Pages

శ్రీ కృష్ణాష్టమి విశేషాలు

 *_రేపు శ్రీ కృష్ణ జన్మాష్టమి , శ్రీ కృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి ? పండుగ విశిష్టత ఏంటి ? విధానం ఏంటి ?_*


🕉🕉🕉🕉🕉🕉


కృష్ణం వందే జగద్గురుమ్. సృష్టికర్త అయిన మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీ కృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించిన కృష్ణ జన్మాష్టమిని *"కృష్ణాష్టమి" , "గోకులాష్టమి"* లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు.

ఈ సంవత్సరం *స్మార్తులకు* ఆగస్టు 11 మంగళవారం  రోజున శ్రీకృష్ణామి. *వైష్ణవ సాంప్రదాయ* ప్రకారం తేదీ 12 బుధవారం  రోజున శ్రీ కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు.

*స్మార్తులు* తిధితో పండగ జరుపుకుంటే , వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని పుజిస్తారు. శ్రీ కృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు.

మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలకు ) నిద్ర లేచి , తలస్నానము చేసి మడి బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపుకుంకుమ , గుమ్మానికి తోరణాలు , పూజా మందిరములో ముగ్గులు వేయాలి.


*ఉపవాస దీక్షలు*


కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి , సాయం కాలం శ్రీ కృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు , శొంఠి , బెల్లం కలిపిన వెన్న , పెరుగు , మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు , కీర్తనలు పాడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని *‘ఉట్ల పండుగ' లేదా ‘ఉట్ల తిరునాళ్ళు'* అని పిలుస్తారు.


*పసుపు , కుంకుమ , గంధము , పుష్పాలతో*


పూజకు ఉపయోగించే పటములకు పసుపు , కుంకుమ గంధము , పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ , ప్రతిమను ఉంచాలి.  ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు , కదంబ పుష్పములు , తులసిమాల , సన్నజాజులతో మాల , నైవేద్యానికి పానకం , వడపప్పు , కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.


*దీపారాధాన*


తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి , ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి , తూర్పు దిక్కున తిరిగి , *'ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః'* అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం , కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలం దక్కుతుందని *బ్రహ్మాండ పురాణం* చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి , పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.


*దీక్షతో దక్షత*


కృష్ణాష్టమి రోజున ఒంటి పూట భోజనం చేసి , శ్రీకృష్ణునికి పూజ చేసి , శ్రీకృష్ణ దేవాలయాలు , మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ , కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి , అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని , ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని *స్కంధ పురాణం* చెబుతుంది.

సంతానం లేని వారు , వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది. ఓం నమో నారాయణాయ , నమోభగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు !


*ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణీ శాయ నమః !*

*ఓం అచ్యుతా అచ్యుతాహరే పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవభగవాన్ అనిరుధ్య శ్రీపతే శమయ దుఃఖమశేషం నమః !*


ఈ మంత్రముతో ఈరోజు ఎవరైతే 108 సార్లు ధ్యానం చేస్తుంటారో వారి , దుఃఖం హరించిపోతుంది.


గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందజేస్తే.. సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం.


హిందూ సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగా , చిన్నవారికి చిలిపి కృష్ణునిగా , స్త్రీలకు గోపికా వల్లభునిగా , పెద్దలకు గీతాకారునిగా... ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం.


కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు. కృష్ణునికి పొన్నచెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే ! కృష్ణాష్టకమ్‌ , కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ , పరిమళభరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి.


కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే ! ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే *భాగవతం , భగవద్గీతలను* ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ , కొలుస్తూ , భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి , కొందరు రాత్రివేళ్లే కృష్ణపూజ చేస్తారు. అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి.... దాని మీద ఒక కుండని పెడతారు. ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి , పూజని నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి , కృష్ణునికి అర్ఘ్యమిస్తారు. మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు.


శ్రీ కృష్ణ జన్మాష్టమి   ఈసారి నక్షత్రం మరియు తిథి కలిసి లేవు. అటువంటి పరిస్థితిలో , ఆగస్టు 11 లేదా 12 న పండుగను జరుపుకోవడం గురించి గందరగోళం ఉంది. అయితే జ్యోతిష్కులు ఆగస్టు 12 న ఉదయ తేదీతో పాటు రాత్రి రోహిణి నక్షత్రాన్ని అనుభవిస్తున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టు 12 న జన్మష్టమి జరుపుకోవడం శుభప్రదంగా ఉంటుంది.


ఈసారి జన్మాష్టమి తేదీకి సంబంధించి చాలా అభిప్రాయాలు ఉన్నాయి. జన్మాష్టమి ఆగస్టు 11 , ఆగస్టు 12 మంగళవారం. అయితే , ఆగస్టు 12 న జన్మాష్టమిని జరుపుకోవడం ఉత్తమమని చెబుతారు. ఎందుకంటే ఆగస్టు 11 న ఉదయం 6: 08 తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఇది ఆగస్టు 12 ఉదయం 7: 54 వరకు ఉంటుంది. మరోవైపు , రోహిణి నక్షత్రం ఆగస్టు 12 మధ్యాహ్నం 1: 20 నుండి ఆగస్టు 13 మధ్యాహ్నం 13.06 వరకు ప్రారంభమవుతుంది.


*స్మార్త మరియు వైష్ణవులు*


స్మార్త మరియు వైష్ణవుల విభిన్న అభిప్రాయాల కారణంగా , తేదీలు భిన్నంగా చెప్పబడుతున్నాయి. శ్రీ కృష్ణ భక్తులలో  స్మార్త మరియు వైష్ణవులు. భక్తులలో , గృహ జీవితంలో జీవించేటప్పుడు , ఇతర దేవతల ఆరాధన మరియు ఉపవాసాలను గుర్తుచేసుకునేవాడు స్మార్త . అదేవిధంగా , శ్రీకృష్ణుడిని కూడా పూజిస్తారు. వైష్ణవులు కృష్ణుడి కోసం తమ జీవితాలను అంకితం చేసిన భక్తులు . భగవంతుని సాధన కోసం వైష్ణవులు శ్రీ కృష్ణుడిని ఆరాధిస్తారు. తేదీ ఉన్న రోజున జన్మష్టమి జరుపుకోవాలని భక్తులు నమ్ముతారు. స్మార్త  ప్రకారం , అష్టమి ఆగస్టు 11 న ఉంది. వైష్ణవ భక్తులు సూర్యోదయం సంభవించిన రోజు నుండి , రోజంతా ఒకే తేదీ అని చెప్పారు. ఈ సందర్భంలో , అష్టమి తిథిపై సూర్యోదయం ఆగస్టు 12 న ఉంటుంది.


*ఆరాధన యొక్క శుభ సమయం*


ఈ సంవత్సరం , కృతిక నక్షత్రం జన్మాష్టమిలో ఉంచబడుతుంది. అలాగే , మూన్ మేషం లో మరియు సూర్యుడు క్యాన్సర్లో ఉంటుంది. కృతికా నక్షత్రంలో రాశిచక్ర గుర్తుల ఈ గ్రహ స్థితి కారణంగా , పెరుగుదల యోగా కూడా జరుగుతోంది. ఆగస్టు 12 జన్మష్టమికి శుభ సమయం. బుధవారం రాత్రి ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:47 వరకు పవిత్ర ఆరాధన.


ఏదైనా పండుగకు ఉదయం తేదీని పరిగణిస్తారు. జన్మాష్టమికి ఉదయం తేదీ ఆగస్టు 12 న. స్మార్త  11 న జన్మాష్టమిని , ఆగస్టు 12 న వైష్ణవులు జరుపుకోవచ్చు....

(........................... సేకరణ ....సేకరించబడినది ..రచయిత పేరు లేదు )

 నేను ఏం అంటానంటే ..ఈ తతంగం అంతా ఆచరించ లేని ..వారు ..సమయం . లేక బిజీ గా ఉండే వారు ..రెండు తులసి దళములు ...వీలు ఉంటే రెండు పువ్వులు ...మీ ఇంట్లో శ్రీ కృష్ణ భగవానుని ..ఫోటో కానీ  ..చిత్రం కానీ ఉంటే .ఆ కృష్ణుని ..పాదాలపై ఆ దళములు ..పువ్వులు ఉంచి ఓం నమో నారాయణాయా ఓం నమో భగవతే వాసుదేవాయ ..ఓం నమో విష్ణువే అని కానీ 

లేక ఓం నమో భగవతే శ్రీ కృష్ణా య న మహా అని జై శ్రీకృష్ణా అని కొద్ది సార్లు  అయినా కళ్ళు మూసుకుని మనస్సులో ఒక్క నిమిషం ఆ కృష్ణభగవానుని స్మరించుకోOడి ..చాలు ................

జైశ్రీ కృష్ణా ..జయ జయ శ్రీ కృష్ణా .........










0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online