..కిరణ్ ...వెనక్కు తిరిగి చూసింది .హలొ కిరణ్ ..నువ్వా ! ఏమిటి ఇక్కడ ..కొద్దిగా చిరునవ్వు ఇస్తూ దగ్గరకు వచ్చింది ..ప్రియ ..ఏమో లే ఇందాక నిజంగానే చూడలేదేమో ..లేకపోతే ఇంత ఆనందంగా వస్తుందా ..మళ్ళీ ఆలోచనలో పడ్డాడు కిరణ్ ..ఇక్కడ కొంచెము ఒక ప్రొఫెసర్ గారిని కలవాలి ..వచ్చాను ..అని మాట్లాడుతూఉండగానే ..బాయ్ ఫ్రెండ్ వచ్చి పక్కనే నిలబడ్డాడు ..అవును బై ది బై ..ఈయన అనిల్ ..నాకు బెస్ట్ ఫ్రెండ్ ..అనిపరిచయం చేసింది ..అవునండి నేను ప్రియ కు హోల్ అండ్ సోల్ మొత్తం నేనే .అని పెద్దగా నవ్వుతూ కిరణ్ చేయు పిసికాడు అనిల్ ..పలక రింపులు కాగానే ..బై మేము క్లాస్ కి వెళ్తాము అని చెప్పి ఇద్దరు అక్కడనుంచి వెళ్లిపోయారు ...కిరణ్ ని చూడగానే వాళ్ళ క్యాంటీన్ కు ఆహ్వానించి కాఫీ ..అందంగా తాగిస్తుందని కలలు కన్నాడు కిరణ్ ..ఏమిచేయాలి ఆలోచనలలో పడి పోయాడు కిరణ్..........
* * * *
డిగ్రీ ఫైనల్ సంవత్సరం చదువుతున్న శివనారాయణ ఆర్థిక పరిస్థితులు అంతగా బాగోలేక పోవడం వల్ల బ్యాంకు లో ఆఫీసుఅసిస్టెంట్ జాబ్ లోపెట్టించాడు ...వాళ్ళ నాన్న గారు ..కాలేజ్ లు తెరిచారు ..తండ్రి కాంతారావు కి ఆరోగ్యం బాగుండలేక కాలేజీ కి వెళ్ళడం మానేసింది అరుణ .ఒక్క పుస్తకం కొనలేదు ..కనీసం కాలేజీ లో ఏమి జరుగుతుందో కూడా ఏమీ తెలియడం లేదు ..శివనారాయణ అయినా వచ్చి కనిపిస్తాడు అనుకుంటే అస్సలు ఇంతవరకు అతని జాడ లేదు రోజులు వేగంగారోజులు నెలలు తిరిగిపోతున్నాయి ..ఒకరోజు అరుణ తల్లి కొత్త గా పెట్టిన గవర్నమెంట్ బ్యాంకు కి వెళ్లి తన నగలు పై ఎంత అప్పు ఇస్తారో తెలుసుకోవాలని వెళ్ళి0ది ...అక్కడ ఆమెను బ్యాంక్ లో పలికి తీసుకొని వెళ్లి .మ్యానేజర్ కి. మా దేవాలయం దొరసాని గారు అంటూ పరిచయం చేశాడు ..వాళ్ళ జమీందారి కుటుంబం .అన్నివిషయాలు వివరించి చెప్పాడు ఆఫీస్ అసిస్టెంట్ శివనారాయణ .ఇంకే ఉంది నాయనా అవి అన్ని చెబితే అప్పు అడుక్కోవడం సిగ్గు గా ఉంటుంది బాబు ఇక చెప్పింది చాలు బాబు .నువ్వు కనిపించడం లేదు అనుకున్నాను ఇక్కడ చేరావా? ..కొంచెం మెల్లగా అడిగింది అరుణ తల్లి ..అవును అమ్మ గారు ..మా ఇంట్లో వాళ్ళు ఒకటే గోల చదివింది చాలు ..దీనిలో చేరితే ఒక దారి దొరుకుతుంది ..అని నాన్నగారు దీనిలో చేర్పించారు .. చెప్పుకుంటూ పోతున్నాడు శివనారాయణ .అక్కడ పని పూర్తికాగానే .బైట వరకు వచ్చి ఆమె ను గౌరవంగా సాగ నంపాడు ..ఇంటికి చేరుకున్న తల్లి బ్యాంక్ లో శివనారాయణ కనిపించిన విషయం తో సహా అన్ని విషయాలను మొత్తం వివరించి చెప్పింది ఎలా అయినా సరే ఇక ఒక రోజు వెళ్ళి శివనారాయణ ని కలవాలి అని నిర్ణయం తీసుకుంది ..అరుణకుమారి .
* * * *
తాను ప్రేమిస్తున్న ప్రియ ని ఎలాగైనా కలవాలి , కల్సి తన భగ్న ప్రేమ ను చెప్పాలని
కలలు కంటూ ప్రియ ఇంటికి వచ్చాడు కిరణ్ . కాలింగ్ బెల్ శబ్దం విని తలుపు తీసింది ప్రియ ..ప్రియ ..వచ్చి తలుపు తీసినందుకు లోలోపల పొంగి పోతున్నాడు కిరణ్ . సోఫా చూపించి కూర్చో ..అంటూ లోపలికి వెళ్ళిపోయి0ది ప్రియ .చాలాసేపు మౌనం ..పిలిచినా ఎవ్వరూ రావడం లేదు ..ఇక ఇంటి లోపల గది లోకి వెళ్ళాడు కిరణ్ ..అక్కడ పగలబడి నవ్వుతూ ఉన్న ప్రియ ఆమె బాయ్ ప్రెండ్ అనిల్ ఏవేవో జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ వున్నారు ..వెళ్లిపోతున్నవా సరే బై ..నేను అనిల్ కంబైన్ స్టడీ చేస్తున్నాం ..కొంచెం బిజీగా ఉన్నా ..అమ్మ నాన్న గారు ఎక్కడో కొంచెము దూరం వెళ్లారు .రాత్రి కూడా నేను ఒక్కదానినే వున్నా .అనిల్ రాత్రంతా తోడుగా. ఉండి కంపెనీ ఇచ్చాడు వాళ్ళు ఇంకా రాలేదు అంటూ ఆమె చెబుతున్నమాటలుపూర్తికాకుండానే వెనుతిరిగి రోడ్డు మార్గం పట్టాడు కిరణ్ .అస్సలు అప్పుడే కాలేజీ లో చూశా ను అనిల్ భాగోతం అప్పుడే కాలేజీ లో చూసినప్పుడే సగం అసహ్యం పుట్టింది ..అయునా నా లవర్ ..నా చుట్టం అది ..నాకు రైట్స్ ఉన్నాయి ..వీడుఎవడో ఎక్కడినుంచో వచ్చాడో చూస్తాను .వాడికి గుణపాఠం చెబుతాను ..హాస్టల్ కి చేరుకున్నాడు ..త్వర త్వర గా తయారై డాక్టర్ రమణ గారి దగ్గరకు చేరుకున్నాడు ..అనిల్ .......కొద్దిసేపు పేషంట్స్ తో బిజీగా వున్న డాక్టర్ రమణ బైటకు వచ్చాడు ..సార్ ..నమస్తే ..లేచి నిలుచున్నాడు ..కిరణ్ .మిమ్మల్ని కలవాలని వచ్చాను సార్ ..
{...... To be continued}. ....... ఇంకా ఉంది)
0 comments:
Post a Comment