Pages

The power of music n vibrations




In this video this man is using music and vibrations created by those sounds to create different structures.  Basing on some of these principles  our ancient people were able to build beautiful structures like musical pillars n other monuments.

9 laws of karma


Normal Water r Mineral Water which is good for our health???


*మినరల్ వాటర్ మంచిదా?*


*జనరల్ వాటర్ మంచిదా?*


మనం నీరు త్రాగేముందు
ఈ మధ్య కాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన...


మినరల్ వాటర్ ని కొని అవే మంచివి.
అని లీటర్ 4 రూపాయల నుండి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం.


కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- అమ్ము తున్నారు.


కాని వాటిలో స్వచ్చత ఉందా...
అనే సందేహం... చాలా మందిలో ఉంది.


కాని ఈ మధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం...


ఏమంటే...


నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ము తున్నారు.


దీని వలన ప్రమాదమే...
కాని ఉపయోగం లేదు.


రోగాలని కొనుక్కొని తెచ్చు కుంటున్నారు.


ఇదంతా ఎందుకు చేస్తున్నారు.అంటే ఆరోగ్యం కోసం అంటారు.
అందరూ...


రోగాల బారిన పడ కూడదు.


అను కుంటూనే రోగాలని కొను.. క్కుంటున్నారు.


ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ... ఉండే కాల్షియం కరిగి పోయి ఎముకలు డొల్ల అవు తున్నాయి.


దీని వలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగి పోతున్నాయి.


ఇంత కీ విషయం ఏంటంటే!


భారత దేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే...
మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు.


అందులో ఇది ఒకటి.


నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు.


వీటిని వాడటం వలన నీటి లో ఉండే సూక్ష్మ క్రిములు చని పోతాయి.


ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో
''రోబ్ రీడ్''
అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు,
ఇత్తడి,
రాగి పాత్రలలో విరోచన కారి అయిన ఒక సూక్ష్మ క్రిమిని వేశారు.


దీనిని 24 గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది...


మరల 48 గంటల తరువాత పరిశీలించగా..
రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99శతం నశించి పోయాయి.


కాని ప్లాస్టిక్,
పాత్రలలో వేసిన క్రిమి 24 గంటలకి రెట్టింపు అయింది.


48 గంటలకి దానికి రెట్టింపు అయింది.
అని కను గొన్నారు.


ఈ మధ్య కాలం లో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలని వాడటం గమనార్హం.


ఎందు కంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా.


కాబట్టి
వాన కాలం 4 నెలలు - రాగి పాత్రలో నీలూచలి కాలం 4 నెలలు - ఇతడి పాత్రలో నీలూ
ఎండ కాలం 4 నెలలు - మట్టి పాత్రలో (కుండ) నీలూ త్రాగడం శ్రేయస్కరం.


కనుక రాగి,
ఇత్తడి మట్టి పాత్రలను వాడండి.


అల్యూమినియం, ప్లాస్టిక్ వదలండి.


ఆరోగ్యాన్ని కాపాడు కోండి

A medicine for Dengue




Friends someone from my friends has sent this to me.  Am just giving the info.  Pls. use ur own discretion n consult ur Doctor before using this.

Navaratri 10th day - Shri Rajarajeswari Avataaram

 
 
 
నవరాత్రి చివరి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి అవతారం లో పూజిస్తారు.  తొమ్మిది రోజులు యుద్ధం చేసి శుమ్భ  నిశుమ్భలు, రక్తాక్ష, రక్తబీజులు , చివరకు మహిషాసురుని వధించిన తరువాత సకల దేవతలు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ చివరి రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి గా పూజిస్తారు. 
ఇంకా శ్రీరాముడు రావణుని వధించి లంక పై విజయాన్ని సాధించింది కూడా ఈరోజే.  అందుకే ఉత్తర భారత దేశం లో రాంలీలా అని రావణ, కుంభకర్ణుల ప్రతిమలు తయారు చేసి రాముని వేషం ధరించి వాటిని దహనం చేస్తారు. 
ఇంకా మహాభారత కాలం లో ఉత్తర గోగ్రహణం సమయం లో కురు సైన్యాన్ని ఎదుర్కొనటానికి అర్జునుడు శమీ వృక్షం పై ఉన్న తమ ఆయుధాలను తిరిగి తీసుకుని అజ్ఞాత వాసం ముగించి యుద్ధం చేసి కురు సైన్యాన్ని ఓడించింది కూడా ఈరోజే.  అందుకే ఆయనకు విజయుడు అనే పేరు కూడానా వచ్చింది. 
విజయదశమి రోజు మనం ఏ పనిని మొదలుపెట్టినా అందులో విజయాన్ని పొందుతాము అని పెద్దల నమ్మకం.  కనుక మన అందరికిఈ పండుగ అన్ని శుభాలను ప్రసాదించాలి అని ఆ అమ్మను కోరుకుంటున్నాను.  విజయదశమి శుభాకాంక్షలు . 

Navaratri 9th day - Mahishasura mardhini avataaram

ఈ నవరాత్రి తొమ్మిదవ రోజు మహిషాసుర మర్ధిని అవతారం లో అమ్మను పూజిస్తాము.  బ్రహ్మ వరం వలన గర్వించిన మహిషాసురుడు అన్ని లోకాలను పీడించటం మొదలుపెట్టాడు,  అది భరించలేని దేవతలు త్రిమూర్తులను ప్రార్ధిస్తే వారి నుండి ఒక వెలుగు బయటకు వచ్చింది ఆమె ఈ మహిషాసుర మర్ధిని .  ఆమెకు దేవతలు అందరు ఆయుధాలను ఇచ్చారు .  ఆ అమ్మ సైన్యం తో , తన శక్తులు అన్నీఈ వెంటరాగా మహిషునిపై యుద్దానికి వెళ్ళింది.  వివిధ దేవతా శక్తులతో అతని అనుచరులు అందరిని సంహరించింది .  చివరకు మహిషుడు యుద్ధానికి వస్తే సింహ వాహినియై తన త్రిశూలం తో వానిని సంహరించింది .  ఈ విధం గా చెడుపై మంచి విజయం సాధించింది .  ఈ అమ్మని మహిషాసుర మర్ధిని స్తోత్రం తో స్తుతిస్తే మనకు ఉన్న అన్ని భయాలు తొలగి సకల విజయాలు లభిస్తాయి . 

Navaratri 8th day - Shri Durga Devi avataaram

ఈ నవ రాత్రుల్లో  ఎనిమిదవ రోజు మహా దుర్గ అవతారం లో అమ్మను పూజిస్తారు.  దుర్గామాత అంటే మనల్ని దుర్గమమైన బాధల నుండి రక్షిస్తుంది అని అర్ధం .  ఈమె పద్మనాభ సహోదరి.  శ్రీ మహావిష్ణువు కృష్ణావతారం ధరించినప్పుడు ఈ అమ్మ ఆయన తో పాటుగా జన్మించింది.  కృష్ణ  జననం గురించి చెప్పి కంసుని హెచ్చరించింది.  ఆలా ఈమె విష్ణు సహోదరి నారాయణి అయ్యింది.

 శాక్తేయులు ప్రధానం గా ఈ నవరాత్రుల్లో అమ్మను నవ దుర్గ రూపాల్లో కొలుస్తారు.  బెంగాలీ వారికి ఈ మహాష్టమి చాలా ముఖ్యమైనది వాళ్ళు ఈరోజు దుర్గాపూజ చేస్తారు,  అమ్మవారిని పందిళ్ళల్లో నెలకొల్పి అందరిని పిలిచి పూజలు చేస్తారు.  ఇక్కడ మన దగ్గర కూడా అమ్మవారిని దుర్గాదేవి గా అలంకరించి పూజలు చేసి అమ్మకు ఇష్టమైన మినప గారెలు నైవేద్యం చేస్తారు.

నమామి మంగళామ్ గౌరీం దుర్గామ్ దుర్గతి హారిణీమ్
దుర్గేభ్యహ త్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే !!  


అని అమ్మను ప్రార్ధిస్తే మనల్ని సకల ఆపదలు, భయముల నుండి కాపాడుతుంది.

Saptha shlokee Durgaa

దుర్గాష్టమి శుభాకాంక్షలతో
శ్రీ దుర్గా సప్తశ్లోకి
శ్రీ దుర్గాప్రీత్యర్థం సప్తశ్లోకీదుర్గా పాఠే వినియోగ:


ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతి హి సా !
బలదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి !!


దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః !
స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి !!

దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా !
సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్తా !!


సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే !
శరణ్యేత్ర్యంబకే గౌరి నారాయణి నమోపాస్తుతే !!

శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే !
సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోపాస్తుతే!!


సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తిసమన్వితే !
భయోభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోపాస్తుతే !!

రోగానశేషానపహంసి తుష్టా !
రుష్టా తు కామాన్ సకలా నభీష్టాన్ !!


త్వామాశ్రితానాం న విపన్నరాణాం !
త్వమాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి !!

సర్వాబాధా ప్రశమనం త్రైలోక్య స్యాఖిలేశ్వరి !
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివానాశనమ్ !!

ఇతి శ్రీ సప్తశ్లోకీ దుర్గా సంపూర్ణమ్

Navaratri 7th day - Shri Mahalashmi Avataaram

నమస్తేస్తు మహామాయే శ్రీపేఠే సుర పూజితే
శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే !!


 ఈ నవ రాత్రుల్లో ఏడవ రోజైన ఈనాడు శ్రీ మహా లక్ష్మి అవతారం లో అమ్మ ని కొలుస్తాము .  మన సంప్రదాయం లో ఆది శక్తి ని లక్ష్మి వాణి మరియు గౌరీ రూపాలలో కొలుస్తాము.  సిరులకు నెలవైన శ్రీమహాలక్ష్మి సాగర తనయ, చంద్ర సహోదరి, విష్ణుప్రియ.  శ్రీ వైష్ణవ సిద్ధాంతం లో ఆ మహా విష్ణువు ను ప్రసన్నం చేసుకోవటానికి ముందుగా శ్రీ మహా లక్ష్మిని అడిగితే ఆ అమ్మ మన కోరికలను స్వామి వద్ద ప్రస్తావించి సిద్దిపచేస్తుంది అని అంటారు.  అందుకే వారు ముందు ఆ అమ్మను ప్రసన్నం చేసుకుంటారు . 


లౌకిక ప్రపంచం లో మనకు లక్ష్మి అనగానే డబ్బు మాత్రమే స్ఫూరిస్తుంది.  కానీ అసలు లక్ష్మి అంటే శుభప్రదమైనది, మంగళకరమైనది అన్ని సంపదలు చేకూర్చేది అని అర్ధం.  అందుకే లక్ష్మి దేవి కొలువైన ప్రదేశం లో సకల దేవతలు ఉంటారు అని అంటారు.  ఆమె అనుగ్రహం ఉంటె లౌకిక, అలౌకిక సంపదలు అన్నీ మనకు లభిస్తాయి.  విద్య, కీర్తి, ధైర్యం, సంతానం, ధనం, ధాన్యం, పశు సంపద, గృహం, ఉద్యోగం , పదవి అధికారం చివరకు మోక్షం కూడా ఆమ అనుగ్రహ ఫలితాలే.  అందుకే మనం ఆమెను అష్టలక్ష్మి స్వరూపాలలో కొలుస్తాము. 

 
పరమ సౌమ్య స్వరూపిణి అయినా శ్రీ మహా లక్ష్మి కూడా అవసరమైనప్పుడు అసురులను నిర్జించి లోకాలకు శాంతిని కలిగించింది.  ఈ శరన్నవరాత్రుల్లో ఆమె రాక్షస సంహారం చేసి ప్రపంచానికి శుభాలను ప్రసాదించింది. అందుకే ఆమెను ఈనాడు పూజిస్తాము.  ఆమెకు ఇష్టమైన నైవేద్యం క్షీరాన్నం /పాయసం .  కనుక ఈరోజు మనం లక్ష్మి స్తోత్రాన్ని పఠించి క్షీరాన్నం నివేదన చేస్తే ఆమె అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ ఉంటుంది.

Navaratri 6th day - Shri Lalitha Parameshwari Avataaram

ఈ నవరాత్రుల్లో ఆరవ రోజు అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర సుందరి గా కొలుస్తారు.  లలితా పరమేశ్వరి అంటే శ్రీ చక్రం లో ప్రధాన దేవత.  మనం అందరం నిత్యం శ్రీ లలితా సహస్ర నామాలు పారాయణ చేస్తుంటాము.  ఈ స్తోత్రాన్ని హయగ్రీవ స్వామి అగస్త్యునికి ఉపదేశించాడు.  దీనిని మనం అందరం చదవవచ్చు.  ఈ అమ్మతనకు ఇరువైపులా లక్ష్మి దేవి, సరస్వతి దేవి తో కలిసి ఉంటుంది.  ఈ అమ్మను పూజించటం వలన  మరియు ఏఈ సహస్ర నామ పారాయణం వలన మనం సుఖ శాంతులు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతాము.  శ్రీచక్ర అధిష్టాత్రి, మణిపుర నివాసిని అయిన లలిత దేవి మనకు సకల శుభాలను ఇస్తుందని అభిలషిస్తున్నాను.

Navaratri 5th day - Shri Saraswathi Mata

శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం) తెలుపు రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ పంచమి


ఆశ్వయుజ శుక్ల పక్షమున మూలా నక్షత్రమునాడు చక్కని పీఠముపై తెల్లని శుభ్రమైన పట్టు వస్త్రాన్ని పరచి, దానిపై పుస్తకాలని పేర్చిపెట్టాలి. ఆ పుస్తకాలపై సరస్వతీదేవిని ఆహ్వాని౦చాలి. ఆహ్వాని౦చే ము౦దు కాస్త ధ్యాన౦ చేయాలి. అ౦దుకై చేతిలో అక్షతలు, పూలు పెట్టుకుని, పూజా పీఠానికి ము౦దు సుఖాసన౦లో కూర్చుని, వెన్నుపూస, మెడ, తల ఒకే వరుసలో ఉ౦డేటట్లు నిటారుగా కూర్చుని మన ఎదురుగా ఆ పుస్తకాలలో సరస్వతీ అమ్మవారు ప్రకాశిస్తున్నట్లు భావి౦చాలి. ఈ క్రి౦ది శ్లోకాలని చదువుచూ వాటి అర్థాన్ని గుర్తుచేసుకు౦టూ పూలని, అక్షతలని ఆపుస్తక ూప సరస్వతీ దేవిపై వేసి అమ్మవారు ఆ దివ్య ప్రకాశము మన శ్వాసరూప౦లో మనలోనికి ప్రవేశిస్తున్నట్లు భావి౦చుకోవాలి.


ధ్యాన శ్లోకములు


నమస్కృత్య జగత్పూజ్యా౦ శారదా౦ విశద ప్రభామ్
శ్రిత పద్మాసనా౦ దేవీ౦ త్ర్య౦బకీ౦ శశి భూషణామ్!!
పద్మముపై కూర్చుని యున్నది, మూడు కళ్ళతో చ౦ద్ర రేఖతో నిర్మలమైన కా౦తితో శోభిల్లుచున్నది, సమస్త జగత్తులకు పూజ్యురాలైన శారదా అమ్మవారిని నమస్కరి౦చుచున్నాను.


ప్రణవాసన మారూఢా౦ తదర్థత్వేన నిశ్చితామ్
సితేన దర్పణాభేన వస్త్రేణ పరిభూషితామ్!!
శబ్ద బ్రహ్మాత్మికా౦ దేవీ౦ శరచ్చ౦ద్ర నిభాననామ్!!
ప్రణవమే అమ్మవారి ఆసన౦. ఆ ఓ౦కారము తెలియజేసే వస్తువు అమ్మవారే అని ఉపనిషత్తులు నిర్ణయి౦చి చెప్పుచున్నాయి. శబ్దము ఆమె స్వరూపము. సాకార రూపమున ఆమె ముఖము శరత్కాల చ౦ద్రుని వలె ఆహ్లాదకరమైనది. ఆమె అద్దమువలె స్వచ్ఛముగా తెల్లగానున్న వస్త్రముతో భాసిల్లుచున్నది. అట్టి దేనిని ధ్యాని౦చుచున్నాను.


అత్రాగచ్ఛ జగద్వన్ద్యే సర్వలోకైక పూజితే
మయా కృతామిమా౦ పూజా౦ స౦గృహాణ సరస్వతి!!
సమస్త లోకాలచే పూజి౦పదగిన దానివి, అ౦దరిచే పూజి౦పబడే ఏకైక దేవతవూ అయిన ఓ సరస్వతీ దేవీ, మా ఆహ్వానాన్ని మన్ని౦చి ఇక్కడికి విచ్చేసి మా పూజని స్వీకరి౦చు తల్లీ!!


మూలా నక్షత్ర౦ రోజున ఇలా అమ్మవారిని ఆహ్వాని౦చి లఘుపూజ చేయాలి. మరునాడు పూర్వాషాఢ నాడు కూడా పునః పూజ చేయాలి. మహానవమి నాడు ఉత్తరాషాఢలో మహానైవేద్యాన్ని సిద్ధ౦ చేసుకుని ఆసనము, పాద్యము, అర్ధ్యము, ఆచమనీయము, మధుపర్కము, ప౦చామృతస్నానము, వస్త్ర యుగ్మము(చీర, రవిక), ఉపవీతము, ఆభరణములు, పసుపు, కు౦కుమ, కాటుక, గ౦ధము, అక్షతలు, పూలమాలలు సమర్పి౦చి, పుష్పాదులతో పూజి౦చి, ధూప దీప నైవేద్య తా౦బూలాదుల సమర్పి౦చి కర్పూర హారతినిచ్చి మ౦త్ర పుష్పా౦జలి నొసగి ప్రదక్షిణ నమస్కారాలను చేయాలి.ఆయా ఉపచారాలకై పూజా గ్ర౦థాలలో శ్లోకాలు ఉ౦టాయి. వాటితో చేయాలి.
పూజలో ము౦దుగా అష్టవిధ పష్పాలని సమర్పి౦చాలి. అవి
అర్క చ౦పక పున్నాగ, నన్ద్యావర్త౦ చ పాటల౦
బృహతీ కరవీర౦ చ ద్రోణ పుష్పాణి చార్చయేత్!!
అర్క=జిల్లేడు, చ౦క=స౦పె౦గ, పున్నాగ, నన్ద్యావర్త౦-న౦దివర్ధన, పాటల, బృహతి=వాకుడు, కరవీర=ఎర్రగన్నేరు, ద్రోణ=తుమ్మి అనునవి. క్రి౦ది ఎనిమిది నామములను స్మరి౦చుచూ చేయాలి.


సరస్వత్యై నమః - అర్కపుష్ప౦ పూజయామి
భారత్యై నమః - చ౦పక పుష్ఫ౦ పూజయామి
వాగ్దేవతాయై నమః - పున్నాగ పుష్ఫ౦ పూజయామి
మాతృకాయై నమః - నన్ద్యావర్త పుష్ఫ౦ పూజయామి
హ౦సాసనాయై నమః - పాటల పుష్ఫ౦ పూజయామి
చతుర్ముఖ ప్రియాయై నమః - బృహతీ పుష్ఫ౦ పూజయామి
వేద శాస్త్రార్థ తత్త్వజ్ఞాయై నమః - కరవీర పుష్ప౦ పూజయామి
సకల విద్యాధిదేవతాయై నమః - ద్రోణ పుష్ఫ౦ పూజయామి
ఆపైన సర్వా౦గ పూజ, అష్టోత్తర శతనామ పూజ, సహస్రనామ పూజలు చేయాలి. చివరికి -
దోర్భిర్యుక్యా చతుర్భిః స్ఫటిక మణిమయీ మక్షమాలా౦ దధానా
హస్తేనైకేన పద్మ౦ సితమపి చ శుక౦ పుస్తక౦ చాపరేణ!
భాసా కు౦దే౦దు శ౦ఖ స్ఫటిక మణినిభా భాసమానా సమానా
సామే వాగ్దేవతేయ౦ నివతు వదనే సర్వదా సుప్రసన్నా!!


చతుర్దశసు విద్యాసు రమతే యా సరస్వతీ
సా దేవీ కృపయా మహ్య౦ జిహ్వాసిద్ధి౦ కరోతు చ!!
అను శ్లోకాలతోనూ, ఇ౦కా కల్ప గ్ర౦ధాలలోని మరికొన్ని శ్లోకాలతోనూ ప్రార్థన చేయాలి.


సరస్వతీ దేవిని ధ్యాని౦చేటప్పుడు ఆరాధి౦చేటప్పుడు అకారాది క్షకారాన్త మాత్రా వర్ణములే సరస్వతీ రూమున మూర్తీభవి౦చినట్లు భావి౦చాలి.
సరస్వతీ దేవినిఈవిధ౦గా పూజి౦చి మహా నవమినాడు అన్నబలిని(నైవేద్య౦) సమర్పి౦చి, శ్రవణ నక్షత్రమున ఉద్వాసన చెప్పాలి. చెప్పి పుస్తకాలని చదువుకొనట౦ మొదలు పెట్టాలి. మూల - పూర్వాషాఢ - ఉత్తరాషాఢలలో మౌనము పాటి౦చి శ్రవణ౦ నాడు పుస్తక పఠ౦ ప్రార౦భిస్తే చదువులు బాగా వస్తాయి. మాటలలో నేర్పరితన౦ కలుగుతు౦ది. చదువుల సార౦ వ౦టబట్టి జ్ఞాన౦ సత్ఫలితాలనిస్తు౦ది.


విమలపటీ కమలకుటీ! పుస్తక రుద్రాక్ష శస్త హస్త పుటీ!!
కామాక్షి పక్ష్మలాక్షీ! కలిత విప౦చీ విభాసి వైరి౦చీ!!

Navaratri 4th day - Katyaayani devi

ఈ నవ రాత్రుల్లో నాలుగవ రోజు అలంకారం కాత్యాయని దేవి .  కాత్యాయని అంటే మన గౌరీ దేవి యొక్క అవతారమే అన్నమాట .  ఈమెను కొలిస్తే పెళ్లి కావలసిన అమ్మాయిలకు వెంటనే వివాహం జరుగుతుంది అని అంటారు . ద్వాపర యుగం లో గోకులం లోని గోపికలు ఈ కాత్యాయని వ్రతం చేశారు కృష్ణుని కోరి . ధనుర్మాసం లో గోదాదేవి 30. దివ్య పాశురాములు రచించి తన సఖులతో కలిసి ఈ కాత్యాయని వ్రతం చేసి శ్రీ రంగనాథుని భర్త గా పొందింది .  ఈ కాత్యాయని మాట అనుగ్రహం మన అందరికి ఉండాలి .

A small clarification about the avataras in Navaratri

We all know that during this Sharannavaratri we worship The Goddess Adishakti in nine different forms.  But there are two different types of these nine forms.  In one form they worship the Goddess in the for of nine Goddesses like Bala, Gayatri Lakshmi etc... and in another form they worship the Goddess in her nine Shakti forms like shailaputri, chandraghanta, siddhidhatri etc.  Shaakteya worshipers ( who believe the Shakti is the ultimate n worship her) perform puja to the nine Shakti forms.  And other people worship in all Goddesses' forms.

Sharannavaratri third day - Annapurna Devi

On the third day of Navaratri we worship the Goddess in the form of Shri  Annapoorna Devi.  She is the Goddess who feeds all the living beings in this world.  That's why she is called Annapurna. 

The shloka with which we pray to the Goddess Annapoorna is

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిద్దూతాఖిల లోక పావనకరీ  ప్రత్యక్ష మాహేశ్వరి
ప్రాలేయాచల వంశ పావనకారీ కాశీ పురాధీశ్వరి
భిక్షామ్ దేహి కృపావలంబన కరీ మాతాన్నపూర్ణేశ్వరి !!

Nava Durga roopam


Description of Nava Durga Avatar of Shri Adi Shakti

నవదుర్గామ్‌ నమోస్తుతే!

అమ్మలగన్నయమ్మ దుర్గమ్మ. నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకొక రూపంతో పూజించే సంప్రదాయం - ఆచారం ఉంది. ఈ తొమ్మిది రోజులూ పూజించే దుర్గాదేవి రూపాలను ‘నవదుర్గలు’ అంటారు. ఈ నవరాత్రార్చనలో తొమ్మిది రాత్రులు దేవిని పూజిస్తే సంవత్సరమంతా పూజించిన ఫలం లభిస్తుందని పెద్దల మాట.

1. శైల పుత్రి*

పరమ శివుని వివాహమాడిన పర్వతరాజ పుత్రి పార్వతి. శైల పుత్రి. ఈమె వృషభవాహిని. కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉంటాయి.

2 బ్రహ్మచారిణి*

పార్వతి శివుని భర్తగా పొందడానికి బ్రహ్మచర్య దీక్షతో కఠిన తపస్సు చేసినందున ‘బ్రహ్మచారిణి’ అనేపేరు వచ్చింది.

3. చంద్రఘంట*

శిరసున దాల్చిన అర్ధ చంద్రుడు ఘంటాకృతిలో ఉండడం వల్ల ఈ దేవికి ‘‘చంద్రఘంట’’ అనేపేరు ఏర్పడింది.

4. కూష్మాండ*

బ్రహ్మాండాన్ని సృష్టించినది కనుక ఆమెకు ‘కూష్మాండ’ అనే పేరు వచ్చింది. సూర్యుడిలో ఉండి జగత్తుకు వెలుగునిస్తుంది.

5. స్కందమాత*

స్కందుడు అంటే కుమారస్వామి. ఆయన తల్లి పార్వతి దేవి అంటే ‘స్కందమాత’. ఆమె ఒడిలో స్కందుడు ఉంటాడు.

6. కాత్యాయని*

కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించిన దుర్గావతారం. శ్రీకృష్ణుని పతిగా పొందాలని, గోపికలు అమ్మవారిని ఆరాధించిన రూపం ఇది.

7. కాళరాత్రి*

ఈ రూపంలో దేవి శరీరం చీకటిలా నల్లగా ఉంటుంది. అందుకే ‘కాళరాత్రి’ అని పేరు వచ్చింది. భయంకర రూపిణి. అయినా శుభకరి.

8. మహాగౌరి*

తెల్లని మేని చాయతో తెల్లని వస్త్రాభరణాలు ధరించిన పార్వతీ రూపమే మహాగౌరి. ఆమె వృషభ వాహిని.

9. సిద్ధిధాత్రి*

దేవి చివరి రూపం సిద్ధి ధాత్రి. అన్ని రకాల సిద్ధులను ఇచ్చేది కాబట్టి ఆమె ‘సిద్ధిధాత్రి’ అయింది.
 
 

sharannavaratri second day - Shri Gayatri Alamkaaram

శరన్నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రీ దేవి అలంకారం చేస్తారు.  మధు కైటభులు వేదాలను అపహరించినప్పుడు శ్రీ మహా విష్ణువు వారిని సంహరించి ఆ వేదాలను రక్షించి తిరిగి బ్రహ్మ కు ఇస్తాడు.ఆ పంచ వేదాల స్వరూపమే శ్రీ గాయత్రీ మాత. అందువల్లనే ఆమెను వేదమాత అని కూడా పిలుస్తారు.  గాయత్రీ మంత్రాన్ని సర్వ మంత్ర రాజము అని కూడా అంటారు .  దేవతలకు నైవేద్యం సమర్పించేటప్పుడు ముందుగా గాయత్రీ మంత్రం చదువుతూ నీటిని చల్లుతారు.  ఈ మంత్రం లో 24.మంది దేవతలు ఉంటారు.  దీనిని మనం పవిత్రం గా చూడాలి అంతే గానీ మన మొబైల్ ఫోన్స్ లో కాలర్ ట్యూన్స్ ఇంకా ఎక్కడ పడితే అక్కడ ప్లే చేసే ఒక సినిమా పాట గా చూడకూడదు.  ఈరోజు అమ్మవారిని గాయత్రీ దేవి రూపం లో కొలుస్తారు . 

ఆ అమ్మ యొక్క ధ్యాన శ్లోకం :

ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయై ముఖై తీక్షణైః
యుక్తామిందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్ధ వర్ణాత్మికామ్ !
గాయత్రీమ్ వరదా భయాంకుశకశామ్  శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మదారవింద యుగళామ్ హస్తైర్వహంతీమ్ భజే !!   

Durga sthotram to reduce all our sufferings

ఈ సారి దుర్గా నవరాత్రులు బుధవారం నుండి ప్రారంభమవుతున్న శుభ సందర్భాన... అందరికీ ఒక నివారణా స్తోత్రాన్ని అందించడం జరుగుతోంది. ఎటువంటి కష్టమైనా, ఇబ్బంది అయినా ఈ స్తోత్ర పారాయణ వల్ల తొలుగి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించే యోగ్యత అమ్మ కలిగిస్తుంది... అమావాస్య వెళ్ళిన తరువాత వచ్చే మొదటి బుధవారం మొదలు పెట్టాలి ఈ స్తోత్రాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలనుకున్నా... కనుక అందరూ శ్రద్ధాభక్తులతో ఈ స్తోత్రాన్ని చదవగలరు... చిన్నది అవడం మూలాన పొద్దున్న, సాయంత్రం కూడా చక్కగా పారాయణ చేసుకోవచ్చును...

                             శ్రీ  దుర్గా ద్వాత్రింశన్నామ  మాలా
 
   Those who read these 32 names of DurgaDevi daily without any doubt will certainly overcome all the difficulties and fears in their life. This Slokam is from Durga Sapthasati.
 
 ఈ  శ్లోకం  చాలా  శక్తిమంతమయిన  శ్లోకం. దుర్గాదేవికి  సంభందించిన 32 నామాలు  ఇందులో  ఉన్నాయి .  ఈ  శ్లోకం  దుర్గాసప్తసతి  లో  కనిపిస్తుంది . ఈ  శ్లోకాన్ని ఎవరు   రోజూ  చదువుతారో  వారు  అన్ని భయాలనుంచీ    కష్ఠాలనుంచీ  విముక్తులవుతారు. అందరూ  తప్పకుండా  నమ్మకం  తో  చదవండి 
 
 
దుర్గా  దుర్గార్తి  శమనీ   దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్ఛేదినీ  దుర్గసాధినీ  దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ   దుర్గనిహంత్రీ   దుర్గమాపహా 
ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక   దవానలా
ఓం దుర్గ  మాదుర్గమాలోకా   దుర్గమాత్మ  స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా   దుర్గమవిద్యా  దుర్గమాశ్రితా
ఓం దుర్గమ  జ్ఞాన  సంస్థానా  దుర్గమ  ధ్యాన  భాసినీ 
ఓం దుర్గ  మోహాదుర్గ  మాదుర్గమార్ధ  స్వరూపిణీ
ఓం దుర్గ  మాసుర  సంహంర్త్రీ    దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ  దుర్గమాతా  దుర్గమాదుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా  దుర్గ  దారిణీ
నామావళి   మిమాం  యస్తు దుర్గాయా  మమ మానవః
 పఠేత్సర్వ  భయాన్ముక్తో  భవిష్యతి  నసంశయః 
 
ఎవరైనా అమితమైన కష్టాలను అనుభవిస్తున్నారనుకున్న వారికి ఈ స్తోత్రాన్ని ఇవ్వగలరు.

Sharannavatri first day - Bala Tripura Sundari Avataram

అందరికి శరన్నవరాత్రి శుభాకాంక్షలు . 

   సహజం గా రోజు ఉదయం పురుష దేవతలను, రాత్రి సమయం లో స్త్రీ దేవతలను పూజిస్తారు.  అది పూర్వ కాలం లో ఉన్న సంప్రదాయం.  ఈ నవ రాత్రుల్లో మొదటిరోజు అమ్మవారిని బాల త్రిపుర  సుందరి రూపం లో కొలుస్తారు .  అమ్మవారు బాల అంటే చిన్నపిల్ల గా భండాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది .  అందుకే ఆమెను ఈ అవతారం లో పూజిస్తారు మొదటిరోజు.  అందుకే ఈరోజు 1. నుండి 10.స0" వయసు లోపు పిల్లలను అమ్మవారి రూపం లో పూజిస్తారు.

ఇంకా శ్రీవిద్య ఉపాసకులకు మొదటి అవతారం మరియు ఉపాసన కూడా ఈ బాలాత్రిపురసుందరి అవతారమే .  ముందు ఈ బాల మంత్రాన్ని అనుష్ఠానం చేసిన తర్వాత మాత్రమే మిగిలిన దేవతలను ఉపాసన చేస్తారు.

అమ్మవారికి ఈరోజు నైవేద్యం గా లడ్డు, పెసర వడలు సమర్పిస్తారు.

  అమ్మవారి ధ్యాన శ్లోకం:

అరుణ కిరణ జాలై రంజిత సావకాశా
విధృత జప వాటికా పుస్తకాభితి హస్తా
ఇతర కరవరధ్యా ఫుల్ల కల్హార సంస్తా
నివసతు హృది బాలా నిత్య కళ్యాణరూపా !!  

Devi Navatri festival (Sharannavatri)

Dear friends,

From today onwards we r going to celebrate Sarannavaratri (Devi navaratri) festivals.  We celebrate this festival for 10 days.  This festival symbolizes the fight b/w good and evil and the victory of good over bad.  The final day of this festival is called Vijaya Dashami because on that day the Goddess killed the Mahishasura. In Eastern n Noth Eastern States they celebrate Durga Puja n worship Maa Durga.  In some places They celebrate Ram leela aslo because on that day Lord Shri Rama killed Ravana n won the battle.

In South India in some states they decorate their houses n arrange all dolls n statues of mythological characters in their homes called Gollu/Bommala koluvu. n worship n celebrate.  In Telangana state they keep Bathukamma n decorate with beautiful flowers n prepare some special sweets n sing special songs n dance around those idols in the evenings. 

In various places we celebrate in different ways.  But the main purpose of this whole celebration is the victory of good over evil.  I pray the Goddes gives us all the happiness n fulfills our wishes n showers her blessings on us. 

Importance of doing Rites to the dead (Pitru Karmas)


పితృ కర్మ
వేదం విధించిన కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి .....!!
నవమాసాలు కడుపులో పెట్టుకొని , రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి , పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణభారము వహించిన తండ్రికి క్రుతజ్ఞత చూపడము మానవత్వము ... విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి .
మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం.అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు పితృదేవతలకు అందుతాయనేది మన నమ్మకం.


మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లితండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే భాద్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆబ్దీకాలు పెట్టాలి.


కాని ప్రస్తుత కాలంలో వివిధ కారణాలతో చాలా మంది ఈ కార్యక్రమాలు చేయలేకపోతున్నందుకు వారిలో వారు బాధపడుతున్నారు అనేక మంది వివిధ కారణాల వల్ల ఈ కార్యక్రమాలు చేయలేకపోతున్నారు.


కొంత మంది స్వదేశం వచ్చినప్పుడో లేక స్వగ్రామం వచ్చినప్పుడో, ఏ కాశీలోనో ఏ గయలోనో పితృ తర్పణాలు ఒక్కసారి చేస్తే సరిపోతుందని అనుకుంటారు. అది పొరపాటు. ఎందుకంటే పుణ్య నదులలో పుణ్యక్షేత్రాలలో చేసిన కర్మలు పవిత్రమైనవే కాని అవి పూర్తిగా సమాప్తం కావు. కాబట్టి పుత్రులు తామున్నంత వరకు పితృకార్యాలు (మాసికం, ఆబ్దీకం) చేయాలి అలా చేయలేని పరిస్థితులలో ఆ కార్యాన్ని నిర్వర్తించే వారిపై నమ్మకం ఉంచి చేయించిన కూడా ఫలితం లభిస్తుంది.


మాసికాలు, ఆబ్దీకాలు ఒక్క మన తల్లి తండ్రులకు మాత్రమే గాక మగ పిల్లలు లేని బంధువులకు మనం కర్తగా ఉండి ఈ కర్మలను నిర్వర్తించవచ్చును.


ఉదా : మావయ్య, అత్తయ్య, తాత, బామ్మ, అమ్మమ్మ, అన్న, వదిన, తమ్ముడు, భార్య, కొడుకు, పిన్ని, బాబయ్య, పెద్దమ్మ, పెద్దనాన్న మొదలగు వారికి కర్మలను నిర్వహించినచో వారు మోక్షమార్గం పొందగలరు.


తీర్థయాత్రలకి వెళ్ళలేని వారు కనీసం తీర్థయాత్రలు చేసిన వారిని చూసిన, సేవించినా కూడా పుణ్యం కలుగుతుందని పురాణాలలో చెప్పబదింది. అలాగే మాసికాలు, ఆబ్దీకాలు స్వయంగా పెట్టలేని వారు తగు వ్యక్తుల సహాయ సహకారాలతో పెట్టించటం కూడా స్వయంగా పెట్టినంత ఫలితానిస్తుంది. ఇది మన భారతీయతలోని సనాతన ధర్మం, సంప్రదాయం తద్వారా వారి వంశాభివృద్దిని ఆయుక్షేమాన్ని, సుఖ శాంతులను పొందగల్గుతారు.


ఒకసారి భీష్ముడు తన తండ్రికి పితృకర్మ తలపెట్టాడు. పరమనిష్ఠతో పితృకర్మలు సమర్పిస్తున్న కుమారుడి శాస్త్రబద్ధతకు మురిసిన ఆయన తండ్రి శంతనుడు స్వయంగా పిండాన్ని అందుకోవడానికి దిగివచ్చాడు. పిండాన్ని తనకు ఇవ్వమని కుమారుడిని అడిగాడు. ‘శాస్త్రాలు ఒప్పుకోనందున నేను పిండాన్ని మీ చేతుల్లో పెట్టలేను’ అని భీష్ముడు అన్నాడు. పిండాలను దర్భల మీదనే  పెట్టాలని శాస్త్రాలు నియమాన్ని విధించాయి.


పితృ కర్మలు అనగా ఆబ్దీకములు(శ్రాద్ధ కర్మలు, తద్దినములు) వదిలిపెట్టడము అంటే చేయకపోవడం వలన మన యొక్క వంశాన్ని, మన పిల్లల్ని, మనల్ని కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది.


నిత్య, నైమిత్తిక, కామ్య కర్మలను ఆచరించే మానవులు తమ పితృ దేవతలను ఉద్దేసించి చేసే కర్మ శ్రాద్ధ కర్మ. శ్రాద్ధ కర్మ అంటే శ్రద్ధతో ఆచరించ వలసినది. మృతులైన పిత్రాదులను ఉద్దేసించి శాస్త్రోక్తమైన కాలమందును, దేశమందును పక్వాన్నము గాని(భొక్తలకు భోజనము ), యామాన్నము గాని(బియ్యము, పచ్చి కూరలు, పప్పు దినుసులు మొదలగునవి), హిరణ్యము(బంగారము) గాని విధి ప్రకారము బ్రాహ్మణులకు దానము చేయుట శ్రాద్ధమనబడును.


అశ్రద్ధ అనగా నాస్తికత్వ బుద్ధి చే పితృదేవతలు లేరని, అనేవారి పితరులు రక్తము త్రాగుదురు(భోజనము అందక).
పితృ దేవతలను ఉద్దేసించి మంత్ర పూర్వకముగా ఇచ్చే వస్తువులు ఏ రూపముగా ఇచ్చినను వారికి చేరును.


మనము శ్రాద్ధ కర్మ చేయునపుడు పితృ దేవతలు వాయురూపమున అతి త్వరగా వచ్చి భోజనము భుజింతురు అందుచే శ్రీ రామ చంద్రుడు శ్రాద్ధము చేయునపుడు సీతా దేవి బ్రాహ్మణుల యందు దశరధాదులను చూసెనని కధ ఉన్నది.


మనం పెట్టే ఈ శ్రాద్ధ కర్మలు మన తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నానమ్మ మొదలైన వారికే కాకుండా మన రక్త సంబంధీకులు, స్నేహితులలో అగ్ని ప్రమాదము, వాహన ప్రమాదము ఇలా అనేక ప్రమాదములలో మరణించిన వారికి ఉపనయనము అవ్వకముందే మరణించిన వారిని కూడా ఈ సంధర్భముగా మనము త్రుప్తి పరుస్తాము అంతే కాక మన ఇంట్లో పని చేసి మరణించిన వారికి కూడా మనము ఈ శ్రాద్ధ కర్మలు ద్వారా తృప్తిపరుస్తాము.


అపుత్రస్యగతిర్నాస్తి: అంటే వారసులు లేని వారికి ఉత్తమగతులు సంప్రాప్తించబోవని సాధారణంగా నిస్సంతువులు నిరంతరం దుఖిఃస్తుంటారు. సంతానం లేకపోతే ఉత్తమ గతులు సంప్రాప్తించవని భావించడం, ఆ క్రమంలో నిరంతరం దుఖిఃంచడం వ్యర్థం. సృష్టికి పునరుత్పత్తి అనేది అవసరం కాబట్టి దానిని కొనసాగించడం కోసం తన తదనంతరం వారసులు ఉండాలని అందరూ భావిస్తుంటారు. వాస్తవానికి వారసులు అంటే సంతానం అని మాత్రమే కాదు. చేసే పని ఏదైనప్పటికీ దానిని అందుకొని కొనసాగించే వారసుడిని పొందాలనేది అపుత్రస్యగతిర్నాస్తిః యొక్క వాస్తవిక అర్థం.


 పితరులను ఉద్దేశించి, వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్ద తో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదం గా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపం లో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడా వాయురూపం లో భోజనం స్వీకరిస్తారు.


శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతం గా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణం లో చెప్పబడింది. ఆదర్శ పూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతతి వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మలో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాలలోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలాన్నిస్తుంది.


కొంత మంది వివిధ కారణాలతో తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు. ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము.


పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు. మనందరి (జీవుల) రాకపోకలను, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ. వసువులు, రుద్రులు, ఆదిత్యులు.. మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు.


కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తరువాత పుడతాడు అనేది నిజం. కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము. ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది. వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపొలేదు. అది ఆ జీవుని యొక్క సంకల్ప బలం, తనకి గల ప్రారబ్ధ, ఆగామి, సంచితం అనే కర్మలపైన ఆధార పడి ఉంటుంది.


ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది. వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏది ఆహారమో ఆ రూపంలో అందుతుంది. ఇలా చేయడానికి ఒక వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు చేసేరు. ఉదాహరణకు..ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంగా మారి మనం పెట్టిన ఆహారం అందుతుంది. వారిని ఉద్దేశించి అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకి మంచి కలుగజేస్తారు. ఒకవేళ గతించిన వారు ముక్తిని పొంది లేదా ఉత్తమ గతులలో ఉండి మనం చేసినవి అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే మన కోరికలు తీరే విధంగా వస్తుంది.  కానీ గతించిన వారి స్థితి మనకు తెలియదు కనుక మనం జీవించి ఉన్నంత కాలం పితృకర్మలు చేయవలసినదే.


ఈ జన్మతో బంధం తెంచుకున్న జీవన్ముక్తులకి తప్ప మిగతావారికి గతించిన తరువాత కూడా తన పూర్వీకులతోనూ, తన తరువాతి తరం వారితోనూ సంబంధం ఉంటుంది. మనం పెట్టే ఆహారం స్వీకరిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని కాపాడేది వాళ్ళే....

Mahalaya Amavasya

పితృదేవతల ‘పక్షం' -  మహాలయ పక్షాలు


అన్నాద్భవంతి భూతాని
పర్జన్యాదన్న సంభవః
యజ్ఞాద్భవతి పర్జన్యో
యజ్ఞ కర్మ సముద్భవః

అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలని గీతలో ఉంది.

మరణించిన వ్యక్తి తిథి నాడు తద్దినం పెట్టడం హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకొని యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతేమిటి? వారి కోసం శాస్త్రం ఓ మార్గాన్ని నిర్దేశించింది. కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరిలు మరణించి ఉండవచ్చు. పెళ్లయినా.. సంతానం లేక మరణించిన దంపతులూ ఉండవచ్చు. ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు, యుద్ధాలలో ప్రాణాలు వదిలిన వాళ్లు, ఆత్మహత్య చేసుకున్నవాళ్లు, ప్రకృతి వైపరీత్యాల్లో గుర్తుతెలియక కన్నుమూసిన వాళ్లు ఉండవచ్చు. అటువంటి వారికి తిలోదకాలు ఇచ్చి.. వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం నిర్దేశించినవే మహాలయపక్షాలు.


భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజులను మహాలయ పక్షాలు అంటారు. మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని వారి వారసులు శ్రాద్ధ విధులు నిర్వర్తించడానికి వీటిని నిర్దేశించారు. వీటినే పితృపక్షాలు అనీ, అపరపక్షాలు అనీ పిలుస్తారు. మరణించిన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షాల ముఖ్యోద్దేశం.


మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుందని మనశాస్త్రాలు చెబుతున్నాయి. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి భూమి మీదికి జీవాత్మగా రావాల్సి ఉంటుంది. మరణించిన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే.. పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అలా అందించే అధికారం వారి కడుపున పుట్టిన పుత్రులకే ఉంటుందని చెబుతోంది శాస్త్రం. అప్పుడే వారి పితృరుణం తీరుతుంది. ఆ రుణం తీరడమే మోక్షం.


కాలం చేసిన వంశస్థులతో పాటు పుత్రులు లేని గురువులకు, స్నేహితులకు కూడా మహాలయ పక్షాల్లో తిలోదకాలతో పిండప్రదానం చేసే అర్హత, అధికారం కర్తకు ఉంటుంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు. ఏ కారణంతోనైనా.. తద్దినం పెట్టకపోతే.. ఆ దోషం మహాలయ పక్షాల్లో పితృవిధి నిర్వర్తిస్తే తొలగిపోతుందంటారు. ఈ పక్షాలº్ల పితృదేవతలు ఆశతో తమ వారసుని ఇంటిని ఆవహించి ఉంటారని నమ్ముతారు.పితృవిధి నిర్వర్తించిన వారసుడిని మనసారా ఆశీర్వదించి, పిల్లాపాపలతో సంతోషంగా జీవించమని దీవిస్తారట .

Did you know these things about India n Its Heritage?






A shloka for curing cancer suggested by Kanchi Paramacharya HH Shri Chandra Shekharendra Saraswathi

Shloka for Cure of Cancer

This shloka from Srimad Narayaneeyam  (Dasakam 8, Sloka 13), written by Narayana bhattadri , which is srimad bhagavatham in condensed form is a very powerful shloka that has been advised by HH Sri Sri Sri Kanchi Maha Periyava Chandrasekhara Saraswati for curing cancer. One who recites this sloka 108 times continuously for 45 days gets completely cured from cancer.

अस्मिन् परात्मन् ननु पाद्मकल्पे
त्वमित्थमुत्थापितपद्मयोनि: ।
अनन्तभूमा मम रोगराशिं
निरुन्धि वातालयवास विष्णो ॥

Asmin Paraathman Nanu Paadmakalpe
Thvamithamutthaapitha Padmayonihi I
Anantha Bhoomaa Mama Roga Raashim,
Nirundhi Vaathaalaya Vaasa Vishno. II

O Supreme Lord of incomprehensible powers, in this age known as the Paadma Kalpa, Thou thus brought into existence the Creator Brahmaa. O Lord Vishnu! Who has manifested in the temple of Guruvaayur, please eradicate my ailments.

10 princeples of Mahatma Gandhi


A remarkable leader Shri Lal Bahadur Shastriji


లాల్ బహదూర్ శాస్త్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు

మనం మరచిన మహానేత లాల్ బహదూర్ శాస్త్రి!
(పాపం విమానం లో కూడా ఫైల్స్ చూసుకొనే వారు ... అది భార్యా పక్కనే )

అక్టోబర్, 2 అంటే ఒక్క గాంధీ గారి పుట్టినరోజు గా మాత్రమే చాలా మంది గుర్తుపెట్టుకున్నారు. 
 
ఇది ఇంకొక మహానాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడా. టి.వి. లు, పేపర్లు ఈ రోజు ఒక్క గాంధీ గారి గురించి మాత్రమే తలచుకుంటాయి. యించుమించు దేశం యావత్తు మరచిపోయినరోజు. కొందరి విషయంలో పునరుక్తి విధానం దోషంకాదు. కాని స్మరించ వలసిన వ్యక్తిని స్మరించకపోవడం నేరం. దురదృష్టవశాత్తూ మన భారతదేశంలో. ఏది ఏమైనా, మనం మరపురాని రోజుగా గాంధీజయంతిని పండుగగా జరుపుకునే అక్టోబర్ 2 రోజు మనం అదేరోజున మన దేశం మూడవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిగారి జన్మదినం కూడ అదేరోజు అన్నది మరచిపోయిన రోజు కూడ అదే అన్నది వింత, విడ్డూరం కలిగిస్తాయి.

అల్పకాలంగా ప్రధానిగా సేవలనందించినా, అనల్పమైన నాయకునిగా పేరుప్రఖ్యాతులను పొందారు. విజయం తెచ్చిన విషాదం భారత్-పాకిస్తాన్ మధ్య 1965 లో జరుగుతున్న యుద్ధం సందర్భంగా శాస్త్రి ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, ఆ సంకల్పం, దీక్ష, సరిసములు లేని ధీరలక్షణాలు ఆ నాయకునివి.
 
దేశానికి మూలమూలలకు వ్యాపించిన నినాదం 'జై జవాన్ జై కిసాణ్ అన్నది లాల్ బహదూర్ శాస్త్రిగారి భావనే. ఆ అవాంతర పరిస్థితుల్లో ప్రజలను త్యాగవంతులుగా ముందుకు రావాలని కోరిన మహానుభావుడు. పాకిస్తాన్ తో అమోఘమైన విజయాన్ని సాధించాడు. ఈ ఆనందం పంచుకునే లోపున, 1966 లో పాకిస్తాన్ తో తాష్కెంట్ లో జరుపుకున్న అంగీకార సమావేశం ఫలితంగా అంగీకారపత్రంపై తన ముద్రని యిచ్చిన వెంటనే, మరణించడం దురదృష్టకరం. 
 
ఓ శాస్త్రీ సరిలేరు నీ కెవ్వరూ ! శాస్త్రిగారు భారత రాజకీయాల్లో తనదైన శైలిలో చెరగని ముద్ర వేశారు. అందరి మనసును దోచిన విషయాలు - శాస్త్రిగారు ప్రదర్శించిన నీతిపూర్వక నడత, నిరాడంబరత, రికామీ వ్యక్తిత్వం, త్యాగశీలత, శాంతమూర్తి, ధృఢనిర్ణయకారుడు. ఆయన భౌతికంగా వామనమూర్తి అయినా ఆయన తరానికి మాత్రం నడతలో ఆజానుబాహుడు.

 

 
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online