మానవుని దేహం నవరంధ్రాలు తో నిర్మితం ఆయున పుట్టలా ఉంటుంది ...లోపల వెన్నుపాము ..పాము లా పై నుంచి క్రిందికి వ్యాపించి ఉంటుంది ...శరీరానికి బ్యాక్ బోన్ అంటారు శరీరానికి ..ఎంతో బలాన్ని ఇస్తూ నిలబడటానికి .ఆధారం అవుతుంది ..అంతే కాదు దానికి 32 వేళా నాడులు ..కనెక్ట్ ఆయు ఉంటాయి ..దాని మూలములో క్రింద భాగములో మూలాధార చక్రం ఉంటుంది ..అక్కడ కుండలిని శక్తుల కేంద్రం అది .అది యోగశక్తి ద్వారా ప్రేరేపించుకున్న వారు ..షట్ చక్రాల ద్వారా ప్రయాణం చెంది సహస్రారం కి చేరి భగవంతునితో అనుసంధానం అవుతుంది ..అందుకే యోగ సాధనలో మూలాధా రం మొదటి మెట్టు ..వెన్నుపాము దేహానికి ఎంతో బలం ఇస్తుంది ....అందుకే వెన్నుపోటు అనేపదం వాడతారు ..దాని సమస్య వస్తే కోలుకోవడం కష్టం ..అందుకే చాటు దెబ్బతీసే వాళ్ళను అలా అంటారు ..ఇక భగవత్ రామనుజులవారు . ప్రతి విషయం మూడు విధాలుగా చూపించారు ..ఒకటి ..భగవంతుడు ...రెండు ప్రకృతి ..మూడు జీవుడు ..ఈ నాగుల విషయం మూడింటిలో కనపడుతుంది ...భగవంతుడు శేష శా యు గా పాముపై పవళిస్తాడు ...శివభగవానుడు పాముని ఆభరణం గా ధరిస్తాడు మళ్ళీ ఆరుతలల .దేవుడు సుబ్రహ్మణ్యస్వామి ..అది రాహు కేతువుల కు సంభంధించనది ...అందుకే ఆ సంభంధమైన దోషాలు పోవడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటారు ..అలానే వారుశివ భక్తులు కాబట్టి ఆ దోషాలు పోవడానికి శివ పూజ కూడా చేసుకుంటారు ..ఇక లోపల ఉన్న పరమాత్మ .శ్రీీీమహా విష్ణువు .నర నరా లుగా దేహం అంతా వ్యాపించి ఉండటం .దేహం మొత్తం అవరించివుంటుంది .
ఇంకా మూలాధారం పై భారం ఉండి దేహం మోయడం మూలాధారం లోని కుండలిని శక్తి ...పాము పడగల్లా ఉంటుంది ..ఇది జీవుడిలో చూసే కోణం ..ఇక భగవంతుని కోణం లో ఈ భూ భారం మొత్తం ఆది శేషుడు తన పడగలపై నిలబెట్టి మోస్తూ కాపాడుతూవున్నాడని పురాణాలు చెబుతూవున్నాయ ఇది భగవంతుని కోణం
పంచభూతాలు పరిగెడుతూ ఉంటాయి అందుకే శివుడు నాట్య0 గా చెప్పుకుంటాము అందుకే లోపల అలా వ్యాపించి ఉన్న శ్రీమహావిష్ణువు శక్తి షట్ చక్రాల ద్వారా యోగ0 లో తెప్పించుకుని సహస్రారం కు చేరుకుంటే అదే బైట పడితే కాపాల మోక్షం .. అందుకే మోక్షం జనార్ధనుడు ఇస్తాడు అని జ్ఞానం శివుడు ..ఆరోగ్యం సూర్యుడు ఇస్తాడు అని పెద్దలు చెబుతారు . అంటే జనార్ధనుడు అంటే వాసుదేవుడు ...వసించి యున్నవాడు ...లేదా విష్ణువు అంటే శరీరం అంతా వ్యాపించి వున్నవాడు అని అనుకోవాలి ..ఆయన ఉంటే ప్రాణం ఉన్నట్టు కదా చైతన్యం ఇది జీవుడి లో పాము తత్త్వాన్ని చూడవలసిన కోణం ..ఇక ప్రకృతిలో అయితే పుట్టలు భూమి అంతా ఆవరించి ఉంటాయు ..రైతులకు ..వ్యవసాయానికి ఎంతో మేలు చేస్తాయి ..అందుకే పుట్టమన్ను పవిత్రం గా చెవులకు ధరిస్తారు ..పాము నివాసం వుండే పుట్ట కాబట్టి ఆ మట్టిని పవిత్రం గా దరిస్తాం ..సంతానం కోసం .పెళ్ళి కావాల్సినవారు నాగుల కు మ్రొక్కి ..సఫలం పొందుతారు ...ఆయనే వల్లి దేవసేన ల భర్త సుబ్రహ్మణ్య స్వామి ....సర్పరాజులు ..ఆయనే శేషుడు ..ఆయనే వాసుకి ఇలా నాగులని ఆరాధిస్తారు ..ఇంకా శ్రీమహావిష్ణువు అవతారం వచ్చినప్పుడల్లా ..శేషుకి కూడా స్వామి వారితో అవతారం ఎత్తి వస్తూవుంటాడు బలరాముడు ..లక్ష్మణుడు ....మొదలగు అవతారములు నాగదేవుని అవతారములు కదా ప్రత్యేకముగా ..ఈ నాగుల చవితి నాడుతెల్ల నువ్వుల పిండి తో బెల్లం కల్పి నాగదేవునికి నైవేద్యం సమర్పిస్తారు ..ఇలా హిందువుల పండుగలలో
ఇన్ని కోణాలలోప్రయోజనం ..స్వకార్యం ...స్వామి కార్యం ..అంటే భగవత్ సేవ ఇలా పండుగలు ఉంటాయి ..ప్రకృతిలోని అన్నీజీవరాసులు ఆ భగ వంతుడే అని చేబటం అంత రార్ధ్0 అని తెలుసుకొని మనకు వీలు కుదిరిన అంతలో ..పండుగ చేసుకుందాం ..వీలుకుదరని వారు నాగదేవతలను ఆ రూపాలు పేర్లని మనస్సులో తలచుకొని శి రస్సు వంచి నమస్కారం చేద్దాము ...
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
0 comments:
Post a Comment