Pages

🌷Jammichettu history 🌷🌷🌷🌷 🌷🌷🌷జమ్మిచెట్టు చరితం 🌷🌷🌷🌷🌷🌷🌷

 పాండవులు ఆయుధాలు జమ్మి పైనే ఎందుకు దాచారు?

ముస్లింల ఆధీనంలో ఉన్న బహ్రేయిన్ దేశంలోని భయంకరమైన ఎడారిలో ఒక జమ్మి చెట్టు ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని చూడడానికి ప్రతీ ఏడాది దాదాపు 50 వేల మంది పర్యాటకులు వస్తున్నారు. దీని వయసు 400 ఏళ్ల పై మాటే. ఏ ప్రాణీ బ్రతికే అవకాశంలేని ఎడారిలో ఈ ఒక్క చెట్టే నిలిచి ఉంది. ఇది ప్రకృతిలోనే అరుదైన వింతల్లో ఒకటి. ఇది ఎలా నిలిచి ఉందో నేటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వారికి తెలిసిన విషయం ఒక్కటే షజరత్ అల్ హయత్ అని పిలిచే ఈ చెట్టు భూమిలో కిలోమీటర్ల కొద్దీ వేళ్లు పంపి నీరు సేకరిస్తోందని తేల్చారు. అంతేకాదు దీని ఆకులు వాతావరణంలో ఉండే కొద్ది పాటి తేమ కూడా సేకరిస్తుందని అంటున్నారు. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సైసిజెరా. వైదిక భాషలో శమీ వృక్షాన్ని 'అరణీ' అనే పేరుతో పిలుస్తారు. అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరంచే మధింప యోగ్యమైన దారువని "ఆరణి' అని అర్ధం. అందుకే పూర్వకాలం నుండి శమీవృక్షం పూజనీయమైంది.

జమ్మి చెట్టు ఎంత దుర్భర పరిస్థితుల్లో అయినా జీవించగలదని చెప్పడానికి ఇదే సజీవతార్కాణంగా ఘోరమైన ఎడారిలో నిలిచింది.జమ్మిచెట్టు హిందువులకే కాక మహ్మదీయులకు కూడా ప్రాణప్రదమైన చెట్టు. అరబ్బు ఎమిరేట్ల దేశానికి జమ్మిచెట్టు జాతీయ వృక్షం. రాజస్థాన్ రాష్ట్రవృక్షం కూడా జమ్మిచెట్టే.

జమ్మిచెట్టు వేదకాలం నాటి నుంచీ పరమ పూజ్యమైన వృక్షం. దీనికి ఉన్న ప్రాధాన్యత హిందూధర్మంలో మరో చెట్టుకులేదు. ఇందులో అగ్ని దాగి ఉందని సనాతనుల నమ్మకం. ఇది స్త్రీతత్త్వానికి చెందింది. రావి చెట్టు పురుషతత్త్వాని చెందిన అగ్నితత్త్వ వృక్షం. పూర్వం ఈ రెండింటినీ రాపాడించి అగ్నిని సృష్టించేవారు. వీటి పుల్లలు కూడా సమిధలుగా యజ్ఞయాగాది క్రతువులలో వాడేవారు.

రామాయణంలో కూడా శమీ వృక్షప్రస్తావన ఉంది. రాముడు కూడా అర్చించాడని కొందరు చెబుతుంటారు. పాండవులు దీన్ని ఆరాధించారనడంలో ఎటువంటి సందేహంలేదు. వీరులకు అతి ముఖ్యమైంది ప్రాణం కన్నా ఆయుధం. నిజమైన వీరుడు తన ఆయుధాన్ని వీడి ఉండడు. అలాగే నేలమీద కూడా పెట్టడు. దానికి అనేక కారణాలు ఉంటాయి. వీరుడి స్పర్శతగిలితే ఆయుధంలోకి చేతనత్వం ప్రవేశిస్తుంది. దాని వల్ల ఆ ఆయుధం మహాశక్తిమంతమవుతుంది. ఒక సారి ఆయుధాన్ని చేత పట్టాక దాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టరు. అలా పెడితే ఆయుధంలో చేరిన వీరుని శక్తి భూమి లాగేసుకుంటుంది. భూమికి ఆ విధమైన ఆకర్షణ శక్తి ఉంది. కనుకనే నేటికీ ఆధునిక సైనికులు కూడా నేల మీద ఆయుధాన్ని పెట్టరు. అంతేకాదు నేల వైపు ఆయుధాన్ని చూపరు కూడా. కేవలం మహామహులు చనిపోయినప్పుడు మాత్రమే ఆయుధాన్ని నేలవైపు చూపుతారు అంతే.

ఈ నేపథ్యంలో పాండవులు వనవాసం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళే టప్పుడు తమ ఆయుధాలు ఎక్కడ ఉంచాలి అనే సంశయం కలిగింది. ఎందుకంటే అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలు తమతోనే ఉంచుకుంటే వాటి కారణంగా తాము దొరికిపోయే అవకాశం ఉంది. అందులోనూ అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడి ఆయుధాలు దైవదత్తాలు. అవి చూడగానే ఇట్టే అవి భూమి మీద తయారైనవి కాదని తెలిసిపోయే అవకాశం ఉంది. కనుక తప్పని సరి పరిస్థితుల్లో వీటిని ఎక్కడైనా దాచాలి. ఎక్కడ దాచాలి అనేది ప్రశ్న వచ్చింది.

దీనికి అర్జునుడు ముందుగా సర్వేచేసి ఒక శ్మశానాన్ని నిర్ణయిస్తాడు. దాని పక్కనే ఉన్న అతిపెద్దశాఖలు ఉన్న జమ్మిచెట్టు ఎంచుకుంటాడు. దైవదత్తమైన ఆయుధాలు మోయాలంటే అది దైవవృక్షమే అవ్వాలి. కనుక దాన్ని ఎంచుకుంటాడు.

నిజానికి అర్జునుడు కూడా గాండీవాన్ని ఎత్తలేడు. కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల దాన్ని ప్రయోగించగలుగుతాడు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన వెంటనే అర్జునుడు గాండీవాన్ని ప్రయోగించి బాణాలు వేయలేక కిరాకులతో గాండీవంతో కర్రసాము చేస్తూ యుద్దం చేయబోతాడు. వారు అర్జునుడ్ని చిన్నపిల్లాడిని గెలిచినట్టు గెలిచి యాదవ కాంతల్ని ఎత్తుకుపోతారు. కనుక అంత మహిమ ఉన్న ఆయుధాలు మోయాలంటే తప్పనిసరిగా అది దివ్యవృక్షమే అయిఉండాలి.

సరే ఇక్కడ మరో ప్రశ్న రావాలి. చెట్టుమీదే ఎందుకు పెట్టాలి? దీనికి కారణం ముందే చెప్పుకున్నాము. భూమి మీద ఆయుధాలు ఉంచరాదు. అంతేకాదు. అరణ్యంలో భూమి మీద ఆయుధాలు ఉంచితే పందులు పందికొక్కులు వంటివి తవ్వి వాటిని బయటకు తీసే ప్రమాదం ఉంది. వర్షం పడినప్పుడు భూమి పీల్చుకునే నీరు ఆయుధాలను ఏడాది పాటు నష్టపరచవచ్చు. కనుక భూమి మీద పెట్టలేరు, భూమి లోపలా పెట్టలేరు. కనుకనే చెట్టుపై పెట్టాల్సివచ్చింది.

ఒక జమ్మిచెట్టులో అగ్ని తత్త్వం ఉండడం వలన దానికి ఆయుధాలలోని అగ్నితత్త్వానికీ మిత్రత్త్త్వం కుదురుతుంది. జమ్మికి ఉన్న మరో ముఖ్య లక్షణం అది ఏ వాతావరణంలో అయినా తన పచ్చదనం కోల్పోదు. మిగిలిన చెట్లు అలా కాదు. వాతావరణ ప్రభావానికి త్వరగా లోనై మోడు కావడం జరుగుతుంది.

మరో ముఖ్యవిషయం ఏమిటంటే జమ్మిచెట్టు దాదాపుగా అడవుల్లో చాలా ఎత్తుగా ఉంటాయి. వాటిని ఎక్కడానికి వీలు లేకుండా ఉంటాయి. ఇది కేవలం జంతు, వృక్షశాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. ఎందుకంటే జమ్మి చెట్టును తినని శాకాహార జంతువు చాలా అరుదు. గడ్డితినే అన్ని జంతువులు జమ్మిని తింటాయి. కనుక జమ్మిని ఏ జంతువుకా జంతువు అందినంత తినేస్తే ఎవరికీ అందనంత ఎత్తున అది పెరుగుతుంది. అంటే ఒంటెలూ జిరాఫీలు వంటివి కూడా తినేయగా వాటికి కూడా అందనంత ఎత్తుగా మాను పెరుగి అక్కడ నుంచీ పెరిగిన కొమ్మలే చెట్టుకు నిలుస్తాయి. అదే మాట అర్జునుడు కూడా అంటాడు. తాను చూసిన జమ్మిచెట్టు మానవులు, జంతువులు ఎక్కడానికి అతికష్టమైనది అని దానికి ఉన్న మరో లక్షణం చెబుతాడు (భీమశాఖా దురారోహా శ్మశానస్య సమీపతః).

ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే అది అందరికీ పూజనీయమైన చెట్టే అయినా శ్మశానం పక్కనే ఉంది కనుక ఎక్కువ మంది తరచూ పూజించరు. బ్రతికి ఉన్నవాడు శ్మశానానికి వెళ్ళడానికి ఇష్టపడడు. చచ్చినవాడు చేటు చేసే అవకాశం లేదు. ఇదికాక పల్లెకార్ల మనస్తత్త్వం అర్జునుడు చాలా బాగా పట్టాడు. నేటికీ వేపమొక్కలు పెరిగే దశలో ఉన్నప్పుడు దానికి ఒక చెప్పు వేళ్ళాడు దీస్తారు. చెప్పు అవమానకరమైంది. బుద్దిఉన్న వాడు ఎవడూ ఒకడి కాలి చెప్పు వేళ్ళాడుతున్న చెట్టు కొమ్మ విరిచి నోట్లో పెట్టుకోడు. నేటికీ నిలిచి ఉన్న ఇటువంటి పౌరుషాన్ని అర్జునుడు ఆనాడు వాడాడు.

ఆయుధాలు అన్నీ ఒక శవం ఆకారంలో మూటగట్టి చెట్టుపై పెట్టించాడు. మూటలోకి నీటి చుక్క కూడా జారకుండా కట్టారు. ఎప్పుడైతే చెట్టు మీద శవం ఉందో ఆ చెట్టును ఎవరూ నరికే అవకాశంలేదు. అందులోనూ దానికి శవం నుంచీ వచ్చే వాసనలు వెదజల్లే ఏర్పాటు కూడా చేశారు. ఇది చాలదన్నట్లు అది తమ తల్లి శవం అనీ తమ ఆచారం ప్రకారం శవాన్ని చెట్టుమీద ఉంచాలని ప్రచారం చేశారు.

(ఆబద్ధం శవమత్రేతి గంధమాఘ్రాయ పూతికం |,

అశీతిశతవర్షేయం మాతా న ఇతి వాదినః |

కులధర్మోఽయమస్మాకం పూర్వైరాచరితోఽపి చ)

పూర్వం ప్రాణం ఉన్న మనిషికి ఇచ్చిన గౌరవం చనిపోయిన శవానికి కూడా ఇచ్చేవారు. కనుక ఎవరూ శవం ఉన్న చెట్టు మీద అనుమానం వచ్చే అవకాశం లేదు. పైగా అది జనులు తిరిగేది కాదు. వారికి కనపడే విధంగా లేదు. చాలా మరుగు ప్రదేశంలో ఉంది. అటువంటి చెట్టు మీద దివ్యమైన ఆయుధాలు ఏడాదిపాటు భరించే శక్తి ఉండి, విరిగిపోని కొమ్మల మీద నకులుడు చెట్టు ఎక్కి, ఆయుధాలు పెట్టి కట్టి వచ్చాడు

(తాముపారుహ్య నకులో ధనూంషి నిదధత్స్వయం,

యత్ర చాపశ్యత స వై తిరో వర్షాణి వర్షతి |

తత్ర తాని దృఢైః పాశైః సుగాఢం పర్యబంధత).

జమ్మిచెట్టే ఎంచుకోవడానికి మరో కారణం ఉత్తరాదిలో జమ్మిని కలప కోసం నరకరు. అది ప్రకృతి సహజంగా మరణించిన తరువాతే కలప సేకరిస్తారు. మరో విచిత్రమైన అంశంమేమంటే అది పొలం మధ్యలో పుట్టినా దాన్ని కదల్చరు. అలాగే పెరగనిస్తారు. నేటికీ ఆచరించే మరో విశేషం ఏమిటంటే జమ్మి కలప ఉపయోగించి మంచం తయారు చేసి దానిమీద శయనించరు.

మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు

మరి ఇన్ని విశిష్ఠతలు ఉన్న జమ్మిచెట్టు ఎందుకు మాయం అవుతోంది?                       

రచయిత గారి పేరు తెలియలేదు

          ...( సేకరణ .....)

🌹 Mantra pushpam 🌹 మంత్రపుష్పము .....వాని అర్థము 🌹

                                      జై శ్రీమన్నారాయణ.. 

                                  🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మంత్రపుష్పము చడవని దేవాలయం ఉండదు .ఇక ఏ పూజలు కానీ యజ్ఞ యాగాదులుకాని, అర్చనలు కానీ   మంత్ర పుష్పం సమర్పించి ..అక్కడ తంతు ముగిస్తారు .  అటువంటి మంత్ర పుష్పం  గురించి అర్థం అందరూ తెలుసుకొని ఎంతో అనుభూతి గా ,ఆనందం గా చదుకోవచ్చు అనే సంకల్పం  ............


శ్రీరస్తు... శుభమస్తు ....మంత్రపుష్పము....శ్రీమతే రామానుజాయయైనమ:
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఓం ధాతా పురస్తా ద్యముదాజహార
       శక్ర:  ప్రవిద్వాన్ ప్రది శశ్చతస్త్ర:
       తమేవం విద్వా నమృత ఇహ భవతి
      నాన్య: ప0ధా అయనాయ విద్యతే

తా:-   పూర్వం పరమపురుషుడు ఈ మంత్ర పుష్పమును తయారుచేసెను. సకల       ప్రాణికోటిని  రక్షించే నిమిత్తం ఇంద్రుడు దీనిని నలు దిక్కులయందు వ్యాపింపచేసెను .ఆ పరమాత్మను ధ్యానించడం వల్ల అమృతత్త్వం లభిస్తుంది ఇది తప్ప మోక్ష ప్రాప్తికి వేరు మార్గం కనిపించదు
     సహస్ర శ్రీర్ష0  దేవ0 విశ్వాక్షం విశ్వశ0భువం
     విశ్వం నారాయణ0 దేవం అక్షరం పరమ్ పదమ్.                            1
తా:-  వేయు శిరస్సులు కలిగి ,అనేక నేత్రములతో ఉండి ప్రపంచమునకు  సుఖమునుచేకూర్చువాడూ ,సర్వవ్యాపకుడు ,సమస్త ప్రాణికోటికి ఆధార మైనవాడూ  ,శాశ్వతుడూ, శుభకరుడూ మోక్ష స్థానమైన వాడూ అయునటువంటి
నారాయణునకు నమస్కరించెదను ..
        విశ్వత:  పరమాన్నిత్యం  విశ్వం నారాయణగ్0  హరిమ్
        విశ్వ  మే వేదం పురుష  స్త దిశ్వ ముపజీపతి .                             2
       పతిమ్ విశ్వస్య ఆత్మేశ్వరగం శాశ్వతగమ్ శివమ్ అచ్యుతమ్
        నారాయణ0  మహాజ్ఞేయ0  విశ్వాత్మానం  పరాయణమ్              3

     తా:-  విశ్వానికి  అతీతుడూ ,విశ్వమే తానుగా అయిన  వాడు ,నిత్యుడూ  సర్వ వ్యాపకుడూ , విశ్వానికి   జీవనాధార మైనవాడూ .విశ్వపతి . విశ్వానికి .
  ఈశ్వరుడూ  ,శాశ్వ తుడూ ,మంగళ కరుడూ ,నాశనము లేనివాడు తెలుసుకొన  తగిన   పరమాత్ముడూ ,విశ్వాత్ముడూ  ,విశ్వాపరాయణుడూ  అయున నారాయణున కు నమస్కారము.
     నారాయణ పరో జ్యోతి రాత్మా  నారాయణః పరః
    నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ: పరః
      నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః                         4

తా:-   నారాయణుడే  పరం జ్యోతి ,పరమాత్మస్వరూపుడు ,అతడే పరబ్రహ్మ ,       పరతత్త్వము , ధ్యానం  చేసేవాడూ ,ధ్యానమూ కూడా ఆ నారాయణుడే

యచ్ఛకించి జ్జగ  త్సర్వం  దృశ్యతే శ్రూయతే ...పి   వా ,
అంత  ర్భిహి  శ్చ  త త్సర్వం  వ్యాప్య నారాయణస్స్థితః                          5
అనంత మన్యయం కవిగమ్ సముద్రే0తమ్ విశ్వశంభువమ్
పద్మ కోశ  ప్రతీకాశగ్0   హృదయం చాప్యధో ముఖం
తా:- బ్రహ్మ0డములో ఈ స్వల్పమైన జగత్తు మహాకాశములో వేరుగా అనిపిస్తూ
        ఘటా కాశం వలె  కనిపిస్తుంది. ఉనికి ని పొందుతుంది. దానికి బయటా ,లోపల  అంతటా నారాయణుడే వ్యాపించి వున్నాడు . అనంతుడు
వినాశనము  లేనివాడు  అయిన  ఈ దేవుడూ  సంసార సాగరం నుండి  విముక్తిని
ప్రసాదిస్తూ  ప్రపంచమునకు  సుఖము  కలిగిస్తాడు.

పద్మకోశ   ప్రతీకాశగ్0  హృదయం  చాప్యధో ముఖమ్                               6
కంఠమునకు  క్రింది భాగములో ,నాభికి పై భాగములో  ద్వాదశ అంగుళ
ప్రమాణం  కలిగి , అదోముఖముగా , ముకుళించి ఉన్న  పద్మాన్ని  పోలిన
  హృదయం ఉన్నది .                                                                          

అధో  నిష్ట్యా విత స్త్యా0తే  నాభ్యా  ముపరి  తిష్టతి ,              
జ్వాల మాలాకులం  భాతి  విస్వశ్యా యతనం  మహత్                               7
సంతతగ్0  శిలాభి  స్తు ల0బత్యాకో శ సన్నిభం
తస్యా0తే  సుషిరగం  సూక్ష్మం  తస్మిన్  త్సర్వం ప్రతిష్టితమ్.                           8
తస్య  మధ్యే  మహా నగ్ని  ర్విశ్వార్చి  ర్విశ్వతో  ముఖ:
సో ..గ్రభు  గ్విభజన్తిష్ఠ  న్నాహార మజర :  కవి :
తిర్యగూర్ధ్వ మధశ్శాయి ర శ్మయస్తస్య సంతతా.                                             9 

తా;-  ఆ  హృదయ  కమలాన్ని ఆశ్రయు0చి  ,జ్వాలా సమూహంతో వెలుగుతూ ,జీవులకు  ప్రధాన స్థానమై , అనేక నాడీ సమూహాలకు  ఆలంబనమై,అరవిరిసిన  పద్మాన్ని  పోలిన  హృదయ అగ్రభాగం లో
సూక్షమైన కమలం ఒకటి ఉన్నది . దానిలో సర్వం ప్రతిష్ఠితమై ఉన్నది .
దాని మధ్య లో అంతటా జ్వాలలు వ్యాపించు గొప్ప అగ్ని దేవుడు వున్నాడు
ఆ అగ్నియే.....కడుపులో ఉండి తిన్న పదార్థాలు అన్ని అరిగించే జఠరాగ్ని.     

సంతాపయతి  స్వం దేహ  మాపాదతలమస్తక:
తస్య  మధ్యే   వహ్ని  శిఖా అణియోర్ద్వా  వ్యవస్థిత:                                       10

తా:-- భుజించిన అన్నాన్ని ఆ అగ్ని సముచిత భాగాలుగా విభజించి పైకి ,క్రిందికి,
    అడ్డముగా వ్యాపించి ఉన్నది . ఆ అగ్ని కిరణాలు ఆ పాద మస్తకం వ్యాపించి  
    ఉన్నవి  . ఈ న్యాసం .చే.లేదా దీని కారణం వల్ల యోగ ధ్యానా దులు చేసేవారు
   మహా  తేజోవంతులు అవుతారు

  నీలతో యద మధ్యస్తా ద్విద్యుల్లే  ఖేవ  భాస్వరా ,
  నీ వార   శూక వత్తన్వీ  పీతా భాస్వత్యణూపమా .                                     11

తా:-ఈ జఠరాగ్ని  నడుమ సూక్ష్మమైన  అగ్నిశిఖ  ఊర్ధ్వముగా  పైకి ఎగయి చున్నది . అది నీల మేఘం మధ్య  మెరుపు వలె ప్రకాశించుచున్నది ..మెరిసే
ధాన్యపు ముల్లువలె సూక్ష్మమై ..అంటే వడ్లగింజ కొన లా సూక్ష్మమై  పచ్చని వన్నె
కలిగి  అది అణువు తో సమానమైనది .

తస్యా  శ్శిఖాయ మధ్యే పరమాత్మా వ్యవస్థిత:.
స బ్రహ్మ స  శివ స్స హరి స్సే న్ద్రస్సో ...క్షరం పరమస్స్వరాట్..                      12
ఆ అగ్ని శిఖ మధ్యలో  పరమాత్మ ఉంటాడు బ్రహ్మ ,శివుడు ,విష్ణువు ,ఇంద్రుడు ఎలా భావించినా ఆ పరమాత్మ యే ..నాశ రహితుడు ,మూలకారణం ,..స్వయం
ప్రకాశం  కలవాడు  ఆ పరమాత్మ యే.                                                       

యో ..పా0 పుష్ప  వేద ,పుష్పవాన్  ప్రజావాన్  పశుమాన్
భవతి,చంద్రమా వా అపా0  పుష్ప0 ,పుష్పవాన్
ప్రజావాన్ పశు మాన్ భవతి ,య ఏవం వేద                                                 13

తా:-  నీటిలో ..భగవంతుడు ...ఆ భగవంతుడిలో నీరు పరస్పరం ..ఆశ్రయాలై        వున్నట్లుగా   తెలుసుకున్న వారికి  పుష్పాలు ,సంతానం ,పశువులు లభించు చున్నవి .ఆ ఉదక  స్థాన వివరణ మెరిగినవారు ముక్తులవుతారు (..ఆది అంతం మొత్తం వ్యాపించినది భగవంతుడే అని జ్ఞానం తెలిస్తే అదే విముక్తి )

యో..పా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి ,
అగ్ని ర్వా అపా మాయతనం ,ఆయతనవాన్ భవతి
యో..గ్నే రాయతనం  వేద,ఆయతనవాన్ భవతి
ఆపో వా  అగ్నే రాయతనం ,ఆయతనవాన్ భవతి ,
య  ఏవం వేద .                                                                                    14
తా:- అగ్నిలో జలం, జలం లో అగ్ని  ,పరస్పర ఆశ్రయాలు, ఈ స్థితిని తెలిసిన వారు  ముక్తులవుతారు .
యో..పా  మాయతనం వేద ,ఆయతనవాన్ భవతి
వాయుర్వా  అ పామాయతనం ,ఆయతనవాన్  భవతి ,
యో వాయో రాయతనం వేద ,ఆయతనవాన్ భవతి
ఆపోవై వాయో రాయతనం, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద                                                                                          15
తా:- వాయువు  జలమునకు స్థానం ..జలాలు వాయువునకు స్థానం . పరస్పర
ఆశ్రయాలైన వీటి స్థానాలు గ్రహించినవారు ముక్తిని పొందుతారు .....

యో.. పామాయతనం  వేద ,  ఆయతనవాన్  భవతి ,
అసోవై తపన్న పామాయతనం ,ఆయతనవాన్ భవతి
యో..ముష్యతపత ఆయతనం వేద ,ఆయతనవాన్ భవతి
అపోవా అముష్యతపత ఆయతనం ,ఆయతనవాన్ భవతి ,
య ఏవం వేద                                                                                           16
తా:-  తపింప చేస్తూన్న  ఈ సూర్యుడే  జలస్థానమునకు  అధినేత ,జలస్థానమే ఆదిత్యస్థానం  . వీటి పరస్పర  అభేద స్థితిని  తెలుసుకున్నవారు ముక్తు లవుతారు .
యో..పామాయతనం వేద, ఆయతనవాన్ భవతి ,
చన్ద్రమా  వా అపా మాయతనం, ఆయతనవాన్ భవతి ,
యశ్చన్ద్ర మస  ఆయతనం వేద ,ఆయతనవాన్ భవతి
య ఏవం వేద                                                                                           17
                                                                  
తా:- జనులందరికి ..సంతోషాన్ని కలుగచేసే చంద్రుడే ..జలస్థానాధిపతి ..జలాలే చంద్రునికి స్థానం. ..ఈ విషయం గ్రహించిన వారు ముక్తులవుతారు.

యో...పామాయతనం  వేద ,ఆయతనవాన్ భవతి ,
నక్ష త్రాణివా  అపామాయత నం ,ఆయతనవాన్ భవతి
యో నక్షత్రాణామాయతన0 వేద, ఆయతనవాన్ భవతి ,
అపోవై నక్షత్రాణా మాయతనం ,ఆయతనవాన్ భవతి ,                              18
య ఏవం వేద
తా:- జలా లకు  నక్షత్రాలే స్తానం ..ఆ నక్షత్రాల  స్థితిని తెలుసుకొని ..నక్షత్రాలకు జలమే  స్థానమని గ్రహించిన వారు ముక్తులవుతారు ...........

యో..పా మాయతనం  వేద, ఆయతనవాన్ భవతి
పర్జన్యో  వా  అపామాయతనం,ఆయతనవాన్ భవతి
య: పర్జన్యస్యాయతనం  వేద ,ఆయతనవాన్ భవతి
అపో  వై పర్జన్యస్యాయతనం ,ఆయతనవాన్ భవతి
య  ఏవం. వేద .                                                                                  19
                                                                                                            
తా:-  నీటి స్థానమునకు  మేఘమే అధినేత . మేఘములకు ఆ నీరు లేక జలమే ,
స్థాన0   ఈ విషయం తెలుసుకున్నవారు ముక్తులవుతారు .

యో..పామాయతనం వేద ,ఆయతనవాన్ భవతి ,
సంవత్సరో వా  అపామాయతనం  ఆయతనవాన్  భవతి ,
య  స్సవంత్సరస్సాయతనం  వేద ,ఆయతనవాన్ భవతి ,
  య   ఏవ0 వేద .                                                                                 20

యో౨ప్సు నావం ప్రతిష్ఠి తాం వేద, ప్రత్యేవ తిష్ఠతి.                                   21

తా.   సంవత్సరమే ఉదకమునకు స్థానం.  ఉదకమే సంవత్సరమునకు స్థానం.  వీటికున్న అభేదమును తెలుసుకున్నవాడు ముక్తుడవుతాడు.  కాబట్టి యివి ఏ విధంగా అన్యోన్య ఆశ్రయంగా వున్నవో తెలుసుకొనవలెను.  అలా గ్రహించిన వారే ముక్తులు.  పడవకూ, నీటికీ ఎలా అన్యోన్యాశ్రయం వున్నదో, అలాగే దీనిని కూడా తెలిసికొనవలెను.

కిం తద్విష్ణోర్బల మాహు:,  కా దీప్తి: కింపరాయణం,
ఏకో యద్ధారాయ ద్దేవః, రేతసీ రోదసీ ఉభే.                                                22

తా.  ఐహికము, ఆముష్మికము అనే రెంటినీ స్వయం ప్రకాశమూర్తి ఐన భగవంతుడు ఒక్కడే లోకాన్ని ఎలా ధరించాడు?  ఆ విష్ణువు బలమేమిటి?  ఆయన ప్రకాశం ఎలాంటిది?  అతని పరంధామం ఏది?

వాతా ద్విష్ణో ర్భల మాహు:, అక్షరాద్దీప్తి రుచ్యతే,
త్రిపదా ద్దారయ ద్దేవః, యద్వి ష్ణో రేక ముత్తమమ్.                                   23

తా.  ప్రాణాయామాదులచేత  విష్ణువునకు బలం లభించింది.  నాశనం లేనివాడవటం చేత ప్రకాశం కలిగింది.  త్రిపదావిభూతి వలన లోకధారణ చేయగలిగాడు.  ఆయనకు విష్ణులోకం ఒక్కటే పరమపద స్థానం.

రాజాధి రాజాయ ప్రసహ్య సాహినే, నమోవయం వై
శ్రవణాయాకుర్మహే సమే కామన్ కామకామాయ
మహ్యం, కామేశ్వరో వై శ్రవణో దదాతు, కుబేరా
య వై శ్రవణాయ, మహారాజాయ నమః.                                     24
                                
తా:- రాజులందరికీ  రాజు అయున  భగవంతునికి నమస్కారం .కామములకు
       ప్రభువైన  ఆ దేవ దేవుడు  కోరిక లు అన్నింటిని  తీరుస్తున్నాడు .స్తోత్రాలు     
       వినడంలో  ఆసక్తి గలవాడూ ,బ్రహ్మా0డానికిఅధినేత అయిన                        శ్రీమన్నారాయణున కు నమస్కారం .

  ఓం తద్బ్రహ్మ్ , ఓం తద్వాయు , ఓం తదాత్మా,
   ఓం తత్సత్యo,  ఓం తత్సర్వం, ఓం తత్పురోo నమ:                     25
   అన్తశ్చరతి  భూతేషు  గుహాయాం విశ్వమూర్తిషు, త్వ0
యజ్ఞ స్త్వం  వషట్కార స్త్వ   మి న్ద్రస్త్వగ్0   రుద్రస్త్వం
విష్ణుస్త్వం  బ్రహ్మ త్త్వం  ప్రజాపతి,:                                                   26
  తా:-   ఓం  అనే  ప్రణవమే  బ్రహ్మ స్వరూపం. అదే వాయువు ,అదే ఆత్మ అదే సత్యము ,సర్వకారణ స్వరూపం ఇలా పలికి  దానికి  నమస్కరిస్తూవున్నారు. ఆ ప్రణవ  స్వరూపుడు  సకల భూతముల  హృదయాల లోను  నెలకొని ఉంటాడు .
పర్వత గుహ లో సంచరిస్తున్నాడు .విశ్వంమంతా వ్యాపించి ఉంటాడు .ఏ దేవా ! నువ్వు  యజ్ఞానివి ,నువ్వే వషట్కారమవు, ఇంద్రుడు  ,రుద్రుడు ,విష్ణువు ,బ్రహ్మ స్వరూపుడూ నువ్వే  ప్రజలను  పాలించే వాడవు నువ్వే !

త్వం తదాప ఆపోజ్యోతీ రసో...మృతం బ్రహ్మ  భూర్భువస్సువరోమ్      27

తా:--ఓ దేవా ! స్వయం ప్రకాశాత్మవి అయున  నువ్వే ఆపోజ్యోతివి .అమృత స్వరూపుడవు . రసరూపుడవు , బ్రహ్మరూపుడవు భూర్భువస్సువర్లోకాలలో  ప్రణవ స్వరూపుడవు నువ్వే

ఈశానస్సర్వ విద్యా నా  మీశ్వర స్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్
బ్రహ్మణో..ధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో మ్ .                          28

తా:- నువ్వు సర్వ విద్య లకు  అధిపతివి సమస్త భూతాధి పతివి. బ్రహ్మ లోకానికి ,బ్రహ్మానికి  అధినేతవు .బ్రహ్మ స్వరూపుడవు .శివుడవు .ఓం కారస్వరూపుడవు ,మాకు ఎల్లప్పుడూ శుభములను ప్రసాదించ వలయునని ప్రార్థిస్తూవున్నాము .

తద్విష్ణో  పరమం పదగమ్  సదా పశ్యన్తి సూరయ:
దివీన  చక్షు రాతతమ్ ....                                                                29
   
  తా:-  తత్వవేత్తలు  పరమ పదమైన  విష్ణులోకాన్ని  అంతరిక్షము లోని 
        నాటక దీపమువలే జ్ఞాన దృష్టిచేత ఎల్లప్పుడూ చూస్తున్నారు .

తద్విప్రాసో  విపన్వవో  జాగృదాం సస్సమిన్ద తే  విష్ణోర్య త్సరమం పదమ్ 30
తా:--పరమ పదమైన భగవంతుని  మోక్ష స్థానాన్ని  శ్రద్దాళువు లు పొందుతారు

         ఋతగమ్ సత్యం ,పరం బ్రహ్మ  పురుష0 కృష్ణ పింగళం ,
         ఊర్ధ్వరేత0  విరూపాక్షం  విశ్వరూపాయ  వై నమో నమ:                31

తా :-ఋత స్వరూపుడూ , సత్య స్వరూపుడూ, పరముడూ , బ్రహ్మస్వరూపుడూ,
         విశ్వా కారుడూ , విశ్వనేత్రుడూ ,ప్రపంచానికి సుఖం కలిగించేవాడు ,పింగళ వర్ణుడూ , ఊర్ధ్వరేతస్కుడూ , అయిన భగవంతునికి  నమస్కారం .

     నారాయణాయ విద్మహే  వాసుదేవాయ  ధీమహి ,
      తన్నో విష్ణు: ప్రచోదయాత్ .                                                              32

    తా:--    శ్రీమన్నారాయణుడు  సర్వ వ్యాప్తి అయిన  వాసుదేవుడు ..మహా విష్ణువు  మా బుద్దిని అపరోక్షానుభవ  (అంటే ప్రత్యక్షముగా ..సత్యముగా అని అనుకోవచ్చు) లాభ సిద్ధి యందు ప్రేరేపించును గాక ...ఇక్కడ లాభ సిద్ధి అంటే భగవంతుని అపారమైన దయ అని అర్థం చేసుకోవాలి ..అది ఉంటే అన్నీ మంచి
గొప్ప ప్రయోజనాలు సిద్ధిస్తాయకదా )
    ఇది నారాయణ గాయత్రీ మంత్రం . ఇక్కడ ఇతర దేవతా గాయత్రి మంత్రములను  ఆయా సందర్భానుసారం చెబుతూఉంటారు

    ఆకాశాత్పతితం  తోయం యథా గచ్ఛతి సాగరమ్
     సర్వదేవ నమస్కార: కేశవం  ప్రతి గచ్ఛతి .                                          33

తా:- ఆకాశం  నుండి పడిన నీరు సముద్రాన్ని చేరుతూవున్నట్లు  ఏ దేవునికి  నమస్కరించినా, ఆ నమస్కారం  కేశవుడు శ్రీమన్నారాయణు నికే చెందుతో0ది .
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
వేద పండితులు అయిన  అర్చక స్వాములు నుంచి తెలుసుకొని వ్రాశాను . మరి0గంటి మురళీ కృష్ణమాచార్యులు ....           జై శివనారాయణ......
                                                                        🌹🌹🌹🌹🌹🌹..
            





🌷🌷🌷🌷కామాక్షి శక్తి పీఠం ...గురించి తెలుసుకుందాం 🌷🌷🌷🌷🌷🌷



శార్వ రి నామసంవత్సర విజయదశమి శుభాకాంక్షలు ..మిత్రులు ..పెద్దలు అందరికి విజయదుర్గ అమ్మవారి కరుణా కటాక్షాలు మెండుగా లభించి ఆయురారోగ్యాయుశ్వర్యము లతో అందరూ వర్ధిల్లాలని ప్రార్థిస్తూ

నవదుర్గలు -- ఆధ్యాత్మిక విశిష్టతలు:-

1. శైలపుత్రి:-  ఆధ్యాత్మిక సాధన మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును అని తెలియజేసేదే  ''శైలపుత్రి''.

2.  బ్రహ్మచారిణి:-  నిరంతరం బ్రహ్మ తత్వంతో (శూన్యంతో),  మూలాత్మతో అనుసంధానం అయి ఉండమని తెలియజేసేదే "బ్రహ్మచారిణి" తత్వం.

3. చంద్రఘంట:-  ఎవరైతే మనస్సు నియంత్రణ కలిగి ఉంటారో వారికి  'త్రినేత్ర దృష్టి' ప్రాప్తిస్తుంది అని తెలియచేసే తత్వమే  "చంద్రఘంట".

4. కూష్మాండ:-  విశ్వంలోని అన్ని చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించే మార్గాన్ని అందించే తత్వమే  "కూష్మాండ".

5. స్కంద మాత:-  సాధకులు తమలోని అరిషడ్వర్గాలను జయించాలి అని తెలియచేసే తత్వమే "స్కందమాత".

6. కాత్యాయని:-  తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో త్రిగుణాలకు (సత్వ, రజో, తమో గుణాలకు) అతీతంగా సాధన చేయాలి అని తెలియజేసేదే  "కాత్యాయని".

7. కాళరాత్రి:-  ప్రతి అంతం... ఒక నవ ఆరంభానికి సంకేతం అని తెలియజేసేదే  "కాళరాత్రి".

8. మహాగౌరీ:- మన ఆత్మ సాధన (ధ్యానం) మహా పాపాలను కూడా హరిస్తుంది అని తెలియజేసేదే  "మహాగౌరీ".

9. సిద్దిధాత్రి:-  ఆధ్యాత్మికత సర్వసిద్ధులను కలుగచేయును అని తెలియజేసే తత్వమే  "సిద్ధిధాత్రి"

                 శమీ శమయితే  పాపం శమీ శత్రు నివారిణి 

                   అర్జునస్య ధనూర్ధారి  రామస్య ప్రియదర్శినీ ...ఈ శ్లోకం చదువుకొని ఒక చిన్న కాగితం పై వ్రాసి కుటుంబములో   అందరి పేర్లు వ్రాసి జమ్మిచెట్టు మండలకు గుచ్చుతారు ...జమ్మిఆకులు అమ్మవారి ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుంటారు ..అందరూ కళ్ళకు అద్దుకుంటారు 

                          శ్రీరస్తు............     శుభమస్తు .......జయ జయ శ్రీరామ జయ జయ శ్రీకృష్ణ 

      శ్రీ మాత్రే నమ:         జై  జై లక్ష్మీమాత... జై జై సరస్వతీ మాత ....జై జై జై దుర్గా మాత              

            

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷





🌹🌹🌹🌹🌹🌹 జమ్మిచెట్టు వైశిష్ట్యం 🌹🌹🌹🌹🌹🌹

 *🚩జమ్మిచెట్టుకి ఎందుకంత ప్రాధాన్యత?🚩*


🌷🌳🌷🌳🌷🌳🌷🌳🌷🌳🌷


దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది జమ్మిచెట్టు. దసరా సాయంత్రం వేళ జమ్మికొట్టి, ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు. చెట్లని దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలో తరచూ కనిపించేదే! కానీ ఈ దసరా రోజుకీ జమ్మి చెట్టుకీ మధ్య అనుబంధం ఏమిటి అన్న ప్రశ్నకు చాలా సమాధానాలే కనిపిస్తాయి.

కాస్త జమ్మి గురించి...

జమ్మి భారతీయులకు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే భారత ఉపఖండంలోనే ఈ వృక్షం ఉద్భవించిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుకనే రుగ్వేదకాలం నుంచే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారు. మనం పురాణాలలోనూ, వేదాలలోనూ తరచూ వినే ‘అరణి’ని ఈ జమ్మితోనే రూపొందించేవారు. జమ్మి ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వరత్వరగా పెరిగేస్తుంది. నీటి లభ్యత పెద్దగా లేకున్నా కూడా సుదీర్ఘకాలం బతికేస్తుంది. అందుకే ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ వరకు పొడి ప్రాంతాలలోని ప్రజలకు జమ్మి జీవనాధారంగా నిలుస్తోంది.


పట్నం వాసులకు జమ్మి ప్రయోజనాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ రైతులకు, గ్రామీణ ప్రాంతాలవారికీ జమ్మి అంటే ప్రాణం. దీని కొమ్మలు, ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి; దీని వేళ్లు భూసారాన్ని పట్టి ఉంచుతాయి; ఈ చెట్టులోని ప్రతిభాగాన్నీ నాటువైద్యంలో ఔషధాలుగా వాడతారు. ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా, దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నమ్మకం. అందుకే వినాయక చవినినాడు పూజించే ఏకవింశతి పత్రాలలో శమీపత్రాన్ని కూడా చేర్చారు.

దసరా- జమ్మిచెట్టు

ఏడాదిపాటు అజ్ఞానవాసానికి బయల్దేరిన పాండవులు విజయదశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్లారట. తిరిగి అదే విజయదశమినాడు వారు జమ్మిచెట్టు రూపంలో ఉన్న అపరాజితా దేవిని పూజించి, తమ ఆయుధాలను తీసుకున్నారు. అలా పాండవులకు అపరాజితా దేవి ఆశీస్సులు ఉండబట్టే, వారు యుద్ధంలో గెలిచారని నమ్ముతారు. కేవలం పాండవులే కాదు, రామునికి సైతం జమ్మిచెట్టు ప్రీతికరమైనది చెబుతారు (రామస్య ప్రియదర్శనీ). పైగా జమ్మిచెట్టుని స్త్రీస్వరూపంగా (శక్తిగా) భావిస్తారు. ఆ శక్తి అనుగ్రహం కూడా రాములవారికి లభించబట్టే, ఆయన రావణునితో జరిగిన సంగ్రామంలో గెలుపొందారట.


జమ్మి చెట్టుకి మన పురాణాలలోనూ, జీవితాలలోనూ ఇంతటి సంబంధం ఉండబట్టే దసరానాడున జమ్మిచెట్టుకి పూజలు చేస్తారు. శమీవృక్షానికి ప్రదక్షిణలు చేస్తూ ఈ క్రింది శ్లోకాలను చదువకుంటారు-

‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనీ....... ఈ శ్లోకం చిన్న కాగితం పై వ్రాసి   కుటుంబ0 లోని వారి అందరి పేర్లు వ్రాసి  కొమ్మకు కడతారు అలా చేస్తే ఇంట్లో అందరికి అమ్మవారి రక్షణ ఉంటుందని పూర్వకాలం నుంచీ  వస్తూ ఉన్న నమ్మకం 

‘’శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,

ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ,

కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,

తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.''  ఇక ఇవి నోటికి వస్తే ..లేక వ్రాసుకొని చదివినా చాలా మంచిది 

జమ్మి బంగారం............అంటే .....

పూజ ముగిసిన తరువాత జమ్మి ఆకులను తుంచుకుని వాటిని బంగారంలా భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు. ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్నా ఆధ్మాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పైగా కుబేరుడు ఒకనాడు రఘమహారాజుకి భయపడి జమ్మిచెట్లున్న తావున బంగారాన్ని కురిపించాడనే గాథ ఎలాగూ ప్రచారంలో ఉంది. అలాంటి జమ్మి ఆకులను శుభంగా భావించి, జమ్మి కొట్టేందుకు రాలేకపోయిన పెద్దల చేతిలో ఉంచుతారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలనూ సాధించాలని కోరుకోవడమే. పిల్లల మనసులోని ఈ విజయకాంక్షను గ్రహించిన పెద్దలు, వారి మనోకామన నెరవేరాలని తమ దీవెనలను కూడా జతచేస్తారు.

పాలపిట్ట

దసరా రోజున పాలపిట్టను కూడా చూడాలన్న నియమం ఒకటి ఉంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద నుంచి తీసుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా, వారికి పాలపిట్ట కనిపించిందనీ... అప్పటి నుంచీ వారికి సకల విజయాలూ సిద్ధించాయని ఒక నమ్మకం. అందుకనే విజయానికి శుభసూచకంగా పాలపిట్టను దర్శించే ఆనవాయితీ బయల్దేరింది.

కొసమెరుపు

జమ్మిచెట్టుకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’ (UAE) భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక జమ్మిచెట్టుని నాటమని సూచిస్తోంది. కానీ మనదగ్గర మాత్రం ఉన్న కాసిని జమ్మి చెట్లూ నాశనం అయిపోతున్నాయి. ఇప్పటి పిల్లలైతే జమ్మి చెట్టుని గుర్తిస్తారో లేదో కూడా అనుమానమే! ఇక పాలపిట్ట సంగతి చెప్పనే అక్కర్లేదు. విజయదశమినాడు పంజరాల్లో పాలపిట్టలను తీసుకుని వచ్చి దర్శనం చేయిస్తున్నారంటే... ఇవి అంతరించిపోయేందుకు ఎంతటి సమీపంలో ఉన్నాయో తెలిసిపోతుంది. జమ్మిచెట్టు, పాలపిట్ట తిరిగి మన జీవితాలలో భాగమైనప్పుడే అసలైన విజయదశమి!

🙏🙏🌷🙏🙏🌷🙏🙏🌷🙏🙏

తలుచుకుంటే చాలు వచ్చి కనపడే దైవం దత్తాత్రేయులవారు

 దత్తాత్రేయుడు త్రిమూర్తి అంశ. దీనిలో విష్ణువు మధ్యలో అటు ఇటూ బ్రహ్మ, మహేశ్వరులు ఉంటారు. ఆయన శంఖం, చక్రం, గదా, పద్మం, త్రిశూలం, డమరుకం, కమండలం, అక్షమాల (జపమాల) ధరించి వీరాసనంలో ఉంటాడు. వీరాసనం అంటే ఎడమతొడపై కుడికాలుని వేసుకొని తన రెండుపాదాలను, పాదుకలను కన్పించేలా కూర్చోవడం. వీటితోపాటు తనచుట్టు నాలుగు కుక్కలు ఉంటాయి. అవి నాలుగు వేదాలకు ప్రతీక. ఇక దూరంగా ఆవు ఉంటుంది. ఇది ఉపనిషత్‌లకు సూచిక. దత్తుడు ధరించిన ఆయుధాలు శత్రు సంహారానికి కాదు. కేవలం జ్ఞానమార్గాన భక్తులను ఉద్ధరించడానికి మాత్రమే. ఈ అవతారం జ్ఞానావతారం. ప్రధానంగా దత్తాత్రేయుడిగా, హరి, కృష్ణ, ఉన్మత్త, ముని, ఆనందదాయక, దిగంబర, బాల, పిశాచ, జ్ఞానసాగర అనే 10 రూపాల్ల్లో దర్శనమిస్తాడు. ఈ రూపాలను స్మరించుకొంటే పాపపుణ్యాలను తీసివేస్తాడు. అద్భుత ఫలితాలను ఇస్తాడని భక్తుల విశ్వాసం. ఆయన కాశీ గంగలో స్నానమాచరించి, కొల్హాపురిలో భిక్ష తీసుకొని, సహ్యాద్రి శిఖరంలోని మాలాపురంలో నిద్రపోతారని పురాణాల్లో ఉంది. ఇటువంటి ఈ గురువును పట్టుకోవాలంటే కేవలం స్మరణ చేస్తే చాలు. అందుకే ఆయనను స్మర్తృగామి అంటారు.  అ0టే  తలుచుకుంటే చాలు ..స్మరిస్తే చాలు  దర్శనం ఇస్తాడు అని అర్ధం పరిసమాప్తిలేని అవతారం దత్త అవతారం(సే కరణ)

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శ్రీమద్ భాగవతం చదువుకుందాం..భగవంతుని తెలుసుకుందాము

 🌸 *శ్రీమద్భాగవతము* 🌷🌷🌷🌷🌷🌷🌷

🌻 సంసార సాగరమును తరించుట ఎట్లు కలుగును? అని నమస్కరింపగా నారదుడు ఇట్లనెను: నరులకు జన్మము, కర్మము, ఆయుర్దాయము, మనస్సు, వాక్కు దేని కొరకు ఏర్పడినవి? అంతర్యామియైన నారాయణుని పరముగా అర్పించి జీవించుటకు. అట్లు భక్తి సమర్పణము చేసినపుడే ఈ సమస్తము సార్థకములు అగుచున్నవి. అట్టి జన్మమే జన్మము. అది లేని జన్మము గాని, ఉపనయన దీక్ష మొదలగు కర్మములు గాని, దీర్ఘాయువు గాని ఎందులకు? వేదోక్త‌ కర్మలు గూడ ఎందులకు? జపము, తపము, పాండిత్యము, సంభాషణలు మాత్రము ఎందులకు? అనేక విషయముల యందు శ్రద్ధ ఉండి మాత్రమేమి లాభము? 


(ఉపనయనమనగా గురువునకు అప్పజెప్పుట. గురువులో అంతర్యామిని చూడనప్పుడు ఉపనయనమేల? ఆయుర్దాయము భగవదర్పితము కానపుడు దానికి వేరుగా స్వార్థమైన ఫలితము ఉండదు. స్వార్థము భ్రాంతియే గాని ప్రయోజనము కాదు. వేదమందు చెప్పబడిన కర్మలు చేయుచున్నను వాని యందు అంతర్యామి కన్నా వేరైన ప్రాధాన్యము కల్పింపబడినపుడు అజ్ఞానమే. 


అట్లే జపము, తపము, పాండిత్యము కూడ. వాక్కుల ప్రయోగము కూడా అట్లే. కనుకనే అట్టివారు వేదోక్త కర్మలు ఆచరించుచు కూడా తాము కోరిన ఫలితములనే ఆశించుచున్నారు. జపతపాదులలో గూడ తమ గొప్పదనము మాత్రమే స్థాపించుకొనుచున్నారు. వాక్కులను గూడ పండితవాదములకు, సిగపట్లు పట్టుకొనుటకు వినియోగించుచున్నారు.).....✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 952(For more Information about Master E.K. Lectures please visit www.masterek.org, for regular updates and Messages of Master E.K. join

https://t.me/masterchannel12 )

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నైమిశా రణ్యం క్షేత్ర0 గురించి తెలుసుకుందాం..............

 నైమిశారణ్య ప్రవేశం సమస్త పాతక నాశనం .. నైమిశారణ్య క్షేత్ర దర్శన0🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు సుమారు 150 కి.మీ దూరంలో సీతాపూర్ జిల్లాలో నైమిశారణ్య క్షేత్రం ఉంది.


నైమిశారణ్య ప్రవేశం సమస్త పాతక నాశనం అని కూర్మపురాణం. నైమిశారణ్య క్షేత్రం గురించి చెప్పాలంటే సూక్ష్మంగా (పూజ్య గురువులు తమ ప్రవచనంలో వివరంగా చెప్పారు) కలియొక్క ప్రభావం లేని ప్రదేశంకోసం మునులు, తాపసులు బ్రహ్మగారిని ప్రార్థించగా దర్భలతోచేసిన చక్రాన్ని బ్రహ్మగారు వదిలారు ఆ చక్రం అంతటా తిరుగుతూ వచ్చి ఈ అరణ్య ప్రాంతంలో తిరుగుతూ ఉండగా దానికున్న నిమి ఊడి చక్రం పడిపోయింది అందువలన ఇది నిమి పడిన క్షేత్రం కాబట్టి నైమిశారణ్యం అయ్యింది. అంటే పుట్టడం-మరణం-పుట్టడం-మరణం-పుట్టడం అనే చక్రం ఆగి పునరావృత్తి రహిత శాశ్వత మోక్ష సిద్ధి కలగడానికి ఈ జనన మరణ ఆవృత్తి ఆగిపోవాలంటే సంసారమనే నిమి పడిపోయే ప్రదేశమే నైమిశారణ్యం. నైమిశారణ్యంలో ప్రవేశించిన సాధకులకు భగవత్కృప వలన, సద్గురు వచనం శాస్త్ర వచనం ఆకళింపు చేసుకున్నంత సంసారంలో ఉన్నా సంసారం అంటనివ్వని ప్రదేశమే నైమిశారణ్యం.

అప్పట్నుంచీ ఇక్కడ ఎన్నో వేల మంది ఋషులు, తాపసులు, వారి శిష్యగణాలతో వసించి తపస్యాదులు చేసుకొన్న క్షేత్రం గొప్ప తపోభూమి. మనోలయం తొందరగా కాగలిగిన క్షేత్రం. అందుచేతనే ఇక్కడ కొన్ని రోజులుండి అతి ప్రాచీన దేవాలయాలు ఎన్నో ఏళ్ళనుంచీ తాపసులు తపస్సు చేస్తున్నారా అన్నట్లుండే పెద్ద పెద్ద కైవారంతో ఉన్న దేవతా వృక్షాలు, గోమతీ నది, శ్రీ చక్ర తీర్థం ఇత్యాది ఎన్నో గొప్ప గొప్ప విశేషాలతో ఉన్న ప్రదేశం గొప్ప సాధనా క్షేత్రం. ఏదో చూసి వెళ్ళిపోదాం అనుక్కునేలాటి క్షేత్రం మాత్రం కాదు.

ఐనా సరే, ఒక్కసారి ఇందులో ప్రవేశిస్తే చాలు "రుజో హరం యస్య రజా పవిత్రం తేజోమయం యస్య తమసా పురస్తాత్..." నైమిశారణ్యంలోని రజస్సు (ధూళి, మన్ను, మట్టి) తాకగానే సకల పాపాలు హరించుకుపోతాయట, చక్రతీర్థంలో స్నానం చేసిన భక్తులు, అక్కడి జానపదులు తడిబట్టలతో అడుగడుగు దండాలు పెడుతూ చక్రతీర్తానికి ప్రదక్షిణ చేస్తుంటారు... నైమిశారణ్య క్షేత్రానికి కూడా అరుణాచల గిరి ప్రదక్షిణ లాగ చేస్తారు కానీ అడవి ప్రాంతం కావడం మూలాన అక్కడి వారే చేస్తూంటారు, సింహాచల క్షేత్రప్రదక్షిణోత్సవంలాగా నైమిశారణ్యంలో ఏటా ఫాల్గుణ శుక్ల పంచమి నాడు చేస్తారని అక్కడి వారు చెప్పారు. సనాతన ధర్మంలో చరించే ప్రతి ఒక్కరూ నైమిశారణ్య క్షేత్రానికి వచ్చి చక్ర తీర్థంలో మునకలు వేయవలసిందే, చక్ర స్నానం చేసి ఒడ్డున ఉన్న యజ్ఞవరాహస్వామిని దర్శించాలి అందువల్ల అపార పాప హరం, కలిదోష హరం, యజ్ఞఫలితమూ కలుగుతాయని పెద్దల వాక్కు. ఈ దివ్య ధామానికి వచ్చి ప్రతి ఒక్కరూ కనీసంలో కనీసం ఒకరోజైనా నిద్ర చేసి అనుష్ఠానాదులు చేసుకొని, ప్రత్యేక దీక్షలు, మంత్రాలు ఉంటే ఇక్కడ సాధన చేసుకోవలసిందే ఎందుకంటే ఇది సిద్ధ క్షేత్రం. అందుకే వ్యాసులు కలి స్సాధుః అన్నారు ఇందువల్లనే కదా మనకి నైమిశారణ్యమనే గొప్ప క్షేత్రం దొరికింది.

గోస్వామి తులసీదాసు గారి మాటలలో “తీర్థ వర నైమిశ్ విఖ్యాతా! అతి పునీత్ సాధక్ సిద్ధిధాతా!!” అని అన్నారు. భూమండలంలో ఉన్న అన్ని తీర్థాలూ క్షేత్రాలుకలిసి పెళ్ళివారి ఊరేగింపుగా కదిలి వస్తే అందులో ముఖ్యమైనదీ మధ్యలో ఉండి అందరూ చూడాలనుక్కునేదీ ఐన వరుని స్థానంలో ఉండేది నైమిశారణ్యం. ఇది అతి పునీతమైనది సమస్త సాధకులకీ సిద్ధినొనరించే క్షేత్రముగా విరాజిల్లుతోంది.

వ్యాస, శుక, సూత, శౌనకాది మహర్షులు 88వేల మంది వారి వారి శిష్యగణాలు, అందులో శౌనకాదులు కులపతులు (11 వేల మంది శిష్యులను పోషిస్తూ వేదవేదాంగాలను బోధించేవారిని కులపతి అంటారు) దీర్ఘ సత్ర యాగం (1000 సంవత్సరాలు) చేసిన స్థలం అందునా యాగం జరిగిన చోట అన్ని వేల మందికీ అన్నదానం జరిగిన ప్రదేశం. అంత గొప్ప గొప్ప మునులు మహర్షులు, రాజర్షులు నడయాడిన ప్రదేశం దేవతలు మెచ్చి దర్శనమిచ్చే ప్రదేశం నైమిశారణ్యం

శార్వరి దసరా నవరాత్రుల శుభాకాంక్షలు.....🌹🌹🌹🌹🌹🌹🌹

 

శా ర్వరి నామ సంవత్సర దసరా నవరాత్రుల శుభాకాంక్షలు ..జనులు అందరికి ..చదువుతున్న ఈ పాఠ కులకు ఆయురారోగ్యాఆయుశ్వర్యములతో  వర్ధిల్లాలని ఆకాం క్షిస్తూ...

*🌹. దసరా నవరాత్రుల లో అమ్మవారి అవతారాలు, అమ్మకు పెట్టవలసిన నైవేద్యాలు, శ్లోకాలు…. 🌹*

ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాసించ వలెను

*🌻. నవదుర్గలు :*

ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా||

నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి.

*🌻. నవదుర్గా ధ్యాన శ్లోకములు 🌻*

*🌷. శైలపుత్రీ : (బాలా త్రిపుర సుందరి)*

నైవేద్యం : కట్టు పొంగలి

శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

*🌷. బ్రహ్మ చారిణి ( గాయత్రి ):*

నైవేద్యం : పులిహోర

శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా |

*🌷. చంద్రఘంట ( అన్నపూర్ణ )*

 నైవేద్యం : కొబ్బరి అన్నము

శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

*🌷. కూష్మాండ ( కామాక్షి )*

నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలు

శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||

*🌷. స్కందమాత ( లలిత )*

నైవేద్యం : పెరుగు అన్నం

శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||

*🌷. కాత్యాయని(లక్ష్మి)*

నైవేద్యం : రవ్వ కేసరి

శ్లో|| చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||

*🌷. కాళరాత్రి ( సరస్వతి )*

నైవేద్యం : కూరగాయలతో వండిన అన్నాన్ని

శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||

*🌷. మహాగౌరి( దుర్గ )*

నైవేద్యం : చక్కెర పొంగలి (గుఢాన్నం)

శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||

*🌷. సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి )* 

నైవేద్యం : పాయసాన్నం

శ్లో|| సిద్ధ గంధర్వ యక్షాద్యైరసురైరమరైరపి | సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

*🌷. దుర్గా ధ్యాన శ్లోకము :*

శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥

🌹 🌹 🌹 🌹 🌹

🌺నవదుర్గా అవతారాలు, నైవేద్యం, మంత్రం🌺


శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరీ, సిద్ధిధాత్రీలను నవదుర్గలుగా పిలుస్తారు. ఈ నవదుర్గలకు సానుకూలంగానే భక్తులు శైలపుత్రి-గాయత్రీదేవి, చంద్రఘంట-అన్నపూర్ణ,కూష్మాండ-మహాలక్ష్మి, స్కందమాతను లలితా త్రిపురసుందరి, కాత్యాయిని- సరస్వతీదేవి, కాలరాత్రిని దుర్గాదేవి, మహాగౌరి-మహిషాసురమర్దని, సిద్ధి ధాత్ని-రాజరాజేశ్వరీదేవిగా అలంకరించి పూజిస్తారు.

తిథులలో అమ్మవారి అవతార విశేషం, ఆ రోజున సమర్పించాల్సిన నైవేద్యం, జపించాల్సిన మంత్రం, గాయత్రి మంత్రం.

పాడ్యమి - బాలా త్రిపురసుందరి - పాల పాయసం

"దినకర కిరణైః జ్యోతి రూపే శివాఖ్యే - హేమ వర్ణే హిమ కర కిరణా భాసమా నేన్దుచూడే

సకల జయకరీ, శక్తి బాలే నమస్తే|| " అని మొదటి రోజున బాల స్వరూపంగా పూజించాలి

బాల గాయత్రి :

" ఓం త్రిపురేశ్యచ విద్మహే కామేశ్వర్యైచ ధీమహి - తన్నో బాలా ప్రచోదయాత్‌||"

అనే బాల గాయత్రి సహస్ర గాయత్రి జపించిన మంచి ఫలితం లభిస్తుంది.

విదియ - అన్నపూర్ణేశ్వరి - పాయసన్నం

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి||

మాతాచ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః

అన్నపూర్ణ గాయత్రి :

అన్నపూర్ణాయై విద్మహే జగన్మాత్రేచ థీమహి - తన్నో దేవి ప్రచోదయాత్‌||

తదియ - శ్రీమహలక్ష్మి - గుఢాన్నం

మాతర్నమామి కమలే కమలాయతాక్షి - శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః

క్షీరదజే కమల కోమల గర్భగౌరి - లక్ష్మీప్రసీద సతతం సమతాం శరణ్యే||

లక్ష్మీ గాయత్రి : ఓం మహాలక్ష్యైచ విద్మహే సర్వసిద్ధ్యైచ ధీమహి - తన్నో దేవి ప్రచోదయాత్‌||

"ఓం అమృతవాసిన్యైచ విద్మహే పద్మలోచన్యైచ ధీమహి - తన్నో లక్ష్మిః ప్రచోదయాత్‌||" అని పఠించినా మంచిది.


చవితి - గాయత్రి దేవి - కట్టు పొంగలి అన్నం

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం

భర్గో దేవస్య థీమహి ధియో యోనః ప్రచోదయాత్‌||

అని పఠించినట్టయితే తల్లి కరుణిస్తుంది.


పంచమి - శ్రీ లలితా దేవి - పులిహోరాన్నం

అనఘాద్భుత చరిత్రా వాంచితార్థ ప్రదాయినీ - ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్య శాసనా||


శ్రీలలితా గాయత్రి : లలితాయై చ విద్మహే కామేశ్వర్యైచ థీమహి ఔతన్నో దేవి ప్రచోదయాత్‌||


షష్టి - శ్రీ దుర్గాదేవి - చిల్లు లేకుండా అల్లపు గారెలు

ప్రథమా శైల పుత్రీచ ద్వితీయ బ్రహ్మచారిణే - తృతీయా చంద్రఘాటేతి కుష్మాండతేతి చతుర్థికీ

పంచమాస్కంద మాతేతి షష్టా కాత్యేయనేతిచ - సప్తమ కాల రాత్రిచ అష్టమా చేతి భైరవీ

నవమా సర్వస్థిశ్చేత్‌ నవదుర్గా ప్రకీర్తితా||


దుర్గా గాయత్రి : ఓం మహా దుర్గాయై విద్మహే సర్వ శక్తయైచ థీమహి - తన్నో దుర్గా ప్రచోదయాత్‌


సప్తమి - మూల నక్షత్రం - సరస్వతి దేవి - కొబ్బరి అన్నం

సరస్వతీత్వియం దృష్టా వీణా పుస్తక ధారిణీ - హంస వాహన సమాయుక్తా విద్యాదానకరీ మమ||


సరస్వతీ గాయత్రి : సరస్వత్యైచ విద్మహే బ్రహ్మసతియైచ ధీమహి - తన్నో వాణీ ప్రచోదయాత్‌||


అష్టమి - మహిషాసురమర్ధని - శాకాన్నం, కేసరిబాత్‌

జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే


మహిషాసుర మర్ధిని గాయత్రి : మహిషష్యైచ విద్మహే జగన్మాత్రేచ ధీమహి - తన్నో మాతా ప్రచోదయాత్‌||


నవమి - శ్రీరాజరాజేశ్వరి - చిత్రాన్నం, లడ్డూలు

అంబా పాలిత భక్తరాజరనిశం అంబాష్టకం యః పఠేత్‌

దంబాలోక కటాక్షవీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా

అంబాపావన మంత్ రాజ పఠనాద్ధంతీశ మోక్ష ప్రదా

చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ||


రాజరాజేశ్వరి గాయత్రి : రాజేశ్వర్యైచ విద్మహే శ్రీభవానీయైచ ధీమహి - తన్నో దేవి ప్రచోదయాత్‌||

ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻

(బ్రాహ్మణ పండిత్తులనుంచి సేకరించబడినది)






అశ్వ యుజ మాసం నవరాత్రులు ప్రారంభం

 17-10-2020 నుంచి నిజ ఆశ్వయుజ మాసం ప్రారంభం ..


 #ఆశ్వయుజ మాసం యొక్క విశిష్టత: 


🍁🍁🍁🍁


త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు, మహేశ్వరుల దేవేరులైన సరస్వతి,మహాలక్ష్మీ ,పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన......వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఆశ్వయుజం !

జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణార్ధం , తొమ్మిది అవతారలను ధరించిన మాసం...

ఆయుర్వేద దేవుడు అయిన ' ధన్వంతరీ , త్రిమతాచార్యులలో ద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ మధ్వాచార్యులు జన్మించిన మాసం. 

దుష్ట దానవుడైన నరకాసురుడు అంతమొందింపబడి ప్రజలందరికి ఆనందాల వెలుగులను పంచిన దివ్య మాసము ఇది 

ఈ మాసం లోని తొలి తొమ్మిది రోజులు "దేవి నవరాత్రులు ". సంప్రదాయబద్ధంగా పూజలు చెయ్యాలి అనుకున్న భక్తులు కలశాన్ని స్థాపించి , ముగ్గురు అమ్మల మూలపుటమ్మను ఈ నాటి నుండి తొమ్మిది రోజుల పాటు నియమముగా ఆరాధించాలి .

 దేవి పూజను ఆశ్వీయుజ మాసం అష్టమి, నవమిలలో పూజించిన భక్తులను ఎటువంటి శోకాలు దరిచేరవు. దేవి పూజకు ఉత్కృష్టమైన ఈ రోజులలో అమ్మవారిని పూజించి రోజుకొక నైవేద్యం చొప్పున సమర్పించడం మంచిది. కలశ స్థాపనాదులతో పూజించలేని వారు, అమ్మవారి పటానికి గాని, విగ్రహానికి గాని , పుస్తకాలను గాని పూజిస్తూ స్తోత్ర , నామ పారాయణలను చేయవచ్చు.

ఈ విధముగ దేవి నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించడం వల్ల ఆ దేవి సంతృప్తురాలు అవుతుంది. అంతే కాకుండా దుష్ట , గ్రహ పీడలు నశించి అమ్మవారి కృప కటాక్షలు కలుగుతాయని చెప్పబడుతోంది. 

అలాగే, ఈ మాసం లో సప్తమి రోజున గోపూజ చెయ్యవలెను. కపిల గోవును పూజించాలని, కేవలం పంచగవ్యములను మాత్రం స్వీకరించి ఉపవాసము ఉండవలెను. 

పూర్ణిమ నాడు " నారదీయ పురాణము"ను పండితులకు తాంబూలములో వుంచి దానము ఇవ్వవలేను.

పూర్ణిమ నాడు స్త్రీలు జాగరణ చెయ్యటం వలన లక్ష్మి దేవి సంతోషించి, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది అని శాస్త్ర వ

ఈ నెలలోని బహుళ పక్షములో చతుర్దశి , అమావాస్య తిధులలో దీపాలను దేవాలయం ,మఠము ప్రాకారాల్లోను , వీధులు , ఇంటి ముందు సాయంత్రము సమయములో వెలిగించుకోవడంవల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని చెప్పబడుతోంది. 

ఈ విధముగ ఎన్నో విశిష్టతలను సొ౦తం చేసుకున్న మాసం -- ఆశ్వయుజ మాసం !

ఈ మాసం లో చేసే పూజలు, విధుల ఆచరణ వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి.

అనంత రూపాలలో విలసిల్లే శక్తిస్వరూపిణి అయిన ఆ తల్లి ఏ రూపములోనైనా , ఏ నామంతోనైనా ఆరాధించవచ్చు. ఆ తల్లి అమ్మలగన్న అమ్మ !.

తనను నమ్మిన భక్తులను ఎట్టి పరిస్థితులలో విడవకుండా కాపాడే కల్పవల్లి ...

కరుణామయి..ఆ తల్లి !!!               (    .........సేకరించబడినది..........)

శ్రీమాత్రే నమః             ఇక అన్ని దానాలు ,పూజలు ,ఉపవాసాలు ,జాగరణ ,కుదరనివాళ్ళు ,చేతకానివారు చక్కగా 

మీ దగ్గరలోని  డేవాలయమునకు వెళ్ళి మనస్సు ను అర్పించి ..కొన్ని పువ్వులు కొబ్బరికాయ సమర్పించండి ....అదీ వీలుకాకపోతే  సాష్టాంగ ప్రమాణం చేయ0డి ...అమ్మవారు  కానీ భగవంతుడు కానీ చూసేది ఎంత ఖర్చు పెట్టావు అని కాదు ..ఎంతసేపు మనస్సు లో ఆ రూపం నిలుపుకున్నావు ..అదే మనస్సు సమర్పించి దైవం పట్ల మనం అనుభూతి చెందితే చాలు ...ఆ భగవత్ శక్తి మనలో ప్రసరిస్తుంది ...మనల్ని అంటిపెట్టుకొని కాపాడుతూఉంటుంది ..కానీ  ఏ ఒక్కరిని ,ఏ జీవి కి బాధ  కలిగించకుండా బ్రతకాలి ..ఏఒక్కరిని అవమానించకూడదు ..సేవ ఏ  పరమార్ధ్గ0గా బ్రతకాలి .  కొద్ది ఆలస్యం అయినా ...ధర్మం  కాపాడుతూఉంటుంది ...మన చూపు అహంకారం లేకుండా అమ్మవారు లేక అయ్యవారు అదే భగవంతుని పాదాలపై ఉంచి శర ణు కోరితే తప్పక కరుణిస్తాడు ....నమ్మకం తో ప్రయత్నం చేసి చూడాలి ...పెట్టే పరీక్షలు కూడా తట్టుకోవాలి ..అప్పుడు విజయం సాధిస్తాం ..అదే సాయిబాబా వారు చెప్పిన               శ్రద్దా.....సబూరి ...అంటే     శ్రద్ద.   ........ఓర్పు అని అర్థం ................................🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


 





భగవంతుడి సృష్టి ..ఆ పక్షలు కానీ ...ఆ తెలివితేటలు కానీ ..అదే భగ వతత్త్వం


 

Hyderabad Shemshabad Airport due to heavy rains


 

భగవద్గీత ఉపన్యాసం లో కొన్ని ముఖ్య విశేషములు


 

శ్రీమద్ భాగవతం చదువుకుందాం ..భగవంతుణ్ణి తెలుసుకుందాం

 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻 నీవు జీవుల క్లేశములను తొలగించువాడవు. (ఇంద్రియములు మనస్సు అనువానిని ఉపయోగించి జీవుడు క్లేశము తెచ్చుకొనును. వానిలో నిన్ను చూచినపుడు నీవు క్లేశము తొలగింతువు). పరమగురువులైన మహానుభావులకు కూడా మనస్సు చేతను, వాక్కు చేతను నీవు గోచరింపవు. (వారి మనస్సు, వాక్కు నీవే అని ఉపాసించినపుడు గోచరింతువు). కోరికలకు కారణమైన సద్గుణముల పేర్లు గలవాడవు. (మంచివాడు కీర్తిమంతుడు, గుణవంతుడు, ధనవంతుడు అను పేర్లు వినుట వలన ఆ గుణములు గోచరించి వానిపై కోరికలు పుట్టును. ఆ గుణములు నీ రూపములని తెలిసిన వారికి కోరికలు తీరును. అనగా కోరికలు ఉండని స్థితి కలుగును. గుణముల కొరకై ఆశపడిన వారికి కోరికలే మిగులును. తీరబోవుచున్నట్లుండును. తీరుట ఉండదు). 


నీవు సత్త్వగుణ మూర్తివి. (రజస్తమస్సులలో మనము ఉన్నపుడు భగవంతుని రూపములును, గుణములును సృష్టిలోని విలువైన వస్తువులుగా కనిపించి కామక్రోధములను పుట్టించును. సత్త్వగుణమున ఉన్నపుడు అవి అంతర్యామి శోభలుగా తెలియును కనుక సాన్నిధ్యమును కలిగించును). ఇట్లు అనుక్షణము ఈ సకల సృష్టియు పుట్టుట, ఉండుట, లయమందుట అను కథలను ధరించి మాయను ప్రసరింపజేయుచుందువు. నీవు మాయాగుణములచే చేయబడిన విగ్రహము కలవాడవు. (ఏ రూపము కాని, ఏ గుణము కాని వేరుగా గ్రహింపబడినపుడు మాయ క్రమ్మును. అంతర్యామియందు చూడబడినపుడు మాయ తొలగును). 


ఇంద్రియముల మార్గమున నీ సమస్తముగా గోచరించుచు ఇంద్రియములచే గమనింపబడుటకు వీలులేనివాడై ఉన్నావు. ప్రశాంతమైన మనస్సు గలవాడవు. (మాకు మనస్సు ప్రశాంతముగా ఉన్నపుడు అది నీదిగా ఉండును. అంతేకాని భగవంతునకు వేరుగా ప్రశాంత మనస్సు ఉండదు. మనస్సు మనది, ప్రశాంత మనస్సు భగవంతునిది). ఈ సంసారమును సృష్టించిపెట్టు మనోహరమైన బుద్ధిబలము గలవాడవు. (బుద్ధిబలము మనోహరమని వేడుక పడినపుడు దానితోనే వారికి సంసారము సృష్టించి బంధము తెచ్చిపెట్టును). 


దేవతలకు దేవుడవై వాసుదేవుడవుగా సర్వభూత నివాసుడవుగా ఉన్నావు. (ఇంద్రియాది ప్రజ్ఞలే దేవతలు. వానికి అధిపతి అంతర్యామి. వాని యందు దేవతా ప్రజ్ఞలుగా ఉండి, వానితో నిర్మింపబడిన జీవుల యందు జీవుడుగా నివసించుచున్నాడు కనుక వాసుదేవుడు). ఇట్టి నీవు ఇన్నిటి యందు ఉండియు ఇన్నిటికి సాక్షిగా ఉన్నావు. (కుండలోని మట్టి కుండ ఆకారమునకు సాక్షిగా ఉన్నదే గాని అందు చిక్కుకొని లేదు)........✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 918 (For more Information about Master EK Lectures please visit www.masterek.org),

శివుడు నీలకంఠుడు గా శ్రీమహావిష్ణువు నీలమేఘశ్యాముడిగ ......లోకాలు పరిరక్షణ కోసం మారిన వైనం

 *శయనిస్తున్న శివుడు ప్రపంచంలో ఏకైక ఆలయం*


క్షీరసాగర మథనంలో హాలాహలం పుట్టుకు వచ్చినప్పుడు భీతావహులైన సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. త్రిలోక రక్షణాదక్షుడైన శివుడు ఆ హాలాహలాన్ని స్వీకరించే ముందు జరిగిన దృశ్యం ఇలా ఉంది ... 


కంటే జగముల దు:ఖము 

వింటే జలజనిత విషము వేడిమి, ప్రభువై 

యుంటకు నార్తుల యాపద

గెంటించుట ఫలము, దాన కీర్తి మృగాక్షీ

.

శివుడు పార్వతితో ఇలా అన్నాడు : లోకాల ఆర్తిని చూసేవు కదా ?

పాల సముద్రం నుండి పుట్టిన విషం ఎంత వేడిమి గలదో విన్నావు కదా ? రాజైనందుకు ప్రజలను వారి ఆపదలలో ఆదుకోవాలి. 

అది నా కర్తవ్యము . పార్వతి తన పెనిమిటి లోక రక్షణార్ధం కాలకూటాన్ని భుజించడానికి సిద్ధ పడితే పంతోషంగా అంగీకరించింది.

.

మ్రింగెడు వాడు విభుండని

మ్రింగుడిది గరళ మనియు మేలని ప్రజకున్

మ్రింగు మనె సర్వ మంగళ,

మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో ! 

.

ఆహా ! గరళాన్ని మ్రింగే వాడు లోకప్రభువైన తన భర్త. మ్రింగేది కాలకూటం. అలా చేయడం వల్ల లోకాలకు మేలు కలుగు తుంది అని తలచి సర్వ శుభప్రదాయిని పార్వతి సరే విషాన్ని తినమని భర్తతో పలికిందిట. 

ఆ పతివ్రత తన మంగళ సూత్రాన్ని ఎంతగా నమ్ముకున్నదో కదా. 


పరమ శివుడు హాలాహలాన్ని భక్షించే టప్పటి దృశ్యాన్ని పోతన గారు ఎంత గొప్పగా కళ్ళకు కట్టేలా చిత్రించారో చూడండి ... 


గరళం కడుపులోకి వెళ్లకుండా శ్రీ మహా విష్ణువు సుక్ష్మ శరీరంతో గొంతులో ఉండిపోయాడు.దీంతో ఆ విషం గొంతులోనే ఉండిపోయి ఆ భాగమంతా నీలిరంగులోకి మారింది. అప్పటి నుండే శివుడు నీల కంటుడిగాను,శ్రీ మహా విష్ణువు నీలిమేఘ శ్యామునిగాను ప్రఖ్యాతి చెందారు.విషప్రభావంతో సొమ్మసిల్లిన శివుడు పార్వతీ దేవి ఒడిలో శయనించాడు.


నారదుడు ముల్లోకాలకూ ఈ సమాచారం చేరవేశాడు. అన్ని సురగణాలకూ ఆ దృశ్యం సురటపల్లిలో కనిపించింది. నీలకంఠుడికి స్వస్థత చేకూర్చాలని సురగణమంతా సురటపల్లికి చేరింది. అలా తరలి వచ్చిన దేవగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు నిలువరించాడు. విషయం తెలుసుకున్న శివుడు మేలుకుని దేవతలకు దర్శనభాగ్యం కలిగించాడు. దేవతలంతా ఆనందంతో నృత్యాలు చేశారు. సప్తరుషులు, దేవతలు పరమేశ్వరుణ్ణి కృష్ణ పక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నార ని… ఈ కథనాన్ని శివపురాణం చెబుతోంది. 


కృష్ణ పక్ష త్రయోదశి శనివారం మహాప్రదోష వేళలో దేవతలు పళ్లికొండేశ్వర స్వామి దర్శనానికి వస్తారని, ఆరోజు దర్శనానికి వెళితే చాలు సమస్త దేవతల కరుణాకటాక్షాలను అందుకోవచ్చని భక్తుల నమ్మకం. శివుడు హాలాహలాన్ని మింగి సొమ్మసిల్లిన వేళ పదిహేనువేల మంది దేవతలు ఈ స్థలానికి వేంచేసినట్లు శివపురాణం చెబుతోంది. ఇక్కడ పరమేశ్వరుడిని నీలకంఠుడిగా, శ్రీ కంఠ, నంజుండస్వామిగానూ ఈ పళ్లికొండేశ్వర స్వామిగా భక్తులు స్తుతిస్తారు. 


సర్వమంగళాదేవి ఒడిలో తలపెట్టుకుని శయనిస్తూన్న శివుని అరుదైన దేవాలయం.


పరమశివుడు కొలువైన క్షేత్రం .. ఆయన లీలా విశేషాలకి నిలయమైన క్షేత్రం ‘సురుటుపల్లి’. మహిమాన్వితమైన ఈ క్షేత్రం చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో విలసిల్లుతోంది. సాధారణంగా కొన్ని వైష్ణవ క్షేత్రాల్లో శ్రీమహా విష్ణువు మాత్రమే శయనభంగిమలో దర్శనమిస్తుంటాడు. శివుడు మాత్రం లింగరూపంలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు.


సదాశివుడు కూడా శ్రీమహా విష్ణువు మాదిరిగానే శయన రూపంలో కనిపించే అరుదైన క్షేత్రమే ‘సురుటు పల్లి’. లోకకల్యాణం కోసం హాలాహలాన్ని మింగిన శివుడు, ఆ విష ప్రభావం కారణంగా అమ్మవారి ఒడిలో సొమ్మసిల్లి .. ఆ తరువాత సేదదీరిన క్షేత్రం ఇది. ఈ సంఘటన కారణంగా కోటి మంది దేవతలు అక్కడికి చేరుకున్నారు.


ఆశలు తీర్చే అభిషేకం..!!


పంచామృతంతో అభిషేకం.. ఆరోగ్య ప్రాప్తి. పాలతో అభిషేకం.. దీర్ఘాయు ప్రాప్తి. 

పెరుగుతో అభిషేకం.. సత్సంతాన ప్రాప్తి. గంధంతో అభిషేకం.. లక్ష్మీకటాక్ష ప్రాప్తి.


స్వామి దర్శనం చేతనే వివాహయోగం. వివాహమైన వారికి దాంపత్య జీవితం సుఖసంతోషాలమయం. పదిహేనువేల మంది దేవతలు తరలి వచ్చి ఆరాధించిన స్వామి పల్లికొండేశ్వరుడు. కొలువుదీరిన నేల సురుటపల్లి. ఇక్కడ శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారు కొలువై ఉన్నారు . ఆయన్ని ఆరాధించడం వలన విశేషమైన విద్యా ప్రాప్తి కలుగుతుంది.ప్రదోష వేళలో శ్రీ నందీశ్వరుని ఆరాధనకూ ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది.


సాధారణంగా దాదాపు అన్ని శివాలయాల్లోనూ శివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు. కొన్నిచోట్ల ధ్యానముద్రలో ప్రశాంతంగా కూర్చున్న భంగిమలో శివయ్యను దర్శించుకుంటాం. కానీ, పార్వతీదేవి ఒడిలో ఆదమరచి నిద్రిస్తున్న భంగిమలో ఉన్న శివుడి విగ్రహాన్ని భక్తజనం ఎక్కడా చూసి ఉండరు.


పద్నాలుగు అడుగుల ఎత్తులో ఈ అరుదైన శయన శివుడి దర్శనం మనకు చిత్తూరు జిల్లాలోని సురుటపల్లి గ్రామంలోని పల్లికొండేశ్వర ఆలయంలో లభిస్తుంది. చుట్టూ బ్రహ్మ విష్ణువులు, సూర్యచంద్రాదులు, నారద తుంబురులు, ఇంద్రుడు, కుబేరుడు, మార్కండేయుడు, అగస్త్య, పులస్త్య, వాల్మీకి, విశ్వామిత్రాది మహర్షులు కొలువు తీరి ఉండగా శివుడు సర్వమంగళాదేవి (పార్వతీదేవి) ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తున్న భంగిమలో భక్తులకు దర్శనమిచ్చే దృశ్యం కన్నులపండుగగా ఉంటుంది.


బుక్కరాయలు నిర్మించిన ఆలయం:..!!


తిరుపతి- చెన్నై జాతీయు రహదారిలో అరుణానది ఒడ్డున ఈ ఆలయుం కొలువుదీరి ఉంది. భక్తుల పాలిట కల్పతరువుగా భావించే ఈ ఆలయూన్ని 1344-47 మధ్యకాలంలో విజయునగరాధీశుడైన హరిహర బుక్కరాయులు నిర్మింపజేశారు. 1833లో శ్రీకాళహస్తి సంస్థానాధీశులైన రాజావారు జీర్ణోద్ధరణ చేసినట్లు ఆలయు కుడ్యాలపై శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయు ప్రాశస్త్యాన్ని గుర్తించిన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర చంద్రశేఖర సరస్వతి స్వామి వారు 1979లో ఇక్కడ వుహాకుంభాభిషేకం నిర్వహించారు. ఆ సందర్భంలో చంద్రశేఖర సరస్వతి స్వాముల వారికి పరవుశివుడు దర్శన భాగ్యం కలిగించడంతో ఆయన ఈ ఆలయంలోనే గడిపినట్లు స్వయంగా పేర్కొన్నారు.

                                            ....                .               ..(    సేకరించ బడినది .............................)


                  



శ్రీ మద్ భాగవతం చదువుకుందాం .....భగవంతుడు ని తెలుసుకు0దాం

 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻 ప్రచేతసులు జనార్దనునితో ఇంకనూ ఇట్లనిరి..... నీ గర్భమునందు జలముల నుండి పద్మము పుట్టుచున్నది. (అవ్యక్తము నుండి వ్యక్తము పద్మముగా విచ్చుకొనుచున్నది). నిన్ను స్మరించుచున్నపుడు సంసార దుఃఖములను హరింతువు. ఎవడైన గమనింప గల ఉత్తమస్థాయి ఉన్నచో దానికి అధిపతివిగా అతనికి భాసించుచున్నావు‌. (శాస్ర్తమును అభ్యసించువానికి శాస్ర్తముగా ప్రత్యక్షమగును. యోగము సాధించువానికి యోగవిద్యగా దర్శనమిచ్చును. ఇట్లే ఎల్లరకును. చివరకు జూదమాడువానికి గూడ జూదము రూపమున ఉన్నానని గీతలో విభూతి యోగములో కృష్ణుడు చెప్పెను). 


పద్మకేసరముల వంటి దివ్యవస్ర్తములను ధరించినవాడవు. (పద్మము సూర్యుని చూచి విచ్చుకొనును కనుక సూర్యరశ్మియే వస్ర్తముగా సృష్టి అను దేహమున వెలుగుచున్నావని అర్థము). పద్మముల వంటి పాదములు గలవాడవు. (సూర్యుని వెలుగునకు మేల్కొను అడుగుజాడలతో జీవులను నడిపించువాడవు). పద్మమాలికను ధరించినవాడవు. (అహస్సులను వరుసలుగా ధరించిన కాలస్వరూపుడవు). 


కృష్ణుడు అను పేరు కలిగి ఆకాశము రూపమున నీలవర్ణుడవై ఉన్నావు. లోకములలోను, వానికి అవ్వలను ఉన్నావు. సద్గుణముల రూపమున భాసించుచున్నావు. దేవతల శత్రువులను హరించుచున్నావు. (దుర్గుణములు ఉన్నచోట నాశమును కలిగింతువు). 


దుఃఖములు లీనమగుటకు కారణమైన నీ రూపము ఎప్పటికప్పుడు ఆశ్చర్యకరమైనది. ఎవడును వారింపరాని ప్రత్యక్షత నీ రూపము‌న కలదు. (సృష్టి రూపమున అంతర్యామి గోచరింపబూనుట వలన దానిని చూడకుండుట సృష్టిలోన ఉన్నవానికి సాధ్యము కాదు. అనుగ్రహ సమయము కలిగినపుడు, ఈ సమస్తము వాడే అని తెలియుట కూడ ఎవడును అడ్డుపెట్టలేడు). 


మేము భరింపరాని విపత్తులను పొందినపుడు నీ కృప మా యందు ప్రసరింపజేయుటకన్నా అనుగ్రహమనగా మరొకటి ఏమున్నది? (ఇంద్రియములు అజ్ఞాని దేహమున ఇంద్రియ స్వరూపులై భయముతో గిలగిల కొట్టుకొను పరిస్థితి కలుగును. అట్టి స్థితిలో కనువిప్పు కలిగించుట కన్నా అనుగ్రహమేమున్నది?) 


భక్తులకు సద్భక్తి ఫలితమును అనుగ్రహ రూపమున ప్రసాదింతువు.......✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 919,920,921,922 (For more Information about Master E.K. Lectures please visit www.masterek.org)

Please see .... really surprise


 

Really mother's affection. తల్లిప్రేమ


 

గ్రహ దోషాలు పోగొట్టే నరసింహస్వామి వారి క్షేత్రము లు🌷🌷

🌷 నవగ్రహాల దోష నివారణకు నవ నారసింహక్షేత్రములు🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 

ఓం నమో నారాయణ..!!🙏


హిరణ్యకశిపుడిని సంహరించి వికటహట్ట్ హాసాలు చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో 

వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి. 


జ్వాల నరసింహ స్వామి

అహోబిల నరసింహ స్వామి

మాలోల నరసింహ స్వామి

వరాహ నరసింహస్వామి (క్రోడా)

కారంజ నరసింహస్వామి

భార్గవ నరసింహస్వామి

యోగానంద నరసింహస్వామి

చత్రవట నారసింహస్వామి

పావన నరసింహ స్వామి


1.జ్వాలా నరసింహ క్షేత్రము.🙏

(కుజగ్రహా అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)


నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట. హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. 

ఇక్కడ కొండపైన వెలసిన నరసింహస్వామికి 

ఘనమైన చరిత్ర ఉంది . 

పూర్వం  యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. 

అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవ్వగా తనకు 

నరసింహమూర్తిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట.

అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, 

జ్వాల నరసింహుడు,యోగానంద నరసింహుడు 

అనే రూపాలలో కనిపించాడట. 

ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట. 

స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.


వైకుంఠవాసుని అశురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీమన్నారాయణుడు తొణకలేదు, 

కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరహిగా ఆవిర్భవించాడు. ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని 

"జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు. 

ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే 

కుజగ్రహ దోషాలు తొలుగుతాయి.


2. అహోబిల నరసింహ స్వామి.🙏

(గురుగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)


నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడిన క్షేత్రమిదేనని 

స్థల పురాణం చెబుతుంది. 

హిరణ్యకశపుని చీల్చి చెండాడిన నరసింహ స్వామి 

ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం, అహో బలం అని ఆశ్చర్యంతో పొగడేరటా.

అందుకీ ఈ క్షేత్రానికి అహోబిల నరసింహ స్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెబుతారు.


ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా "స్వయంభు" తనకు తానే సాలగ్రామముగా, 

ఎవరు ప్రతిష్ఠచేయని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు. 

ప్రహ్లాదుడు ప్రార్ధించగా గరుడాద్రి పర్వత క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలం. 

ఈ అహోబిలానికి దేవతలు స్తుతించినందున 

అహోబలం అని, బిలం నందు స్వయముగా వెలసినందుకు అహోబిలం అని రెండు విధాలుగా అభివర్ణించారు. 

ఈ నరసింహా స్వామిని పూజించిన వారికి 

గురుగ్రహా దోషాలు నివారణ అవుతాయి. 


3. మాలోల నరసింహ స్వామి..🙏

(శుక్రగ్రహ అనుగ్రహానికి.. దోషాలు పోవడానికి..)


వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా 

"మా" అనగ లక్ష్మి లోల యనగ "ప్రియుడు" అని అర్ధం. 

ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. 

ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరం లో 

ఈ ఆలయం కలదు. 

స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. 

వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడినది. 

ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు. 

స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి 

వామ హస్తము లక్ష్మీదేవిని ఆలింగనము చేసుకొన్నట్లుగా యున్నది. 

స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. 

ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు, 

ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక. 

ఈ నరసింహా స్వామిని పూజించినవారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది. 


4. వరాహ నరసింహస్వామి (క్రోడా)..🙏

(రాహుగ్రహ అనుగ్రహానికి.. దోషాలు పోవడానికి..)


వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా 

వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి 

భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి 

వరాహ నరసింహ క్షేత్రమని పేరు. 

భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి. 

ఈ నరసింహా మూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి. 


5. కారంజ నరసింహస్వామి..🙏

(చంద్రగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)


కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.

పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.

గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని మరియు శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు "నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదనగా" నృసింహుడు నేనే శ్రీరాముడ 

నేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు. 

ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు. 

అందుకే అన్నమయ్య "పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ" అని పాడారు. 

ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును.


6. భార్గవ నరసింహస్వామి..,,🙏

(సూర్యగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)


పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. 

కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. 

ఈ స్వామిని "భార్గోటి" అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. 

పరశురాముని పూజలందుకున్న దివ్యధామము. 

ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరం లో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది. 

స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమై 

శంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, 

అసురుని ప్రేవులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు, 

ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, 

ప్రభావళి నందు దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది. 

ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును.


7. యోగానంద నరసింహస్వామి..🙏

(శనిగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)


యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి 

అని పిలవబడుచున్నాడు. 

యోగపట్టంతో, విలసిల్లినాడు, 

ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. 

మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను. 

ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.

ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును.


8. చత్రవట నారసింహస్వామి..🙏

(కేతుగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)


పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. "హా హా" "హుహ్వా" అను 

ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి 

నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి 

వారికి శాప విమోచనం గావించెను. 

కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రం నందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని 

చత్రవట స్వామి అని పిలుస్తారు. 

ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును.


9. పావన నరసింహ స్వామి..🙏

(బుధగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)

పరమపావన ప్రదేశం లో ఏడుపడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి.

ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, 

సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించగలిగేవాడని అర్ధమగుచున్నది. 

మరియు "భరద్వాజ" ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు. 

కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రాన్ని పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో 

దక్షిణ దిశలో యున్నది. 

పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు. 

బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి "శనివారం" నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. 

ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు. 

ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభించును.

🙏🙏🙏


శుభోదయం🌹🌹🌹

దేశ ఆర్థిక విధానములో కోర్టులు కల్పించుకోరాదు అంటూ మోడీ ప్రభుత్త్వం దాఖలు చేసిన ........

 https://mobi.greatandhra.com/article/news-/tl_112148/amp

Hollywood actress salma hayek devotee of sri lakshmi devi

 https://www.hindustantimes.com/hollywood/salma-hayek-shares-image-of-goddess-lakshmi-says-it-makes-her-feel-joyful-and-connect-with-inner-beauty/story-o6QL9dO2JPUlHjZDte01rL.html


శ్రీమద్ భాగవతం చదువుకుందాం ....భగవంతుని కృప కు పాత్రులు అవుదాం

 [10/9, 8:33 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻 చంద్రుని కిరణములవలె కోనేరు స్వచ్ఛమై ఉండెను. (జీవుడు గర్భస్థుడగు మార్గము చంద్రగతి అని వేదములు చెప్పుచున్నవి. చంద్రుడు గర్భధారణమునకు అధిపతి అని పితృమేధ మంత్రములు చెప్పుచున్నవి. చంద్రుడు మాతృకారకుడని జ్యోతిశ్శాస్ర్తము చెప్పుచున్నది.) 


విష్ణుని కథవలె ఆ కోనేటి జలములు సకల కల్మష హరములు. (విష్ణుభక్తి ప్రపూర్ణములైన జీవిత సన్నివేశములే జీవులకు పాపహరములు.) అగ్నిహోత్రముల వలె అందలి జలములు లోకములను పవిత్రము చేయును‌. (దక్షిణాగ్ని లేక దాంపత్యము అనబడు ధర్మబద్ధమైన కామము నరజన్మమును పవిత్రము చేయును.) 


అట్టి జలములచే నిండిన కోనేరు వారికి కనుపించెను. అట్టి సరోవరమున ఒక దివ్య పురుషుడు వారికి దర్శనమిచ్చెను‌ (అతడే జీవుని రూపము ధరించుటకు దిగి వచ్చుచున్న పరమేశ్వరుడైన రుద్రమూర్తి.) నలుదిక్కుల నుండి మనోహరమైన నాదము‌ వినిపించుచుండెను. అందు మృదంగ ధ్వనులు, వేణుగానములు దివ్యములై మనస్సును రంజింపజేయుచున్నవి. (దివ్యతత్త్వమే నాదమార్గమున మనస్సుగా దిగివచ్చుచున్నది.) ఎవ్వరో గంధర్వలు గానము చేయుచున్నారు. దానిని వినుచు ఆనంద పులకితుడై, ఆ నాదమునకు తానే ఆశ్చర్యపడుచు ఆ దివ్యపురుషుడు కుతూహలముతో కోనేటి నుండి యీవలకు వచ్చెను. 


ఆ దేవలోక శ్రేష్ఠుడు కరగించి పోసిన బంగారు రంగు గలవాడు. అతని చుట్టును సనకాది యోగి జనులు స్తోత్రగానములు చేయుచున్నారు. భక్తులకు అనుకూలముగా ప్రవర్తించు స్వభావము గల ప్రసన్న ముఖముతో ఐశ్వర్యములు వెదజల్లుచున్న ఆ త్రిలోచన మూర్తి యొక్క దర్శనమే సకల పాపహరము అనిపించెను. ప్రచేతసులకు రుద్రుడు ఈ విధముగా దర్శనమిచ్చెను......✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 691,692,692,693,694,695. (For more Information about Master EK Lectures please visit www.masterek.org)

[10/9, 8:34 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻ఇట్లు పలుకుచున్న జనార్దనుడు జనుల పురుషార్థములకు నిజమైన ఆధారమని దర్శించి, ఆ దర్శనము వలన ప్రచేతసులు రజస్తమోగుణములు రహితము చేసిరి. 


(ధర్మము ఆచరించినను నారాయణుని స్వరూపముగా తెలిసి ఆచరింపవలెను. ధనమును ఆర్జించి వినియోగించుట కూడా అట్లే చేయవలెను. దేహాది పోషణమునకై ఇంద్రియ సుఖములను గూడ అంతర్యామిగనే గుర్తించి అనుభవింపవలెను. ఈ పురుషార్థములకు వానిలో ఉన్న అంతర్యామి గాక మరియొక ఆధారమెట్లు కలుగును? ఈ సత్యమును తెలిసికొను సాధన చేయుటకు కూడా ఇంద్రియములే కావలెను. జీవితమును జనార్దనునిగా దర్శించు సాధనకు ఇంద్రియములే ఆధారము. ఇంద్రియములను మూసి ధ్యానము చేసి‌ లోపల జనార్దనుని దర్శింప యత్నించువాడు మరల బాహ్యప్రపంచమున‌ కన్నులు తెరచినంతనే లోకమంతయు దైవేతరమైన మాయగా గుణములతో విజృంభించి బంధించును. కనుక రజస్తమో గుణములు మరల, మరల జీవియందు  విజృంభించుచుండును. ఈ ఆపద నుండి తప్పించుటకు ఇంద్రియముల మార్గముననే బాహ్యప్రపంచమును నారాయణుడుగా ఉపాసింపవలెను. అప్పుడే ప్రచేతసులు రజస్తమో‌ గుణములను ధ్వంసము చేయుదురు. ఈ పవిత్ర యజ్ఞము కొరకే వారి ఇంద్రియములుగా పనిచేయవలసి వచ్చినది. భాగవతునకు ఇంద్రియములును, మనస్సు జీవులను ఉద్ధరించుటకేగాని బంధించుటకు గాదు.) 


ప్రచేతసులు చేతులు జోడించి గద్గద కంఠముతో భక్తిపరవశులై ఇట్లనిరి: స్వామీ నీవు అందరికిని శరణ్యము. నిన్ను గూర్చి ఇట్టి వాడవని గణించుట వెర్రి. ఈ సమస్తము నీది అనబడు లక్ష్మీదేవియే గదా? నీవు లక్ష్మీపతివి. కనుకనే ఈ సమస్తమునందు దేనిచేతను జయింపబడవు. నీవు గుణములచే కట్టుపడక గుణములకు అధిపతిగా ప్రకాశించుచున్నావు. కనుకనే సద్గుణములు నీ సంపద.‌ నీ ప్రవర్తనము నందు ఎవ్వరును లోపములు ఎన్నలేరు. (లోపములు ఎన్నువాని యందు పుట్టును. నిన్ను స్మరించినచో లోపములు ఎక్కడ? కనుక నీవు పవిత్రుడవు. నీలో పొరపాటు ఉండదు. నీ నుండి జీవి పొరపడవచ్చును). 


నీవు పరమేశ్వరుడవై సంసారబంధ విమోచనము చేయుచున్నావు. (ఇంద్రియాదులలో దేనిని చూచినను భవబంధము కలుగును. దాని యందు నిన్ను చూచినప్పుడు బంధ విమోచనము అగును)........✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 916,917 (For more Information about Master EK Lectures please visit www.masterek.org),

[10/9, 8:34 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻ఈ మారిషను వృక్షజాతిలో ప్రచేతసులు వివాహమాడుదురు దశేంద్రియములు వృక్షముల యందు జీవరసమున మాత్రమే ఉండును. అన్నియు కలిసి ఒకటిగా ఉండును. వృక్షములకి ఇంద్రియ విభాగము లేదు. శబ్దము, కాంతి, స్పర్శ మున్నగునవి అన్నియు ఒకే అనుభవముగా పొందబడును. సుఖస్పర్శగాని నొప్పిగాని ఒకే అనుభవముగా చెట్టు మొత్తమునకు కలుగును. ప్రాంతీయమైన అనుభవము లేదు. పెంచి పోషింపబడుచున్నపుడు గాని, కోసి తినుచున్నపుడు గాని వృక్షములు ఒకే అనుభవమును పొందును. కనుకనే గడ్డికోసిన తరువాత పెరుగుట, చెట్లు కొమ్మ నరికినచో చిగురించుట ఉండును. జంతువులకు నరులకు ఇంద్రియములు వేరు వేరుగా విడిపోవుట చేతను, ఒక్కొక్క ఇంద్రియమునకే భౌతికమైన ఉపాధి ఏర్పడుట చేతను నరకినచో చిగుర్చుట సాధ్యము కాదు. 


దీనిని అనుసరించియే సంస్కారవంతులైన ఋషులలో వృక్షములను తినవచ్చుననియును, జంతువులను తినరాదనియును ఒక సంప్రదాయము ఏర్పడినది. ఇంద్రియ విభాగములు ఏర్పడని జీవరసము తొలిజాడలైన వృక్షచేతన్యముల వృత్తాంతము ఇందు వర్ణింపబడినది. ప్రచేతసులు అభిన్న ధర్మశీలురు. మారిష గూడ అభిన్న ధర్మశీలగా పతివ్రతగా వర్ణింపబడినది. వృక్షములందు ఈ ధర్మములన్నియును ఏకత్వమున ఉండునని అర్థము. 


అటుపైన ప్రచేతసులు పదివేల దివ్యసంవత్సరములు అడ్డులేని తేజస్సుతో భౌతికములు, దివ్యములు అగు సుఖములను అనుభవించిరట. అనగా వృక్షముల నుండి జంతువులు నరులు పరిణామమందుటలో ప్రచేతసులు ఇంద్రియ ప్రవృత్తులను వేర్వేరుగా సాధించిపెట్టిరి. భౌతిక దేహములందు భౌతిక సుఖములు, తపోమయాది దివ్యదేహములందు దివ్యసుఖములు ప్రచేతసుల వలననే జీవులకు కలుగుచున్నవని అర్థము. అందు భౌతికసుఖములు సంసారబద్ధులకును, దివ్యసుఖములు చిత్తవృత్తి నిరోధము చేసినవారికిని ప్రచేతసులచే అందింపబడినవి. 


నరులలో మొదట భౌతిక సుఖముల అనుభవము, అటుపైన వయస్సునుబట్టి వాని యందు వైరాగ్యము పుట్టుటయు ఇంద్రియముల ద్వారముననే కలుగుచున్నది. కనుకనే కొంతకాలము సుఖములను అనుభవించి అటుపైన అవి నరకములని గ్రహించి, నా స్థితిని పొందగలరని విష్ణువు వారికి వరమిచ్చెను.....✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 911 (For more Information about Master EK Lectures please visit www.masterek.org)

రుద్రగీత గురించి ఈ blogspot లో చూడండి

http://srimadbhagavatasudha.blogspot.com/2013/03/30.html ఇది ఓపెన్ కాకపోతే ఈసారి పోస్ట్ లో రుద్రగీత విశేషాలు ఉంటాయి 

శ్రీమద్ భాగవతములో రుద్రగీత వైభవం

 [10/8, 11:06 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻ప్రచేతసులతో విష్ణువు ఇంకనూ ఇట్లనెను......మీకు రుద్రడు ఉపదేశించిన రుద్రగీత అనబడు స్తోత్రమును ఎవడు నిత్యమును అధ్యయనము చేయునో వాని అభీష్టములు అన్నియు సిద్ధించును. ప్రజ్ఞ శుభమైన మార్గమున వర్తించును. (కనుకనే వారి అభీష్టములు కోరదగినవిగా మాత్రమే ఉండుట, నెరవేరుట జరుగును). 


మీరు సంతోషముతో తండ్రి ఆజ్ఞను స్వీకరించిరి కనుక మీ కీర్తి లోకములందు వ్యాపించును. (పంచేంద్రియములు తండ్రి నుండి కొడుకునకు ప్రసాదింపబడును. మరియు తండ్రి మాటను సుతుడు పాటించినచో ధర్మమార్గము ఏర్పడి నరుడు లోకమున కీర్తిమంతుడు అగును.) 


మీకు పరబ్రహ్మముతో సమానమైన గుణములు గల పుత్రుడు ఉద్భవించును. (పరబ్రహ్మమునకు గుణములుండవు. అతని నుండి పుట్టినవాడును, అతని సృష్టికొరకై గుణములను పొందినవాడును చతుర్ముఖ బ్రహ్మ. వానితో సమానుడైన పుత్రుడు ఉద్భవించి బ్రహ్మవిద్యను అందించునని అర్థము. ఇచ్చట పదిమందికి ఒకడే పుత్రుడుగా వరము ఈయబడినది. అతడే మనస్సు. పిండాకారమగు జీవి యందు మెలగుచున్న చతుర్ముఖ బ్రహ్మయే జీవి మనస్సుగా సాక్షాత్కరించును. అది పుట్టుకచేత నిర్మలము, త్రిగుణాత్మకము, ఇంద్రియముల వలన వ్యక్తమగు అస్తిత్వము కలదియు అగును.) అతడు మీకు ఆత్మసంతతిగా జన్మించును. (దేహము పుట్టుట కాదనియు ఆత్మకు ప్రతిబింబమైన మనస్సు పుట్టుట అనియు భావము). 


పూర్వము కండు అను మహాముని తపస్సు చేయుచండగా వాని తపస్సు భంగము చేయుటకై ఇంద్రుడు ప్రమ్లోచ అను అప్సరసను పంపెను. ఆమె అతని వలన గర్భము దాల్చి అతనిని విడిచి స్వర్గమునకు బయలుదేరుటకు ముందు పుత్రికను కనెను. ఆ బిడ్డను చెట్లలో వదలిపోయెను.......✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 909 (For more Information about Master E.K. Lectures please visit www.masterek.org)



శ్రీహనుమాన్ స్వామి వారి సుందరకాండ పారాయణం వైభవం ఒకేసారి వినండి ....

 రోజూ కనీసం వినినా చాలు ..వినిశ్రీ సీతా రామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి వారికి నమస్కారం చేసుకో0డి చాలు ..టీటీడీ svbc ఛానల్ లో ప్రతిరోజూ ఉదయం 7గంటలకు ,మళ్ళీ 9 గంటలకు వినండి తరించండి 

                                   ఓం నమో వే0కటేశాయా ...........జయ జయ హనుమ జయ జయ శ్రీరామ 


నిరీక్షణ Shortstory. Part ......4 NIREEKSHANA

కిరణ్ ..ప్రియ చదువుకుంటూ ఉన్న కాలేజ్ కి బయలు దేరారు ..ప్రియ  ని కల్సి తాను ఎంతగా ప్రియ  ని ఇష్టపడుతున్నది  .. తనకు   తన ఇంట్లో వాళ్ళందరికీ  కూడా ..నువ్వు అంటే ఇష్టం ..అని .మనం  ఓకే చెప్పితే ..మా ఇంట్లో వాళ్ళు మన పెళ్ళి ఆనందం గా చేస్తారని ..ఇలా ఎంతో చెప్పాలని ప్లాన్  లు వేసుకొని బయలు దేరాడు ..ఇదివరలో  సైకిల్ పై తొక్కుతూ నాకు ..ఈ సమయంలో ఇక్కడ కని పించిందే ..అని ఆలోచించుకుంటూ కాలేజి ముందు లాంజ్ లో సిమెంట్ బల్ల పై కూర్చొని ప్రియ కోసం నిరీక్షిస్తూ వున్నాడు కిరణ్ ..బాబ్ది హెయిర్ ..పైన ఒక టోపి పెట్టుకొని సైకిల్ నడిపిస్తూ లోపలికి వస్తూ కనిపించింది ప్రియ ..పరిశీలన గా చూస్తున్నాడు కిరణ్ . ఆమె పక్కనే ఎవరో ఆమె బాయ్ ఫ్రెండ్ లా గా వున్నాడు .వాళ్లిద్దరు నవ్వుకుంటూ వస్తూన్నారు ...కిరణ్ వైపు చూసింది ..కావాలనే చూడనట్టు గా  చూపు మరల్చింది ...కిరణ్ కు దగ్గర నుంచే లోపలికి నడిచారు ....కిరణ్ లోపల కొంచెం బాధ అనిపించింది ...కొద్దిసేపు ఆలోచించాడు ..ఏమి చేస్తాం ..మన ప్రయత్నం చేయాలి ..అస్సలు ఎంతచేసినా నా లాంటి వాళ్లకు కల్సి రావడం ..లక్ దానంతట అది తగలడం ఈ జన్మ లో ఎప్పుడైనా తగిలిందా ..మరి లేదు ..కదా అందుకే ..చూద్దాం  నా కృషి నేను చేస్తాను ..అలానే లోపలికి వెళ్ళి ..పిలిచాడు ..ప్రియా .ప్రియ ..పిలిచాడు

..కిరణ్ ...వెనక్కు తిరిగి చూసింది  .హలొ కిరణ్ ..నువ్వా ! ఏమిటి ఇక్కడ ..కొద్దిగా చిరునవ్వు ఇస్తూ దగ్గరకు వచ్చింది ..ప్రియ ..ఏమో లే ఇందాక నిజంగానే చూడలేదేమో ..లేకపోతే ఇంత ఆనందంగా వస్తుందా ..మళ్ళీ ఆలోచనలో పడ్డాడు కిరణ్ ..ఇక్కడ కొంచెము ఒక ప్రొఫెసర్ గారిని కలవాలి ..వచ్చాను ..అని మాట్లాడుతూఉండగానే ..బాయ్ ఫ్రెండ్ వచ్చి పక్కనే నిలబడ్డాడు ..అవును బై ది బై ..ఈయన అనిల్ ..నాకు బెస్ట్ ఫ్రెండ్ ..అనిపరిచయం చేసింది ..అవునండి నేను ప్రియ కు హోల్ అండ్ సోల్ మొత్తం నేనే .అని పెద్దగా నవ్వుతూ  కిరణ్ చేయు పిసికాడు అనిల్ ..పలక రింపులు కాగానే ..బై మేము క్లాస్ కి వెళ్తాము అని చెప్పి ఇద్దరు అక్కడనుంచి వెళ్లిపోయారు ...కిరణ్ ని చూడగానే వాళ్ళ క్యాంటీన్ కు ఆహ్వానించి కాఫీ ..అందంగా తాగిస్తుందని కలలు కన్నాడు కిరణ్ ..ఏమిచేయాలి ఆలోచనలలో పడి పోయాడు కిరణ్..........

*                                  *                                 *                                       *

డిగ్రీ ఫైనల్ సంవత్సరం చదువుతున్న శివనారాయణ  ఆర్థిక పరిస్థితులు అంతగా బాగోలేక పోవడం వల్ల బ్యాంకు లో ఆఫీసుఅసిస్టెంట్ జాబ్ లోపెట్టించాడు ...వాళ్ళ నాన్న గారు ..కాలేజ్  లు తెరిచారు  ..తండ్రి కాంతారావు కి ఆరోగ్యం బాగుండలేక కాలేజీ కి వెళ్ళడం మానేసింది అరుణ  .ఒక్క పుస్తకం కొనలేదు ..కనీసం కాలేజీ లో ఏమి జరుగుతుందో కూడా ఏమీ తెలియడం లేదు ..శివనారాయణ అయినా వచ్చి కనిపిస్తాడు అనుకుంటే అస్సలు ఇంతవరకు అతని జాడ లేదు రోజులు వేగంగారోజులు నెలలు  తిరిగిపోతున్నాయి ..ఒకరోజు అరుణ తల్లి  కొత్త గా పెట్టిన గవర్నమెంట్ బ్యాంకు కి వెళ్లి  తన నగలు పై ఎంత అప్పు ఇస్తారో తెలుసుకోవాలని వెళ్ళి0ది  ...అక్కడ ఆమెను బ్యాంక్ లో పలికి తీసుకొని వెళ్లి .మ్యానేజర్ కి. మా దేవాలయం  దొరసాని గారు అంటూ పరిచయం చేశాడు ..వాళ్ళ జమీందారి కుటుంబం .అన్నివిషయాలు వివరించి చెప్పాడు ఆఫీస్ అసిస్టెంట్ శివనారాయణ .ఇంకే ఉంది నాయనా అవి అన్ని చెబితే అప్పు అడుక్కోవడం సిగ్గు గా ఉంటుంది బాబు ఇక చెప్పింది చాలు బాబు .నువ్వు కనిపించడం లేదు అనుకున్నాను ఇక్కడ చేరావా? ..కొంచెం మెల్లగా అడిగింది అరుణ తల్లి ..అవును అమ్మ గారు ..మా ఇంట్లో వాళ్ళు ఒకటే గోల చదివింది చాలు ..దీనిలో చేరితే ఒక దారి దొరుకుతుంది ..అని నాన్నగారు దీనిలో చేర్పించారు .. చెప్పుకుంటూ పోతున్నాడు శివనారాయణ .అక్కడ పని పూర్తికాగానే .బైట వరకు వచ్చి ఆమె ను గౌరవంగా సాగ నంపాడు ..ఇంటికి చేరుకున్న తల్లి బ్యాంక్ లో శివనారాయణ కనిపించిన విషయం తో సహా అన్ని విషయాలను మొత్తం వివరించి చెప్పింది ఎలా అయినా సరే  ఇక ఒక రోజు వెళ్ళి శివనారాయణ ని కలవాలి అని నిర్ణయం తీసుకుంది ..అరుణకుమారి .

*                                           *                                  *                                 *

తాను ప్రేమిస్తున్న ప్రియ ని ఎలాగైనా కలవాలి , కల్సి తన భగ్న ప్రేమ ను చెప్పాలని

కలలు కంటూ ప్రియ ఇంటికి వచ్చాడు కిరణ్ . కాలింగ్ బెల్ శబ్దం విని తలుపు తీసింది ప్రియ ..ప్రియ ..వచ్చి తలుపు తీసినందుకు లోలోపల పొంగి పోతున్నాడు కిరణ్ . సోఫా చూపించి కూర్చో ..అంటూ లోపలికి వెళ్ళిపోయి0ది ప్రియ .చాలాసేపు మౌనం ..పిలిచినా ఎవ్వరూ రావడం లేదు ..ఇక ఇంటి లోపల గది లోకి వెళ్ళాడు కిరణ్ ..అక్కడ పగలబడి నవ్వుతూ ఉన్న  ప్రియ ఆమె బాయ్ ప్రెండ్ అనిల్ ఏవేవో జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ వున్నారు ..వెళ్లిపోతున్నవా సరే బై ..నేను అనిల్ కంబైన్ స్టడీ చేస్తున్నాం ..కొంచెం బిజీగా ఉన్నా ..అమ్మ  నాన్న గారు ఎక్కడో కొంచెము దూరం వెళ్లారు  .రాత్రి కూడా నేను ఒక్కదానినే వున్నా  .అనిల్ రాత్రంతా తోడుగా. ఉండి కంపెనీ ఇచ్చాడు వాళ్ళు ఇంకా రాలేదు  అంటూ ఆమె చెబుతున్నమాటలుపూర్తికాకుండానే వెనుతిరిగి రోడ్డు మార్గం పట్టాడు కిరణ్ .అస్సలు అప్పుడే కాలేజీ లో చూశా ను అనిల్  భాగోతం అప్పుడే  కాలేజీ లో చూసినప్పుడే సగం అసహ్యం పుట్టింది ..అయునా నా లవర్ ..నా చుట్టం అది ..నాకు రైట్స్ ఉన్నాయి ..వీడుఎవడో ఎక్కడినుంచో వచ్చాడో చూస్తాను .వాడికి గుణపాఠం చెబుతాను ..హాస్టల్ కి చేరుకున్నాడు ..త్వర త్వర గా తయారై డాక్టర్ రమణ గారి దగ్గరకు చేరుకున్నాడు ..అనిల్ .......కొద్దిసేపు పేషంట్స్ తో బిజీగా వున్న డాక్టర్ రమణ బైటకు వచ్చాడు ..సార్ ..నమస్తే ..లేచి నిలుచున్నాడు ..కిరణ్ .మిమ్మల్ని కలవాలని వచ్చాను సార్ ..
                                                                {......   To be continued}. .......      ఇంకా ఉంది)

 

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online