ప్రతి మనసుకు ఉంటుంది ఆశయం
సాధించాలంటే ప్రతిదీ ఓ పద్మవ్యూహం
స్వార్ద శక్తులు మార్గం అంతట కంటకాలను పరుస్తాయి
మనసుని విమర్సల అస్త్రాలతో తూట్లు చేస్తారు
గాట్లు పెడతారు , విధి నెత్తిన ఎక్కి వస్తారు
మేధస్సును శిధిలం చేసి వెనక్కి లాగుతారు
జంకిపోయి బెదిరిపోయి వెక్కి వెక్కి ఏడవకు
విధి నిన్ను చూసి వెక్కిరిస్తుంది
నీ వాళ్ళే నిన్ను నమ్మించి దగా చేస్తారు
నవ్వులపాలు చేసి తన్నిపోతారు
ఎ ఎండకు ఆ గొడుగు పడతారు
నీ చుట్టూ నిరాశా నిస్పృహలు కారు చీకట్లలా దట్టంగా ఆవరిస్తాయి
లోకులు కాకులై పొడుస్తారు
నీ పక్షాన ఎవరు ఎక్కడా కనిపించరు
జాడ తెలియని రాత్రిళ్ళు కీచురాళ్లై గోల పెడతారు
నిర్లిప్తమైన శూన్యం నిన్ను ఆవరిస్తుంది
భయపడి ముడుచుకోకు
ప్రాణాలకు తెగించి ప్రయత్నం చెయ్యి
ఓటమి తోక ముడిచి పారిపోతుంది
శరీరం ముక్కలు అయినా పర్వాలేదు
మనసును ముక్కలు కానివ్వకు
ఒకవేళ మనసు బూదిడైపోయినా
బాగా వెతికి పట్టుకో ఏదో మూల చిన్న నిప్పురవ్వ ని
బలంగా లేచి చిన్ని ఆశతో
పగిలిన మనసుని అంటించుకో
నిప్పురవ్వ ను కష్టపడి నిప్పు కణికగా రగుల్చు
నువ్వు ఎంతో నష్టపోయి ఉండవచ్చు
కష్టాన్ని నమ్ముకో అది నిన్ను గట్టేకిస్తుంది
అంకితభావం , క్రమశిక్షణ కృషి అనే కొలిమిలో
మనసుని రగిలించు
అప్పుడు ఏ స్వార్ధ శక్తి నీకు ఎదురైనా
కాలి భస్మం అయిపోతుంది
అప్పుడు నీదే పై చేయి , నీదే విజయం

0 comments:
Post a Comment