లాల్ బహదూర్ శాస్త్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు
మనం మరచిన మహానేత లాల్ బహదూర్ శాస్త్రి!
(పాపం విమానం లో కూడా ఫైల్స్ చూసుకొనే వారు ... అది భార్యా పక్కనే )
అక్టోబర్, 2 అంటే ఒక్క గాంధీ గారి పుట్టినరోజు గా మాత్రమే చాలా మంది గుర్తుపెట్టుకున్నారు.
ఇది ఇంకొక మహానాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడా. టి.వి. లు, పేపర్లు ఈ రోజు ఒక్క గాంధీ గారి గురించి మాత్రమే తలచుకుంటాయి. యించుమించు దేశం యావత్తు మరచిపోయినరోజు. కొందరి విషయంలో పునరుక్తి విధానం దోషంకాదు. కాని స్మరించ వలసిన వ్యక్తిని స్మరించకపోవడం నేరం. దురదృష్టవశాత్తూ మన భారతదేశంలో. ఏది ఏమైనా, మనం మరపురాని రోజుగా గాంధీజయంతిని పండుగగా జరుపుకునే అక్టోబర్ 2 రోజు మనం అదేరోజున మన దేశం మూడవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిగారి జన్మదినం కూడ అదేరోజు అన్నది మరచిపోయిన రోజు కూడ అదే అన్నది వింత, విడ్డూరం కలిగిస్తాయి.
అల్పకాలంగా ప్రధానిగా సేవలనందించినా, అనల్పమైన నాయకునిగా పేరుప్రఖ్యాతులను పొందారు. విజయం తెచ్చిన విషాదం భారత్-పాకిస్తాన్ మధ్య 1965 లో జరుగుతున్న యుద్ధం సందర్భంగా శాస్త్రి ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, ఆ సంకల్పం, దీక్ష, సరిసములు లేని ధీరలక్షణాలు ఆ నాయకునివి.
దేశానికి మూలమూలలకు వ్యాపించిన నినాదం 'జై జవాన్ జై కిసాణ్ అన్నది లాల్ బహదూర్ శాస్త్రిగారి భావనే. ఆ అవాంతర పరిస్థితుల్లో ప్రజలను త్యాగవంతులుగా ముందుకు రావాలని కోరిన మహానుభావుడు. పాకిస్తాన్ తో అమోఘమైన విజయాన్ని సాధించాడు. ఈ ఆనందం పంచుకునే లోపున, 1966 లో పాకిస్తాన్ తో తాష్కెంట్ లో జరుపుకున్న అంగీకార సమావేశం ఫలితంగా అంగీకారపత్రంపై తన ముద్రని యిచ్చిన వెంటనే, మరణించడం దురదృష్టకరం.
ఓ శాస్త్రీ సరిలేరు నీ కెవ్వరూ ! శాస్త్రిగారు భారత రాజకీయాల్లో తనదైన శైలిలో చెరగని ముద్ర వేశారు. అందరి మనసును దోచిన విషయాలు - శాస్త్రిగారు ప్రదర్శించిన నీతిపూర్వక నడత, నిరాడంబరత, రికామీ వ్యక్తిత్వం, త్యాగశీలత, శాంతమూర్తి, ధృఢనిర్ణయకారుడు. ఆయన భౌతికంగా వామనమూర్తి అయినా ఆయన తరానికి మాత్రం నడతలో ఆజానుబాహుడు.
0 comments:
Post a Comment