ప్రియమిత్రులారా, వర్షాకాలం వచ్చేసింది .మొక్కలు ఎక్కడో అక్కడ ఎన్నో కొన్ని నాటండి .అది చేయలేనివారు కనీసం మొక్క్లల గింజలు అయునా నాటండి .అదికూడా వేపచెట్లు అయుతే మరీ మంచిది .ఇక ముందుగా వేప ,నేరేడు చింత సీతాఫలం లాంటి మీరు ఏమి తిన్నా సరే ఆ గింజలు ను పారవేయకుండా ఓ డబ్బా లో వేయండి .అలా వర్షం కురిసి ఆగిన తరువాత బైటకు వెళ్ళినప్పుడు ఖాళి ప్రదేశములో వీటిని కొద్దిగా పుల్లతో లోపలికి గుచ్చి ఓ గింజ చొప్పున వేస్తూ వెళ్ళండి .మామిడి ,వేప, రావి, జువ్వి, పారిజాతం, తులసి, మర్రి, మారేడు లాంటివి దేవతా వృక్షములు అని చెబుతారు . అవి నాటి పెంచితే ఎంతో పుణ్యం వస్తుంది అని చెబుతారు .సరే పుణ్యం అంటే పది మందికి మంచి జరగటం. సంతానం లేనివారికి కూడా , దాని వాళ్ళ కలిగే దోషాలు తొలగి పోయి స్వర్గం ప్రాప్తిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి.
రావిచెట్టు దేవాలయములో కానీ ఆ సమీపములో కానీ వేస్తే కోటి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది అని కూడా వుంది .రావి చెట్టు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు రూపం అని భగవద్ఘీత లో భగవానుడు చెప్పాడు కదా ,జ్యోతిష్యం లో కొన్ని సమస్యలకు ఆ రావి చెట్టు ప్రదక్షిణాలు పరిహారముగా చెబుతూ వుంటారు .ఒక్క శనివా రం రోజు మాత్రమే ఆ వృక్షాన్ని ముట్టుకొని దండం పెట్టుకోవాలి ఆ రోజు ఒక్కరోజు మాత్రమె శ్రీ మహాలక్ష్మీదేవి కొలువుఅయి ఆ చెట్టులో వుంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి, మిగతారోజులు జేస్టాదేవి అక్కడ వుంటుంది అందుకే ముట్టుకోరాదు అని చెబుతారు .
ఇక వేప చెట్టు అమ్మవారి అవతారం అని చెబుతారు .వేప గాలి మనకు ఎంతో మంచిది .దానివల్ల పర్యావరణం ఎంతో శుభ్రపడుతుంది. ముఖ్యముగా ఆస్తమా లాంటి శ్వాసకు సంభందించినవ్యాధులు రాకుండా ఉంటాయి ,అలర్జీ లకు ,చర్మ వ్యాధులకు క్రిమి కీ ట కాడులకు దీని వేప గాలి మందులా పనిచేసి తరిమి కొడుతుంది . ఇక జమ్మి చెట్టు శని సంభంధమైన సమస్యలకు మంచి పరిష్కారం ఇంకా అలానే జన్మ నక్షత్రాలు బట్టి కూడా మొక్కలు నాటుతూ వుంటారు మామిడి మొక్కలు ఎంత పెద్దగా అయునా సరే దాని బలమైన వేర్లు మాత్రం సూటిగా భూమిలోకి మాత్రమే నిట్ట నిలువుగా పోతాయి, ఇంటి గోడల్లోకోపోయి గోడలు పాడు చేయవు.
అవసరాల కోసం కార్ కొనేవాళ్ళు కొందరు అయితే ,డబ్బు పుష్కలముగా వుండి కొనేవారు కొందరు,కొన్నాము కదా అని తిరిగేవారు కొందరు, త్రాగుతూ తిరిగేవారు కొందరు, ఏది ఏమయునా విలాసాలకోసం పర్యావరణం పాడుచేసేసాం. భూగోళం వేడి ఎక్కిపోతుంది. రానున్న తరాల వారి వాటా కూడా మనం ఇప్పుడే పాడుచేసేసాం. కనీస మానవ ధర్మం తో రాబోయే తరాల పిల్లలకు ఆరోగ్యమైన పర్యావరణం కోసం మన తప్పులను దిద్దుకొని మొక్కలు నాటాలి . కనీసం విత్తనాలను అయునా జేబుల్లో పోసుకొని వన పడినప్పుడు నాటుదాం , ఈ వర్షాకాలాన్నిసద్వినియోగం చేసుకుందాం . ఈ జన్మని కనీసం చిన్న పని కి వుపయోగించి పుణ్యాత్ములం అవుదాం పదండి ముందుకు.
.

0 comments:
Post a Comment