🙏🌷*శ్రీమద్భాగవతము* 🌸ఓం నమో నారాయణాయ...ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే🌷🙏
🌻 దేవతలు నారాయణుని ఇంకనూ ఇట్లని స్తుతించిరి...... పూర్వము భూమి అంతయు జలమయమై పోగా మత్స్యమూర్తివై ఈ సమస్తమును, మమ్మును నీ ముట్టెపై కొమ్మును ఆధారముగా చేసి రక్షించితివి. నేడు వృత్రాసురుని వలన కలిగిన ఆపద తొలగించి రక్షించుట కొరకు వేడుచున్నాము. గాలికి పైకి ఎగిరి అనేక రూపములతో అలలు లేచి పడుచున్న మహా సముద్రమందలి జలములపై శయ్యను ఏర్పరచుకొని ఉన్నావు. సృష్టికర్త అంత వానిని నీ అభికమలమున నిలిపి రక్షించుచున్నావు. ఈ నీ నేర్పరితనముచే మమ్ము దయ చూపి రక్షింపుము. దేవతలమైన మేము సర్వలోక శరణ్యుడవైన నిన్ను శరణు జొచ్చితిమి. బలిష్ఠుడైన ఈ వృత్రాసురుని వలన కలుగు ఆపదల నుండి రక్షించి మమ్ము అనుగ్రహింపుము, అని స్తుతించుచున్న దేవతలకు వైకుంఠవాసియైన నారాయణుడు దర్శనమిచ్చెను.
శంఖము, చక్రము, గద ధరించి, వక్షస్థ్సలమున శ్రీవత్సము అను పుట్టుమచ్చపైన కౌస్తుభమణి దాల్చి ఉండెను. మణులు తాపిన మహా కిరీటము దివ్యభూషణముల కాంతులు కలిగి, భుజములకు కేయూరములు, చెవులకు కుండలములు కలిగి ఉండెను. వక్షస్థ్సలమున లక్ష్మీదేవి ఉన్నది. పచ్చని పట్టుబట్టకట్టుకొని తెల్ల తామరపువ్వు రేకుల వంటి కన్నులు కలిగి ఉండెను.
చుట్టునున్న సేవకులందరును తన వంటి రూపములే ధరించియున్నారు. అతడు చిరునవ్వు నవ్వుచుండగా అమృతము వర్షించుచున్నట్లు ఉండెను. దేవతలందరును కన్నుల కరవుదీర నారాయణుని దివ్య రూపమును దర్శించిరి..............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-328,329,330,331,332.
0 comments:
Post a Comment