Pages

ధన్వంతరి నారాయణ స్తోత్రం.....ఆంజనేయ నవరత్నమలాస్తోత్రం

ఈ  మంత్రాన్ని చదువుకొని శ్రీ వేంకటేశ్వరుని కి లేదా మీ ఇష్ట దైవానికి నమస్కారం చేసుకోవచ్చు ముఖ్యంగా ఔషధం తీసుకొనే వారు తీసుకొనేముందు ఈ మంత్రం జపిస్తే అది బాగా పనిచేస్తుంది
అనారోగ్యవంతులు అయితే రోజూ ఒక 11సార్లు లేక మీ ఇష్టం మీకు కుదిరిన ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది ఇక ఆరోగ్యవంతులు వారిఇష్టం 3.లేక5లేక 11 సార్లు చదువుకున్నా మంచిది 


ప్రార్ధన

ఓం నమో భగవతే
మహా సుదర్శన వాసుదేవాయ 
ధన్వంతరాయ
అమృత కలశ హస్త స్య
సకల భయ వినాశాయ
సర్వరోగ నివారణాయ
త్రిలోక  పతయే
త్రిలోక  నిత్య యే
ఓం శ్రీ మహావిష్ణు స్వరూపా
శ్రీ ధన్వంతర స్వరూపా
ఓం శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ నమః
...................................................................................................................................శుభ0......

* ఆంజనేయనవరత్నమాలాస్తోత్రం

హనుమగుణగణములతో ఆంజనేయనవరత్నమాలాస్తోత్రం

గుణగణముల

రామ పూజారి పర ఉపకారి
మహావీర భజరంగ బలీ     
సద్ధర్మ చారి సద్బ్రహ్మ చారి
మహా వీర భజరంగబలీ! 
   
జ్ఞాన గుణసాగర
రూప ఉజాగర
శంకర సువన
సంకట మోచన
మహా వీర భజరంగబలీ!     
     
కేసరి నందన
కలిమల భంజన
రాఘవ దూత
జయ హనుమంత
మహా వీర భజరంగబలీ!     
     
అంజని నందన
అసురనికందన
మంగళహారతి
మారుతి నందన
మహా వీర భజరంగబలీ!
 
జయ రణధీర
జయ రణశూర
జయ బలభీమ
జయ బలధామ
మహా వీర భజరంగబలీ!

వాల్మీకి రామాయణమునకు సుందరకాం డ తలమానికము.
సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే......... శ్రీఆంజనేయ #నవరత్నమాలాస్తోత్రం. రత్ననములవంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామివారికి సమర్పంచబడినది.

ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది. ఇవి శ్రీ ఆంజనేయస్వామి వారి వైభవము, స్వామి వారికి నవ గ్రహములతో గల సంబంధము తెలియబర్చును. ఈ స్తోత్రం పారాయణ చేసినవారికి శ్రీ ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో బాటు నవగ్రహముల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది. శ్లోకము తత్‌సంబంధిత గ్రహము, రత్నముల వివరములు స్తోత్రంలో తె లుపబడినవి. నవగ్రహములకు ఆయా శ్లోకములతో జపముచేసి ఫలితం పొందవచ్చునని చెప్పబడినది.

* ఆంజనేయనవరత్న మాలాస్తోత్రం

1) మాణిక్యం (సూర్యుడు)
శ్లో ®తతో రావణనీతాయా: సీతాయాశ్శత్రుకర్శన: |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ||

అర్థము : అనంతరము అరివవీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీతజాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతులవారు సంచరించు ఆకాశమార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను.

2) ముత్యం (చంద్రుడు)
శ్లో®యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ|
స్మృతిర్మతిర్ధృ తిర్ధాక్ష్యం స కర్మసు న సీదతి ||

అర్థము : నీవలె గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వముగలవాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడును వైఫల్యమును పొందడు.

3) ప్రవాలం (కుజుడు)
శ్లో ®అనిర్వేద: శ్రియో మూలం అనిర్వేద: పరం సుఖం |
అనిర్వేదో హి సతతం సర్వార్ధేషు ప్రవర్తక: ||

అర్థము : దిగులుపడకుండా ఉత్సాహముతో నుండుటవలన కార్యసిద్ధియు, పరమ సుఖము కలుగును. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి యుండటయే శ్రేయస్కరము.

4) మరకతం (బుధుడు)
శ్లో ®నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చతస్యై జనకాత్మజాయై |
నమోస్తు రుద్రేంద్రయమనిలేభ్య:
నమోస్తు చంద్రార్కమరుద్గణభ్య: ||

అర్థము : శ్రీరామునకు నమస్కారము. జనకసుతయైన సీతామాతకు ప్రణతి, లక్ష్మణునకు నమస్కారము, వాయుదేవునకు నమస్కారములు. సూర్యచంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు. Soma Sekhar

5) పుశ్యరాగం (గురుడు)
శ్లో® ప్రియన్న సంభవేద్దు:ఖం అప్రియాదధికం భయం|
తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం||

6) హీరకం (శుక్రుడు)
శ్లో ®రామ: కమలపత్రాక్ష: సర్వసత్త్వమనోహర|
రూపదాక్షిణ్యసంపన్న: ప్రసూతో జనకాత్మజే ||

అర్థము : ఓ జానకీ! శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులుగలవాడు. తన నిరుపమానకాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును గూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహసౌందర్యము, గుణసంపదయు గలవాడు.

7) ఇంద్రనీలం (శని)
శ్లో  ®జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల: |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ: ||

అర్థము : మహాబలసంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. అసహాయ శూరుడు, కోసలదేశప్రభువు ఐన శ్రీరామునకు నేను దాసుడను. Soma Sekhar

8) గోమేదికం (రాహువు)
శ్లో®యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తప: |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమత: ||

అర్థము : నేను పతిసేవాపరాయణనే ఐనచో, తపమాచిరించియున్నచో, నేను నిష్కలంక పతివ్రతనైనచో ఓ అగ్నిదేవా! హనుమంతుని చల్లగా చూడుము.

9) వైడూర్యం (కేతువు)
శ్లో®నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమం |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం ||

అర్థము : శత్రుమర్ధనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతోగూడి అయోధ్య యందు పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలో చూడగలవు.
ఇతి శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం సంపూర్ణం. (Soma Sekharగారి నుంచి సేకరించబడినది.........)

శ్రీహనుమ జయ హనుమ జయ జయ హనుమ
శ్రీ రామ జయ రామ  జయ  జయ శ్రీరామ .....
అలానే సద్గురు సాయి నాధులు ....భక్తులకు ఇచ్చిన మంత్రం. " రాజారామ్.. రాజారామ్ జయ జయ శ్రీరామ్"

భగవంతుని నమ్ముకోండి ...మానవుడ్ని కాదు....అప్పుడు మానవ రూపేణా అంటే మనిషి రూపములో ఎవరినైనా పంపించి ఆదుకుంటాడు..కాకపోతే చిన్న చిన్న పరీక్షలు ఉంటాయి ..అవితెల్సుకొని మనస్సుని భగవంతునిపైనే పెట్టాలి ,అంతే కానీ పరిక్షలోపడి దైవాన్ని తిట్టకూడదు ..ఆయన పాదాలు ను ఆశ్రయించండి.... అహ0కారం ...గర్వం వదిలిపెట్టాలి ...

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online