Pages

social networking sites n their perils

       ఈనాటి రోజులలో సోషల్ నెట్వర్క్ బాగా పెరిగిపోయి౦ ది .  ప్రతి మనిషి ముఖ్యముగా యువకులు,  అంతా చేతిలో సేలఫోన్   లేకపోతే  నెట్ కి అతుక్కుపోవటం సాధారణ దినచర్య అ యుపో యింది .ముఖ్యముగా నెట్ లో యు ట్యూబ్ లో రక రకాల సమాచారం ,వింత .వింత గా చోధ్యం చూపిస్తూ వున్నాయి .ఆ సినిమా హీరోయున్ డ్రెస్ ఖరీద్ తెలుస్సా ?ఆ హీరో ఆస్తి అంతస్తులు ఎంతో తెలుస్సా ,ఆ హీరో కొడుకు పెళ్లి ఎందుకు ఆగిపోయిందో తెలుస్సా? ఇవన్ని నెట్ ని౦డాహాల్ చల్ చేస్తు౦ టాయి .ఒక్కసారి ఆలోచించు కుందాము ?  ఏమిటి అవి అన్ని చదివి బట్టీ పట్టి చర్చి౦ చు కొంటూ టైం పాస్ చేసుకొంటూ వుంటే వచ్చే లాభం  ఏమిటో నాకు ఎమీ అర్థం కాలేదు ,ఓ .కే ఏదో కాస్త అలసిపోయినజీవితానికి ఊరట అనుకోవచ్చు ,కానీ రోజుల తరబడి ,గంటల తరబడి నెట్ కి అతుక్కొని పోయి కూర్చోవటం అటు శారీరిక  ఇటు మానసిక ఆరోగ్యానికి అమితమైన నష్టాన్ని తెచ్చి పెడుతుంది .

        అంతేకాదు కొన్ని యు .ట్యూబ్  అంశాలు అయుతే  వాస్తు ,జ్యోతిష్యం ,లక్కీ నంబర్స్ ,ఇంట్లో సంపదలు పెరగాలంటే ఇలా మనిషి లోని బలహీనత ను క్యాష్ చేసుకుంటున్నారు .కొంతకాలం ఆలోవెరా మట్టలు ఇంటి ముందు కట్టమన్నారు ,మరికొంతకాలం తరువాత మనీప్లాంట్ ,ఆ తరువాత తెల్లజిల్లేడు మండలు,లేక పువ్వులు ,ఇక కొంతమంది కర్పూరం కడ్డీలను ఇంటిముందు కట్టమనడం.కొన్ని యంత్రాలు ,కొన్ని దిష్టి యంత్రాలు కట్టమని అమ్ముకోవటం ,నలుగురు నాలుగు రకాలుగా మనలిని   మనస్సు స్థిరత్త్వం  లేకుండా చేసేస్తున్నారు .కష్టపడటం ,వచ్చిన దానిని జాగ్రత్తగా నిలుపుకోవటం ,అందుకోసం మనం చెడు వ్యసనాలకు బానిసలం కాకుండా వుండాలి .ప్రతీదానిని గుడ్డిగా నమ్మి దాని వెనుక బడి పరుగెత్తకండి .భక్తీమార్గములో నడవండి ,జ్ఞానం పెంచుకోండి ,కాని మూఢనమ్మకాలు ను కనిపెట్టి వాటి నుంచి దూరముగా ఉండండి

        .రోజు మొత్తములో సోషల్ మీడియా ని ఒక్క గంట కంటే ఎక్కువ చూడటం శారీ రక ,మానసిక ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని తెలుసుకోండి .అనుమానాలు ,వాస్తు భయాలు వుంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ధైర్యము గా వుండండి .ఇష్టదైవం ముందు  ధ్యానములో కూర్చొని మీ బాధ ఆ దేవునికి చెప్పుకోండి .తప్పులు చేయకండి .అంటే ఒకరికి బాధ కలిగించేది ,ఒక జీవికి కష్టం కలిగించేది  పాపం.అది చేయకుండా ఉండండి   .సహజము గానే ధైర్యం ,సంతోషం  కల్గుతాయి .మనకు లభి౦చే దానితో తృప్తి బడటం నేర్చుకోవాలి .ఆశ పడొచ్చు దానికి ,మన అర్హత కూడా ఆలోచించి  కష్టపడాలి .కాని అతి ఆశ పడటం మాత్రం ఎప్పటికి మంచిది కాదు   దక్కేది ఎలాగు దక్కుతుంది  . దక్కనిది ఎలాగు దక్కదు . కొంచం అనుభవం తో అది తెలుసుకొని   జీవితాన్ని కాపాడుకోవాలి  అత్యంత  విలువైన సమయం ,గడచి పోయి నది ఇక తిరిగిరాదు ఇకనైనా వున్న జీవితాన్ని సద్వి నియోగం   చేసుకోవాలి అంతేకాని అనేకమందిని జ్యోతిష్యులను కలవడం ,అనేక మంది వాస్తు పండితులను కలవడం వాళ్ళు వచ్చి తలోకడు ఏదో ఒక గోడ పడేసి పోవడం చివరికి కొంప పాడుచేసుకొని చేతిలో డబ్బులు వాళ్ళకు వాళ్ళ ఫీజు లు కట్టటం .కొంప మారి అప్పుడు దేవుడిని ఆశ్రెయిస్తాము.
       
          మనుష్యులను నమ్ముకోవటం ,ఆస్తులు పాడుచేసుకోవడం కాదు .భగవంతుడిని నమ్ముకోండి ప్రతివాళ్ళకు చేయు.ఇంటివాస్తూ రెండూ చూపగూడదు .ఏ ఇద్దరి పండితుల అభిప్రాయాలు కలవవు .మన లోw eekness  కనిపెట్టి ఆఫీస్ కు రమ్మంటాడు. ఒక చెట్టు తెచ్చి ఇంట్లో కట్టమంటాడు .అది శ్రీశైలం అడవుల్లో దొరుకుతుంది అంటాడు .నేను వెళ్ళలేను ,వెళ్ళినా ఆ మొక్కను కనిపెట్టలేము.అప్పుడు ఆ జ్యోతిష్యుడు లేక వాస్తు ఆయన ఏమంటాడు నేను తెప్పిస్తాను వేల రూపాయలు అడుగుతాడు , ఆ మత్తులో వున్న మనం ఎగేసుకు౦ టూఇస్తాము .ఏదో ఒకటి మొక్క చేతిలో పెడతాడు .ఇలా చాలా మంది Uట్యూబ్ లో వ్యాపారాలు చేస్తూ దోచుకుంటున్నారు తస్మాత్ జాగ్రత్త .  .

          ఒకవేళ అంతా మంచిగా  వున్నా ఏవో సమస్యలు వస్తున్నాయి.   అప్పడు ఇలా చేసుకోండి .సూర్యోదయముముందే లేవండి .మీదగ్గ్రర లో ఆంజనేయ స్వామీ గుడికి రోజూ వెళ్ళండి ,ఓ 11 ప్రదక్షిణాలుచేయండి నవగ్రహాలు వుంటే వాటికి నమస్కారం చేసుకోండి మీకుఆంజనేయ స్వామీ పై .లేక శ్రీరాముడి పై మంత్రం వస్తే చదవండి .రాకపోతే శ్రీరామదూత హనుమ  ఈ పదం ఆంజనేయస్వామివారికి ఎంతో ఇష్టం .ఇది  అనుకొంటూ ప్రదక్షిణాలు చేయండి తీర్థ ప్రసాదాలు తీసుకొని ,స్వామీ వారి సింధూరం బొట్టుపెట్టుకోండి .పూజారిగారిని అడిగి కొంచం ఇంటికి తెచ్చి అందరూ పెట్టుకోండి .  సమస్య తీవ్రముగా వుంటే శని వారం కాని మంగళ వారం కాని ఆకు పూజ స్వామికి  చేయుంచుకోండి .అదికూడా చేసుకోలేక పొతే స్వామీ వారి కి  మీ సమస్య చెప్పుకొని  చుట్టూ 111 ప్రదక్షిణాలు చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టండి చాలు .లేదా నువ్వులు నూనె కొని స్వామీ వారి గుళ్ళో దీపారాధనకు ఇవ్వండి చాలు . లేదా అప్పాలదండ స్వామీ వారికి మొక్కుకోండి .ఇంట్లో చిరాకులు వుంటే ఇంట్లో సుందరకాండ పారాయణం పెట్టించుకొని ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టండి

          .ఇక సాయి భక్తులు  అయితే  సాయి పటం పూవులతో అలంకరించి ఓ కొబ్బరికాయ కొట్టి మీ సమస్య చెప్పుకొని రొజూ కొన్ని పే జీ లు చదవండి .రోజూ రొట్టెలు ఆరగి౦ పు చేయటం అవి కుక్కలకు ,ఆవులకు బిచ్చగాండ్ లకు పంచటం మంచిది .నల్లజంతువులకు పెడితే గ్రహబాధలు పోతాయి .ఆవు దూడ చుట్టూ  ప్రదక్షిణం చేస్తే చాలా వాటికి మంచిది .వెనుకభాగంలక్ష్మి స్వరూపం అక్కడే నమస్కారం చేసుకోవాలి .ఏదిఎంత చేసినా ఒక ముఖ్య విషయం గుర్తు పెట్టుకోవాలి .అలరడి మన క్యాసెట్ రికార్డు అయు మనతో మనం అనుభవించాల్సిన ఫైల్ వచ్చే సింది .ఇక దానిలో ఏ మార్పులు వుండవు .ఇప్పుడు చేసే మంచి చెడ్డ వచ్చే జన్మకోసం .మరి పైన పరిహారాలు చెప్పారు కదా అని అనుకోవచ్చు .ఇక అదేమిటి అంటే భగవంతుడు మనం చేసే జపాలతో ప్లీజ్ చేసుకొంటే ఆయనకు దయ కలిగి గొడ్డలి తో పోయే ప్రమాదం గోరు తో చేసి శిక్షతగ్గిస్తాడు .తరువాత ఏదైనా ఉపద్రవాలకు తట్టుకొని నిలబడే శక్తి ని ఇస్తాడు .

           ఇక ఆరోగ్యం లేనివారికి రోజు సూర్యునికి నమస్కారం  చేసుకోవాలి  ప్రదక్షిణ౦ లు చేసుకొని పుష్పమాల ధరించిన ఆ స్వామిని దర్శనంచేసుకోవాలి .పుష్పమాల స్వామీ ధరించి ఉండకపోతే మీరు మీ శక్తి మేరకు కొని లేక అల్లించి వేయుంచి దర్శనం చేసుకోవాలి .నోటికి వచ్చిన లేక క్యాసెట్ లో విన్నా లక్శ్మీనరసి౦హ కరావలంబ స్తోత్రం  పాదుకొన్నా చాలా వుపసేమ నం కలుగుతుంది. ఇక కలియుగానికి భాద్య్యత నాది అని కలవ్ వే ౦ కటనాయకః అని కదా ఇంటిలో తులసీ దళములతో స్వామీ వారి 108 నామాలు చదివి పూజ చేసుకోండి .మీ సమస్య చెప్పుకొని స్వామికి మొక్కు లేక ముడుపు కట్టుకోండి .ఇక విపరీతముగా మోత పెడుతూ మనలను సందేహ ములో పడేసేవి .బుర్ర పిచ్చి ఎక్కించేవి చూడటం మానేయండి మానసిక శారీరక ఆరోగ్యం కాపాడుకోండి .ఇంకా సమస్యలు పరిహారాలు తరువాయి భాగములో వివరించి చెబుతాను .

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online