Pages

మిత్రులందరికీ, శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ త త్ తుల్యం రామ నామ వరాననే
3 సార్లు చదివితే ...శ్రీ విష్ణు సహస్రనామ0  ఒకసారి చదివినట్లు లెఖ్ఖ గా సాక్షాత్తు శివభగవానుడు పార్వతి అమ్మవారికి చెప్పినట్లు గా పెద్దలు చెబుతారు


ఆ పదలలో కూడా ,చెడు, పీడ కలల నుంచీ రక్షించేది శ్రీరామ రక్షా స్తోత్రం అందరూ చదువుకో0డి ..రక్షింపబడండి ...జయ జయ శ్రీరామ్ ...జయ జయ రాజారామ్ రాజారామ్ జయరామ్ రాజారామ్ ..అనే గొప్ప మంత్రం కూడా షిర్డీసాయి భగవానుడు.. ఉపదేశం ఒక భక్తుడి కి షిర్డీ లో ఆ రోజుల్లో ఇచ్చారు  కాబట్టి ఆ నామ0 చదువుకున్నా ...జపం చేస్తున్నా చాలు శుచి గా లేము ఎలా అనుకోవక్కర్లేదు మనస్సులో లోపల ఎప్పుడైనా ఎవ్వరైనా ఎక్కడైనా చదువుకోవచ్చు అదే రామతారక నామ గొప్పతనం.


వాల్మీకి మహర్షి ప్రకారం ఆయనకు పదహారు లక్షణాలు ఉన్నాయి.
1. గుణవంతుడు
2. వీరుడు
3. ధర్మజ్ఞుడు
4. కృతజ్ఞుడు
5. సత్యం పలికేవాడు
6. దృఢమైన సంకల్పం ఉన్నవాడు
7. ఉత్తమ చరిత్ర కలిగినవాడు
8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు
9. విద్యావంతుడు
10. సమర్థుడు
11. సౌందర్యం కలిగిన వాడు
12. ధైర్యవంతుడు
13. క్రోధాన్ని జయించినవాడు
14. తేజస్సు కలిగినవాడు
15. అసూయ లేనివాడు, ఇతరుల్లో మంచిని మాత్రమే చూసేవాడు
16.ఈ సృష్టిలో ఎవరి కోపాన్ని చూసి దేవతలు కూడా భయపడతారో అటువంటి వ్యక్తి!

దశరథ మహారాజు రాముడ్ని పిలిచి రేపే నీ పట్టాభిషేకం అని చెప్పగానే, సరే అంటాడు. ఆ కాసేపటికే కైకేయి రామా! నీవు వనవాసం చేయాలని చెబుతుంది.
ఆ క్షణం కూడా అంతే శాంత స్వభావంతో సరే! అంటాడు.
ఒక్కసారి మనం పక్కనున్న కాటారం అడవిలో నెలరోజులు ఉండి వద్దాం... అడవి సంగతేంటో తెలుస్తుంది.
అలాంటిది ఒక యువరాజు.... పో! అనగానే నారబట్టలు కట్టుకుని
లగెత్తుకుని పోయాడు.
కన్నతల్లిని, కన్న ఊరిని విడిచి వెళ్తుంటే కలిగే బాధ ఎంతో మనందరికీ తెలుసు.
ఇప్పటికీ సొంతూరు గుర్తుకు వస్తే,బాల్యమిత్రులు గుర్తుకు వస్తే మనసేదోలా ఐపోతుంది.
కన్న ఊరు విడిచి వేరేప్రాంతాలలో బతికే మిత్రుల హృదయాలలో ఊరితో బంధం ఎంత బరువో వారిని అడిగితే వారే చెప్తారు.

మన అమెరికా మిత్రుల హృదయాల తడిని మనం అర్థం చేస్కోగలమా?
లాగే పాశం ఓదిక్కు....
కర్తవ్యం ఓ దిక్కు....
ఈ కొరోనా కాలంలో అదో పీడకాలం.....

అలాంటిది రాముడు వేల ఏండ్ల క్రితమే రాజ్యాన్ని త్యజించడమెంత కఠినతరం!

14 సంవత్సరాలు ఒక ఊరితో సంబంధం తెగిపోతే అతనికి ఆ ఊరిపై హక్కు ఉండదనేది ఆనాటి చట్టం.

ఇంకోమాట ఎవరి గురించో ఎందుకు?
ట్రాన్స్ఫర్ అంటే నా మనసే ఏదోలా ఐపోతుంది.
కొందరైతే గింగిరాలు తిరిగి పోతారు.

ఇక రాముని అణకువ చూద్దామా....
మున్యాశ్రమంలో అడుగు పెడితే విల్లుయొక్క అల్లెతాడును విప్పేసేవాడు.
ప్రస్తుతం పోలీసులు, రాజకీయ నాయకులు గన్మెన్ లతో గుళ్ళలోకి ప్రవేశించడం కద్దు.

ఇప్పుడు చెప్పండి....
రాముని వినయం, అణకువ. మనకున్న అహం.

ఇక ఎంతటి విధినిబద్ధత కలవాడో ఇప్పుడు చెప్తా!

తాటకిని సంహరించి, మారీచసుబాహులను నిగ్రహించి యాగరక్షణ చేసి అలసిపోయినా, తెల్లవారే విశ్రాంతి కూడా తీసుకోక విశ్వామిత్రుడి చేరి తదుపరి ఆదేశాలకోసం చేతులు కట్టుకుని నిలబడతాడు.
అప్పుడు ఆ పిల్ల రాముని వయసెంతో తెలుసా!!!

(ఊనషోడశవర్షో మే రామో రాజీవలోచనః౹
న యుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః౹౹
పదహారేళ్ళు కూడా నిండని వాడు....రాక్షసులతో యుద్ధం చేయగలడని నేననుకోనంటాడు విశ్వామిత్రుడితో దశరథుడు.)

ఇలాంటి సందర్భంలో మనమెలా ప్రవర్తిస్తామో మనమే ఊహించుకుందాం.

ఎలక్షన్ డ్యూటీ తర్వాత సెలవుల కోసం తహతహలాడే ప్రభుత్వ ఉద్యోగుల బాధలెన్నో

సాయం చిన్నదో.....పెద్దదో, చేసిన ఉపకారానికి కృతజ్ఞతాభావం తప్పడు. గుహుడు అన్నా, జటాయువు అన్నా అందుకే ప్రేమ.
శత్రువు సోదరుడైన విభీషణుడు శరణు కోరివస్తే ఆశ్రయం కల్పిస్తాడు. శరణు ప్రసాదిస్తాడు. సమాజంలో ఎంతమంది అలాంటి వారున్నారు?
చిన్నమాటకు పక్కింటివారితో యుద్ధానికి దిగుతాం.
చిన్న తప్పుకే మిత్రులను శత్రువుల్లా చూస్తాం.

కఠోరశిక్షను అనుభవించిన అహల్యకు పాదాభివందనాలు చేసి ఉద్ధరించిన కరుణాంతరంగుడు.
(17/49/బాలకాండ)

మనలో ఎంతమంది తప్పైంది అని ఒప్పుకున్న వారిని అక్కున చేర్చుకుంటున్నాం?
ఆ తప్పు గురించి వేరే వారివద్ద చర్చించకుండా ఉంటున్నాం?

ఎదురుచూసీచూసీ, వచ్చిన తడవుగనే పండ్లుపెట్టిన శబరీమాతకు పుత్రుడిలా అంత్యక్రియలు నిర్వర్తించడం మన ఊహకందనిది.
మిత్రులు, బంధువులు చనిపోతే శవమెత్తడానికి సంశయించడం మన సాధారణ స్వభావం.


ఇక రాముడి మరో గొప్ప లక్షణం....
నాయకత్వం.
కోతుల సాధారణ లక్షణం చపలచిత్తం.
అలాంటి వానరులను నియంత్రణలో పెట్టుకుని, లంకను జయించడానికి ఎలాంటి నాయకత్వ లక్షణాలు ఉండాల్నో మీరే ఆలోచించండి.

సీతను అగ్నిలో దూకమన్నాడంటారు...

వదిలేసాడంటారు.

సీతాపహరణం తర్వాత రాముని ఏడ్పులు, పెడబొబ్బలు 57 నుండి 67 వ సర్గ/అరణ్యకాండలో చూస్తే రాముడి ప్రేమ అర్థమౌతుంది.
పెళ్ళాల మీద,మొగుళ్ళ మీద కుళ్ళు జోకులు వేసుకుని సంతోషించే మనకు ఆ ఏడ్పులు అంతబాగా అర్థం కావనుకుంటా!


సీత అగ్నిప్రవేశం ఎపిసోడ్ చదివి ఏమైనా అంటే బాగుంటుంది.
మనల గురించి తెలీక ఏదైనా అభాండాలు వేస్తే మన మనసెంత బాధపడుతుంది?
కానీ, ధర్మ సూక్ష్మాలు తెలియక ఆయన మీద నిందలు చాలా సులభంగా వేసేస్తాం.

చిన్నమదేవి నిద్రలో కాలేసిందని కొన్నేళ్లు వదిలేసిన ముగ్గురు భార్యలు,మూడువందల ఉంపుడుగత్తెలున్న శ్రీకృష్ణ దేవరాయలూ మనిషే!

పిల్లలకోసం నలుగురు భార్యలను మనువాడిన దశరథుడూ మనిషే!
పెళ్ళై అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారూ మనుషులే!

పదుల సంఖ్యలో భార్యలు, వందలువేల సంఖ్యలో లైంగిక బానిసలున్న రాజులూ,చక్రవర్తులూ మనుషులే!

జీవితంలో కనిపించే అందగత్తెను,అందగాన్ని ప్రేమించి, కామించే వారూ మనుషులే!

ఒకతే భార్య, ఒకటే మాట అని జీవించిన రాముడూ మనిషే!

ఆయన గురించి నేను చెప్పింది కొంతే....
ఆయనను దేవుడని మొక్కుదామా?
ఆయన మన పూర్వీకుడని అనుసరిద్దామా అనేది మనిష్టం.....

🙏

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online