[10/8, 11:06 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻ప్రచేతసులతో విష్ణువు ఇంకనూ ఇట్లనెను......మీకు రుద్రడు ఉపదేశించిన రుద్రగీత అనబడు స్తోత్రమును ఎవడు నిత్యమును అధ్యయనము చేయునో వాని అభీష్టములు అన్నియు సిద్ధించును. ప్రజ్ఞ శుభమైన మార్గమున వర్తించును. (కనుకనే వారి అభీష్టములు కోరదగినవిగా మాత్రమే ఉండుట, నెరవేరుట జరుగును).
మీరు సంతోషముతో తండ్రి ఆజ్ఞను స్వీకరించిరి కనుక మీ కీర్తి లోకములందు వ్యాపించును. (పంచేంద్రియములు తండ్రి నుండి కొడుకునకు ప్రసాదింపబడును. మరియు తండ్రి మాటను సుతుడు పాటించినచో ధర్మమార్గము ఏర్పడి నరుడు లోకమున కీర్తిమంతుడు అగును.)
మీకు పరబ్రహ్మముతో సమానమైన గుణములు గల పుత్రుడు ఉద్భవించును. (పరబ్రహ్మమునకు గుణములుండవు. అతని నుండి పుట్టినవాడును, అతని సృష్టికొరకై గుణములను పొందినవాడును చతుర్ముఖ బ్రహ్మ. వానితో సమానుడైన పుత్రుడు ఉద్భవించి బ్రహ్మవిద్యను అందించునని అర్థము. ఇచ్చట పదిమందికి ఒకడే పుత్రుడుగా వరము ఈయబడినది. అతడే మనస్సు. పిండాకారమగు జీవి యందు మెలగుచున్న చతుర్ముఖ బ్రహ్మయే జీవి మనస్సుగా సాక్షాత్కరించును. అది పుట్టుకచేత నిర్మలము, త్రిగుణాత్మకము, ఇంద్రియముల వలన వ్యక్తమగు అస్తిత్వము కలదియు అగును.) అతడు మీకు ఆత్మసంతతిగా జన్మించును. (దేహము పుట్టుట కాదనియు ఆత్మకు ప్రతిబింబమైన మనస్సు పుట్టుట అనియు భావము).
పూర్వము కండు అను మహాముని తపస్సు చేయుచండగా వాని తపస్సు భంగము చేయుటకై ఇంద్రుడు ప్రమ్లోచ అను అప్సరసను పంపెను. ఆమె అతని వలన గర్భము దాల్చి అతనిని విడిచి స్వర్గమునకు బయలుదేరుటకు ముందు పుత్రికను కనెను. ఆ బిడ్డను చెట్లలో వదలిపోయెను.......✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 909 (For more Information about Master E.K. Lectures please visit www.masterek.org)
0 comments:
Post a Comment