Pages

Navaratri 8th day - Shri Durga Devi avataaram

ఈ నవ రాత్రుల్లో  ఎనిమిదవ రోజు మహా దుర్గ అవతారం లో అమ్మను పూజిస్తారు.  దుర్గామాత అంటే మనల్ని దుర్గమమైన బాధల నుండి రక్షిస్తుంది అని అర్ధం .  ఈమె పద్మనాభ సహోదరి.  శ్రీ మహావిష్ణువు కృష్ణావతారం ధరించినప్పుడు ఈ అమ్మ ఆయన తో పాటుగా జన్మించింది.  కృష్ణ  జననం గురించి చెప్పి కంసుని హెచ్చరించింది.  ఆలా ఈమె విష్ణు సహోదరి నారాయణి అయ్యింది.

 శాక్తేయులు ప్రధానం గా ఈ నవరాత్రుల్లో అమ్మను నవ దుర్గ రూపాల్లో కొలుస్తారు.  బెంగాలీ వారికి ఈ మహాష్టమి చాలా ముఖ్యమైనది వాళ్ళు ఈరోజు దుర్గాపూజ చేస్తారు,  అమ్మవారిని పందిళ్ళల్లో నెలకొల్పి అందరిని పిలిచి పూజలు చేస్తారు.  ఇక్కడ మన దగ్గర కూడా అమ్మవారిని దుర్గాదేవి గా అలంకరించి పూజలు చేసి అమ్మకు ఇష్టమైన మినప గారెలు నైవేద్యం చేస్తారు.

నమామి మంగళామ్ గౌరీం దుర్గామ్ దుర్గతి హారిణీమ్
దుర్గేభ్యహ త్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే !!  


అని అమ్మను ప్రార్ధిస్తే మనల్ని సకల ఆపదలు, భయముల నుండి కాపాడుతుంది.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online