Pages

అక్షయతృతీయ గురించి తెలుసుకుందాము

వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభం అయుంది అని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆనాటి ది ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది ....ఇంకా ఈ నాటి తృతీయ రోజునే శ్రీమహావిష్ణు వు అవతారం పరశురాముడు పుట్టాడు అనికూడా తెలుస్తోంది .
మత్యపురాణములో శివుడు ,పార్వతీ అమ్మవారికి అక్షర తృతీయ చాలా విశిష్ట మైనది ..అని ఆ రోజు చేసే దానాలు అక్షయమై ..అంటే నాశనము లేకుండా ఆ ఫలితం ఎప్పటికీ ఉంటుంది .బ్రహ్మ కు ప్రధానమైనది అలానే శ్రీమహావిష్ణువు ఆరాధన కూడా అత్యంతవిశిష్ట మైనది ..కొంతమంది.. అక్షతలు..తో కల్పిన నీటిని తలస్నానం చేస్తారు ..శ్రీమహావిష్ణువు వద్ద బియ్యం ఉంచి నమస్కారం చేసి ...ఆ బియ్యాన్ని ...బీద బ్రాహ్మణులు కు లేదా గుడి లోని అర్చకుల కు దానం ఇచ్చి ఆశీస్సులు పొందవచ్చు ...అవి కూడా అక్షయం గా ఫలితం ఇస్తాయి .చాలా ముఖ్య విషయం ఏమిటంటే మనం చేసే దానాలు పై లోకంలో ఉన్న పితృదేవతలకు ..చాలా పుణ్యాన్ని తెచ్చిపెడతాయు అందుకే కొందరు వాళ్ళ పితృదేవతలు పేరుతో కానీ వాళ్ళ ఇంట్లో గతించిన వారి పేరు మీద గాని చలివేంద్రం పెట్టి ఈ ఎండా కాలములో మంచినీటిని కుండలు పెట్టి వచ్చి పోయే జనాలకు ,బాటసారులకు ,అడవిలో జంతువులకు ,కూడా దప్పిక తీరుస్తూ ఉంటారు .అలానే బ్రాహ్మణులు కు ,అలానే ఎవరైనా ముస్సలి వారికి చేతికఱ్ఱలు, విసనకఱ్ఱలు ,కొత్త ధోవతులు ..బట్టలు ముఖ్యంగా ఎండలో కాళ్ళు కాలకుండా చెప్పులు ,గొడుగు ఇటువంటివి దానం చేయాలి ...ఆ పుణ్యం కూడా అక్షయమై .జన్మ తరువాత పై లోకాల్లో స్వర్గసుఖాలు ,మ ళ్ళీజన్మ ఎత్తి భూమిపై పుడితే అప్పుడు కూడా ఆ పుణ్యం అక్షయమై ..మంచి శుభాలు ను ,సుఖాలు ను కూడా ఇస్తుంది .అంతే కానీ బంగారం కొని దాచుకుంటే అది పిల్లలు పెట్టి అక్షయమై కొన్ని టన్నులు... టన్నులు అవుతుంది అని ఎక్కడా చెప్పివుండలేదు ...కాకపోతే ఏదైనా సువర్ణ అంటే బంగారు దానాలు ....పితృదేవతలు... పెద్దలు గతించిన వారి పేరు మీద ఇస్తే అది కూడా చాలా విశిష్టమైన ,అక్షయమై న దానంగా మంచి ఫలితాలను ఇస్తుంది .అలానే పశుగ్రాసం ,దాణా కూడా అంతే ..ఇక ప్రతీ దానం బ్రాహ్మణులు అని ఎందుకు అంటారు ...బ్రాహ్మణులు...వాళ్ళు వ్రాసుకున్నవి కదా అంటారు ...కానీ అది నిజం కాదు ..వాళ్ళే వ్రాసుకొని ఉంటే ..మరి వాళ్ళు కూడా ఉపవాసాలు ,పండుగలు ,వ్రతాలు ,గ్రహ సమస్యలకు దానాలు .....పురాణాలు, శాస్త్రాల లో చెప్పిన వి ..అన్నీవాళ్ళు కూడా ఆచరిస్తూ ఉన్నారా ?లేదా?..ఇతరులు ఒక్కరే చేస్తుంటే వాళ్ళు వదిలేసి తిరుగుతూ ఉన్నారా లేదే ..
బ్రాహ్మణులు కూడా గుళ్ళు, గోపురాలు పూజలు,శాంతులు, హోమాలు ...దీక్ష లు అన్నీ ...ఇతర కులాల వారితో చేయిస్తూ,
వారు కూడా చేస్తూవున్నారు ...కాకపోతే ప్రతీది బ్రాహ్మణులు కు అని ఎందుకు అన్నారంటే ..దానం ఇస్తే అది దుర్వినియాగం misuse కాకూడదు అని ...దానం ఇవ్వగానే అది అమ్మేసుకొని పీకల వరకు తాగేసి భార్య ను కొడితే దానం వల్ల ఒనగూరే ప్రయోజనం రాదు ...బ్రాహ్మణులు అందరూ మంచి వాళ్లేనా?అని మనకు సందేహం రావచ్చు ఈ రోజుల్లో అందుకే సత్ బ్రాహ్మణులు కి అని చెబుతూవున్నారు ...అస్సలు బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కలవారు అని అస్సలు అర్థం ..అందుకే పెద్దలుబీదలు,చేతకానినివారికి ..అంటే ముదుసలి వారు ఏ కులం ఆయునా భగవంతుని రూపాలే .....అన్నీజీవులు ,అందరూ ..నేనే ...అందరిలోనూ నేను అంతరాత్మ గా వున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు గీత లో చెప్పాడు కదా .అలా చేయవచ్చు. తరువాత బ్రాహ్మణులు ఇచ్చిన దానం గుడిలో,లేక ఇంటిలో నిష్ఠ గా వండి దైవానికి నైవేద్యం అంటే నివేదించి...సమర్పించి తాను తింటూ ఇచ్చిన వారిని తలచుకొని పవిత్రంగా అన్న దాత సుఖీభవ అనే ఆశీర్వచనాలు చదువుతాడాని ,ఆ భగవంతుని చేత ఇప్పి0చుతాడని ప్రజల కు అనాదిను0చీ ఒక బలమైన విశ్వాసం. అంతే కాదు దత్తాత్రేయుడు అవతారం ,షిర్డీసాయి అవతారం ,త్యాగరాజు స్వామి వారు,పీఠాధిపతులు ,వామనా వతారం వరకు బ్రాహ్మణ రూపములో భిక్ష ను స్వీకరించిన వారు అగుట వల్ల .ఏవేవో.. కొంత వరకు అలా0టి ఆలోచనలు తో కూడా బ్రాహ్మణుడు కు దానం ఇవ్వాలని ..పైగా అగ్ని రూపం ,జ్ఞానం రూప0 బ్రాహ్మణులు అనియు ..పూర్వకాలములో భిక్షాటన చేసుకొని పరమార్థం గా జీవించడం వల్ల కూడా అనుకోవచ్చు .ఇంకా శాస్త్రాలలో బ్రాహ్మణ త్త్వం ..గురించి ఏమి చెప్పబడినదో ఇస్సారి సందర్భములో చూద్దాము .అలానే ..ఈ అక్షరతృతీయ రోజునే సింహచలం. ..అప్పల నారసింహస్వామి వారి చందనోత్సవం ..కూడా విశేషంగా నిర్వహిస్తారు ...ఆ స్వామి వారి కరుణా కటాక్షాలు మనందరిపై కురిసి ఆయురారోగ్య ఐస్స్వర్యాలతో మనందరిని వర్ధిలింప చేయమని ఆ లక్ష్మీనరసింహస్వామి వారిని వేడుకుండాము.
...సర్వేజనా:సుఖినోభవం తు... ఓ0...శాంతి..శాంతి. శాంతి:

పరశురాముడి అవతార విశేషం

*  ఓం ...ఓం .ఓం           ...                    రేపు పరశురామ జయంతి
పరుశు రామావతారం విశేషం తెలుసుకుందాం.





ఇదం బ్రహ్మ0..ఇదం క్షాత్రమ్ కుడివైపు హస్తం ,కుడివైపు భాగం బ్రాహ్మణ త్త్వం ..ఆశీర్వదిస్తూ ఉండే లక్షణం ఒకభాగం ,రెండో భాగం వామహస్తం ఎడమవైపు అది ఇదం క్షాత్రమ్ ..క్షత్రియులు.. ధర్మం ఆవలంబించు తుంది ....అని ప్రతిజ్ఞ చేసినవాడు ,సవాలు విసిరినవాడు పరశురాముని అవతారంఅంటే బ్రాహ్మణుడి గా అవతరించినా ..కూడా .శత్రువులను ఊచకోత కోయడానికి కూడా క్షత్రియులు లా దూకుతాడు అది అలా రెండు వర్ణములు కల్సిన అవతారం

పరశురాముడు విష్ణుమూర్తి దశావతారములలో ఆరవది. ఈ అవతారాన్నిఆవేశంతో ఉండే అవతారంగా చెప్పుకుంటారు  ... అంటే భగవంతుడికి ఆవేశం ఉన్నంతవరకే పరసురముసు తన అవతార లక్ష్యాన్ని నేరవేర్చగాలుగుతాడు. పరశురాముడు చిరంజీవుల్లో ఒకడిగా కుడా ప్రసిద్ధుడు . పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు అవతరించాడని స్కంద పురాణం మరియు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది.
పరశురామ జయంతి నాడు ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, *"జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!"* అని అర్ఘ్యప్రదానము చేయవలెనని వ్రత గ్రంధాలు తెలియజేస్తున్నాయి.
శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది.  త్రేతాయుగము ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని *భార్గవరాముడు, జామదగ్ని* అని కూడా అంటారు.
కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు. ఇలా జరుగుతుండగాస్ ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఉచీకుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళతాడు.
సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తన కొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని చెబుతాడు. ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో  జన్మించినవాడు పరశురాముడు. గాధి కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.
హైహయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వేయి చేతులు పొంది, మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు.
ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.
కాలం ఇలా నడుస్తుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని, సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా, అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరం కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.
ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు. ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను  నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథుని వంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. పరశురాముడు మహా పరాక్రమవంతుడు.ఇప్పటికి కేరళ ప్రాంతములో ఒక సరస్సు ప్రాంతములో క్షత్రియులు ను హతమార్చిన సందర్భములో ఆ నీరు ఎర్రగా అవుతుంది ..ఇప్పటికి అలానే ఎర్రగా ఉంటాయి అంటారు అక్కడి నీళ్ళు .
అలానే శ్రీరాముని అవతారం లో కూడ శివధనస్సు విరిచిన శ్రీ రాముని పరీక్షించిదలచి వస్తాడు ...అప్పుడు క్షత్రియులు అందర్నీ చంపాను కదా ...నీవు ఎక్కడివాడవు .అనగానే దశరథుడి కుమారుడని అని చెప్పగానే.. ఒక్క నిమిషం ఆలోచించి మనస్సులో అనుకుంటాడు అవును అప్పుడు కొత్త గా పెళ్లిచేసుకుంటున్న వధూవరులను ,స్త్రీలను చంపకుండా వదిలేసిన వాళ్లలో ని రాజు   ..అయ్యుఉంటాడు ..అని మనసులో ఊహించుకోగానే కళ్ళకు ..శ్రీమహావిష్ణువు అవతారం గా శ్రీరాముడు ..పరశురాముడు కి కనిపిస్తాడు ...అక్కడినుంచి పరశురాముడు..సాష్టాంగ పడి చేతులుజోడించి అడవిలోకి తపస్సులోకి వెళ్ళిపోతాడు ..
ఇక్కడ ..పరశురాముడు కు శ్రీరాముడి ని గుర్తించడం అన్నది ఒక దైవ సంబంధ ఘటన ..అంతేకాని సాక్షాత్తు పరశురాముడు.. శ్రీమహావిష్ణువు అవతారం ..ఆయన శ్రీరాముడి ని గుర్తించలేక కాదు ..అలా ఎందుకు జరిగిందో ..కూడా ఒకకధ ఉంది పరశురాముడు గురించి ఇంకా చాలా విషయాలు వున్నాయి.ఇస్సారి సందర్భంలో మళ్ళీ చర్చించుదాం .........శుభం భూయాత్.
వైశాఖ పురాణం


విశాఖ నక్షత్రం పేరుతో వస్తే( ...పౌర్ణమి చంద్రుడు ఆ రోజునుంచి ఆ నక్షత్రం పేరుతోతెలుగు నెల ప్రారంభం .అవుతుంది .).కాబట్టి వైశాఖమాసం


వైశాఖమాసమున చేయవలసిన వివిధ దానములు - వాని ఫలితములు

నారదమహర్షి అంబరీష మహారాజుతో మరల నిట్లనెను. అంబరీష మహారాజా! వినుము. విష్ణుప్రీతికరమగుటచే మాధవమాసమని వైశాఖమునందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసములేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేదసమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థ జలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుటవలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు.

నిరాహారముగ చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుటవలన వచ్చు సుఖమునకు సాటియైన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజనతృప్తితో సమమైన తృప్తి వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మసమమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీమహావిష్ణుసముడైన రక్షకుడు, వైశాఖసమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు.

శేషశాయియగు శ్రీమహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగ గడపిన వాడు ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్ష్యాది జన్మలనందుచున్నాడు. వైశాఖమాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగువానినెన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖమాస వ్రతమును పాటింపనిచో యివి అన్నియు వ్యర్థములగుచున్నవి. వైశాఖవ్రతమును పాటించువానికి మాధవార్పితములగావించి భక్షించి ఫలాదులకును శ్రీమహావిష్ణు సాయుజ్యము కలుగును. అధికధనవ్యయముచే చేయు వ్రతములెన్నియో యున్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములును యెన్నియో యున్నవి. . కనుక నియమ పూర్వకమైన వైశాఖమాస ప్రాతఃకాల స్నానము పునర్జన్మను పోగొట్టును అనగా ముక్తినిచ్చును.

అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములయందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖమాసమున జల దానము చేసినంతనే వచ్చును. ఆ దానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి కల మరియొకనిని ప్రబోధించినచో అట్టివానికి సర్వసంపదలు కలుగును. హితములును చేకూరును. దానములన్నిటిని ఒకవైపునను జలదానమును మరొకవైపునను వుంచి తూచినచో జలదానమే గొప్పది యగును.

బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రము నేర్పరచి జలదానము చేసినచో వాని కులములోని వారందరును పుణ్యలోకములనందుదురు. జలదానము చేసినవారు విష్ణులోకము నందుదురు. చలివేంద్రము నేర్పరచుటచే బాటసారులు, సర్వ దేవతలు, పితృదేవతలు అందరును సంతృప్తులు ప్రీతినంది వరముల నిత్తురు. ఇది నిస్సంశయముగ సత్యము సుమా. దప్పికగలవాడు నీటిని కోరును. ఎండ బాధపడినవాడు నీడను కోరును. చెమటపట్టినవాడు విసురుకొనుటకు విసనకఱ్ఱను కోరును. కావున వైశాఖమాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు, జలమును(నీరుకల చెంబును), గొడుగును, విసనకఱ్ఱను దానమీయవలెను. నీటితో నిండిన కుంభమును దానమీయవలయును.

దప్పిక కలవానికి చల్లని నీటినిచ్చి యాదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకుడస్సిన వానికి విసనకఱ్ఱతో విసిరి యాదరించినవాడు ఎండకుడస్సినవానికి విసురుటకు విసనకఱ్ఱ లేనిచో పైబట్టతో(ఉత్తరీయము) విసిరినవాడు పాపవిముక్తుడై విష్ణుసాయుజ్యము నందును. పరిసుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకఱ్ఱ నిచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము పొందును

గొడుగును దానము చేసినచో ఆధిభౌతిక, ఆధీఅత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియమైన  వైశాఖమాసమున పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు నిహలోకమున బాధలను పొందడు, సర్వసుఖములనందును. చెప్పులు లేక బాధపడువానికి, చెప్పులులేవని అడిగినవానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు, బాటసారులకు ఉపయోగించునట్లుగా అలసట తీర్చునట్లుగా మండపము మున్నగువానిని నిర్మించినవాని పుణ్యపరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్నకాలమున అతిధిగ వచ్చినవానిని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును.

అంబరీషమహారాజా! అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానములేదు. అలసివచ్చిన బాటసారిని వినయమధురముగ కుశలమడిగి యాదరించినవానిని పుణ్యము అనంతము. ఆకలిగలవానికి, భార్యసంతానము గృహము వస్త్రము అలంకారము మున్నగునవి యిష్టములు కావు. ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము యిష్టము ఆవశ్యకము. కాని ఆకలి తీరినచో నివియన్నియు నిష్టములు ఆవశ్యకములు నగును. అనగా అన్నము భార్య మున్నగువారికంటె ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానములకంటె నుత్తమమైనదని భావము. కావున అన్నదానముతో సమానమిన దానము యింతకు ముందులేదు, ముందుకాలమున గూడ నుండబోదు. వైశాఖమాసమున అలసిన బాటసారికి జలదానము, చత్రదానము, వ్యజనదానము,. రాజా! అన్నమును పెట్టినవాడు తల్లినిదండ్రిని తన ఆదరణ మున్నగువానిచే మరపించును. కావున త్రిలోకవాసులందరును, అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మ నిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చి కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కాని అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రులకంటె నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతాస్వరూపుడు, సర్వదేవతాస్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు అనగా అన్నదానమున, అన్ని తీర్థములు(వానిలో స్నానము చేసిన పుణ్యము) సర్వదేవతలు(వారిని పూజించిన ఫలము) సర్వధర్మములు(అన్ని ధర్మముల నాచరించిన ఫలము) కలుగుననిచెప్పబడినది.
అంతే కాదు భారతీయ ధర్మం ప్రకారం ఆకలి గొనువానికి అన్నం పెట్టవలెను .అన్నం పరబ్రహ్మ స్వారూపం ..కులం ,మతం వర్గం చూడకుండా అన్నదానం చేయవలెను ..ఏ జీవి లేదా జంతువు ఆకలి తీర్చిన ప్రాణం నిలిపిన వార0 కాగలము ..ఎందుకంటే కలియుగములో ప్రాణం అన్నము లో దాగి ఉన్నది .పైగా ఎంత సంపద ,ధనరాసులు చదువు ఇలా ఎన్ని ఇస్తూ ఉన్న తృప్తి లభించదు అన్నం తో కడుపు నిండును ..ఆ జీవి లేక జీవుడు సంతృప్తి పొందును ..పెట్టిన వానిని తలుచుకోవడమో ..ఆ జీవి,లేక జంతువు లేక మనిషి ..ఆకలిని తీర్చి న వానివైపు చూసి సంతృప్తి గా ముందుకు కదులును ....వాని ఆనందం చూసి మనలో ఒక ఆనందం కలుగును ..అదియే బ్రహ్మానందం ..అని పెద్దలు చెబుతారు.
ఈ రోజుల్లో కొంతమంది యాచకులు వస్తున్నారు ..పొట్ట చూపి బిక్షం అడుగుతున్నారు ..సరే కదా అని అన్నము పెడదామని ప్రయత్నం చేస్తే ..ఆ యాచకులు డబ్బులు ఇవ్వమని అడుగుతూవున్నారు ..సరే ఇది కలికాలం ..అందుకే ఏ విషయాన్ని దుర్వినియోగం చేయకుండా చూసుకోవాలి ..దానినే పాత్రని ఎరిగి దానం చేయాలి ...అవసరం అని బాధపడే వాడికి మాత్రమే తప్పనిసరిగా కష్ట పడైన తెచ్చి పొట్ట నింపాలి అదే పరమార్థం...

Is it good to add political colours to nature????

రాజకీయాలరంగులు -పర్యావరణం -

ఏ ..రాజకీయ పార్టీల కు కానీ ,ఏ ప్రభుత్త్వాలకు కానీ నదులు పూడిచేసి ,చక్కటి పంట పొలాలను పాడు చేసి కాంక్రీట్ జంగిల్ గా మార్చే హక్కు లేదు . మన దేశం వ్యవసాయం ప్రాముఖ్యం గల దేశం అని చదువుకోవటానికి ,చెప్పుకోవటానికి
బాగానే ఉంటుంది కానీ ఆచరణలో ఏనాడో భ్రష్టుపట్టింది ..కాదు కాదు పాలకులు భ్రష్టు పట్టించారు .దానికి ప్రజలే ముఖ్య కారణం .ఇప్పుడు ప్రజలందరికీ ప్రతి ఊరు ఒక హైదరాబాద్.. బెంగుళూర్ అయిపోవాలి ఇక్కడ లాగా ప్లైఓవర్ లు ఒక దానిపై ఒకటి కట్టి నగరాన్ని మూసెయ్యాలి..ఎక్కడ చూసినా మురుగుకాల్వలు ,మాస్ నిండిన బస్తీలు ,నగరంలో ను ,బైట
ఎక్కడ చూసినా అపార్టుమెంట్లు .ముప్పై ,నలభై అంతస్తులు ..ఖాళీగా ఉండటం ...పావురాలు పెరిగిపోయి మిగతా పక్షులు కనుమరుగు అయిపోవడం .మంచినీళ్లు ఉండవు ,మంచి గాలి దొరకదు ,మానసికపరమైన ఆనందం ఇచ్చేపైరగాలి ,ఆకుపచ్చ గ్రీనరి కనుమరుగు అయిపోతుంది .చాలా రాష్ట్రాల లో..పట్టణ సంస్కృతి పెరిగిపోయిన తరువాత ..చెరువులు ,పంట కాల్వలు పూడిచేసి ...రియల్ స్టేట్. ఇరవై, ముప్పై అంతస్తులు కట్టేసి ,బాగా కష్ట పడి పొలం సాగు చేసి అన్న0 పెట్టే రైతన్నలు ను , బెదిరించి ,లేక రెట్టింపు ఇస్తామని ఆశ లు పెట్టి ,డబ్బులు ఎరవేసి ,లేకపోతే పిల్లలకు సూట్...బూట్ ఉద్యోగాలు ,కంపెనీలు వస్తాయనో ఎదో ఒక రకంగా ..వాళ్ళ వీకనెస్ కనిపెట్టి ల్యాండ్ పుల్లింగ్..చేస్తున్నారు .ప్రభుత్త్వాలు కూడా ..రైతులు ఇష్టం ,వున్నా లేకున్నా దేశ ,రాష్ట్ర ప్రయోజనాలను ,అభివృద్ధి విషయంలో వాళ్ళ భూమిని లాగేసుకోవచ్చు ..అనిజీ.వో లు కూడా తెచ్చి గ్రామాల్లో మూడు పంటలు పండే పచ్చని సారవంతమైన.. రేగడి భూములను లాగేసుకొని పాడుచేస్తున్నారు .ప్రజలు కూడా రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగిపోయి ..ఊరంతా. ప్లైఓవర్ లు రావాలి ..అపార్టుమెంట్లు రావాలి..అలా కలలు కనేసి ..చివరికి అన్నీ పోగొట్టుకొని ..ఆ.. అపార్టుమెంట్లు కు వాచమెన్ లు గా తయారు అయి ఊడిగం చేయాల్సి వస్తున్న కాలం ఇది ..మనం అన్ని మహా నగరాలలో చూస్తున్న దృశ్యమే ఇది .ఇక రాజధాని నిర్మాణం..చేయడం ఓ ముఖ్యమైన విషయం ..దానికోసం ఎంచుకున్న ప్రదేశం కు కొద్దీ దూరం లొనే మహా నగరాలు ఉంటే ఏమి ప్రయోజనం ..కొద్ది దూరం లొనే ఆసియాఖండం లొనే ..పెద్ద రైల్వే స్టేషన్ ..పెద్ద బస్తాండ్ ..మెడికాలంకాలేజీ లు ఇంకా ఎన్నో వున్నాయి ..మళ్ళీ ఒక్క ఇరవై కిలోమీటర్లు దాటగానే మళ్ళీ కొత్తరైల్వేస్టేషన్ లు ,కొత్తబస్టాండ్ లు కొత్త విమానాశ్రయం.. ఇవి అవసరమా? ..రాజధాని నిర్మాణం ఉదాహరణకు హైదరాబాద్ తీసుకుంటే అయిదు వందల సంవత్సరాలు చరిత్ర ఉంది ..ఇన్ని సంవత్సరాలు ఎంతో మంది పరిపాలించారు .ఎంతో కృషి జరిగితే కాని ఇంత రాజధాని అయుంది.. కానీ కొత్త కొత్త ప్రభుత్త్వాలు వచ్చి మొత్తం అన్ని ఆఫీసులు ,అన్ని విశ్వవిద్యాలయాలు ,విద్యాసంస్థలు ,అన్నిరకాల కంపెనీలు ఒకచోటే పెట్టి హైద్రాబాద్.. వాతావరణం మొత్తం పాడుచేశారు పైగా రాష్ట్రంలో చాలా జిల్లాలు ,ప్రాంతాలు వెనుకబడివున్నాయి...అదే ఒక్కొక్క ప్రాంతములో కొన్ని ,కొన్ని రకాల పరిశ్రమలు పెట్టటం .ఏ.. ఏ.. జిల్లాల్లో ఏమేమి వనరులు ఉన్నాయి ..వాటిని సద్వినియోగం చేస్తూ అక్కడ పంటలకు ,,అక్కడి రైతులకు వాటికి సంబంధించిన పరిశోధనా సంస్థలు ,అక్కడ కొన్ని కంపెనీలు ..కొన్ని ఆఫీసులు పెడుతూ రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలు కవర్ చేస్తే ..ఇంత పెద్ద మొత్తం లో ఎప్పుడూ కూడా ..రాష్ట్రాలు ముక్కలు చేసుకోవాలని ..ఎవరి ముక్క వాళ్ళం పంచేసుకుందాము అనే ఆలోచనలు రాకుండా ఉంటాయి..రాష్రం లో పెద్ద పెద్ద పరిపాలన భవనాలు ,కార్యాలయాలు పెట్టాలన్నా, కట్టాలన్నా ..పంటలు పండని రాళ్ళు, రప్పలు. ప్రదేశాలలో కట్టుకోవడం మేలు ..దానివల్ల పచ్చని బువ్వ పెట్టె పొలాలు వృథా కాకుండా వుంటాయు.అస్సలు మన ప్రాచీన నాగరికత,సంస్కృతి,
చరిత్ర ఏమి చెబుతున్నాయి అంటే నదులు కు అతి దగ్గరలో కట్టిన నగరాలు ..చాలా నీటి వరదలకు కొట్టుకొని పోయి
భూమి లో కలిసిపోయాయి. అందుకే నదులుదగ్గర. రాజధానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు భవనాలు నిర్మించక పోవడమే మంచిది.రెండు, మూడు చోట్ల విభజించి పెడితే నీటి ప్రవాహం వల్ల అంత నష్టము జరగదు ..ఒకవేళ జరిగినా కొద్దీ భాగ0,కు సంభందించిన భవనాలే పోతాయు. మొత్తం లాస్ ఉండదు. నదులు,పర్యావరణ0,పక్షులు,అడవులు,జంతువులు ఆరోగ్య కరమైన వ్యవసాయం.. పచ్చదనం చక్కని గ్రామాలు ,సంస్కృతి, తర.. తరాల వారసత్త్వ నాగరికతలు ,కళలు ..కుటుంబ వాతావరణం లాంటి భారతీయ సమాజం బాగుంటుంది ..రాజధాని పక్కనే లేకపోయినాగ్రామాల అభివృద్ధి ఏమి ఆగిపోదు...కాకపోతే ప్రభుత్త్వం అన్ని జిల్లాలకు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు ,విద్య, వైద్యం అందిస్తూపరిపాలన ఆఫీసులు రాష్ట్రం నలుమూలల్లో ..కార్యాలయాలుస్థాపించాలి. అప్పుడు అసమానతలు తలెత్తవు... రానున్న తరాల నెత్తిన ప్రపంచ బ్యాంకు అప్పులు రుద్దుతూ రాజధాని నిర్మాణం పేరిట లక్షల రూపాయల కోట్లు వృధా చేయడం కూడా అనవసరం .ఒకప్పుడు తెలుగు వారు పనుల పై మద్రాస్ చెన్నై వెళ్ళే వారు ..తరువాత ఎక్కడో మూలనుంచి హైదరాబాద్ వస్తూఉండే వాళ్ళు ...అటు చివరి లో ఉన్న ప్రజలకు ఇటు రాజధాని ఎంత దూరమో.. ఇటు చివరి లో ఉన్న రాజధాని అటు వారందరికీ ..అంతే దూరం ఆయునా రాజధాని కి ప్రతిసారి వచ్చేపని ఎవరికి ఎక్కువ ఉంటుంది అది కూడా అంచనా వేయాలి ..ఎక్కడ ఏ ప్రాంతములో ఏ పరిపాలన భవనం ఎక్కువ గా అక్కడి ప్రజలకు ఉపయోగమో ఆ భవనం నిర్మించాలి..అప్పుడు. ప్రజలకు అనవసరతిరుగుడు..డబ్బులు కల్సివస్తాయి...రాజధాని నిర్మా ణానికి నీరు కూడా అవసరం.. అంతమాత్రం చేత పారుతున్న జీవనదులను పూడిచేసి ఆ కరకట్టలు కొల్లగొట్టి ..ఆక్రమించి భవనాలు కట్టేయకూడదు ..తరువాత ఏమి చేస్తారు ..భవనాలలో ప్రవహించే మురుగు నీరు ఆ జీవనదులులోకి వదిలిపెడతారు.మరి సముద్రాల దగ్గరలో రాజధాని ఉన్న నగరాల పరిస్థితి ఏమిటి ? అనే ఆలోచన రావచ్చు ..ఓకే.. మద్రాస్..అదే చెన్నై అంతేగా..ఆ సిటీలో మంచినీటిపారుదల, డ్రైనేజీ సిస్టమ్ సరిగా ప్లాన్ చేయలేదు అందుకే చెన్నైలో సముద్రంలోకి ఆ నగరం మురుగు అంతా వదులుతున్నారు. ఎక్కడైనా సరే ఒకేచోట అంతా కట్టేసి ఇరుకు చేసేసి ..అక్కడేరియల్ స్టేట్..వెంచర్లు.వేసి 30,40 బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి.. అమ్ముకోవడం ...వ్యాపారము చేయడం ..కొంతమంది ఆ భవనాలనే ప్రభుత్వ కార్యకలాపాలకు అద్దెలకు ఇవ్వడం ..ఇది సరిఆయు న రాజధాని నిర్మాణం కాదు.అన్ని రాష్ట్రాల లోను రాజధాని ఒకచోటే ఉంటుంది ..కానీ మీరు గమనిస్తే... దానికి దగ్గరలోని గ్రామాలు
నగరాలు బాగా డెవలప్ అయి ఉంటాయి మిగతా ప్రాంతాలు అన్నీ అభివృద్ధి లేక ఏడారుల్లా ఉంటాయి ...తెలంగాణ కు ఇంత 400 సంవత్సరాల పైన చరిత్ర ఉంది కానీహైదరాబాద్, వరంగల్ .లాంటివి ఒక 3 ,4 తప్ప మిగతా గ్రామాలు ఎలా ఉన్నాయి .కారణం ప్రతీ ప్రభుత్త్వం రాజధాని హైదరాబాద్ పైననే దృష్టి పెట్టడం వల్ల ...అంతే కాదురాష్ర్టంలో అన్నిప్రాంతాల నుంచి ప్రజలు కూలీలు. భారీగా ఓకేచోటు లో రాజధానిలో నిండి ఓవర్ ఫ్లోఅయి పోతారు .అయితే హైదరాబాద్ లో పండే పంట పొలాలు ఏమి లేవు కాబట్టి నష్టం ఏమీ లేదు కానీ మిగతా పంటలు పండే పచ్చని పొలాలు నదులు మాత్రం పాడుచేసి రాజధానులు కడితే రైతులు ,పంటలు తినేతిండి పోయి డ్రైనేజీ కాలువలు ,వాచమేన్ గా మారిపోయినరైతుఅన్నలు కోట్ల రూపాయలు బ్యాంకు లకు ఎగవేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొనే బడా పారిశ్రామిక వర్గాలు ..ప్లాట్లుమిగిలిపోయు నిండిపోయిన పావురాలు ...ఇది ఒకచోటే రాజధాని ముఖ చిత్రంఅలానే....ఇటువైపు రాజధాని నిర్మాణం వున్నప్పుడు అటువైపు వాళ్ళు ఇంత దూరం వచ్చారు అలానే అటు వైపు రాజధానినిర్మాణం ఉంటే ఇటువైపు వాళ్ళు వెళ్ళాలి తప్పదు .వివిధ ప్రదేశాలలో ఉంటే అన్ని ప్రదేశాల. ప్రజలకు పరిపాలన అందుతుంది ,విద్యాసంస్థలు, యూనివర్సిటీ లు వస్తాయి .విమానాశ్రయం లు పెరుగుతాయి ..మారుమూల ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తుంది ..ముఖ్యంగా తరువాతి కాలంలో ప్రాంతాల వారిగా కొట్టుకు చచ్చి విడిపోకుండా ఉంటారని గట్టిగా చెప్పవచ్చును



Knee pains - some ayurvedic remedies



మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి ఆయుర్వేదంలో చిట్కాలు



ఇదివరలోఒకసారి పైన మోకాళ్ళ నొప్పులు గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము.
ఒకకప్పు జీలకర్ర +ఒక కప్పు వాము +ఒక కప్పు మెంతులు కొద్దిగా స్టవ్ పై గిన్నెలో వేయి0చి. మొత్తం మిక్సీ పట్టుకొని
రాత్రి భోజనం తరువాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కల్పి తీసుకోవాలి ఇక ఓ అర్థ గంట వరకు ఏమి తినరాదు.
ఇక మోకాళ్ళ లో గుజ్జు అరిగిపోయిన వారు ఆయుర్వేదషాప్ లో మహాబీరగింజలు అనే పాకెట్ ఉంటుంది .అవి నల్ల గా ఉంటాయి .అవి తెచ్చుకొని రాత్రి వేళల్లో ఒక గ్లాస్ నీళ్లల్లో ఒక చెమ్చా గింజలు వేసి ఉంచాలి ..ఉదయం లేచిన తరువాత ఎప్పుడైనా త్రాగవచ్చు అల్పాహారం కంటేముందు తీసుకోవచ్చు ...అలా పడకపోతే అలవాటు పడేంతవరకు అల్పాహారం కాగానే కూడా తీసుకోవచ్చు .ఒక వేళ క్యాలిష్యం.. తక్కువై వస్తుంటే ఇదివరలో చెప్పినట్లు దూపుప్పాపేశ్వర్ కంపెనీ ...అస్థిపోషక్ వాడవచ్చు ఉత్తపెరుగు, లేక మజ్జిగ లేక పాలు తీసుకుంటూ కొద్దిగా ఆవునెయ్యి.. జెర్సీ ఆవు కాదు దేశీయఆవు నెయ్యి భోజనం ప్రారంభం లో హాఫ్ స్పూన్ అయినా వేసుకోవాలి ..ఇది మంచి కొలెస్ట్రాల్ అని గుర్తు పెట్టుకొండి .ఇక D విటమిన్ చెక్ చేయించు కోవడం మంచిది ....ఇక నువ్వులు బెల్లం ,వేరుశెనగలు బెల్లం చాలా మంచిది షుగర్ వాళ్ళు తాటిబెల్లం వాడవచ్చు లేక చిన్న ముక్క ని ఒక చెంచా నువ్వులు కల్పి తినవచ్చు ..బెల్లం మంచిది కాదా అని షుగర్ వాళ్లు ఎక్కువ తినకూడదు .
ఇదివరలో చెప్పినట్లు తినేది,లోపలికి త్రాగేది ఏదైనా సరే నిలబడి చేయకూడదు ..కూర్చొని లోపలికి తీసుకోవాలి దానివల్ల చాలా ప్రయోజనాల ను ఆయుర్వేదం చెప్పింది ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు వాళ్ళు మాత్రం కూర్చొని త్రాగండి ..ఇక మోకాళ్ల నొప్పులకు తిప్పతీగ ఆకుల కషాయం చాలా మంచిది ..లేదా దానినుంచి తయారు చేసిన గిలాయ్ అనే ఆయుర్వేద క్యాప్సిల్ ను రోజూ ఒకటి ,లేక రెండు చొప్పున వాడవచ్చు ..ఇది ఆయుర్వేద షాప్ లలో దొరుకుతుంది .ఇంకా పూర్వం లో చెప్పినట్లు HADJOD.... Himalayacompany లో దొరుకుతుంది .దీనిని నల్లేరు తో తయారు చేస్తారు ఇది కూడా బోన్స్ ...joint pai ns కి బాగా పనిచేస్తుంది .
ఇంకా ఆయుర్వేదంలో painkillers కూడా ఉన్నాయి. Shallakiayurvedic tabs దీనిలో కూడా పోర్ట్ ,ప్లయిన్, 500 పవర్ అలా ఉంటాయి.  మీకు ఉన్న నొప్పి తీవ్రత బట్టి 400 power కొంచెం ఉంటే fort... మామూలుగా అయితే ప్లయిన్ ఇలా కొనుక్కొని వాడుకోవచ్చు.

 ఒక మూలిక అనేక రోగాలకు ఉపయోగిస్తుంది ..తిప్పతీగ. ..ఈ మూలిక ఆకులు చాలా మందుల్లో కలుస్తాయి .షుగర్ కంట్రోల్ లో బాగా పని చేస్తోంది .మనిషి లో ఇంమ్యూనిటీ ..రోగనిరోధక శక్తి ని అభివృద్ధి చేస్తుంది .మోకాళ్ల నొప్పులను నయం చేస్తుంది ..ఇలా చాలా చెప్పవచ్చు .ఆవు నెయ్యి వాడకం కీళ్ళ మధ్య భాగం అరగిపోకుండా ఒక జిడ్డు ,లేక కందెన లా పనిచేస్తుంది .ఇంకా ఆవునెయ్యి కడుపులో మంట ను తగ్గిస్తుంది ..ప్రేవులలో ఉన్న పలుచని మంబ్రెన్ అతిపలుచని పొరకు జిడ్డులా ఉండి మాచ్యురైజ్ చేస్తుంది ..గాయాలను అల్సర్ మంటను మానుపుతుంది కాకపోతే నాటుఆవు లేదా దేశీయ ఆవు యొక్క నెయ్యి ని మాత్రమే వాడాలి ..కొలెస్ట్రాల్ భయం తో ఆరోగ్యకరమైన జిడ్డులను అదే నూనెలను పూర్తిగా మానేశాము కదా ..అందుకే ఇన్ని sideeffects.వస్తూవున్నాయు.
అలానే కాలీ ప్లవర్ లో కూడా క్యాల్షియం బాగా ఉంటుంది .కాలీ ఫ్లవర్. రోజూ ఉడికించి త్రాగినా క్యాల్షియం బాగా లభిస్తుంది .నల్లేరు కూర తినడం లేదా నల్లేరు చూర్ణం కొద్దిగా తేనె లో కల్పి ప్రతిరోజూ ఉదయం అల్పాహారం తరువాత నాకినా కూడా మోకాలి నొప్పులు తగ్గిపోతాయి. 3,..లేక4 పారిజాతపుకులు, లేదా 4,...5..తిప్పతీగ ఆకులు తెచ్చుకొని కషాయం కాచుకుని త్రాగితే కూడా మోకాలి నొప్పులు ,ఎముకల నొప్పులు తగ్గిపోతాయి. కానీ కొద్దిరోజులు చేయాలి .ఇంగ్లీష్ మందులు లాగా వెంటనే తగ్గదు ..ఇంగ్లీష్ మందుల్లా సైడ్ ఎఫెక్ట్ లు కూడా ఉండవు .ఇక ఇంగ్లీసు మందుల్లో ...నొప్పి తట్టుకోలేక పోతే కొద్దీ రోజులు ulteraset ...pain killer వాడిస్తారు... ఇది కూడా సేఫ్ drug ..అలానే ఓవరాన్ 75mg లేక150 mg కూడా డాక్టర్లు రోగులకు ఇస్తుంటారు ఏది ఏమైనా painkillers 4 రోజుల కంటే ఎక్కువ వాడకూడదు .అలానే కిడ్నీ, కాలేయ ,థైరాయిడ్ ,గుండె జబ్బులు ఉన్నవారు డాక్టర్ పర్యవేక్షణ లో ఇంగ్లీషు మందులు వాడవాల్సి ఉంటుంది ...అలానే ప్రతిసారి ఇంగ్లీషు మందులు పై expire date చూసి వాడండి ...పరగడుపున antaasid టాబ్లెట్ తప్ప ఇతర మందులు డాక్టర్లు చెబితే తప్ప వేసుకోరాదు ..ఎప్పుడైనా కొంచెం ఏదో ఒకటి తినాలి .
ఆయుర్వేదం మందులు కొంచెము పాత బడినా కూడా వాడవచ్చు అంటే కొద్దినెలలు ,దాటినా వాడవచ్చు ఎందుకంటే అది కెమికల్ కాదు కాబట్టి ..పూర్వకాలంలో ఆయుర్వేదం ఎంత మగ్గితే అంత మంచిది అనిచెప్పేవారు .ఈ రోజుల్లో కొంతమంది వాడవద్దు పవర్ తగ్గిపోతుంది అంటున్నారు ...ఓకే .....పెద్ద ప్రమాదం ఇంగ్లీషు మందుల్లా ఉండదు అనియు అస్సలు ఇంగ్లీషు మందులు ఎక్సపైర్ డేట్ అయిపోయినవి పారవేయడం చాలా మంచివి ..వాడకూడదు .                                                                       
   .............మరికొన్ని విషయాలు మో కాళ్ళ నొప్పులు ...నివారణ తరువాయి update లో తెలుసుకుందాము.



 ulteraset.. English medicine

ఇదిAyurvedicpainkiller

idi Ayurveda.... Sugar patients...కి చాలా మ0చిది. ఇది7,8...రో గా ల కు మ0చి ది



Story of karonamedicine hydrokloro quine

ట్రంప్, అమెరికా పుణ్యాన Hydroxychloroquine తెలియనివారు ఇప్పుడు దాదాపు ఉండరేమో. ఈ డ్రగ్ వెనుక ఓ మంచి కథ ఉంది. ఇది బ్రిటిష్ సామ్రాజ్యం, మన శ్రీరంగ పట్టణం, తాగే జిన్ను, టానిక్కులను కలుపుతుంది.

అది 1790 సమయం, టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నం రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న రోజులవి. 1799లో బ్రిటీషు సైన్యం టిప్పు సుల్తాన్ ను ఓడించడంతో సమస్త మైసూరు సామ్రాజ్యం, రాజధాని శ్రీరంగపట్నంతో కలిపి బ్రిటీషువారి ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత ఓ 10-12 రోజులవరకు బ్రిటీషు సైనికులు విజయోత్సవాలలో మునిగితేలారు. కానీ కేవలం కొన్ని వారాల వ్యవధిలో, శ్రీరంగపట్నంలోని దోమల కారణంగా వాళ్లలో చాలామందికి మలేరియా సోకింది.

ప్రాంతీయ ప్రజలకు శతాబ్దాల కాలంగా వృద్ధి చెందిన రోగనిరోధక శక్తివల్ల వాళ్లకు మలేరియా నుండి రక్షణ లభించింది పైగా వీరు తినే మిరియాలు, లవంగం, అల్లం, కారం కూడా కొంతవరకు రక్షణ కల్పిస్తుంది. కానీ కొత్తగా వచ్చిన బ్రిటీష్ సైనికులు, అధికారులు మలేరియా బారిన పడ్డారు.

ఈ పరిస్థితి నుండి గట్టెక్కడానికి బ్రిటీషువారు రాజధానిని శ్రీరంగపట్నం నుండి బెంగళూరుకు తరలించారు. అప్పుడు వెలసిందే ఈ బెంగళూరు కంటోన్మెంట్ ఏరియా. ఇక్కడి చల్లటి వాతావరణంతో సైనికులు సేదతీరారు కానీ మలేరియా నుండి విముక్తి లభించలేదు. బెంగళూరులో కూడా దోమల బెడద ఏమీ తక్కువ లేదు.

ఇంచుమించు అదే సమయంలో యూరోప్ శాస్త్రజ్ఞులు క్వినైన్ అనే కెమికల్ ను కనుగొన్నారు. దీన్ని మలేరియాకు వాడుతున్నప్పటికీ పెద్ద ఎత్తున పరీక్షలు చేయలేదు.

సైన్యంలోని ఈ మలేరియా సమస్య వీళ్లకు పరీక్షలు చేయడానికి ఓ సువర్ణావకాశంగా వచ్చింది. అలా ఈ క్వినైన్ ను టోకుగా దిగుమతి చేసుకుని సైనికులందరికీ ఇచ్చి ప్రతి ఒక్కరినీ రోజూ వాడమని చెప్పారు. రోగులే కాక, వ్యాధి లేనివాళ్లు కూడా వ్యాధి బారిన పడకుండా ఉండడానికి వాడమన్నారు. తర్వాత దీన్ని దేశంలోని అన్ని బ్రిటీషు సైనిక స్థావరాల్లో అమలుచేశారు.

ఇక్కడ ఓ కొత్త సమస్య వచ్చింది. మలేరియా బారినపడ్డ దాదాపు ప్రతి సైనికుడు కోలుకొంటున్నాడు కానీ ఆరోగ్యంగా ఉన్న చాలా మంది వ్యాధి బారిన పడుతున్నారు. బాగా ఆరా తీస్తే తెలిసొచ్చిన విషయం ఏంటంటే, వీళ్ళు క్వినైన్ డోస్ తీసుకోకుండా పారబోశారు. కారణం అంతకంటే చేదైన మందు ప్రపంచంలో ఇంకోటి లేదు, పైగా ఇది ట్యాబ్లెట్ లా కాకుండ లిక్విడ్ గా ఉంది. ఈ చేదుమందు తాగడం కంటే, సైనికులు, ప్రాణాంతక మలేరియా బారిన పడడం మేలనుకున్నారు.

ఇప్పుడు మళ్లీ పరిశోధనలు మొదలయ్యాయి, ఇంకో కొత్త మందు కోసం కాదు, ఈ క్వినైన్ న్నే పేషంట్లు ఇబ్బంది పడకుండా తీసుకునే కిటుకు కోసం. ఈ పరిశోధనల్లో ఓ విన్నూత్నమైన విషయం కనుగొన్నారు. ఈ క్వినైన్ న్ను జునిపర్ తో చేసిన ఆల్కహాల్ తో కలిపునప్పుడు ఓ తీపి వాసన వెలువడింది, నిజానికి క్వినైన్ సైనికాధికారులు తాగే జిన్నుతో కలిపినప్పుడు ఆ చేదు పూర్తిగా పోయి కాస్త తీయ్యటి పదార్థంగా మారింది. ఇలా జిన్నుతో కలిపిన క్వినైన్ "Gin & Tonic" అయ్యింది. ఈ మిశ్రమాన్ని సేవించడానికి సైనికులు ఎగబడ్డారు.

దీని సక్సెస్ చూసిన అదికారులు. సైనికులకిచ్చే నెలవారీ రేషన్లో కొన్ని Gin బాటిళ్లు, ఓ టానిక్ బాటిల్(క్వినైన్) కూడా చేర్చారు.

ఈ డిమాండును తట్టుకోడానికి అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగళూరు, ఆ పరిసర ప్రాంతాల్లో ఎన్నో లిక్కర్ ఫ్యాక్టరీలను (breweries) ప్రారంభించింది. అలా ఆ రోజుల్లోనే బెంగళూరు పబ్బుల నిలయంగా మారింది. కాలక్రమేణా బ్రిటీషు వాళ్ళు దేశం వదలి పోవలసిన సమయం వచ్చినప్పుడు మన విజయ్ మాల్యా నాన్నగారు విట్టల్ మాల్యా ఆ లిక్కర్ ఫ్యాక్టరీలను కొని, అన్నింటినీ కలిపి United Breweries అనే పేరుతో ఓ కొత్త కంపెనీని బెంగళూరులో ప్రారంభించారు.

సరే మళ్లీ విషయానికి వస్తే, అలా మొదలయ్యింది ఇప్పటికీ పాపులర్ అయిన Gin & Tonic. తర్వాత దాదాపు అన్ని జ్వరాలను బాగు చేయడానికి ఈ టానిక్(క్వినైన్) ద్రావకాన్ని డాక్టర్లు ఇవ్వడం మొదలెట్టారు. దాదాపు 1980 వరకూ కూడా గ్రామాల్లో ఎవరికైనా అస్వస్థత అయితే "డాక్టరు దగ్గరికెళ్లి టానిక్ తెచ్చుకో" అనే మాట నానుడి అయ్యింది. అలా ఇంగ్లీషు మందులకు టానిక్ అనే పేరు స్థిరపడిపోయింది.

క్రమంగా విస్తృత పరిశోధనల తర్వాత ఈ క్వినైన్ కాస్తా Chloroquineగా, ఆ తర్వాత side effects దాదాపుగా లేని Hydroxy chloroquineగా రూపాంతరం చెంది, మలేరియాకు స్టాండర్డ్ ట్రీట్మెంట్ అయ్యింది.

ఇలా టిప్పు సుల్తాన్ ఓటమితో మొదలైన ఈ chloroquine ప్రస్థానం ఇప్పుడు అమెరికా కరోనా పోరులో బ్రహ్మాస్త్రమై, బ్రెజిల్ దృష్టిలో సంజీవనిగా స్థిరపడింది. 😊😊

Soorya namaskara stotrafor good health

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
           *సూర్య నమస్కారములు*
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

🌞1
*హంసాయ భువనధ్వాంత ధ్వంసాయామిత తేజసే !*
*హంసవాహన రూపాయ భాస్కరాయ నమో నమః !!*

🌞2
*వేదాంగాయ పతంగాయ విహంగారూఢ గామినే !*
*హరిద్వర్ణ తురంగాయ భాస్కరాయ నమోనమః !!*

🌞3
*భువనత్రయదీప్తాయ భుక్తిముక్తి ప్రదాయ చ !*
*భక్తదారిద్ర్యనాశాయ భాస్కరాయ నమోనమః !!*

🌞4
*లోకాలోకప్రకాశాయ సర్వలోకైక చక్షుషే !*
*లోకోత్తరచరిత్రాయ భాస్కరాయ నమోనమః !!*

🌞5
*సప్తలోకప్రకాశాయ సప్తసప్తి రథాయ చ !* 
*సప్తద్వీపప్రకాశాయ   భాస్కరాయ నమోనమః !!*

🌞6
*మార్తాండాయ ద్యుమణయే భానవే చిత్రభానవే !*
*ప్రభాకరాయ మిత్రాయ భాస్కరాయ నమో నమః !!*

🌞7
*నమస్తే కమలనాథ నమస్తే కమల ప్రియ !*
*నమః కమలహస్తాయ భాస్కరాయ నమోనమః*

🌞8
*నమస్తే బ్రహ్మ రూపాయ నమస్తే విష్ణు రూపిణే !*
*నమస్తే రుద్ర రూపాయ భాస్కరాయ నమో నమః !!*

🌞9
*సత్యజ్ఞాన స్వరూపాయ సహస్రకిరణాయ చ!*
*గీర్వాణభీతినాశాయ భాస్కరాయ నమో నమః !!*

🌞10
*సర్వదుఃఖోపశాంతాయ సర్వపాప హరాయచ !*
*సర్వవ్యాధి వినాశాయ భాస్కరాయ నమో నమః !!*

🌞11
*సహస్రపుత్ర నేత్రాయ సహస్రాక్ష స్తుతాయ చ !*
*సహస్రనామ ధేయాయ భాస్కరాయ నమో నమః !!*

🌞12
*నిత్యాయ నిరవద్యాయ నిర్మలజ్ఞాన మూర్తయే !*
*నిగమార్థ ప్రకాశాయ భాస్కరాయ నమో నమః !!*

🌞13
*ఆదిమధ్యాంత శూన్యాయ వేదవేదాన్తవేదినే !*
*నాదబిందు సవినాశాయ  భాస్కరాయ నమోనమః !!*

🌞14
*నిర్మలజ్ఞాన రూపాయ రమ్యతేజస్స్వరూపిణే !*
*బ్రహ్మతేజస్స్వరూపాయ భాస్కరాయ నమో నమః !!*

🌞15
*నిత్యజ్ఞానాయ నిత్యాయ నిర్మలజ్ఞానమూర్తయే !*
*నిగమార్ధస్వరూపాయ భాస్కరాయ నమో నమః !!*

🌞16
*కుష్టువ్యాధి వినాశాయ దుష్టవ్యాధి హరసయచ !*
*ఇష్టార్ధదాయినే తస్మై భాస్కరాయ నమో నమః !!*

🌞17
*భవరోగైక వైద్యాయ సర్వరోగాపహరిణే !*
*ఏకనేత్ర స్వరూపాయ భాస్కరాయ నమో నమః !!*

🌞18
*దారిద్ర్యదోషనాశాయ ఘోరపాప హరాయచ !*
*దుష్టశిక్షణధుర్యాయ భాస్కరాయ నమో నమః !!*

🌞19
*హోమానుష్ఠాన రూపేణ కాలమృత్యు హరాయచ !*
*హిరణ్యవర్ణదేహాయ భాస్కరాయ నమో నమః !!*

🌞20
*సర్వసంపత్ర్పదాత్రేచ సర్వ దుఃఖ వినాశినే !*
*సర్వోపద్రవనాశాయ భాస్కరాయ నమో నమః !!*

🌞21
*నమో ధర్మనిధానాయ నమః సుకృతసాక్షిణే !*
*నమః ప్రత్యక్షరూపాయ భాస్కరాయ నమో నమః !!*

🌞22
*సర్వలోకైక పూర్ణాయ కాలకర్మాఘహారిణే !*
*నమః పుణ్య స్వరూపాయ భాస్కరాయ నమో నమః !!*

🌞23
*ద్వంద్వ వ్యాధివినాశాాయ సర్వదుఃఖ వినాశినే !*
*నమస్తాపత్రయఘ్నాయ భాస్కరాయ నమో నమః !*

🌞24
*కాలరూపాయ కళ్యాణమూర్తయే కారణాయ చ!*
*అవిద్యాభయ సంహార్త్రే భాస్కరాయ నమో నమః !!*

*ఇతి భాస్కర స్తోత్రం*

A miracle in a temple in Madhya Pradesh




మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలోని ఒక గ్రామంలో ఏకాదశి రోజున, పూజ అనంతరం నరసింహ స్వామి వారి రాతి విగ్రహాన్ని స్థానిక భీమా రి నదిలో పవిత్ర స్నానం చేయించి, విగ్రహాన్ని నదిలో వదిలి పెడతారు. కొన్ని వేల మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని చూస్తుండగా, స్వామి వారి విగ్రహం నదీ ప్రవాహానికి ఎదురు ఈది, తిరిగి తన పూజారి వద్దకు మాత్రమే చేరడం జరుగుతుంది. వీడియో చూసి తరించండి.🙏

A prayer to help in the cure of diseases




This Prayer,  in olden days the Royels used  to prayer to escape very infectous diseases.
A very powerful prayer which you should listen to in the morning and evening
Send it to family and friends also

The origin of Yogavaasistam

వశిష్ఠ ఉవాచ

నేనెవరిని?

నా కంటికి కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా శాశ్వతమేనా?

అశాశ్వతమే అయితే ఆ క్షణికమైన తృప్తి కోసం మానవుడు ఎందుకీ మోహానికి బందీ అవుతున్నాడు?

ప్రాణులన్నీ మరణించటం కోసమే పుడుతున్నాయి. పుట్టి మరణిస్తున్నాయి. మరి ఈ చావు పుట్టుకలెందుకు?

ఆయువు పెరిగిన కొద్దీ కష్టాలు పెరగడం తప్ప మరే ఇతర ప్రయోజనం లేదు. అలాంటప్పుడు జీవికి ఆయువెందుకు?

ఎందుకోసం ఈ జీవితం? మనిషి కర్తవ్యం ఏమిటి?

పిడుగుల్లాంటి ఈ ప్రశ్నలకు దశరథ మహారాజు నిండు సభ నివ్వెరపోయింది. అక్కడున్న వేదవేదాంగవేత్తలు నిరుత్తరులవుతున్నారు. తాను అనుభవించిన వైరాగ్యాన్నంతటినీ సందేహాల రూపంలో శరపరంపరగా అడుగుతోంది నిండా 15 ఏళ్లు కూడా లేని ఓ బాలుడు. అతడే స్వయంగా జ్ఞాని. ఆత్మశోధనతో ప్రపంచాన్ని అలౌకిక కోణంలో చూసిన దివ్యవేత్త. ఇక అతడి ప్రశ్నలకు మనం సమాధానం చెప్పేందుకు బ్రహ్మర్షులు కూడా సాహసం చేయలేకపోయారు. ఏం జరుగుతుందో చూడాలనే ఆసక్తితో మహర్షులు, సిద్ధులు సభలోకి వచ్చారు.

ఇంతకీ ఎవరీ బాలుడు? అంత చిన్న వయసులోనే అంత వైరాగ్యమేంటి? మరి అతని ప్రశ్నలకు సమాధానం చెప్పిందెవరు?

కులగురువైన వశిష్ఠ మహర్షి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత శ్రీరామచంద్రుడికి దేశయాత్ర చేయాలనే కోరిక కలిగింది. తండ్రి దశరథుడి ఆజ్ఞ తీసుకుని, సోదరులతో కలిసి పుణ్యక్షేత్రాలతో సహా మొత్తం దేశమంతా చుట్టివచ్చాడు. అయోధ్యకు వచ్చిన తర్వాత అతనిలో ఎంతో మార్పు వచ్చింది. రాజభోగాలు అనుభవిస్తున్నా ఎప్పుడూ నిర్వేదంగా ఉండేవాడు. ముఖంలో విషాదఛాయలు ఉండేవి. లేకలేక పుట్టిన రాముడి ప్రవర్తనతో దశరథుడికి అంతులేని దు:ఖం కలిగింది. ఓరోజు ఈ విషయంపై మాట్లాడుతుండగానే సభలోకి విశ్వామిత్రుడు వచ్చాడు. రాక్షస సంహారం కోసం తనతో పాటు రామచంద్రుణ్ణి పంపమని అడిగాడు. కలవరపడుతున్న దశరథుణ్ణి, వశిష్ఠుడు సముదాయించి రామలక్ష్మణులను సభకు పిలిపించాడు.

అక్కడ రాముడి మనసులో ఆవేదన పసిగట్టిన విశ్వామిత్రుడు ‘రామా! నీ మనసు బాధ పడటానికి కారణం నాకు చెప్ప’మన్నాడు.

‘దేనివల్ల దు:ఖరహితమైన స్థితి వస్తుందో ఆ ఉపాయాన్ని నాకు చెప్పండి. ఒకవేళ అలాంటిది లేకపోతే ఇక నాకు అశాంతి తప్పదు.మనస్సుకు శాంతి లభించకపోతే ‘నా’ అనుకున్న సర్వస్వాన్నీ వదిలేస్తాను. చివరికి దేహాన్ని కూడా... ఇంతకు మించి మార్గం లేదన్నాడు రాముడు.

విశ్వామిత్రుడి సూచనతో వశిష్ఠుడు రాముడి సందేహాలు తీర్చడానికి సిద్ధపడ్డాడు. నిషధ పర్వతంపైకి తీసుకెళ్లాడు. బ్రహ్మదేవుడు తనకు ఉపదేశించిన పరమాత్మతత్త్వాన్ని రామచంద్రుడికి ఉపదేశించాడు.

రామ, వశిష్ఠ సంవాద రూపంలో జరిగిన ఈ అనంతమైన తత్త్వవివేచనే ‘యోగవాశిష్ఠం’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. అనంతమైన తత్త్వజ్ఞానానికి, జ్ఞానోపదేశానికి యోగవాశిష్ఠం కీర్తిపతాకగా మారింది. దీనికి ‘వశిష్ఠ రామ సంవాదం’, ‘వశిష్ఠగీత’ అనే పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం 32 వేల శ్లోకాతో ఆరు ప్రకరణాలుగా వాల్మీకి మహర్షి దీన్ని తీర్చిదిద్దాడు.

Sreemannarayana..In five swaroopas

ప్ర: వేంకటేశ్వరస్వామిని 'అర్చావతారం' గా వచ్చాడు .స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నిలువు బొట్టు మతం లో అనగా శ్రీవైస్టన్వం.... దానినే విశిష్టాద్వైతం అని పిలుస్తారు భగవత్ రామనుజలవారు ...ఈ మతాన్ని తీసుకొని వచ్చారు ...అద్వైతమే కానీ కొద్దీ మార్పులతో విశిష్ట మైనది విశిష్టాద్వైతం.. అని తెలుసుకోవాలి దీనిలో 3 ప్రతిపాదించారు రామానుజులు 1 ప్రకృతి...2 జీవుడు ...3..పరమేశ్వరుడు అవే మోడరన్ సైన్స్ లో electron... ptotaan... newtran

జ: విశిష్టాద్వైత సిద్ధాంత ప్రకారం నారాయణుడు ఐదు స్వరూపాలతో భాసిస్తున్నాడు.
1. పర, 2. వ్యూహ, 3. విభవ, 4. అంతర్యామి, 5. అర్చావతారం.

*1. పరస్వరూపం:* శుద్ధసత్వంతో, అద్భుత తేజస్సుతో వైకుంఠంలో నిత్యమూ భాసించే, భూదేవీ శ్రీ దేవీ సమేత మూర్తి. కేవలం నిత్యముక్తులకు ఇది దర్శనమిస్తుంది.నిత్య ముక్తులు అంటే జన్మ నుంచి విముక్తి పొందిన వారు వారికి వైకుంఠంలో కనిపించే స్వామి

*2:వ్యూహస్వరూపం:* జగత్ సృష్టికి మూలకారణమైన స్వరూపం. నాలుగు వ్యూహాలతో ఉన్నది. అవి - వాసుదేవ, అనిరుద్ద, ప్రద్యుమ్న, సంకర్షణ. ఈ వ్యూహాలతో సృష్టి స్థితి లయలను నిర్వహించువాడు. వాసుదేవుడు క్షీరసాగర శయనుడైన మూలమూర్తి. అనిరుద్ధుడు సృష్టికారక చైతన్యం. ప్రద్యుమ్నుడు స్థితి శక్తి. సంకర్షణుడు లయ కారకుడు. అనిరుద్దాంశ బ్రహ్మ, సంకర్షణాంశం రుద్రుడు, ప్రద్యుమ్న తేజం విష్ణువు.ఈ ...స్వరూపంతో ప్రపంచాన్ని లేదా జగత్తును నడిపించే ఒక తంత్రం లేదా విధానం planning and idea structure

*3. విభవ స్వరూపం:* ధర్మరక్షణార్ధం లీలగా అవతరించే నారాయణుడు. అప్రాకృత దివ్య మంగళస్వరూపంతో, లీలా విభూతితో ఇలకు దిగిన శ్రీరామ, శ్రీకృషాదులు హరి యొక్క విభవస్వరూపులు.ఇది ఏమిటంటే ...అనగా వైభవతత్వం శ్రీమన్నారాయణుడు ఆయన ధర్మ రక్షణార్ధం ...మనకోసం ఒక అవతారం గా వస్తాడు ..ఆయన ను గుర్తించి ....ఆయనకు దగ్గరగా అవుతాము

*4. అంతర్యామి:* జీవుల హృదయాలలో భాసించే పరమాత్మ. అందరి ప్రవృత్తులకు కారకమై, సత్కర్మానుష్ఠానాలకు అనుమతించే స్వరూపమే అంతర్యామి...ఈ స్వరూపం ఏమిటంటే మన లోపల వడ్లగింజ కొన పరిమాణంలో నీలపు రంగు లో జ్యోతి లా వెలుగుతుంటాడు ...కంఠం నుంచి  మన చేతితో   క్రిందికి చిటికిన వేలు తగిలే చోట ఒక సొట్ట ఉంటుంది .అక్కడ నుంచి పొట్ట స్టార్ట్ అవుతుంది .అదిగో ఆ సొట్ట లో నే పరమాత్మ జ్యోతి లా వెలుగుతుంటాడు .అదే అంతర్యామి ఆయన శరీరాన్ని ,ఆత్మ ని నడిపిస్తూ వెంట ఉంటాడు నువ్వు చేసే పాప, పుణ్యాలు ఆయనకు అంటవు. ఊరికే ఒక కరెంట్ లేక చైతన్యం ఇచ్చి చురుకుగా ఉంచుతాడు .జ్ఞానం తెలుసుకొని నడుచుకోవాల్సినది నీవే దానిని బట్టి పాప పుణ్యాలు మళ్ళీ జన్మలు ఎత్తడం ,కష్టాలు పడటం ..దానుంచి బైట పడటమే మోక్షం
ఇక ఇప్పటి యోగా గురువులు మన లోపల మనమే చూసుకొని అంతర్యామి ని కొలుస్తున్నాం అని చెబుతున్నారు ..దానినే మెడిటేషన్ అంటున్నారు ..ఇది కొత్తదేమీ కాదు ...భగవద్గీత లో ఉన్న దే కాక పోతే భగవద రామానుజులు దీనిని బోధించలేదు ..ఎందుకంటే ఈ ధ్యానం అంత తేలికైన వ్యవహారం కాదు ఈ రోజుల్లో ఏకాగ్రత చాలా కష్టం అందుకే సామాన్యులకు భక్తి మార్గం ఉపదేశించాడు అదే విగ్రహారాధన దానిద్వారా భక్తి. ..దానిద్వారా ప్రప త్తి దాని ద్వారా జ్ఞానం అప్పుడు మోక్షం ఇలా ఒక వరుస క్రమము చెప్పారు

*5. అర్చావతారం:* అర్చింపబడి అనుగ్రహించేందుకు వివిధ క్షేత్రాలలో వెలసిన భగవద్రూపం. తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడు, శ్రీరంగంలో రంగనాథుడు మొదలైన వి అంటే దేవాలయాలలో కొలిచే శ్రీరాముడు,శ్రీకృష్ణుడు శివలింగం ఇవన్నీ విగ్రహం రూపంలో కొలిచి ఆనందపడటం విగ్రహారాధన అన్న మాట
ఇలా శ్రీ వైష్ణవ0 లో భగవంతుడిని ...కొలిచే ,తలిచె విధానం ..భగవత్ తత్వం చెప్పబడినది

శ్రీ రామ రక్షా స్తోత్రం..... అర్థం తో

అస్యశ్రీ రామరక్షాస్తోత్ర మంత్రస్య, బుధకౌశిక ఋషిః, శ్రీసీతారామచంద్రో దేవతా, అనుష్టుప్‌ఛందః, సీతా శక్తిః, శ్రీమాన్‌ హనుమాన్‌ కీలకం, శ్రీరామచంద్ర ప్రీత్యర్థం, రామరక్షాస్తోత్ర పారాయణే వినియోగః ||
తాత్పర్యము: శ్రీ రామరక్షాస్తోత్రమునకు బుధకౌశికుడు ఋషి, సీతాసహిత శ్రీరామచంద్రుడు అధిదేవత. ఛందమనుష్టుప్పు. సీత శక్తి. శ్రీమంతుడైన హనుమంతుడు కీలకం. శ్రీరామచంద్రుని ప్రీతి కొరకై (అనుగ్రహము నాశించుచూ) చేయు పారాయణమునందీ మంత్రమునకు వినియోగము. (ప్రతి మంత్రానికి దానిని దర్శించిన ఋషి, ఆ మంత్రానికి అధిష్టానదేవత, ఛందస్సు, శక్తి, కీలకము, ఆ మంత్ర జపము చేసినందువల్ల కలిగే ప్రయోజనము చెప్పబడతాయి.)
 ధ్యానమ్‌ : ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బధ్ధ పద్మాసనస్థమ్‌ | పీతం వాసోవసానం, నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్‌ | వామాంకారూఢ సీతాముఖకమల మిలల్లోచనం నీరదాభమ్‌ | నానాలంకార దీప్తం దధతమురుజటామండలం రామచంద్రమ్‌ ||
తాత్పర్యం: ఆజానుబాహుడైన శ్రీరామచంద్రుడు ధనుర్బాణములు ధరించి వున్నాడు. పచ్చని వస్త్రములను ధరించి, పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. కలువరేకులను మించిన సోయగము గల కన్నులాయనవి. ప్రసన్నముగా వున్న ఆయన ఎడమతొడపై తల్లి జానకమ్మ కూర్చొనియున్నది. నీలమేఘశ్యాముడైన రామయ్యతండ్రి సీతమ్మ ముఖకమలాన్ని పరికించుతున్నాడు. ఆయన జటామండల ధారియై, సర్వాలంకారాలతో శోభిస్తూ వున్నాడు. అటువంటి సీతాసహితుడై వున్న శ్రీరామచంద్రుని నేను ధ్యానించుకుంటున్నాను. (ఈ దృశ్యాన్ని మనసులో ఊహించుకుంటూ భక్తిగా నమస్కరించుకుందాం.)ప్రక్కన సీతమ్మ తల్లి వుండడం వలన శ్రీరామచంద్రుడి వదనం ప్రసన్నంగా వుంది. వారి అనుగ్రహాన్ని సంపాదించడానికి ఇదే కదా సరైన సమయం!
 స్తోత్రమ్‌
--------------
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం |
ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్‌ || 1 ||
తాత్పర్యం:
రఘువంశ ప్రభువైన శ్రీరామచంద్రుని చరిత్ర వందకోట్ల శ్లోకాలతో వున్నది. ఆ శ్లోకాలలో వున్న ఏ ఒక్క అక్షరమైనా మనయొక్క మహాపాపాలను సైతం పరిహరిస్తుంది.మనకు హిమాలయాలకు పోయి ఘోరమైన తపస్సు చేసుకునే పరిస్థితి లేదు. కనీసం ఇంట్లో రోజూ గంటలు గంటలు కూర్చుని షోడశోపచారాలతో దేముని పూజించే వెసులుబాటు కూడా లేదు. అందుకే దగ్గిరదారిని వెడదాం. మనం కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, బస్సులోనో, కారులోనో, రైలులోనో, విమానంలోనో వెళ్తున్నప్పుడు, నిత్యం రామనామం జపించుకుంటూ వుందాం. దీనికి ఏ నిష్టా, నియమమూ అక్కర్లేదు. ఇదే తరించడానికి సులువైన ఉపాయం.
.
 ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం |
జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితం ||
సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తంచరాంతకం |
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుమ్‌ || 2 ||
తాత్పర్యము:
నల్లకలువ వంటి శరీరవర్ణము, పద్మదళముల వంటి వెడద కన్నులు కలిగివుండి, జడల ముడినే కిరీటముగా ధరించిన శ్రీరామచంద్రుడు సీత తోను, లక్ష్మణుడితోను కూడి వున్నాడు. ఆయన చేతులలో ఖడ్గం, శరములతో నిండివున్న అమ్ములపొది, ధనుస్సు వున్నవి. ఆ ఆయుధములతో ఆయన రాక్షసులను అంతమొందిస్తాడు. లోకసంరక్షణార్థం అవతరించడం వారి లీలయే గాని వేరు కాదు. నిజానికి శ్రీరామచంద్రప్రభువు పుట్టుక లేనివాడు.
.
 రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్‌ |
శిరోమే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః || 3 ||
తాత్పర్యము:
 ప్రాజ్ఞులు సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుని రూపాన్ని మదిలో ఊహించుకుంటూ, పాపములను పోగొట్టేటటువంటి, అన్ని కోరికలను తీర్చునట్టి యీ రామరక్షాస్తోత్రమును పఠించవలెను. ఇక్కడనుంచి శ్రీరామచంద్రుడు మనలను ఏవిధంగా కాపాడాలో, ఏవిధంగా కాపాడతాడో చెప్పబడుతోంది. రాఘవుడు నా శిరస్సును, దశరథాత్మజుడు నా నొసటిని రక్షించు గావుత!
.
 కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియః శ్రుతీ |
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః || 4 ||
తాత్పర్యము:
కౌసల్యాతనయుడు నా నేత్రాలను, విశ్వామిత్రునికి ప్రియమైనవాడు కర్ణేంద్రియములను, యజ్ఞరక్షకుడు నాసికను, లక్ష్మణునియందు వాత్సల్యభావము గలవాడు ముఖమును రక్షించుగాక.
(పఠించేటప్పుడు కౌసల్య ఒడిలో నున్న శ్రీరామచంద్రుడిని, విశ్వామిత్రుడి వెనుక యాగరక్షణకేగుచున్న శ్రీరాముని, యజ్ఞరక్షణకై విల్లమ్ములు చేబూని తిరుగుతున్న రాముని, లక్ష్మణుని వాత్సల్యంతో అక్కున జేర్చుకుంటున్న శ్రీరామచంద్రుడిని మనసులో భావించుకోవాలి. ఇట్లాగే అన్ని నామాలకు వాటి అర్థాన్ని బట్టి రూపాన్ని ఊహించుకుంటూ వుండాలి.)
 జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః |
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ||
కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ |
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః || 5 ||
తాత్పర్యము:
విద్యానిధి యైన రాముడు నా నాలుకను, భరతునిచే నమస్కరింపబడిన రాముడు నా కంఠమును, దివ్యాయుధములను ధరించియున్న రాముడు నా భుజస్కంధములను, శివధనుర్భంగమొనరించిన రాముడు నా భుజములను, సీతాపతి నా చేతులను, పరశురాముని గర్వమునణచిన రాముడు నా హృదయమును, ఖరుడను రాక్షసుని జంపిన రాముడు నా నడుమును, జాంబవంతుని కాశ్రయమిచ్చిన రాముడు నా నాభిని రక్షించుగాక!శ్రీరాముడిని మన సర్వాంగాలను రక్షించమని వేడుకుంటున్నాము కదా? మరి ఆ యా అంగాలను మనం సదుపయోగం చేసుకోవాలి గాని దురుపయోగం చెయ్యకూడదు కదా? ఉదా: నాలుకను మంచిమాటలు పలుకడానికి, భగవంతుని స్తుతించడానికి ఉపయోగించుకుందాము. అంతేగాని పరులను నిందించడానికి, అబధ్ధాలాడడానికి ఉపయోగించవద్దు.
.
 సుగ్రీవేశః కటిం పాతు సక్థినీ హనుమత్ప్రభుః |
ఊరూ రఘూత్తమః పాతు రక్షః కుల వినాశకృత్ || 6 ||
తాత్పర్యము:
సుగ్రీవుని పాలించిన ప్రభువు కటి ప్రదేశమును, హనుమంతునకు ప్రభువు తొడల యెముకలను, రాక్షస కులమును నిర్మూలించిన రాఘవశ్రేష్ఠుడు తొడలను రక్షించుగావుత!
.
 జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః |
పాదౌ విభీషణ శ్రీదః పాతు రామోఖిలం వపుః || 7 ||
.
తాత్పర్యము:
సేతువును నిర్మించినవాడు నా మోకాళ్ళను, రావణాసురుని చంపినవాడు నా పిక్కలను, విభీషణునికి రాజ్యలక్ష్మిని ప్రసాదించినవాడు నా పాదములను, శ్రీరాముడు నా సకలదేహమును కాచుగాక!
.
 ఏతాం రామబలోపేతాం రక్షాం యస్సుకృతీ పఠేత్ |
స చిరాయుస్సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ || 8 ||

తాత్పర్యము:
శ్రీరాముని బలమును పొందిన ఈ రామరక్షాస్తోత్రమును పఠించిన వుణ్యశాలి దీర్ఘాయుష్మంతుడై, సంతానవంతుడై, వినయశాలియై, విజయము నొంది సుఖించును.
 పాతాళ భూతల వ్యోమ చారిణశ్ఛద్మ చారిణః |
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః || 9 ||
.
తాత్పర్యం:
పాతాళమందు గాని, భూలోకమందు గాని, ఆకాశమందుగాని కపటవేషములు ధరించి తిరుగాడు ఏ కుటిలాత్ములైనను శక్తిమంతమైన రామనామముచే రక్షింపబడిన వారిని కన్నెత్తి యైనను చూడజాలరు.
.
 రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్‌ |
నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి || 10 ||
తాత్పర్యము:
రామా అని గాని, రామభద్రా అని గాని, రామచంద్రా అని గాని స్మరించు నరునకు ఏ పాపములు అంటవు. అతడు ఇహలోకమందు భోగములనుభవించి, తదనంతరము మోక్షమును పొందగలడు.
.
 జగజ్జైత్త్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్‌ |
యః కంఠే ధారెయేత్తస్య కరస్థాః సర్వసిధ్ధయః || 11 ||
తాత్పర్యము:
జగత్తును జయించగలది ఒక్క రామనామ మంత్రమే. ఆ మంత్రముచే రక్షింపబడియున్న యీ రామరక్షాస్తోత్రమును కంఠస్థము చేసి జపించువానికి అన్ని సిధ్ధులు కరతలామలకములగును.
.
 వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్ |
అవ్యాహతాజ్ఞస్సర్వత్ర లభతే జయమంగళమ్‌ || 12 ||

తాత్పర్యము:
వజ్రపంజరమను పేరుగల ఈ రామకవచమును (ఈ రామరక్షాస్తోత్రమును) జపించిన వాని యాజ్ఞ తిరుగులేనిదగును. అతడికి ఎల్లెడల జయమును, శుభమును లభించగలవు.
.
 ఆదిష్టవాన్‌ యథా స్వప్నే రామరక్షామిమాం హరః |
తథా లిఖితవాన్‌ ప్రాతః ప్రబుధ్ధో బుధకౌశికః || 13 ||
తాత్పర్యము:
బుధకౌశిక మహర్షి నిద్రనుండి మేల్కొని, తనకు పరమశివుడు స్వప్నమందుపదేశించిన ఈ రామరక్షాస్తోత్రమును యథాతథముగా ప్రాతః కాలమున లిఖించెను.
.
 ఆరామః కల్పవృక్షాణాం విరామస్సకలాపదామ్‌ |
అభిరామ స్త్రిలోకానామ్‌ రామః శ్రీమాన్సనః ప్రభుః || 14 ||
తాత్పర్యము:
శ్రీరాముడు కల్పవృక్షముల వనము. (ఒక్క కల్పతరువే అన్ని కోర్కెలను తీరుస్తుంది. అటువంటిది శ్రీరాముడు అనేక కల్పతరువుల తోట.) అన్ని ఆపదలను పారద్రోలే త్రిలోకాభిరాముడు. అటువంటి శ్రీరామచంద్రుడే మన ప్రభువు.
.
 తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ |
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ |
ఫలమూలాశినౌ దాంతౌ తపసౌ బ్రహ్మచారిణౌ |
పుత్రౌ దశరథ స్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ |
శరణ్యౌ సర్వసత్వానాం శ్రైష్ఠౌ సర్వ ధనుష్మతామ్‌ |
రక్షః కుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ || 15 ||
తాత్పర్యము:
రామలక్ష్మణుల గురించిన వర్ణన ఇందులో వుంది. యువకులు, అందమైనవారు, సుకుమారులు, అమితమైన బలము కలవారు, కలువలవంటి విశాలమైన నేత్రద్వయములను కలిగినవారు, నారబట్టలను, లేడిచర్మమును ధరించినవారు, కందమూలములను భుజించుచున్నవారు, ఇంద్రియనిగ్రహము కలిగి తపస్సు నాచరింపుచున్నవారు, బ్రహ్మచారులు, దశరథపుత్రులు, సోదరులు అయిన రామలక్ష్మణులు సకలప్రాణులకు శరణ్యమైనవారు. ధనుర్ధరులలో శ్రేష్టులు, రాక్షసకులమును నిర్మూలించువారు. అటువంటి ఆ శ్రీరామ లక్ష్మణులు మమ్ములను రక్షింపుదురు గావుత.
.
 ఆత్తసజ్య ధనుషావిషు స్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ |
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథిసదైవ గఛ్ఛతామ్‌ || 16 ||
తాత్పర్యము:
ధనువులెక్కుపెట్టి, బాణములు పట్టుకొని, మూపుల నక్షయ తూణీరముల దాల్చి నన్ను రక్షించుటకు రామలక్ష్మణు లెల్లప్పుడు నేను నడచు మార్గమున నాకు ముందుగా నడచుచుందురు గాక.
.
 సన్నధ్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా |
గఛ్ఛన్‌ మనోరథాన్నశ్చ రామః పాతు సలక్ష్మణః || 17 ||
తాత్పర్యము:
సర్వదా సంరక్షణార్థము సంసిధ్ధుడై, కవచ ఖడ్గములు, విల్లమ్ములు ధరించి, యువకుడై, లక్ష్మణసమేతుడై యున్న శ్రీరాముడు మన కోరికల నీడేర్చుచు మనలను రక్షించుగాక!
.
 రామో దాశరథిశ్శూరో లక్ష్మణానుచరో బలీ |
కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ||
వేదాంత వేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః |
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః ||
ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రధ్ధయాన్వితః |
అశ్వమేథాదికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః || 18 ||
తాత్పర్యము:
 పరమశివుడు చెప్పుచున్నాడు, ఈ రామరక్షాస్తోత్రమును నా భక్తులు నిత్యము శ్రధ్ధతో జపించినచో వారికి అశ్వమేథయాగము చేసినందు వల్ల కలిగెడు పుణ్యము కంటె అధికమైన పుణ్యము లభించును. ఇందులో ఎట్టి సందేహమును లేదు.
.
 రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాస సం
స్తువంతి నామభిర్దివ్యైర్నతే సంసారిణో నరాః || 19 ||
తాత్పర్యము:
దూర్వాదళశ్యాముడు, పీతాంబరధారి, పద్మపత్రాక్షుడు ఐన శ్రీరామచంద్రుని దివ్యనామాలతో స్తుతించినవారు (శ్రీరామరక్షాస్తోత్రం పఠించడం ద్వారా) పునర్జన్మ లేక మోక్షమునందెదరు.
.
 రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం |
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకులతిలకం రావణారిమ్‌ || 20 ||
తాత్పర్యము:
లక్ష్మణునికి అన్నగారు, రఘుకులతిలకుడు, జానకీనాథుడు, సుందరుడు, కాకుత్స్థుడు, దయాసముద్రుడు, సద్గుణసంపన్నుడు, విప్రప్రియుడు, ధర్మమూర్తి, రాజేంద్రుడు, సత్యవాక్పరిపాలకుడు, దశరథతనయుడు, నీలివర్ణుడు, శాంతమూర్తి, లోకాభిరాముడు, రఘువంశశ్రేష్ఠుడు, రావణునికి వైరి అగు శ్రీరామచంద్రునికి నమస్కారము.
.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః || 21 ||
.
తాత్పర్యము:
రామభద్రుడు, రామచంద్రుడు, రఘునాథుడు, లోకనాథుడు అని పిలువబడుచున్న సీతాపతి యైన శ్రీరామచంద్రపరబ్రహ్మకు నమస్కారము.
.
 శ్రీరామ రామ రఘునందన రామ రామ!
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ |
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ!
శ్రీరామ రామ శరణం భవ రామ రామ || 22 ||
తాత్పర్యము:
పదే పదే భక్తితో శ్రీరామచంద్రుని పలువిధముల పిలుచుచు భక్తుడు తనకు రామచంద్రుడే రక్ష యగుగాక అనుచు శరణు జొచ్చుచున్నాడు.
 శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి |
శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి |
శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి |
శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే || 23 ||
తాత్పర్యము:
ఓ శ్రీరామచంద్రా! నీ చరణములను మనసార ధ్యానించి, నోరార నీ చరణములను కీర్తించి, తలవంచి మ్రొక్కుచున్నాను. శ్రీరామచంద్రా! నీ చరణముల శరణు వేడుచున్నాను.
.
 మాతా రామో మత్పితా రామచంద్రః |
స్వామీ రామో మత్సఖా రామచంద్రః |
సర్వస్వం మే రామచంద్రో దయాళు ర్నాన్యం నైవజానే న జానే || 24 ||
తాత్పర్యం:
నాకు తల్లియు, తండ్రియు, స్వామియు, మిత్రుడును కూడ రామచంద్రుడే. నాకు సర్వస్వము దయాళువైన శ్రీరామచంద్రుడే. వేరొక దైవమును నేనెఱుగనే ఎఱుగను.
.

దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా |
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్‌ || 25 ||
తాత్పర్యము:
కుడిప్రక్క లక్ష్మణుడు, ఎడమవైపున సీతాదేవియు, ఎదుట ఆంజనేయుడును వుండగా విరాజిల్లు రఘునందనునికి నమస్కరింతును.
.
 లోకాభిరామం రణరంగధీరం | రాజీవనేత్రం రఘువంశనాథం |
కారుణ్యరూపం కరుణాకరం తం | శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే || 26 ||
తాత్పర్యము:
కనులకు విందు చేయు సుందర రూపము గలవాడు రాముడు. యుధ్ధరంగమునందు ధీరుడైన వీరుడు రాముడు. తామరపూవుల వంటి కనులు గలవాడు. రఘువంశనాథుడు. కరుణయే రూపముగా గలవాడు. దయాసముద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుని నేను శరణు జొచ్చుచున్నాను.
 మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుధ్ధిమతాం వరిష్ఠమ్‌
వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్‌
శ్రీరామదూతం శరణం ప్రపద్యే || 27 ||
తాత్పర్యం:
మనోవేగము కలవాడు, వాయువుతో సమానమైన వేగము కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, బుధ్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాయుపుత్రుడు, వానర సైన్యాధిపతి, శ్రీరాముని దూత ఐన హనుమంతుని నేను శరణు వేడుకొనుచున్నాను.
 కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం |
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలమ్‌ || 28 ||
తాత్పర్యము:
 కవిత్వమను కొమ్మనెక్కి రామ రామ యనెడి మధురాక్షరములను మధురముగా కూయుచున్న వాల్మీకి యనెడు కోకిలకు నేను నమస్కరించుచున్నాను.
.
 ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ || 29 ||
.
తాత్పర్యము:
 ఆపదలను పోగొట్టువాడు, సర్వసంపదలను ఇచ్చువాడు, లోకాభిరాముడు అయిన శ్రీరామునికి మరల మరల నమస్కరింతును.
 భర్జనం భవబీజానా మర్జనం సుఖసంపదామ్‌ |
తర్జనం యమదూతనాం రామరామేతి గర్జనమ్‌ || 30 ||
.
తాత్పర్యం:
 రామా రామా యని ఎలుగెత్తి చేయు గర్జన సంసారపు బీజములను నశింపజేసి (ముక్తిని ప్రసాదించి), సుఖసంపదలను కలిగించుటయే గాక ఆ అరుపు విని యమదూతలు కూడ బెదిరిపోదురు.
.
 రామో రాజమణిస్సదా విజయతే రామం రమేశం భజే |
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః ||
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం |
రామే చిత్తలయస్సదా భవతు మే భోరామ మా ముధ్ధర || 31 ||
.
తాత్పర్యము:
 రాజరత్నమైన రాముడు సదా విజయవంతుడై యున్నాడు. లక్ష్మీపతియైన (విష్ణుస్వరూపుడైన) రాముని నేను భజింతును. రామునిచే రాక్షససైన్యము సంహరింపబడినది. ఆ రామునికి నమస్కారము. రాముని కంటె మించిన అండ మరియొకటి లేదు. నేను రామునకు దాసుడనై యున్నాను. నా చిత్తమెల్లప్పుడు రాముని యందు లగ్నమై (రామునిలో కలసిపోయి) యుండుగాక. ఓ రామా! నన్నుధ్ధరింపుము.
.
 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే || 32 ||
తాత్పర్యము:
పరమేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పుచున్నాడు,
" ఓ వరాననా! నేను " శ్రీరామ రామ రామ " యనుచు మనస్సును రమింపజేయు శ్రీరాముని యందు రమించుచుందును.
ఆ రామనామము సహస్రనామ సమానము.
(లేదా సహస్రనామము ఒక్క రామనామముతో సమానము)
ఇతి శ్రీ బుధకౌశికముని విరచితం శ్రీరామరక్షాస్తోత్రం సంపూర్ణమ్‌.
తాత్పర్యము:
ఇతి శ్రీ బుధకౌశికముని విరచితమైన శ్రీరామరక్షాస్తోత్రము సంపూర్ణము.

Top 10 Shri Rama Temples in India


మిత్రులందరికీ, శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ త త్ తుల్యం రామ నామ వరాననే
3 సార్లు చదివితే ...శ్రీ విష్ణు సహస్రనామ0  ఒకసారి చదివినట్లు లెఖ్ఖ గా సాక్షాత్తు శివభగవానుడు పార్వతి అమ్మవారికి చెప్పినట్లు గా పెద్దలు చెబుతారు


ఆ పదలలో కూడా ,చెడు, పీడ కలల నుంచీ రక్షించేది శ్రీరామ రక్షా స్తోత్రం అందరూ చదువుకో0డి ..రక్షింపబడండి ...జయ జయ శ్రీరామ్ ...జయ జయ రాజారామ్ రాజారామ్ జయరామ్ రాజారామ్ ..అనే గొప్ప మంత్రం కూడా షిర్డీసాయి భగవానుడు.. ఉపదేశం ఒక భక్తుడి కి షిర్డీ లో ఆ రోజుల్లో ఇచ్చారు  కాబట్టి ఆ నామ0 చదువుకున్నా ...జపం చేస్తున్నా చాలు శుచి గా లేము ఎలా అనుకోవక్కర్లేదు మనస్సులో లోపల ఎప్పుడైనా ఎవ్వరైనా ఎక్కడైనా చదువుకోవచ్చు అదే రామతారక నామ గొప్పతనం.


వాల్మీకి మహర్షి ప్రకారం ఆయనకు పదహారు లక్షణాలు ఉన్నాయి.
1. గుణవంతుడు
2. వీరుడు
3. ధర్మజ్ఞుడు
4. కృతజ్ఞుడు
5. సత్యం పలికేవాడు
6. దృఢమైన సంకల్పం ఉన్నవాడు
7. ఉత్తమ చరిత్ర కలిగినవాడు
8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు
9. విద్యావంతుడు
10. సమర్థుడు
11. సౌందర్యం కలిగిన వాడు
12. ధైర్యవంతుడు
13. క్రోధాన్ని జయించినవాడు
14. తేజస్సు కలిగినవాడు
15. అసూయ లేనివాడు, ఇతరుల్లో మంచిని మాత్రమే చూసేవాడు
16.ఈ సృష్టిలో ఎవరి కోపాన్ని చూసి దేవతలు కూడా భయపడతారో అటువంటి వ్యక్తి!

దశరథ మహారాజు రాముడ్ని పిలిచి రేపే నీ పట్టాభిషేకం అని చెప్పగానే, సరే అంటాడు. ఆ కాసేపటికే కైకేయి రామా! నీవు వనవాసం చేయాలని చెబుతుంది.
ఆ క్షణం కూడా అంతే శాంత స్వభావంతో సరే! అంటాడు.
ఒక్కసారి మనం పక్కనున్న కాటారం అడవిలో నెలరోజులు ఉండి వద్దాం... అడవి సంగతేంటో తెలుస్తుంది.
అలాంటిది ఒక యువరాజు.... పో! అనగానే నారబట్టలు కట్టుకుని
లగెత్తుకుని పోయాడు.
కన్నతల్లిని, కన్న ఊరిని విడిచి వెళ్తుంటే కలిగే బాధ ఎంతో మనందరికీ తెలుసు.
ఇప్పటికీ సొంతూరు గుర్తుకు వస్తే,బాల్యమిత్రులు గుర్తుకు వస్తే మనసేదోలా ఐపోతుంది.
కన్న ఊరు విడిచి వేరేప్రాంతాలలో బతికే మిత్రుల హృదయాలలో ఊరితో బంధం ఎంత బరువో వారిని అడిగితే వారే చెప్తారు.

మన అమెరికా మిత్రుల హృదయాల తడిని మనం అర్థం చేస్కోగలమా?
లాగే పాశం ఓదిక్కు....
కర్తవ్యం ఓ దిక్కు....
ఈ కొరోనా కాలంలో అదో పీడకాలం.....

అలాంటిది రాముడు వేల ఏండ్ల క్రితమే రాజ్యాన్ని త్యజించడమెంత కఠినతరం!

14 సంవత్సరాలు ఒక ఊరితో సంబంధం తెగిపోతే అతనికి ఆ ఊరిపై హక్కు ఉండదనేది ఆనాటి చట్టం.

ఇంకోమాట ఎవరి గురించో ఎందుకు?
ట్రాన్స్ఫర్ అంటే నా మనసే ఏదోలా ఐపోతుంది.
కొందరైతే గింగిరాలు తిరిగి పోతారు.

ఇక రాముని అణకువ చూద్దామా....
మున్యాశ్రమంలో అడుగు పెడితే విల్లుయొక్క అల్లెతాడును విప్పేసేవాడు.
ప్రస్తుతం పోలీసులు, రాజకీయ నాయకులు గన్మెన్ లతో గుళ్ళలోకి ప్రవేశించడం కద్దు.

ఇప్పుడు చెప్పండి....
రాముని వినయం, అణకువ. మనకున్న అహం.

ఇక ఎంతటి విధినిబద్ధత కలవాడో ఇప్పుడు చెప్తా!

తాటకిని సంహరించి, మారీచసుబాహులను నిగ్రహించి యాగరక్షణ చేసి అలసిపోయినా, తెల్లవారే విశ్రాంతి కూడా తీసుకోక విశ్వామిత్రుడి చేరి తదుపరి ఆదేశాలకోసం చేతులు కట్టుకుని నిలబడతాడు.
అప్పుడు ఆ పిల్ల రాముని వయసెంతో తెలుసా!!!

(ఊనషోడశవర్షో మే రామో రాజీవలోచనః౹
న యుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః౹౹
పదహారేళ్ళు కూడా నిండని వాడు....రాక్షసులతో యుద్ధం చేయగలడని నేననుకోనంటాడు విశ్వామిత్రుడితో దశరథుడు.)

ఇలాంటి సందర్భంలో మనమెలా ప్రవర్తిస్తామో మనమే ఊహించుకుందాం.

ఎలక్షన్ డ్యూటీ తర్వాత సెలవుల కోసం తహతహలాడే ప్రభుత్వ ఉద్యోగుల బాధలెన్నో

సాయం చిన్నదో.....పెద్దదో, చేసిన ఉపకారానికి కృతజ్ఞతాభావం తప్పడు. గుహుడు అన్నా, జటాయువు అన్నా అందుకే ప్రేమ.
శత్రువు సోదరుడైన విభీషణుడు శరణు కోరివస్తే ఆశ్రయం కల్పిస్తాడు. శరణు ప్రసాదిస్తాడు. సమాజంలో ఎంతమంది అలాంటి వారున్నారు?
చిన్నమాటకు పక్కింటివారితో యుద్ధానికి దిగుతాం.
చిన్న తప్పుకే మిత్రులను శత్రువుల్లా చూస్తాం.

కఠోరశిక్షను అనుభవించిన అహల్యకు పాదాభివందనాలు చేసి ఉద్ధరించిన కరుణాంతరంగుడు.
(17/49/బాలకాండ)

మనలో ఎంతమంది తప్పైంది అని ఒప్పుకున్న వారిని అక్కున చేర్చుకుంటున్నాం?
ఆ తప్పు గురించి వేరే వారివద్ద చర్చించకుండా ఉంటున్నాం?

ఎదురుచూసీచూసీ, వచ్చిన తడవుగనే పండ్లుపెట్టిన శబరీమాతకు పుత్రుడిలా అంత్యక్రియలు నిర్వర్తించడం మన ఊహకందనిది.
మిత్రులు, బంధువులు చనిపోతే శవమెత్తడానికి సంశయించడం మన సాధారణ స్వభావం.


ఇక రాముడి మరో గొప్ప లక్షణం....
నాయకత్వం.
కోతుల సాధారణ లక్షణం చపలచిత్తం.
అలాంటి వానరులను నియంత్రణలో పెట్టుకుని, లంకను జయించడానికి ఎలాంటి నాయకత్వ లక్షణాలు ఉండాల్నో మీరే ఆలోచించండి.

సీతను అగ్నిలో దూకమన్నాడంటారు...

వదిలేసాడంటారు.

సీతాపహరణం తర్వాత రాముని ఏడ్పులు, పెడబొబ్బలు 57 నుండి 67 వ సర్గ/అరణ్యకాండలో చూస్తే రాముడి ప్రేమ అర్థమౌతుంది.
పెళ్ళాల మీద,మొగుళ్ళ మీద కుళ్ళు జోకులు వేసుకుని సంతోషించే మనకు ఆ ఏడ్పులు అంతబాగా అర్థం కావనుకుంటా!


సీత అగ్నిప్రవేశం ఎపిసోడ్ చదివి ఏమైనా అంటే బాగుంటుంది.
మనల గురించి తెలీక ఏదైనా అభాండాలు వేస్తే మన మనసెంత బాధపడుతుంది?
కానీ, ధర్మ సూక్ష్మాలు తెలియక ఆయన మీద నిందలు చాలా సులభంగా వేసేస్తాం.

చిన్నమదేవి నిద్రలో కాలేసిందని కొన్నేళ్లు వదిలేసిన ముగ్గురు భార్యలు,మూడువందల ఉంపుడుగత్తెలున్న శ్రీకృష్ణ దేవరాయలూ మనిషే!

పిల్లలకోసం నలుగురు భార్యలను మనువాడిన దశరథుడూ మనిషే!
పెళ్ళై అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారూ మనుషులే!

పదుల సంఖ్యలో భార్యలు, వందలువేల సంఖ్యలో లైంగిక బానిసలున్న రాజులూ,చక్రవర్తులూ మనుషులే!

జీవితంలో కనిపించే అందగత్తెను,అందగాన్ని ప్రేమించి, కామించే వారూ మనుషులే!

ఒకతే భార్య, ఒకటే మాట అని జీవించిన రాముడూ మనిషే!

ఆయన గురించి నేను చెప్పింది కొంతే....
ఆయనను దేవుడని మొక్కుదామా?
ఆయన మన పూర్వీకుడని అనుసరిద్దామా అనేది మనిష్టం.....

🙏
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online