Pages

Problems with pegions


పావురాలను..గబ్బిలాలను ఇళ్ళ లోనికి ...ఏపార్టమెంట్స్ లోనికి రానివ్వకూడదు ..శాస్త్రప్రకారం అయినా ,సెన్సు ప్రకారం అయునా అది మంచిది కాదు ..వాటి మూలుగుతూ ఉన్నట్లు గా వుండే వాటి కూత కూడా మంచిది కాదు ..ఇక ఈ పావురాలను సినిమా ల లో విపరీతంగా చూపించడం వల్ల వాటిని పెంచే మోజులో పడి పోతున్నారు యువత .గబ్బిలాలు
లాగానే పావురాలు కూడా నివాసం ఉన్న కొంతకాలని కి వాటి పెంట లు ,వాటి ఈకలు ఆ ప్రాంతానికి అంతటికీ ఇన్ఫెక్షన్స్ ను పోగేసి పెడతాయు .ఎంత కొత్త ఇల్లు ఆయునా ,కొత్త కాలనీ అయినా పావురాలు చేరాయంటే పాత కంపు ,నిలవ ఉన్న పాత బూజు పట్టిన ..కాలనీ గా బూతు బంగ్లా గా మార్చేస్తాయి ..గోడలనిండా పెంటలు ..పాత కంపు మీరు పరిశీలించి చూడండి ..హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలలో విపరీతంగా పెరిగిపోయాయి ..వాటిలో సంతాన సాఫల్యం బాగా ఎక్కువ
ఏ పక్షి జాతి లో లేని విధముగా రెండు ,మూడు నెలల్లోనే 200 నుంచి సంవత్సరం వచ్చేసరికి వేల సంఖ్యలో పుట్టి పెరిగిపోతాయు ..వాటి మల.. మూత్రాలు చేసిన ప్రదేశాలలో చాలా ఇన్ఫెక్షన్స్ పుట్టి పెరుగుతాయు..అవి మనిషి పీల్చేగాలిలోని కి చేరి ఊపిరితిత్తుల సామర్ధ్యం ను తగ్గించేస్తాయి ..దానివల్ల ఆస్తమా ,ఆయాసం ఎలర్జీ లు కొన్ని చర్మ వ్యాధులు కూడా వస్తాయి ...చిన్నపిల్లలు ,ముదుసలి వారు కి రోగనిరోధక శక్తి తక్కువ వుండటం వల్ల వారి ఊపిరితిత్తుల. చాలా తేలిగ్గా ఇన్ఫెక్షన్స్ సోకి ఇక వాళ్ళు జీవితాంతం బాధ పడుతూవుంటారు ...
పైగా ఈ పావురాలు కష్ట పడిబ్రతికే చిలుకలు, గోరువంకలను ,పిచ్చుకలను ,కాకులను ఇక మిగతా ఇతర పక్షులను రానివ్వకుండా తరిమి తరిమి కొడతాయు ..మీకు ఈ పక్షులు ఎక్కడ బాగుగా తిరుగుతున్నాయో అక్కడ పర్యావరణం బాగుంది ..అక్కడ ప్రకృతి శుభ్రంగా ఉంది ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క...
ఎక్కడ పావురాలు బాగా తిరుగుతున్నాయో అక్కడ గబ్బు లేపే.. జబ్బులుతెచ్చే వాతావరణం ఉన్నట్లు లెక్క ...శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చెప్పిన నిజం .
ఇక పిచ్చుకలు ,కాకులు ,గోరంకలు, చిలుకలు పర్యావరణానికి హాని చేసే పురుగులను ,జెర్రెలను ,తేళ్లను .విష పురుగులను ..సాలె పురుగులను పట్టి తింటాయి ..
పావురాలు అస్సలు సోమరితనం తో ఉంటాయి ...ఇంకా కొంతమంది వాటిపిచ్చిప్రేమికులు గింజలు కొని మరీ వాటి జాతిని పెంచి పోషిస్తూ ప్రతి ఇల్లును ,ప్రతి కాలనీ ను పాత బూజు పట్టిన గబ్బిలాల వాసన వచ్చేలా మన చేతులారా మన ప్రకృతి ని మనమే పాడుచేస్తున్నాము ...ముందు గింజలు కొని మేపడం ఆపండి ..
చాలామంది పిల్లలు లేని వాళ్ళు ....జ్యోతిష్యులు చెప్పారని గింజలు ,దాణాలు కొని పావురాలకు వేసి మరీ మన ఊరు ని మన కాలనీ ని ..మన ఇళ్లను చేతులారా పాడుచేసుకుంటున్నాము
జ్యోతిష్యులు..ఒకవేళ చెప్పినా కూడా ..పావురాలకు బదులు ఆవులకు పెట్టండి ...పెట్టవచ్చు అని శాస్త్రం కూడా చెబుతుంది వంద రెట్లు పుణ్యం వస్తుంది..... ఈ మధ్య GHMC వారు కూడా పావురాలను పట్టుకొని తీసుకొని వెళ్లి అడవుల్లో వదిలివస్తున్నారు ..మనం కావాలని పనికట్టుకొని పెంచుతూ ఉంటే ప్రభుత్త్వం మాత్రం ఎంత అని చేస్తుంది?.. కాబట్టి మిత్రులారా....మీరు ఈ పావురాలను . పెంపకం ,పోషణ ఆపేయండి ..పిచ్చుకలు మిగతా పక్షులను పెంచండి
ఈ విషయాన్ని అందరం మన శా య శక్తుల ప్రచారం చేద్దాం ...పర్యావరణం కాపడుకుందాం                            

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online