి విసిరికొట్టారు .ఆరోజు నుంచి మిమ్మల్ని ..మీ నాన్న గారిని మీ కుటుంబం మిస్ అవుతూవున్నా నే అనే బాధ ..ఎవరికి చెప్పుకోలేక నాలో నేను సతమతం అయిపోతున్నాను ..మా ఇంట్లో ఇంతవరకు చెప్పలేదు ..మా నాన్నగారు కూడా నన్నే తిడతారని ఇంతవరకు చెప్పనే లేదు ..మీ నాన్న గారితో అంటే అస్సలే వారి ఆరోగ్యం బాగాలేదు ..ఆవేశంగా ఊగిపోతే వారికి ఏమైనా అవుతోందేమొనని మీరు మీరు నా వల్ల కొట్టుకోకూడదు అని ..ఆలోచించుకొని ఇక నేను అటువైపు ఎక్కడా కనపడకూడదని రావడం మనేశాను ..కొంచం కళ్ళు తడిగా బరువుఎక్కుతూవుంటే ..జీరబోయన కంఠ0 తో చెప్పాడు కిరణ్.....ఏమిటి ..నీ పై  అంత రౌడీయిజం చేసి ...నిన్ను అవమానించారా ?మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు ? ..అవునులే నువ్వు అన్నట్లు ..చెప్పినా చేసేది ఏముంది లే ..నాకు ఇవన్నీ తెలియవు ..నీకు సారీ చెబుతున్నాను .నేలవైపు క్రిందికి చూస్తూ చెప్పింది .
ఎందుకు ..అమ్మాయి గారు ..దీనిలో మీరు చేసింది ఏముంది ...నేను కాకపోయినా మా వాళ్ళే కదా ...ఇంతకీ మన చదువులు ఇక అటకెక్కినట్లేనా ..కొంచం బాధగా అడిగింది అరుణ .నా విషయం మీకు కనిపిస్తూనే ఉంది గా ..ఇక మీ విషయంలో కూడా మీ నాన్నగారు లేరు కదా ...ఇక మీ వాళ్ళ పెత్తనం ఎలా ఉంటుందో ..ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అమ్మయుగారు ..మీరు నన్ను కలిసినట్లు తెలిస్తే ..ఈసారి   మన ఇద్దర్ని వాయుస్తారు ..కొంచెం భయపడుతూ చెప్పాడు శివ ...వాళ్ళు ఎవరు ...మన మీద జులుం చేయడానికి ...నా ఆస్తి పాస్తులు నాకు ఉన్నాయి ..వాళ్ళ ఏమైనా నాకు పెడుతూవున్నారా ?వాళ్లకెందుకు ఏడుపు ...చూస్తాను .మా అమ్మ తో మాట్లాడతాను ...శివ నాకు నువ్వు ఎప్పుడూ తోడుగా ఉండాలి ..ఎలాగైనా మన ఇద్దరం కలిసి పై చదువులు చదవాలి ..పరిశోధనా రంగంలోకి వెళ్ళాలి ..నా చదువు ఆగిపోయినా పర్వాలేదు కానీ నువ్వు బాగా తెలివితేటలు గల వాడివి నువ్వు ఆయునా పై చదువులు కి వెళ్ళాలి అది నా కోరిక .నీకు నేను హెల్ప్ గా ఉంటాను అనుకున్నాను .కానీ మా నాన్నగారు ఇలా అవడం వల్ల నీకునేను  ఏసహాయంచేయలేకపోతున్నాను .కళ్ళు వత్తుకుంటూ లేచి నిలబడింది..అరుణ కుమారి .పర్వలేదండి ..మీరు బాగుండాలి జీవితం లో మంచిగా గొప్పగా మీరు స్థిరపడాలని నా కోరిక ..కొంచెము చిరునవ్వు తెప్పించుకుంటూ చెప్పాడు శివ ..సరే ఇంతకు ఇక కల్సుకోలేము అన్నట్టుగా ఇద్దరం చెప్పేసుకు0టున్నాము ..పెదవి విరిచింది అరుణ ..అంతే కదా.. మీ వాళ్ళు ఇక రానున్న రోజుల్లో మిమ్మల్ని బైటకు రానిస్తారా అని ..నేను మిమ్మల్ని చూడటం
మాట్లాడటం ..జరిగే పనులేనా అమ్మయుగారు ....అబ్బా మిస్టర్ శివ నారాయణ నువ్వు ముందు గారు ...గారు అని పదే పదే .అని నన్ను బాధ పెడుతున్నావు ..నువ్వు అది మానేయడం మ0చిది ...నా పై నాకుటుంబం పై ఏ మాత్రం గౌరవం వున్నా అలా పిలవడం మానేస్తావు అనుకుంటున్నాను ..పద ఇక .. వెళదాం ...అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ బైట కు వచ్చారు ......
*                                     *                                       *                                     *
డాక్టర్ రమణ ఎంతసేపు ఒక మంచి అల్లుడిని తెచ్చుకోవాలి ..ఉన్నంత కాలం సంతోషంగా ..హుషారుగా కుటుంబం అంతా కల్సి సరదాగా సమస్యలు లేకుండా
ఉన్నదానిలో హాయిగా గడపాలి ....అమ్మాయి డాక్టర్ ..ఓకే ఆమె కూడా మళ్ళీ
డాక్టర్ ని చేసుకున్నా కూడా ఉరుకులు పరుగులు ..అందుకే సాదా సీదా ప్రొఫెషన్ అబ్బాయి  ని చూసి పెళ్ళి చేయాలి ..అమ్మాయి ఏమి అంటుందో ..చూస్తాను అలా ఊహల్లో విహరిస్తున్నాడు డాక్టర్ రమణ ..ఏమిటి ఈ  రోజు మీరు క్లీనిక్ కి వెళ్లరా ?
కళ్ళజోడు ఇస్తూ అడిగింది డాక్టర్ గారి భార్య ...ఎందుకు వెళ్ళను ..వేళ తాను సరే కానీ ..అమ్మాయి కి ఎటువంటి అబ్బాయి ని చూద్దాం ..అదే పెళ్ళి కోసం ..కొంచెం ఆసక్తి గా అడిగాడు డాక్టర్ రమణ ..మన చేతిలో ఏముంది ఎవరో ఒకరు ఇంకో డాక్టర్ గారు దొరకవచ్చు ....ఠక్కున చెప్పింది ..ఆమె అబ్బా అది కాదే ..సర్లే ..నీకు మొత్తం చెప్పాలంటే చాలా టైం పడుతుంది ..నేను వెళ్ళాలి అంటూ కారు దగ్గరకు
నడిచి పోతుంటే ..సార్ అని పిలుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు కిరణ్ .
సరే ..రండి బాబు కూర్చో0డి ..మాట్లాడుకుంటూ వెళదాం ...ఇద్దరూ కారు లో బయలు దేరారు .   పిచ్చా పాటి మాట్లాడుకుంటూ వెళ్తూవున్నారు ..కిరణ్ ఒక విషయం అడుగుతాను ..జవాబు చెప్పు ..అంటూ మొదలుపెట్టాడు డాక్టర్ రమణ అమ్మాయి ..అమ్మాయి లను ప్రేమించుకుంటున్న రోజులు ...కొన్ని చోట్ల పెళ్ళి కూడా చేసుకుంటున్నారు ..నీ అభిప్రాయం ఏమిటి ..చిలిపిగా ముఖం పెట్టి అడిగాడు డాక్టర్ రమణ ..డాక్టర్ రమణ ని చూడగానే కిరణ్ లో కొత్త భయ0
వేసింది .ఏమిటి ఈ ప్రశ్న వేశారు ..! ..కొంపతీసి ఈయన ఏమీ అటువంటి జాతి కాదుకదా ..కొద్దిగా అనుమనించాడు ..ఏమో ఎక్కడ చూసినా ఇటువంటి పిచ్చోళ్లే
తగులుతున్నారు ..కొద్దిసేపు మౌనం ..ఏమిటయ్యా బాబు మౌనం  సగం అంగీకార0 అంటారు కదా ..ఏమి ఆలోచిస్తున్నావయ్యా బాబు ...కొంచెము సాగతీశాడు డాక్టర్ ..అయ్యబాబోయ్ ..వీడు ..ఆ జాతికి సంబంధి0చిన వాడే ..మనస్సులో గొణుక్కుంటూ న్నాడు కిరణ్ ...ఏమి లేదు సార్ ..నాకు మా నాన్నగారు ఎప్పుడో చెప్పారు .ఇటువంటి వెధవలు తగులుతారు సిటీల్లో అని చెబితే ..పెద్దవాళ్ళు చాదస్తం అనుకున్నా ..కానీ నాకు అనుభవాలు అయునాయు సార్ ..అని కొంచెము కోపంగా పళ్ళు కొరికాడు కిరణ్ ...మరి ..మరి అప్పుడు ఏమిచేశావు ..ఆతృతగా అడిగాడు డాక్టర్ ..ఏముంది సార్ బెల్ట్ తీసి నాలుగు ఉతికాను .వెధవలు అక్కడనించి ..పరా ర్..అంటూ  బెల్ట్ లాగి  గాలిలో ఆడించాడు కిరణ్ ...సరే   పద నేను  క్లీనిక్ కూడా వెళ్ళాలి ..అక్కడ పేషేంట్స్ నా కోసం ..అంటూ లేచి నిలబడి కారు దగ్గరకు బయలు దేరారు ఇద్దరు .. కారు బయలు దేరింది ..ఒక పాత దేవాలయం దగ్గర చెట్లలో కారు ఆపాడు డాక్టర్ రమణ
కిరణ్ ..దిగుతారా ?మీ ఇష్టం నేను ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళాడు ..డాక్టర్
ఇక్కడ ఎందుకు ఆపినట్లు ...మెల్లగా దిగి పరీక్షించడానికి వెతుకు తున్నాడు కిరణ్ ..లోపల పాత దేవాలయం అక్కడ సాగిలబడి దండాలు పెడుతూవున్నారు డాక్టర్ రమణ ...చూసి గమనించి గబ గబా వెళ్ళి కారులో కూర్చున్నాడు కిరణ్ .ఏమిటీ  ..నేను అనవసరంగా అనుమాన పడుతూవున్నాను ..డాక్టర్ మానసిక వైద్యుడు కదా ..అందులో పెద్దాయన అందుకే అలా సైకాలజీ కి సంభందించి న ప్రశ్నలు అడుగుతాడెమో ? ఓకే ..నా సబ్జెక్టు నే కదా ..చూద్దాం ..మళ్ళీ మనస్సుని సంభాళించుకున్నాడు కిరణ్ ......మళ్ళీ కారు బయలు దేరింది ..కిరణ్ నువ్వు ఏ అమ్మాయి నైనా ప్రేమించావా ...కొంచెము నవ్వుతూ అడిగాడు డాక్టర్ రమణ
అది ..అది ..మా చుట్టాల అమ్మాయి ని ఇష్టపడ్డా ను ప్రేమించాను ..కొంచెము బాధ గా చెప్పాడు కిరణ్ ..ఒక్కసారిగా నెత్తిన పిడుగు బడినట్లు గా ఆ..అని కారు షాడన్
బ్రేక్ వేశాడు డాక్టర్ రమణ ...ఎన్నో కలలు కంటూవున్న డాక్టర్ కి కాస్తంత టైం పట్టింది తెరుకోవడానికి ...ఏమైంది సార్ ....అవును నేను ప్రేమిస్తే ఈయన కేంటి కంగారు ..నిజంగా ఈ డాక్టర్ గారు అంతు పట్టడం లేదు  .. అని మళ్ళీ మనస్సులో గొణుక్కున్నాడు కిరణ్ ...ఏమి లేదు బాబు మీరుప్రేమించిన విషయం అంత ..బాధ గా చెబుతున్నారు ఎందుకు అని ..అడిగాడు మళ్ళీ ఇంకో పక్క ఈయన  కూడా ప్రేమలో పడ్డాడా ..నేను ఎంతగానో ఊహించుకున్నాను ఇతగాడిపై ఎంతో సమయం వెచ్చించి కష్ట పడ్డాను అలా మనస్సులో తెగ ఫీల్ అయిపోతున్నాడు డాక్టర్ రమణ ..చూస్తాను ..తరువాత ఏం జరుగుతుందో ..ఆలోచనలో పడ్డాడు డాక్టర్ .కొద్దిసేపు మౌనం ..సార్ ..నేను కొద్దికాలంగా డల్  అయిపోయాను ఏమి చేయాలో అర్థం కావడం లేదు .మీరే నాకు మార్గం చూపాలి కొంచెము వినయం గా అడిగాడు కిరణ్   ఎందుకు?..ఏ రోజుల్లో కుర్రాళ్ళు అంతేనయ్యా ..ప్రతి విషయానికి కంగారుపడిపోవడం తిండి మానేయడం .నిద్రకు మద్యం లేక టాబ్లెట్ లు ..అంత దాకా ముదరుకుండా ముందే చెప్పు కొంచెము  పెదవి విరుపు లతో చెప్పాడు ..డాక్టర్ ..ఏమి వుందిసార్ మా చుట్టాల అమ్మాయి ని ప్రేమించాను సార్ ,ఆ అమ్మాయి నే పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాను సార్ ..కానీ ఆ అమ్మాయి  వేరే అబ్బాయి తో చెట్టా పట్టా లేసుకొని తిరిగేస్తుంది .  ఆ అబ్బాయి నాతో ..ఆ అమ్మాయి కి ఓల్ అండ్ సోల్ నేనే అని నాతో వెకిలిగా నవ్వుతూ చెప్పాడు సార్ . కొంచం ఆవేశంగా అన్నాడు కిరణ్ ..సరే ఇంతకీ ఇప్పుడు నువ్వు చాలా బాధ లో ఉన్నావు .తిండి మానేయలేదుకదా ..ఓకే ..నల్ల దుప్పటి ..ఒక కుక్క ..ఒక బీరు సీసా కొనేద్దాం ..ఇక నువ్వు గడ్డం పెంచి తే ..సినిమా పాటలు నేను వెతికి ఇస్తా ను ....ఓకే నా ..కొంచెం జోక్ గా మాట్లాడాడు  డాక్టర్ రమణ ..
సార్ ...ఏమిటి ..నా జీవితం జోకర్ గా మార్చేస్తారా ? ..వినయంగా అడిగాడుకిరణ్
లేకపోతే ఏమిటయ్యా బాబు ..నీ జీవితం జోకర్ కాకూడదని నేను కోరుకుంటున్నాను ..మీ కుటుంబం పరిస్థితులు ఏమిటి ...నీ జీవితానికి ఎదురున్న సవాళ్లు ఏమిటి ...మీ చెల్లి కి ఒక మంచి దారి చూపాలి ..ఎన్నో సమస్యలు పెట్టుకొని .ప్రేమా ..దోమా ఏమిటయ్యా ..ఆయునా నువ్వు వద్దు ..నీ లవ్ వద్దు ..చుట్టరికం అస్సలే వద్దు అని నిన్ను పట్టించుకోకుండా ..కనీసం నిన్ను కలలో ఆయునా తల చుకోని ..అమ్మాయి ....కి నీకు మధ్య లవ్ ఉందా ..దానిని లవ్ అనరు ....వన్ సైడ్ లవ్ అదికూడా కాదు ఒక ఆకర్షణ కు లోను అయిపోవడం అంటారు.ఇలా ప్రేమ ....కాదు ..కాదు ఆకర్షణ ....  రకరకాలు ,బస్ స్టాప్ లవ్ ,
సిటీబస్ లో లవ్  తెల్సిన వాళ్ళమ్మాయి లవ్ ..ట్యూషన్ లో పరిచయం లవ్ ఇలా చాలా రకాలుగా ఉంటుంది ఆకర్షణ ...కాబట్టి నీది వన్ సైడ్ ..ఇక అటువంటివి వదిలిపోవడం మన మంచికే అనుకోవాలి ...భవిష్యత్తు లో మీ అమ్మగారిని ..నిన్ను  ప్రశాంతంగా ఉంచే ..పరిస్థితులు ఎలా వున్నా సంసారం ది ద్దు కొచ్చే  మంచి అమ్మాయి ని ఎంచుకో అంతే కానీ ..నిలకడలేని ...మంచి మనస్సులేని ..కష్ట సుఖాలు తెలియని వారిని ప్రేమించకు ..పెళ్లిచేసుకోవద్దు ..ఇక జీవితం చాలా చిన్నది ...యవ్వనం ఇంకా చిన్నది ..ఎంతో విలువైనది ..మీ కుర్రాళ్ళ కు తెలియదు ...అంతా అయిపోయిన తరువాత ..తల తెల్ల....బడటం ప్రారంభం అయున తరువాత ..అర్రేరే ...తప్పుచేశాను అనుకుంటే ...ఏమి లాభం .
అందుకే చెబుతున్నాను .. అది ఎవరో నిన్ను పట్టించుకోవడం లేదని ..నిన్ను ప్రేమి0 చడం లేదని ..దిగాలుపడిపోయు చక్కని జీవితాన్ని  చేతులారా చీకటి లోకి నెట్టే సు కోవద్దు ...ఇంతవరకు మీవాళ్ళు  మిమ్మల్ని చదివించారు .మీ గురించి వాళ్ళు ఏన్నొకలలు కన్నారు ..గొప్పగా సెటిల్ అయి తే చాలా గర్వంగా తల ఎత్తుకు తిరుగుతారు ...కనీసం మంచిగా సెటిల్ అయితే ఆనంద పడతారు ..అంతే కాని ఎటు కాకుండా జీవితాన్ని రోడ్ల పాలు చేసుకుంటే ..మీ వాళ్ళు ఎంతగా ఏడుస్తారో ఒక్కసారి వాళ్ళను  గుర్తుకు తెచ్చుకొని నడుచుకోండి .

ఆనక మీ ఇష్టం .అస్సలు నాకు ఆరోజుల్లో పట్టించుకునే నాధుడే లేడు .చిన్నప్పుడే తల్లితండ్రులు పొగోట్టుకొని బంధువులు ద గ్గర పెరిగి ఎన్నొకష్టాలు పడి జీవితాన్ని మలుచుకున్నాను ..మిగతా చెల్లెళ్లు ని తమ్ముళ్లని ఉద్ధరించి ఒక దారిలో పెట్టాను .కాబట్టి జీవిత సత్యాలు ఇవ్వన్నీ అనుభవాలు ..ఇంతకీ నేను  మీ విషయం లో ఆలోచించి ఏదైనా హెల్ప్ చేయగలనేమో చూద్దాం ...మీరు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి నడుచుకోండి ..మళ్ళీ కలుద్దాం .రండి ..దారిలో దింపి వెళ తాను ..అంటూ ఇద్దరు కారు ఎక్కారు........******            *******           *****

                                                                   (  🌹🌹🌹   To be continued............. ఇంకా ఉంది 🌷🌷🌷)








0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online