ఇంకా శ్రీరాముడు రావణుని వధించి లంక పై విజయాన్ని సాధించింది కూడా ఈరోజే. అందుకే ఉత్తర భారత దేశం లో రాంలీలా అని రావణ, కుంభకర్ణుల ప్రతిమలు తయారు చేసి రాముని వేషం ధరించి వాటిని దహనం చేస్తారు.
ఇంకా మహాభారత కాలం లో ఉత్తర గోగ్రహణం సమయం లో కురు సైన్యాన్ని ఎదుర్కొనటానికి అర్జునుడు శమీ వృక్షం పై ఉన్న తమ ఆయుధాలను తిరిగి తీసుకుని అజ్ఞాత వాసం ముగించి యుద్ధం చేసి కురు సైన్యాన్ని ఓడించింది కూడా ఈరోజే. అందుకే ఆయనకు విజయుడు అనే పేరు కూడానా వచ్చింది.
విజయదశమి రోజు మనం ఏ పనిని మొదలుపెట్టినా అందులో విజయాన్ని పొందుతాము అని పెద్దల నమ్మకం. కనుక మన అందరికిఈ పండుగ అన్ని శుభాలను ప్రసాదించాలి అని ఆ అమ్మను కోరుకుంటున్నాను. విజయదశమి శుభాకాంక్షలు .
0 comments:
Post a Comment