మిత్రులారా ! నేను ఇక్కడ కొన్ని వార్తపత్రికల్లోని వ్యాసాలు మీ ముందు ఉంచుతున్నాను . అవి మీరు కూడా చదవండి . పైన వ్యాసాలలో మనం ఒక విషయం గమనించ వచ్చు . అసలు జరిగిన విషయం ఒకటైతే వ్రాసిన వ్యాఖ్యానం మరొకటి . ఎవరి అభిప్రాయం వారి సిద్ధాంత కోణం లోకి వెళ్లి వ్రాస్తున్నారు . అసలు జరిగిన సంగతి వదిలేసి దాన్ని వారికి నచ్చిన , వారు నమ్మిన సిద్ధాంత పరంగా చూసి ఆ మూస లోనే దాన్ని వ్యక్తీకరిస్తున్నారు మనం చిన్నప్పుడు చదివిన ఆవు వ్యాసం లాగా . చివరకి ఈ పెద్దల రాతల వల మనం కూడా అన్ని విషయాలని కులం , మతం అనే కోణం లోనే చూస్తున్నాం . అసలు అవి మర్చిపోయి బ్రతకలేక పోతున్నాం . కొన్ని క్రింది కులాల గురించి ఆధునిక తరం వాళ్ళు మర్చిపోయారు . వీరి ఇంటికి వారు , వారి ఇంటికి వీరు వస్తు పోతూ ఉన్నారు , కలిసి చదువుకుంటున్నారు , పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు . ఇలా జనం ఆలోచనా విధానం లో మార్పులు వచ్చినా ఈ పైన ఉదహరించిన లాంటి వ్యాసాల వల్ల వీరు కొన్ని కులాల వారి గతాన్ని తవ్వి చూపుతున్నారు . నిజానికి విజ్ఞాన యుగం లో కూడా మన మనసులకి సంకెళ్ళు వేస్తున్నారు . ఒక విషయం మాత్రం నిజం అది ఏమిటంటే ప్రతి జీవి ఇంకొక జీవిని దోచుకోవటం నిజం కాదు కాదు .. సహజం అయిపొయింది . నిజానికి అన్ని మతాలలోను , కులాలలోను ధనవంతులు , బీదవారు ఉన్నారు అందువల్ల ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వారిని గుర్తించి ఆదుకోవాలి .తెలివితేటలూ ఉండి ఆర్ధిక కారణాల వల్ల చదువుకోలేని వారికి సహాయం చెయ్యాలి . ఈ మేధావులు అటువంటి విషయాలపై చర్చలు జరిపి , వ్యాసాలూ రాసి జనాన్ని చైతన్య పరచాలి . అంతేగాని ఇలా అన్నిటిని ఒకే మూసలో చూసి అన్నిటికి ఒకటే అర్ధం తీయరాదు . అందరికి మంచి జరగాలి . మనం ఆ దిశగా అడుగులు వెయ్యాలి
0 comments:
Post a Comment