Pages

Navaratri 7th day - Shri Mahalashmi Avataaram

నమస్తేస్తు మహామాయే శ్రీపేఠే సుర పూజితే
శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే !!


 ఈ నవ రాత్రుల్లో ఏడవ రోజైన ఈనాడు శ్రీ మహా లక్ష్మి అవతారం లో అమ్మ ని కొలుస్తాము .  మన సంప్రదాయం లో ఆది శక్తి ని లక్ష్మి వాణి మరియు గౌరీ రూపాలలో కొలుస్తాము.  సిరులకు నెలవైన శ్రీమహాలక్ష్మి సాగర తనయ, చంద్ర సహోదరి, విష్ణుప్రియ.  శ్రీ వైష్ణవ సిద్ధాంతం లో ఆ మహా విష్ణువు ను ప్రసన్నం చేసుకోవటానికి ముందుగా శ్రీ మహా లక్ష్మిని అడిగితే ఆ అమ్మ మన కోరికలను స్వామి వద్ద ప్రస్తావించి సిద్దిపచేస్తుంది అని అంటారు.  అందుకే వారు ముందు ఆ అమ్మను ప్రసన్నం చేసుకుంటారు . 


లౌకిక ప్రపంచం లో మనకు లక్ష్మి అనగానే డబ్బు మాత్రమే స్ఫూరిస్తుంది.  కానీ అసలు లక్ష్మి అంటే శుభప్రదమైనది, మంగళకరమైనది అన్ని సంపదలు చేకూర్చేది అని అర్ధం.  అందుకే లక్ష్మి దేవి కొలువైన ప్రదేశం లో సకల దేవతలు ఉంటారు అని అంటారు.  ఆమె అనుగ్రహం ఉంటె లౌకిక, అలౌకిక సంపదలు అన్నీ మనకు లభిస్తాయి.  విద్య, కీర్తి, ధైర్యం, సంతానం, ధనం, ధాన్యం, పశు సంపద, గృహం, ఉద్యోగం , పదవి అధికారం చివరకు మోక్షం కూడా ఆమ అనుగ్రహ ఫలితాలే.  అందుకే మనం ఆమెను అష్టలక్ష్మి స్వరూపాలలో కొలుస్తాము. 

 
పరమ సౌమ్య స్వరూపిణి అయినా శ్రీ మహా లక్ష్మి కూడా అవసరమైనప్పుడు అసురులను నిర్జించి లోకాలకు శాంతిని కలిగించింది.  ఈ శరన్నవరాత్రుల్లో ఆమె రాక్షస సంహారం చేసి ప్రపంచానికి శుభాలను ప్రసాదించింది. అందుకే ఆమెను ఈనాడు పూజిస్తాము.  ఆమెకు ఇష్టమైన నైవేద్యం క్షీరాన్నం /పాయసం .  కనుక ఈరోజు మనం లక్ష్మి స్తోత్రాన్ని పఠించి క్షీరాన్నం నివేదన చేస్తే ఆమె అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ ఉంటుంది.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online