Pages

Kaarthika Daamodara Puja

*కార్తీక దామోదరాయ నమః*

శ్రీమహావిష్ణు పరంగా *కార్తీకం* చాలా ప్రసిద్ధి. ఈ మాసాన *విష్ణు పూజ* ఫలప్రదం. *తులసీ దళాలతో స్వామిని ఆరాధించడం, ఏకాదశీ, ద్వాదశీ తిథులల్లో ప్రత్యేక వ్రత నియమాలతో ఉపాసించడంఉత్కృష్టమ*ని బహు పురాణాలు చెబుతున్నాయి. *కార్తీక శుద్ధ ఏకాదశీ* నుండి *పూర్ణిమ* వరకు *ఐదు రోజులు* విశేషించి *మహిమన్విత* దినాలుగా పేర్కొన్నారు.


 *తులసీవనంలోస్వామిని అర్చించే పర్వం “క్షీరాబ్ధి ద్వాదశి”* ఈ రోజులలోనే వస్తున్నది.

ఈ మాసానికంతటికీ విష్ణువు *దామోదర* నామంతో అధిపతిగా ఉన్నాడు. *సర్వ లోకములను తనలొ దాచుకున్న పరతత్వమే “దామోదరుడు”.*

*మార్గశీర్ష మాసం నాటి ఏకాదశి నుండి ‘కేశవ’ నామంతో మొదలై క్రమంగా’‘నారాయణ’, ‘మాధవ’, ‘గోవింద’, ‘విష్ణు’, ‘మధుసూదన’, ‘త్రివిక్రమ,’‘వామన’, ‘శ్రీధర’ ‘హృషీకేశ’, ‘పద్మనాభ,’ ‘దామోదర’ నామాలతో ప్రతినెలా ఏకాదశీ వ్రతం చేస్తారు. ఇలా ఆ వ్రతం పరిసమాప్తి 12వ ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి. ఆనాటి విష్ణునామం ‘దామోదరుడు’.* అందుకే ఈ మాసంలో ఏ పుణ్యకార్యం చేసినా *కార్తీక దామోదర ప్రీత్యర్థం* అని సంకల్పించడం ఆనవాయితీ.

 *బృందావనవ్రతం* ఈ నెలలో విశిష్ట ఫలప్రదం. *బృందావనానికి ప్రత్యామ్నాయంగా తులసికోటను ఆరాధిస్తాం.*


*‘దామములను’ (లోకములను) ‘ఉదరము’ నందు (తనలో) కలవాడు ‘దామోదరుడు.’* *సర్వలోకాలను వహించి పోషించే పరమాత్ముడు, తన మాధుర్యలీలలో భాగంగా యశోదమ్మ చేత త్రాటి చేత (దామముచే) రోటికి బంధింపబడ్డాడు. ఆ విధంగా దామముచేత (త్రాడుచేత) బంధింప బడిన ఉదరము కలవాడు దామోదరుడు అని కూడా అర్థం.* బృందావన సంచారియైన శ్రీకృష్ణపరమాత్మను ఆరాధించేందుకు అనువైన ఈ మాసంలో శుక, వ్యాసాది సిద్ధపురుషుల చేత ఉపాసింపబడిన స్వామి లీలలను పారాయణ చేసినా విశేష ఫలం.
 *“సర్వం శ్రీ కార్తీక దామోదరార్పణమస్తు.”

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online