Pages

vinayaka chavithi - some interesting info n essential things

నా యొక్క ప్రియమైన మిత్రులు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.
వినాయకుడు అవతారం గురించి అన్ని పురాణాలలో ఉంది.  సంపూర్ణం గా వైదిక మతానుసారమే ఈ వినాయకుడిని కోలీ మతం, విధానం ఉంది.  శ్రీ మహావిష్ణువు కి జగదాంబ అంటే ఉమాదేవి చెల్లెలు అవుతుంది.  ఒకానొక సందర్భం లో చెల్లెలి దగ్గరే ఎప్పుడూ ఉండాలి అని, ఆ ప్రేమ ఎల్లప్పుడూ పొందాలి అని ఆ నారాయణుడే వినాయకుడి గా రూపు దాల్చాడు అని కూడా ఒక వాదం ఉంది .  అందుకే లక్ష్మి గణపతి అని పిలుస్తారట లక్ష్మి నారాయణుల వలే అని కొందరు చెబుతారు.  కుమార స్వామి అంటే శేష అవతారం.  ఆ శేషుడే అలా జన్మించాడు అని కొందరి కొత్త కోణం.  దేవ గురువైన బృహస్పతి కూడా వినాయకుని అవతారమే అని మరికొన్ని వాదాలు ఉన్నాయి. 
     ఏది ఏమైనా ఆంజనేయ స్వామి వలెనె గణపతి ఆరాధన కూడా నవగ్రహాల యొక్క మంచి ఫలితాలను ఇస్తుంది .  విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యా రంగం లోని వారికి ఈ పూజ ఎంతో మేలు చేస్తుంది .  అందుకే విద్యార్థులు ఈ పూజ లో పుస్తకాలు ఉంచి, ఆ తర్వాత ఓంకారం పసుపు తో దిద్దుతారు.
  ఇక మట్టి గణపతి ని పూజించటమే ఉత్తమ మైనది.  అటు పర్యావరణ ప్రయోజనం కోసం, ఇటు లౌకిక, అలౌకిక ఆనందం కోసం రెండు సమకూరుతాయి.  భూమాత లోనే , పంచా భూతాలలోనే ప్రతి జీవి, ప్రతి శరీరము, ఆకులు, హలములు అన్నీ భూదేవి ఒడి లోనే కలిసి పోతాయి.  ఆ తల్లి ఎంతో ఓర్పు ఉన్న సహనశీలి.  ఆ భూమాత నుండి కొంత మట్టిని తీసుకుని విగ్రహం గా మలచుకొని, పూజించుకొని, మరల నిమజ్జనం చేసుకోవటం జీవుడి ప్రస్తానం ఎలా ఉంటుందో ఈ ప్రక్రియ లో కనపడుతుంది.  ఒక సంకల్పం, దానికి రూపం, దానిలో ప్రాణం, కొంత కాలం స్థిరత్వం, ఆ తర్వాత నిమజ్జనం, సృష్టి, స్థితి లయములు ప్రతి వస్తువు లోను ఉంటాయి అనే పరమార్ధాన్ని పవిత్రం గా భావించటమే నిమజ్జనం.  ఎక్కడినుండి వచ్చామో అక్కడికి మళ్ళీ వెళ్ళవలసిందే.  ఇక నీటిలోనే ఎందుకు వెయ్యాలి అంటే గణపతి పృధివీ తత్వానికి సంబందించిన వాడు.యోగం లో మనిషికి ఉన్నచక్రాల ఆధారం గా మొదటగా మూలాధార స్థానం లో క్రిందగా ఉండే వాడు, స్థిరత్వాన్ని ఇచ్చే వాడు గణపతి.  అందుకే ఈ సమయం లో మట్టి తో చేసిన విగ్రహమే విశిష్టమైనది. 
మళ్ళీ ఆయన విష్ణువు అవతారం అనుకున్నాం కదా!  అది జల తత్వం.  అందుకే ఇక్కడ జలము లోనే కలిపేస్తున్నాము. అసలు గణపతి పూజకు ప్రధానం గా కావలసినవి 1. మట్టి గణపతి 2. గంధం (గంధం చెక్క నుండి అరగతీసిన గంధం అయితే మంచిది ) 3. సింధూరం (హనుమంతుడికి మనం పెట్టేది ) 4. గరిక 5. తులసి దళాలు 6. చెరకు ముక్కలు.
మట్టి గణపతికి గంధం తో బొట్టు పెట్టి సింధూరం మెడకు రాసి, గరిక తో, తులసి దళాలతో పూజించి చెరకు ముక్కలు నైవేద్యం పెట్టాలి.  తులసి అంటే లక్ష్మి స్వరూపం.  వినాయక చవితి రోజు మాత్రమే గణపతిని తులసి దళాలతో పూజించాలి.  మిగిలిన రోజుల్లో కాదు.  ఈ విధం గా పూజిస్తే మనం కోరుకున్న సిరిసంపదలు మనకు లభిస్తాయి. 
ఇక్కడ మనం గుర్తు ఉంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అసలు భక్తి ప్రధానం గానీ మిగిలినవి ఏమి ముఖ్యం కాదు.  పాలవెల్లి లేదు, పత్రీ లేదు, అని ఇలా అక్కర్లేని ఆర్భాటాలకు పోయి డబ్బు, సమయం వృధా చేసుకోవద్దు.  ఈ ఒక్కరోజు కోసం చెట్లు, మొక్కలు పీకి పర్యావరణం పాడు చెయ్యొద్దు.  మనకు పత్రీ దొరకక పోయినా కొన్ని పువ్వులు, పత్రాలు, గరిక ఉంటె చాలు. మీ ఇంటి చుట్టూ ఉన్న చెట్లు నుండి దొరికిన ఆకులు తెచ్చి పూజించినా చాలా పత్రీ అవుతుంది.  అది చాలు పూజకి.  వినాయకుడు అంటే గజానికి ప్రతి రూపం కనుక అన్ని చెట్ల ఆకులు పూజించ వచ్చు.  మీకు ఆ పత్రాల పేర్లు తెలియక పోయినా పరవాలేదు, ఆ పేరు చెప్పి అక్షతలు వెయ్యండి చాలు.  చివరలో మీరు కోసిన ఆకులు అన్నీ కలిపి 108. నామాలతో పూజించండి.  మీకు చేతనైన తీపి పదార్ధం, ఉండ్రాళ్ళు చేసి ఆరగింపు చెయ్యండి.  అది కూడా చేత కాకపోతే కొబ్బ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టండి చాలు.  ఇక్కడ భక్తి ముఖ్యం గానీ మిగిలినవి ఏమి కావు.  మనకు ఆ మంత్రాలూ రాక పోయినా ఓం గణేశాయ నమః అని 108. సార్లు అన్నా చాలు.
భగవంతుని పై భక్తి ప్రధానం కానీ మిగిలినవి అన్నీ కూడా మనకు ఆ నిష్ఠ కుదరడానికి ఉపయోగ పడేవే.  అసలు భగవంతుడు ఈ ఆర్భాటాలు చూడడు. నిర్మల మైన మనసుతో రెండు క్షణాలు ఆయనను తలచుకుంటే ఆయన సంతృప్తి చెందుతాడు.  మనకి మనసు ఆనంద పడుతుంది.  అదే బ్రహ్మానందం.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online