Pages

🌝15part నిరీక్షణ. కథానిక .......short story NI RIKSHN A. Last part🌝

       

Part 15
కాలం అలా అలా తిరిగిపోతోంది ...పిన్ని గారి ఇంట్లోనే కాలం గడుపుతోంది అరుణకుమారి ...ఉత్తరాలు ద్వారా ..తల్లి కూతుళ్ళు ..వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకొని కాస్తంత ఉపశమనం ..తో హాయిగా గాలి పీల్చు కుంటున్నారు ...తాను ఇక్కడ కూడా ఖాళీ గా ఉండకుండా పిన్ని బాబాయి సహాయం తో తనకు ఎంతో ఇష్టం అయిన చదువుని  కొనసాగించేలా ..వాళ్ళు ఎన్నో ఏర్పాట్లు చేశారు ...అందుకే ..ఇంట్లో ఉండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాను ....అమ్మా... నన్ను,  పిన్ని ..బాబాయి ఇక్కడ బాగా చూసుకుంటున్నారు ..ఏది ఏమైనా మన0 సేఫ్ జోన్ లో ఉన్నాము ..చాలా సంతోషం గా ఉంది అమ్మా ..నేను ప్రస్తుతం ఇక్కడ చెల్లెలు కు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ..సీటు వచ్చింది ..చెల్లెలు కు సహాయం గా  వెళ్ళు అని పంపిస్తున్నారు ...అక్కడికి వచ్చిన తరువాత నీ దగ్గరకు వస్తాను ..అమ్మా ...ఎప్పుడా .అమ్మని చూస్తాను ..అని  నాలో కూడా తొందర పెరిగిపోతోంది ....అక్కడ రాగానే తక్షణమే నిన్ను కలుసుకుంటాను ..అంటూ.. కూతురు అరుణ తల్లికి ఉత్తరాలు వ్రాస్తోంది ....అమ్మాయి ని జాగ్రత్తగా ఇంత కాలం కనిపెట్టుకొని ఉన్నందుకు ..మీకు ఎంతో ఋణ పడిపోయాను ..అని అక్క ఉత్తరంలో వ్రాయడం ...అంతంత మాటలు వద్దు అక్కా అని చెల్లెలు వ్రాయడం ..ఇలా అరుణకుమారి వాళ్ళ అమ్మ ..పిన్ని లు కూడా ఉత్తరాలలో వ్రాసేసుకుంటున్నారు .....
**.                                      **.                                    **.                          **
వెంటనే వచ్చేస్తున్నాను ..రాగానే కలుస్తాను అని చెప్పింది .నెలలు గడిచిపోతున్నా ..మనిషి ఇంత వరకు పత్తా లేదు ..ఏమిటి ఆలోచనల్లో పడిపోయింది అరుణకుమారి తల్లి ..చాలా కాలం అయిపోయింది ..అమ్మాయిని ఎప్పుడు...ఎప్పుడు  చూస్తానా ..అనే ఆరాట పడిపోతుంది ...ఆందోళన అపి పట్టుకోలేక కొడుకు కిరణ్ కి మొత్తం చెప్పింది ...తల్లి ...అవునమ్మా ..నాకు ఎప్పుడో తెలుసు చెల్లి.. పిన్ని ఇంట్లో ఉంది ..కంగారుపడవద్దు అని చెప్పాను ..నువ్వు వింటేనా ..నేను వెతక్కుండా ఎందుకు వున్నాను ..నాకు మాత్రం బాధ ఉండదా ..ఎక్కడో అక్కడ ప్రశాంతం గా ఉంది ..అని నేను తెలుసుకొనే ఆగాను ..ఇక్కడ మనం కొంత పనులనుంచి బయట పడగానే ..ఇద్దరం వెళ్ళి తీసుకొని వద్దాం ..మా మామయ్య గారు కూడా ఒక మంచి సంభ0ధం వెతికి పెండ్లి కూడా చేద్దాం ..ఆందోళన పడవద్దు అని ..నాకు గట్టిగా చెప్పారు ..అలానే మన ఊరు కూడా వెళ్లి ..మనకు తెల్సిన వారి సహాయంతో మ న పొలాలు మనకు చెందేటట్లు కృషి చేద్దాం అనికూడా మామయ్య గారు చెప్పారు ..ఇక ఒక్కోక్కటి చేసుకొందాం ..అలా చెప్పుకుంటూ పోతున్నాడు ..కిరణ్ ..అదేరా అస్సలు  ఇక్కడ యూనివర్సిటీ లో మీ పిన్ని కూతురు చదువుకుంటూ0ది. హెల్ప్ గా హాస్టల్ లో కొద్దిరోజులు ఉండటానికి ఇక్కడ కు వస్తానంది ..మన అడ్రెస్ ..నీ పెళ్లి విషయాలు ..ఊళ్ళో వచ్చిన తగాదాలు వల్ల కలుసుకోలేక పోయాము ఏమి అనుకోవద్దు ఇలా అన్నీ విషయాలు వివరించి వ్రాశాను ...వాళ్ళు కూడా ముందు మనం అందరం గోడవల్లో లేకుండా ప్రశాంతంగా ఉన్నందుకు చాలా సంతోషించు తున్నట్లు ఉత్తరాలు వ్రాశారు నువ్వు కూడా చదివావు గా ..అలా చెప్పుకుపోతుంది కిరణ్ తల్లి ...సరేనమ్మా ...రానీ ..ఇక్కడ అడ్రసు ప్రకారం మన0 వెళ్లి చెల్లిని కలుసుకుందాం ..ఇంటికి తీసుకువద్దాం ..ఓకే నా.. నువ్వు టెన్షన్ పడవద్దు ...ప్రశాంతం గా అన్ని పనులు చక్కబెడదాం ..ఓదార్చి నట్టు చెబుతున్నాడు కిరణ్ .
అలా కొద్దీ రోజుల తేడా తో అరుణ కుమారి యూనివర్సిటీ చేరుకోవడం ..హాస్టల్ లో ఉండటం ..ఒకరోజు శివ నారాయణ కు సన్మానం జరుగుతుంటే ఆ సభ లో పాలుగోవడం ...అన్ని జరిగిపోయాయి ...ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న శివనారాయణ దర్శనం అవడం ..దగ్గరనుంచి  చూడటం ..ఆ సభ  లో పాలుగోవడం .అన్నీ పూర్తి అయిపోయి ప్రస్తుతం ..పిన్ని కూతురి హా స్టల్ రూ0 లో ఉంది ..ఆ జ్ఞాపకాలతో సతమతం అయి ..దీనంగా ఉంది ..దుప్పటి ముసుకు పెట్టుకొని ఘోరంగా కళ్లనీళ్లు పెట్టుకుంటూ ఉంటే ....పిన్నికూతురు కల్గించుకొని ..ఊరడిస్తున్నట్లుగా ..మాట్లాడి ..అస్సలు ఎందుకు ఇంతలా ఏ డుస్తున్నావు అక్కా అని అడిగింది ..మనస్సు విప్పి చెబితే ..నాకు ఏదైనా ఒక ఆలోచన తడితే చెప్తా కనీసం బైటకు చెప్పుకుంటే నీకు మనస్సు తేలిక పడుతుంది ..అని చాలాసేపు అస్సలు విషయం తెలుసుకోవడానికి నానా తంటాలు పడింది పిన్నికూతురు
అప్పుడు మొదలు పెట్టి తన కాలేజి జీవితం గురించి ...చెప్పడం  ప్రారంభించింది ...
అలా. చెపుతూనే ఉంది ....శివనారాయణ ..తాను పక్క పక్క ఊరివాళ్ళు అవడం
పైగా ..వాళ్ళ కుటుంబం .అరుణా వాళ్ళ . స్వంత దేవాలయంలో అర్చకకుటుంబ0
గా రావడం ....ఇద్దరూ కల్సి చదువుకోవడం ..అరుణ వాళ్ళ నాన్నగారు అరుణ ని కాలేజి లో చేర్చి ...శివనారాయణ ని తోడుగా ఉండమని ప్రోత్సహించడం ..ఏ నాడు కూడా అమర్యాదగా ప్రవర్తించని ..అతగాడి నైజం ..ఇలా ఎన్నో విషయాలు
మంచి అనుభూతిగా చెప్పుకుంటూ పోతుంది ..అరుణకుమారి ......    మధ్యలో మధ్య లో  ..ఏదో ఒక పని చేసుకుంటూ అలా మాట్లాడుకుంటున్నారు ..అయినా ఇంకే శివనారాయణ లే..మ్మా. ఆయన పక్కన ఓ విదేశీ ఆమె ఉంది గా పెళ్ళిఅయ్యిఉంటుంది  వ్యుద్యోగం ..కాస్తంత సుఖపడుతున్నాడులే ..కానీ అది మ0చిదే గా ..కొంచం కోపంగా విసుగ్గా ఆడిపోసుకుంటున్నట్లు గా అంటుంది అరుణ ....నాకు డిన్నర్ వద్దు ...తినాలని లేదు .  అని అరుణ చెబుతూన్నా బలవంతం గా పెరుగు అన్నం కొద్దీ గా తినిపించింది  ఎలానో అలా....కాస్తంత దారిలో పడుతుంది లే అనుకుంటుంది ...ఆమె చెల్లెలు ...ఇక రాత్రి వేళ ..పున్నమి వెన్నెల ఇరగ కాస్తుంది కో0చెం చల్లగాలి కూడా వేస్తుంది ..అడవి మల్లెల గుబాలి0పులు...హాస్టల్ నిండా సువాసనలు ని0పేస్తున్నాయు ....ఎటు చూసినా ఆకుపచ్చగా ..మధ్యలో అక్కడ అక్కడ పూల గుత్తుల చెట్లు ...ఆ పక్కన పెద్ద కొండలు ..వెన్నెలో అందాలు ఇంకాస్త ఇనుమడిస్తున్నాయు. మంచాలపై దుప్పటి కప్పుకొని మాట్లాడు కొంటున్నారు ..టైం పెద్దగా అవలేదు ...ఇంతలో వార్డెన్ .నడుస్తున్న బూట్లు చప్పుడు .ఇద్దరు ..ముగ్గురు మాటలు పెద్దగా వినిపిస్తున్నాయి ....సార్ ఇదే రూమ్ నె0బర్ లో వుంటున్నారు ..అంటూ తలుపు కొడుతున్నారు ..మేడమ్ మేడమ్ అంటూ ..వెంటనే వచ్చి తలుపు తీసింది ...అరుణకుమారి ఏది అని పిలుస్తూ ..నేను శివ నారాయణ స్నేహితుడిని రాఘవులు ని ..వాడు అరుణ కుమారుని చూడటానికి వచ్చాడు ....పెద్దగా సంతోషంగా చెప్పాడు రాఘవులు ...అటుతిరిగి నిలబడింది
ఇంకే అతగాడు బాగుంటే చాలు ..మధ్యలో.నేను ఎందుకు ..లే ..నేను ఇక్కడ లేను అని చెప్పు ....చీర పమిటే నిండుగా కప్పుకొని మాట్లాడుతూంది అరుణ కుమారి ...ఆ మాటలు విన్న శివ నారాయణ ..సరే అమ్మయు గారు ..మీరు లేకపోతే నేను కూడా లేను ..కానీ ఇంత కాలం నేను ఎవ్వరి కోసం ఎంతగా తపస్సు చేశానో మీకే0 తెలుస్తుంది ...మీరు తప్పించుకొని పోయునప్పుడు ఆ రాత్రి మీ మనుషులు వచ్చి మమ్మల్ని ..నన్ను టార్చర్ పెట్టారు ..ఆయునా ఒక రాత్రి వేళ మా ఇంట్లోకి వస్తారు అని తెలిసి తలుపులు తీసి పెట్టి కిర్టీలోనుంచి మీ రాక కోసం ఎదురు చూశాను ..తెల్లవారి అడవి అంతా గాలించాను ..మీరు ఏమైపోయారో అని చాలాకాలం వెతికి వెతికి అలసిపోయాను ...ఇంతలా వెతుక్కుంటూ వస్తే ఇదేనా మేడమ్ మీరు అర్థం చేసుకుంది ..కృష్ణ కుమారి గారు సారి అరుణకుమారి గారు ....ఒక్కసారి మిమ్మల్ని చూసి వెళదామని వచ్చాను ..నా అన్నవాళ్ళు ఎవరూ లేరు ..నాకు మీరు .ఈ రాఘవ గాడు ఉన్నారని వెతుక్కుంటూ వచ్చాను ....మరి మీకే ఇష్టం లేనప్పుడు .మిమ్మల్ని బలవంత పెట్టలేను ..బహుశా ఇక మన0 కలుసుకోవడం కష్టం ..నేను నా దేశం వెళ్లిపోతున్నాను ...బై బై అమ్మాయి గారు ..జీవితంలో అందరూ దూరం అయిపోయారు అని బాధ పడేవాడ్ని మీకోసం మిమ్మల్ని ఒక్కసారి చూడాలని కలుసుకొని మాట్లాడుకోవాలని ఇంతకాలం బ్రతికి వున్నాను ... .ఏది ఏమైనా మీరు మంచిగా ఉంటే చాలు ....సంతోషంగా వెళ్లిపోతాను ...అంటూబైటకువచ్చి .. వెనుతిరిగాడు ..రాఘవులు కన్నీళ్లు పెట్టుకున్నాడు ..చూడమ్మా వాడు పెళ్లికూడా చేసుకోలేదు ..వాడికి దీనిమీద కోరిక కూడా లేదు..అనుకున్న చదువు ..అదీ నీ కలగా ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు ..వాడి అదృష్టమేమో నువ్వు కష్టపడకుండానే ..మాకు కనిపించావు నేను వాడికి అడ్రస్ చెప్పి పట్టుకొచ్చాను..నువ్వు కూడా పెళ్లికాకుండా ఉండి పోయావని నీ గురించి మొత్తం సేకరించాము .. ..వాడ్ని ఎలా ఆయునా పెళ్ళి చేసుకోమ్మా ..వాడికి జీవితం అంతా తోడుగా ఉండి సుఖపెట్టమ్మా ..ఇన్నాళ్లు కష్టాల కడలిలోనే ఉండిపోయాడు ..ఆదుకోమ్మా ..అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ బాధ పడుతూ వున్నాడు రాఘవులు .. ఇంతలో తాను కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ బొంగురు గొంతు తో బైటకు వచ్చి పిలూస్తుంది .అరుణ కుమారి .....ఒరేయ్ శివా ...అని కేక వేశాడురాఘవులు  ..వెనక్కి తిరిగి చూశాడు శివ నారాయణ పరుగున ఆమె రూమ్ వైపుకు వస్తున్నాడు ..లోపలికి దారి తీస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది అరుణ ...గబ గబా రూ0 లోకి దూకి క్రింద నుంచి లేపి పట్టుకున్నాడు ...కొద్దిసేపటి తరువాత గట్టిగా కౌగిలించుకొంది శివనారాయణ నాకు చెప్పకుండానే పరిశోధనలు చేసి అంతర్జాతీయి శాస్త్రవేత్త వి అయ్యావా ..మరి ఇద్దరం కలిసి చేద్దా0 అంటే వినలేదు ..అని కొంచం బాధగా అనేస్తుంది ..అరుణకుమారి ..ఎం చేయమంటావు ..పరిస్థితులు అనుకూలించలేదు ...ఇప్పడు కల్సి చేద్దాం ఏముంది ..అన్నాడు మెల్లగా నవ్వుతూ శివనారాయణ ...నన్ను క్షమించు ఇందాక ఏదేదో మాట్లాడాను ...పర్వాలేదు ఇటు కూర్చో ..ఇద్దరూ ఎదురు ఎదురు మాట్లాడుకొంటూ కూర్చున్నారు ..మళ్ళీ బయట శబ్దం ..ఒక విదేశీయురాలు ..ఆమె తో ఒక గ్రూప్ జనం రూ0 లోకి వచ్చారు ..బాగుందమ్మా ...మేము డిన్నర్ చేసి వస్తామంటే మాకు చెప్పకుండా ..నీ దగ్గరికి వచ్చేశాడు శివగారు ....బాగుంది మొత్తానికి మిమ్మల్ని కలుసుకున్నారు ..మేమంతా ..ఆయన శిష్యులం ..అక్కడ యూ.ఎస్ లో వారి దగ్గర పరిశోధన చేస్తున్నాము ...అక్కడ ఏ సభ లో అయినా నీ పేరే జప0 చేస్తున్నారమ్మా .....నువ్వు లేకపోయినా ..కనిపించకపోయినా డిప్రెషన్ లోకి పోతున్నారు ..ఇంత మేధావి ఏమైపోతాడో అని కాపలా కాస్తూ వెంట తిరుగుతూ ఉన్నాం ..హమ్మయ్య ఇప్పటికి మా మనస్సు  కుదుట పడింది ...అందరూ నవ్వుకున్నారు ...లేచి బైటకు నడుస్తున్నారు ..శివ నారాయణ మాత్రం తన కోటు తీసి అరుణ కి కప్పాడు ..బాగుంది కృష్ణకుమారి గారు ..వెరీబ్యూ టిఫుల్ ..ఉంచండి .వెంటనే పెద్దగా ఏడుస్తూ కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ శివ నారాయణ గుండెల పై వాలిపోయుంది దగ్గరకు తీసుకొని ..ఓదార్చాడు.రేపు వస్తాం బయటకు వెళ్లి అన్ని విషయాలు మాట్లాడుకుందాం ...బై చెప్పి కొత్త తేజస్సు తో ..రెట్టించిన ఉత్సాహం తో బైటకు నడిచాడు ..శివ నారాయణ ..అక్కా.. నువ్వు లక్కీ ....కొంటెగా నవ్వుతో0ది..ఇంతకాలంనీ ..నిరీక్షణ ఫలించింది.  ..అవునమ్మా ..దేవుని దయతో ..మళ్ళీ కలుసుకోగలిగాము .రేపు ..అమ్మా వాళ్ళ దగ్గరికి వెళదాం ..అన్నివిషయలు ..మాట్లాడుకుందాము ...ఇక పడుకో ...చెల్లెమ్మా ..అంటూ తనివితీరా మనస్సు పూర్తిగా నవ్వేస్తుంది ..అరుణకుమారి ..
                                    (The End................శుభం ............

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online