Pages

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-11

         పోనీ ఒక వేళ ఇంకో మతం వారు ఏ రూపం లేకుండా నిరంజన నిరాకార రూపం అంటారు .కాని మనస్సులో ఏమి ఊహించి దండం పెట్టుకుంటారు .ఏదో ఒక రూపం ,తండ్రి  గా ,పురుషుడిగా ,లేదా ప్రకృతి అంతా నిండి వున్న ఓ పెద్ద దుప్పటి లా ,లేదు అంటే వెలుగుతున్న ఓ  జ్యోతి లా ,  నాయనా   ,తండ్రి    ఏదో ఒకటి   సంభోదిస్తూ లోలోపల మాట లాడు కొంటూ  ప్రార్ధన చేయాల్సిందే అంటే ,ఆకారం పూజ చేసేవాళ్ళు ఎదురుగా వున్న రూపమ్ తో  మాటలు పెట్టుకుంటారు .కాబట్టి అందరు అన్ని మతాలవారు  కనపడని భగవంతుడి ని ఏదో రకము గా కనెక్ట్ అవ్వలిసిందే .అందుకే ఒకరు గొప్ప ,ఒకరు కాదు అనలేము ,అనకూడదు ,   పరమాత్మ నేను అన్ని రూపాలులో ,అన్ని జీవులలో వున్నాను ,అని చెప్పటానికి చేప , తాబేలు , పంది  , సగం మనిషి సగం సింహం  శ్రీరాముడు ,శ్రీకృష్ణుడు ఇలా అన్నింటిలోనునేను,అన్నినేనేఅని చెప్పకనేచెప్పాడు .అసహ్యంచుకోవడం ,ఆనందపడటం ,ఇష్టపడటం అన్ని నేనే అని చెప్పటానికే  పంది అవతారం   కూడా ఎత్తాడు  అంతేకాదు ప్రపంచం ,విశ్వం అంతటా నేనే నిండి వున్నాను .అందరు దేవుళ్ళు ,అన్నిరకాలు నాలో చూడండి అని విశ్వరూపం ఎత్తి చూపించాడు .

        ఎంత చెప్పిన అర్థం అయ్యేవాడికి అర్థం అవుతుంది ,కాని వాడికి కాదు దానికి కొంత పూర్వ జన్మల అదృష్టం వుండాలి ,ఆ దైవం యొక్క దయ కూడా మనపై ప్రసరించాలి .మన మనస్స్సు కూడా కడిగిన ముత్యం లా వుండాలి . లేకపొతే  మనకు ఎక్కదు .చెక్క,ప్లాస్టిక్ వస్తవులలోకి కరెంట్ ఎలా ప్రసరించ దో ,అలా అక్కడ అంత దేవుడి  ప్రవాహం వున్నఎక్కదు. అంతదాకా ఎందుకు శ్రీకృష్ణపరమాత్మ కౌరవుల సభలో ప్రవేశించి నప్పుడు ,ఆ పరమాత్మ ను తాళ్ళతో కట్టేయటానికి దుర్యోధనుడు , కర్ణుడు తో దుష్ట చెతుస్ట యం అందరూ ఓ పన్నాగం పన్నారు  . ఇంకా ఆ  సభ లో విదురుడు   ధృతరాష్ట్రుడు    కూడా వున్నారు .  ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి వాడు కదా ,అందుకే ఆయనకు మనో నేత్రం  ప్రసాదించి మరీ విశ్వరూపం కళ్ళకు చూపెట్టాడు .వాళ్ళందరికీ ఏమి అర్థం అయ్యంది ?  ఆయన సాక్షాత్తు భగవంతుడే    అని ఒక్క విదురుడు కి తప్ప మిగతా వాళ్ళ కి ఏమి అర్థం కాలేదు .ఓరి పిచ్చివాళ్ళా రా ప్రపంచం అంతా నేనే నిండి వున్నప్పుడు మీరు ఏమి బంధిచగలరు . ఇక్కడ మనకేమి తెలుస్తుంది .నేను ఒక్క చిత్రము లోనో ,లేక ఒక్క ఫోటో లోనో .ఒక్క విగ్రహము లోనో కాదు అంతటా నేనే నిండి వున్నాను   మీ దేహములో నేనే వున్నాను అదే అంతర్యామి అని పిలుస్తాము .అలా . నాలో శివుడు వినాయకుడు హనుమంతుడు ఇలా దేవతలూ ,పిత్రుదేవతలూ అంతా నాలోనే వుండి ,ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు అని మనం శ్రీకృష్ణుడివిశ్వరూపం చూచి అర్థం చేసుకోవాలి 

      భగవంతుడు ఒక్కడే కానీ మన అవసరాలకు తగ్గట్టుగా మనం మలుచు కొంటున్నాము .ప్రవహించే విద్యుత్తుఒక్కటే కాని టి.వి ,ఫ్రిజ్ వాషింగ్ మెషిన్,నీటి మోటార్ ,ఇస్త్రిపెట్టే ఇలా దానిని అన్నిటిలో  వాడుతున్నాము.  అలానే ఒక ఇంట్లో ఇంటి యజమాని ,ఆయన కూడా ఒక్కడే తండ్రి ,బాబాయి ఒకరికి మేనమామ ,ఒకరికి తమ్ముడు ఒకరికి బావ ఇలా ఒక్కరినే ఎలా పిలుచుకొంతున్నామో అలానే దేవుడి ని ఇన్ని రూపాలలో కోలుచుకొంటు న్నాము.  బలానికి ,భయం పోవటానికి ఆంజనేయస్వామిని ,పనిలో ఆటంకాలు రాకుండా వినాయకుడిని ,సంపదకోసం శ్రీలక్ష్మి అమ్మవారిని ,విద్యకోసం సరస్వతి అమ్మవారిని యుద్దములో విజయంకోసం దుర్గామ్మవారిని ఇలా ఆరాధిస్తున్నాము

           శుద్ధమైన భక్తీ అవసరం .భగవంతుడుకూడా మనలోని భక్తీ ని చూస్తాడు .అంతేకాని ఆడంబరాలు పట్టించుకోడు .మనకు శ బరి,గుహుడు ,ఇంకా తిన్నడు ,పాము ,ఏనుగు ,సాలీడు ఈ కధలు అన్ని మనకు తెలిసినవే .అంతేకాదు సత్త్వ ,తమో  రజస  గుణాల ను భట్టి కూడా దైవారాధన వుంటుంది అని గీతలో భగవానుడు చెప్పాడు కదా.   కాబట్టి అంతా ఒక్కరే ,ఏకదా సత్  బహుదా వదంతీ  వున్నది ఒక్కటే సత్ పదార్దం , దానిని పండితులు  అనేక రూపములుగా చెప్తున్నారు  అని వేదభాష్యం చెబుతుంది.        మీరు  ఏ దేవుడికి లేక ఏ దేవత కు అర్చన చేసినా అది వచ్చి నాకే చేరుతుంది .అందుకే   మనం  పెద్దవాళ్ళకు   నమస్కారం చేసినప్పుడు వాళ్ళు కృష్ణార్పణం  అంటూ వుంటారు .అదే    సర్వ దేవ నమస్కారం కేశ వం ప్రతి గచ్చతి    అని అర్థం.

          హిరణ్యకశిపుడు కి  సంపదలు ,భోగాలు   అన్నీ ఇచ్చాడు. జ్ఞానము ,అజ్ఞానము అన్నీ తెలుసుకొనే విచ క్ష ణ కూడా ఇచ్చాడు .కాని అతనిలో జనించిన  అహంకారం వల్ల కళ్ళు మూసుకు పోయాయి .దానితో నేనే ఈ సృష్టి కి ఆధారం .నేనే భగవంతుడిని అందరు నన్నే పూజించండి .అంటూ సేవకులని ,ప్రజలని పీడించి ,అధికారముతో భయపెట్టి భజన చేయుం చు కొనే వాడు .భగవంతుడు ఆ అహంకారి  చివరికి కన్న కొడుకు  తో కూడా జ్ఞానం చెప్పించాడు    .మరీ అంతటా నేనే అన్నప్పుడు చెడు ,రాక్షసులు అంతా కూడా మరి పరమాత్మే  అవుతాడు  కదా ? అలాంటప్పుడు ఈ పూజలు పొగడ్తలు మంచి పనులు   పుణ్యం   ఇది అంతా ఎందుకు ? చెడు పనులు చేస్తే తప్పు ఏమిటి ?ఇటువంటి సందేహాలు రావచ్చు ?   (contd..)
 
 
 
 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online