Pages

Sharannavatri first day - Bala Tripura Sundari Avataram

అందరికి శరన్నవరాత్రి శుభాకాంక్షలు . 

   సహజం గా రోజు ఉదయం పురుష దేవతలను, రాత్రి సమయం లో స్త్రీ దేవతలను పూజిస్తారు.  అది పూర్వ కాలం లో ఉన్న సంప్రదాయం.  ఈ నవ రాత్రుల్లో మొదటిరోజు అమ్మవారిని బాల త్రిపుర  సుందరి రూపం లో కొలుస్తారు .  అమ్మవారు బాల అంటే చిన్నపిల్ల గా భండాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది .  అందుకే ఆమెను ఈ అవతారం లో పూజిస్తారు మొదటిరోజు.  అందుకే ఈరోజు 1. నుండి 10.స0" వయసు లోపు పిల్లలను అమ్మవారి రూపం లో పూజిస్తారు.

ఇంకా శ్రీవిద్య ఉపాసకులకు మొదటి అవతారం మరియు ఉపాసన కూడా ఈ బాలాత్రిపురసుందరి అవతారమే .  ముందు ఈ బాల మంత్రాన్ని అనుష్ఠానం చేసిన తర్వాత మాత్రమే మిగిలిన దేవతలను ఉపాసన చేస్తారు.

అమ్మవారికి ఈరోజు నైవేద్యం గా లడ్డు, పెసర వడలు సమర్పిస్తారు.

  అమ్మవారి ధ్యాన శ్లోకం:

అరుణ కిరణ జాలై రంజిత సావకాశా
విధృత జప వాటికా పుస్తకాభితి హస్తా
ఇతర కరవరధ్యా ఫుల్ల కల్హార సంస్తా
నివసతు హృది బాలా నిత్య కళ్యాణరూపా !!  

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online