Pages

kaarthika puraanam - 11th chapter

*కార్తీక పురాణం 11 వ అధ్యాయం*
*మ౦థరుడు - పురాణ మహిమ*
ఓ జనక మహారాజా! యీ కార్తీకమాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన యెడల చంద్రాయణ వ్రతము చేసిన౦త ఫలము కలుగును. విష్ణ్యర్చనానంతరం పురాణ పఠనం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారూతప్పని సరిగా వైకుంఠాన్నేపొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్దగా ఆలకి౦పుము. అని వశిష్టుల వారు ఈ విధముగా చెప్ప దొడంగిరి.
 
 
పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు, మద్య మా౦సాది పానీయాలు సేవించుచూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నానజప, ధీపారాదనాదికములను ఆచారములును పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు, భర్త యెంత దుర్మార్గుడయిననూ, పతనే దైవముగానెంచి విసుగు చెందక సకలోపచారములు జేయుచు, పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని చేయుచున్ననూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగ తనములు చేయుచూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద నున్న ధనము, వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవుచుండ నతనిని భయపెట్టి కొట్టి ధనమపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్ర మొకటి గాడ్రించుచు వచ్చి కిరాతుకుని పైబడెను. కిరాతుకుడు దానిని కూడా చంపెను. కానీ అ పులి కూడా తన పంజా తో కిరాతుకకుని కొట్టి యుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒక కాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమ లోకమున అనేక శిక్షలు అనుభావి౦చుచు రక్తము గ్రక్కుచు భాద పడుచు౦డిరి.
 

 
మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరి నామ స్మరణ చేయుచు సదాచర వర్తినియై భర్తను తలచుకోని దుఃఖిoచుచు కాలము గడుపుచు౦డెను. కొనాళ్ళుకు ఆమె యిoటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్య పాద్యాదులచే పూజించి " స్వామి!నేను దీ నురాలను, నాకు భర్త గాని, సంతతిగానిలేరు. నేను సదా హరి నామ స్మరణ చేయుచు జీవించుచున్న దానను, కాన, నాకు మోక్ష మార్గము ప్రసాదించు" మని బ్రతిమాలుకోనేను. ఆమె వినయమునకు, ఆచారమునకు ఆ ఋషి సంతసించి" అమ్మా! ఈ దినము కార్తిక పౌర్ణమి, చాల పవిత్రమైన దినము. ఈ దినమును వృథాగా పాడు చేసుకోనువద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చుదువుదురు. నేను చమురు తీసికొన వచ్చేదను. నీవు ప్రమిదను, వత్తి ని తీసికొని రావాలయును. దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీ వందుకోనుము" అని చెప్పిన తోడనే అందుకామె సంత సించి, వెంటనే దేవాలయమునకు వెళ్లి శుబ్రముచేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానె స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనే ప్రమిదెలో పోసి దీపారాధ న చేసెను. అటు తరువాత యింటికి వెడలి తనకు కనిపించిన వారి నెల్ల " ఆరోజు రాత్రి ఆలయ ముందు జరుగు పురాణ కాలక్షేపము నకు" రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయు  పురాణమును వినెను.
 
 
 ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమున కు మరణించెను. ఆమె పుణ్యత్మురాలగుటచే వల్ల విష్ణుదూతలు వచ్చి విమాన మేక్కించి వైకుంట మునకు దీ సికోనిపోయిరి. కానీ - ఆమెకు పాపత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముందుట చేత మార్గ మధ్యమున యమలోకమునకు దీ సికోనిపోయిరి. అచట నరక ముందు మరి ముగ్గురితో భాద పడుచున్న తన భర్త ను జూచి " ఓ విష్ణుదూత లారా! నా భర్తా మరి ముగ్గురును యీ నరక  బాధపడుచునారు . కాన, నాయ౦దు దయయుంచి వానిని వుద్ద రింపు "డ ని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు " అమ్మా! నీ భర్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంధ్యా దులు మాని పాపాత్ముడై నాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశ చే ప్రాణహితుని చంపి ధనమపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము నలుగవ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినాను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము, మద్య మాంసభక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే యీ నలుగురు నరకబాధలు పడుచునారు. " అని వారి చరిత్రలు చెప్పిరి.
 
 
 అందులకు ఆమె చాలా విచారించి "ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపు" డని ప్రార్ధించగా , అందులకా దూతలు " అమ్మా! కార్తిక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిదఫలము కిరాతకునకు, పురాణము వినుటవలన కలిగినఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగు" నని  చెప్పుగా అందులకామె అట్లే ధార పోసేను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిరి. కావున, ఓరాజా! కార్తికమాసమున పురాణము వినుటవలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా? అని వశిష్టులవారు నుడివిరి.
*పదకొండవ రోజు పారాయణము సమాప్తము.*

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online