ముందుగా ద్వాదశి గొప్పతనం గురించి కొంత ప్రస్తావించి తరువాత ఉసిరికి దానికి సంబంధంగురించి మిత్రులడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పటానికి స్వామి దయతో ప్రయత్నిస్తాను.
ఆషాడ మాసం లో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరం లో శయనించిన విష్ణువు ... కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రనుండి మేల్కొంటాడు., అలా నిద్రనుండి మేల్కొనిన మరుసటి రోజు క్షీరాబ్ధి ద్వాదశిగా జరుపుకుంటారు .
కృతయుగం లో దేవతలు , రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసారు కనుక ఆ రోజు క్షీరాబ్ధి ద్వాదశి " అని పిలుస్తారు .
అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక " చిలుక ద్వాదశి"
అమృతం కోసం సాగరాన్ని మధించారు గనుక "మధన ద్వాదశి"
ఈ ద్వాదశి నాడే శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేతం గా బ్రహ్మ , ఇంద్రాది దేవతల తో కలసి బృందావనానికి వెళ్ళారు కనుక ఈ రోజుని " బృందావని ద్వాదశి".
బృందా విష్ణువుల వివాహము (గాంధర్వ వివాహము) జరిగి బృంద తులసి చెట్టు గాను, విష్ణువు సాలగ్రామం (శిలగా)గా ఒకరిని ఒకరు శపించుకున్న రోజు గనుక " బృంద ద్వాదశి "
తులసీదేవిని శ్రీలక్ష్మీదేవిగా, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను భావిస్తారు.
అందుకే తులసి చెట్టుకు, ఉసిరి కొమ్మను కలిపి విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి వివాహం జరిపించినట్లునట్లు ఈ రోజు భావిస్తారు.
కొన్ని పురాణాల ప్రకారం క్షీర సాగరమధనం సమయంలో అమృతం కోసం అసురాసుర వివాదసమయం లో క్రింద పడిన అమృత బిందువుల నుండి ఉసిరి చెట్టు ఆవిర్భవించిందని నమ్ముతారు. అందువల్ల ఈ ఉసిరి అమృత ఫలములని, లక్ష్మీ దేవికి మిక్కిలి ప్రీతికరమని, ఎటువంటి వ్యాధినైనా తగ్గిస్తాయని నమ్ముతారు.
ఉసిరి ఫలాన్ని దానం చేస్తే అమ్మ వారు కనకధార కురిపిస్తుందని జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు నిరూపించారు.
క్షీరాబ్ది ద్వాదశి రోజు, కార్తీక పౌర్ణమి రోజు తులసి మొక్కతో పాటు ఉసిరి మొక్కను కూడా అలంకరించి, ఉసిరి దీపాలు వెలిగిస్తారు.
ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి ఘడియలలో ఉసిరి ఫలాన్ని స్వీకరిస్తే ద్వాదశవ్రతం పూర్తి చేసిన ఫలం వస్తుంది.
సేకరించి..తీసుకున్నాము ..పేరు దొరకాలేదు..!.🙏🌹
.🙏
0 comments:
Post a Comment