పెద్ద నులక మంచం , దానిపై పరుపు , ఆ పరుపు నిండా గౌరీ పూలు తెఛ్చి పోసింది . తను గంధం పూసుకుంది చాలక తనకీ మెడ నిండా పూసింది . అత్తరు పూసుకుంది కొండ మల్లెలు జడలో నింపుకుంది మొగలి రేకులు తల కింద పెట్టింది అయ్యగారింటి నుండి కిళ్ళీలు కట్టుకొచ్చింది . అది ఒకటి తీసుకుని తనకి ఒకటి ఇచ్చింది . తన మీద పడుకుని ఒకటే అల్లరి చేసినా తనకి ఏందో ఏం అర్ధం కాలేదు . తర్వాత మనసు అంట ఏదోలా అయిపొయింది . వొళ్ళంతా బద్దకంగా అయ్యింది , గౌరీ అటూ ఇటూ గింజుకుంటున్నా తనని గట్టిగా వాటేసుకుని పెదాలు సప్పరించేసాడు తను . గౌరీ కూడా అట్టనే సేస్తూ ఉంటె తనకు ఏంటో హాయిగా అనిపించింది . తామిద్దరూ కలబడుతున్నట్లు మంచం మీద పడిపోయారు . తనని గౌరీ తనకేసి నొక్కుతుంటే ఆమె సేతులు వెచ్చంగా అనిపిస్తున్నాయి . అలా ఎంతసేపు ఒకరితో ఒకరు ఎన్ని సిలిపి పనులు సేసామో , ఇప్పటికి అది యాడికి వస్తే మనసు తేలిపోతుంది . ఇంకా ఆ కొండ మల్లెల గాలి , మొగలిరేకుల పరిమళం ఇంకా మనసుకి తెలుస్తూనే ఉంటుంది . మళ్ళీ బిన్నీ ఆ రాత్రి జ్ఞాపకాలలోకి వెళ్ళాడు . పెద్ద నులక మంచం , దానిపై పరుపు , ఆ పరుపు నిండా గౌరీ పూలు తెఛ్చి పోసింది . తను గంధం పూసుకుంది చాలక తనకీ మెడ నిండా పూసింది . అత్తరు పూసుకుంది కొండ మల్లెలు జడలో నింపుకుంది మొగలి రేకులు తల కింద పెట్టింది అయ్యగారింటి నుండి కిళ్ళీలు కట్టుకొచ్చింది . అది ఒకటి తీసుకుని తనకి ఒకటి ఇచ్చింది . తన మీద పడుకుని ఒకటే అల్లరి చేసినా తనకి ఏందో ఏం అర్ధం కాలేదు . గౌరి దీపం ఆర్పెసిందో లేక అదే ఆరిపోయిందో గుర్తు రావటంలేదు . ఆఖరుకు ఆ సీకట్లో ఎన్ని సిలిపి పనులు చేసుకున్నామో తెల్లారేసరికి తన లాల్చి ,పైజమా గౌరి తొడుక్కుంది , గౌరి కుర్తా తను తొడుక్కున్నాడు . అవునులే సీకట్లో ఏమి తెలియలేదులే బుల్లోడా ! అని గౌరి తనను ఆట పట్టించలా!
ఫోటో చేక్కపెట్టే అడుగున ఒక మూలగా కనపడటం తో దానిపై తన సూపు పడింది . తన శోభనం జ్ఞాపకాలనుండి బయట పడి బిన్నీ ఆ ఫోటో తీసి చూస్తూ కూర్చుండిపోయాడు . ఇంతలో "ఎరా బిన్నిగా ! మేకలు వచినాయి గాని గొర్రెలు రాలేదురా . ఎడపోయినాయో ఏంటో పోరా చొక్రిగా " అరుచుకుంటూ వచ్చింది అవ్వ . అదిరిపడ్డాడు బిన్నీ .
అవ్వ పరిశీలనగా చూస్తూ ఓరిచొక్రిగా! నీకు పోటుక యాడిదిరా? అమ్మో నాకు తెలియకుండా ఇద్దరు కలిసి తిరునాళ్ళలో పోటుక దిగారా ? కట్నం రొక్కం తీసుకురాని ఆ పోరి పోటుక ఎందుకురా ! అవ్వ కోపం తో విసిరేసింది . బిన్నీ విసుగ్గా లేచి ఆ ఫోటో మళ్ళీ ఏరుకుని తన బీడు లోకి పరిగెత్తాడు .
మరుసటి రోజు ఎత్తైన పచ్చని కొండలు , ఎటు చూసినా పచ్చిక బయళ్ళు . గొర్రెలు మేకలు వాటి మేతలో లీనమై మేస్తున్నాయి . ఎప్పుడు చూసినా పారే సెలయేరు ఆ యేరు ఆ ఇంటి ముందు కొంకి కర్ర పట్టుకుని నీళ్ళను చూస్తూ అలానే కూర్చుంది పోయాడు బిన్నీ . "ఒరె బిన్నీ ! ఎక్కడినుంచో ఒక కేక . పచ్చని కొండల్లో నుంచి వచ్చే మార్గం వైపు చూసాడు బిన్నీ . అయ్యగారు , తనకి పిల్లనిచ్చిన మావా కలిసివస్తున్నారు .
బిన్నీ మనసు రెక్కలు వచ్చినట్లు ఆనందం తో ఒక్కసారే నింగికి ఎగసినట్లు అయ్యింది . ఒక్క నిమిషం లో పరుగు తీసి వాళ్ళను కలుసుకున్నాడు .
" నమస్కారం అయ్యగారూ !"
ఏరా బిన్నీ ! నీకు సుభ వార్త చెబితే ఏమి ఇస్తావురా ?"
" అయ్యా ! నేను తవరికి ఎమివ్వగలను ? పెదోన్నిగా !
" ఒరె అల్లుడు ! ఇందా గొర్రెలు అమ్మి రొక్కం పట్టుకొచ్చా తీసుకో" , అంటూ ఇవ్వబోయాడు మావ. "మావా నన్ను చమించు . మా అవ్వ ఏదో సెపితే ఏదో సేశాను . నాకు డబ్బు వద్దు , ఏమి వద్దు .గౌరీ కావాలి . గౌరీ గౌరీ !" అని ఏడుస్తూ చిన్న పిల్లాడిలా మావను కౌగిలించుకున్నాడు బిన్నీ .
అయ్యగారి పాదాలకు వందనం చేసాడు . "లే లేరా ! బిన్నీ గౌరి మా ఇంటి దగ్గర ఉంది . రా పోదాం ". అన్నాడు అయ్యగారు .
అక్కడ అయ్యగారింట్లో గౌరి కూడా బిన్నీ ని జ్ఞాపకం చేసుకుంటోంది . ఎట్టయినా కండలు తిరిగిన దేహం , నల్లని ఒత్తయిన జుట్టు , బలమైన చేతులు , పెద్ద కళ్ళు , ఎర్రని మోము ,బలిష్టమైన ఛాతి, మెడలో తాయత్తు కట్టిన నల్లని తాడు తోడగొట్టే మగతనం ఉట్టిపడే నా మావ బిన్నీ . కాని నిన్న తిరునాళ్ళలో చూసినప్పుడు చాల బాధ కలిగింది . ఎలా ఉండే నా బిన్నీ ఎలాగైపోయినాడు ? అని ఆలోసిస్తా ఉంది . ఇంతలో గౌరీ గౌరీ ! అని బిన్నీ గొంతు . బావా అంటూ కళ్ళ వెంట నీళ్ళు పెట్టేసుకుంది ఇలా చిక్కిపోయవేంటి బావా ! అని అంది గొంతు జీరబోతుండగా .
నేను ఎలా ఉంటె , నీకు ఏమైద్దిలే . నీవు వాడ్ని ఎవడ్నో జోడి కట్టుకుని తిరుగుతున్నవుగా తిరనాళ్ళలో సంబరంగా , వాడు చొక్కా , ప్యాంటు వేసుకున్నోడు, పైగా మంచోడు కదా . పోవేపో అని అమాయకంగా బాధగా అన్నాడు బిన్నీ . అయ్యగారు కలిగించుకొని " అదా బిన్నీ నీ సందేహం! అది నేను ఆడించిన నాటకం రా ! గౌరీ తల్లి , తండ్రి నన్ను పెద్దమనిషిగా ఎన్నుకుని నాకు వాళ్ళ సమస్య చెప్పుకున్నారు . ఆ తర్వాత నీకు జ్ఞానం కలిగించాలని , నీకు కనపడేటట్లు వాళ్ళ బాబాయి కొడుకుని వేసుకుని తిరగమని నెన్నె చెప్పా . అందులోను వాడిది వేరే దేశం రా , నువ్వు వాడిని చూడలా, అందుకే నీకు తెలియదు ."
ఒరె బిన్నీ ! నీ స్థానం గౌరీ మనసులో అట్లనే భద్రం గా ఉందిరా . ఈ మాట పూర్తి అవుతుండగానే గౌరిని కౌగిలించుకున్నాడు బిన్నీ .
గౌరీ తన చేతిలో మూట విసిరేసింది . ఇద్దరు ఒకళ్ల నొకళ్ళు పూర్తిగా అల్లుకుపోయారు .
" మా అవ్వ దగ్గరికి పోవద్దు . మళ్ళీ మనల్ని విడదీస్తుంది . డబ్బు కోసం వెల్లగొడుతుంది."
అయ్యగారు డబ్బు మూట తీసి బిన్నీ కి ఇచ్చారు . " నాకు ఎందుకు ఈ డబ్బులు ? ఇవి గౌరివి " అని గౌరికి ఇచ్చ్చాడు బిన్నీ .
దీనితో వేరే ఇల్లు కట్టుకుందాం అని సంతోషం గా చెప్పింది గౌరీ .
ఆశీర్వదించాడు అయ్యగారు .

0 comments:
Post a Comment