Pages

ఓ భావన ( ఇది కవిత్వం కాదు )

కొండ గుట్టల్లో నుండి ఓ దారి
ఆ దారి గుండా వెళ్తే మా ఊరు
కొండ గాలులకు భూమి పై జాలువారిన పూలు
ఆమె రోజూ ఇదే దారిలో వెళ్తుంది
వర్షం బాగా వస్తోంది అని గొడుగు తెచ్చాను
ఆమె కోసం వెతుకుతూ ఎదురు చూపులు
వర్షం కోసం మేఘాలను త్రొలే ఈదురు గాలులు
ఆకాశం నిండు కుండ లా బరువెక్కింది
నా హృదయం ఆమె కోసం పరుగు పెడుతోంది
మనసు నిండా ముసురుకున్న ఎన్నో ఆశలు
నా గొడుగు కిందకు ఆమెను ఆహ్వానిస్తాను
వర్షం దంచి కొట్టాలి , అందాలు తడిసి కరిగిపోయేలా
నిజం గానే వర్షం ఎక్కువై నన్ను ముంచేస్తోంది
నా ముందు నుంచే ఆమె గొడుగులో సాగిపోతోంది
తడిసి పోయిన రామ చిలుకలా
ఇక నేను  గొడుగును ముడుచుకున్నాను
వర్షం నన్ను కరిగించి వేస్తోంది కసి కసి గా !

vinayaka chavithi - some interesting info n essential things

నా యొక్క ప్రియమైన మిత్రులు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.
వినాయకుడు అవతారం గురించి అన్ని పురాణాలలో ఉంది.  సంపూర్ణం గా వైదిక మతానుసారమే ఈ వినాయకుడిని కోలీ మతం, విధానం ఉంది.  శ్రీ మహావిష్ణువు కి జగదాంబ అంటే ఉమాదేవి చెల్లెలు అవుతుంది.  ఒకానొక సందర్భం లో చెల్లెలి దగ్గరే ఎప్పుడూ ఉండాలి అని, ఆ ప్రేమ ఎల్లప్పుడూ పొందాలి అని ఆ నారాయణుడే వినాయకుడి గా రూపు దాల్చాడు అని కూడా ఒక వాదం ఉంది .  అందుకే లక్ష్మి గణపతి అని పిలుస్తారట లక్ష్మి నారాయణుల వలే అని కొందరు చెబుతారు.  కుమార స్వామి అంటే శేష అవతారం.  ఆ శేషుడే అలా జన్మించాడు అని కొందరి కొత్త కోణం.  దేవ గురువైన బృహస్పతి కూడా వినాయకుని అవతారమే అని మరికొన్ని వాదాలు ఉన్నాయి. 
     ఏది ఏమైనా ఆంజనేయ స్వామి వలెనె గణపతి ఆరాధన కూడా నవగ్రహాల యొక్క మంచి ఫలితాలను ఇస్తుంది .  విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యా రంగం లోని వారికి ఈ పూజ ఎంతో మేలు చేస్తుంది .  అందుకే విద్యార్థులు ఈ పూజ లో పుస్తకాలు ఉంచి, ఆ తర్వాత ఓంకారం పసుపు తో దిద్దుతారు.
  ఇక మట్టి గణపతి ని పూజించటమే ఉత్తమ మైనది.  అటు పర్యావరణ ప్రయోజనం కోసం, ఇటు లౌకిక, అలౌకిక ఆనందం కోసం రెండు సమకూరుతాయి.  భూమాత లోనే , పంచా భూతాలలోనే ప్రతి జీవి, ప్రతి శరీరము, ఆకులు, హలములు అన్నీ భూదేవి ఒడి లోనే కలిసి పోతాయి.  ఆ తల్లి ఎంతో ఓర్పు ఉన్న సహనశీలి.  ఆ భూమాత నుండి కొంత మట్టిని తీసుకుని విగ్రహం గా మలచుకొని, పూజించుకొని, మరల నిమజ్జనం చేసుకోవటం జీవుడి ప్రస్తానం ఎలా ఉంటుందో ఈ ప్రక్రియ లో కనపడుతుంది.  ఒక సంకల్పం, దానికి రూపం, దానిలో ప్రాణం, కొంత కాలం స్థిరత్వం, ఆ తర్వాత నిమజ్జనం, సృష్టి, స్థితి లయములు ప్రతి వస్తువు లోను ఉంటాయి అనే పరమార్ధాన్ని పవిత్రం గా భావించటమే నిమజ్జనం.  ఎక్కడినుండి వచ్చామో అక్కడికి మళ్ళీ వెళ్ళవలసిందే.  ఇక నీటిలోనే ఎందుకు వెయ్యాలి అంటే గణపతి పృధివీ తత్వానికి సంబందించిన వాడు.యోగం లో మనిషికి ఉన్నచక్రాల ఆధారం గా మొదటగా మూలాధార స్థానం లో క్రిందగా ఉండే వాడు, స్థిరత్వాన్ని ఇచ్చే వాడు గణపతి.  అందుకే ఈ సమయం లో మట్టి తో చేసిన విగ్రహమే విశిష్టమైనది. 
మళ్ళీ ఆయన విష్ణువు అవతారం అనుకున్నాం కదా!  అది జల తత్వం.  అందుకే ఇక్కడ జలము లోనే కలిపేస్తున్నాము. అసలు గణపతి పూజకు ప్రధానం గా కావలసినవి 1. మట్టి గణపతి 2. గంధం (గంధం చెక్క నుండి అరగతీసిన గంధం అయితే మంచిది ) 3. సింధూరం (హనుమంతుడికి మనం పెట్టేది ) 4. గరిక 5. తులసి దళాలు 6. చెరకు ముక్కలు.
మట్టి గణపతికి గంధం తో బొట్టు పెట్టి సింధూరం మెడకు రాసి, గరిక తో, తులసి దళాలతో పూజించి చెరకు ముక్కలు నైవేద్యం పెట్టాలి.  తులసి అంటే లక్ష్మి స్వరూపం.  వినాయక చవితి రోజు మాత్రమే గణపతిని తులసి దళాలతో పూజించాలి.  మిగిలిన రోజుల్లో కాదు.  ఈ విధం గా పూజిస్తే మనం కోరుకున్న సిరిసంపదలు మనకు లభిస్తాయి. 
ఇక్కడ మనం గుర్తు ఉంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అసలు భక్తి ప్రధానం గానీ మిగిలినవి ఏమి ముఖ్యం కాదు.  పాలవెల్లి లేదు, పత్రీ లేదు, అని ఇలా అక్కర్లేని ఆర్భాటాలకు పోయి డబ్బు, సమయం వృధా చేసుకోవద్దు.  ఈ ఒక్కరోజు కోసం చెట్లు, మొక్కలు పీకి పర్యావరణం పాడు చెయ్యొద్దు.  మనకు పత్రీ దొరకక పోయినా కొన్ని పువ్వులు, పత్రాలు, గరిక ఉంటె చాలు. మీ ఇంటి చుట్టూ ఉన్న చెట్లు నుండి దొరికిన ఆకులు తెచ్చి పూజించినా చాలా పత్రీ అవుతుంది.  అది చాలు పూజకి.  వినాయకుడు అంటే గజానికి ప్రతి రూపం కనుక అన్ని చెట్ల ఆకులు పూజించ వచ్చు.  మీకు ఆ పత్రాల పేర్లు తెలియక పోయినా పరవాలేదు, ఆ పేరు చెప్పి అక్షతలు వెయ్యండి చాలు.  చివరలో మీరు కోసిన ఆకులు అన్నీ కలిపి 108. నామాలతో పూజించండి.  మీకు చేతనైన తీపి పదార్ధం, ఉండ్రాళ్ళు చేసి ఆరగింపు చెయ్యండి.  అది కూడా చేత కాకపోతే కొబ్బ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టండి చాలు.  ఇక్కడ భక్తి ముఖ్యం గానీ మిగిలినవి ఏమి కావు.  మనకు ఆ మంత్రాలూ రాక పోయినా ఓం గణేశాయ నమః అని 108. సార్లు అన్నా చాలు.
భగవంతుని పై భక్తి ప్రధానం కానీ మిగిలినవి అన్నీ కూడా మనకు ఆ నిష్ఠ కుదరడానికి ఉపయోగ పడేవే.  అసలు భగవంతుడు ఈ ఆర్భాటాలు చూడడు. నిర్మల మైన మనసుతో రెండు క్షణాలు ఆయనను తలచుకుంటే ఆయన సంతృప్తి చెందుతాడు.  మనకి మనసు ఆనంద పడుతుంది.  అదే బ్రహ్మానందం.

Brahmamokkate para brahmam okkate - part - 12

ఇటువంటి అన్ని సందేహాలకు ఉపనిషత్తులు ,భగవద్గీత లలో సమాధానం దొరుకుతుంది .కొన్ని వేదాంత విషయాలు ఏదో నవల లాగా చదువుకొంటూ పొతే అర్థం కాదు .సద్గురువు ,పండితుడు దగ్గర కూర్చుని అధ్యయనం చేయాలి  .ఇక పైన సందేహానికి  సమాధానం   ప్రతి జీవిలో రెండు  పక్షులు ఉంటాయి .ఒక పక్షి కదలకుండా స్థిరముగా వుంటుంది .ఇంకో పక్షి కదలాడుతూ వుంటుంది .అంటే దాని అర్థం ఒకటి జీవాత్మ    అది కదులుతూ ,ఆలోచిస్తూ వుంటుంది ,రెండోది పరమాత్మ .అయుతే అన్ని జీవులలోను ఇలానే ఉన్నప్పటికి   ప్రత్యేకముగా   మనిషిలో మాత్రం ఇంగిత జ్ఞానం అనేది ,ఇది మంచి ,ఇది చెడు అని తెలుసుకొనే అవకాశ ౦  ఇచ్చాడు ,జంతు వులలో మాత్రం అది లేదు .అందుకనే పెద్దవాళ్ళు పశువు ,మృగం అని కోపం వచ్చినప్పుడు తప్పు చేసిన వాడిని తిడుతూ వుంటారు . అయుతే  మనుషులలో అరిషడ్వర్గాలు అని ఆరు ఉంటాయి .అవి కామ ,క్రోధ ,లోభ మోహ ,మద మాత్సర్యాలు  ఈ ఆరు మనలోని జ్ఞానాన్ని మూసి కప్పెస్తాయు .

         కామం అంటే కోరిక     అది తీరక క్రోధం   అంటే కోపం     వున్నది పోతుందేమో అని లోభం      అంటే పిసినారితనం .     మళ్ళీ పదే పదే దానినే కోరుకోవటం ,దానిని విడిచిపెట్టలేక పోవటం అదే మోహ౦ .      ఇక మదం అంటే    నా అంత బలవంతుడు ,గొప్పవాడు ఇంకోడు రాడు నన్ను గెలిచి ఇదిఎమి పట్టుకెళ్ళలేడు .అని ఆలోచించడం ఇక మదం ముదిరి వచ్చేది  .మాత్సర్యం దానివల్ల వచ్చే పనికిరాని ఆవేశంపు గర్జనలు   ఈ ఆరు కాని అందులో ఒకటి కానీ మనుషుల్లోని మానవత్త్వాన్ని మంటకలిపేస్తాయి అది అప్పుడు చెడు గా మారిపోతుంది .అప్పుడు కూడా అంతరాత్మ గా కొంచం కొంచం గా మనిషి ని హెచ్చరిస్తూనే ఉంటాడు .కొంతమంది దానిని సిక్స్త్ సెన్సు అంటూ వుంటార     .అయునా వినడు  .లోపల  దాగి వున్న భగవంతుడు అలా చూస్తూ మౌనముగా ఉండిపోతాడు     .అటూ ఇటూ చలించనివి   మంచిని  స్తిరముగా ,శా స్వితముగా  వుండే వి ,ప్రపంచం వున్ననాళ్ళు ఉండేవి    భగవంతుడు అవి నేనే   అని కొన్నిటిని ఎంచుకొని    భగవద్ఘీత లో  చెప్పటం లో రహస్యం అదే అనుకోవాలి    .అంతేకాదు ప్రతీ ఒక్క  జాతికి  ఓ  ముఖ్య మైన దానిని ఎంచుకొన్నాడు .అది అగ్రభాగములో వుండిమిగతా వాటికి బలాన్ని , ఆదర్శాన్ని మార్గదర్శ కత్త్వాన్నిఇవ్వటానికి అలా ఎంపిక చేసుకొని చెప్పి ఉంటాడు భగవానుడు.

      .కాని వాస్తవముగా   అన్ని ప్రాణుల్లోనూ ,అన్ని జీవులలోను భగవంతుడు వసించి వున్నాడు .అందుకే ,అందుకే శ్రీ వైష్ణవములో తిరుమంత్రార్ధం మూడు రకాలు వుంటుంది మొదటిగా ఓం నమో నారాయణాయ , తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ  తరువాత ఓం నమో విష్ణవే ఇది పూర్తి తిరు మంత్రం , ద్వయమంత్రం ..ఇంకా మనం ప్రతి రోజు ,ప్రతి పూజకు చదివే  కేశవ నామాలలో సంకర్షణ ,వాసుదేవ ,ప్రద్యుమ్న నామాలు చాలా చాలా విశిష్టమైనవి అని పెద్దలు చెబుతారు .ఎందుకంటే పర ,వ్యూహ   విభవ   అంతర్యామి  అర్చన అనే అయుదు పద్దతులలో భగవంతుడి ఆరాధన విధానం వుంది అని పైన చెప్పుకున్నాము .శ్రీ మన్నారాయణు ని వ్యుహములో వుండే వే ఆ సంకర్షణ , వాసుదేవ  ప్రద్యుమ్న  రూపాలు అందుకే వాటిని మన పెద్దలు అంత గొప్పవి గా చెప్పారు .  అంటే ఆరాధనలో మొదటగా కొలిచేది శేషశాయుఅంటే పవలించియున్న శ్రీ మన్నారాయణుడు రెండవ విధానములో భగవ౦ తుడి ఆరాధానములో ఈ వ్యూహ ము లో వచ్చేవి ఆ సంకర్షణ  వాసుదేవ  ప్రద్యుమ్న రూపాలు

      .ఇక ఆతరువాత ఆరాధన విధానాలు ఇంకా మూడు వున్నాయి .అవి ఇదివరలో పైన చెప్పుకున్నాము   జీవుడికి వారి వారి గతం జన్మలలో చేసుకున్న పాప పుణ్యాలను పట్టి శ రీరం,జన్మ ,జీవితం ఇస్తాడు.  తరువాత  జీవుడికి శ రీరం అనే బండి ఎలా నడుపుకోవాలో ,ఎలా ప్రయాణం చేయాలో ,ఇది మంచి   ఇది చెడు   అనే జ్ఞానం ,విజ్ఞానం నేర్పిస్తాడు .అందుకే నా ఉద్దేశ్యములో భగవంతుడి దయ తో నే మనకు మంచి గురువు లభిస్తాడని ,అలా అటువంటి గురువే మనకు దైవాన్ని ,ఆ మోక్ష మార్గాన్ని చూపిస్తాడు అని , అందుకే  గురువు కంటే దైవమే గొప్ప అని నా ఉద్దేశ్యం .రాక్షస గురువు శుక్రాచార్యుడు ఎన్ని మార్గాలు కనిపెట్టినా వాటి అన్నిటినీ వమ్ము చేసేవాడు .గురువుని బట్టి మార్గం దానిని బట్టి భగవంతుడు లభిస్తారు కదా .కాబట్టి అంతిమం గా భగవంతుడి దయ వుండాలి .సరే ఇక అలా   పండితులు గురువులతో  జ్ఞానం   చెప్పిస్తాడు  , ఒక్కొక్క సారి ఆయనే దత్తాత్రేయుడిగా  మరియు   గీతాచార్ర్యుడు గా వచ్చి దర్మం ఉపదేశించి    అవసరాన్ని బట్టి స్తాపించి    వెళుతుంటాడు,.కొన్ని కొన్ని స్వయం అనుభవాలతో స్వయంగా మనకే నేర్పిస్తాడు   అన్ని రకాలుగా తర్ఫ్ఫీదు ఇచ్చి .అప్పడు నీ బండి లో అంటే నీ శ రీరములో కూర్చో బెట్టి నీ వు ఏమి తెల్సుకున్నావో ,తెల్సింది ఎలా ఆచరిస్తూన్నావో  ,,తెల్సి కూడా ఎలా నటిస్తున్నావో  , అంతా గమనించి మార్కులు వేస్తాడు .దానినిబట్టి మళ్ళీజన్మలా ,లేక మోక్షమా అనేది నీ కు వచ్చిన మార్కులు బట్టి వుంటుంది .

       ఇంత చెప్పినా మనిషి మారడు అతని స్వభావము మారదు   ,మార్చుకోవాలనే  ప్రయత్నం కూడా చేయడు  . కాబట్టి నీవు జన్మ ఎత్తినతరువాత ,నియమాలు నిభందనలు తెలుసుకొని రహదారిపై నీ జీవన శ రీర సెకటాన్ని జాగ్రత్తగా నడుపుకోవాలి . ధర్మముగా  నీకు లభించే దానితో నీవు సంతృప్తి పడుతూ జీవితాన్ని నడుపుకోవాలి ,ఒకర్ని చూసి ఈర్ష్య పడాల్సిన పని లేదు ,కోటీశ్వరులు కావాలని ఏదో ఏదో అడ్డదారులు తొక్కడం ,మనశ్శా౦ తి లేకుండా ,మనవాళ్ళకు ప్రశాంతమైన నిద్ర లేకుండా .సాగించే జీవితం ఎవరికీ లాభం .ప్రక్కవాడిది లాగేసుకొని తినేయటం ,వాడి డబ్బు కొట్టెయ్యడం, అడ్డం వస్ద్తే  వాడిని చంపేయటం  ఎవరికోసం పోనీ వాడిని చంపి వీడు ఏమైనా వంద సంవత్సరాలు బ్రతుకుతాడ ని గ్యారంటీ ఏమైనా వుందా ? 

       ఇక ,తరువాతి తరాలకు కూడా మనమే సంపాదించి పెట్టాలనుకోవటం .ఇదంతా అతిగా ఆశపడటం అవుతుంది మనం సంపాదించి ఇవ్వడం వచ్చిన వాడు విలాసాలు గడిపి వాడికి బద్ధకం పెరిగి అంతా త్రాగి వ్యసనాలతో ఆ డబ్బు అంతా తగలేయడం , కాబట్టి ఇది మంచిది కాదు    .మనం బ్రతకాలి ,పదిమందిని బ్రతక నివ్వాలి ఎక్కడైనా ఎప్పుడైనా మన ..కర్మ మన విధి జాగ్రత్తగా    ఆచరించాలి దాని ఫలితం ఆయన  కు వదిలేయాలి ,ఆయన  చూసుకొంటాడు.  గీత లో భగవంతుడు చెప్పినది  కూడా ఇదే .కోట్లకు పడగలు ఎత్తే మనిషి గా తయారవచ్చు కాని భగవంతుడు మెచ్చే మనస్సు ని మాత్రం అంత తేలికగా తయారు చేయలేవు  మానవుని జన్మఎత్తినందుకు  ఇహ లోకములో కోరికలు తీర్చుకోవటం లో  ఆశ పడాలి తప్పదు.కాని అతి ఆశ మాత్రం ఎప్పటికీ మంచిదికాదు అని తెలుసుకోవాలి .ధర్మ మార్గం లో తీర్చుకోవాలి ,అది భగవానుడు మెచ్చి  ఇచ్చే కర్మ మంచి ఫలితం .
 
 
 

some important uses of cow ghee


ఈ రోజుల్లో అందరు నెయ్యి, నూనె అంటేనే చాలా భయ పడుతున్నారు.  అందరికి కొలెస్ట్రాల్ భయం, అధిక బరువు భయం తో ఇటువంటి పదార్ధాలను తినటం తగ్గించివేస్తున్నారు.  కానీ ఈ పదార్ధాల వలన కలిగే లాభాలను మనం మరిచిపోతున్నాం.  ఉదాహరణకు నెయ్యి నే తీసుకోండి.  ఇదివరకు మనం భోజనం లో నెయ్యి విధిగా వాడే వాళ్ళం.  ఇంకా రకరకాల పిండివంటలు ఇతర పదార్ధాలు చేసుకునేవాళ్లం.  ఇంకా కొన్ని రకాల చిట్కా వైద్యాలకు కూడా వాడేవాళ్ళం.  కానీ ఇప్పుడు మనలో ఎంత మంది అది వాడుతున్నాం ?  మళ్ళీ మన పెద్దలు పాటించిన కొన్ని చిట్కాలను ఇక్కడ చెప్తున్నాను.  మనం నెయ్యి వాడటం ఎంత మంచిదో, అందునా ఆవునెయ్యి వాడటం వలన ఉపయోగాలను తెలుసుకుందాం .  

   ఆవునెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మెదడు బాగా పని చేస్తుంది . మతిభ్రమణం తగ్గుతుంది
 ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే ఎలర్జీ తగ్గుతుంది .
 ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే పక్షవాతం తగ్గుతుంది
 సెరిబ్రల్ పాలసీ లలో ఎంతో లాభం కనిపిస్తుంది
 ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మంచి నిద్ర పడుతుంది,  మైగ్రేన్ తల నొప్పి మాయమవుతుంది, కోమా నుండి బయట పడవచ్చు, మెదడు శక్తివంతం గా పనిచేస్తుండి , జుట్టు ఊడడం తగ్గి కొత్త జుట్టు వస్తుంది
 ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది .
 20 – 25 గ్రాముల ఆవు నెయ్యితో కొంచెం పాత బెల్లం కలిపి తినిపిస్తే భంగు , గంజాయి , మత్తు పదార్ధాల మత్తు వదులుతుంది
 అరచేతులు , అరికాళ్ళు మంటలకు ఆవునేయ్యితో ఆ భాగాలను మాలిష్ చేస్తే మంటలు తగ్గుతాయి
. ఎక్కిళ్ళు తగ్గాలంటే అరచెంచా నెయ్యి తినండి
 ప్రతిరోజూ నెయ్యి తినేవారికి ఎసిడిటీ , మల బద్ధకం రావు . ఉంటె పోతాయి
 ఆవు నెయ్యి బల వర్ధకము , వీర్య వర్ధకము . మానసిక బలాన్ని పెంచుతుంది
 పిల్లలలో కఫం , శ్లేష్మం ఎక్కువగా ఉంటె ఆవునెయ్యి పాతది ఛాతీకి వీపుకీ మాలిష్ చెయ్యండి .
 మీరు బలహీనంగా , సన్నగా ఉంటె ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచా ఆవునెయ్యి , పటిక బెల్లం పొడి ఒక చెంచా వేసుకుని రోజూ తాగండి . బలం వస్తుంది . బరువు పెరుగుతారు
 ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చెయ్యడమే కాదు , వచ్చిన వారికి వ్యాప్తి చెందకుండా చూస్తుంది
 హృద్రోగులకు ఆవునెయ్యి వరం .
 ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చేస్తుంది . బ్రెస్ట్ కేన్సర్ , పేగుల కేన్సర్ లను ఇది నిరోధిస్తుంది
 రాత్రి పడుకునే ముందు గ్లాసుడు పాలలో చెంచాడు నెయ్యి వేసుకుని తాగితే అలసట పోయి బలం గా ఉంటారు
ఆవు నెయ్యి వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది . బరువు తక్కువగా ఉన్నవారి బరువు పెరుగుతుంది . బరువు ఎక్కువగా ఉన్నవారి బరువు తగ్గుతుంది . ఆవు నెయ్యి సంతుల స్థితిని తెస్తుంది .
ఆవు పాలు గ్లాసుడు తీసుకుని అందులో పంచదార పొడి ( దీనిని బూరా అంటారు ) మిరియాల పొడి వేసుకుని తాగితే మీ కంటి సమస్యలు తగ్గుతాయి .
ఎన్నో లాభాలను ఇస్తున్న గోవులను రక్షించుకుని వాటి పాలూ , పెరుగూ , నెయ్యి , మూత్రం, పేడ ల ద్వారా లాభాలను పొందుదాము









 



 

 

some useful techniques to reduce n manage stress

*ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు*

👉1. ఒక రోజు సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో !
👉2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !
👉3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను తగ్గించ గలదని గుర్తించుకో !
👉 4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో ! మాంసాహారం -విషాహారం అని తెలుసుకో !
👉 5. కక్ష కన్నా క్షమ గొప్పది
 క్షమ కన్నా *జీవుల పట్ల కరుణ* గొప్పదని  అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !
👉 6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !
👉 7. నవ్వును , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!
👉 8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి.  రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కోట్టడం నేర్చుకో  !
👉9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో !
👉 10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో  !
👉11. *మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో*  *శాకాహారిగా* ఉండడం *ధ్యానం* చేయడం నేర్చుకో!
👉12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో!
13. నాకు ఒద్దు , నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో !
👉 14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం  సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో !
👉 15.*టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో
    16. *పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో* !
👉17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాట్లాడు నేర్చుకో !
👉18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో  !
👉 19. వారానికి ఒక్కసారి ఉపవాసం ; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం  చూడడం నేర్చుకో  !
👉 20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !
21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!
👉22. నీ ఆందోళన వలన సమస్యలు త్వందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు .అని గుర్తించుకో !
👉23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !
👉24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని. నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !
👉25. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి. 

 
ఈ పనులలోఏవైనా కొన్ని మనం చేసినా కూడా ఒత్తిడి ని అధిగమించ వచ్చు.


👉 ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు .

 నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు .

*ఇవి మానవ జీవితానికి కంప్లీట్ ఎగ్జామ్ పేపర్....

Punarnava (Boohervia diffusa) properties n uses particularly for kidneys

ఈ ఒక్క ఆకు రసం వాడితే చాలు కిడ్నీ సమస్యలన్నీ దెబ్బకు పోతాయి.... డయాలసిస్ పేషంట్లు కూడా బతుకుతారు!!

మన ఆహార పదార్థాలు, పరిసరాల్లోని మొక్కల్లో ఎంతో అమూల్యమైన ఔషద గుణాలు దాగి ఉన్నాయి. వేలు, లక్షల రూపాయలు ఖర్చుచేసినా నయంకాని వ్యాధులను ఇట్టే పారదోలే అద్భుత లక్షణాలెన్నో ఉన్నాయి. మన పూర్వీకులు పదిపైసలు ఖర్చు లేకుండా ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొంది పది కాలాలు పదిలంగా ఉండేవారు. దానికి కారణం పెరటి మొక్కల వైద్యమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అటువంటిదే ఈ అటిక మామిడి తీగ (పల్లెల్లో విరివిగా పెరుగుతుంది.. దీనిని అంటుడు కాయ మొక్క అని కూడా అంటుంటారు) కూడా.. కిడ్నీ సమస్యలన్నిటికీ ఇది చక్కటి పరిష్కారం. కిడ్నీలో రాళ్లు ఏర్పడినా, ఇతరత్రా వ్యాధులు వచ్చినా, వచ్చే అవకాశాలున్నా కింద చెప్పిన విధంగా వాడితే చాలు మీ కిడ్నీల సమస్యలన్నీ తొలగిపోతాయని మన సంప్రదాయక వైద్యమైన ఆయుర్వేదం చెబుతోంది. కిడ్నీలు ఫెయిల్ అయి ఆఖరు దశ అయిన డయాలసిస్ వరకు వచ్చిన వారి ప్రాణాలను సైతం అటిక మామిడి రసంతో రక్షించవచ్చని ఆయుర్వేద నిపుణులు ఢంకా బజాయించి చెబుతున్నారు. ఇంతకూ ఏం చేయాలంటే..

తయారీ విధానం:

 * అటిక మామిడి తీగను తెంచుకుని ఆకులు, పువ్వులు, రెమ్మలు, వేర్లతో సహా సన్నని ముక్కలుగా చేసుకోవాలి.
 * 200 మి.లీ. నీటిని ఓ గిన్నెలో తీసుకుని సన్నని సెగపై 5-10 నిమిషాలు మరిగించాలి.
 * మరిగే క్రమంలోనే అందులో ఆ ముక్కలను వేయలి.
 * తర్వాత ఆకుల్లోని సారం దిగి రసంగా మారిన తర్వాత వడకట్టి రసం వరకు ఓ గ్లాసులోకి తీసుకోవాలి.
 * రోజూ ఉదయం 50మి.లీ. నీటిని తాగితే సరిపోతుంది.


ఇదీ ప్రత్యేకత:

 * అటిక మామిడి తీగ ఊళ్లలో, చేలల్లో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.
 * దీనిని సంస్కృత గ్రంథాలు పునర్వవగా పేర్కొనగా వృక్షశాస్త్ర శాస్త్రీయ నామం బొహేవియా డిప్యూస
* కిడ్నీ వ్యాధులకు సంబంధించిన ఇంగ్లిష్ మందుల్లో దీనిని ఎక్కువగా వాడతారు.
 * కిడ్నీ సమస్యలపై ప్రత్యేకంగా పనిచేసే ఈ ఆకు రసం చేసుకుని తాగితే వ్యాధులు రావు, వచ్చినా పోతాయి.
 * దీనిని మిగిలిన ఆకు కూరల్లాగానే వండుకుని తింటే ఇంకా మంచిది.
 * కళ్ల నుంచి కాళ్ల వరకు, శిరస్సు నుంచి పాదాల వరకు అన్ని అవయవాలకు చక్కటి పోషకాలు ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
 * కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ చేయించుకునే వారు సైతం దీనిని వాడొచ్చు. అటిక మామిడి రసం తాగుతూ డయాలసిస్ చేసుకుంటూ ఉండొచ్చు.
 * ఇది తాగడం వల్ల వారానికి 3సార్లు చేసే డయాలసిస్ క్రమంగా ఒక్కసారికి వచ్చి తర్వాత అవసరమే ఉండదని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.
 * అన్ని కిడ్నీ సమస్యలకు ఇంగ్లిష్ మందులు వాడుతూ కూడా ఈ రసం తాగొచ్చు. కూర తినొచ్చు. అద్భుత ఫలితాలు ఉంటాయి.
 * ఈ గొప్ప విషయం పది మందికి తెలిసేలా షేర్ చేయండి.

Bypass the Bypass surgery using pomegranate

Dear friends,

The following story is a real life experience shared by one of my group members in whats up group.  Pls. read this n follow it with discretion. 

Bypass the Bypass surgery” By Dr Syed Zair Hussain Rizvi*

*EVERY SEED OF POMEGRANATE (DELUM) WHICH GOES IN YOUR STOMACH IS A SEED OF LIFE FOR YOUR HEART....*

Two things are full of benefits for the human being, Lukewarm Water & Pomegranate.
I prepared a decoction boiling a fistful of dried seeds of Pomegranate in half litre of water for 10 minutes, strained the decoction and advised those patients suffering from painful Angina to drink a glass of lukewarm decoction on empty stomach early mornings.

Amazing result was observed, _the decoction of dried pomegranate seeds worked like a magic, the feelings of tightness and heaviness of chest and the pain were relieved._

It encouraged me to try more experiments on various types of cardiac patients.  So I experimented on patients who were suffering from painful Angina, Coronary Arterial Blockage, Cardiac Ischemia (insufficient blood flow to the heart muscle) etc, who were waiting for  bypass surgery.

_Drinking lukewarm decoction on empty stomach in the morning provided quick relief in all symptoms including painful condition._


In another case of Coronary Arterial Blockage the patient was given half glass of fresh pomegranate juice everyday for one year, although all symptoms were completely relieved within a few weeks but they continued taking it for a whole year.
 
This  completely reversed the plaque build-up and unblocked arteries to normal, the angiography report confirmed the evidence.

Thus decoction of dried pomegranate seeds, fresh pomegranate juice or eating a whole pomegranate on empty stomach in the morning proved to be a miracle cure for cardiac patients. But _the lukewarm dried seeds decoction proved to be more effective_ compared to eating a whole pomegranate or fresh pomegranate juice.

_Consuming  pomegranate has demonstrated even more dramatic effects as blood thinner, pain killing properties for cardiac patients, lowers LDL (low density lipoprotein or bad cholesterol) and raises the HDL (high density lipoprotein or good cholesterol)._

There are more than 50 different types of heart diseases and the most common being Coronary Artery Disease (CAD), which is the number one killer of both women and men in many countries, and there has been no medicinal cure for this disease.

Many cardiac patients have reversed their heart diseases by drinking one glass of lukewarm decoction of pomegranate dried seeds, half glass of fresh pomegranate juice or eating a whole pomegranate on empty stomach in the morning.
It was the very first real breakthrough in the history of cardiology to successfully treat the cardiac diseases by a fruit..
It is regretted to say that treating the heart patients and bypass surgery has become far more profitable business around the world.

*A regular use of pomegranate in any way ensures a healthy cardiac life, thinning your blood, dissolving the blood clots and obstruction inside the coronary arteries, maintains an optimal blood flow, supports a healthy blood pressure, prevents and reverses atherosclerosis (Thickening of the internal lining of the blood vessels).*

From these experience and observations in last several years, I can say:
 _“A Pomegranate a day keeps the Cardiologist away”._


You can try and see the wonder work....
 From today let us try and see.

పేరొకటి - కధ మరొకటి!!!!! ఇది మరోరకం ఆవు వ్యాసం

 
ఈ వ్యాస రచయుత  ఆయన వ్రాసే ప్రతీ వ్యాసములో కూడా హిందూవులను .బ్రాహ్మణులను ,వైదికమతమును తూలనాడటం గా పని పెట్టుకున్నారు .ప్రతీ మతములోను ,ప్రతీ కులములోను మంచివాళ్ళు ,చెడ్డవాళ్ళు వున్నారు అది వారికి తెలియాలి ..వారు వ్రాసిన పది వ్యాసాలలో  తొమ్మిది  హిందువులను తూలనాడిన వ్యాసాలే .వాళ్ళు ఏమి చెప్పిన ,ఏమి వ్రాసినా ఆవు వ్యాసం లా అక్కడకే వస్తారు . ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే  ఆ వ్యాసం పై  ఏదైనా మనకు తోచిన నాలుగు విషయాలు లేక అభిప్రాయాలు వ్రాసి పంపిస్తే ఈ వార్తా పత్రికలు వాళ్ళు వేసుకోరు .ఏమిటి కారణం అడిగితే అబ్బో ఆ వ్యాస కర్త చాలా పెద్ద మనిషి వారి అబిప్రాయాలకు ఎదురు ఖండన వ్రాయటమా ? అంటూ మన వ్యాసం తీసి ప్రక్కన పారేస్తారు .అదే  ఈ వ్యాసం చాలా బాగుంది అంటూ హిందువులను ,బ్రాహ్మణులను ఇంకో రెండు తిట్టి   కనిపించని ,నేడు వినిపించని   బౌద్దాన్ని నాల్గు పొగిడి  వ్రాసి పంపిస్తే బ్రహ్మ్మాండముగా వేసుకుంటారు . ఇక వాళ్ళ జన్మ అంతా ఇలాతూలనాడటమే పనా ? మంచి విషయాలు కూడా కాస్త చెప్పండి   ఇక .కులం ,మతం ఒద్దు అంటారు .వీళ్ళే ముందు కులం ఎత్తి పట్టుకు వస్తారు .అదే పొరపాటున బ్రాహ్మడు లేక ఓ .సి  వాళ్ళు కులం మాట తెస్తే మీది మీది కి ఊరికి వస్తారు .  మూడ విశ్వాసాలు  ను ,సమాజానికి,నష్టం తెచ్చే ఆచారాలను ఏ మతం లో వున్నా ,ఏ కులంలో వున్నా ఖండించాల్సిందే .దానిని ఎవరూ కాదనరు .హిందూ మతం మీద ,బ్రాహ్మణుల పై వ్రాసినంత ఇతర కులాలు ,మతాలపై వ్రాయలేరు .అంత ఎందుకు పైన  మనం చూస్తున్న రచయుత గారివి ఎన్నో వ్యాసాలూ చూస్తూవుంటాం. కానీ వారివి ఒక్క వ్యాసం కూడా ఇతరులపై  నాకు ఎప్పుడూ కనిపించలేదు ..ఎప్పుడూ అరిగిపోయున రికార్డు లా గా అదేనా .  అన్నికులాల్లో ప్రతిభావంతులు వస్తున్నారు ,గొప్ప చదువులు చదువుకొంటున్నారు  కాని చాలామంది నిరుధ్యోగముతో బాధపడుతున్నారు .అటువంటి సమస్యలు పై వ్రాయవచ్చు.అధికధర లు ,దేశ సరిహద్దుల్లో సామాన్యప్రజలు పడుతున్న ఇబ్బందులు ,టెర్రరిజం ,నక్సలిజం  డ్రగ్స్ ,కల్తీలు ,రైతుల సమస్యలు ,అన్నిమతాల్లో కుటుంబ నియంత్రణసమస్యలు , పర్యావరణం ,పక్షులు ,లాంటివి ఎన్నో వున్నాయి .   అయునా ఒక నాటి చాంధస వాదుల్లోనుంచే చాలామంది సంఘ సంస్కర్తలు పుట్టుకొచ్చారు ,వాళ్ళ పేర్లు వ్రాస్తూ పొతే ఓ చాంతాడు  అంత లిస్టు వస్తుంది . స్వాతంత్రవుద్యములో ఒక్క మహాత్మాగాంధీ తప్ప మిగతా వారు అంతా బ్రాహ్మణులే ,దానిలో చాలామంది జమిందారులే వాళ్ళు అంతా దేశం కోసం ఆస్తులు ,కుటుంబం జీవితం అంతా ధారపోసిన వాళ్ళే ,ఈనాడు వాళ్ళ వారసులు ,కుటుంబాలు చదువులు వుండీ ఉద్యోగాలు లేక ,ఆస్తిపాస్తులు లేక రోడ్ల పై బడి బ్రతుకు ఈడుస్తున్నారు .అటువంటి వాళ్ళ సమస్యలపై వ్రాయవచ్చు .జమ్మూ కాశ్మీర్ లో వేల మంది బ్రాహ్మణులుపండితులు వాళ్ళ కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు బలవంతముగా లాక్కొని  వాళ్ళను వెళ్ళ  గోట్టేసారు ముస్లిమ్స్ .భయపడి లొంగిపోయి కొంతమంది ముస్లిమ్స్ గా మారిపోయారు .అటువంటి బాధితుల పై వ్రాయవచ్చు . ఎప్పుడూ కసి కసి గా హిందూవులను,వేదాలను బ్రాహ్మిన్స్ పై రాతలు వల్ల ఏమి ప్రయోజనం ?వేదాలులో అంతరిక్షo గురించి విజ్ఞానం వుంది అని తెలుసుకున్న అమెరికన్లు వాళ్ళ స్పేస్ సెంటర్ లో వేదిక్ రీసెర్చ్సెంటర్ ను ఎప్పుడో స్తాపించు కున్నారు .మనం మాత్రం మనవేదాలపై విషం కక్కుతూ ఉన్నాము .  వేదాలలో ఏముంది నాకు ఏమి కనపడలేదు అని ఆ మధ్య ఒకామె వ్రాసారు .అంతమాత్రం చేత వేదాలు చదివే వారందరూ దుకాణం మూసుకొని వెళ్ళలేదు సరికదా వేదాలు చదివి తెలుసుకుందామని చాలామందికి ఎంతో ఆసక్తి కలిగింది .బనారస్ విశ్వ విద్యాలయం ,తిరుపతి శ్రీ  వెంకటేశ్వరవిశ్వ విద్యాలయం అటువంటి చోటికి వెళ్లి పండితులను కలిసి ,అక్కడ గ్రంథాలయములో బుక్స్ రుబ్బితే విషయాలు బైటకు వస్తాయి .ఇంట్లో కూర్చుని ఎక్కాలపుస్తకం లా వ్రాసేది కాదు అంతదాకా ఎందుకు   పూర్వకాలములో త్రేతాయుగంలో రావణాసురుడు అంతటి రాక్షసుడు లెక్కలు అదే గణితం పై పెద్ద గ్రంథం వ్రాశాడు ,దానిలో గ్రహాలు ,గ్రహాల వ్యాసం ,కొలతలు ,వాటి ప్రభావం పై పెద్ద బుక్ వ్రాసాడు .అది చాలామందికి తెలీయదు. ఇక మన వ్యాసం లోకి వస్తే ,    రాష్ట్రపతి గా  బ్రా హ్మనుడిని చేస్తే ,  బ్రాహ్మణుడా అంటారు ?దళితుడిని చేస్తే దానిలో కూడా రంద్రాన్వేషణ చేస్తున్నారు .ఈ మద్య మీడియా కూడా బ్రాహ్మణుడే దైన గొప్ప స్తాయులో సంఘం లో వస్తే కులం పేరు వ్రాయకుండా దాటేసినసందర్భాలు చాలా వున్నాయి .కులం లేదు ,మతం లేదు ,ప్రాంతం లేదు వర్ణం లేదు అని రాజ్యాంగములో గొప్పగా వ్రాసుకున్నాము .కానీ oc లకు వేరే విద్యాసంస్థలు,bcలకు scలకు s T  లకు ఇతర మతాలకు  ఇంకా స్త్రీలకూ ఇవి కాక బ్రాహ్మణులకు వేరే కార్పొరేషన్లు,bc లకు వేరే కార్పొరేషన్లు ఇలా ఎంత కాలం . రాజ్యాంగము  మరి కుల ,మతాలు లను ఒప్పుకోలేదు , అని గొప్పఅంటూ వ్రాతలుఎందుకు ?
బౌద్ధమతము అంటే చాలా మంది  అది ఒక వేరే మతము గా చెబుతూవుంటారు .అది వేరే మతం ఎలా అవుతుంది అని  నా భావన  . మీరు కూడా ఆలోచించిచూడండి .బౌద్ధం  స్థాపకుడు గౌతమబుద్దుడు .ఆయన కులం క్షత్రియ ,శ్యాఖ్యవంశపు రాజు తల్లి తండ్రులు ఇద్దరు హిందువులే వాళ్లకు పుట్టిన సంతానం ఏమవుతుంది?హిందూవులే కదా పైగా కాషాయము ధరించి ,గుండు కొట్టించుకొని సన్యాసం తీసుకోవటం , యోగ ముద్ర ఇది అంతా హిందూ మతమే కదా ,అంటే ఇది కూడా హిందూ మతములో ముక్క ,జైనమతం  కూడా అంతే  కాకపొతే సామాజిక స్పృహ కొత్తగా తీసుకువచ్చారు అని చెబుతున్నారు . శ్రీరాముడి కాలములోను సామాజిక సంఘటనలు చాలా జరిగాయి ,గుహుడు,శ బరి,కొద్దిగా జంతు లక్షణాలు కలిగిన మానవ వానరులను సైతం క్రమశిక్షణలో పెట్టాడు .దుష్టులు రాక్షసులను అందరిని మట్టుపెట్టాడు ,క్రింది కులాల ను ప్రేమతో అక్కున చేర్చుకోవడం ఆయన దగ్గర్నుంచే ప్రారంభం అయుంది . అలానే క్రీస్తు పూర్వములోనే వేదకాలములో ఉపనిషత్తులు ,అరణ్యకాలు ఉద్భవించాయి. అరణ్యకాలు ,ఉపనిషత్తులు ఇవి జ్ఞానముకు సంబంధించినవి ,కొంతమంది బ్రాహ్మణులు ఆడంబరమైన పూజలు కు వ్యతిరేకముగా అడవుల్లోకి వెళ్ళిపోయారు .వాళ్ళ అక్కడే వుండితయారుచేసినవి అవి .కాబట్టి సామాజికస్పృహ  అప్పటినుంచే  ప్రారంభం .
ఇక తరువాత విషయం  మరచిపోని చరిత్ర బౌద్ధం అన్నారు .అంత వుంటే భారతీయులలో మరి మాంసం ,మద్యం ఎందుకు విపరీతమైన వాడకం పెరిగింది ? ఆ రోజుల్లో హిందూసమాజం వివక్ష చూపారు అని , క్రింది కులాల వారు  బౌద్ధం లోకి మతం మర్చేసుకున్నారని కొంతమంది మహనీయులు వ్రాసేశారు   .నిజముగా అలా జరిగి వుంటే చాలా మంది క్రింది కులాలవారు మాంసం ,మధ్యం ముట్టకుండా వున్న వాళ్ళు చాలా మంది వుండాలి కదా ,   పైన చెప్పిన ఆ మాంసం ,మద్యం లాగేస్తున్నారు , బుద్దుడిబోధనలు ఏమి అయి పోయాయి ? నాగపూర్ లో సభ లో ఆనాటి రోజుల్లో పాల్గున్నబౌద్దుల ,మారిన మతస్తులు అంతా ఎటు పోయారు ?  బుద్దుడు ,అంబేత్కర్ మంచిని ఆచరించమని చెప్పారే కాని ఇలా తాగి,తినీ రోడ్ల పై తందనాలు ఆడమని చెప్పలేదే .
బౌద్దానికి ,ఛాందసవాదం కు మధ్యపోరాటం అని వ్రాసారు .అందులో ఒక విషయం వుంది .క్రీస్తు పూర్వం ఎన్నో మతాలూ పుట్టాయి .ఎవరి ఇష్టం వచ్చినట్లు  వాళ్ళు మతం అవలంబిస్తూ మూడనమ్మకాలు నమ్మసాగారు . ఆ తరువాత కొంత కాలానికి శంకరాచార్యులు వారు వచ్చి    వారి మతాలలోని   విషయాలను ప్రస్తావిస్తూ  కొన్ని ప్రశ్నలు
అడిగారు ,దానికి సమాధానాలు చెప్పలేకపోయారు.           
==================================================================
అదీ కూడా ఏదో అలాటప్పా గా ,మామూలుగా అడగటం కాదు .ఆయన ప్రస్తానత్రయం  అనే ఒక సూచీ పెట్టాడు .అనగా మూడు పుస్తకాలు . అవి వేదం – ఉపనిషత్తులు –భగవద్గీత . వారు చెప్పే మతం విషయాలు ఈ మూడింటిలోనూ చూపించాలి ,ఉదాహరణకు గాణాపత్యం ,అంటే గణపతి ని ఆరాధించేవారు గణపతి కి సంభదించిన విషయాలు  పై న చెప్పిన మూడు పుస్తకాలలో చూపించాలి . ఏ ఒక్కదానిలో లేకపోయనా ఆ మతం వైదిక మతం కాదు . అంటే శాస్త్రీయం కాదు .దానిని ప్రజలు నమ్మకూడదు .అనుసరించ కూడదు .వదిలిపెట్టేయాలి .అలా 75మతాల వారు ఆయనతో వాదులాట లు పెట్టుకొనగా అందరు ఓడిపోయి కేవలం 5 మతాలూ వారు మాత్రమే మిగిలారు . వారు ఆదిత్యం(సూర్యారాధన) ,అంబికాం (దుర్గ) ,గణనాధం  విష్ణుం   మహేశ్వరం .ఇలా .ఇక ఆ తరువాత ఈ అయుదు గురు మళ్ళి వాళ్ళలో వాళ్ళు మేము గొప్ప కాదు మేము గొప్ప అని కొట్టుకోసాగారు .అప్పుడు శంకరాచార్యులువారు ఒక సలహా ఇచ్చారు ,ఈ అయుదుగురు  పూజలో గుండ్రముగా   మీ విగ్రహాలన్నీ పెట్టుకోండి  . ఎవరి మతం వారికి ఏది ఎక్కువ అనిపిస్తే దానిని మధ్యలో పెట్టుకోండి . అలా ఒక విషయం కొత్తగా చెప్పి ,పైన 5 + 1 ఆరు మతాలు స్తాపించారు కాబట్టి షన మత స్తాపనాఆచార్య  అని శంకరాచార్యులు వారికి పేరు వచ్చింది .అలా మధ్వాచార్యులు ,ఆ తరువాత రామానుజాచార్యులు అలా మిగతా గురువులు అందరు వచ్చారు .వారి వారి జీవిత గమనములో మళ్ళీ మళ్ళీ పుట్టుకు వస్తూవున్నమూఢనమ్మకాలు ను అణిచివేస్తూ    జ్ఞానంతో కూడిన   భక్తిని  ప్రతిపాదించారు .అలా కొట్టుకొని పోయి కనుమరుగు అయున చాలా మతాలలో బౌద్ధము ఒకటి .త్రి మతాచార్యులు ఎవరూ వ్యక్తి పూజలు ఒప్పుకోలేదు .అంటే వాళ్ళ బొమ్మలు పెట్టి చేసే పూజలు వుండవు . బౌద్ధములో బుద్దుడు చెప్పింది ఆచరించ కుండా ఆయన బొమ్మలు పెట్టి వ్యక్తిపూజ చేయటం వల్ల కొంతకాలానికి  ఆ  మతం  అంతరించి పో యినది .
పూర్వకాలములో యజ్ఞాలలో ఎక్కువ శాతం మేకలను బలి ఇచ్చేవారు .అలానే ఆవులను ,గేదెలను గుర్రాలను కొంచం తక్కువగా బలి ఇచ్చేవారు .అది కూడా శాస్త్రం ప్రకారం
 శ రీ రములో వున్న చిన్న భాగం వోప అనే దానిని తీసి యజ్ఞ పాత్రలో వేయాలి .కాని రాను రాను అది ముదిరి టన్నుటన్నుల మాంసం లాగేయటం మొదలు పెట్టారు .అదిగో అక్కడే ఆడంబ ర మైన ఈ పూజల వల్ల  విసిగిపోయినకొంతమంది ఋషులు అడవుల్లోకి వెళ్ళిపో యి వ్యతిరేకించారు  బుద్దుడు ,శంకరాచార్యులు  లాంటి వారు ఆ మూఢనమ్మకాలు కు వ్యతిరేకముగా పోరాటంచేశారు .ఇక్కడే మనం ఆలోచించాలి ,బుద్ధుడు కి మిగతా త్రి మతా ఆచార్యులు కి తేడా ,  ఏమిటి  అంటే బుద్దుడు  ప్రజలకు జ్ఞానం  బోధించాడు ,ఆచరించమని చెప్పాడు ,కాని వాళ్ళు చెప్పిన జ్ఞానం ఆచరించడం మానేసి ,ఆయన బొమ్మలు పెట్టి పూజించటం మొదలు పెట్టారు .కాని త్రి మతాచార్యులు చెప్పిన జ్ఞానం ఇక్కడ ప్రజలు ఆచరించారు ,ఆదరించారు .అందుకే వాళ్ళ బొమ్మలు పెద్దగ ఎక్కడ కనిపించవు .మెల్ల మెల్లగా మధు మాంసాలు ను వైదిక పూజల్లో మానివేశారు .ధృఢమైన సంకల్పం తో మాంసం .సోమరసం అనే మధువు మానివేశారు ,అలా  అలా పురోహితులు ,ఆ వర్గం వారు సంపూర్ణ శాఖాహారులు అయ్యారు .మరి ఇప్పుడు తినే వారంతా ఎవరు ? ఇప్పుడు అహింసావాదం ఎక్కడికి పోయింది ? పైన వున్న వ్యాసం రచయుత లెక్క ప్రకారం ,ఆ రోజుల్లో అందరు బౌద్ధం లోకి వెళ్ళిపో యి వుంటే  ,లారీ లారీలు మాంసం లాగించే వారు అంతా ఎవరు ? యజ్ఞం లో ఓ జంతువుని ముక్కు మూసి మంత్రాలు చదువుతూ బలికోసం చంపారు  అంటేనే  అది ఒక పెద్ద హింస గా భావించే వాళ్ళు , మరి ఈనాడు చేతులతో కొస్తే ఆలస్యం అవుతుంది అని  మూడు రోజులు తిండి పెట్టకుండా నీళ్ళు ఇవ్వకుండా వాటిని మాడ్చి ఆ పై  పశువులను  , యంత్రాలలో పెట్టి పరమ కిరాతకముగా ప్రాణం పోకుండానే చర్మం పై వేడి వేడి నీరు పోసి    వూ డపీకి ,కనుగ్రుడ్డ్లు పెకిలించి ,ఎముకలు విరిచి రక్తం ఏరుల్ల్లాప్రవహింప చేసి  పైసాచికముగాతినేది ఎవరు ?
ఈ హింస మీ కళ్ళకు కనపడటం లేదా ? బీఫ్ పెస్టివల్ ను ఎందుకు సమర్ధిస్తున్నారు ?అప్పుడు బుద్దుడు , జైనుడు ఒంటెలు మాత్రమె నిషేధించారు .గే దెలు కూడా నిషేధించటం ఆనందకరమైన అంశం .ఎందుకంటే ఆవులు తెల్లగా ఉంటాయి ,గేదెలు నల్లగా ఉంటాయి కాబ ట్టి బ్రాహ్మణులు కుట్ర తో గేదె లు దేవతలు కాదు అనే వాదం తెచ్చారు  ఇతర రాష్ట్రాలలో ఆవులను చంపకుండా ఎక్కువ గేదెలను చంపి తినేస్తున్నారు  అంటూ చాలా సభల్లో కంచే ఐలయ్య్ చెప్పారు .అది ఉపయోగములో మాత్రమె నేను చెబుతున్నాను ,ఆవుల పాల కంటే ఎక్కువ గేదె ల పాలనే నేడు మనం ఎక్కువగా త్రాగుతున్నాము .కన్నతల్లి మనకు చిన్నప్పుడు   5 సంవత్సారాలు వరకే పాలు ఇచ్చి పెంచు తుంది .కానీ పశువులు మనషి జీవితాంతం పాలు  పెరుగు  నెయ్యి  ఇచ్చి చచ్చిన తరువాత కూడా ఎముకలు ఎరువుల కర్మాగారానికి ,చర్మం చెప్పుల కు ఇచ్చేసి  వెళుతుంది ,ఇంకా ఆవు అయుతే ఆక్సిజెన్ పీలుచుకొని ఆక్సిజెన్ నే వదిలిపెట్టి పర్యావరణం మేలు కు ఎంతో ఉపయోగపడుతుంది . పూర్వకాలములో  రైతులు      పశువులను స్వంత బిడ్డలు గా చూసుకోనేవాళ్ళు .ముసలి వాటికి విశ్రాంతిని ఇస్తూ వాటికి సేవ చేసేవాళ్ళు .అలానే  రాత్రివేళలలో పశువులు ఏవి అయి నా దారి తప్పి ఆకలితో బాధ పడతాయి అని ,ఆలోచించి ఇంటి ముందు అరుగుల పై కాస్తంత గడ్డి ,వేసి ఉంచే వారు .మరి ఇప్పుడు కాలం మారిపోయింది .తల్లి తండ్రులు ,ఆవులు గేదెలు అంతా వ్యాపారమే ,పనికిరాని పశువు ఇంటి ముందు ఎందుకు దండగ కబేలం కు అమ్మితే రెండు రూపాయలు వస్తాయి గా  అనుకొనే రోజులు ఇవి .  అదీగాక పోషించలేక పోవడం ,సకాలములో వర్షాలు లేక పంటలు లేక పశువులకు మేత లేకపోవటం కూడా ఒక ప్రధాన కారణం .

కాబట్టి గేదెలు ,ఆవులు అనే కాదు పక్షులు ,పిట్టలు, పిల్లులు, ప్రకృతి  ,చెట్లు అస్సలు దేనినీ మానవులు బ్రతకనీయుత్లేదు .ఇటువంటి పరిస్తితుల్లో ఆనాడు మతం పుచ్చుకున్న ఎంతోమందిబౌద్ధులు ఎక్కడ కి పోయారు .బుద్దుడు రాకముందు జరిగిన  హింస కంటే వంద రెట్లు ఇప్పుడు ఎక్కువ జరుగుతుందే ,మరి ఆనాడు యజ్ఞాలు లో జంతు హింస వద్దు అని బుద్దుడు, శంకరాచార్యులు చెబితే బ్రాహ్మణులు అంతా విన్నారు .మరి వేల మంది బొద్ద మతం తీసుకొన్న వారు ఎటుపోయారు ,ఏమి చేస్తున్నారు .వారు అంతా సామాజిక స్పృహ వున్నవారు ,బ్రాహ్మణుల కంటే నీతిమంతులు  కదా ,పైగా కొంతమంది మేధావులు ఏమి వ్రాశారు అంటే బౌద్ధం తీసుకున్నవారిని ఆ రోజులలో వెలి వేసారు ,వాళ్ళే అంటరానివారు గా పరిగణించారు  అన్నారు .ఇప్పుడున్న సమాజములో వారే ఎక్కువ నిష్పత్తి లో వున్నారు కదా .హింస చాలా తక్కువ గా వుండితీరాలి ,తక్కువ మాంసం వినియోగం లో వుండాలి కదా ,మరి అలా జరగటం లేదే ,అదికాదు వేరే మతస్తులు ఎక్కువ తింటున్నారు అని చెబుతారు అనుకునదాము .మరి వేరే మతం అంటే వారు ఎవరో కాదు కదా ,వారు కులవివక్ష భరించ లేనివారే అన్య మతాలలోకి వెళ్ళారు కదా ?ఇప్పుడు ఈ విషయములో పైన వ్రాసిన  రచయుతకు   ఒకటి అర్థం కావాలి  హింస ,మాంసం ఇవి అన్నీ కూడా హిందూ మతములోని చాందస్సులకు ,బ్రాహ్మణులకు ఇప్పుడు ఏ సంభంధం లేదు పదే పదే B.C 25౦౦ -౩౦౦౦ కి వెళ్లి బౌద్ధం విషయం తీసుకురావటం వల్ల ఉపయోగం లేదు .ఇప్పుడు సమాజం లో చాలా మార్పులు జరిగిపో యునాయి..మీ పాత బూజుపట్టిన వాదాలను ఇక ఆపే యండి .
ఇక చిలకలూరి పేట బస్సు దహనంకేసు. ఈ కేసు లో కల్లా కపటం తెలీయని 27మంది ప్రయాణీకులు బస్సు లో కాలి బొగ్గులు గా మారిపోయారు .బస్సు లోకి ఎక్కిన  ,ఇద్దరు ,ముగ్గురు ,బస్సు కొంత  దూరం ప్రయాణం చేసిన తరువాత డబ్బులు ,నగలు కోసం   పెట్రోల్   బస్సు అంతా జల్లి అగ్గి పుల్ల గీసి బెదిరిస్తున్నారు .ఈ లోపు నిజముగానే నిప్పురవ్వ జారి బస్సు బగ్గు మంది  మంటలు అంటుకున్నాయు.    నేరస్తులు తప్పించుకున్నారు .కాని ప్రయాణికులు మాత్రం ఒక్కళ్ళు కూడా మిగలలేదు .ఇళ్ళ దగ్గర తల్లితండ్రులు ,పిల్లలు ,కుటుంబ సభ్యులు అంతా ఎదురుచూస్తూ వున్నారు .కానీ వాళ్ళ కు మాడిన బొగ్గులు దొరికినాయు .కనీసం మనుషుల ఆనవాళ్ళు ఎక్కడా  ఆ బొగ్గుల్లో లేదు  .అది  అప్పుడు కులాల కార్డ్ బైటకు తీసి అప్పటి రాష్ట్రపతి నారాయణన్ ని కల్సి ఉరిశిక్ష రద్దు చేయుం చారు .పూర్వ కాలములో ని ధర్మ శాస్త్రములను విమర్శించే వారు. బ్రాహ్మణ కులానికి ఒక న్యాయము ,ఇతర కులాలకు ఒక న్యాయమా అని అడిగే వీరు చేసినది ఏమిటి ?
అదే సమయములో బెంగాల్ లో ఓ అగ్ర కులస్తుడు వాచ్ మెన్  గా వున్నాడు . అతగాడు చిన్న పిల్లను మానభంగం చేసి చంపేసి ఎక్కడో దాచేసాడు   తరువాత  .అతగాడి ని జైలు లో వే శారు . అతగాడు ఓ! 12 సంవత్సరాలు శిక్ష పూర్తి అయుపోయింది .ఈ లోపు విచారణ జరిపి ఉరిశిక్ష అమలు చేసి చంపారు .కొంతకాలం శిక్ష అను భవించాడు కదా .అతనికి క్షమాభిక్ష కోసం ఎవరూ ప్రయత్నించలేదు .ఎందుకంటే అతను క్రిందికులం వాళ్ళు కాదు .ఒక్కరిని చంపినందుకు వురి వేస్తె మరి 27 మందిని చంపేసిన వారి పరిస్తితి ఏమిటి ? మరి  అతగాడి శిక్ష ను జీవిత ఖైదు గా మార్చి వుండాల్సింది ,ఎందుకంటే ఆ నేరస్థుడు 11 ఏళ్ళు శిక్ష అనుభవించాడు కదా ,ఇక్కడ శిక్షలు ,ఉరిశిక్ష లు నిషేధం వాటి గురించి కాదు నేను మాటలాడేది   ,ప్రతీ విషయములో కుల ,మతాల కార్డు లు తీసుకురావడం . పైన పత్రికావ్యాస రచయుత గారు ఒక విషయం తెలుసుకోవాలి ఇది వరలో ఇలాంటి కేసుల్లో చాలామంది కి గతములో నేర చరిత్ర లేదు , వాళ్ళ అందరికి క్షమాభిక్ష పెట్టేశారా .? మీకు అబ్దుల్ కలాం ,ప్రణబ్ ముఖర్జీ  మీకు గుర్తుకు రాలేదా ? వాళ్ళు కులం మతం సంభందం లేకుండా , నేరం – శిక్ష  దృష్టిలో ఆలోచించి ఎవ్వరికి ఒక్కరికి కూడా క్షమా భిక్ష పెట్టల్లేదు .వాళ్ళ హయాం లో.  ఇక మూఢనమ్మకాలు హిందువులు ,బ్రాహ్మణులు ,భారతీయుల లోనే కాదు ప్రపంచం లో అన్ని దేశాలలో మనకంటే ఘోరముగా వున్నాయి . ఎవ్వరైనా ,ఎక్కడైనా ఏ దేశములో అయునా మూఢనమ్మకాలు వుంటే ఖండిచాల్సిందే దానిని ఎవరూ కాదనరు ,ప్రతీ దానికి భారతీయ హిందూ సమాజాన్ని మాత్రం నింది౦చటం  మానుకోవాలి .

గ్రహణం - దాన ధర్మాలు

మనం గ్రహణ సమయం లో దాన ధర్మాలు చెయ్యటం ఎంతో మంచిది అనీ , ఈ సమయం లో చేసే దానాలకు ఫలితం కోటి రెట్లు ఎక్కువ గా లభిస్తుంది అని పెద్దలు చెప్తారు .  కానీ ఈ గ్రహణం అర్ధరాత్రి కాబట్టి మనం ఆ సమయం లో ఏమి ఇటువంటి పుణ్య కార్యాలు చేయలేము .  కనుక ఆ సమయం లో మనకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోవడం ఎంతో మంచిది .


ఇంకా ఈ దాన ధర్మాల విషయానికి వస్తే అవి రేపు ఉదయం స్నానం చేసి కూడా చెయ్యచ్చు .  అప్పుడు కూడా అదే ఫలితం లభిస్తుంది.  ఇవి అన్నీ చేయలేనివారు తమకు చేతనైతే అరటిపండ్లు , తోటకూర వంటి పదార్ధాలు ఆవులకు తినిపిస్తే కూడా చాలా మంచిది.  

Raksha Bandhan - Some Mythological n Historical events reg. this

“రాఖీ పౌర్ణమి”

 'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః,
తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల'


అంటూ బలిచక్రవర్తి రక్షకోరిన సోదరిని రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురొడ్డి నిలిచినవాడు. అటువంటి మహావీరునితో తన అన్నని పోలుస్తూ తనకి రక్షణ నివ్వమని కోరుతుంది. ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ ఆశీర్వధిస్తాడు అన్న. రాఖీ పౌర్ణమి, శ్రావణ పున్నమిరోజును యిలా ఎన్నోరకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దేవతారాధనలు, ప్రకృతి దేవతారాధనలు, ఆత్మీయతానురాగబంధాలు... సకల పూజారాధనలు అందుకునే రోజు ఈ శ్రావణ పౌర్ణమి. రాకీలతోపాటు పూజాథాలీ( పూజ పళ్ళాలు) అలంకరణ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.

శ్రావణ పూర్ణిమకు భారతీయ సంప్రదాయంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు.

 ఈ పండుగ మూడు నాలుగు రకాలుగా ఉంది. రక్షాబంధనం (రాఖీ) పండుగ గానూ, హయగ్రీవ పూజ, వరుణ పూజల రూపంలో ఈ పూర్ణిమను ఉత్సవంగా అందరూ జరుపుకుంటుంటారు. భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది.

 ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా ఓ కథను కూడా ఆయన వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు ఘోర యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం.

 చరిత్రలో మొగలాయి చక్రవర్తుల పాలనలో ఈ రక్షాబంధనానికి నూతనమైన విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్ నవాబైన బహదూర్ షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు.

 మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ణీపూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారి కేళాలను (కొబ్బరి కాయలను) కొడతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నార్ల పూర్ణిమ) వ్యవహారంలోకి వచ్చింది. పాల్కురికి సోమనాధకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమ అని వర్ణించాడు. నూల్ అంటే యజ్ఞోపవీతం అని అర్థం.

 శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది. రక్షాబంధనానికి సంబంధించి ఇతర పురాణ కథలు కూడా ఉన్నాయి. పౌరాణిక గాథలు ఎలా ఉన్నప్పటికీ ఆధునిక కాలంలో రాఖీ పౌర్ణమి సోదర సోదరీమణుల మధ్య ఆప్యాయతకు, ప్రేమకు ప్రతీకగా మారింది. ఏడాదిలో అన్నిటి కన్నా సోదరసోదరీమణుల మధ్య ప్రేమకు ఈ పర్వదినమే ప్రతీకగా నిలుస్తుంది.
My heartiest greetings to all on this auspicious day.

the procedure of changing the yagnopaveetham on jandhyala pournami

నూతన యజ్ఞోపవీత ధారణ విధానము

జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) దరించవలెను.


ప్రార్థన:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||


గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః ||


అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా |
యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: ||

పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!

 (అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను)

ఆచమన విధానం:
ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,
1. ఓం కేశవాయ స్వాహా,
2. ఓం నారాయణాయ స్వాహా,
3. ఓం మాధవాయ స్వాహా,


అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.

4. ఓం గోవిందాయనమః,
5. ఓం విష్ణవే నమః,
6. ఓం మధుసూదనాయనమః,
7. ఓం త్రివిక్రమాయనమః,
8. ఓం వామనాయనమః,
9. ఓం శ్రీధరాయనమః,
10. ఓం హృషీకేశాయనమః,
11. ఓం పద్మనాభాయనమః,
12. ఓం దామోదరాయనమః,
13. ఓం సంకర్షణాయనమః,
14. ఓం వాసుదేవాయనమః,
15. ఓం ప్రద్యుమ్నాయనమః,
16. ఓం అనిరుద్ధాయనమః,
17. ఓం పురుషోత్తమాయనమః,
18. ఓం అధోక్షజాయనమః,
19. ఓం నారసింహాయనమః,
20. ఓం అత్యుతాయనమః,
21. ఓం జనార్దనాయనమః,
22. ఓం ఉపేంద్రాయనమః,
23. ఓం హరయేనమః,
24. ఓం శ్రీకృష్ణాయనమః.
అని నమస్కరించవలెను.


  అటు పిమ్మట:
భూతోచ్చాటన:
(చేతిలో ఉద్ధరిణి తో నీరు పోసుకుని యీ క్రింది మంత్రమును చదివిన పిమ్మట భూమిపై నీళ్ళు జల్లవలెను.)

ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః | దేవీ గాయత్రీచ్చందః ప్రాణాయామే వినియోగః

 ప్రాణాయామం :
(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)


గృహస్తులు ఐదు వ్రేళ్లతో నాసికాగ్రమును పట్టుకొని మంత్రము చెప్పవలెను.

బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక ఉంగరం వ్రేళ్లతో ఎడమ ముక్కును పట్టుకొని ఈ క్రింది మంత్రమును చెప్ప వలెను.

ఓం భూః, ఓం భువః, ఓగ్ మ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ | ఓం ఆపో జ్యోతి రసో2మృతం, బ్రహ్మ భూర్భువస్సువరోమ్||


తదుపరి సంకల్పం:

మమ ఉపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, సత్యయుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య వాయువ్య ప్రదేశే, గంగా కావేరీయోర్మధ్యే, స్వగృహే (లేదా శోభన గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ,

అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే

(బ్రహ్మచారులు “ధర్మపత్నీ సమేతస్య" అని చెప్పనక్కర లేదు)

యజ్ఞోపవీతములు ఐదింటిని ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలముల వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి, యజ్ఞోపవీత ధారణా మంత్రము స్మరించి ఈ క్రింది విధముగా ధరించవలెను.


ప్రథమోపవీత ధారణం:

యజ్ఞోప వీతే త్తస్య మంత్రస్య
పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా,
దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః ||
"ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్
ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః "


అని చెప్పి అని ధరించవలెను.


(మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.)


ద్వితీయోపవీత ధారణం:

తిరిగి ఆచమనం చేసి “మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి
పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.


తృతీయ యజ్ఞోపవీత ధారణం:

తిరిగి ఆచమనం చేసి “ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి
పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.


చతుర్ధ పంచమ యజ్నోపవీతములు ధరించుట:

తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ...

"ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను.
మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.



తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి,
“దశ గాయత్రి” (పదిమారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీటిని వదలవలెను.


(బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును)


గాయత్రీ మంత్రము:
“ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్"

తరువాత ఈ క్రింది విజర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.


జీర్ణోపవీత విసర్జనం:
తిరిగి ఆచమనం చేసి


 శ్లో: ఉపవీతం ఛిన్నతంతుం కశ్మల దూషితం
విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే ||
శ్లో: పవిత్రదంతా మతి జీర్ణవంతం
వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం
ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం
జీర్నోపవీతం విసృజంతు తేజః ||
శ్లో: ఏతా వద్దిన పర్యంతం
బ్రహ్మత్వం ధారితం మయా
జీర్ణత్వాత్తే పరిత్యాగో
గచ్ఛ సూత్ర యథా సుఖం ||



విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను.
తిరిగి ఆచమనం చేసి కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపింఛి యధాశక్తి
"గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీరు విడువ వలెను.
ఆ తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను.
తీసివేసిన పాత జందెమును ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను.

 
నూతన యజ్ఞోపవీత ధారణ సమయములు:
జాతాశౌచ శుద్ధి యందు, మృతాశౌచ శుద్ధియందు, గ్రహణానంతరము, ప్రతి నాలుగు మాసముల అనంతరము నూతన యజ్ఞోపవీతమును ధరించి, పూర్వ యజ్ఞోపవీతమును త్యజించవలెను.


Pls. consider this as a ritualistic procedure n follow this as per ur convenience. 

can we change the yagnopaveetham on this sravana pournami as it is lunar eclipse today?


యజ్ఞోపవీతాలు మార్చుకోవడం, రాఖీ కట్టించుకోవడం చేయవచ్చా:


శ్రావణ పౌర్ణమినాడు, గ్రహణం అయినప్పటికీ ఉదయం 12.30 లోపుగా యజ్ఞోపవీతాలు మార్చుకోవడం, రాఖీ కట్టించుకోవడం మరియు నిత్యకృత్యాలు చేసి తీరవల్సింde .


బార్హస్పత్య స్మృతి, శుక్ర స్మృతి ప్రకారంగ్రహణం రోజు యజ్ఞోపవీతంమార్చుకోవాలనీ, ఆ మరునాడు గ్రహణస్నానానంతరం మరలా నూతన యజ్ఞోపవీతంమార్చుకోవాలి, మార్చుకునేముందు గాయత్రి జప ప్రతిపద కనుక "మిధ్యాదీతదోషప్రాయశ్చిత్తార్థం" అని సంకల్పంతో చెప్పుకోవాలి.


 
ఈ శ్రావణ పౌర్ణమి రోజున గ్రహణం ఉన్నందున నూతన ఉపాకర్మ చేయువారు :


ఋగ్వేద ఉపాకర్మ నిర్ణయం : ఋగ్వేదులకు శ్రవణ నక్షత్రం ప్రాధాన్యం కానీ శ్రవణ నక్షత్రం గ్రహణ దూషితమగుట వలన హస్తపంచమీ గ్రాహ్యా|| తేదీ.04-09-2017 సోమవారం భాద్రపద శుద్ధ త్రయోదశి శ్రవణా నక్షత్రం రోజున ఋగ్వేదులు ఉపాకర్మ ఆచరించాలి.

యజుర్వేదీయులు ఉపాకర్మ నిర్ణయం : యజుర్వేదీయులకు పౌర్ణమీ ప్రాధాన్యం తేదీ.06-09-2017 బుదవారం భాద్రపద శుద్ధ పౌర్ణమీ రోజున యజుర్వేదీయులు ఉపాకర్మ ఆచరించవలయును.

సామవేద ఉపాకర్మ నిర్ణయం : సామవేదీయులకు హస్తా నక్షత్రం ప్రాధాన్యం తేదీ 25-08-2017 శుక్రవారం భాద్రపద శుద్ధ చవితి హస్త నక్షత్రం రోజున సామవేదీయులు ఉపాకర్మ ఆచరించవలయును.

 (గమనిక సామవేదీయులు సామవేద శాఖాదిపతి మౌడ్యమి ఉండుట వలన శాఖాధిపతి శాంతి చేసుకొని ఉపాకర్మ ఆచరించవలయును).
యజ్ఞోపవీత ధారణ శ్రావణ పౌర్ణమి తేదీ.07-08-2017, సోమవారం రోజునే మద్యాన్నం 12.30 లోపు యధావిధిగా మార్చుకోవాలి.

Meaning of choodamani yoga in this lunar eclipse

 

Lunar Eclipse - reasons for some cautions

: చంద్రగ్రహణం ఎఫెక్ట్:
ఆరోజు ఏం జరుగుతుంది?


గర్భిణీలు ఏం చేయాలి!

ఈ సం|| శ్రావణ శుక్ల పూర్ణిమా సోమవారము 07-08-2017 నాడు శ్రవణా నక్షత్రములో మకరరాశిలో చూడామణి నామక అర్గలగ్రాస కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించును.
ఈ గ్రహణమున పుణ్యము అధికముగా వచ్చును.

స్పర్శ కాలం రాత్రి10: 52 మధ్యకాలం
మధ్యకాలం రాత్రి 11: 50
మోక్ష కాలం రాత్రి 12:49

మొత్తం పుణ్యకాలం గం. 01:57 నిమిషాలు

నిత్య భోజన ప్రత్యాబ్దికాది నిర్ణయము
సూర్యగ్రహే తు నాశ్నీయా త్పూర్వం యామ చతుష్టయమ్ |
చన్దగ్రహే తు యామాంఫ్రీన్ బాల వృద్ధాతురాన్వినా !


ఇది రాత్రి ద్వితీయ యామమన ఆరంభమగుచున్నది.
కనుక నిత్య భోజన, ఆబ్దికాదులను పగలు ద్వితీయ యామము లోగానే (అనగా పగలు 12.20 లోగానే) జరుపుకొనవలెను.
అశక్తులు (అనగా చిన్నపిల్లలు = వృదులు - వ్యాధితులు - గర్భిణులు) మాత్రము గ్రహణారంభ యామము నుండి సార్ధయామ కాలమును విడచి - అనగా ఈనాడు సా. 5.00 లోగా ఆహారాదులను స్వీకరించవచ్చును.

గ్రహణ మోక్షము అర్ధరాత్రి తరువాత గనుక సమర్తులు మోక్ష స్నానానంతరము కూడా ఈనాడు ఆహారాదులను స్వీకరించరాదు.
గ్రహణ గోచారము ఈ గ్రహణమును శ్రవణ నక్షత్రము వారును, అధమ ఫలము నిచ్చు రాశుల వారును అసలు చూడరాదు.
 
శుభ ఫలము : మేష, సింహ, వృశ్చిక, మీన రాశులవారలకు
మధ్యమఫలము : వృషభ, కర్కాటక, కన్య, ధనూ రాశులవారలకు
అధమ ఫలము : మిథున, తుల, మకర, కుంభ రాశులవారలకు

గ్రహణ సమయంలో జాగ్రత్తలు
వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకని గర్భిణీస్త్రీలపైఆ కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శాస్రాలలో చెప్పడం జరిగింది.దాని వల్ల గర్భస్థ శిశువుకు కురూపిగానో, అంగవైక్యలంతోనో పుటతీరిడంజరుగుతుంది. కాని సృష్టితీరులో ప్రతిచర్యకు ప్రతిచర్యకు ఉంటుంది.
ఏది జరిగినాదాని ప్రభావం ఏదో ఒకరూపంలో వెల్లడి అవుతుంది. ఆ కారణంగా సాధారణంగా మంత్ర సాధకులు నిత్యపూజాది కార్యక్రమాలు దేవాలయాలు మూసిశాంత్యోపచరాలు చేసుకోవలసినదని జపతపాదులు చేసుకొమ్మని, సముద్రపు ఆటు పోటులు జాగ్రత్తగా పరిశీలించుకొమ్మని చెప్పడం జరిగింది.

ముఖ్యంగాగర్భిణీ స్త్రీలు వీటి ప్రభావం ఎక్కువై శరీరములో అధిక వేదనలు పడతాయనిదానికోసమే గ్రహణములు చూడరాదని కాస్మోటిక్ రేడియేషన్ తగలకుండా ఉంటుందని శాస్త్రజ్ఞలు పరిశోధన ఫలితాలు తెలియచేస్తున్నాయి

 ఇంటిలో గ్రహణం పడుతున్నదని తెలిసినప్పడు ముందుగా దర్భలు ఇంటిలో వేసితరువాత పచ్చళ్ళమీద, ఆహారపద్ధారాల మీద దర్భలను వేయవలయును. సాధారణంగా గ్రహణానికి రెండుగంటల ముందే భోజనము పూర్తి చేయవలెను. గ్రహణం పట్టు, తర్వాత స్నానము, విడుపుస్నానము చెయ్యవలెను.

ఆసమయంలో మంత్ర పునరశ్చరణ చేయుటవలన అధిక ఫలితముల నొసగుననిశాస్త వచనము. భూమి ఎన్నో మార్పులకు లోనౌతుంది. ఎప్పడైనా మార్పులువస్తే దానికి అనుగుణంగా మన శరీరంలోను మన జీవన విధానంలోనుమార్పులు చేసుకోవాలి. అప్పడే ఆరోగ్యం బాగుంటుంది .
సూర్య, చంద్రులు ఆరోగ్యకారకులు అన్నది ఆరోగ్య జ్యోతిషసూక్తిగా చెప్పకోవాలి. గ్రహణసమయాలలో మనం వాటి కనుగుణంగా మార్పులు చేసుకుని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి.

దర్భలతో శుద్ధి ఎలా జరుగును ?

గ్రహణ సమయంలో దర్భలను ఆహారపదార్థలపైనే వేయవలసిన అవసరం ఉన్నది. దర్భలు గరిక జాతిలో సన్నటి ఆకులు. వాటి చివళ్ళ చాలా పదునుగా సూదంటు గా ఉంటాయి. దర్భలను పుష్యమి నక్షత్ర యుక్త ఆదివారం నాడుకొయ్యాలి.
ఆ విధంగా చేసినటైతే ఆ దర్భలు రేడియేషన్ను తొలగిస్తాయి. గ్రహణ సమయాలలో ఉత్పత్తిఅయ్యే ఫలితాన్ని అల్త్రావైలెట్ కిరణాల ప్రభావాన్నిఅవి నిరోధిస్తాయి. ఆ కారణంగా నీటిలో గాని పచ్చళ్ళపైగాని వేసినటైతేఅవి బూజు పటతీరికుండా ఉంటాయని ఎన్విరాన్మెంట్ బయాలజీ విభాగంవారు పరిశోధించి తెలిపిన విషయం.
అందువల్ల దర్భలను పచ్చళ్ళవీుదనీళ్ళలో దర్భలను వేస్తారు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే ఆహారంజీర్ణం కాదు. వాతావరణ మార్పులే దీనికి కారణం.‪

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-11

         పోనీ ఒక వేళ ఇంకో మతం వారు ఏ రూపం లేకుండా నిరంజన నిరాకార రూపం అంటారు .కాని మనస్సులో ఏమి ఊహించి దండం పెట్టుకుంటారు .ఏదో ఒక రూపం ,తండ్రి  గా ,పురుషుడిగా ,లేదా ప్రకృతి అంతా నిండి వున్న ఓ పెద్ద దుప్పటి లా ,లేదు అంటే వెలుగుతున్న ఓ  జ్యోతి లా ,  నాయనా   ,తండ్రి    ఏదో ఒకటి   సంభోదిస్తూ లోలోపల మాట లాడు కొంటూ  ప్రార్ధన చేయాల్సిందే అంటే ,ఆకారం పూజ చేసేవాళ్ళు ఎదురుగా వున్న రూపమ్ తో  మాటలు పెట్టుకుంటారు .కాబట్టి అందరు అన్ని మతాలవారు  కనపడని భగవంతుడి ని ఏదో రకము గా కనెక్ట్ అవ్వలిసిందే .అందుకే ఒకరు గొప్ప ,ఒకరు కాదు అనలేము ,అనకూడదు ,   పరమాత్మ నేను అన్ని రూపాలులో ,అన్ని జీవులలో వున్నాను ,అని చెప్పటానికి చేప , తాబేలు , పంది  , సగం మనిషి సగం సింహం  శ్రీరాముడు ,శ్రీకృష్ణుడు ఇలా అన్నింటిలోనునేను,అన్నినేనేఅని చెప్పకనేచెప్పాడు .అసహ్యంచుకోవడం ,ఆనందపడటం ,ఇష్టపడటం అన్ని నేనే అని చెప్పటానికే  పంది అవతారం   కూడా ఎత్తాడు  అంతేకాదు ప్రపంచం ,విశ్వం అంతటా నేనే నిండి వున్నాను .అందరు దేవుళ్ళు ,అన్నిరకాలు నాలో చూడండి అని విశ్వరూపం ఎత్తి చూపించాడు .

        ఎంత చెప్పిన అర్థం అయ్యేవాడికి అర్థం అవుతుంది ,కాని వాడికి కాదు దానికి కొంత పూర్వ జన్మల అదృష్టం వుండాలి ,ఆ దైవం యొక్క దయ కూడా మనపై ప్రసరించాలి .మన మనస్స్సు కూడా కడిగిన ముత్యం లా వుండాలి . లేకపొతే  మనకు ఎక్కదు .చెక్క,ప్లాస్టిక్ వస్తవులలోకి కరెంట్ ఎలా ప్రసరించ దో ,అలా అక్కడ అంత దేవుడి  ప్రవాహం వున్నఎక్కదు. అంతదాకా ఎందుకు శ్రీకృష్ణపరమాత్మ కౌరవుల సభలో ప్రవేశించి నప్పుడు ,ఆ పరమాత్మ ను తాళ్ళతో కట్టేయటానికి దుర్యోధనుడు , కర్ణుడు తో దుష్ట చెతుస్ట యం అందరూ ఓ పన్నాగం పన్నారు  . ఇంకా ఆ  సభ లో విదురుడు   ధృతరాష్ట్రుడు    కూడా వున్నారు .  ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి వాడు కదా ,అందుకే ఆయనకు మనో నేత్రం  ప్రసాదించి మరీ విశ్వరూపం కళ్ళకు చూపెట్టాడు .వాళ్ళందరికీ ఏమి అర్థం అయ్యంది ?  ఆయన సాక్షాత్తు భగవంతుడే    అని ఒక్క విదురుడు కి తప్ప మిగతా వాళ్ళ కి ఏమి అర్థం కాలేదు .ఓరి పిచ్చివాళ్ళా రా ప్రపంచం అంతా నేనే నిండి వున్నప్పుడు మీరు ఏమి బంధిచగలరు . ఇక్కడ మనకేమి తెలుస్తుంది .నేను ఒక్క చిత్రము లోనో ,లేక ఒక్క ఫోటో లోనో .ఒక్క విగ్రహము లోనో కాదు అంతటా నేనే నిండి వున్నాను   మీ దేహములో నేనే వున్నాను అదే అంతర్యామి అని పిలుస్తాము .అలా . నాలో శివుడు వినాయకుడు హనుమంతుడు ఇలా దేవతలూ ,పిత్రుదేవతలూ అంతా నాలోనే వుండి ,ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు అని మనం శ్రీకృష్ణుడివిశ్వరూపం చూచి అర్థం చేసుకోవాలి 

      భగవంతుడు ఒక్కడే కానీ మన అవసరాలకు తగ్గట్టుగా మనం మలుచు కొంటున్నాము .ప్రవహించే విద్యుత్తుఒక్కటే కాని టి.వి ,ఫ్రిజ్ వాషింగ్ మెషిన్,నీటి మోటార్ ,ఇస్త్రిపెట్టే ఇలా దానిని అన్నిటిలో  వాడుతున్నాము.  అలానే ఒక ఇంట్లో ఇంటి యజమాని ,ఆయన కూడా ఒక్కడే తండ్రి ,బాబాయి ఒకరికి మేనమామ ,ఒకరికి తమ్ముడు ఒకరికి బావ ఇలా ఒక్కరినే ఎలా పిలుచుకొంతున్నామో అలానే దేవుడి ని ఇన్ని రూపాలలో కోలుచుకొంటు న్నాము.  బలానికి ,భయం పోవటానికి ఆంజనేయస్వామిని ,పనిలో ఆటంకాలు రాకుండా వినాయకుడిని ,సంపదకోసం శ్రీలక్ష్మి అమ్మవారిని ,విద్యకోసం సరస్వతి అమ్మవారిని యుద్దములో విజయంకోసం దుర్గామ్మవారిని ఇలా ఆరాధిస్తున్నాము

           శుద్ధమైన భక్తీ అవసరం .భగవంతుడుకూడా మనలోని భక్తీ ని చూస్తాడు .అంతేకాని ఆడంబరాలు పట్టించుకోడు .మనకు శ బరి,గుహుడు ,ఇంకా తిన్నడు ,పాము ,ఏనుగు ,సాలీడు ఈ కధలు అన్ని మనకు తెలిసినవే .అంతేకాదు సత్త్వ ,తమో  రజస  గుణాల ను భట్టి కూడా దైవారాధన వుంటుంది అని గీతలో భగవానుడు చెప్పాడు కదా.   కాబట్టి అంతా ఒక్కరే ,ఏకదా సత్  బహుదా వదంతీ  వున్నది ఒక్కటే సత్ పదార్దం , దానిని పండితులు  అనేక రూపములుగా చెప్తున్నారు  అని వేదభాష్యం చెబుతుంది.        మీరు  ఏ దేవుడికి లేక ఏ దేవత కు అర్చన చేసినా అది వచ్చి నాకే చేరుతుంది .అందుకే   మనం  పెద్దవాళ్ళకు   నమస్కారం చేసినప్పుడు వాళ్ళు కృష్ణార్పణం  అంటూ వుంటారు .అదే    సర్వ దేవ నమస్కారం కేశ వం ప్రతి గచ్చతి    అని అర్థం.

          హిరణ్యకశిపుడు కి  సంపదలు ,భోగాలు   అన్నీ ఇచ్చాడు. జ్ఞానము ,అజ్ఞానము అన్నీ తెలుసుకొనే విచ క్ష ణ కూడా ఇచ్చాడు .కాని అతనిలో జనించిన  అహంకారం వల్ల కళ్ళు మూసుకు పోయాయి .దానితో నేనే ఈ సృష్టి కి ఆధారం .నేనే భగవంతుడిని అందరు నన్నే పూజించండి .అంటూ సేవకులని ,ప్రజలని పీడించి ,అధికారముతో భయపెట్టి భజన చేయుం చు కొనే వాడు .భగవంతుడు ఆ అహంకారి  చివరికి కన్న కొడుకు  తో కూడా జ్ఞానం చెప్పించాడు    .మరీ అంతటా నేనే అన్నప్పుడు చెడు ,రాక్షసులు అంతా కూడా మరి పరమాత్మే  అవుతాడు  కదా ? అలాంటప్పుడు ఈ పూజలు పొగడ్తలు మంచి పనులు   పుణ్యం   ఇది అంతా ఎందుకు ? చెడు పనులు చేస్తే తప్పు ఏమిటి ?ఇటువంటి సందేహాలు రావచ్చు ?   (contd..)
 
 
 
 

పర్యావరణ పరిరక్షణ - మన కర్తవ్యం

        ప్రియమిత్రులారా,   వర్షాకాలం వచ్చేసింది .మొక్కలు ఎక్కడో అక్కడ  ఎన్నో కొన్ని నాటండి .అది చేయలేనివారు కనీసం మొక్క్లల గింజలు అయునా  నాటండి .అదికూడా వేపచెట్లు  అయుతే మరీ మంచిది .ఇక ముందుగా వేప ,నేరేడు చింత సీతాఫలం  లాంటి మీరు ఏమి తిన్నా సరే  ఆ గింజలు ను పారవేయకుండా ఓ డబ్బా లో వేయండి .అలా వర్షం కురిసి ఆగిన తరువాత  బైటకు వెళ్ళినప్పుడు ఖాళి ప్రదేశములో వీటిని కొద్దిగా పుల్లతో లోపలికి గుచ్చి ఓ గింజ చొప్పున వేస్తూ వెళ్ళండి .మామిడి ,వేప, రావి, జువ్వి, పారిజాతం, తులసి, మర్రి, మారేడు లాంటివి దేవతా వృక్షములు అని చెబుతారు .  అవి నాటి పెంచితే ఎంతో పుణ్యం వస్తుంది అని చెబుతారు .సరే పుణ్యం అంటే  పది  మందికి మంచి జరగటం.   సంతానం లేనివారికి  కూడా , దాని వాళ్ళ కలిగే దోషాలు తొలగి పోయి స్వర్గం ప్రాప్తిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి.
       రావిచెట్టు దేవాలయములో  కానీ  ఆ సమీపములో కానీ వేస్తే కోటి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది అని కూడా వుంది .రావి చెట్టు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు రూపం అని భగవద్ఘీత లో భగవానుడు చెప్పాడు కదా ,జ్యోతిష్యం లో కొన్ని సమస్యలకు ఆ రావి చెట్టు ప్రదక్షిణాలు పరిహారముగా చెబుతూ వుంటారు .ఒక్క శనివా రం  రోజు మాత్రమే ఆ వృక్షాన్ని ముట్టుకొని దండం పెట్టుకోవాలి   ఆ రోజు ఒక్కరోజు మాత్రమె శ్రీ మహాలక్ష్మీదేవి కొలువుఅయి ఆ చెట్టులో వుంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి, మిగతారోజులు  జేస్టాదేవి అక్కడ వుంటుంది అందుకే  ముట్టుకోరాదు అని చెబుతారు .  
      ఇక వేప చెట్టు  అమ్మవారి అవతారం అని చెబుతారు .వేప గాలి  మనకు ఎంతో మంచిది .దానివల్ల పర్యావరణం ఎంతో శుభ్రపడుతుంది. ముఖ్యముగా ఆస్తమా లాంటి శ్వాసకు సంభందించినవ్యాధులు రాకుండా ఉంటాయి ,అలర్జీ లకు ,చర్మ వ్యాధులకు క్రిమి కీ ట కాడులకు దీని వేప గాలి మందులా పనిచేసి తరిమి కొడుతుంది . ఇక జమ్మి చెట్టు శని సంభంధమైన సమస్యలకు మంచి పరిష్కారం  ఇంకా అలానే జన్మ నక్షత్రాలు బట్టి కూడా మొక్కలు నాటుతూ వుంటారు  మామిడి మొక్కలు ఎంత పెద్దగా అయునా సరే దాని బలమైన వేర్లు మాత్రం సూటిగా భూమిలోకి మాత్రమే నిట్ట నిలువుగా పోతాయి, ఇంటి గోడల్లోకోపోయి గోడలు పాడు చేయవు.

      అవసరాల కోసం కార్ కొనేవాళ్ళు కొందరు అయితే ,డబ్బు పుష్కలముగా వుండి కొనేవారు కొందరు,కొన్నాము కదా అని తిరిగేవారు కొందరు, త్రాగుతూ తిరిగేవారు కొందరు, ఏది ఏమయునా విలాసాలకోసం పర్యావరణం పాడుచేసేసాం.  భూగోళం వేడి ఎక్కిపోతుంది.  రానున్న తరాల వారి వాటా కూడా మనం ఇప్పుడే పాడుచేసేసాం.  కనీస మానవ ధర్మం తో రాబోయే తరాల  పిల్లలకు ఆరోగ్యమైన పర్యావరణం కోసం  మన తప్పులను దిద్దుకొని మొక్కలు నాటాలి .  కనీసం విత్తనాలను అయునా జేబుల్లో పోసుకొని వన పడినప్పుడు నాటుదాం , ఈ వర్షాకాలాన్నిసద్వినియోగం చేసుకుందాం .  ఈ జన్మని కనీసం చిన్న పని కి వుపయోగించి పుణ్యాత్ములం అవుదాం పదండి ముందుకు.
.            
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online