Pages

sharannavaratri second day - Shri Gayatri Alamkaaram

శరన్నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రీ దేవి అలంకారం చేస్తారు.  మధు కైటభులు వేదాలను అపహరించినప్పుడు శ్రీ మహా విష్ణువు వారిని సంహరించి ఆ వేదాలను రక్షించి తిరిగి బ్రహ్మ కు ఇస్తాడు.ఆ పంచ వేదాల స్వరూపమే శ్రీ గాయత్రీ మాత. అందువల్లనే ఆమెను వేదమాత అని కూడా పిలుస్తారు.  గాయత్రీ మంత్రాన్ని సర్వ మంత్ర రాజము అని కూడా అంటారు .  దేవతలకు నైవేద్యం సమర్పించేటప్పుడు ముందుగా గాయత్రీ మంత్రం చదువుతూ నీటిని చల్లుతారు.  ఈ మంత్రం లో 24.మంది దేవతలు ఉంటారు.  దీనిని మనం పవిత్రం గా చూడాలి అంతే గానీ మన మొబైల్ ఫోన్స్ లో కాలర్ ట్యూన్స్ ఇంకా ఎక్కడ పడితే అక్కడ ప్లే చేసే ఒక సినిమా పాట గా చూడకూడదు.  ఈరోజు అమ్మవారిని గాయత్రీ దేవి రూపం లో కొలుస్తారు . 

ఆ అమ్మ యొక్క ధ్యాన శ్లోకం :

ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయై ముఖై తీక్షణైః
యుక్తామిందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్ధ వర్ణాత్మికామ్ !
గాయత్రీమ్ వరదా భయాంకుశకశామ్  శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మదారవింద యుగళామ్ హస్తైర్వహంతీమ్ భజే !!   

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online