బీజాపూర్ దుర్గమ్మ తిరునాళ్ళు కోలాహలంగా జరుగుతున్నాయి . కన్నుల పండుగగా జనం కనిపిస్తున్నారు . ఎక్కడ చూసినా స్త్రీలు ఎక్కువ సంఖ్య లో కనిపిస్తున్నారు . ఎ దుకాణం లో చూసినా సరే గాజులు కొనుక్కున్తోనొ , పూసలు కొని మేడలో వేసుకొని , అందమైన సంఖంలాంటి మెడని అద్దంలో చూసుకుంటూనో , చెవికి రింగులు సరి చూసుకుంటూనో , జడకుచ్చులు కట్టుకున్టూనో, ఎంతోమంది స్త్రీలు వారి బేరసారాల సంబరాల్లో మునిగి తేలుతున్నారు .
ఒక్కో దుకాణం చూసుకుంటూ వస్తున్నా బిన్నీ అకస్మాత్తుగా ఆగిపోయాడు . ఏమైందో ! ఖచితంగా ఒక సంవత్సరం క్రితం ఆనందం , అనుభూతి కేకలు మనస్సు లోయల్లో ప్రతిధ్వనించాయి .
తనూ , గౌరీ ఒకళ్లంటే ఒకళ్ళకు ఎంత ప్రేమా , అసలు గౌరి అందం ఎవరికుంతాది. ఇద్దరం పోద్దుపోడిసేఎల జొన్న చేలోకి సద్ది కట్టుకుని ఎల్లేవాళ్ళం .
అన్నెం పున్నెం ఎరుగని నా గౌరి కళ్ళు , ప్రేమ చిందించే కొలనులాంటి కళ్ళు , మా దుర్గమ్మ గుడిపై బొమ్మ కున్న లాంటి సన్నని ముక్కు , ఎర్రని బుగ్గలు , కసికసిగా బుంగమూతి పెట్టి కోర్కెలు పుట్టించే ఆ పెదవులు , నా చేతులతో పట్టుకుని ఎన్నిసార్లో ఊపిన సన్నని చిన్ని గడ్డం , మోచేతులవరకు సింతపూల రవిక .
ఆ రైక పై వాక్కోటు కింద కుర్తా , మైమరపించి మురిపించే మెడ కనపడకుండా శాస్త్రప్రకారం గా తల పైనుంచి బలమైన జబ్బాల వరకు కప్పుకున్న పలుచని ముసుగు . కొద్దిగా ముసుగు పైకి జరుపుకుని చిరునవ్వులు చిందిస్తూ , తను గడ్డిమోపు తలపై పెట్టుకుని పొలం గట్లపై నడుస్తా ఉంటె నా గౌరీ నన్ను పిచ్చేక్కించేది .
గౌరి అంటే పడిసచ్చే వాడ్ని , ఎప్పుడు చీకటి పడుద్దా, నా గౌరి దుప్పట్లో దూరిపోవాలని తహతహ లాడే వాడ్ని . సంవత్సరం తర్వాత మళ్ళీ నా అందమైన గౌరి . అవును నా గౌరి . గౌరీ - గౌరీ , అని పెద్దగా పిలుస్తూ అటూ ఇటూ చూసాడు బిన్నీ . దుకాణం లో ఉన్న గౌరి అక్కడనుంచి తప్పించుకుంది . గౌరి పక్కన ఎవరయి ఉంటాడు వాడు -- దాని బావ కాదూ , ఆ -దాని బావే ! బావను ఏసుకుని తిరనాల్లో తిరుగుద్దా? సెపుతా ఉండు .
అటూ ఇటూ ఆందోళనతో వెతికాడు బిన్నీ . గౌరీ కనపడలేదు . విసుగుతో తల గోక్కున్నాడు . ఇంకా ఎంతో మంది మిసమిస లాడే , కళ్ళతో చూపులతో ఊసులాడే , మెళ్ళో కాసులతో గల గల లాడే , నవ్వులతో కిలకిలలాడే తుంటరి భామలు కనిపిస్తున్నా తనకు మనస్సు ఏమాత్రం స్పందించటంలేదు . గౌరి జ్ఞాపకాలు ముసురుతున్నాయి . కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి తిరిగి వచ్చాడు . "అవ్వా ! అవ్వా !" అని పిలిచాడు .
ఎవరూ ఇంట్లో కనిపించలేదు . కొంకి కర్ర తీసుకుని గొర్రెలను తోలుకుంటూ వెనకాల బీడులోకి వెళ్ళాడు . అక్కడ ఒక పెద్ద చెట్టు , ఆ చెట్టు క్రింద రాధాకృష్ణ విగ్రహం . ఎన్నిసార్లు గౌరి తనతో " అదిగో ఆ రాధమ్మ నేను అయితే నువ్వు ఆ కిష్టయ్యవి " అని సెప్పి ఆట పట్టించేది . నా ముక్కు పట్టుకుని పిండేది . నేను దాహం అయి సోరకాయలో నీళ్ళు తాగుతుంటే ఉండేలుతో రాళ్లు విసిరి సయ్యని కొట్టేది . నాకు కోపం వచ్చిందాకా సేసి గోర్రెల్లో పది అటూ ఇటూ ఉరికేది .
తడాలున నేను పట్టుకుంటే నా తలను తన కౌగిట్లో రాసుకుంటూ , తెల్లని పలువరుసతో కిలకిల నవ్వేది . ఎర్రని పెదాలతో నా నుదుటిపై , బుగ్గలపై ముద్దులు పెట్టేది . కర్ర లాక్కుని చిన్న చిన్న దెబ్బలు కొట్టేది పలక పై అక్షరాలూ దిద్దబెట్టేది . బాస మంచిగా మాట్లాడాలని నాకు ఎన్నో విషయాలు నేర్పింది .
"నీకు ఎలా ఇయ్యన్నీ వచ్చినాయీ!" అని అడిగితే నేను మా ఊరి గుళ్ళో పూజారి గారింట్లో అచ్చరాలు దిద్దుకున్నా , కొద్దిగా సదువుకున్నా, ఆ అయ్యగారు , అమ్మగారే మంచి బాస మాట్లాడటం నేర్పారు , అని నన్ను కూడా నేర్చుకోమని బలవంతం చేసేది బిన్నీ ఆ జ్ఞాపకాల ముసురులకు తట్టుకోలేక గొర్రెలను , మేకలను బీడులో వదిలేసి ఇంట్లోకి వచ్చ్చి పడ్డాడు .
ఏందిరో పెద్దాడా ! గొర్రెలు అన్నీ ఆడే వదిలేసావు? అస్సలు ఏమైందిరా నీకు , అట్లున్నావు ? అని అవ్వ నిలదీసింది .
నీకు తెలవదే అవ్వా ! నీకు సెప్పినా అర్ధం కాదులే . పో , నా పాణాన నన్ను బతకనీవే అంటూ కళ్లపై చేతులు పెట్టుకుంటూ మంచం పై అటూ ఇటూ దొర్లుతున్నాడు బిన్నీ .
"నాకు ఎరుకేలేరా ! ఆ గౌరమ్మ కోసమేగా నీ బాధ . వత్తదిలే . ఇక అట్లానే పోయిద్ది అనుకున్నావా ? బాకీ ఉన్న పెండ్లి రొక్కం ఇవ్వమన్నాము . అంతేగా , అది పట్టుకుని బేగిరా వస్తాదిలేరా " రాగాలు తీస్తోంది అవ్వ .
ఇంతలో బిన్నీ కి ఓ ఆలోచన మెరిసింది . వెంటనే లేచి ఒక్క పరుగుతో ఊరి దివాణంలో పురాణం చెప్పే అయ్యగారి ఇంటికి వెళ్ళాడు . దండాలు అయ్యగారు అంటూ బిన్నీ నేలపై కూర్చున్నాడు .
"ఒరే బిన్నీ ఏమిట్రా ఈ మధ్య గౌరి కనిపించటం లేదు ? అని అడిగాడాయన . అదే అయ్యా ! మీతో నా మనసు గోడు చెప్పుకోవాలని వచ్చ్చాను " అంటూ తిరిగి తనే ఇలా చెప్పాడు -
"నా పెళ్ళాం గౌరి , నా అవ్వా ఇద్దరూ పోరు పెట్టుకున్నారు . అయ్యా ! మా అవ్వ మీద గౌరి తిరగబడింది అని దాన్ని దెబ్బలు కొట్టి మా అవ్వా నేను కలిసి ఎల్ల గొట్టినమయ్యా ఆది ఏడుసుకుంటూ గోర్రేపిల్లని ఎత్తుకుని వాళ్ళ ఊరు వేల్లిన్దయ్యా
అప్పటినుండి నాకు యాడ సూసినా గౌరే కనపడుతున్దయ్యా ! దాని అల్లరి లక్షణాలు , సిలిపి కళ్ళు అన్నీ పడ్డాకా గురుతు కొస్తున్నాయయ్యా " బాధ గా చెప్పుకున్నాడు బిన్నీ .

0 comments:
Post a Comment