Pages

🌹 Mantra pushpam 🌹 మంత్రపుష్పము .....వాని అర్థము 🌹

                                      జై శ్రీమన్నారాయణ.. 

                                  🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మంత్రపుష్పము చడవని దేవాలయం ఉండదు .ఇక ఏ పూజలు కానీ యజ్ఞ యాగాదులుకాని, అర్చనలు కానీ   మంత్ర పుష్పం సమర్పించి ..అక్కడ తంతు ముగిస్తారు .  అటువంటి మంత్ర పుష్పం  గురించి అర్థం అందరూ తెలుసుకొని ఎంతో అనుభూతి గా ,ఆనందం గా చదుకోవచ్చు అనే సంకల్పం  ............


శ్రీరస్తు... శుభమస్తు ....మంత్రపుష్పము....శ్రీమతే రామానుజాయయైనమ:
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఓం ధాతా పురస్తా ద్యముదాజహార
       శక్ర:  ప్రవిద్వాన్ ప్రది శశ్చతస్త్ర:
       తమేవం విద్వా నమృత ఇహ భవతి
      నాన్య: ప0ధా అయనాయ విద్యతే

తా:-   పూర్వం పరమపురుషుడు ఈ మంత్ర పుష్పమును తయారుచేసెను. సకల       ప్రాణికోటిని  రక్షించే నిమిత్తం ఇంద్రుడు దీనిని నలు దిక్కులయందు వ్యాపింపచేసెను .ఆ పరమాత్మను ధ్యానించడం వల్ల అమృతత్త్వం లభిస్తుంది ఇది తప్ప మోక్ష ప్రాప్తికి వేరు మార్గం కనిపించదు
     సహస్ర శ్రీర్ష0  దేవ0 విశ్వాక్షం విశ్వశ0భువం
     విశ్వం నారాయణ0 దేవం అక్షరం పరమ్ పదమ్.                            1
తా:-  వేయు శిరస్సులు కలిగి ,అనేక నేత్రములతో ఉండి ప్రపంచమునకు  సుఖమునుచేకూర్చువాడూ ,సర్వవ్యాపకుడు ,సమస్త ప్రాణికోటికి ఆధార మైనవాడూ  ,శాశ్వతుడూ, శుభకరుడూ మోక్ష స్థానమైన వాడూ అయునటువంటి
నారాయణునకు నమస్కరించెదను ..
        విశ్వత:  పరమాన్నిత్యం  విశ్వం నారాయణగ్0  హరిమ్
        విశ్వ  మే వేదం పురుష  స్త దిశ్వ ముపజీపతి .                             2
       పతిమ్ విశ్వస్య ఆత్మేశ్వరగం శాశ్వతగమ్ శివమ్ అచ్యుతమ్
        నారాయణ0  మహాజ్ఞేయ0  విశ్వాత్మానం  పరాయణమ్              3

     తా:-  విశ్వానికి  అతీతుడూ ,విశ్వమే తానుగా అయిన  వాడు ,నిత్యుడూ  సర్వ వ్యాపకుడూ , విశ్వానికి   జీవనాధార మైనవాడూ .విశ్వపతి . విశ్వానికి .
  ఈశ్వరుడూ  ,శాశ్వ తుడూ ,మంగళ కరుడూ ,నాశనము లేనివాడు తెలుసుకొన  తగిన   పరమాత్ముడూ ,విశ్వాత్ముడూ  ,విశ్వాపరాయణుడూ  అయున నారాయణున కు నమస్కారము.
     నారాయణ పరో జ్యోతి రాత్మా  నారాయణః పరః
    నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ: పరః
      నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః                         4

తా:-   నారాయణుడే  పరం జ్యోతి ,పరమాత్మస్వరూపుడు ,అతడే పరబ్రహ్మ ,       పరతత్త్వము , ధ్యానం  చేసేవాడూ ,ధ్యానమూ కూడా ఆ నారాయణుడే

యచ్ఛకించి జ్జగ  త్సర్వం  దృశ్యతే శ్రూయతే ...పి   వా ,
అంత  ర్భిహి  శ్చ  త త్సర్వం  వ్యాప్య నారాయణస్స్థితః                          5
అనంత మన్యయం కవిగమ్ సముద్రే0తమ్ విశ్వశంభువమ్
పద్మ కోశ  ప్రతీకాశగ్0   హృదయం చాప్యధో ముఖం
తా:- బ్రహ్మ0డములో ఈ స్వల్పమైన జగత్తు మహాకాశములో వేరుగా అనిపిస్తూ
        ఘటా కాశం వలె  కనిపిస్తుంది. ఉనికి ని పొందుతుంది. దానికి బయటా ,లోపల  అంతటా నారాయణుడే వ్యాపించి వున్నాడు . అనంతుడు
వినాశనము  లేనివాడు  అయిన  ఈ దేవుడూ  సంసార సాగరం నుండి  విముక్తిని
ప్రసాదిస్తూ  ప్రపంచమునకు  సుఖము  కలిగిస్తాడు.

పద్మకోశ   ప్రతీకాశగ్0  హృదయం  చాప్యధో ముఖమ్                               6
కంఠమునకు  క్రింది భాగములో ,నాభికి పై భాగములో  ద్వాదశ అంగుళ
ప్రమాణం  కలిగి , అదోముఖముగా , ముకుళించి ఉన్న  పద్మాన్ని  పోలిన
  హృదయం ఉన్నది .                                                                          

అధో  నిష్ట్యా విత స్త్యా0తే  నాభ్యా  ముపరి  తిష్టతి ,              
జ్వాల మాలాకులం  భాతి  విస్వశ్యా యతనం  మహత్                               7
సంతతగ్0  శిలాభి  స్తు ల0బత్యాకో శ సన్నిభం
తస్యా0తే  సుషిరగం  సూక్ష్మం  తస్మిన్  త్సర్వం ప్రతిష్టితమ్.                           8
తస్య  మధ్యే  మహా నగ్ని  ర్విశ్వార్చి  ర్విశ్వతో  ముఖ:
సో ..గ్రభు  గ్విభజన్తిష్ఠ  న్నాహార మజర :  కవి :
తిర్యగూర్ధ్వ మధశ్శాయి ర శ్మయస్తస్య సంతతా.                                             9 

తా;-  ఆ  హృదయ  కమలాన్ని ఆశ్రయు0చి  ,జ్వాలా సమూహంతో వెలుగుతూ ,జీవులకు  ప్రధాన స్థానమై , అనేక నాడీ సమూహాలకు  ఆలంబనమై,అరవిరిసిన  పద్మాన్ని  పోలిన  హృదయ అగ్రభాగం లో
సూక్షమైన కమలం ఒకటి ఉన్నది . దానిలో సర్వం ప్రతిష్ఠితమై ఉన్నది .
దాని మధ్య లో అంతటా జ్వాలలు వ్యాపించు గొప్ప అగ్ని దేవుడు వున్నాడు
ఆ అగ్నియే.....కడుపులో ఉండి తిన్న పదార్థాలు అన్ని అరిగించే జఠరాగ్ని.     

సంతాపయతి  స్వం దేహ  మాపాదతలమస్తక:
తస్య  మధ్యే   వహ్ని  శిఖా అణియోర్ద్వా  వ్యవస్థిత:                                       10

తా:-- భుజించిన అన్నాన్ని ఆ అగ్ని సముచిత భాగాలుగా విభజించి పైకి ,క్రిందికి,
    అడ్డముగా వ్యాపించి ఉన్నది . ఆ అగ్ని కిరణాలు ఆ పాద మస్తకం వ్యాపించి  
    ఉన్నవి  . ఈ న్యాసం .చే.లేదా దీని కారణం వల్ల యోగ ధ్యానా దులు చేసేవారు
   మహా  తేజోవంతులు అవుతారు

  నీలతో యద మధ్యస్తా ద్విద్యుల్లే  ఖేవ  భాస్వరా ,
  నీ వార   శూక వత్తన్వీ  పీతా భాస్వత్యణూపమా .                                     11

తా:-ఈ జఠరాగ్ని  నడుమ సూక్ష్మమైన  అగ్నిశిఖ  ఊర్ధ్వముగా  పైకి ఎగయి చున్నది . అది నీల మేఘం మధ్య  మెరుపు వలె ప్రకాశించుచున్నది ..మెరిసే
ధాన్యపు ముల్లువలె సూక్ష్మమై ..అంటే వడ్లగింజ కొన లా సూక్ష్మమై  పచ్చని వన్నె
కలిగి  అది అణువు తో సమానమైనది .

తస్యా  శ్శిఖాయ మధ్యే పరమాత్మా వ్యవస్థిత:.
స బ్రహ్మ స  శివ స్స హరి స్సే న్ద్రస్సో ...క్షరం పరమస్స్వరాట్..                      12
ఆ అగ్ని శిఖ మధ్యలో  పరమాత్మ ఉంటాడు బ్రహ్మ ,శివుడు ,విష్ణువు ,ఇంద్రుడు ఎలా భావించినా ఆ పరమాత్మ యే ..నాశ రహితుడు ,మూలకారణం ,..స్వయం
ప్రకాశం  కలవాడు  ఆ పరమాత్మ యే.                                                       

యో ..పా0 పుష్ప  వేద ,పుష్పవాన్  ప్రజావాన్  పశుమాన్
భవతి,చంద్రమా వా అపా0  పుష్ప0 ,పుష్పవాన్
ప్రజావాన్ పశు మాన్ భవతి ,య ఏవం వేద                                                 13

తా:-  నీటిలో ..భగవంతుడు ...ఆ భగవంతుడిలో నీరు పరస్పరం ..ఆశ్రయాలై        వున్నట్లుగా   తెలుసుకున్న వారికి  పుష్పాలు ,సంతానం ,పశువులు లభించు చున్నవి .ఆ ఉదక  స్థాన వివరణ మెరిగినవారు ముక్తులవుతారు (..ఆది అంతం మొత్తం వ్యాపించినది భగవంతుడే అని జ్ఞానం తెలిస్తే అదే విముక్తి )

యో..పా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి ,
అగ్ని ర్వా అపా మాయతనం ,ఆయతనవాన్ భవతి
యో..గ్నే రాయతనం  వేద,ఆయతనవాన్ భవతి
ఆపో వా  అగ్నే రాయతనం ,ఆయతనవాన్ భవతి ,
య  ఏవం వేద .                                                                                    14
తా:- అగ్నిలో జలం, జలం లో అగ్ని  ,పరస్పర ఆశ్రయాలు, ఈ స్థితిని తెలిసిన వారు  ముక్తులవుతారు .
యో..పా  మాయతనం వేద ,ఆయతనవాన్ భవతి
వాయుర్వా  అ పామాయతనం ,ఆయతనవాన్  భవతి ,
యో వాయో రాయతనం వేద ,ఆయతనవాన్ భవతి
ఆపోవై వాయో రాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద                                                                                          15
తా:- వాయువు  జలమునకు స్థానం ..జలాలు వాయువునకు స్థానం . పరస్పర
ఆశ్రయాలైన వీటి స్థానాలు గ్రహించినవారు ముక్తిని పొందుతారు .....

యో.. పామాయతనం  వేద ,  ఆయతనవాన్  భవతి ,
అసోవై తపన్న పామాయతనం ,ఆయతనవాన్ భవతి
యో..ముష్యతపత ఆయతనం వేద ,ఆయతనవాన్ భవతి
అపోవా అముష్యతపత ఆయతనం ,ఆయతనవాన్ భవతి ,
య ఏవం వేద                                                                                           16
తా:-  తపింప చేస్తూన్న  ఈ సూర్యుడే  జలస్థానమునకు  అధినేత ,జలస్థానమే ఆదిత్యస్థానం  . వీటి పరస్పర  అభేద స్థితిని  తెలుసుకున్నవారు ముక్తు లవుతారు .
యో..పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి ,
చన్ద్రమా  వా అపా మాయతనం, ఆయతనవాన్ భవతి ,
యశ్చన్ద్ర మస  ఆయతనం వేద ,ఆయతనవాన్ భవతి
య ఏవం వేద                                                                                           17
                                                                  
తా:- జనులందరికి ..సంతోషాన్ని కలుగచేసే చంద్రుడే ..జలస్థానాధిపతి ..జలాలే చంద్రునికి స్థానం. ..ఈ విషయం గ్రహించిన వారు ముక్తులవుతారు.

యో...పామాయతనం  వేద ,ఆయతనవాన్ భవతి ,
నక్ష త్రాణివా  అపామాయత నం ,ఆయతనవాన్ భవతి
యో నక్షత్రాణామాయతన0 వేద, ఆయతనవాన్ భవతి ,
అపోవై నక్షత్రాణా మాయతనం ,ఆయతనవాన్ భవతి ,                              18
య ఏవం వేద
తా:- జలా లకు  నక్షత్రాలే స్తానం ..ఆ నక్షత్రాల  స్థితిని తెలుసుకొని ..నక్షత్రాలకు జలమే  స్థానమని గ్రహించిన వారు ముక్తులవుతారు ...........

యో..పా మాయతనం  వేద, ఆయతనవాన్ భవతి
పర్జన్యో  వా  అపామాయతనం,ఆయతనవాన్ భవతి
య: పర్జన్యస్యాయతనం  వేద ,ఆయతనవాన్ భవతి
అపో  వై పర్జన్యస్యాయతనం ,ఆయతనవాన్ భవతి
య  ఏవం. వేద .                                                                                  19
                                                                                                            
తా:-  నీటి స్థానమునకు  మేఘమే అధినేత . మేఘములకు ఆ నీరు లేక జలమే ,
స్థాన0   ఈ విషయం తెలుసుకున్నవారు ముక్తులవుతారు .

యో..పామాయతనం వేద ,ఆయతనవాన్ భవతి ,
సంవత్సరో వా  అపామాయతనం  ఆయతనవాన్  భవతి ,
య  స్సవంత్సరస్సాయతనం  వేద ,ఆయతనవాన్ భవతి ,
  య   ఏవ0 వేద .                                                                                 20

యో౨ప్సు నావం ప్రతిష్ఠి తాం వేద, ప్రత్యేవ తిష్ఠతి.                                   21

తా.   సంవత్సరమే ఉదకమునకు స్థానం.  ఉదకమే సంవత్సరమునకు స్థానం.  వీటికున్న అభేదమును తెలుసుకున్నవాడు ముక్తుడవుతాడు.  కాబట్టి యివి ఏ విధంగా అన్యోన్య ఆశ్రయంగా వున్నవో తెలుసుకొనవలెను.  అలా గ్రహించిన వారే ముక్తులు.  పడవకూ, నీటికీ ఎలా అన్యోన్యాశ్రయం వున్నదో, అలాగే దీనిని కూడా తెలిసికొనవలెను.

కిం తద్విష్ణోర్బల మాహు:,  కా దీప్తి: కింపరాయణం,
ఏకో యద్ధారాయ ద్దేవః, రేతసీ రోదసీ ఉభే.                                                22

తా.  ఐహికము, ఆముష్మికము అనే రెంటినీ స్వయం ప్రకాశమూర్తి ఐన భగవంతుడు ఒక్కడే లోకాన్ని ఎలా ధరించాడు?  ఆ విష్ణువు బలమేమిటి?  ఆయన ప్రకాశం ఎలాంటిది?  అతని పరంధామం ఏది?

వాతా ద్విష్ణో ర్భల మాహు:, అక్షరాద్దీప్తి రుచ్యతే,
త్రిపదా ద్దారయ ద్దేవః, యద్వి ష్ణో రేక ముత్తమమ్.                                   23

తా.  ప్రాణాయామాదులచేత  విష్ణువునకు బలం లభించింది.  నాశనం లేనివాడవటం చేత ప్రకాశం కలిగింది.  త్రిపదావిభూతి వలన లోకధారణ చేయగలిగాడు.  ఆయనకు విష్ణులోకం ఒక్కటే పరమపద స్థానం.

రాజాధి రాజాయ ప్రసహ్య సాహినే, నమోవయం వై
శ్రవణాయాకుర్మహే సమే కామన్ కామకామాయ
మహ్యం, కామేశ్వరో వై శ్రవణో దదాతు, కుబేరా
య వై శ్రవణాయ, మహారాజాయ నమః.                                     24
                                
తా:- రాజులందరికీ  రాజు అయున  భగవంతునికి నమస్కారం .కామములకు
       ప్రభువైన  ఆ దేవ దేవుడు  కోరిక లు అన్నింటిని  తీరుస్తున్నాడు .స్తోత్రాలు     
       వినడంలో  ఆసక్తి గలవాడూ ,బ్రహ్మా0డానికిఅధినేత అయిన                        శ్రీమన్నారాయణున కు నమస్కారం .

  ఓం తద్బ్రహ్మ్ , ఓం తద్వాయు , ఓం తదాత్మా,
   ఓం తత్సత్యo,  ఓం తత్సర్వం, ఓం తత్పురోo నమ:                     25
   అన్తశ్చరతి  భూతేషు  గుహాయాం విశ్వమూర్తిషు, త్వ0
యజ్ఞ స్త్వం  వషట్కార స్త్వ   మి న్ద్రస్త్వగ్0   రుద్రస్త్వం
విష్ణుస్త్వం  బ్రహ్మ త్త్వం  ప్రజాపతి,:                                                   26
  తా:-   ఓం  అనే  ప్రణవమే  బ్రహ్మ స్వరూపం. అదే వాయువు ,అదే ఆత్మ అదే సత్యము ,సర్వకారణ స్వరూపం ఇలా పలికి  దానికి  నమస్కరిస్తూవున్నారు. ఆ ప్రణవ  స్వరూపుడు  సకల భూతముల  హృదయాల లోను  నెలకొని ఉంటాడు .
పర్వత గుహ లో సంచరిస్తున్నాడు .విశ్వంమంతా వ్యాపించి ఉంటాడు .ఏ దేవా ! నువ్వు  యజ్ఞానివి ,నువ్వే వషట్కారమవు, ఇంద్రుడు  ,రుద్రుడు ,విష్ణువు ,బ్రహ్మ స్వరూపుడూ నువ్వే  ప్రజలను  పాలించే వాడవు నువ్వే !

త్వం తదాప ఆపోజ్యోతీ రసో...మృతం బ్రహ్మ  భూర్భువస్సువరోమ్      27

తా:--ఓ దేవా ! స్వయం ప్రకాశాత్మవి అయున  నువ్వే ఆపోజ్యోతివి .అమృత స్వరూపుడవు . రసరూపుడవు , బ్రహ్మరూపుడవు భూర్భువస్సువర్లోకాలలో  ప్రణవ స్వరూపుడవు నువ్వే

ఈశానస్సర్వ విద్యా నా  మీశ్వర స్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్
బ్రహ్మణో..ధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో మ్ .                          28

తా:- నువ్వు సర్వ విద్య లకు  అధిపతివి సమస్త భూతాధి పతివి. బ్రహ్మ లోకానికి ,బ్రహ్మానికి  అధినేతవు .బ్రహ్మ స్వరూపుడవు .శివుడవు .ఓం కారస్వరూపుడవు ,మాకు ఎల్లప్పుడూ శుభములను ప్రసాదించ వలయునని ప్రార్థిస్తూవున్నాము .

తద్విష్ణో  పరమం పదగమ్  సదా పశ్యన్తి సూరయ:
దివీన  చక్షు రాతతమ్ ....                                                                29
   
  తా:-  తత్వవేత్తలు  పరమ పదమైన  విష్ణులోకాన్ని  అంతరిక్షము లోని 
        నాటక దీపమువలే జ్ఞాన దృష్టిచేత ఎల్లప్పుడూ చూస్తున్నారు .

తద్విప్రాసో  విపన్వవో  జాగృదాం సస్సమిన్ద తే  విష్ణోర్య త్సరమం పదమ్ 30
తా:--పరమ పదమైన భగవంతుని  మోక్ష స్థానాన్ని  శ్రద్దాళువు లు పొందుతారు

         ఋతగమ్ సత్యం ,పరం బ్రహ్మ  పురుష0 కృష్ణ పింగళం ,
         ఊర్ధ్వరేత0  విరూపాక్షం  విశ్వరూపాయ  వై నమో నమ:                31

తా :-ఋత స్వరూపుడూ , సత్య స్వరూపుడూ, పరముడూ , బ్రహ్మస్వరూపుడూ,
         విశ్వా కారుడూ , విశ్వనేత్రుడూ ,ప్రపంచానికి సుఖం కలిగించేవాడు ,పింగళ వర్ణుడూ , ఊర్ధ్వరేతస్కుడూ , అయిన భగవంతునికి  నమస్కారం .

     నారాయణాయ విద్మహే  వాసుదేవాయ  ధీమహి ,
      తన్నో విష్ణు: ప్రచోదయాత్ .                                                              32

    తా:--    శ్రీమన్నారాయణుడు  సర్వ వ్యాప్తి అయిన  వాసుదేవుడు ..మహా విష్ణువు  మా బుద్దిని అపరోక్షానుభవ  (అంటే ప్రత్యక్షముగా ..సత్యముగా అని అనుకోవచ్చు) లాభ సిద్ధి యందు ప్రేరేపించును గాక ...ఇక్కడ లాభ సిద్ధి అంటే భగవంతుని అపారమైన దయ అని అర్థం చేసుకోవాలి ..అది ఉంటే అన్నీ మంచి
గొప్ప ప్రయోజనాలు సిద్ధిస్తాయకదా )
    ఇది నారాయణ గాయత్రీ మంత్రం . ఇక్కడ ఇతర దేవతా గాయత్రి మంత్రములను  ఆయా సందర్భానుసారం చెబుతూఉంటారు

    ఆకాశాత్పతితం  తోయం యథా గచ్ఛతి సాగరమ్
     సర్వదేవ నమస్కార: కేశవం  ప్రతి గచ్ఛతి .                                          33

తా:- ఆకాశం  నుండి పడిన నీరు సముద్రాన్ని చేరుతూవున్నట్లు  ఏ దేవునికి  నమస్కరించినా, ఆ నమస్కారం  కేశవుడు శ్రీమన్నారాయణు నికే చెందుతో0ది .
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
వేద పండితులు అయిన  అర్చక స్వాములు నుంచి తెలుసుకొని వ్రాశాను . మరి0గంటి మురళీ కృష్ణమాచార్యులు ....           జై శివనారాయణ......
                                                                        🌹🌹🌹🌹🌹🌹..
            





0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online