Pages

🏹🏹ముచ్చట పత్రిక లో వచ్చిన వ్యాసానికి ఖoడన 🏹🏹

ఇదీ గొప్ప గా నిర్ణయం ఎవ్వరూ తెలుసుకోలేరు అంటూ ఎగతాళి 

                     🌹తిరుమల లో భక్త జనులకు చేతి కర్ర లు🙏
మీ ముచ్చట పత్రిక లో ...ఒక వ్యాసం వచ్చింది ... టిటిడి వారు కర్రలు గురించి విమర్శ వ్రాశారు .. బాగుంది కానీ అక్కడ పరిస్థితులు అన్నీ రీ సర్చి చేసి వ్రాయాలి
ఏదో పేలవంగా .. విమర్శించాము కదా అని అనందపడిపోకూడదు. మీ సూచనలు కూడా చెప్పాలి మేధావులు అంతా ఆలోచించి అక్కడ ఏమి చేయలేని పరిస్తితి దానికి అనేక కారణాలు ఉన్నాయి అడవి మధ్య లో మెట్ల మార్గం వద్ద జంతువులు రాకుండా నిలువరించడానికి  కంచే లేక పెన్సింగ్ వేసే వీలు లేదు.అడవి మధ్యలో వేస్తే.వాటికి ఇబ్బంది అవుతుంది.. ఇక భక్త జనుల ను వారి మొక్కులను ఆపలేరు కదా.  వెంటనే తరుణోపాయం  ఒకటి చేశారు దీనిలోవెక్కిరింతలు
విమర్సలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు చెరువు కట్ట తెగిపోతుంది అప్పుడు వెంటనే ఇసు
క బస్తాలు అడ్డం వేసి ముందు జాగ్రత్తగా ఏదైనా చేయాలని ప్రయత్నం చేసి చూస్తారు తరువాత ఆనకట్ట కరకట్ట పనులు గురించి ఆలోచిస్తారు కదా ఇక ఇక్కడ జనాలకు .తుపాకులు ..కత్తులు ఇవ్వకూడదు కదా .ఏదో ఒక గట్టి కర్ర చేతిలో ఉంటుంది .దానిని తీసుకొని జనాలు గుంపులు గుంపులు గా పోతుంటే ఆ శబ్దం.. ఆ కర్రలు కనపడటం...కొద్దిగా ఏ జంతువైన
ఏ కుక్క అయినా పిచ్చిమనిషి సైతం పెద్ద కర్ర చూస్తే భయపడ తాయు ..కనీసం కొద్దిగా పక్కకు అయినా పారిపోతాయి ...ఎన్నిచొట్ల కోతులను  కుక్కల ను మనం కర్రలతో దడిపించటం లేదు  .పూర్వ కాలం లోభారతీయుడు అన్నా గ్రామీణo లో అయునా తలకు చూట్టూ తలపాగా చెప్పులు వేసుకొని చేతిలో గట్టి కర్ర రక్షణగా పెట్టుకొని అడవిలో నడిచి పోతూవుండే  వారు ..కాబట్టి అది ఒక ఆయుధO అ నాలి .. ఇప్పుడు అడవులు ఎక్కడ వున్నాయి ... ఆ గ్రామీణ వ్యవసాయం అంత పాత వూళ్లు ఎక్కడ .. ఆ ముతక మనుషులు ఎక్కడ వుండనిచ్చాము.. అంతా కాంక్రీట్ జంగిల్ ...నదులు చెరువులు పూడ్చేసి.రియల్ ఎస్టేట్ పెంచడం ..కాబట్టి పాత పద్దతులు ఆ కట్టు బట్టలు ఆ కర్ర లు బుర్రలు అర్థం కాదు .. అయినా  స్వామివారు తో పెట్టుకోవటం అని వ్రాశారు ..ఎక్కడో గుడిలో స్వామికి ఎందుకు కోపం  ఇటు జనుల ప్రాణాలు అటు జంతువుల ప్రాణాలు రెండూ భగవత్ సంబంధమే అని సమానంగా చూసి ఇద్దరూ క్షేమంగా ఉండాలని కోరుకోవడం స్వామివారికి రుచించ దా ఏమి చెప్పండి ..ఏది చేసినా ఏది చూసిన దిక్కుమాలిన రాజకీయాలకు ఆపాదించి ఆ కోణం లో చూడటం మానేసి ఎవ్వడు చేసినా దానిలో ఒక్కింత మేలు ఏమైనా జరుగుతుందా దానికి మన వైపు నుంచి ఏదైనా సూచన సలహా ..లేక సేవ ఏమైనవుందాఅనేది ఆలోచిస్తే సమాజానికి హితం ..అంతేకాని వెక్కిరింతలు వల్ల ఏమి ఒరగదు ...పెట్టే కుళ్ళు జోకుల బొమ్మల వల్ల సమయం వృధా ...చదువుకున్న వారం ఎదిగి పైకి ఎదిగి ఆ లోచంచాలి దిగిపోయి కాదు సుమా సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ మరింగంటిమురళీ కృష్ణ..ఓం నమో వేంకటేశాయ 🙏🌹

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online