Pages

Deities n grahas to worship on every week day - part - 2

        గోధుమలతో, బెల్లం కలిపి పాయసం త్రాగవచ్చు ,పిల్లలకు త్రాగించవచ్చు ,గోధుమలు సూర్యభగావానునికి  సంభందించిన ధాన్యం ,ఆదివారం రోజు పిల్లలకు త్రిఫ్హలాది చూర్ణం పిల్లలకు కొద్దిగా త్రాగిస్తే కూడా మంచిది .పిల్లలు వజ్రతుల్యం పొంది వాళ్లకు భవిష్యత్తులో ఏ రోగం రాకుండా వుంటారు .ఇక జిల్లేడు సూర్యభగవానుడి కి సంభందించిన యజ్ఞ౦ లో వాడే ప్రధాన సమిధ .దానితో యజ్ఞం చేస్తే పదవీ యోగం ,మంచి ఆరోగ్యం సిద్దిస్తాయి.సప్తమి తో వచ్చే ఆదివారం ను భాను సప్తమి అని పిలుస్తారు .ఆ రోజు ఆ జిల్లేడు లేక తెల్ల జిల్లేడు ఏదైనా సరే వుపయోగించి హోమం లేక యజ్ఞం చేస్తే చాలా విశేషమైన ఫలితం వుంటుంది .యజ్ఞం లో పూర్ణాహుతి మాత్రం సూర్యాస్తమయం లోగా  చేసేసుకోవాలి.

        సూర్యొదయంవేళల్లో తులసి కోటలో సూర్యుడు వైపు కి తిరిగి( రాగి చంబు)ఎలా అయునా   నీటి ని తర్పణం గా మూడు సార్లు వదిలితే మంచిది మీకు సూర్యుని నామాలు వస్తే చదవండి .నమస్కారప్రియుడు సూర్యభగవానుడు .  అందుకే ఏమి చేసినా ,చేయకపోయినా ఉదయమే కనీసం చేతులు ఎత్తి పలు సార్లు నమస్కారం చేసినా కూడా చాలా మంచిది .కొంతమంది రోజూ సూర్య నమస్కారములు యోగ పద్దతిలో చేస్తారు .అవి 11 రకాల నమస్కారములు మొత్తం ఉంటాయి .అవి నేర్చుకొని రోజూ ఉదయం వేళా చేస్తే శ రీరములో అన్నిరకాల అంగాలు మంచి ఆరోగ్యం పొందుతాయి .అనారోగ్యం తో బాధ పడే వారు చేస్తే ఆరోగ్యవంతులు అవుతారు .అలానే ఆదిత్య హృదయం రోజూ ఉదయం వేళా చదువుకొంటే పిల్లలకు ,పెద్దలకు చాలా మంచిది. కాకపొతే ,చదివే వాళ్ళు  ఆ  రోజు త్రాగటం ,మాంసం తినడం లాంటివి చేయకూడదు . 
 
        కొందరి పండితుల అభిప్రాయం ప్రకారం పూర్వ కాలములో ఆదివారం సెలవు లేదు .ఆదివారం మధువు, మాంసం తెచ్చుకొని  తినడం లేదు .ఆ ఆచారం పరాయు పాలన వచ్చిన తరువాత మన సమాజములో ప్రారంభం అయునది .( ఇక ఆయనకు సంభందిo చినవి:- గోధుమలు,ధాన్యం /బంగారం /ఎరుపు వస్త్రం ఇవి వీటిలో ఏదో ఒకటి లేదా ఇవన్ని మూట కట్టి దానం గా ఇస్తూ వుంటారు.  సిద్దాంతి జాతకం   చూసి చెప్పినప్పుడు )ఇక ఎవరైనా ఇది సూర్యుడిని చూస్తూ చదువుకోవచ్చు

.జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమో రీ౦  సర్వ పాపఘ్నం  ప్రణతోస్మి దివాకరం .

;ఇక ఇది మీ వీలు బట్టి చదువుకొని దండం పెట్టినా చాలు ఎన్నిసార్లు అయునా  చదువుకోవచ్చు .సూర్యభగవానుడి రత్నం పేరు కె౦పు (Ruby).మాణిక్యం ,పద్మరాగం సౌగంధికం .కురువిందము ,మంసగంధి ,నీలగ౦ధీ ,లాలుగంది  అని పేర్లు కలవు .ఎరుపు రంగు లో ఉండును .శ్రీలంక లో దొరుకు కెంపు చాలా విశిష్టమైనది.దీని ప్రభావం వల్ల ధైర్యం,సాహసం ,మేధాశక్తి ,వాగ్ధాటి ,మేధాశక్తి కలుగుతాయి .నేత్ర రోగములు తగ్గు ముఖం పడతాయి కోర్టు వ్యవహారముల్లో విజయం సిద్దిస్తుంది .వ్యాపారములో కూడా లాభాలు వస్తాయి    కష్టపడినా ఒకొక్కసారి కొందరు విద్యార్థులు .పరిక్షలు తప్పుతున్నప్పుడు వారు కూడా ఈ రత్నం ధరిస్తే విజయం వారికి లభిస్తుంది .సహజముగా సింహ రాసి ,లగ్నం వారు ,కృత్తిక నక్షత్రం వారు ,ఉత్తర నక్షత్రమున వారు ఉత్తరాషాడ  వారు దీనిని ధరిస్తూ వుంటారు .

         రత్నములు కంటే గూడా ఎదురుగా వున్న సూర్య భగవానుడికి స్తోత్రం చదువుకొని నీటి తో అర్ఘ్యం ఇచ్చి దండాలు పెడితే చాలు .స్తోత్రం ఏదీ రాకపోయునా చిన్న రాగి చెంబులో చిన్న బెల్లం ముక్క వేసి కల్పి సూర్య భగవానునికి చూపించి నమస్కారం చేసి ఓం నమో నారాయణా య అను కుంటూ ఆ తీర్థం త్రాగేయాలి అలా కొద్ది రోజులు చేసి చూడండి .   .సమస్య ఎక్కువగా ఉన్నాప్పుడు పండితుడి ని కల్సి జాతకం చూపించుకొని వారు సూచించిన రత్నం ధరించాలి ,   
 
 
 
 
 
 
 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online