Pages

🙏🙏కళా తపస్వి విశ్వనాథ్ గారికి 🙏🙏...🌹..నివాళి🌹

 🙏💐కళా తపస్వి విశ్వనాధ్ గారికి 🙏💐     🙏నివాళి🙏

(ఒక సామాన్యుడిగా నా అనుభవాలు మిత్రులతో పంచుకోవాలని )

నేను ....నా మిత్రుడు ఎన్ రవి ..చదువు కొనసాగిస్తూనే కధలు వ్రాస్తుండే వాళ్ళం డిగ్రీ తరువాత హైదరాబాద్ చేరుకున్నాం ఉస్మానియా విశ్వవిద్యాలయం లో సీటుకొట్టాం ..అప్పుడు బాగా కుర్ర కుంకలం ..సినిమా రంగం లో దర్శకుల0 కావాలని కలలు కంటూ ...ముందుగా శిష్యరికం కోసం ..ఆ రోజుల్లో ప్రతీ దర్శకుడి ని కలుస్తూ ఉండేవాళ్ళం ..ఈ లోపు మాకు  అర్ధం అయుంది ..అంత తేలిక కాదని .....ఇంట్లో వాళ్ళు కూడా తిట్టిపోశారు..ఇక మార్గంతప్పించి  ..అలా టీచరు .. .యం డి ఓ ..వ్యుదోగాల కోసం కష్టపడి చదివి  వ్రాశా ము ..మిత్రుడు సెలెక్ట్  అయి వెళ్ళిపోయాడు ..నేను మాత్రం పీహెచ్. డి  పరిశోధనలో దిగాను ..మళ్ళీ అంకురం వుమా మహేశ్వర రావు ..దాసరి నారాయణరావు ..కృష్ణ వంశీ ...మధ్య మధ్య మణిరత్నం హైదరాబాద్ వచ్చినప్పుడు అలా కొంచెము టైమ్ వెచ్చించి శిష్య్ రకం కోసం తిరుగుతూ ఉండేవాడిని    ఒకసారి జయప్రద గారి తో ఇంటర్వ్యూ తీసుకుందామని హాలిడే ఇన్ కృష్ణ గ్రాండ్ హోటల్ రేడియో తరుపున వెళ్ళాను .అక్కడ ఆమె భర్త నహతా గారు  నన్ను కూర్చో బెట్టారు ఇంతలో  విశ్వనాథ్ గారు అక్కడకు వచ్చారు కొద్దిసేపు.మళ్ళీ నేను మొ ర పెట్టుకున్నాను .ఈసారి చూస్తాను లే అన్నారు...అని ..చెన్నై వెళ్లిపోయారు  ....ఆ పక్క రూ0 లోనే రాజశేఖర్ గారిని జీవిత లను కోలుకోవడం జరిగింది ...అలా అలా  వేటూరి సుందరామ్మూర్తి గారు ..అంకురం ఉమా మహేశ్వరరావు గారితో హైదరాబాద్ గోల్కొండ హోటల్ లో బాగా గడుపుతూ ఉండేవాడిని వేటూరి గారు కాఫీ కలుపుకొని నాకు కూడా ఒక  కప్పు ఇచ్చేవారు ..చాలా విషయాలు మాట్లాడుకునే వాళ్ళం ..మళ్ళీ నేను రేడియో లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుండే వాడ్ని ..ఇంకో పక్క పత్రికల్లో జర్నలిస్ట్ మళ్ళీ ఇలా బిజీ ..బిజీ ఇక విశ్వనాథ్ గారిని పట్టుకొని ఆయన శిష్యరికం చేయాలని మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించాను ..కష్టపడి ఎన్ని సార్లు కలిసినా ఇప్పుడు కాదు...అనేవారు ..ఒకసారి శుభ సంకల్ప0 సినిమా వంద రోజుల ఉత్సవం హైదరాబాద్  లో రవీంద్రభారతి లో నిర్వహించ టానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ..అప్పుడు సీఎం ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతి ..కమల్ ..బాలు ..శ్రీరామ్ ఫోటో గ్రఫి ఇంకా వేటూరి ..సోమయాజులు ఇంకా నాన్న గారు భట్టరాచార్యులు  వారిని ఇలా ప్లాన్ చేసి అందరిని గ్రీన్ పార్క్ హోటల్ కి పిలిపించారు ...సత్తుపల్లి నుంచి నాన్నగారు బయలు దేరి వచ్చారు ..నాన్న గారు ..కమల్ హస్సన్ కి ఒకే రూమ్ బుక్ చేశారు పక్క రూమ్ లో విశ్వనాథ్ గారు ..బాలు గారు శుభలేఖ సుధాకర్  శైలజ  గారు (ఇంకా అప్పట్లో వాళ్ళ చిన్న పిల్లల్ని ఎత్తుకొని తిప్పాను ఆ రోజు ) ..ఇలా బుక్ చేసుకున్నారు.... కమల్ గారు బాగా లేటుగా వచ్చారట ..ఉదయం ఇక హడావిడి ..అయినా కమల్ నాన్నగారు చాలాసేపు మాట్లాడుకున్నారు  నాన్నగారి వద్ద భద్రాచలం స్వామి వారి ప్రసాదం ఉంది  కమల్ కి ఇచ్చారు ..అది తీసుకొని కమల్ ..నాన్నగారికి పాదాభి వందనం చేశారు  నేను కమల్ కి పాదాభివందనం చేశాను ....అప్పుడు చెన్నై అడ్రెస్ లు ఫోన్ నెంబర్ లు వ్రాసి ఇచ్చారు ..నాన్నగారి ని తీసుకొని ఒక సారి చెన్నై రావాల్సిందిగా గట్టిగా చెప్పారు ...అక్కడ హొటల్ ..బయట అందరూ ..హాలు లో కూర్చుని వున్నారు ...అప్పుడు విశ్వనాథ్ గారిని మళ్ళీ కలిశాను ....బాబూ చూడు ఇది కత్తి మీద సాము ..నువ్వు చదువు అంటే నీ రీసెర్చి పూర్తి చేసుకొని అప్పుడు అడుగు పెట్టు   .అప్పుడు ..ముందు నా దగ్గర స్క్రిప్ట్ అసిస్టెంట్  గా ప్రారంభం చేద్దువు గానీ అంతే కాని రెండు పడవల మీద డాన్స్ వద్దు ..అయినా ముందు చదువు పూర్తి చేయు ..అదిమన జీవితానికి రక్ష ని ఇస్తుంది ..ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో ....అని గంభీరంగా చెప్పారు ....నాకు కొంచెము కోపం బాధ కలిగాయి ..ఇక ఆ తరువాత సభా కార్యక్రమ0 ..అందరూ పాల్గున్నారు .ఆ ఫోటో లు చాలా ఉండేవి సత్తుపల్లి లో చెదలు పట్టి పాడై పోయాయు .ఇక ఆ తరువాత జీవన యాన0 ..ఇంట్లో తిట్లు ..పరిస్థితులు అలా అలా  పీ హెచ్ డి పూర్తి అవ్వడం..కాల0 కదిలిపోయుంది ..మా వైఫ్ వాళ్లకు దగ్గర బంధువు విశ్వనాథ్ గారు అని తెల్సింది ..నియోగి బ్రాహ్మణులు అందులోనూ లింగ ధా రులు అంటే శివ లింగం మెడలో లేక జంధ్యానికి కట్టుకుంటారు ..చంద్రమోహన్ ..బాలు ...చాగంటి వీళ్ళంతా  ఒకటే నియోగి బ్రాహ్మణు లే కానీ లింగ ధా రుల శాఖ వారు ..వారి ఆచారాలు వేరుగా ఉంటాయి ..కొంత కాలం క్రితం వారిని మళ్ళీ కలుద్దాం అని ప్రయత్నం చేశాను ..సాగర సంగమం డ్యాన్స్ కొద్దీ స్టెప్పులు అయినా వేసి పాద నమస్కారం చేద్దామని అనుకొని ..ప్రయత్నం చేశాను ..ఓపిక లేదండి తరువాత చూద్దాం అంటూ దాట వేశారు అలా అది కలగానే అయిపోయింది.  సాగర సంగమం ఒక యోగం ..కదా....వారి జ్ఞాపకాలను మనన0 చేసుకొని ఆ కళా తపస్వి ..ఆ మహర్షి ఆ యశస్వి కి  శిరస్సు వంచి చేతులు జోడించి ..సాష్టాంగ ప్రణామం ఆచరించడమే నా లాంటి సామాన్యుడు అర్పించే నివాళి 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌷🌷🌷🌷🙏🙏🙏డాక్టర్ మరి0గంటి మురళీకృష్ణ భట్ట రాచార్య మణికొండ హైదరాబాద్9866049495🌷


0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online