Pages

శ్రీమద్ భాగవతం చదువుకుందాం..భగవంతుని తెలుసుకుందాము

 🌸 *శ్రీమద్భాగవతము* 🌷🌷🌷🌷🌷🌷🌷

🌻 సంసార సాగరమును తరించుట ఎట్లు కలుగును? అని నమస్కరింపగా నారదుడు ఇట్లనెను: నరులకు జన్మము, కర్మము, ఆయుర్దాయము, మనస్సు, వాక్కు దేని కొరకు ఏర్పడినవి? అంతర్యామియైన నారాయణుని పరముగా అర్పించి జీవించుటకు. అట్లు భక్తి సమర్పణము చేసినపుడే ఈ సమస్తము సార్థకములు అగుచున్నవి. అట్టి జన్మమే జన్మము. అది లేని జన్మము గాని, ఉపనయన దీక్ష మొదలగు కర్మములు గాని, దీర్ఘాయువు గాని ఎందులకు? వేదోక్త‌ కర్మలు గూడ ఎందులకు? జపము, తపము, పాండిత్యము, సంభాషణలు మాత్రము ఎందులకు? అనేక విషయముల యందు శ్రద్ధ ఉండి మాత్రమేమి లాభము? 


(ఉపనయనమనగా గురువునకు అప్పజెప్పుట. గురువులో అంతర్యామిని చూడనప్పుడు ఉపనయనమేల? ఆయుర్దాయము భగవదర్పితము కానపుడు దానికి వేరుగా స్వార్థమైన ఫలితము ఉండదు. స్వార్థము భ్రాంతియే గాని ప్రయోజనము కాదు. వేదమందు చెప్పబడిన కర్మలు చేయుచున్నను వాని యందు అంతర్యామి కన్నా వేరైన ప్రాధాన్యము కల్పింపబడినపుడు అజ్ఞానమే. 


అట్లే జపము, తపము, పాండిత్యము కూడ. వాక్కుల ప్రయోగము కూడా అట్లే. కనుకనే అట్టివారు వేదోక్త కర్మలు ఆచరించుచు కూడా తాము కోరిన ఫలితములనే ఆశించుచున్నారు. జపతపాదులలో గూడ తమ గొప్పదనము మాత్రమే స్థాపించుకొనుచున్నారు. వాక్కులను గూడ పండితవాదములకు, సిగపట్లు పట్టుకొనుటకు వినియోగించుచున్నారు.).....✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 952(For more Information about Master E.K. Lectures please visit www.masterek.org, for regular updates and Messages of Master E.K. join

https://t.me/masterchannel12 )

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online