Pages

Wish you Happy new year2024


 మిత్రులు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర2024 శుభాకాంక్షలు ..కలియుగ దైవంశ్రీవేంకటేశ్వరు ని దయతో అందరికీ ఆయురారోగ్య అయుశ్వర్యా లతోను శుభ లాభలతోను వర్ధిల్లాలని ..ప్రార్ధిస్తూ శుభాకాంక్షలు ఓం నమో వెంకటేశాయ

జై శ్రీకృష్ణ జై శ్రీరామ శ్రీ సాయునాధ మహరాజ్ కి జై 


Tiruppavai15 th pashuram తిరుప్పావై15 వ పాశురం


      🙏ఓం  నమో నారాయణాయ ఓం నమో వే0కటేశాయ🙏

Tiruppavai14 th pashurm తిరుప్పావై 14 వ పాశురం


 భక్తులు లో 3 రకాల వారు ఉన్నారట   వారుఎవరు అలానే భగవంతుని కి ఎవ్వరు అంటే అత్యంత ఇష్టం ..ఈ పాశురం మొత్తం వినే ప్రయత్నం  లో తెలుసుకోవచ్చు...

ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ

                       ఓం నమో విష్ణవే 

                      ఓం నమో వే 0కటేశాయ 

తమినాడులోని శ్రి రంగం లో శ్రీ రంగనాథ స్వామి వారి కి జరిగే సేవ నీ చూడండి... తరించండి


                                           ఓం నమో నారాయణాయ ఓం నమో వేంకటేశాయ 

                                                        శ్రీమతే రామనుజాయై నమ,:

Tiruppavai 13 th pashuram తిరుప్పావై 13 వ పాశురం


     ఓం నమో నారాయణాయ ఓం నమోవే0కటేశాయ

Tiruppavai12 pashuram... తిరుప్పావై 12 వ పాశురం


   ఓం నమో నారాయణాయ ఓం నమో వే0కటేశాయ

            శ్రీ మతే రామానుజాయై నమ:



Tiruppavai11 th pashuram. తిరుప్పావై11 వ పాశురం


 భగవంతుడు కలియుగంలో ఏ రంగులో ఉంటాడు 

తెలుసుకోవాలని అనుకుంటే మొత్తం వ్యాఖ్యాన0 వినండి

   ఓం నమో నారాయణా య ఓం నమో  వే0కటేశాయ 


Tiruppavai 10 th pashuram తిరుప్పావై 10 వ పాశురం


 ఓం నమో నారాయణాయ ఓం నమో వేంకటేశాయ

           ,, శ్రీమతే రామానుజయాయై నమ:

Tiruppavai 9 th pasuram తిరుప్పావై 9 th పశుర0


       ఓం నమో నారాయణాయ ఓం నమో వేంకటేశాయ

Tiruppavai 8 th pasuram తిరుప్పావై 8 వ పాశుర0


 ఓం నమో నారాయణాయా ఓం నమో  వే0కటేశాయ

తిరుప్పావై 7 వ పాశుర0 Tiruppavai 7 th pasuram


    ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ
              శ్రీమతే   రామానుజాయ నమ:

తిరుప్పావై 5 వ పశురాం Tiruppavai 5 pashuram


 ఓం నమో నారాయణాయ ఓం నమో వే0కటేశాయ

            శ్రీమతే రామానుజాయై నమ:

బులుసు సా0బమూర్తి గారు ఒక భారత రత్నం

 💥బులుసు సాంబమూర్తిగారు


బులుసు సాంబమూర్తి గారి గురించి చెప్పుకోవాలంటే మాములుగా, ఆయన వ్యక్తిత్వం గురించి తలుచుకుంటే, ‘ మనమధ్య తిరిగిన వ్యక్తియేనా ఈయన.  మనకెందుకు ఈయన గురించి ఇన్నాళ్లూ తెలియకుండా పోయింది ‘ అనిపిస్తుంది.


బులుసు సాంబమూర్తిగారు, 1886 మార్చి 4 న గోదావరి జిల్లాలోని దుళ్ల గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ లో, సాంప్రదాయ బద్ధమైన ఒక బ్రాహ్మణకుటుంబంలో జన్మించారు. వారి జీవిత కాలం 71 సంవత్సరాలు. 


వీరు 1958 వ సంవత్సరం ఫిబ్రవరి 2 న కాకినాడలో అస్తమించారు.  వీరి పితృదేవులు సుబ్బావధానులు గారు వేదపండితుడు.  కుటుంబమంతా దానధర్మాలు చేస్తూ, ధార్మిక జీవనం సాగించేవారు.


సాంబమూర్తి గారు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి సైన్స్ లో పట్టా పుచ్చుకుని, విజయనగరం మహారాజా కళాశాలలో కొంతకాలం భౌతికశాస్త్రం బోధించారు. స్వతహాగా స్వేచ్ఛాస్వభావి అయిన సాంబమూర్తిగారికి ఈ ఉద్యోగం అంతగా నచ్చలేదు.  కొంతకాలానికి, ఆ ఉద్యోగానికి రాజీనామాచేసి, న్యాయవాదవృత్తి చేపట్టాలని నిర్ణయించుకున్నారు.


తరువాత బి.ఎల్. పరీక్షలో ఉత్తీర్ణులై, 1911 లో కాకినాడలో క్రిమినల్ లాయర్ గా న్యాయవాదవృత్తిని ప్రారంభించారు. వారి ప్రతిభతో వారు, ప్రకాశం పంతులుగారి అభిమానం చూరగొని, వారితో కలిసి మద్రాస్ హైకోర్ట్ లో యెంతో ప్రతిభావంతంగా క్రిమినల్ కేసులు వాదించేవారు. 


సాంబమూర్తి గారు చాలా విలాసవంతమైన జీవితం గడిపేవారు. ఆయన సిల్క్ సూటు వేసుకుని, మోటార్ సైకిల్ మీద కోర్టుకువస్తుంటే, చూడముచ్చటగా ఉండేదట.


అయితే, మహాత్మా గాంధీ పిలుపునందుకొని న్యాయవాదవృత్తిని వదలి, సాంబమూర్తిగారు స్వతంత్రపోరాటంలో పాల్గొన్నారు.   ఆరోజులలో బ్రాహ్మణులు న్యాయవాదవృత్తిలో అమోఘంగా రాణిస్తూ, విశేషమైన ధనం ఆర్జించేవారు.  అయినా దేశభక్తి ముందు ఆ సంపాదన తృణప్రాయంగా భావించారు సాంబమూర్తి గారు.  వారు గాంధీ గారి కంటే ముందునుండే ఖద్దరువస్త్రాలు తొడగడం ప్రారంభించి, చరిత్ర సృష్టించారట.


సాంబమూర్తి గారు, 1919 లో హోంరూల్ ఉద్యమంలోను, 1930 లో ఉప్పు సత్యాగ్రహంలోను, 1932 లో శాసనోల్లంఘన ఉద్యమంలోను, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలోను, నీల్ సత్యాగ్రహంలోను పాల్గొని కారాగార శిక్షలు అనుభవించారు. 1927 లో నాగపూరు ‘ పతాక సత్యాగ్రహ ‘ దళానికి నాయకులుగాను, 1928 లో ‘ హిందూస్థానీ సేవాదళానికి ‘ అధ్యక్షులుగాను పనిచేశారు.


స్వతంత్ర ఉద్యమసమయంలో, డప్పుల సుబ్బారావు అనే క్రూరుడైన పోలీస్ అధికారి చేతిలో లాఠీతో చావు దెబ్బలుతినికూడా, మొక్కవోని ధైర్యంతో, రాయిలాగా నిలబడి, అందరినీ ఆశ్చర్యపరిచారు, సాంబమూర్తి గారు. ఆ తరువాత అనేకసార్లు సాంబమూర్తి గారిని పోలీసులు అరెస్ట్ చెయ్యడం, జైళ్లలో పెట్టడం పరిపాటి అయిపొయింది.


తరువాత వీరు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెసు కమిటీకి అధ్యక్షులుగాను, 1929 లో అఖిలభారత కాంగ్రెసు కమిటీలో సభ్యులుగా వ్యవహరించారు. 1930 ఉప్పుసత్యాగ్రహ సమయంలో తన సహచరులతో చొల్లంగి సముద్రతీరానికి వెళ్ళి ఉప్పును తయారు చేశారు. అప్పుడు సాంబమూర్తి గారిని అరెస్టుచేసి వెల్లూరు జైలుకి తరలించారు.


సాంబమూర్తి గారు అకళంక దేశభక్తుడు, స్వతంత్ర సమరయోధుడు.  భారతదేశ స్వతంత్రం, ప్రత్యేకాంధ్ర రాష్ట్రం, విశాలాంధ్ర అనే పరమలక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేసిన కార్యశూరుడు.  వారి ధార్మిక జీవనాన్ని గమనించి ప్రజలందరూ, సాంబమూర్తి గారిని ' మహర్షి బులుసు సాంబమూర్తి ' గారని పిలిచేవారు.


స్వతంత్రఉద్యమ పోరాటసమయంలో, కాకినాడలో అఖిల భారతకాంగ్రెస్ సెషన్ నిర్వహించే సమయంలో, ఆహ్వాన కమిటీ ముఖ్య కార్యదర్శిగా వున్న సాంబమూర్తి గారు, అదేరోజు వారి కుమారుడు పాముకాటు వలన ఆకస్మికంగా మృతిచెందినా, మనసు నిబ్బర పరచుకుని, సమావేశానికి ఏమాత్రం అంతరాయం కలుగకుండా, దుఃఖాన్ని తొక్కిపెట్టి, సదస్సుకు అందరినీ ఆహ్వానించి తనకు అప్పజెప్పిన బాధ్యతని చక్కగా నిర్వర్తించారు.


ఈ విషయం తెలిసి తరువాత గాంధీగారు, సదస్సును మధ్యలో ఆపుజేయించి, ‘ సంతాప సభ ‘ గా దానిని మార్చారు. సరోజినీ నాయుడు గారు ఎంతగానో ఆయన కార్యదీక్షను ప్రశంసించారు.  ఆ సమయంలో, సాంబమూర్తిగారు నిజమైన మహర్షిలాగానే ప్రవర్తించారు.   


అంతేకాదు, ఉప్పు సత్యాగ్రహం సమయంలో, సాంబమూర్తిగారు, బ్రిటిష్ వారు మనదేశాన్ని వదలి వెళ్లేవరకూ, వుప్పుముట్టనని ప్రతిజ్ఞ చేసారు.   అదే విధంగా ఆహారం తీసుకున్నారు, ఉప్పులేకుండా.


జాతీయస్థాయిలో సాంబమూర్తిగారు హిందూసేవాదళ్ కి అధ్యక్షునిగా పనిచేసి, తాను ఛాందస బ్రాహ్మణ కుటుంబంలోనుంచి వచ్చినా, హరిజనులకు, స్త్రీల ఉద్ధరణకు యెంతో సేవజేశారు. 


ఒక చిన్న కార్యకర్తగావున్న దుర్గాబాయి దేశముఖ్ గారిని ప్రోత్సహించి ఆమె న్యాయశాస్త్ర పట్టభద్రురాలు అయేటట్లుచేసి, ఆమెసేవలు దేశం ఉపయోగించుకునే విధంగా సాంబమూర్తి గారు, ఆమెను తీర్చిదిద్దారు. అంతేకాదు, సాంబమూర్తి గారు, ‘ చెన్నపురి ఆంద్ర మహిళా సభ ‘ వ్యస్థాపకులలో ఒకరు.


ఆరోజులలోనే, ఆంధ్రోద్యమంలో భాగంగా, సాంబమూర్తి గారు, మన తెలుగు న్యాయవాదులను, శాసనసభ్యులను ఇంగ్లీషుకు బదులుగా, తెలుగులోనే మాట్లాడమని ప్రోత్సహించేవారు.  ఉద్యమాల ద్వారా, తెలుగు మాట్లాడేవారి ఆత్మగౌరవాన్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉండేవారు.


ఇక సాంబమూర్తి గారి రాజకీయ ప్రస్థానం పరిశీలిస్తే, 1935 లో మద్రాసు ప్రోవిన్షియల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పుడు, సీ.రాజగోపాలాచారి గారు  ముఖ్యమంత్రిగా ప్రభుత్యాన్ని ఏర్పాటు చేశారు.  అప్పుడు, సాంబమూర్తిగారు 1937 నుంచి 1942 వరకూ స్పీకరుగా ఉన్నారు.   


కాంగ్రెసు మంత్రివర్గ పరిపాలనలో మద్రాసు రాష్ట్ర శాసనసభకు, వీరు సభాపతిగా విధులను సంప్రదాయాలకు అనుగుణంగా, మర్యాదగా, అద్వితీయంగా నిర్వహించి సభకు గౌరవ ప్రతిష్ఠలను సమకూర్చారు.


స్వాతంత్రం వచ్చేవరకు, భరతమాత ముద్దుబిడ్డడిగా సాంబమూర్తిగారు అనేక ఉద్యమాలు నిర్వహిస్తూనే వున్నారు.  అయితే,స్వతంత్రం వచ్చిన తరువాత, నాయకులంతా పదవుల కోసం పోట్లాడుకుంటుంటే, ఆయన పదవుల కోసం ఉత్సాహం చూపలేదు. సామాన్య కార్యకర్తగానే ఉండిపోయారు.


ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, పొట్టి శ్రీరాములుగారి నిరశనదీక్షకు ఏ నాయకుడూ మద్దత్తు ఇవ్వకపోతే, సాంబమూర్తిగారు తాను మైలాపూర్ లో ఉన్న తనవిశాలమైన, విలాసవంతమైన భవంతిలో వారికి ఆశ్రయం ఇచ్చి, అక్కడే దీక్ష కొనసాగేటట్లు చేసారు.  తరువాత, ఆభవనాన్ని మన ప్రభుత్వంవారు పడగొట్టి పొట్టి శ్రీరాములు సంస్మరణార్ధం గ్రంధాలయం స్థాపించి, ఒక్కరూపాయి కూడా,  సాంబమూర్తి గారికి పరిహారం ఇవ్వలేదు. .


ఇంత వైభవంగా జీవితం గడిపిన సాంబమూర్తి పంతులుగారు, తన సర్వస్వాన్ని దేశోద్ధరణకు సమర్చించి, తనను అనుసరించిన వారే తనను మోసం చేసినా, చివరిరోజులలో పేదరికంలో, అనారోగ్యంతో గడిపి 1958 వ సంవత్సరంలో పరమపదించారు. 


స్వతంత్ర భారతదేశంలో పదిసంవత్సరాలు సాంబమూర్తిగారు, ఒంటరిగా, పేదరికంలో మ్రగ్గి, అనారోగ్య పరిస్థితులలో మరణించారని తెలిస్తే, కన్నీరు ఆగదు, ఎవరికైనా.


ఆయన చనిపోయే సమయానికి విధవరాలైన అయన కుమార్తె మాత్రమే బ్రతికివున్నది. ఆమె స్వతంత్ర సమర యోధుల పింఛను కోసము దరఖాస్తు పెట్టుకుంటే, బులుసు సాంబమూర్తిగారు సమరయోధుడిగా, ఎక్కడా పేరు వ్రాయించుకోలేదనే నెపంతో  ఆమెకు పింఛను తిరస్కరించారు. అదీ మహర్షి సాంబమూర్తి గారి దేశభక్తి ఆంటే !


2008 లో భారత ప్రభుత్వం బులుసు సాంబమూర్తిగారి గౌరవార్థం ఒక తపాలాబిళ్లను విడుదల చేసింది.


ఆ మహర్షికి, ఆ మహానుభావుడికి, ఆ మనీషికి నివాళి. వారి జీవనసరళి ఎందరికో మార్గ దర్శకం.💥

జీకే GK... జగన్ గురించి తుపాకీ ఈ పత్రిక లో చదవండి మరి

https://www.tupaki.com/latest-news/jagangovermentachivementinexports-1330635
Ap లో ప్రభుత్వం చేసిన  దానికి కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ 
పైన క్లిక్ చేసి తుపాకీ  పత్రిక లో చదవండి 

శ్రీరంగం లో శుప్రభాత సేవ ఓం నమో నారాయణా య


 శ్రీరంగం లో స్వామివారి ప్రధమదర్శనముకై బ్రాహ్మి ముహూర్తం లో

గోవు,గజరాజు,శ్వేతాశ్వము దర్శించుకుంటాయి.వాటిని మనము

దర్శిద్దాము.. దీనినే విశ్వరూప దర్శనం అంటారు..🙏🕉🌹

భూలోక వైకుంఠం bhooloka vaikuntam కార్తీక పురాణములోH,,

 https://www.v6velugu.com/significance-of-srirangam-temple-do-you-knownకార్తీక పురాణం: భూలోక  వైకుంఠం ఎక్కడుందో తెలుసా.. https://www.v6velugu.com/significance-of-srirangam-temple-do-you-known

Gk జీకే ఈ లింక్ ని టచ్ చేసి వార్త చదవచ్చు జీకే

 https://www.tupaki.com/latest-news/jaganwasgivensecuritybycentralforces-1327854

Gk లోవిజయవాడ సిటీ ఇప్పుడు బాగుంది అంటారు నిజమేనా?


 హెడ్డింగ్ ఏమిటో పెట్టేస్తారు అది మనం పట్టించుకోకూడదు 

కానీ అస్సలు ఈ తరహా అభిప్రాయాలు  పార్టీలను నిలబెడ తాయా? 

Gk జీకే మనకు వాడు పెట్టిన హెడ్డింగ్ ని పట్టించుకోకూడదు

 

జగన్ అయినా బాబు అయినా సరే పచ్చని పండే భూములు అన్నం పెట్టే అన్న పూర్ణ ..వి నాశనం చేయడం తగదు ..హైదరాబాద్ లో పండే పంటలు పెద్దగా ఏమి లేవు ఇక్కడ కాంక్రీటు జంగిల్  పెరిగినా నష్టం ఏమి లేదు ..కానీ ఆంద్రప్రదేశ్ అట్లా కాదు కదా ...అన్ని రకాల పండ్లు, ధాన్యం అపరాలు అన్ని ఇస్తుంది కదా......

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిసుప్రభాతం ముఖ్యవిశేష0 సుప్రభాతం

 *తిరుమల…


                సుప్రభాత గానం.            

                  ➖➖➖✍️


దక్షిణభారతదేశం లోని లక్షలాది గృహాలలో, మరీ ముఖ్యంగా విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు వారిళ్ళలో దినచర్య నేటికీ సుప్రభాతగాన శ్రవణం తోనే ప్రారంభమవుతుంది. 


గృహాలలోనే కాకుండా తిరుమలతో సహా ప్రపంచం నలుమూలలా ఉన్న శ్రీవేంకటేశ్వరుని దేవాలయాల లోను, ఎన్నో హిందూ ధార్మిక సంస్థల్లోను, ప్రసార మాధ్యమాలలో కూడా ఉదయపు వేళల్లో సుప్రభాతగానం చేయబడుతుంది. 


కోట్లాదిమంది తెలుగువారు కంఠస్థంగా చెప్పగలిగిన ఆధ్యాత్మిక గీతమేదైనా ఉందంటే అది ముమ్మాటికీ ‘సుప్రభాతం' మాత్రమే. అంతటి ప్రఖ్యాతి గాంచిన సుప్రభాత గానాన్ని శ్రవణానందకరంగా విని, ఆనందించి, భక్తిపారవశ్యంలో మునిగిపోవడమే గానీ ఆ గీత రచయిత ఎవరు? అది ఏ సందర్భంలో, ఎలా రచింపబడింది? దానిలోని భావర్థమేమిటి? అన్న విషయాలు అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈనాటి ప్రకరణంలో ఆ విషయాలను ముచ్చటించుకుందాం…



*సుప్రభాతగానం ఆవిర్భావం:


అర్థసహస్రాబ్దానికి పైగా కోట్లాది భక్తజనులను తన ఆధ్యాత్మిక శోభతో, భావలాలిత్యంతో, వీనులవిందైన ఛందోబద్ధ శ్లోకాలతో పులకింపజేస్తున్న 'సుప్రభాతగానం' ప్రణాళికాబద్ధంగా, ఎంతోకాలం వెచ్చించి వ్రాసినది కాదు. భక్త్యావేశాన్ని తనువెల్లా రంగరించుకున్న ఒక భక్తాగ్రేసరుని  గుండె  లోతుల్లోంచి అసంకల్పితంగా, ఆశువుగా పొరలి వచ్చిన గానామృతమే 'సుప్రభాతం'.



 *మనవాళ మహాముని


దాదాపు ఆరు శతాబ్దాలక్రితం….    ‘మనవాళ మహాముని’ అనే శ్రీవారి మహాభక్తుడుండేవారు. విశిష్టాద్వైత సాంప్రదాయాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన మహామహులలో వీరు కూడా ఒకరు. శ్రీవారి భక్తితత్వ వ్యాప్తికి, హైందవమత సాంప్రదాయం వ్రేళ్ళూనుకోవడానికి ఆ మహనీయుడు సలిపిన విశేషకృషికి గుర్తుగా తిరుపతి పట్టణం నడిబొడ్డున ఉన్న గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో వారికో ఉపాలయాన్ని నిర్మించి, అందులో నేటికీ నిత్యపూజలు నిర్వహించబడుతున్నాయి.


ఆ ఋషిసత్తముడు, తన ఎనిమిది మంది ప్రముఖ శిష్యులలో ఒకరైన 'హస్తగిరినాథన్' వారితో ఒకసారి తిరుమలకు విచ్చేశారు.



 *హస్తగిరినాథన్:


హస్తగిరినాథన్ వారు ప్రఖ్యాత వైష్ణవమత ప్రచారకులు 'ముడుంబైనంబి' వారసులైన అనంతాచారి, ఆండాళ్ పుణ్యదంపతులకు; పధ్నాలుగవ శతాబ్దపు ద్వితీయార్థభాగంలో, కాంచీపురంలో జన్మించారు. ఆధ్యాత్మిక గ్రంథాలెన్నింటినో అలవోకగా పఠించిన హస్తగిరినాథన్ తన అసమానమైన కవితాకౌశలంతో, పాండితీప్రకర్షతో; ఆధ్యాత్మిక చర్చల్లో ప్రతివాదులకు పెనుసవాలుగా నిలిచారు. ఎందరో ఉద్దండ పండితులను తన వాక్ఫటిమతో ఓడించిన 'నరశింహ మిశ్రుడు' అనే అద్వైత పండితోత్తముడిని పరాజయం పాలు గావించి, వారిని తన శిష్యునిగా చేసుకొనడం వల్ల హస్తగిరినాథన్ 'ప్రతివాద భయంకర అణ్ణన్' గా ప్రఖ్యాతి గాంచారు. వారి వంశీయులు ఇప్పటికీ సంగీతసాధనలో తరించుతున్నట్లు కొందరి కథనం. 


తెలుగు చలనచిత్రసీమను ఒకానొక సమయంలో తన గానమాధుర్యంతో ఉర్రూతలూగించిన, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ”ప్రతివాద భయంకర శ్రీనివాస్ (పి. బి. శ్రీ నివాస్)” కూడా అదే వంశనామంతో ప్రఖ్యాతి గాంచడం కేవలం కాకతాళీయం కాకపోవచ్చు.



*ఆమోదముద్ర!


ఆనాడు, శ్రీవేంకటేశ్వరునికి ప్రత్యేకంగా సుప్రభాతం లేదు. ప్రాతఃకాల సమయాలలో ప్రబంధపఠనం మాత్రమే జరుగుతుండేది. ఒకనాటి ప్రాతఃసంధ్యలో గురుశిష్యులిద్దరూ (మణవాళ మహాముని, హస్తగిరినాథన్) స్వామివారి దివ్యమూర్తిని అలౌకిక ఆనందంతో కాంచుతున్నప్పుడు; గురువుగారు భగవత్సంకల్ప ప్రేరితుడై శ్రీనివాసుణ్ణి మేల్కొలుపుతూ ఒక ప్రత్యేక ప్రార్థనాగీతాన్ని ఆలపించ వలసిందిగా తన శిష్యుణ్ణి ఆదేశించారు. వెనువెంటనే ద్వాదశాళ్వారులలో ఒకరైన తొండరడిప్పొడి ఆళ్వార్ శ్రీరంగనాథునిపై రచించిన, అప్పటికే విస్తృతంగా ప్రచారంలో ఉన్న సుప్రభాతం శిష్యుని మదిలో మెదలగా, దానిలోని భావార్థాన్ని వారు స్మరణకు తెచ్చుకున్నారు. గురువు గారి ఆజ్ఞను మహాప్రసాదంగా, అందివచ్చిన అవకాశంగా భావించిన అణ్ణన్ స్వామి, *శ్రీరంగశాయి సుప్రభాత స్ఫూర్తితో 29 శ్లోకాలతో కూడిన శ్రీ వేంకటేశ సుప్రభాతాన్ని, 11 శ్లోకాలున్న శ్రీ వేంకటేశ స్తోత్రాన్ని, 16 శ్లోకాలు గల శ్రీ వేంకటేశ ప్రపత్తిని, 14 శ్లోకాలు గలిగిన శ్రీ వేంకటేశ మంగళాశాసనాన్ని ఇలా మొత్తం నాలుగు భాగాలను ఆశువుగా పఠించాడు.


అప్పటివరకు తమిళభాషలో ప్రబంధపారాయణం జరిగే తిరుమల ఆలయంలో అణ్ణన్ స్వామి సంస్కృతభాషలో రచించిన మేలుకొలుపు గీతాన్ని నిత్యం పఠించే…   'శ్రీ వేంకటేశ సుప్రభాతం' గా అంగీకరించే విషయంలో చర్చోపచర్చలు జరిగాయి. కానీ భావసౌందర్యం లోను, రాగయుక్తంగా పాడబడడం లోను, ఛందోబద్ధత లోను ఏ విధమైన లోటుపాట్లు కానరాకపోవడంతో; ఎట్టకేలకు 1430 వ సంవత్సరం, శ్రీవీరప్రతాపరాయల వారి పరిపాలనాకాలంలో అణ్ణన్ స్వామి రచించిన గీతం….

 'శ్రీ వేంకటేశ సుప్రభాతం' గా ముక్తకంఠంతో ఆమోదించబడింది. 


అంటే, నేటికి దాదాపు 590 సంవత్సరాల నుండి సుప్రభాతగానం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోందన్న మాట. తన అమోఘమైన ఆధ్యాత్మిక, సాహిత్య, కవితా, గాన పటిమతో అశేషంగా ఉన్న శ్రీవారి భక్తుల గుండెల్లో అజరామరమైన స్థానాన్ని సంపాదించుకున్న …

‘అణ్ణన్ స్వామి’ ధన్యజీవి.


సుప్రభాత అంతర్గతమైన ఒక్కొక్క విభాగంలో ఏముందో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం…



*శ్రీ వేంకటేశ సుప్రభాతం:


*'సుప్రభాతం’ అంటే… ‘మంగళకరమైన ఉదయపు వేళ’ అని అర్థం. 


వేంకటేశ సుప్రభాతం యొక్క ఇతివృత్తం ముఖ్యంగా శ్రీవారి మేలుకొలుపు గానమే అయినప్పటికీ అందులో వారి అపురూప సౌందర్యం, మంగళకరమైన గుణగణాలు, మహిమలు యొక్క సంక్షిప్త వర్ణన కూడా కానవస్తుంది. శ్రీవారు ముల్లోకాలకు రాజాధిరాజు. రాజులను, మహారాజులను సర్వలాంఛనాలతో మేలుకొలుపే సాంప్రదాయం అనాదిగా వస్తోంది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ శ్రీవారికి, సతీ సమేతంగా, రాజోచిత సత్కారాలతో పాడే మేలుకొలుపే సుప్రభాతగానం. 


ప్రభాత సమయంలో ప్రకృతి శోభ; స్వామివారి తొలిదర్శనానికై వేచియుండే బ్రహ్మాదిదేవతల, నవగ్రహాల మరియు సప్తఋషుల కోలాహలం; రామచిలుకలు, తేనెటీగల వంటి అల్పప్రాణులు సైతం విభిన్నరీతుల్లో శ్రీవారికి తెలియజేసే అభినందనలు; శ్రీమహావిష్ణువు దశావతారాలు మున్నగు అంశాలు కూడా సుప్రభాతంలో మనోహరంగా వర్ణించబడ్డాయి.



*శ్రీ వేంకటేశ స్తోత్రం:


'స్తోత్రం' అంటే స్తుతి లేదా పొగడ్త అని అర్థం. శ్రీ వేంకటేశ స్తోత్రంలో శ్రీవారి దశావతారాల మహిమలు; వారి విశ్వవ్యాపకత్వం, సార్వభౌమత్వం, ఆశ్రితజన పక్షపాతం; శ్రీరామచంద్రుని విలువిద్యా కౌశలం మున్నగునవి విస్తారంగా వర్ణించబడ్డాయి.



*శ్రీ వేంకటేశ ప్రపత్తి:


సాధారణంగా, భక్తి ప్రపత్తి అనే మాటలను ప్రత్యాయపదాలుగా ఉపయోగిస్తుంటాం. కానీ రెండింటికీ ఎంతో వ్యత్యాసముంది. భక్తిని 'మర్కటకిశోరన్యాయం' తో పోల్చవచ్చు. అంటే పిల్ల కోతి ఎల్లవేళలా తల్లి ఉదరాన్ని తన కాలి వ్రేళ్ళతో గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఏ క్షణంలో నైనా పట్టు తప్పితే కోతిపిల్ల ప్రమాదానికి లోనవుతుంది. కోతిపిల్లను భక్తుని తోనూ, తల్లికోతిని భగవంతునితోనూ పోల్చినప్పుడు, 'మర్కట కిశోర న్యాయం' లో భగవంతునిపై విశేషమైన భక్తిభావ మున్నప్పటికీ, వారిని ఎల్లవేళలా అంటిపెట్టుకుని ఉండే బాధ్యత మాత్రం భక్తునిదే.


కానీ 'ప్రపత్తి' విషయంలో అలా కాదు. ప్రపత్తిని 'మార్జాల కిశోర న్యాయం' తో పోల్చుతారు. తల్లిపిల్లి తన పిల్లను నోటితో కరుచుకుని ఒక చోటి నుండి మరో చోటికి క్షేమంగా చేర్చుతుంది. పిల్లిపిల్ల తన బాధ్యతను పూర్తిగా తల్లిపై వేసి, నిశ్చింతగా ఉంటుంది. అలాగే, భక్తుడు 'ప్రపత్తి' లేదా 'శరణాగతి' ని ఆశ్రయించినప్పుడు తన భారాన్నంతా దేవునిపై వేసి, ఐహిక చింతలకు దూరంగా ఉంటూ, భగవన్నామ స్మరణలో ప్రశాంతంగా గడప గలడన్న మాట.


సంక్షిప్తంగా చెప్పాలంటే 'భక్తి' అంటే భగవంతుణ్ణి ఆరాధించడం;

 'ప్రపత్తి' అంటే దేవుని శరణు వేడి భారాన్నంతా వానిపై వేసి నిశ్చింతగా ఉండటమన్న మాట. 

'భక్తి' కంటే 'ప్రపత్తి' ని ఉత్తమమైనదిగా భావించి….           ‘అణ్ణన్ స్వామి’ దానినే ఆశ్రయించారు.


శ్రీ వేంకటేశ ప్రపత్తిలో శ్రీనివాసుని పాదపద్మాలే ముల్లోకవాసులందరికి శరణ్యమని; వారి శరణువేడినవారికి మోక్షప్రాప్తి లభిస్తుందని; వారు ఈప్సితాలు ఈడేర్చే కల్పతరువని వర్ణించ బడింది. భక్తులకు శ్రీవారి పాదాలే శరణు కావున, వారి పాదారవిందాలను కూడా ప్రపత్తిలో ‘అణ్ణన్ స్వామి’ విస్తారంగా వర్ణించారు.



*శ్రీ వేంకటేశ మంగళాశాసనం:


'మంగళాశాసనం' అంటే'ఆశీర్వచనము'. 

శ్రీవేంకటేశ్వరుడు మానవమాత్రునిగా జన్మించి, అర్చారూపంలో వెలసియుండటం వల్ల వారు కూడా నరదృష్టికి అతీతులు కారు. కావున అతిలోక సౌందర్యంతో వర్థిల్లే వారి దివ్యమంగళ మూర్తికి దృష్టి (దిష్టి) సోకుతుందేమోననే బెంగతో, ‘అణ్ణన్ స్వామి’ శ్రీవారికి ఆశీర్వచనం పలికారు. 


వారి శుభచింతనను విని, గగనాన విహరించే తథాస్తు దేవతలు 'తథాస్తు' పలికి, శ్రీవారిని దుష్టశక్తుల నుండి కాపాడతారని అణ్ణన్ స్వాముల ఆకాంక్ష. 

అందువల్ల ముల్లోకాలను ఏలే, భక్తజనుల పాలిట కొంగుబంగారమైన శ్రీవేంకటేశ్వరుడు, శ్రీమహాలక్ష్మి కలకాలం వర్థిల్లాలనే ఆకాంక్షను 'మంగళాశాసనం' లో అణ్ణన్ స్వామి వెలిబుచ్చుతారు. 


'శ్రీ వేంకటేశ మంగళాశాసనం' 'వరవరముని' అనే మరో భక్తుని ద్వారా రచించబడినదని కొన్ని గ్రంథాల్లో పేర్కొనబడింది. కానీ, అత్యధికులు మాత్రం దీనిని కూడా అణ్ణన్ స్వామివారే వ్రాశారని విశ్వసిస్తారు.✍️

      🙏ఓం నమోవేంకటేశాయ🙏

అణ్ణన్ స్వామి అంటే ప్రతివాది భయంకర అణ్ణ0గ రాచార్యులు వారు అని కొందరు పెద్దలు చెబటం విశేషం ఓం నమో వెంకటేశాయ🙏

ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ 

          *సర్వ0

    శ్రీకృష్ణార్పణమస్తు*

                  

  లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

Gk లో పార్టీలు మారిన వారు చెప్పే ..జీకే


 
పార్టీలు మారే వారు కొందరు ...పార్టీ లోకి వచ్చే వారు కొందరు 

ఎవరి అభిప్రాయం వారిది..మనకు కొంత GK వస్తుంది గా 

👌🙏నీటితో కారు నడుపుతున్న ఓ శా స్త్రవేత్త సుందరం హైదరాబాద్ చూసేద్దామా 👌🙏


 ఇది వేద విజ్ఞానం అనియు ఇంకా నానో టెక్నాలజీ అనియు ఘంటాపథంగా చెప్పడం నిజంగా ఆ శాస్త్రవేత్త గారిని అభినందించాలి ..ఇక ఇది ఎంత నిజమో ఇప్పుడే ఎవ్వరు చెప్పలేక పోవచ్చు ... భవిష్యత్తులో అందరికీ సుందరం గారి  కృషి ఉపయోపడా లని .. ధ్వనికాలుష్యం...వాయు కాలుష్యము పోగొట్టి మంచి ప్రకృతి ని జీవ జంతుజాతులు కి

సమస్త మానవాళి కి మంచి చేయాలని కంకణం కట్టుకున్న సుందరం గారికి శతమానం భవతి 🙏

సంగీతం ..మహా గొప్పసంగీతం ఒక్కసారి వినండి


 అబ్బ ఎంత బాగుందో కదా stressfree tenshion free

మానసిక తద్వారా శారీరక ఆరోగ్యం తద్వారా ఆనందం ఇచ్చే 

గొప్ప మందు ...మంచి మెడిసిన్ .

G K. జీకే ఎన్నికలు సమీపిస్తుంటే రాజకీయ విన్యాసం GK


 

G K.జీ కే .ఎన్నికల వేళ ఇలా ఉంది రాజాకెయం


 

హైదరాబాద్ లో open plots కావాలా తక్కువ ధర లో


 Investment కి చాలా బాగుంటుంది మన బ్లాగ్ సభ్యులు కి ఇంకా తగ్గి 0పు రేట్ల కి ఇ స్తాను ...కాల్ చేయండి 

Gk... జీకే .ఇందులో పులివెందుల పై తీసిన .ఏరియల్ వ్యూ బాగుంది ..ఒకసారి చూద్దాం


 రాజకీయాలు లో ఒకర్ని ఒకరు తిట్టుకుంటూ వుంటారు అది నేటి రాజకీయాలు లో సహజమై పోయుంది 

జీ కే ...చట్ట సభల్లో నిజాలు.GK


  ఏమైనా...అస్సలు నిజంగా చట్ట సభల్లోనే ..అన్ని విషయాలు చెబుతున్నప్పుడు ..abn ఎందుకు జాగ్రత్త లు తీసుకోలేదు ...ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుందా మా...ఏమో మరి 

మిత్రులు ...పెద్దలు అందరికి దీపావళి శుభాకాంక్షలు


  అందరి కుటుంబాల లో అందరికి ఆయురారోగ్య ఐస్వర్యా ల . మంగళ విజయాది శుభాలు కలిగి వర్ధిల్లాలి అని ఆసిస్తూ  

                దీపావళి పండుగ శుభాకాంక్షలు  

🤲🙏వంద సంవత్సరాల వరకు నిండు ఆరోగ్యము కావాలంటే.... ఈ డాక్టర్ గారి అనుభవాలు విందాం🙏🤣


       

                               🙏ఓం శ్రీ ధన్వంతరీ నారాయణా భ్యా నమ: ఓం నమో వేంక టేశాయ 🌹

👌🙏ఎముకలు విరిగిన వారికి చూడండి వైద్యం.........🌹. స్ఫూర్తి 🙏🦴


 

GK .జీకే .. ఇది నిజమా ..


 ఇది నిజం అంటారా ..ఒకసారి మొత్తం విని ఆలోచిద్దాం 

ఏదో బుక్ వ్రాశాను ఈ వార్త పై అంటున్నాడు ..

ఎంత నిజం ఉంది ..పరిశీలిద్దాం 

G K gk ..అస్సలు మొత్తం విందాము


 

జీ కే ..G. K హెడ్డింగ్ వేరు ..అందులో ఉన్నది వేరు


ఏ పార్టీ అయినా మనకు వచ్చేది ఏమి లేదు కానీ 
క్రింది స్థాయు పెద్దగా చడవుకో ని వారు కూడా ఇంతలా
అన్ని విషయాలు చర్చించేస్తున్నారు ....ప్రజలు ఈ విషయాల్లో ఎంతగా ఎలా ఉంటున్నారో కదా 

Gk... జీ కే ..G K


 మొత్తం జాగ్రత్తగా వింటే ...ఏ పార్టీ అయినా మనకు ఒరిగేదేమీ లేదు ..కొద్దిసేపు ఫన్ 

క్రింది స్థాయు వారికి ..ఆ జనాలకు కూడా ఇంత జీ కే ఉందా అనిపిస్తుంది అన్నీ date లు పేర్లు చెప్పేస్తున్నారు 

జీ. కే . . G K ..రాజకీయం


 ఎవరైనా రాజకీయ క్రీడ చేస్తారు ...కానీ వైస్సార్ అప్పట్లో కాంగ్రెస్ కి జీవం పోశాడు ...ఈ ఎపిసోడ్ లో చివర్లో వైస్సార్ మాటలు బాగుంటాయి తప్పక వినాల్సినవి

🤤🤤ఈనాటి జీకే లో....... GK ...అమరావతి లో మాయలు ఏమిటో చూద్దాం 😄😁

                           🤠హెడ్డింగ్ కి దీనికి సంబంధమే లేదు పవన్ ల్యాండ్ అందులో వుంది అంతే😎

 


              😄😃   అంతా గందగోళంగా అనిపిస్తోంది కదా ..ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతూ వున్నారు అంతేగా😃

😃😄నేటి జీకే లో GK వుండవ ల్లి గారి కొన్ని అనుభవాలు ఆలోచనలు విందాం 🤣😆


 

ఎవరి ఇష్టం వారిది ...అందరి ఆలోచనలు అభిప్రాయాలు తెలుసుకోవడం లో తప్పులేదు కొద్దిసేపు different   గా                                                                         🙏😀😆😄😀😀😃🙏

😆🤣 G,k. ఉండవల్లి రాజకీయ విలాసం. కాసేపు చూద్దాం 😆😄


   ....

                😄  U ట్యూబ్ లో వచ్చేవాటిలో శీ ర్షికలు..హెడ్డింగ్ లు తేడాగా వుంటాయి ...దీనిలో వుండే విషయానికి 😆

                                                 😁     కంటెంట్ కి ఏమీ సంబంధం ఉండదు😃

ఇదంతా చిట్ ఫండ్స్ పై రగడ ...ok ఎవడు పడితే వాడు చిట్ ఫండ్స్ పెట్టి ..అధిక వడ్డీలు ఆశ చూపి నమ్మిన ప్రజలను 

పిచ్చోళ్లను చేసి కోట్లాది రూపాయలు దాచేసి పారిపోవడం ... ఇలా ఎంతకాలం దానిపైన పోరాటం చేస్తున్న ఉండవల్లి గారిని అభినందించాలి 🙏

😆 చంద్రబాబు అరెస్ట్ గురించి వర్మ ఇంటర్య్వూ ...GK... చూద్దాం😆మొత్తం జాగ్రత్తగా వినండి



 సారాంశం నేను ఎప్పుడూ అనుకుంటాను ......చంద్ర బాబు నీ నిండా ముంచేది వాళ్ళ చానల్స్ ..వాళ్ళ పత్రికలు అని 

అదే ఎల్లో మీడియా అంటారే వాళ్ళు 

అలానే వాళ్ళ లాయర్స్ కూడా చంద్ర బాబు నీ మభ్య పెడతున్నారు .... చoద్రబాబు తో కలిసి తిరిగిన నాయకుల అనవసర కేకలు ...అది కనిపెట్టాడు ఇది కనిపెట్టాడు అనే గొప్పలు ఐటీ జనాలు పోగేయడం ఇవన్నీ కూడా బాబు కి దెబ్బ అవుతున్నాయి ,.అందరూ కలిసి బాబు నీ ఇంకా లొపలికి వూబి  లోకి తొక్కేస్తున్నారు ..అది అయన కనిపెట్టాలి ...ఇదే విషయం జగన్ చాలా సార్లు చెప్పారు ..

మీరు ఏమంటారు  మీ అభిప్రాయం చెప్పండి😃😃😃😀😆😄

🌹🙏కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు హుండీ గురించి విశేషాలు 🌹🙏

https://telugu.news18.com/news/andhra-pradesh/tirupati-what-is-koppera-where-is-it-used-in-srivari-temple-gvj-tvk-tpt-2125934.html

ఈ లింక్ పై టచ్ చేయండి

                       🙏🌹🌹🌹  ఓం నమో వేంకటేశాయ..ఓం నమో నారాయణాయ 🌹🌹🌹🌹🙏

                               🙏🌹🌹    శ్రీమతే రామానుజా య యై నమ 🌹🌹🙏

😄😄😆 రాజకీయ క్రీడ లు. Gk ఒకసారి చూద్దాం 😄😀😄


                                      😄ఈ   రాజ కీయ క్రీడ లో ప్రజలు నల్గిపోతున్నారు అనిపిస్తోంది 😃

                                        😃ఎవరి వాదం ఎవరి అభిప్రాయం వారిది అన్నీ చూద్దాం 😃

                                                              😃అందరివీ విందాం పోయేది ఏముంది😆


🙏🙏🌹వినాయక వ్రతకల్పము vinayaka vratakalpa 🙏🙏🌹

 *🚩_శ్రీ వినాయక వ్రతకల్పం_🚩*శ్రీ గణేష్ మహారాజ్ కి జై    జయ జయ వినాయక శ్రీ సిద్దివినాయక జై జై 


🕉️🐁🕉️🐁🕉️🐁🕉️🐁🕉️🐁🕉️


*పూజకు కావలసినవి*


పసుపు , కుంకుమ , గంధం , అగరువత్తులు , కర్పూరం , తమల పాకులు , వక్కలు , పూలు , పూలదండలు , అరటిపండ్లు , కొబ్బరి కాయలు , బెల్లం లేదా పంచదార , పంచామృతాలు , తోరము , దీపారాధన కుందులు , నెయ్యిలేక నూనె , దీపారాధన వత్తులు. వినాయకుడి  ప్రతిమ , 21 రకాల ఆకులు , ఉండ్రాళ్ళు , పాయసం , భక్ష్యాలు.


వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించు కోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుని గది వుంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీటవేసి , దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని వుంచాలి. తెచ్చిన పూజా సామాగ్రిని కూడా అందుబాటులో వుంచుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పని సరిగా తయారు చేసుకోవాలి.


వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను వుంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. దానిలో కొన్ని అక్షతలు , పూలు వేసి దానిపై మామిడి ఆకులు వుంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్ధరిణ వుంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు, కుంకుమలు అవుతాయి కాబట్టి చేతికింద ఒక శుభ్రమైన గుడ్డను వుంచుకుంటే బాగుంటుంది.


*ఆచమనం*


ఓం కేశవాయ స్వాహాః

నారాయణాయ స్వాహాః

మాధవాయ స్వాహాః

(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)


గోవిందాయ నమః

విష్ణవే నమః

మధుసూదనాయ నమః

త్రివిక్రమాయ నమః

వామనాయ నమః

శ్రీధరాయ నమః

హృషీకేశాయ నమః

పద్మనాభాయ నమః

దామోదరాయ నమః

సంకర్షణాయ నమః

వాసుదేవాయ నమః

ప్రద్యుమ్నాయ నమః

అనిరుద్దాయ నమః

పురుషోత్తమాయ నమః

అధోక్షజాయ నమః

నారసింహాయ నమః

అచ్యుతాయ నమః

ఉపేంద్రాయ నమః

హరయే నమః

శ్రీ కృష్ణాయ నమః

శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః


*దైవ ప్రార్థన*


(గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను).


1. యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం


2. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థోజనార్థన:


3. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం


4. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.


తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై , సర్వ మంగళ నామధేయురాలవై , అన్ని అర్థములను సాధించి , శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే , ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ ! పార్వతీ , ఓ ! దుర్గాదేవీ, ఓ ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.


(ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను.)


ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శచీపురందరాభ్యాం నమః ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||


భూతోచ్చాటన: (క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.)


శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే


తా: భూతోచ్చాటన అంటే భూతపిశాచములను పారద్రోలుట. చేయబోవు కార్యమునకు అవరోధము కలిగించు భూతపిశాచములను అచటినుండి వెడలిపొమ్మని భావము.


ప్రాణాయామం (మూడు సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం)


ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహాః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |


ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||


||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||


*కారణము:* (గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి , ఓం భూ: నుండి భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను. దీనినే పూరకం , కుంభకం , రేచకం అంటారు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అంటారు. బ్రహ్మచారులు బొటన వ్రేలు , చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.)


అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః || (అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్ళు చల్లవలెను. సుద్ధి చేసినట్టుగా)


*ప్రాణాయామం*


*సంకల్పము:* (ఎప్పుడు , ఎక్కడ, ఎవరు , ఏమి కోరి , ఏ పనిచేస్తున్నారో స్పష్టముగా చెప్పుకొనుటను సంకల్పము అంటారు.) మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే , శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే , శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూ ద్వీపే, భరతవర్షే , భరతఖండే , మేరోర్ధక్షిణదిగ్భాగే , …….. నదీ సమీపే……… ( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే, …………… (దక్షిణాయనే), …….. (వర్ష) ఋతౌ, ……… (భాద్రపద) మాసే, ……… (శుక్ల) పక్షే,..….. (చతుర్థ్యాం) తిథి ………………. వాసరే , శుభ నక్షత్రే , శుభయోగే శుభకరణే , ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం , శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ……………… సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. (నీరు ముట్టుకొనవలెను)


భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజేఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం


*షోడశోపచారపూజ*


ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥


శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి


అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ


*ఆవాహయామి*


మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥


*ఆసనం సమర్పయామి*


గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥


*ఆర్ఘ్యం సమర్పయామి*


గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥


*పాద్యం సమర్పయామి*


అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥


*ఆచమనీయం సమర్పయామి.*


దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥


*మధుపర్కం సమర్పయామి.*


స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥


*పంచామృత స్నానం సమర్పయామి.*


గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥


*శుద్దోదక స్నానం సమర్పయామి.*


రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥


*వస్త్రయుగ్మం సమర్పయామి.*


రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥


*ఉపవీతం సమర్పయామి.*


చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥


*గంధాన్ సమర్పయామి.*


అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్ , గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥


*అక్షతాన్ సమర్పయామి.*


సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥


*పుష్పాణి పూజయామి.*


*అథాంగ పూజ*


*(పుష్పములతో పూజించవలెను)*


గణేశాయ నమః - పాదౌ పూజయామి ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి హేరంబాయ నమః - కటిం పూజయామి లంబోదరాయ నమః - ఉదరం పూజయామి గణనాథాయ నమః - నాభిం పూజయామి గణేశాయ నమః - హృదయం పూజయామి స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి


*ఏకవింశతి పత్రపూజ*


(21 విధముల పత్రములతో పూజింపవలెను)


సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామిగజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి , ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి , వికటాయ నమః - కరవీరపత్రం పూజయామిభిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి , వటవేనమః - దాడిమీపత్రం పూజయామి , సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి , ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి , హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి , సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి , ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి , సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి  శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.


*శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా*


ఓం గజాననాయ నమః


ఓం గణాధ్యక్షాయ నమః


ఓం విఘ్నరాజాయ నమః


ఓం వినాయకాయ నమః


ఓం ద్వైమాతురాయ నమః


ఓం ద్విముఖాయ నమః


ఓం ప్రముఖాయ నమః


ఓం సుముఖాయ నమః


ఓం కృతినే నమః


ఓం సుప్రదీప్తాయ నమః


ఓం సుఖనిధయే నమః


ఓం సురాధ్యక్షాయ నమః


ఓం సురారిఘ్నాయ నమః


ఓం మహాగణపతయే నమః


ఓం మాన్యాయ నమః


ఓం మహాకాలాయ నమః


ఓం మహాబలాయ నమః


ఓం హేరంబాయ నమః


ఓం లంబజఠరాయ నమః


ఓం హయగ్రీవాయ నమః


ఓం ప్రథమాయ నమః


ఓం ప్రాజ్ఞాయ నమః


ఓం ప్రమోదాయ నమః


ఓం మోదకప్రియాయ నమః


ఓం విఘ్నకర్త్రే నమః


ఓం విఘ్నహంత్రే నమః


ఓం విశ్వనేత్రే నమః


ఓం విరాట్పతయే నమః


ఓం శ్రీపతయే నమః


ఓం వాక్పతయే నమః


ఓం శృంగారిణే నమః


ఓం ఆశ్రితవత్సలాయ నమః


ఓం శివప్రియాయ నమః


ఓం శీఘ్రకారిణే నమః


ఓం శాశ్వతాయ నమః


ఓం బల్వాన్వితాయ నమః


ఓం బలోద్దతాయ నమః


ఓం భక్తనిధయే నమః


ఓం భావగమ్యాయ నమః


ఓం భావాత్మజాయ నమః


ఓం అగ్రగామినే నమః


ఓం మంత్రకృతే నమః


ఓం చామీకర ప్రభాయ నమః


ఓం సర్వాయ నమః


ఓం సర్వోపాస్యాయ నమః


ఓం సర్వకర్త్రే నమః


ఓం సర్వ నేత్రే నమః


ఓం నర్వసిద్దిప్రదాయ నమః


ఓం పంచహస్తాయ నమః


ఓం పార్వతీనందనాయ నమః


ఓం ప్రభవే నమః


ఓం కుమార గురవే నమః


ఓం కుంజరాసురభంజనాయ నమః


ఓం కాంతిమతే నమః


ఓం ధృతిమతే నమః


ఓం కామినే నమః


ఓం కపిత్థఫలప్రియాయ నమః


ఓం బ్రహ్మచారిణే నమః


ఓం బ్రహ్మరూపిణే నమః


ఓం మహోదరాయ నమః


ఓం మదోత్కటాయ నమః


ఓం మహావీరాయ నమః


ఓం మంత్రిణే నమః


ఓం మంగళసుస్వరాయ నమః


ఓం ప్రమదాయ నమః


ఓం జ్యాయసే నమః


ఓం యక్షికిన్నరసేవితాయ నమః


ఓం గంగాసుతాయ నమః


ఓం గణాధీశాయ నమః


ఓం గంభీరనినదాయ నమః


ఓం వటవే నమః


ఓం జ్యోతిషే నమః


ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః


ఓం అభీష్టవరదాయ నమః


ఓం మంగళప్రదాయ నమః


ఓం అవ్యక్త రూపాయ నమః


ఓం పురాణపురుషాయ నమః


ఓం పూష్ణే నమః


ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః 


ఓం అగ్రగణ్యాయ నమః


ఓం అగ్రపూజ్యాయ నమః


ఓం అపాకృతపరాక్రమాయ నమః


ఓం సత్యధర్మిణే నమః


ఓం సఖ్యై నమః


ఓం సారాయ నమః


ఓం సరసాంబునిధయే నమః


ఓం మహేశాయ నమః


ఓం విశదాంగాయ నమః


ఓం మణికింకిణీ మేఖలాయ నమః


ఓం సమస్తదేవతామూర్తయే నమః


ఓం సహిష్ణవే నమః


ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః


ఓం విష్ణువే నమః


ఓం విష్ణుప్రియాయ నమః


ఓం భక్తజీవితాయ నమః


ఓం ఐశ్వర్యకారణాయ నమః


ఓం సతతోత్థితాయ నమః


ఓం విష్వగ్దృశేనమః


ఓం విశ్వరక్షావిధానకృతే నమః


ఓం కళ్యాణగురవే నమః


ఓం ఉన్మత్తవేషాయ నమః


ఓం పరజయినే నమః


ఓం సమస్త జగదాధారాయ నమః


ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః


ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే


దశాంగం గుగ్గలోపేతం సుగంధం , సుమనోహరం , ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥


ధూపమాఘ్రాపయామి॥


సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా , గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే


దీపందర్శయామి


సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్ , నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్ ,


భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ , ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక ,


నైవేద్యం సమర్పయామి


సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక


సువర్ణపుష్పం సమర్పయామి.


పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం


తాంబూలం సమర్పయామి


ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ


నీరాజనం సమర్పయామి


అథ దూర్వాయుగ్మ పూజాసవరించు


గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి


ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి


*నమస్కారము , ప్రార్థన*


ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన ,


ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ,


అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన ,


పునరర్ఘ్యం సమర్పయామి ,


ఓం బ్రహ్మవినాయకాయ నమః


నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ,


ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్


వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ


నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.


*శ్రీ వినాయక వ్రత కథ*


*గణపతి జననము*


సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను. గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు తనను ఎవరూ వధించజాలని శక్తిని , శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు అతడు అజేయుడైనాడు.


భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది , జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది , విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించాడు గజముఖాసురుడు ఆనందంతో *"ఏమి కావలయునో కోరుకో"* అన్నాడు విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చాడు శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించాడు అయినా మాట తప్పుట కుదరదు కుక్షియందున్న శివుని ఉద్దేశించి *"ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు , నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది"* అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు శివుడు గజముఖాసురుని శిరమును , చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు


అక్కడ పార్వతి భర్త రాక గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది తనలో తాను ఉల్లసిస్తూ , స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసినది ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది.


శివుడు తిరిగి వచ్చాడు , వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించాడు. తన మందిరమున తనకే అటకాయింపా ! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు.


జరిగిన దానిని విని పార్వతి విలపించింది శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును , త్రిలోకపూజనీయతను కలిగించాడు గణేశుడు గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి.


*గణేశుడు అగ్రపూజనీయుడు*


ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి మాట ఏమిటి ? ఈ గజాననునికి ఆ స్థానము కలుగవలసి ఉంది శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాదు శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు గజాననుడుమిగిలిపోయినాడు  త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమర్థించాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు నారములు అనగా జలములు , జలమున్నియు నారాయణుని ఆధీనాలు అనగా ఆ మంత్ర ఆధీనములు , మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు వినాయకునికే ఆధిపత్యము లభించినది.


*చంద్రుని పరిహాసం*


గణేశుడు జ్ఞానస్వరూపి , అగ్రపూజనీయుడు , జగద్వంద్యుడూ। ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు।


(చంద్రుడుమనస్సుకు సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడనను సరణీయుడైనాడు। ఆతని మాన్యత నశించింది। నింద్యుడయినాడు। ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి। అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు అవుతారు। నిందలకు గురియగుతారు।


చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు ? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు ? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించాడు. బాధ్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించాడు.


ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడింది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడింది.


*శ్యమంతకోపాఖ్యానము*


*చంద్ర దర్శనం నీలాపనింద:*


ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించింది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారము నీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించాడు. అతనికి ఆ సూచన రుచించలేదు.


అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. అది ఆతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయింది.


నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు.


ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది.


అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించింది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము , భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉంది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది ఒక దినము కాదు , రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది.


అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించాడు.


అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అది శ్రీరామకార్యము గాదు కానఅప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని , ఆ మణీతో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు.


శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.


వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభచించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై బాధ్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సాంప్రదాయమయినది.


పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు... సింహ ప్రసేనమవధీత్‌ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః


సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడింది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడింది.


సర్వేజనాః సుఖినో భవంతు.


*విఘ్నేశ్వర చవితి పద్యములు*


*ప్రార్థన :*


తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.


తలచెదనే గణనాథునితలచెదనే విఘ్నపతిని దలచినపనిగాదలచెదనే హేరంబునిదలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌


అటుకులు కొబ్బరి పలుకులుచిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌నిటలాక్షు నగ్రసుతునకుబటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.


*వినాయక మంగళాచరణము*


ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు 

కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు - జయమంగళం నిత్య శుభమంగళం


వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి 

మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి - జయమంగళం నిత్య శుభమంగళం


శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు 

సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు - జయమంగళం నిత్య శుభమంగళం


ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు 

బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు - జయమంగళం నిత్య శుభమంగళం


చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను 

పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను - జయమంగళం నిత్య శుభమంగళం


తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌


మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌. కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌. 


మరొక పద్యం కూడా విద్యార్థులకు ఉచితమైనది.


తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయవయ్య నిని ప్రార్థన సేసెద నేకదంత నా వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా! 


ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్థనా శ్లోకము


సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి .

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌹 పిల్లనగ్రోవి అదే మురళి గానానికి ఎలా పరవశిస్తున్నాయో ఆ ఆవు దూడలు 🙏


                                          🙏🌹  ఓం నమో భగవతే వాసుదవాయ జయ జయ శ్రీ కృష్ణా 🙏🌹

🌹🌹 తిరుమల తిరుపతి స్వామి వారి సేవ లో శ్రీవాణి ట్రస్టు సాధించిన మంచి ఘనత 🙏🙏


 

                                🙏ఓం నమో వేoకటేశాయ ఓం నమో నారయణాయ గోవింద గోవింద 🙏

                     పురాతన పాడుబడ్డ దేవాలయము లని ఉద్ధరించి ప్రతీ నెల ఆలయాలలో ధూప దీప నైవేద్యాలు

       కు మళ్ళీ 5000 రూ లు ఇవ్వటం  ఒక  మంచి ఆలోచన ఒక మంచి పథకం 🙏🌹

ఇంతకీ శ్రీ వాణీ ట్రస్టు ఎందుకు ఏర్పాటు చేశారో ...ఎలా 0టి సౌకర్యాలు ఇస్తారో మీకు తెలిసే వుంటుంది 

🌹🌹🌹నూతన యజ్ఞోవీతమును ధరించే విధానం nootana yajnopa dharana 🙏🙏

                               🌹🌹🌹నూతనయజ్ఞోపవీత ధారణ విధానము 🙏🙏🙏🙏🙏

                    ఇదీhn 2వ సారి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ....పాతది కూడా వుంది అది కూడా చూసుకోవచ్చు

                    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

                       🌹ఓం నమో వేంకటేశాయ...ఓం నమో నారాయణాయ శివ కేశవమ్ మహా నారాయణ0🌹

                     


పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) దరించవలెను.

 

ప్రార్థన:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః |

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః ||



అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా |


యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: ||


పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!


(అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను)



ఆచమన విధానం:

ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,

1.   ఓం కేశవాయ స్వాహా,


2.   ఓం నారాయణాయ స్వాహా,


3.   ఓం మాధవాయ స్వాహా,


అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.


4.   ఓం గోవిందాయనమః,


5.   ఓం విష్ణవే నమః,


6.   ఓం మధుసూదనాయనమః,


7.   ఓం త్రివిక్రమాయనమః,


8.   ఓం వామనాయనమః,


9.   ఓం శ్రీధరాయనమః,


10.  ఓం హృషీకేశాయనమః,


11.  ఓం పద్మనాభాయనమః,


12.  ఓం దామోదరాయనమః,


13.  ఓం సంకర్షణాయనమః,


14.  ఓం వాసుదేవాయనమః,


15.  ఓం ప్రద్యుమ్నాయనమః,


16.  ఓం అనిరుద్ధాయనమః,


17.  ఓం పురుషోత్తమాయనమః,


18.  ఓం అధోక్షజాయనమః,


19.  ఓం నారసింహాయనమః,


20.  ఓం అత్యుతాయనమః,


21.  ఓం జనార్దనాయనమః,


22.  ఓం ఉపేంద్రాయనమః,


23.  ఓం హరయేనమః,


24.  ఓం శ్రీకృష్ణాయనమః.

అని నమస్కరించవలెను. అటు పిమ్మట:


.


భూతోచ్చాటన:


(చేతిలో ఉద్ధరిణి తో నీరు పోసుకుని యీ క్రింది మంత్రమును చదివిన పిమ్మట భూమిపై నీళ్ళు జల్లవలెను.)


ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః | దేవీ గాయత్రీచ్చందః ప్రాణాయామే వినియోగః


.


(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)


.


గృహస్తులు ఐదు వ్రేళ్లతో నాసికాగ్రమును పట్టుకొని మంత్రము చెప్పవలెను. బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక ఉంగరం వ్రేళ్లతో ఎడమ ముక్కును పట్టుకొని ఈ క్రింది మంత్రమును చెప్ప వలెను.


ఓం భూః, ఓం భువః, ఓగ్ మ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ | ఓం ఆపో జ్యోతి రసో2మృతం, బ్రహ్మ భూర్భువస్సువరోమ్||


.


తదుపరి సంకల్పం:


మమ ఉపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా కావేరీయోర్మధ్యే, స్వగృహే (లేదా శోభన గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే


.


(బ్రహ్మచారులు “ధర్మపత్నీ సమేతస్య” అని చెప్పనక్కర లేదు)


.


యజ్ఞోపవీతములు ఐదింటిని ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలముల వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి, యజ్ఞోపవీత ధారణా మంత్రము స్మరించి ఈ క్రింది విధముగా ధరించవలెను. కొందరు రెండు ముడులు కొందరు మూడు ధరిస్తారు 


.


యజ్ఞోపవీతమిత్తస్య మంత్రస్య పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా,


దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః ||


.


“ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం


ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్


ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం


యజ్ఞోపవీతం బలమస్తు తేజః ”


అని చెప్పి అని ధరించవలెను.


.


(మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.)


.


ద్వితీయోపవీత ధారణం:


తిరిగి ఆచమనం చేసి “మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.


.


తృతీయ యజ్ఞోపవీత ధారణం:


తిరిగి ఆచమనం చేసి “ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.


.


చతుర్ధ పంచమ యజ్నోపవీతములు ధరించుట:


తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ “ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను. మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.


.


తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి, “దశ గాయత్రి” (పదిమారులు కానీ నూట ఎనిమిది మారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు” అని నీటిని వదలవలెను. (బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును)


.


గాయత్రీ మంత్రము:


“ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం


భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ ”


.


తరువాత ఈ క్రింది విజర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.


.


జీర్ణోపవీత విసర్జనం:


తిరిగి ఆచమనం చేసి


.


శ్లో: ఉపవీతం ఛిన్నతంతుం కశ్మల దూషితం


విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే ||


.


శ్లో: పవిత్రదంతా మతి జీర్ణవంతం


వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం


ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం


జీర్నోపవీతం విసృజంతు తేజః ||


.


శ్లో: ఏతా వద్దిన పర్యంతం


బ్రహ్మత్వం ధారితం మయా


జీర్ణత్వాత్తే పరిత్యాగో


గచ్ఛ సూత్ర యథా సుఖం ||


.


విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను.


తిరిగి ఆచమనం చేసి కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపింఛి యధాశక్తి “గాయత్రీ దేవతార్పణమస్తు” అని నీరు విడువ వలెను. ఆ తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను.


.


తీసివేసిన పాత జందెమును ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను.


.


నూతన యజ్ఞోపవీత ధారణ సమయములు:


జాతాశౌచ శుద్ధి యందు, మృతాశౌచ శుద్ధియందు, గ్రహణానంతరము, ప్రతి నాలుగు మాసముల అనంతరము నూతన యజ్ఞోపవీతమును ధరించి, పూర్వ యజ్ఞోపవీతమును త్యజించవలెను.  యజ్ఞోపవీత మహిమ https://youtu.be/f2xtCih_cjc?feature=shared


వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. 


దీనినే తెలుగులో ‘జ్యంద్యం’ అంటాం. 


ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు. 


ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతోనూ, కొందరు ఆచారం మీద మక్కువతోనూ, కొందరు ఇతరుల ముందు ప్రదర్శన కోసం, మరికొందరు అవసరార్థం ఉపయోగించేవారుగా కనపడతారు. 


యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. 


దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.


’సూచనాత్ బ్రహ్మతత్త్వస్య 


   వేదతత్త్వస్య సూచనాత్


తత్సూత్రముపవీతత్వాత్ 


బ్రహ్మసూత్రమితి స్మృతమ్’!!


బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.  


యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. 

అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని


 ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’


 అనే మంత్రం చెబుతోంది.  


యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి. 


ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం - 


‘ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ 

వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ 

ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ

తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా 

పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః

సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ 

సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః’!!


మొదటి తంతువులో ఓంకారం,

 రెండవ తంతువులో అగ్నిదేవుడు, 

మూడవ తంతులో నాగదేవత, 

నాలుగవ తంతువులో సోమదేవుత, 

ఐదవ తంతువులో పితృదేవతలు, 

ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, 

ఏడవ తంతువులో వాయుదేవుడు, 

ఎనిమిదవ తంతువులో సూర్యుడు, 

తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం. 


‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది. 


’తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్

కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’


ఈ శ్లోకంలో తాత్పర్యం ఇది. 


తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. 

అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం.


 ‘యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది. 


’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ

తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్’


నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. 


అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. 


గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం. 


యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది. 


’పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్

తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్

ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్

యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’!!


అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. 

దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.


బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.


యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. 


యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. 


ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి. యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు. 


ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి. 


ఇదే యజ్ఞోపవీత మహిమ!


ఓం తత్సత్......

సర్వేజనా సుఖినోభవంతూ.......


ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ 

ఈ క్రింద ఇచ్చిన లింక్ మెయిల్ id పై క్లిక్ చేసి టిటిడి పై ఒక గొప్ప వ్యాసం జీ కే చదవండి

 https://telugu.greatandhra.com/politics/opinion/silly-aligations-to-ttd-138666.html

                                                 TTD పై కొన్ని విషయాలు 

పాలు... మనం లొపలికి పాలు తాగు తు న్నామా.....లేక విషమా ఒకసారి చూడండి


 

                పాపం లక్షలు పోసి చదువుకున్న డాక్టర్ లకు ఆదాయం ఎలా వస్తుంది ....ఇలానే కదా మరి

🙏🌹 శ్రీ వేంటేశ్వరస్వామి వారి గురించి వినండి మిస్ కావద్దు...తప్పక వినండి 🌹🙏


        

                                                     🌹🌹  శ్రీమతే రామానుజాయై నమ🙏🙏


                    🌹🌹🌹🌹🌹      ఓం నమో వేంకటేశాయ ఓం నమో నాాయణాయ జై శివ నారాయణ🙏🙏🙏

                                                   🙏🙏🙏🙏   జయ జయ శ్రీరామ జయ జయ సాయురామ 🌹🌹🌹🌹

🌹🙏మంగళ గౌరీ వ్రతం...ఈ శ్రావణమాసంలో వినినా ... చూసినా మీరు కోరుకొనే మంచి జరుగుతుంది 🙏🌹


 

                            🌹🌹🌹నమ: పార్వతీ పతయే హర హర మహాదేవ ..ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

🏹🏹ముచ్చట పత్రిక లో వచ్చిన వ్యాసానికి ఖoడన 🏹🏹

ఇదీ గొప్ప గా నిర్ణయం ఎవ్వరూ తెలుసుకోలేరు అంటూ ఎగతాళి 

                     🌹తిరుమల లో భక్త జనులకు చేతి కర్ర లు🙏
మీ ముచ్చట పత్రిక లో ...ఒక వ్యాసం వచ్చింది ... టిటిడి వారు కర్రలు గురించి విమర్శ వ్రాశారు .. బాగుంది కానీ అక్కడ పరిస్థితులు అన్నీ రీ సర్చి చేసి వ్రాయాలి
ఏదో పేలవంగా .. విమర్శించాము కదా అని అనందపడిపోకూడదు. మీ సూచనలు కూడా చెప్పాలి మేధావులు అంతా ఆలోచించి అక్కడ ఏమి చేయలేని పరిస్తితి దానికి అనేక కారణాలు ఉన్నాయి అడవి మధ్య లో మెట్ల మార్గం వద్ద జంతువులు రాకుండా నిలువరించడానికి  కంచే లేక పెన్సింగ్ వేసే వీలు లేదు.అడవి మధ్యలో వేస్తే.వాటికి ఇబ్బంది అవుతుంది.. ఇక భక్త జనుల ను వారి మొక్కులను ఆపలేరు కదా.  వెంటనే తరుణోపాయం  ఒకటి చేశారు దీనిలోవెక్కిరింతలు
విమర్సలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు చెరువు కట్ట తెగిపోతుంది అప్పుడు వెంటనే ఇసు
క బస్తాలు అడ్డం వేసి ముందు జాగ్రత్తగా ఏదైనా చేయాలని ప్రయత్నం చేసి చూస్తారు తరువాత ఆనకట్ట కరకట్ట పనులు గురించి ఆలోచిస్తారు కదా ఇక ఇక్కడ జనాలకు .తుపాకులు ..కత్తులు ఇవ్వకూడదు కదా .ఏదో ఒక గట్టి కర్ర చేతిలో ఉంటుంది .దానిని తీసుకొని జనాలు గుంపులు గుంపులు గా పోతుంటే ఆ శబ్దం.. ఆ కర్రలు కనపడటం...కొద్దిగా ఏ జంతువైన
ఏ కుక్క అయినా పిచ్చిమనిషి సైతం పెద్ద కర్ర చూస్తే భయపడ తాయు ..కనీసం కొద్దిగా పక్కకు అయినా పారిపోతాయి ...ఎన్నిచొట్ల కోతులను  కుక్కల ను మనం కర్రలతో దడిపించటం లేదు  .పూర్వ కాలం లోభారతీయుడు అన్నా గ్రామీణo లో అయునా తలకు చూట్టూ తలపాగా చెప్పులు వేసుకొని చేతిలో గట్టి కర్ర రక్షణగా పెట్టుకొని అడవిలో నడిచి పోతూవుండే  వారు ..కాబట్టి అది ఒక ఆయుధO అ నాలి .. ఇప్పుడు అడవులు ఎక్కడ వున్నాయి ... ఆ గ్రామీణ వ్యవసాయం అంత పాత వూళ్లు ఎక్కడ .. ఆ ముతక మనుషులు ఎక్కడ వుండనిచ్చాము.. అంతా కాంక్రీట్ జంగిల్ ...నదులు చెరువులు పూడ్చేసి.రియల్ ఎస్టేట్ పెంచడం ..కాబట్టి పాత పద్దతులు ఆ కట్టు బట్టలు ఆ కర్ర లు బుర్రలు అర్థం కాదు .. అయినా  స్వామివారు తో పెట్టుకోవటం అని వ్రాశారు ..ఎక్కడో గుడిలో స్వామికి ఎందుకు కోపం  ఇటు జనుల ప్రాణాలు అటు జంతువుల ప్రాణాలు రెండూ భగవత్ సంబంధమే అని సమానంగా చూసి ఇద్దరూ క్షేమంగా ఉండాలని కోరుకోవడం స్వామివారికి రుచించ దా ఏమి చెప్పండి ..ఏది చేసినా ఏది చూసిన దిక్కుమాలిన రాజకీయాలకు ఆపాదించి ఆ కోణం లో చూడటం మానేసి ఎవ్వడు చేసినా దానిలో ఒక్కింత మేలు ఏమైనా జరుగుతుందా దానికి మన వైపు నుంచి ఏదైనా సూచన సలహా ..లేక సేవ ఏమైనవుందాఅనేది ఆలోచిస్తే సమాజానికి హితం ..అంతేకాని వెక్కిరింతలు వల్ల ఏమి ఒరగదు ...పెట్టే కుళ్ళు జోకుల బొమ్మల వల్ల సమయం వృధా ...చదువుకున్న వారం ఎదిగి పైకి ఎదిగి ఆ లోచంచాలి దిగిపోయి కాదు సుమా సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ మరింగంటిమురళీ కృష్ణ..ఓం నమో వేంకటేశాయ 🙏🌹

🙏🌹ప్రపంచం లోనే పెద్ద దేవాలయాలు ఒకసారి చూద్దాం రండి🙏🌹


 

Gk ఆంధ్రా లో రాబోయే ఎన్నికలు కోసం మాటల కుస్తీ లు Gk

 



                                                                  రాజకీయ కోణం 

🙏 G,k .. రాజకీయం లో పదనిసలు😄😃🤣


 

    🙏   పెట్టిన హెడ్డింగ్ ...కి ఇందులో వున్న కంటెంట్ కి అస్సలు పోలిక లేదు అనుకోండి అయినా తలపండిన నాయకులు ఎం చెబుతున్నారో అది ఒక్ GK 🙏🙏🙏

🌹🙏🙏 సృష్టి రహస్యాలు ఒకసారి పరిశీలించి చూద్దాం🌹🌹🙏


 

                                   🙏🌹జై శ్రీమన్నారాయణ..జై జైశివ నారాయణ జైజై సద్ గురు సాయి నారాయణ 🙏🌹

🌹🙏పింగళి వెంకయ్య గారునిజంగా భారత రత్నమే 🙏🙏🙏🙏🌹








చాలా చక్కగా వివరించి వ్రాశారు ..ధన్యవాదాలు ...వారు ఒక్కరు కాదు ఇద్దరు ఖచ్చిత0 గా జై జవాన్ జై కిసాన్ ఇద్దరు వున్నారు ఆ రెండు మార్గాలలో భారత మాతకు సంపూర్ణ 0 గా సేవలు అందించి జీవితాన్ని అంకితం చేసిన భరత మాత ముద్దు బిడ్డ భారతరత్నం--డాక్టర్ మరిగంటిమురళీ కృష్ణ 🙏🙏🌹💐

🙏 నిజ శ్రావణ మాస తేదీలు🙏

                                         నిజ శ్రావణ మాస తేదీలు


నిజ శ్రావణ మాసం 17 ఆగస్టు 2023 గురువారం నుంచి 15 సెప్టెంబరు 2023 వరకు ఉంటుందని  సోమవార శివారాధన, మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మీ పూజలు, నాగ పంచమి, పుత్రద ఏకాదశి, జంద్యాల పూర్ణిమ (శ్రావణ పూర్ణిమ) వంటి పండగలన్నీ కూడా నిజ శ్రావణ మాసంలో 17 ఆగస్టు 2023 నుంచి 15 సెప్టెంబరు 2023 మధ్య జరుపుకోవడం చాలా వుత్తమం

                       🙏ఓం నమో  వేంకటేశాయ.   .... సద్గురు సాయనాథ్ మహారాజ్ కీ జై🌹

Gk..రాజకీయయుద్దాలు గ్రూపులు ఒకరిపై ఒకరు చేస్తున్న ఆరోపణలు


 

               మొత్తం చూస్తే ఎన్ని కోణాల్లో ఎలా రాజకీయాలు తిరుగుతున్నాయి అనిఒక జీకే 

🙏🌹మా తండ్రి గారు .. స్వాతంత్ర్య సమర యోధులు శ్రీమాన్ మరింగంటి భట్ట రా చార్యుల వారి వర్థoతి సంద ర్భంగా నివాళి🙏🌹




                                          🌹🙏 భారత్ మాతాకి జై ....జై జై తెలుగు తల్లి🌹🙏

🙏ముచ్చట అనే ఈ పేపర్ ని....క్రింద ఇచ్చిన id తో ఓపెన్ చేసి చదవండి 🙏


ముచ్చట అనే వెబ్ న్యూస్ పేపర్ లో కొన్ని మంచి చిత్రాలు తీసిన దర్శకుడు గురించి తెలుసుకుందాము 

                                🙏  ఈరంకి శర్మ       ... చిలకమ్మ చెప్పింది 🙏



             https://muchata.com/this-is-about-telugu-director-eeranki-sharma/






🌹🙏Ramanujacharyavisistadwitampart 24 ...రామనుజాచార్యులవారి విశిష్టాద్వైతం పార్ట్24🌷🙏


 

                                              🌹 ఓం నమో నారాయణాయ ...ఓం నమో వేంకటేశాయ🌹

                                                             🌹   శ్రీమతే రామానుజాయై నమ:🌹

                                                              🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


                                                          

🙏😀కొంతమంది అభిప్రాయం వాట్సప్ లో ఇలా....🙏😀

              🙏కొంతమంది జనాల ఇలా కూడా ఆలోచిస్తున్నారా ..అనిపిస్తోంది 🙏

తిరుమల తిరుపతి దేవస్థానం ..శ్రీ వేంకటేశ్వరుని ది ...పూర్వకాలంలో ఎంతోమంది శ్రీ వైష్ణవ జనాలు. ..మా మతం ఒకటి ఉంది వినండి అని చెప్పే ప్రయత్నం కూడా చేయనిచ్చే వాళ్ళు కారు కొందరు ...అయినా ఎన్నో తరాలు  ఎంతోమంది వైష్ణవ భక్త శిఖా మణులు ..వాళ్ళని వాళ్ళు అర్పించుకొంటే కానీ అప్పుడు నేను వాళ్ళ ప్రతినిధిని అంటూ ఎన్నో యు గాలనుంచి అక్కడే ఉన్న దైవం.. నేను ఆ సంప్రదాయం ని సమ్మతిస్తూన్నాను అని నిలబడ్డ స్వామి శ్రీనివాసుడు శ్రీ వేంకటేశ్వరుడు ..ఆ భక్త జనులు  మౌనవిప్లవ0 కి ...చాలా కాలానికి వాళ్ళు  ..శివ కేశువులకు భేదం లేదని విష్ణువు  ని ..దగ్గర కు చే ర్చుకున్నారు  .(.వైష్ణవు లపై హింస ఎలా జరిగిందో కమల్ సినిమా దశా వతారం లో నీళ్ళ లో పారేస్తారు ఒక ఆళ్వారుని కట్టేసి .)..ఇప్పటికి పురాణం చెప్పే కొందరు వాళ్ళ రీతిలో వైష్ణవ జనాలను విమర్శిస్తూ నే వున్నారు ...అటువంటి వారిలో ఒకరిని టిటిడి లో నియమించారు ..వారి పాత వీడియో లు చూడండి ..శ్రీ మహా విష్ణువు అందంగా లేదని నల్లగా ఉంటాడని ..శివుడు అందగాడని తెల్లగా ఉంటాడని  శివుడు అందం చూసి విష్ణువు తన కమలా ల వంటి కన్నులు పీకి ఆ శివుడి పాదాల పై పెట్టి వెళ్ళిపోయా డని  చాలా సార్లు చిదంబరం గురించి చెప్పిన పురాణములో ..సందర్భం లేకపోయినా మరీ చిలువలు పలువలతో నొక్కి చెప్పారు ..విష్ణువు గొప్పతనం వచ్చి నప్పుడు  కూడా మనస్సు పూర్తిగా ఒప్పుకొనెడి వారు కాదు డొ0క తిరుగుడు గా చెప్పేవారు  ..పెద్ద జీయర్ స్వామివారి గురించి కానీ ..రామానుజులవారిగురించి కానీ ఎక్కడైనా ఒక్క మాట చెప్పిన విషయం ఉందా   .ఇక కంచి పరమాచార్యులు వారి గురించి రోజూ చెబుతూనే వుంటారు ..ఓకే ..మహానుభావులు అందరి గురించి చెప్పడం మాకు ఆనందమే ... అక్కడ ఏ అధికారిని ఏ రూపేణా ప్రభుత్వం నియమించి నా ఆ అళ్వార్ ల రచించిన వాజ్ఞ మయం ఆ సాహిత్యం లో నిష్ణాతులైన వారు ఉండాలి 

అవి అన్ని ఏమి ఆలోచించ కుండా ప్రతి వాళ్ళను తెచ్చి అక్కడ వేసేస్తూ వుంటారు 

దీనిని ఏం అనాలి .....మిడి మిడి జ్ఞానం తెలిసిన నేటి యవతరం ..కంపూటర్ వ్యుద్యోగులు  ఇదేదో గొప్ప మహత్తు అని భుజాలు జర్చుకోవడానికి చాలా బాగుంటుంది ...కాకపోతే క్రిస్టియన్  పెట్టలేదు సంతోషం అని ఆనంద పడటం తప్ప ఇతర గొప్పతనాలు చెప్పే అంత మహత్తులు ఆయన ను నియమించు టలో ఏమి లేదు ......అలా అంటున్నారు జనులు 🙏

                            (వాట్సప్ లో చాగంటి గారి పై చక్కర్లు కొడుతొంది ఇలా )



🌹🙏రామనుజాచార్యులవారి విశిష్టాద్వైతం23 వ .Ramanujacharya visistadwaita part23 🙏🌹


 

                                              🙏ఓం నమో నారాయణా య..ఓం నమో వేంకటేశాయ🙏

                                                           :🌹🙏శ్రీమతే రామానుజాయై నమ:🌹🙏

🙏🙏కళా తపస్వి విశ్వనాథ్ గారికి 🙏🙏...🌹..నివాళి🌹

 🙏💐కళా తపస్వి విశ్వనాధ్ గారికి 🙏💐     🙏నివాళి🙏

(ఒక సామాన్యుడిగా నా అనుభవాలు మిత్రులతో పంచుకోవాలని )

నేను ....నా మిత్రుడు ఎన్ రవి ..చదువు కొనసాగిస్తూనే కధలు వ్రాస్తుండే వాళ్ళం డిగ్రీ తరువాత హైదరాబాద్ చేరుకున్నాం ఉస్మానియా విశ్వవిద్యాలయం లో సీటుకొట్టాం ..అప్పుడు బాగా కుర్ర కుంకలం ..సినిమా రంగం లో దర్శకుల0 కావాలని కలలు కంటూ ...ముందుగా శిష్యరికం కోసం ..ఆ రోజుల్లో ప్రతీ దర్శకుడి ని కలుస్తూ ఉండేవాళ్ళం ..ఈ లోపు మాకు  అర్ధం అయుంది ..అంత తేలిక కాదని .....ఇంట్లో వాళ్ళు కూడా తిట్టిపోశారు..ఇక మార్గంతప్పించి  ..అలా టీచరు .. .యం డి ఓ ..వ్యుదోగాల కోసం కష్టపడి చదివి  వ్రాశా ము ..మిత్రుడు సెలెక్ట్  అయి వెళ్ళిపోయాడు ..నేను మాత్రం పీహెచ్. డి  పరిశోధనలో దిగాను ..మళ్ళీ అంకురం వుమా మహేశ్వర రావు ..దాసరి నారాయణరావు ..కృష్ణ వంశీ ...మధ్య మధ్య మణిరత్నం హైదరాబాద్ వచ్చినప్పుడు అలా కొంచెము టైమ్ వెచ్చించి శిష్య్ రకం కోసం తిరుగుతూ ఉండేవాడిని    ఒకసారి జయప్రద గారి తో ఇంటర్వ్యూ తీసుకుందామని హాలిడే ఇన్ కృష్ణ గ్రాండ్ హోటల్ రేడియో తరుపున వెళ్ళాను .అక్కడ ఆమె భర్త నహతా గారు  నన్ను కూర్చో బెట్టారు ఇంతలో  విశ్వనాథ్ గారు అక్కడకు వచ్చారు కొద్దిసేపు.మళ్ళీ నేను మొ ర పెట్టుకున్నాను .ఈసారి చూస్తాను లే అన్నారు...అని ..చెన్నై వెళ్లిపోయారు  ....ఆ పక్క రూ0 లోనే రాజశేఖర్ గారిని జీవిత లను కోలుకోవడం జరిగింది ...అలా అలా  వేటూరి సుందరామ్మూర్తి గారు ..అంకురం ఉమా మహేశ్వరరావు గారితో హైదరాబాద్ గోల్కొండ హోటల్ లో బాగా గడుపుతూ ఉండేవాడిని వేటూరి గారు కాఫీ కలుపుకొని నాకు కూడా ఒక  కప్పు ఇచ్చేవారు ..చాలా విషయాలు మాట్లాడుకునే వాళ్ళం ..మళ్ళీ నేను రేడియో లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుండే వాడ్ని ..ఇంకో పక్క పత్రికల్లో జర్నలిస్ట్ మళ్ళీ ఇలా బిజీ ..బిజీ ఇక విశ్వనాథ్ గారిని పట్టుకొని ఆయన శిష్యరికం చేయాలని మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించాను ..కష్టపడి ఎన్ని సార్లు కలిసినా ఇప్పుడు కాదు...అనేవారు ..ఒకసారి శుభ సంకల్ప0 సినిమా వంద రోజుల ఉత్సవం హైదరాబాద్  లో రవీంద్రభారతి లో నిర్వహించ టానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ..అప్పుడు సీఎం ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతి ..కమల్ ..బాలు ..శ్రీరామ్ ఫోటో గ్రఫి ఇంకా వేటూరి ..సోమయాజులు ఇంకా నాన్న గారు భట్టరాచార్యులు  వారిని ఇలా ప్లాన్ చేసి అందరిని గ్రీన్ పార్క్ హోటల్ కి పిలిపించారు ...సత్తుపల్లి నుంచి నాన్నగారు బయలు దేరి వచ్చారు ..నాన్న గారు ..కమల్ హస్సన్ కి ఒకే రూమ్ బుక్ చేశారు పక్క రూమ్ లో విశ్వనాథ్ గారు ..బాలు గారు శుభలేఖ సుధాకర్  శైలజ  గారు (ఇంకా అప్పట్లో వాళ్ళ చిన్న పిల్లల్ని ఎత్తుకొని తిప్పాను ఆ రోజు ) ..ఇలా బుక్ చేసుకున్నారు.... కమల్ గారు బాగా లేటుగా వచ్చారట ..ఉదయం ఇక హడావిడి ..అయినా కమల్ నాన్నగారు చాలాసేపు మాట్లాడుకున్నారు  నాన్నగారి వద్ద భద్రాచలం స్వామి వారి ప్రసాదం ఉంది  కమల్ కి ఇచ్చారు ..అది తీసుకొని కమల్ ..నాన్నగారికి పాదాభి వందనం చేశారు  నేను కమల్ కి పాదాభివందనం చేశాను ....అప్పుడు చెన్నై అడ్రెస్ లు ఫోన్ నెంబర్ లు వ్రాసి ఇచ్చారు ..నాన్నగారి ని తీసుకొని ఒక సారి చెన్నై రావాల్సిందిగా గట్టిగా చెప్పారు ...అక్కడ హొటల్ ..బయట అందరూ ..హాలు లో కూర్చుని వున్నారు ...అప్పుడు విశ్వనాథ్ గారిని మళ్ళీ కలిశాను ....బాబూ చూడు ఇది కత్తి మీద సాము ..నువ్వు చదువు అంటే నీ రీసెర్చి పూర్తి చేసుకొని అప్పుడు అడుగు పెట్టు   .అప్పుడు ..ముందు నా దగ్గర స్క్రిప్ట్ అసిస్టెంట్  గా ప్రారంభం చేద్దువు గానీ అంతే కాని రెండు పడవల మీద డాన్స్ వద్దు ..అయినా ముందు చదువు పూర్తి చేయు ..అదిమన జీవితానికి రక్ష ని ఇస్తుంది ..ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో ....అని గంభీరంగా చెప్పారు ....నాకు కొంచెము కోపం బాధ కలిగాయి ..ఇక ఆ తరువాత సభా కార్యక్రమ0 ..అందరూ పాల్గున్నారు .ఆ ఫోటో లు చాలా ఉండేవి సత్తుపల్లి లో చెదలు పట్టి పాడై పోయాయు .ఇక ఆ తరువాత జీవన యాన0 ..ఇంట్లో తిట్లు ..పరిస్థితులు అలా అలా  పీ హెచ్ డి పూర్తి అవ్వడం..కాల0 కదిలిపోయుంది ..మా వైఫ్ వాళ్లకు దగ్గర బంధువు విశ్వనాథ్ గారు అని తెల్సింది ..నియోగి బ్రాహ్మణులు అందులోనూ లింగ ధా రులు అంటే శివ లింగం మెడలో లేక జంధ్యానికి కట్టుకుంటారు ..చంద్రమోహన్ ..బాలు ...చాగంటి వీళ్ళంతా  ఒకటే నియోగి బ్రాహ్మణు లే కానీ లింగ ధా రుల శాఖ వారు ..వారి ఆచారాలు వేరుగా ఉంటాయి ..కొంత కాలం క్రితం వారిని మళ్ళీ కలుద్దాం అని ప్రయత్నం చేశాను ..సాగర సంగమం డ్యాన్స్ కొద్దీ స్టెప్పులు అయినా వేసి పాద నమస్కారం చేద్దామని అనుకొని ..ప్రయత్నం చేశాను ..ఓపిక లేదండి తరువాత చూద్దాం అంటూ దాట వేశారు అలా అది కలగానే అయిపోయింది.  సాగర సంగమం ఒక యోగం ..కదా....వారి జ్ఞాపకాలను మనన0 చేసుకొని ఆ కళా తపస్వి ..ఆ మహర్షి ఆ యశస్వి కి  శిరస్సు వంచి చేతులు జోడించి ..సాష్టాంగ ప్రణామం ఆచరించడమే నా లాంటి సామాన్యుడు అర్పించే నివాళి 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌷🌷🌷🌷🙏🙏🙏డాక్టర్ మరి0గంటి మురళీకృష్ణ భట్ట రాచార్య మణికొండ హైదరాబాద్9866049495🌷


🌹🙏నటీమణి విలక్షణమైన అందమైన అలనాటి తార జమున గారికి నివాళి🌹🙏

       


                            🙏 అందాల నటి జమునా రమణారావు గారికి నివాళి🙏 

హైదరాబాద్  యూనివర్సిటీ లో చదువుకొంటూ వార్తా పత్రిక ల్లోనూ ...రేడియో దూరదర్శన్ లోను  విస్సా లాంటి కొన్ని ఛానల్స్ లోను ...హైదరాబాద్ లో పని చేశాను ...అప్పట్లో 90 నుంచి 2005  వరకూ కూడా అనేక సాంస్కృతిక సంస్థలు 

కళాకారుల సంఘాలు మీటింగ్స్ ...సన్మాన సభలకు   ఆ..వార్తలు కవర్ చేయటానికి .సంగీతం ..నాట్యం .సాహిత్యం ల గురించి కాస్తంత పరిచయం ఉందని ..నన్ను పంపించే వారు     అలా  ఎందరినో కలుసుకొని ముచ్చటి0చే  .అదృష్టం లభించింది...ఇంకో అవకాశం ఎక్కడో ఏదో సభలో  మా నాన్న గారు 

మరి0గంటి భట్టరా చార్యుల వారు పాల్గునే వారు ..అలా కూడా తోడుగా వెళ్ళాల్సి వస్తూవుండేది  ..అప్పుడు చాలాసార్లు కనిపించిన వారు ..అక్కినేని గారు...జమున  గారు ..వీళ్ళు ప్రతీ సభలో కనిపిస్తూ వుండే వారు ..ముఖ్యంగా త్యాగరాజ గాన సభ లో ....అలా అక్కినేని గారు ..అయితే నాన్న గారిని దీక్షితులు గారు ..అని పిలిచేవారు ...జమున గారు బాగా మాట్లాడేవారు ..ఇదంతా ఒక ఎత్తు అయితే ...జమున గారి భర్త ప్రొపెసర్ రమణారావు గారు  నేను యూనివర్సీ టీ లో బాగా కలిసి మాట్లాడుకునేవారం ..వారు కూడా చాలా ఆత్మీయంగా మాట్లాడేవారు ..నా రీసెర్చ్ టాపిక్ ఎలా నడుస్తోంది అడిగి తెలుసుకొనే వారు 

కొన్ని మెలుకువ లు కూడా చెప్పేవారు ..ముఖ్యంగా ఓ యూలోఒక  బ్యాంకు ఉంది 

ఆ బ్యాంకు లో పని మీద వచ్చి నప్పుడు చాలా సేపు మాట్లాడుకొంటూ  కూర్చునే వాళ్ళ0 ..చాలా చక్కగా ..ఆచి తూచి మాట్లాడుతూ వుండే వారు .సినిమా రంగం లో వారి వి కూడా కొన్ని సంభ0దాలు ...కూడా చెప్పారు ...నా కు అప్పట్లో స్థిర మైన ఆదాయం లేక ధైర్యం చేయలేదు  ఎన్నో సార్లు నాన్న గారిని తీసుకొని  ఇంటికి రమ్మని ఆహ్వానించే వారు ....నాన్న గారు ఇక్కడ స్థిరంగా  నివాసం వు 0డ లేక పోవడం ...నేను అప్పట్లో స్థిర పడకపోవడం ..లాంటి కారణాలతో వెళ్లలేక పోయాము ..తరువాత కొంత కాలానికి హైదరాబాద్ చేరి  స్థిర పడే టైమ్ కి రమణారావు గారు పరమ పదించడం ఇక్కడికి చేరేసరికి నాన్న గారు పెద్దవాళ్ళు అయి ఇంటికే పరిమితం అవడం ..ఆ తరువాత వారూ వెళ్లిపోవడం అలా ...అలా జరిగిపోయాయి ..మనస్సులో మంచివాళ్ళు ..మంచిని కోరేవాళ్ళు మంచిగా జీవించి నా లాంటి సామాన్యులు మరియు అందరి  జనుల గుండెల్లో  సు కీర్తిని  ఆ చంద్ర తారార్కం ..నింపిన..ఎందరో మహానుభావులు అందరికి  కోటి సాష్టాంగ ప్రాణామాలు అర్పిస్తూ అందమైనసోయగాలనటి జమునా రమ ణా రావు గారికి అశ్రునయనాలతో  నివాళులు సమర్పించు కొంటున్నాను .

🙏🙏🙏🌹🌹🌹.డాక్టర్ మరి0గంటి మురళీకృష్ణభట్టరాచార్య .హైదరాబాద్

🙏🌹 రధ సప్తమి శుభాకాంక్షలు మిత్రులు అందరికి 🌹🙏


           🙏🌹 ఓం సూర్యా యై నమ: ..ఆడిత్యా యై నమ: ఓం నమో నారాయణాయ ఓంనమో వేంకటేశాయ🌹🙏

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏

😃😎 రాజకీయాన్ని కూడా ఈ పెద్ద సార్ ..కూడా కధ లా చేప్పేస్తున్నాడు😁😄


 

😆😃రాజకీయ పార్టీల గురించి చదువుకోని పెద్దవాళ్ళు కూడా ఏనాలసిస్ లు ఇచ్చేస్తున్నారు😎😃


 

😄😁రాజకీయాలు ఒకరిమీద ఒకరు పోస్ట్ లు పెట్టుకొంటూ న్న వైనం😁😎


 

🌹🙏రామనుజాచార్యులవారి విశిష్టాద్వైతం 22 వ భాగం ...Ramanuja charya visista dwaitam part 22


          

                                     🌹🌹 ఓం నమో నారాయణా య ......ఓం నమో వేంకటేశాయ🌹🌹
               
        
                                                                 🌷శ్రీ మతే రామానుజాయై నమ:🌷

🌹🙏 IIT student చేస్తున్న అవధానం ..తెలుగు భాష తియ్యదనం ...గమ్మత్తులు చూద్దాం 🌷🙏


  

                                   🌹ఓం నమో వేంకటేశాయ 🌹ఓం సద్గురు సాయునాద్ కీ జై 🌷

🌷 ఆరోగ్యం కోసం ..మంచి సంతానం కోసం శ్రీరామ గధ్య రుగ్వేదం లోని ఈ మంత్రం వినండి🌷


 

                                                         🌹   ఓం నమో వేంకటేశాయ🌹

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online