Pages

Deities n grahas to worship on every week day - part-1

      మీకు తెలుసా;     జీవిత గమనములో సమస్యలు వస్తూవున్న ,లేక సమస్యలు అంటే భయం కలుగు తున్నా కనీసం రోజుకు ఒక్కసారి నవగ్రహాలు పేర్లు అయునా చదువుకోండి .ఆదిత్యాయ ,సోమాయ మంగళాయ  బుధాయచ గురు శుక్ర శనిభ్యచ రాహవే కేతవే నమః అని చదువుకోండి .తరువాత ఆంజనేయ స్వామీ వారిపై ,లేక శ్రీ వెంకటేశ్వర స్వామివారి పైన మీకు ఏవైనా స్తోత్రాలు వస్తే చదువుకోండి .వరుసపెట్టి ఓ పది దేవుళ్ళు స్తోత్రాలు చదివేయకండి .ఒకటీ .రెండు దేవుళ్ళ   స్తోత్రాలు చదువుకోండి చాలు .మిగతావి దేవుళ్ళ పేర్లు చెప్పుకొని నమస్కారం చేసుకోండి .ఒకవేళ శ్రీవేంకటేశ్వరస్వామివారి స్తోత్రం ,ఓ లక్ష్మి అమ్మవారి స్తోత్రం చదువుకోండి .మిగతా దేవుళ్ళ పేర్లు చెప్పుకొని ఆనంద పడవచ్చు నమస్కారం పెట్టుకోవచ్చు చాలు అయుతే .అన్నీదేవుళ్ళ స్తోత్రాలు  చదువు కుంటే  చదువుకోవచ్చు  కానీ దానివల్ల మనస్సు కి ఓవర్ డోస్ పడి ప్రశాంత త లేకుండా పోతుంది .అందుకే ఏదైనా అతి పనికి రాదు .ఇక ఏ స్తోత్రానికైనా గణేష్ ని లేదా విస్వక్సేను డి ని ప్రారంభములో తలచుకోవడం ,ఆ తరువాత ఒకసారి నవగ్రహాలను ఒకసారి పేర్లు చెప్పుకొని ,మన ఇష్ట దైవం స్తోత్రం లోకి వెళ్లిపోవచ్చు .ఇది ఏమీ కుదరని వాళ్లకు రెండు ,మూడు తులసి దళాలు శ్రీకృష్ణుడు పాదాలపై వుంచి మనో ఫలకం పై ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని  స్వామిరూపం దర్సించుకోండి ,మీ సమస్య ని దాటించమని ప్రార్ధించండి చాలు . కాని ఆయన పై పిచ్చి విశ్వాసం వుంచుకోవాలి


          .మీదగ్గర  శ్రీ  రాములవారు శ్రీ వేంకటేశ్వర ఎవరైనా పర్వాలేదు భక్తీ ప్రధానం .కాకపొతే కలౌ వేంకట నాయకః  అని చెబుతారు .కలియుగము లో అందరి రక్షణ భాధ్యత నాదే అని చెప్పివున్నారు అందుకే .ఇక కొంతమంది సద్గురు సాయినాదుడిని తలచుకొని నమస్కారం చేసుకొని ఇక ఇష్ట దైవాని వెళ్ళే వారు వున్నారు .అంటే సాయి ని సద్గురువు గా పెట్టుకొ౦టారన్నమాట .ఇంకా వారి వారి కి కుల గురువులు వుంటారు ఉదా; శ్రీవైష్ణవులు  శ్రీ లక్శ్మీనారాయ ణు లు ను ఆరాధిస్తారు .వాళ్ళు ప్రారంభములో శ్రీమతే రామానుజాయనమః  అని వాళ్ళ కుల ,లేక మత గురువుని తలచుకొని ,   విశ్వక్సేనుడి  ఆరాధన (అంటే వినాయకుడి పూజ లా )  చేస్తారు .అలా ఇతరులు అయుతే శంకరాచార్యులు వారిని స్మరించుకొని పూజ ప్రారంభం చేసుకుంటారు . ఏది ఏమైనా రోజూ ఏదో రకముగా కొద్ది సేపు భగవధ్యానం చేయండి మంత్రాలు ,శ్లోకాలు రావలసిన అవసరం లేదు .మనోఫలకం  పై మీ ఇష్ట దైవాన్ని కొద్ది సెకనులు నిల్పుకొని నమస్కారం చేసుకోండి చాలు .అన్నిపక్షి జంతు జాలాలులో .వృక్షాలలో ఆ దైవాన్ని దర్శించండి .మీ శక్తి మేరకు దానధర్మాలు చేయండి చాలు


.ఇక నవగ్రహాలు పట్టి ప్రతీ రోజు నడిచే వారములు ,అధిపతులు వారి మంచి దృష్టి మనపై ప్రసరించటానికి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకు౦ దాము .



ఆదివారం ;/    ఆది వారం అనగానే సూర్యనారాయనుడి కి సంభందించినది అందరికి తెలుస్సు .భాను వాసరే అని  రవి వారం అని కూడా పిలుస్తారు . నవగ్రహాలుకు అధిపతి .మిగాతాగ్రహాలు అన్ని సూర్యుని చుట్టూ తిరగాల్సిందే .ఆయనకు రధానికి ఏడు గుర్రాలు ఉంటాయి .ఇవే సైన్సు లో ఏడు రంగులు  గా విబిజీయార్ అని చెబుతారు .మన ప్రాచీనులు ఏ టెలీస్కోప్ లు లేకుండానే అన్ని విషయాలు చెప్పేశారు .పూర్వములో అన్ని దేశాలలో సూర్యారాధన వుండేది .ప్రపంచములో  చాలా దేశాలలో సూర్యారాధన వున్నట్లు పురాతన దేవాలయాలు  చాలా బయలు పడినాయి .భాను ,ఉదయం 6 గంటలకు భానుడు ,9గంటలకు భాస్కరుడు మధ్యాహ్నం 12 గంటలకు మార్తాండ చండ ప్రచండ సాయంత్రం 6 గంటలకు దినకరుడు అలా పిలుస్తాము.అలా ఆరాధిస్తాము .సూర్యారాధన వల్ల ఆయురా రోగ్య ఐశ్వర్యములు, విజయం కీర్తి ,పుత్రసంతానం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది .జాతకములో సూర్యుడు మంచి స్తితిలో లేదా ఉచ్చ స్తితిలో వుంటే ప్రభుత్వ వుద్యోగం ఖాయం అని పండితులు చెబుతారు .ప్రవహించే నదిలో రాగి నాణెం వదిలితే కూడా సూర్యుని దయ కలిగి ఉద్యోగ లాభం కలుగుతుంది అని పెద్దలు చెబుతారు .పిల్లలతో రోగులకు సేవ చేయుంచాలి . వాళ్ళ జీవితం .భవిష్యత్తు  బాగుంటా యి .అలానే పిల్లలతో గోధుమలతో తయారు చేసిన రొట్టెలు ,లేదా గోధుమలతో చేసిన ఏవైనా తినుబండారాలు కానీ పిల్లలు ,పెద్దలు అందరికి ,బిక్షువులకు కూడా పంచి పెడితే పిల్లలకు ధృడమైన శ రీరం .పెద్దలకు ఆరోగ్యం లభిస్తాయి .లేదా ఆదివారం గోశాలలకు లేదా దగ్గరలో గోవు లు లభిస్తే వాటికి దాణాపెడితే కూడా సూర్య దేవుని అనుగ్రహం కలుగుతుంది .అలానే అమ్మకి ,అమ్మమ్మ కి పాదసేవ చేయాలి .పిల్లలతో చేయుస్తే వాళ్ళు వున్నత మైన స్తితికి చేరుకుంటారు .ఏ రోజు అయనా కూడా పెద్దలకు కాళ్ళకు నూనె రాయటం ,పాదసేవ చేయడం ,వాళ్ళు మందులు వేసుకోవడం లో వాళ్ళ కు సహాయం చేయడం  లాంటివి ,పిల్లలకు అలవాటు చేయాలి .వాటివల్ల సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది .ప్రతి దేవత కు ఆ సంబంధ మైన గాయత్రి మంత్రం వుంటుంది కదా .ఇక్కడ కూడా సూర్యభగవానుడికి కూడా గాయత్రి వుంది , ;భాస్కరాయ విద్మహే మహ ద్వ్యుతి కరాయ ధీ మహీ తన్నో ఆదిత్య ప్రచోదయాత్;   ఇది సూర్య నారాయణుడి గాయత్రి ,దీనిని ఆదివారం రోజు చదువు కుంటే ఇంకా విశేషమైన ఫలితం వుంటుంది .ఇతర రోజుల్లో కూడా సూర్యోదయంవేళ చదువు కోవచ్చు . 
 
 
 
 
 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online