Pages

Navaratri 9th day - Mahishasura mardhini avataaram

ఈ నవరాత్రి తొమ్మిదవ రోజు మహిషాసుర మర్ధిని అవతారం లో అమ్మను పూజిస్తాము.  బ్రహ్మ వరం వలన గర్వించిన మహిషాసురుడు అన్ని లోకాలను పీడించటం మొదలుపెట్టాడు,  అది భరించలేని దేవతలు త్రిమూర్తులను ప్రార్ధిస్తే వారి నుండి ఒక వెలుగు బయటకు వచ్చింది ఆమె ఈ మహిషాసుర మర్ధిని .  ఆమెకు దేవతలు అందరు ఆయుధాలను ఇచ్చారు .  ఆ అమ్మ సైన్యం తో , తన శక్తులు అన్నీఈ వెంటరాగా మహిషునిపై యుద్దానికి వెళ్ళింది.  వివిధ దేవతా శక్తులతో అతని అనుచరులు అందరిని సంహరించింది .  చివరకు మహిషుడు యుద్ధానికి వస్తే సింహ వాహినియై తన త్రిశూలం తో వానిని సంహరించింది .  ఈ విధం గా చెడుపై మంచి విజయం సాధించింది .  ఈ అమ్మని మహిషాసుర మర్ధిని స్తోత్రం తో స్తుతిస్తే మనకు ఉన్న అన్ని భయాలు తొలగి సకల విజయాలు లభిస్తాయి . 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online