Pages

బ్రతుకున బ్రతుకై

పొలం దున్ని విత్తనాలు జల్లాను.
పొలాలు అన్నీ పచ్చగా లేచాయి
మనస్సు లోకి ఆమె తొంగి చూసింది
ఆమె ఎంతో చదివింది, నా చదువు మధ్యలో ఆగింది
చిన్నతనం లో ఇద్దరం ఎన్నో చిలిపి ఆటలు ఆడుకున్నాం
ఇప్పుడు ఆమె షర్టు లతో ఫ్యాషన్ గా ఉంది
ఎప్పుడూ నన్ను కవ్వించే ఆమె చిరునవ్వుల జల్లు
ఆమె ఇంటి పక్కనే నా ఇల్లు
ఆమె ఒక చిరునవ్వు నా మనస్సు ని చుట్టి కట్ట కట్టేస్తుంది
బావా అన్న పిలుపు చాలు ఆమె కోసం యుగ యుగాలు పడి ఉంటాను
ఆమె కోసం ఒక్క చెడు అలవాటు నా దగ్గరకు రానీయలేదు
పెళ్ళివారు వస్తున్నారట!  ఆమె కు పెళ్లిచూపులు
నా కళ్ళల్లో నీళ్లు రావు ఆమె కు మంచి జరగాలని
పొలాల్లో నీళ్లు లేవు పచ్చని చేలు ఎండినాయి
ఇంకేం మిగిలింది ? మిగిలింది అప్పులే
ఈ జన్మ కు , రానున్న జన్మలకు మిగులు ఈ బంధాలు
పొలానికి వెళ్ళాడు .. చెట్టుకు వేసాడు ఒక తాడు
తాడుపై వేలాడి .... ఇక వెళ్లిపోవాలని
ఏ పక్షి పలకని , కాపాడని వైనం ... కొద్దీ సేపు మౌనం
బావా ...బావా .. పెద్దగా పిలుపు   తాడు తప్పించింది
 ఆమె ఎద పై నేను ... నా కళ్ళ నీళ్లు తుడుస్తూ ఆమె
పంట లేకపోతేనేం బావా !  నా కంట నీవు లేవా ?
జీవితం అంతా ఉందాము ..  ఒకరికి ఒకరం తోడుగా
ఆమె కళ్ళలో ఆర్ద్రతగా!  అది  ఒకరికి ఒకరం భద్రత అని  

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online