Pages

మూలాలను తెలుసుకోండి

         అన్ని మతాలలోను , అన్ని కులాల్లోనూ  గొప్పతనం ఉంది .  భారతీయ సంస్కృతిలో ప్రతి చెట్టుకు ప్రతి పుట్టకు , ప్రతి జంతువుకు ...ఒక గొప్పతనం ఆపాదించబడింది .  అంతదాకా ఎందుకు రాక్షసులను హీనం గా చూస్తాము .  కానీ , రాక్షసులు కూడా వారి వారి పూర్వజన్మలలో మంచివారిగా ఉండి ఒక చెడ్డపని వల్ల శాపం పొంది అలా పుట్టారని పురాణాల్లో చెప్పబడింది .
       పాము , పంది, దగ్గర్నుంచి ఉడుత వరకు అన్ని ప్రాణులు భగవంతుని స్వరూపం అని మన సంస్కృతి చెబుతోంది .  మల్లెచెట్టు పువ్వులకు మంచి పరిమళం ఉంది, అది మనసుకు వైద్యం చేస్తుంది .  అలానే జిల్లేడు చెట్టు పువ్వుకు ఒక గొప్పతనం ఉంది . అది శరీరానికి వైద్యం చెయ్యటానికి పనికివస్తుంది .  పెద్దగా కనిపించే వేపచెట్టు గొప్పతనం వేప చెట్టుదే .  ఇలా ఎన్నో భగవంతుని సృష్టిలో అన్నింటిలోను ఏదో ఒక గొప్పతనం ఉంది .  ఒక చెట్టు గొప్పతనం చూసి వేరొక చెట్టు దాని గొప్పతనాన్ని తక్కువ చేసుకుని ఈర్ష్య పడటం లేదు .  అలానే అన్ని ప్రాణులూ , జీవులూ కూడా ... ఒక్క మనిషి తప్ప ....భగవంతుని సృష్టి లో అన్నీ సమానమే అన్న సత్యం ప్రతి మనిషి తెలుసుకోవాలి .  ఈర్ష్య , ద్వేషం  రగుల్చుకుంటూ పొతే మనిషి , ఈ ప్రపంచం ఏమవుతుంది ?           పురాణపురుషులు, పురాణాలు , పురాణాలు వ్రాసినవారు అందరూ బ్రాహ్మణులు కాదు .  శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , వ్యాసుడు , వాల్మీకి , శబరి , గుహుడు ఇంకా అనేక మంది ఉన్నారు  బ్రాహ్మణులు కానివారు .   కానీ వారిని అందరినీ బ్రాహ్మణులు నెత్తిన పెట్టుకుని , వారి మర్గాన నడుచుకోమని చెబుతున్నారు .  మరి బ్రాహ్మణులే పురాణాలు , కట్టుకధలు వ్రాసారు అని అనుకుంటే పైన చెప్పిన వాళ్ళు అందర్నీ వాళ్ళు మా వారే అని వ్రాసి ఉండవచ్చు కదా .
       ప్రతి ఒక్కరు పురాణాలు కాని , చరిత్రలు కానీ మూలాలు చదవండి . మధ్యన వచ్చిన వారి వ్యాఖ్యానాలు , అర్ధాలు , వ్రాతలు చదివి అదే నిజం , అవే గొప్పవి , యదార్ధమైనవి అని అనుకోవద్దు . ఉదాహరణకు  రావణాసురుడు , మహిషాసురుడు , నరకాసురుడు మొదలైన వారంతా దోపిడీకి గురి అయినవారని , మంచి వారు అయినాగాని కుల వివక్ష తో వారిని అలా చిత్రీకరించారని , వారంతా మనకు ఆదర్శ పురుషులు అని చెబుతున్నారు.  అలా చెప్పేవారు ఎవరైనా వాల్మీకి రామాయణం గాని తులసి దాసు రచన గాని  చదవలేదు .  వారు రామాయణ , భారతాలు చదవలేదు . వారికి అంత ఓపిక ఓర్పు లేవు .  పైగా మేము ఆ పురాణాలు చదవలేదు అని గర్వం గా చెబుతున్నారు . వారికి అంత ఓర్పు , ఓపికా లేవు .  మిత్రులారా ! దయ చేసి మూలాలు చదవండి అది చరిత్ర అయినా , పురాణం అయినా సరే .   చరిత్రలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చెయ్యటం, వాస్తవాలను వారి వారి దృష్టికోణం లో చూపటం జరుగుతోంది .  దానికి రాజకీయ , సామాజిక కారణాలు ప్రభావాలు చాలా ఉండచ్చు .  ఉదాహరణకు బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని పాలించినప్పుడు మన చరిత్రని వారికి నచ్చిన విధం గా మార్చివేసారని కొందరి అభిప్రాయం .  అలాగే రాహుల్ సాంకృత్యాయన్ , కౌసంబి వంటి వారు కూడా వారు చూసిన కమ్యూనిస్ట్ కోణంలోనే చరిత్రని చూసి భాష్యం వ్రాసారు .  అదే ఫైనల్ అన్నారు .  మూలాలు చదువుకునే పండితులు అయితే భాష్యాలను పట్టించుకోరు .  కానీ మనవంటి సామాన్యులు అవి చదివి అదే నిజమని నమ్ముతున్నాము .  అది కరెక్ట్ కాదు .  ప్రతి దాని మూలం చదువుకోవాలి .
          ఇప్పటి వార్తా పత్రికలలో రాజకీయ పార్టీల పత్రికలూ కూడా ఉంటున్నాయి .  ఆ పత్రికలలో వచ్చే వ్యాసాలూ చాలావరకు తప్పుదోవ పట్టిస్తున్నాయి ప్రజలని .  పైగా గురువు ఎవరైనా అన్ని చదువుకున్న వారు దొరకటం చాల అదృష్టం ఇప్పటి రోజుల్లో .   ఉదాహరణకు మన సంస్కృతీ లో సంఘ స్వరూపం గురించి ఐతరేయ బ్రాహ్మణా పురుష సూక్తం లో ఓ విషయం ఉంది .  అదేమిటంటే " బ్రాహ్మణులూ విరత్పురుషుని ముఖం నుండి పుట్టారని , క్షత్రియులు భుజాలనుంది , వైశ్యులు ఊరువుల నుండి , శూద్రులు పాదాల నుండి పుట్టారని వ్రాసి ఉంది .  అది యదార్ధమే .  కాని ఇక్కడ కొంతమంది ఈ విషయాన్ని ఆసరాగా తీసుకుని సూద్రుల మెప్పు కోసం , వారిని రెచ్చ గొడుతూ  చూసారా ! మిమ్మల్ని పాదాలతో పోల్చారు , ఇదంతా బ్రాహ్మణుల కుట్ర అని ఏదేదో వ్రాస్తూ ఉంటారు .  దానికి ఇంకొంత మంది అగ్నికి ఆజ్యం పోసే విధం గా దినపత్రికలలో రెచ గొట్టే వ్యాఖ్యలు వ్రాస్తూ ఉంటారు .  పైగా మేము ఇలా రాసి అసలయిన శూద్రులకు , పేదలకు బడుగు వర్గాల వారికి మేలు కోసం అంటూ వార్తల్లోకి వస్తుంటారు .  ఇదంతా తమని తాము వార్తల్లోకి తెచ్చుకోవతనికే .ఇటువంటివి చదివి అదే నిజమైన జ్ఞానం అని అనుకోకండి .  అసలైన జ్ఞానం నిస్వార్ధ పరులైన గురువుల నుండి తెలుసుకోండి .  అసలు పైన చెప్పిన విషయం లో నిజమైన గురువుల అర్ధం ఏంటంటే అయ్యా ! మిమ్మల్ని పాదాలతో పోల్చారు అని మీరు బాధ పడుతున్నారు కానీ దానిలోని పరమార్ధం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ శరీరం దేని మీద ఆధారపది ఉందొ తెలుసా ?  పాదాల మీదనే.  కాళ్లు లేకపోతె ఈ దేహం నిలవదు .  కుప్పకూలిపోయి దాని స్వరూపం నిర్మాణమే దెబ్బ తింటుంది .  ఒక భవనానికి పునాది ఎక్కడ ఉంటుంది ?  అట్టడుగున ఉన్న భూమిలో ఉంటుంది .  అలానే సూద్రుడు పైనే ఆధార పది ఉంది ఈ సంఘం .  సూద్రుడు గట్టిగా ఉంటేనే ఈ సంఘం , సంస్కృతి , పాడి పంటలు అన్నీ .  మనం అంతా అన్నం తినగలుగుతాము అందుకే ఎవరైనా దణ్ణం పెట్టేటప్పుడు పాదాలకి పెడతారు .పాదాలు పట్టుకుంటారు తెలుసా !  మీకు ఈ సత్యం బోధ పడే ఉంటుంది ఇప్పుడు .  కాబట్టి ప్రతి విషయాన్ని మంచి గురువుల దగ్గర అభ్యాసం చేసి , లోతుగా ఆలోచించి స్వయం గా పరిశీలించి అర్ధం చేసుకోవాలి .  అంతేకాని ఏవో కొన్ని పత్రికలూ , పుస్తకాలు , ఇంటర్నెట్ లో వ్యాసాలూ చదివి అదే నిజమని భ్రమ పడకండి .  మూలాలను తెలుసుకోండి .

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online