[8/7, 10:53 AM] Murali: శ్రీరామ భక్తి తేజస్సు తో ముఖం వెలుగుతుందా అన్నట్లు గాతేజస్సు గా కనిపించే శ్రీరామ భక్తుడు పరమ భాగవతోత్తములు శ్రీమాన్ లక్ష్మణ యతింద్రులు పెద్ద ముత్తేవి...సీతా నగరం జీయర్ స్వామివారి ఆశ్రమంలో తిరుగుతూ వుండేడివారు అప్పట్లో ..వారు ఒక భక్త బృందం తో అయోధ్య కరసేవకు వెళ్ళారు ..అక్కడ జరిగిన కరసేవ తోపులాట లో బాగా అస్వస్థతకు గురై పరమ పదించారు.. ఈ సమయంలో వారిని తలుచుకోవడం కూడా శ్రీరామ కార్యం కోసం అంకితం చేసిన వారిని ఓ మహాద్ భాగ్యం గా తలచి అంజలి ఘటిద్దాం ....జయ జయ శ్రీరామ...
[8/7, 10:53 AM] Murali: ------------/శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రులు/---------------
శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రులు నిజమైన యతీంద్రులు.
పూర్వాశ్రమంలో కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ పీఠంలో ఆచార్యులు గా విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పించారు.
ఒక జర్నలిస్ట్ గా ఆనాటి సమకాలీన రాజకీయాలపైన,సామాజిక అంశాలపైన ఎంతో సంయమనంతో కూడిన వ్యంగ్య వ్యాఖ్యలు చేసేవారు. అపూర్వమైన సాహితీజ్ఞానామృతాన్ని పంచిపెట్టారు. సమయపాలనను నిక్కచ్చిగా చేసేవారు. ఎటువంటి ఆడంబరాలకు,దురాచారాలకు తావిచ్చేవారు కాదు.ఆయన ఉంటే ఆధ్యాత్మిక సాహితీ గోష్టులు ఆద్యంతం రసవత్తరంగా ఉండేవి.పద్యాన్ని ఎంతగా ప్రేమించే వారో వచనకవితలను కూడ అంతే ఆదరించేవారు.భక్తి తాదాత్మ్యం ఆయనలోనే కనబడింది నాకు.
1991లో లక్షమందికి ఏక కాలంలో సమారాధన చెయ్యాలని సంకల్పించారు. కాని సమారాధనకు రెండు రోజుల ముందు వచ్చిన తుఫాన్ తో తరువాత ఏడాదికి వాయిదా వేశారు. ఆ తరువాత సంవత్సరం అద్భుతమైన రీతిలో లక్షమంది భక్తులకు సమారాధనను చేశారు.నా జీవితంలో తొలిసారిగా అంత పెద్ద కార్యక్రమానికి వ్యాఖ్యానం చేసే అవకాశం ఇచ్చారు. పైగా అప్పటికప్పుడు వేదికపైకి పిలిచి ఆ బాధ్యత అప్పగించారు.సందేహిస్తుంటే భుజం తట్టి మరీ ప్రోత్సహించారు. ఆనాడు అనుగ్రహభాషణం చేస్తూ 'ఈసంవత్సరాంతానికి(1992) రామజన్మభూమి లోని పరమత చిహ్నాలంతరిస్తాయి.మన సంస్కృతి పునఃపట్టాభిషేకానికి నాందిప్రస్థావన జరుగుతుంది.'అని ప్రకటించారు. తన జీవిత పరమార్ధమదేనని ,జాతిని జాగృతం చేయడమే తన కర్తవ్యమనీ, ఆ తరువాత జాతి తన దారిలో తానే నడవగలదని చెప్పారు.
అప్పుడు స్వామి జనాంతికంగా మాట్లాడుతున్నారు అనుకున్నాను.
కాని 92 డిశెంబర్ లో బాబ్రీమసాదు అంతర్ధానం తరువాత అయోధ్య కరసేవనుండి తిరిగి వస్తూ వారు పరమపదం చేరిన తరువాత గానీ ఆనాటి వారి ప్రవచనం "ప్రతీకాత్మకం" అని అర్థం కాలేదు. మందమతులం.
కాని ఏజన్మలోనో చేసుకున్న ఏ పుణ్యఫలమో
ఆ మహనీయుని పాదపద్మాల చెంత
నిలబడే అదృష్టాన్ని పొందగలిగాం.
స్వామీ ఈనాడు మీరు భౌతికంగా ఉండి ఉంటే ఎంతటి పండుగో కదా!!!!!
##చక్రావధానుల రెడ్డప్ప ధవేజి##
నరసాపురం
0 comments:
Post a Comment