Pages

story-- మొగలి రేకులు - part-2

      అది విన్న అయ్యగారు " ఒరేయ్ ! బిన్నీ ! ఆశ్చర్యం ఏమిటంటే నీకు ఆ గౌరి చిలిపి చేష్టలు గుర్తుకొస్తున్నాయి  అంటున్నావే , మరి నీవు కొట్టిన దెబ్బలు తిట్టిన తిట్లు గుర్తుకురావటం లేదా ?  అసలు నీవు ఎవర్రా కొట్టటానికి ? మగాడ్ని అనేగా ధీమా ! ఏదైనా తప్పు చేస్తే , అది నీకు తప్పు అనిపిస్తే వాళ్ళ పెద్దవాళ్ళకు చెప్పాలి .  అంతకూ  న్యాయం జరగక పొతే పదిమందికి చెప్పుకోవాలి .  సరే !ఇంతకీ నన్ను ఇప్పుడు ఏమి చెయ్యమంటావు చెప్పు ?"
      "అది కాదయ్యా ! గౌరి   వాళ్ళ బావ తో తిరునాళ్ళలో తిరుగుతుందయ్యా . నన్ను చూసి ఎటో తప్పించుకుందయ్యా. అదీ నా బాధ " బిన్నీ ఆందోళనగా చెప్పాడు .
       అవునురా నువ్వు సంవత్సరం గౌరి గురించి పట్టించుకోకుండా ఉండిపోయావు . ఇది రెండో వేసవి కాలం అంటున్నావు . ఇంత కాలం దాని వైపు చూడలేదా ?  కనీసం దాని ధ్యాస కూడా లేదుట్రా నీకు ?  తిరునాళ్ళకు వెళితే అక్కడ గౌరి పక్కన దాని బావ ఉన్నాడని చూసి నీలో ధ్యాస మొదలయ్యింది .  మరి తప్పు ఎవరిదిరా ?  అదీ ఉప్పు , కారం తినే మనిషి కదరా !  దానికి కోపతాపాలు , కోర్కెలు ఉంటాయి కదరా !కొట్టి ఇష్టం వచ్చినట్లు తిట్టి వేల్లగోట్టినవాడివి అట్లానే వదిలెయ్యరాదూ  తన దారి తనుచూసుకుంటుంది కదరా !" సూటిగా ప్రశ్నించాడు అయ్యగారు .          " అది కాదయ్యా !అయిపోయిందేదో అయిపొయింది .  నేను కావాలని కొట్టలేదు .  ఆచ్చనం అత్తా జరిగిపోయింది .  మీరు నాకు చిన్న  సాయం చేస్తే ...."  నసుగుతూ అన్నాడు బిన్నీ .           "ఏమిటో చెప్పు , నావల్ల  అయితే తప్పకుండా సహాయం చేస్తాను". అయ్యగారు అభయం ఇచ్చారు . 
       "మీరు రోజూ దివాణం లోకి పోతూ ఉంటారు కదయ్యా ! అక్కడ మా మావ పని చేస్తూ ఉంటాడు . మీరు మా మవకు గట్టిగ సేప్పందయ్యా !  మీఎరు సెబితే వింటాడు .  ఇక నుండి మేం బుద్ధిగా ఉంటాం .  మా అవ్వ మాట విని దాన్ని కొట్టాను మీరే సాక్ష్యం అయ్యా !".అన్నాడు .
      సరే వెళ్ళు , నేను అటు దివాణం వైపు వెళ్ళినప్పుడు గౌరి తండ్రి భాక్రా  తో మాట్లాడతాను  అని అన్నాడు అయ్యగారు .
     అంతే బిన్నీ లో పట్టలేని ఆనందం
     తను గౌరి ని కలుసుకోబోతున్నాడు త్వరలో . ఏదో పట్టరాని సంతోషం .  ఆ సంతోషం తో తన కండువా ని గాల్లోకి విసిరి పట్టుకుంటూ  ఇంటికి చేరుకున్నాడు .  ధోవతులు , లాల్చిలు , కండువా ఉతుక్కున్నాడు .  చక్కగా చెంబు ఇస్త్రి చేసాడు .  మంచిగా గడ్డం గీయించుకుని దరిద్రం వదిలిన మనిషిలా నూతన తేజం తో శుభ్రం గా ఉన్నాడు .
        తన దగ్గర చెక్క పెట్టెలో గౌరి , తను క్రితం సంవత్సరం తిరునాళ్ళలో దిగిన ఫోటో కోసం చూస్తున్నాడు .  ఇంతలో ఆ పెట్టెలో వాళ్ళ ఆచారం ప్రకారం శోభనం నాడు కట్టుకున్న తన బట్టలు గౌరి కుర్తా లో చుట్టి దాచి పెట్టింది .  వారిని చూస్తున్న బిన్నికి మనసు గత కాలపు జ్ఞాపకాల లోకి వెళ్ళిపోయింది .  ఆ రోజు గౌరి ఎంత చిలిపి చేసింది !.  

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online