కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
🌹కార్తీమాసం లో తిరుమల తిరుపతి క్షేత్రములోనికపిలతీర్ధం లో కపిలేశ్వర స్వామివారి యాగ0 (రుద్రయాగం)🌹
🙏🌹శ్రీ వేంకటేశ్వర స్వామివారి పై బొమ్మల తో కూడిన గోవింద నామాలు చూడండి ..తరించండి 🌹🙏
🌹ఓం నమో వేంకటేశాయ..ఓం నమో నారాయణా య🌹
🌹🌹🙏శ్రీమద్భాగవతము... ఆ శ్రీమహావిష్ణుకథా మృతం సేవిద్దాం 🌹🌹🙏
🙏🌷*శ్రీమద్భాగవతము* 🌸ఓం నమో నారాయణాయ...ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే🌷🙏
🌻 దేవతలు నారాయణుని ఇంకనూ ఇట్లని స్తుతించిరి...... పూర్వము భూమి అంతయు జలమయమై పోగా మత్స్యమూర్తివై ఈ సమస్తమును, మమ్మును నీ ముట్టెపై కొమ్మును ఆధారముగా చేసి రక్షించితివి. నేడు వృత్రాసురుని వలన కలిగిన ఆపద తొలగించి రక్షించుట కొరకు వేడుచున్నాము. గాలికి పైకి ఎగిరి అనేక రూపములతో అలలు లేచి పడుచున్న మహా సముద్రమందలి జలములపై శయ్యను ఏర్పరచుకొని ఉన్నావు. సృష్టికర్త అంత వానిని నీ అభికమలమున నిలిపి రక్షించుచున్నావు. ఈ నీ నేర్పరితనముచే మమ్ము దయ చూపి రక్షింపుము. దేవతలమైన మేము సర్వలోక శరణ్యుడవైన నిన్ను శరణు జొచ్చితిమి. బలిష్ఠుడైన ఈ వృత్రాసురుని వలన కలుగు ఆపదల నుండి రక్షించి మమ్ము అనుగ్రహింపుము, అని స్తుతించుచున్న దేవతలకు వైకుంఠవాసియైన నారాయణుడు దర్శనమిచ్చెను.
శంఖము, చక్రము, గద ధరించి, వక్షస్థ్సలమున శ్రీవత్సము అను పుట్టుమచ్చపైన కౌస్తుభమణి దాల్చి ఉండెను. మణులు తాపిన మహా కిరీటము దివ్యభూషణముల కాంతులు కలిగి, భుజములకు కేయూరములు, చెవులకు కుండలములు కలిగి ఉండెను. వక్షస్థ్సలమున లక్ష్మీదేవి ఉన్నది. పచ్చని పట్టుబట్టకట్టుకొని తెల్ల తామరపువ్వు రేకుల వంటి కన్నులు కలిగి ఉండెను.
చుట్టునున్న సేవకులందరును తన వంటి రూపములే ధరించియున్నారు. అతడు చిరునవ్వు నవ్వుచుండగా అమృతము వర్షించుచున్నట్లు ఉండెను. దేవతలందరును కన్నుల కరవుదీర నారాయణుని దివ్య రూపమును దర్శించిరి..............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-328,329,330,331,332.
🌷🙏శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి అనుభవాలు 🌷🙏
🌹కోటాను కోట్ల సంవత్సరాలు నుంచి ఉన్న దైవం అఖిలా0డ కోటి బ్రహ్మ0డ నాయకుడు పదునాల్గు భువన భాండములు .ను సృష్టి0చి న వాడు.... పాలించేవాడు పోషించేవాడు శ్రీనివాస శ్రీవేంకటేశ్వరుని ...గురించి ఆ మహాత్మ్య0 గురించి స్వామీజీ ...అనుభవంలో ఏమి చెప్పారో చూద్దాము.....ఓం నమో వేంకటేశాయ 🌷🙏🙏🌷
🌝😀ఈ లింక్ లో నేటి రాజకీయ ఉంది ..ఆ మసాలా చూద్దాం 🌝😀
https://www.idreampost.com/te/news/political/mudragada-padmanabham-open-letter-to-chandrababu🌝
https://telugu.greatandhra.com/politics/political-news/chandrababu-naidus-self-goal--122286.html🌝
🙏🌹 శ్రీమద్ భాగవతం ..ఇ. కే ..ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు అందించింది 🌹🙏
[11/23, 7:56 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 ఆ వృత్రుని చూచి దేవతలందరును రోషపడి గుంపులుగా గూడి చుట్టుముట్టిరి. ( సృష్టిలో అందరును ఒకని యందు ఒకడు తప్పులు గమనించి, అసూయపడి దెబ్బతినిరి అని అర్థము.) వారు తమ విద్యలన్నియు ప్రదర్శించి అస్ర్తములు, మహాశస్ర్తములు వానిపై ప్రయోగించిరి. అతడు వాటినన్నిటిని పట్టుకొని భక్షించెను. అస్ర్తములను మ్రింగి మీదకు వచ్చుచున్న వృత్రాసురుని చూచి ఆ దేవతలందరును తమకు రక్షకుడెవడో తెలియక చెల్లా చెదరై పరుగెత్తిరి. వాని తేజస్సు యొక్క వైభవమునకు భయపడి చేయునది లేక కన్నులు మూసుకొని అంతర్యామిని స్మరించి ఇట్లని మొరపెట్టుకొనిరి.
వీనిని జయించుట సాధ్యము కాదు. ప్రయోగించిన మహాస్ర్తములన్నిటిని మ్రింగి మీదకు వచ్చుచున్నాడు. (ఎదుటివారిలోని తప్పులను గమనించి ఒకరినొకరు సరిదిద్దకోవలెనని యత్నించుటలోను, సంఘసంస్కరణలు మొదలగునవి తలపెట్టుటలోను తమలోనే రాక్షస గుణములు పెచ్చు పెరుగుటయు, సంస్కరణ ప్రయత్నములు వ్యర్థమై దురహంకార స్వరూపుడగు వృత్రునిచే మ్రింగబడుటయు వేదార్థముగా ఇతిహాసము చేయబడెను. దానితో పెద్ద పెద్ద వారు కూడా కర్తవ్యము తోచక అంతర్యామి స్మరణ వైపునకు మొగ్గుచున్నారు.)
వీడు సాటిలేనివాడు. వీనితో యుద్ధము చేయగలవాడుండడు. ఇప్పుడు నారాయణుడు తప్ప మనకు తోడ్పడగలవాడు లేడు. (ఎదుటివారిలో తప్పులను గమనించు లక్షణము పోవలెనన్నచో అంతర్యామి సాధనయే ముఖ్యమని అర్థము.)...........✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-321,322,324,324.
[11/23, 7:56 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻వృత్రాసురుడు ఒక్కమారు నోరు తెరువగా ఆకాశమును మ్రింగుచున్నట్లుండెను. నాలుక జాపగా గ్రహములను, తారకలను నాకి వేయునా అన్నట్లుండెను. ఉత్సాహమునకు విరగబడి నవ్వుచుండగా లోకములను మ్రింగుచున్నాడా అను భ్రాంతి కలిగెను. నలు దిక్కులకు వ్యాపించిన కోరలు వెలువడుచుండగా దిగ్గజములు, దంతములు ముక్కలై రాలుచున్నవా అనిపించెను. త్వష్ట అను ప్రజాపతి తపస్సుతో పుష్టి పొంది లోకములను ఆక్రమించు వృత్రాసురుని పద్ధతి అడ్డగింపరానిదై విజృంభించెను.
(విశ్వరూపుని చూచి తొందరపడి ఇంద్రుడు శిరస్సులు ఖండించుటతో వృత్రాసురుడు పుట్టెను. దేవదానవ గుణములలో దానవ గుణములు చెడ్డవి, వానిని గమనించుట, తొలగించుట అను ప్రయత్నములలో ఆ గమనించువారి లోపలనే సమస్త రాక్షస గుణములు పుట్టి ఆక్రమించును. ఈ లక్షణమే వృత్రాసురుడు. మిగిలిన రాక్షసులందరిని చంపవచ్చును గాని రాక్షస గుణములను ఇతరులలో గమనించి, వేటాడుట అను వృత్రాసుర లక్షణమును ఎవ్వరును జయింపలేరు. జయింప సాధ్యము కానంతగా లోపల వ్యాపించును. ఏ ఆయుధములకు గాని, ఉపదేశములకు గాని ఈ లక్షణము లొంగదు. దీని ఇతిహాసమే వృత్రాసుర కథ. ఇది వేద సంహితల కాలము నాటికే సుప్రసిద్ధమైన ఇతిహాసము.
వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, రామాయణ, మహాభారతములు మున్నగునన్నిటి యందును ఈ కథ వ్యాపించియే ఉన్నది.)...........✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)- 320.
[11/23, 7:56 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 వృత్రాసురుని చూచి భయపడిన దేవతలు వీనితో యుద్ధము చేయగల వాడుండడు అని భావించి తమలో తాము కంగారుపడి, తికమక పడి బయలుదేరిరి. వారికి కన్నులు కనుపింపలేదు. వృత్రాసురుని తేజోమయమైన వికృత రూపము చూచిన కన్నులతో ఎటు చూచినను ఆ రూపమే కనిపించెను. అట్లే తడువుకొనుచు వారందరును స్మరణమే ఆధారముగా పాలసముద్ర తీరము చేరిరి.
అందెటు చూచినను నారాయణుని కీర్తి లతలుగా ప్రాకి పూలగుత్తులు కదలాడుచున్నట్లు క్షీరసాగరమందలి అలలు, వానిపై ఎగురుచున్న నురుగు ముద్దలు దర్శన మిచ్చినవి. నిరంతరము నారాయణుని పాదారవిందములను సేవించుచున్న పుణ్యముద్రతో కూడిన దక్షిణావర్త శంఖములే ఎటు చూచినను కనిపించెను. నలుదెసల యందును కఠినములైన తిమింగలముల ముట్టెలపై కొమ్ములును, సొర చేపల ముట్టెలపై పెరిగిన గరికతో కూడిన పెద్ద పెద్ద కాడలవంటి మీసములను, మహా దేహములతో కూడిన తాబేళ్ళును తీవ్రవేగములతో పరువెత్తుచున్నవి. అవి వేటాడుచు ఈదుచుండుటలో గుండ్రముగా తిరుగుచున్నవి. ఈ గమనములకు భయంకరములైన సుడిగుండములు ఏర్పడుచున్నవి. ఆ సుడులకు ఆ జంతువులు కొట్టుకొనుట వలన పైకి లేచిన అలలు ఆకాశమున చెదరి బిందువులై తారకలవలె కనిపించుచున్నవి.
ఆ పాల సముద్రమున అందందు మహా పర్వతములు ఉన్నవి. వాని శిఖరాగ్రముల దాకా ఎగసి ఘర్షణ చెంది దిగువకు ప్రవహించుచున్న క్షీరములు సెలయేళ్ళ వలె ఉన్నవి. అట్లు క్షీరములు దిగువకు ప్రవహించినపుడెల్ల పలు విధములైన ఆకారములతో పర్వతములు గుహలు, లోయలు వెలువడుచున్నవి. అవి పురాణ పురుషుని నిర్మలాంతఃపురముల వలె కనుపించుచున్నవి. వాని వెంబడి జారుచున్న అలల ఆకారములలో అనేక శిల్ప వైభవములు గోచరించుచు ఊహింపరాని నారాయణుని మహా భవన నిర్మాణ కుశలతను తెలుపుచు ఆ క్షీరములు తళుకుమనుచున్నవి............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-325,326.
[11/23, 7:56 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 అతి పవిత్ర గుణములతో విచిత్ర రూపములు ధరించిన నారాయణుని భార్యల ప్రేమయు, ఆనందస్థితి అందు గోచరించుచున్నవి. (శ్రీదేవి, భూదేవి యొక్క వైభవములు గోచరించుచున్నవి.) వారి ప్రేమానందములను గమనించి తన హృదయమందలి కరుణారసముతో కలిపి అతడు మరల తన ప్రేమను ప్రసరింపజేయుచున్నాడనుటకు నిదర్శనముగా పగడముల తీగలు అల్లుకొని వ్యాపించి ఉన్నవి.
అందు ప్రవహించుచున్న సముద్ర జలములు సిద్ధరసములైన క్షీరములు వానితో సంగమము చెందుటకు అనేక మహా తీర్థముల జలములు వచ్చి ఘర్షణ చెంది, చాలా ఎత్తుగా ఎగిరి పడుచున్నవి. దానితో ఆకాశ ప్రదేశము అంతయు శబ్దముతో నిండిపోయినది. సముద్ర తీరము భూదేవికి మొలనూలు వలె అలంకరింపబడి ఉన్నది. దాని వైపునకు ప్రసరించుచున్న పలుచని అలలు భూదేవి ధరించిన పట్టు వస్ర్తముల వలె ఉన్నవి.
విష్ణువు గాని, శివుడు గాని, ఏ దేవతలు గాని అమృత దానము చేయవలసిన సందర్భము కలిగినపుడు వెదకికొనక్కరలేదు. ఇచ్చట మహానిధి ఉన్నది అని తెలియుచున్నది. ఆ క్షీర సాగరమున తెల్లని దీవిపై వైకుంఠపురమున్నది. అచ్చటి పుర ప్రముఖులు కోరికలను ఫలింపజేయు కల్పవృక్షముల జాతులతో కూడిన మహా వృక్షముల వనములున్నవి.............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-325,326.
[11/23, 7:56 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 కుబేరుని ధనాగారమునందు పద్మము, మహా పద్మము, శంఖము, మకరము, కుచ్ఛపము, ముకుందము, కుందము, నీలము, వరము అను మహానిధులు ఉండును. అట్లే ఈ పాలసముద్రమున మహాపద్మరాగములు, శంఖములు, మకరములు, కుచ్ఛపములు (తాబేళ్ళు), ముకుందములు, కుందములు (కొన్ని జాతుల రత్నములు) నీలములు మొదలగు శ్రేష్ఠములైన సామాగ్రి ఉన్నది. విష్ణుమూర్తి హస్తమునందు సుదర్శన చక్రము తిరుగుచున్న ఠీవి ఉండును. ఈ పాల సముద్రమునందు సుదర్శనములైన (చక్కని దర్శనము ఇచ్చునట్టి) సుడులు ఠీవిగా తిరుగుచుండును. కైలాస పర్వతమున అమృత కళలకు స్థానమైన చంద్రుని శిరస్సు ధరించిన పరమేశ్వరుని దర్శనము అగును. ...
🌷🌷🌷🙏 జై శ్రీమన్నారాయణ ....జై జై శివనారాయణ ...జై జై సాయి నారాయణ 🙏🌷🌷🌷
అట్లే ఈ క్షీర సాగరమున చంద్రుడు పుట్టి తన కిరణములను ప్రసరింపజేయుచున్నాడు. ఇంద్రుని వైభవము కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అనువానితో పుట్టుచుండును. ఈ పాల సముద్రమున ఆ కల్పవృక్షాదులు తామే పుట్టినవి. పూర్వము సుగ్రీవుని సైన్యమున అంతులేని హరి రూపముల (కోతుల) సంచారముండెను. ఈ పాలసముద్రమున హరియైన విష్ణుమూర్తి బహురూపములతో సంచరించుచుండును.
ఈ క్షీర సాగరము నారాయణుని గర్భము వలె సమస్త సృష్టి భారమును భరింపగలిగియున్నది. శంకరుని జడల చుట్టవలె ఆకాశ గంగానదిచే ఆక్రమింపబడి ఉన్నది. బ్రహ్మలోకమువలె హంసల చేతను (శ్వాసల చేత), పరమహంసల చేతను సేవింపబడుచున్నది. పాతాళలోకమున అనంతుడు అను భోగిరాజు నిలుచుటకు తావున్నది. అట్లే క్షీర సాగరమున కూడా ఆదిశేషుడు చుట్టుకొని విష్ణుమూర్తికి శయ్యగా ఉండును. నందనవనమున ఐరావతము, మాధవీలత, రంభ (అరటి చెట్టు) జన్మించి పెరుగుచుండును. ఈ క్షీరసాగరమున ఐరావతములు (మెరపులు), మాధవీ (లక్ష్మీదేవి), రంభ అను అప్సరస పుట్టిరి.............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-325,326.
🌷🌷🌷చిన్న జీయర్ వారికి సీఎం జగనరెడ్డి గారి పాదాభివందనం🌷🌷🌷
జగన్ క్రితం సంవత్సరం ...తిరుపతి స్వామివారి దర్శనం చేసుకోవడం ..అనేక వంకలు వెతికి కోర్టులోవేశారు ..కోర్టు ఏమంది ..అందరి ప్రజలు తరుపున రాజ్యాంగ బద్ధమైన..ఎన్నికల్లో వచ్చినవాడు.. అన్ని కులాల అన్ని మతాల కు ప్రతినిధి రాష్ట్ర ముఖ్యమంత్రి ....ఆయనకు ఇష్టమై నది ..నమ్మకం ఉండబట్టే ..ఏడుకొండల కు వచ్చి తల వంచి నమస్కారం చేశాడు . కాబట్టి అది చాలు ..ఇంకా ప్రత్యేకంగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదు...అని కోర్టు కొట్టేసింది ..కాబట్టి అస్సలుఅఖిలాండ కోటి బ్రహ్మ0డ నాయకుడు. ఆ మహానుభావుడి దయ పట్టి ఉంటుంది ....అంతే కాని ప్రతి దానికీ ఒక విమర్శ తయారుచేసి ..వాట్సప్ లు నింపే సే మా లాంటి జనాల వల్ల ఏం జరగదు ...అక్కడ ఓటు వేసే జనాలు వాళ్ళ అనుభవాలు ..వాళ్ళ కి జరిగిన అభివృద్ది ప్రజా సంక్షేమం ..ఆ ఫలితం వాళ్ళు నిర్ణయిస్తారు ..ఇక ఎవరో అడిగారట ..ఏమండీ జగన్ జీయర్ స్వామి వారిని తాకాడు వచ్చి ఆశీర్వచనం. తీసుకున్నాడట కదా అని వాళ్ళ వాళ్ళు .ఏదో విమర్శించారట ..నువ్వు చెప్పు అని ఒక శ్రీ వైష్ణవము తీసుకున్న ఆమెను రెచ్చగొట్టారట ...ఆమె దానికి బదులు ఇస్తూ ...వాడు కుక్క ..మాస్వామిని ముట్టుకుంటే ఏమవుతుంది ...అలా ఒక గౌరవప్రదమైన వారిని అలా మాట్లాడవచ్చా ...అది ఆమె కు వాళ్ళ పెద్దలు నేర్పిన సంస్కారం కాబోలు .అస్సలు శ్రీ వైష్ణవము లో అన్నిరకాల ప్రజలకి స్థానము ఉంది ..12 మంది ఆళ్వారులలో అన్ని కులాల వారు ఉన్నారు ..పైగా ఒక సూద్రుడు వ్రాసిన ప్రభ0దాన్ని ...నాలాయుర దివ్య ప్రబంధం ..ని స్వామివారి ముందు నిష్టాగరిస్టులయున ..శ్రీ వైష్ణవ పండితులు ..జీయంగార్లు అంతా శిరస్సు వంచి చదువుతారు .....అలానే స్వామివారికి అంత బంగారం వున్నా ..ఎవరో ఇతర కులస్తుడు..రొజూ భక్తి తో పెట్టిన నైవేద్యంగా.కుండ పెంకు లో కాస్తంత వెన్న పెట్టి తలుపులు వెసేస్తారు ..బ్రిటీషువాళ్ళు వైష్ణవ జనం బొట్టుల గొడవ లు పడుతుంటే అందరిని లోపల వేసి ఒక బొట్టు మోడల్ ని ఎంపిక చేసి0ది ఆ క్రీష్టానివాళ్లే గా ..అస్సలు ఈ పూజావిధానం ..ఉత్సవాల టైం టేబుల్ తయారు చేసిందే వాళ్ళు .క్రీస్టియన్ జేసుదాసుఎప్పుడో పాడిన కీర్తనలుకూడా స్వామివారి ముందు గాత్ర సేవ గా ఉంచుతూనే వున్నారు ..ఒక ముస్లించేయుంచి పెట్టిన బంగారు కమలాలు. స్వామి వారి పూజలో మూల విరాట్టు ని తాకు తూనే ఉన్నాయి ..బీబీ నాంచారి అమ్మవారు ని స్వామిఎలాగూదగ్గరకు తీసుకున్నారు ..ఇలా చాలా చెప్పవచ్చు .సీఎం కూడా ఒక మతం లో ఉండి పేరు బడి మ న స్వామి వారి దగ్గరకి వచ్చి తల వాల్చి మన స్వామి వారి బొట్టు ధరించి ..తల పై స్వామి వారి వస్త్రాలు పట్టుకురావడం మే మనకు గర్వ కారణం ...అస్సలు క్రీస్టియాన్లు తల మీద ఇంకో మతం చిహ్నాలు ధరించరు ...వాళ్ళు ఓట్లు కోసమో జనం కోసమో చేసినా ..మన మత0 తల మీద ధరించాడు కదా అది చాలు ..ఇక ఊరికే కోడి గుడ్డు పై ఈకలు పీకడం తప్పా ..ఏమీ ఉండదు ..ఏదైనా ఇటువంటివి పెడతాము అనుకోండి ..ఇక ఆ మధ్య చరిత్ర విషయం ..బిబినా0చారి విషయం తేవద్దు ..అని మాన గ్రూప్ లో పెద్దాయన ..కళ్ళు ఎర్ర చేసి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది ..ఎందుకు సార్ పీకేయండి మీకు నచ్చదు ..కదా నేను చరిత్రవిషయాలను చెప్పద్దు అంటే ఎలా ..నేను కొన్ని నిజాలు తెలుసుకోమని చెబుతున్నాను కానీ మన ఆర్ష ధర్మ0 వదులుకోమని నేను వ్యతిరేకం అని చెప్పడం లేదుగా చరిత్ర చదివిన వాళ్ళం కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది .ఈ మధ్య చరిత్ర పుస్తకాలు వ్రాసే ఒకాయన సీనియర్ జర్నలిస్ట్ నాతో వాదిస్తారు .బిబినంచారి విషయం లేదట ...అది ఫేక్ ..అట..అలానే దళితులను అస్సలు అవమానించి అంటరానితనం....పాటి0చడం ఇవేమీ లేవు అట ..ఇదంతా బ్రిటిష్ వాళ్ళ ఎత్తుగడలు అట ..ఇవన్నీ ట్రాష్ ఫేక్ ..అని చెబుతారు ..కానీ వాళ్ళు అల్లే కథలు ఇందిరాగాంధీ.. నెహ్రూ లని ..తిట్టేవి ..వాళ్లపై వచ్చేవి అభూతకల్పనలు మాత్రం ...నిజం గా మేము నమ్మాలి ....ఇక హిందూమతం ...హిందూ అని గొంతు చించుకొని ఉపన్యాసాలు ఇస్తుంటారు
🌷🙏కార్తీకపౌర్ణమి ...శివకేశవుల ఆరాధనా విశేషాలు🌷🙏 మరింగంటి మురళీకృష్ణ
🌹🙏ఓం నమో నారాయణాయ ...ఓం నమో వేంకటేశా య ....శ్రీ శివ కేశవం మహనారాయణ0🌹🙏
🌷🙏Personality development...selfmotivation🙏🌷
*అర్జెంటినా నుండి పార్న్ స్వాలొ అనే చిన్న పక్షి తన జాతిని పెంచుకోడానికి ఒక్కో సంవత్సరము ఫిబ్రవరి నెల లో మొదలై 8300 km ప్రయాణం చేసి మార్చ్ నెల చివరలో కాలిఫోర్నియా చేరుకుంటుంది ......* *కాలిఫోర్నియా లో ఒక సురక్షితమైన ప్రదేశంలో నివాసం ఏర్పరుచుకుంటాయి. తన వంశాన్ని వృద్ధి చేసుకుని అక్టోబర్ లో తన పక్షి పిల్లలతో తిరుగు ప్రయాణం చేస్తాయి ..... ఇందులో వింత ఏముంది అంటారేమో .... కానీ అవి దాదాపుగా 16600 km ప్రయాణం చేస్తాయి .... అవి ప్రయాణం చేస్తున్న మార్గంలో ఎక్కడ కూడా ఒక్క అడుగు భూమి కనిపించదు. ప్రయాణం అంత సముద్రమార్గమే ..... అందుకే అవి అర్జెంటీనాలో బయల్దేరే ముందు , ఒక చిన్న పుల్లను వాటి సహాయార్థం తీసుకుంటాయి ..... అవి అలసిపోయినప్పుడు , ఆకలివేసినప్పుడు , ఆ పుల్లను నీటిపైన వేసుకుని సేద తీరుతుంది ..... అలాగే దొరికిన ఆహారంతో ఆకలి తీర్చుకుని మళ్ళి ప్రయాణం మొదలెడుతుంది . ఇలా ఒక చిన్న పుల్ల ఆధారంతో ...... చిన్న పక్షి అంత అంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది అంటే అవి వాటిపైన పెట్టుకున్న నమ్మకం , పట్టుదల . పక్షులువాటికే వాటిపైన అంత నమ్మకం ఉన్నప్పుడు ...... దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు మన మీద మనకు ఇంకెంత నమ్మకం ఉండాలి , ఇంకెంత పట్టుదల ఉండాలి ప్రయత్నిద్దాం ఓడిపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిద్దాం సాధించలేనిది ఏది లేదు కదా…
🌷🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷
🌷🌷🌷🙏ద్వాదశినాడు జరుపుకొనే ఉసిరి....తులసి శ్రీ మహా విష్ణువు కళ్యాణం 🙏🌷🌷🌷
ముందుగా ద్వాదశి గొప్పతనం గురించి కొంత ప్రస్తావించి తరువాత ఉసిరికి దానికి సంబంధంగురించి మిత్రులడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పటానికి స్వామి దయతో ప్రయత్నిస్తాను.
ఆషాడ మాసం లో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరం లో శయనించిన విష్ణువు ... కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రనుండి మేల్కొంటాడు., అలా నిద్రనుండి మేల్కొనిన మరుసటి రోజు క్షీరాబ్ధి ద్వాదశిగా జరుపుకుంటారు .
కృతయుగం లో దేవతలు , రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసారు కనుక ఆ రోజు క్షీరాబ్ధి ద్వాదశి " అని పిలుస్తారు .
అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక " చిలుక ద్వాదశి"
అమృతం కోసం సాగరాన్ని మధించారు గనుక "మధన ద్వాదశి"
ఈ ద్వాదశి నాడే శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేతం గా బ్రహ్మ , ఇంద్రాది దేవతల తో కలసి బృందావనానికి వెళ్ళారు కనుక ఈ రోజుని " బృందావని ద్వాదశి".
బృందా విష్ణువుల వివాహము (గాంధర్వ వివాహము) జరిగి బృంద తులసి చెట్టు గాను, విష్ణువు సాలగ్రామం (శిలగా)గా ఒకరిని ఒకరు శపించుకున్న రోజు గనుక " బృంద ద్వాదశి "
తులసీదేవిని శ్రీలక్ష్మీదేవిగా, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను భావిస్తారు.
అందుకే తులసి చెట్టుకు, ఉసిరి కొమ్మను కలిపి విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి వివాహం జరిపించినట్లునట్లు ఈ రోజు భావిస్తారు.
కొన్ని పురాణాల ప్రకారం క్షీర సాగరమధనం సమయంలో అమృతం కోసం అసురాసుర వివాదసమయం లో క్రింద పడిన అమృత బిందువుల నుండి ఉసిరి చెట్టు ఆవిర్భవించిందని నమ్ముతారు. అందువల్ల ఈ ఉసిరి అమృత ఫలములని, లక్ష్మీ దేవికి మిక్కిలి ప్రీతికరమని, ఎటువంటి వ్యాధినైనా తగ్గిస్తాయని నమ్ముతారు.
ఉసిరి ఫలాన్ని దానం చేస్తే అమ్మ వారు కనకధార కురిపిస్తుందని జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు నిరూపించారు.
క్షీరాబ్ది ద్వాదశి రోజు, కార్తీక పౌర్ణమి రోజు తులసి మొక్కతో పాటు ఉసిరి మొక్కను కూడా అలంకరించి, ఉసిరి దీపాలు వెలిగిస్తారు.
ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి ఘడియలలో ఉసిరి ఫలాన్ని స్వీకరిస్తే ద్వాదశవ్రతం పూర్తి చేసిన ఫలం వస్తుంది.
సేకరించి..తీసుకున్నాము ..పేరు దొరకాలేదు..!.🙏🌹
.🙏
🌷🙏చిన్న జీయర్ స్వామి వారి మాటల్లోశ్రీవైష్ణవమతం part...2🙏🌷
🌹 ఓం నమో నారాయణా య ...ఓం నమో వేంకటేశా య 🌹
🙏🙏🌷నాగదేవతఆదిశేషుని దయ ....భాగవత ములో ఇంకా ఇలా🙏🙏🌷
🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 స్తోత్రములు, స్తోమములు, స్తోభములు మున్నగు వివిధ సామలతో స్తుతింపబడుచున్న ఛందోమయదేహుడైన గరుడుడు సమస్త బాధల నుండి రక్షించుగాక! శ్రీహరి యొక్క నామములు, రూపములు, వాహనములు మొదలగునవి దివ్యాయుధములై మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను రక్షించును గాక.
(ఇచ్చట సాధకుని మనస్సు, బుద్ధి, ఇంద్రియములు మొదలగునవియే ఆయుధములుగా పనిచేయునని అర్థము. అవియే భక్తుల యెడల భూషణములుగా వర్తించునని మూలమున ఉన్నది. ఇది అనువాదమున విడువబడినది.)
సమస్తమును భరించుచున్న ఆదిశేషుని మూర్తి ఉపద్రవములన్నిటిని తొలగించును గాక! ఈ విశ్వము యొక్క రూపమే నారాయణుని రూపముగా ధ్యానము నిలిచినవానికి నారాయణుడు వికల్పము లేనివాడు. అతడు తన మాయచేతనే తన శక్తులన్నిటిని భూషణములుగను, ఆయుధములుగను ధరించి వెలుగొందుచుండును. అట్టి లక్ష్మీసహిత నారాయణుడు వికల్ప విగ్రహముల నుండి నన్ను రక్షించునుగాక. (వికల్ప విగ్రహములనగా చూచువానిచే కల్పింపబడునట్టి సృష్టి రూపములు. మట్టితో కుండను కల్పించినపుడు కుండయే జ్ఞప్తి యుండును గాని మట్టి ఉండదు గదా! అట్లే భగవంతుని రూపములను చూచుచు మనము జంతువు, చెట్టు మున్నగు వానినే గుర్తుంచుకొందుము గాని భగవంతుని రూపములను గుర్తుంచుకొనము గదా! ఇంకను చుట్టరికములు మున్నగు వానిని కల్పించుకొని ఏవో చిక్కులలో పడుచుందుము. ఇవియే వికల్ప విగ్రహములు అట్టివాని నుండి మనస్సును భగవంతుడే రక్షింపవలెను.)
భయంకరమైన తన నవ్వుతో వెలుగులు వెలువడజేయుచున్న పెద్ద నోరు గల నృసింహమూర్తి దిక్కులందును, దిక్కుల సందులందును, క్రింద మీద సమస్త ప్రదేశములందును కాపాడుచుండును గాక!......✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-306.
🌹🌹🌹ఓం నమో నారాయణాయ ...ఓం నమో వేంకటేశా య ...శివ కేశవం మహా నారాయణ0🌹🌹🌹
🌹🌹నాగుల చవితి శుభాకాంక్షలు ....పండుగ గురించి కొన్ని విశేషాలు🌷🌷
*_ నాగుల చవితి శుభాకాంక్షలు _*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*ఆశ్లేష , ఆరుద్ర , మూల , పూర్వాభాద్ర , పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు.* సర్పము అనగా కదిలేది , పాకేది. *నాగములో *‘న , అగ’* ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని *‘నాగము’* అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది *‘కాలము’* కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా *‘కాలనాగు’* అని అంటారు.
జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా *‘నాగం’*. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు. కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా *‘ఉరగముల’* మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం , సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది. కార్తీకమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం , ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు , అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య , శంకరునికి ఆభరణము కూడా సర్పమే. కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది.
కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ , నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తీకమాసం నెలరోజులు కాకపోయినా కనీసం *కార్తీక శుద్ధ చవితినాడు* నాగులను ఆరాధించాలి. చవితి అంటే నాల్గవది అనగా *ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో* నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితినాడు దేవాలయాలలో , గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.*
ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును , పుట్టను , రాయిని , రప్పను , కొండను , కోనను , నదిని , పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత.
నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే *"నాగుపాము"* ను కూడా నాగరాజుగా , నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.
ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది.
దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు , రెండు పాములు మెలికలు వేసుకొని రావి , వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు , వైవాహిక , దాంపత్య దోషాలు , గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం , కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. *కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.* ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయిఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి *" నీటిని"* ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ , పరోక్షంగా *" రైతు "* కు పంటనష్టం కలగకుండా చేస్తాయట !. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా - సంహితల్లో , బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ , ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు , కర్కోటకుడు , వాసుకి , శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.
కద్రువ నాగ మాత , మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే - ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు , రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది.
దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన , ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి. సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.
వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం *‘నాగ పంచమి’* పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి , రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో *‘కార్తీక శుద్ధ చవితి’నాడు* మనం *‘నాగుల చవితి’ని* పర్వదినంగా ఆచరిస్తున్నాం.
పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు !.
పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.
*‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని , వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’* అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి , సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే , నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం.
పంట పొలాలకు శత్రువులు ఎలుకలు , వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే , మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా , విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.
*ఆధ్యాత్మిక యోగా పరంగా :-* ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను *' వెన్నుపాము'* అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో *"పాము"* ఆకారమువలెనే వుంటుందని *"యోగశాస్త్రం"* చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో *'సత్వగుణ'* సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు *' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు"* నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వార తెలుస్తుంది.
నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం*
పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.
*”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్ పాలయంతి”* అనేది ప్రమాణ వాక్యం , అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.
*నాగుల చవితి మంత్రం*
పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
అనంత
వాసుకి
శేష. ఈ సర్పములు పేర్లు తలచుకొని నమస్కారం చేసుకోండి నాగదోషం పోతుంది అని
పద్మ. శాస్త్ర పండితులు చెబుతారు 🙏🌹
కంబాల
కర్కోటకం
ఆశ్వతార
ధృతరాష్ట్ర
శంఖపాల
కలియా
తక్షక
పింగళ
ఈ ప్రపంంచంలో పాములు, ఆకాశం , స్వర్గం , సూర్యకిరణాలు , సరస్సులు , బావులు చెరువులు నివసిస్తున్నాయి. ఈ రోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు.
*పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .*
*నడుము తొక్కితే నావాడు అనుకో*
*పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో*
*తోక తొక్కితే తోటి వాడు అనుకో*
*నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి.*
ప్రకృతిని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము. పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.
మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత. బియ్యం , రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట. ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం. పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు. ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.
🌺🙏నాగుల చవితి శుభాకాంక్షలు ..శేషుని ..మరియు ఇంకా ఇతర దేవ తా సర్పములు గురించి తెలుసుకొని చదివిన మనల్ని ఆవరించి ఉన్న దోషములు పోవును..మంచి శుభాలు జరుగును 🌷🙏
[5/28, 7:31 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 బలి భూదానము చేయునపుడు వామనుని కేవల బ్రహ్మచారి అని తలవక సకల భూతాంతర్యామిగా తలచి ధారదత్తము చేసెను. కనుక వెంటనే శ్రీహరి త్రివిక్రముడై దర్శనమిచ్చెను. తనది అగు సమస్తమును అపహరించి తాను మిగులునట్లు చేసెను. దానికి మోక్షమే ఫలమయ్యెను. ఇతడు ఎచ్చట ఉన్నను అచ్చట మోక్షలోకము సాక్షాత్కరించి ఉండును. పై లోకముల వారికి కూడా మోక్షము అనునది కంటికి కనపడదు కదా! ఇట్టి వ్యామోహములు తీరిన బలి చక్రవర్తిని అధోలోకమున ఉంచెను.
అంతర్యామిని చూచువానికి అంతర్యామి లోకమే గాని ఇతర లోకములు ఉండవు. లోకముల భేదములు, లేత ముదుళ్లు, మంచి చెడ్డలు వివేకించుకొనువానికి ఆ లోకములే ఉండును కాని అంత్యర్యామి ఉండడు. తుమ్ము, దగ్గు, ఆవులింత కలిగినపుడుగాని, కాలుజారుట, పడుట కలిగినపుడు గాని భగవంతుని నామస్మరణ చేయగల అంతర్యామి బుద్ధి కావలెను. అది కలవాడు మాత్రమే కర్మబంధముల నుండి విడివడి జ్ఞానస్వరూపుడు అగును. అట్టి వాసుదేవుడు ఆత్మజ్ఞానమును ఇచ్చి భక్తులను పోషించునే గాని ఐహిక భోగ భాగ్యములను ఎట్లు ఒసగునని భావింపరాదు.
అతడు పూర్వము బలిచక్రవర్తిని ఎందులకు యాచించెను? ఇంద్రునికి ఇచ్చుటకు కాదు. బలిని సమస్త సంపదల నుండి వేరు చేసి తనను తానుగా నిలబెట్టుటకు. అట్లు నిలబెట్టబడినపుడు మనస్సు ఎట్లు పని చేయవలెనో అదే నిజమైన పరీక్ష. తానొక్కడే మిగులునట్లుగా సంపదలను హరించి వరుణ పాశములతో బంధించినపుడు బలీంద్రడు ఏమనెనో వినుము:..............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-113
[5/28, 7:31 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻తానొక్కడే మిగులునట్లుగా సంపదలను హరించి వరుణ పాశములతో బంధించినపుడు బలీంద్రడు ఏమనెనో వినుము: దేనియందును కోరిక లేకుండుట భగవంతుని లక్షణమని ఇప్పటికి తెలిసికొంటిని. ఇంద్రాది దేవతలు ఏ కారణము చేత దేవుడు కాలేకపోయిరి? ఇంద్రుని తమ్మునిగా పుట్టినను వామనుడే దేవుడు ఎందులకు అయ్యెను? ఇంద్రాదులు స్వర్గమును కోరి ప్రార్థించిరి. కనుక దేవతలయ్యి దేవుడు కాలేకపోయిరి. వామనునకు కోరికయే లేదు. ఇంద్రుడు కోరెనని యాచించెను. తనకు ఏమియు లేనివాడే సమస్తము తాను అగును. చూడుడు! కాలమునందు సమస్తము పుట్టుచున్నది. అందేదియు కాలమునకు అక్కరలేదు. మనువులు మన్వంతరములు కాలములోని భాగములోని భాగములే కదా! అట్లని కాలము మన్వంతరాధిపత్యము కోరుచున్నదా!
పూర్వము మా తాత ప్రహ్లాదుని చూచి ఈ వామనుడే నృసింహ రూపము పొందినపుడు నీకేమి కావలెనని ప్రశ్నించెను. లోకత్రయాధిపత్యము ఇమ్మందువా అని ప్రశ్నించెను. అప్పుడు ఈ దేవుని ఆజ్ఞ శిరసావహించి కూడా మా తాత యేమని కోరెను? తండ్రి రాజ్యము తనకు ఇమ్మని కోరలేదు. భగవంతుని సేవ నిరంతరము చేయుటకు అవకాశము ఇప్పింపని కోరెను. దానితో అతని జన్మ చరితార్థమైనది. భగవంతుడు ప్రహ్లాదునే కాక హిరణ్యకశిపుని కూడా అనుగ్రహించి తన తేజస్సుగా స్వీకరించెను. ఇట్లు పలికిన బలిచక్రవర్తి ఇంటి ద్వారమున నారాయణుడు శంఖ చక్రగదా పాణియై కాపుగా ఉన్నాడు. అతడు తన వారుగా శరణుజొచ్చు వారి యందు జాలిపడి ఏదియైనను చేయవచ్చును. ఒకమారు రావణుడు బలిచక్రవర్తి శాసనము ఉల్లంఘించి పాతాళముపై దండెత్తుటకు వచ్చెను. బలి ఇంటి ద్వారము కడ కాపున్న నారాయణుడు పాదాంగుష్ఠముతో నెట్టెను. రావణుడు పదివేల యోజనముల దూరమున పడెను. ఓ పరీక్షిన్నరేంద్రా! ఈ ప్రహ్లాదుని, వారి వంశమును గూర్చిన వృత్తాంతమును ముందు సవిస్తరముగా వివరించెదను.
(బలి అనగా బలవంతుడు. ఇతడు స్వాతిశయమునకు సంకేతము. స్వాతిశయముతో అన్ని లోకములు గెలువవలెననిపించును. సద్గుణములు అభ్యసించినను తన అంతటి సద్గుణవంతుడు లేడనిపించును. భక్తిని అభ్యసించినను తన వంటి భక్తుడు లేడనిపించును. దానమిచ్చినను తనను మించిన దాత లేడనిపించును. ఈ విధముగా బలి అన్ని లోకములను జయించెను. అట్టి వానికి తనది అను సమస్తము తొలగించినచో స్వాతిశయమునకు తాను తప్ప మరి ఏదియు మిగలదు. అదియే భగవంతుడు. దానితో స్వాతిశయము త్రొక్కబడును. అటుపైన సమస్తమునకు అధిపతి అగును. వాని మనస్సే ఇంటిద్వారము. అచ్చట భగవంతుడే ఉండును గాని స్వాతిశయము ఉండదు. అట్టివాని మనస్సు దగ్గరకు పరదారాసక్తి మున్నగు రావణ లక్షణములు చేరలేవు)............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-114,115.
[5/28, 7:31 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻దానికి దిగువ మహాతలమునందు ఈ సర్పములన్నియును కట్టలు కట్టుకొని తిరుగుచుండునట. అవి కామ క్రోధ పూరితములై ఉండును. అనగా దేహముల యందు గుహ్యస్థానమున కామక్రోధాదులకు కారణములైన శక్తులున్నవి. వాని సృష్టి ఈ భూగర్భమున మహాతలము నందు జరుగుతున్నది.
అందు కుహకుడు, కాళీయుడు, సుషేణుడు మొదలగు సర్పరాజులు సూక్ష్మదేహములు కలిగి తిరుగుచుందురు. విష్ణుమూర్తి వాహనమైన గరుడుడు అన్నచో వారికి భయము. వారు దారా పుత్రులతో, మిత్రులతో, బంధువులతో సుఖపడుచున్నప్పుడు కూడా గరుడుని వలన భయము పోదు. (ఉదయించుచున్న సూర్యునకును, ఈ నాగలోక వాసులకును బద్ధవిరోధము. సూర్యుడు అస్తమించిన వెనుక వీరందరును రాత్రి జరుగుచున్న భూగర్భము నందు మేలుకొని ఉందురు. కనుకనే పశ్చిమ దిక్కు కద్రువగా, తూర్పుదిక్కు వినతగా పనిచేయుచుండును. సూర్యుడు వినతాసుతుడై ఊర్ధ్వగమనము చేయును. సూర్యాస్తమయ సమయమున చీకటులే సర్పలోక ప్రజ్ఞలై తలత్తును. అందు చీకటుల నుండి పుట్టిన సర్పములు కన్నములలో వసించును. వానికి మూలములైన నాగలోక వాసులు భూగర్భమున చీకటి వైపున సంచరించుచుందురు.
అహోరాత్ర గమనమున జ్యోతిర్మయమైన అండము నుండి సూర్యుడు గరుత్మంతుడై ఉదయించును. తమోమయమైన రాత్రి భాగపు అండమున చీకటులు సర్పములై సంచరించుచుండును. ఈ రెండింటి నుండియే జీవుల దేహమున ఊర్ధ్వగతి, అధోగతి కలుగుచున్నవి. గరుడుడు శ్వాసరూపమున ఓంకారము అను పరమాత్మను మూపున గొనివచ్చును. సర్పములు జీవిని దేహ నిర్మాణమునకై గర్భమున బంధించును. ఊర్ధ్వగతికి ప్రణవ స్వరూపమైన ఆత్మజ్ఞానమును, అధోగతికి కామస్వరూపమైన గర్భధారణమును కారణములైనివి. ఇట్లు సృష్టికి రెండు యానములు కల్పించుటలో సర్పములు ఒక ప్రక్కను, గరుడుడు ఒక ప్రక్కను అధి దేవతలుగా పనిచేయుచున్నారు)..............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-116,117,118.
[5/28, 7:31 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻ఆ బలి రాజ్యమైన సుతలమునకు క్రిందుగా తలాతలమున్నది. దానికి అధిపతి మయుడు. అతడు అసుర పట్టణములను నిర్మించిన వాడుగా ప్రసిద్ధి చెందియున్నాడు. పూర్వము పరమేశ్వరుడు త్రిపురములను దగ్ధము చేయుటకై విష్ణుమూర్తి తన బాణముగా ప్రయోగించెను. విష్ణువు మూడు పురములను దగ్ధము చేసెను. తనను శరణుజొచ్చిన మయుని కాపాడి తలాతలమునకు నిర్మాతగా ప్రతిష్ఠించెను. అప్పటి నుండి ఈ మయుడు నిర్భయుడై ఉన్నాడు.
తలాతలామునకు దిగువగా మహాతలమున్నది. అచ్చట కద్రువ సంతతియైన సర్పములు పెక్కు శిరస్సులతో తిరుగుచుండును. (సర్పములనగా అధోలోక వాసులైన సూక్ష్మదేహ జీవులే గాని పాములు కావు. ఈ జీవులు రెక్కలతో కూడిన సర్పములై ఎగిరి భూలోకమును ఆరోహించునని చెప్పబడినది. వారే ఈ భూమిపై దేహములు ధరించిన జీవులకు అమృతత్వమును చేకూర్చుచున్నారు. అంకుర శక్తిగా విత్తనముల లోనికిని, శుక్రలోక జీవులుగా భూలోక వాసుల దేహముల లోనికి దిగివచ్చుచున్నారు. అందుండి శుక్రధాతువునందలి కణములుగా ఏర్పడి దేహములు అనబడు పురములను నిర్మించు మాయను ఉపదేశమందుచున్నారు.
పరమేశ్వరుడు ప్రళయమునకు అధిపతి. విష్ణువు స్థితికి అధిపతి. ప్రళయము కలుగవలెనన్నచో సృష్టికి స్థితి ఉండవలెను. కనుక విష్ణువునే బాణముగా ప్రయోగించెను. అటుపైన మూడు లోకముల నిర్మాణము గల త్రిపురములను దేహములను శివుడు నిత్యము దగ్ధము చేయుచున్నాడు. దేహధారులకు మృత్యుభీతి ఏర్పడినది. దాని నుండి నిర్భీతి కలుగుటకు శుక్రకణములు దిగివచ్చి జీవునకు పుత్రరూపమున క్రొత్త దేహము కల్పించుచున్నవి. అప్పటి నుండి ఇది తెలిసినవారికి నిర్భీతి ఏర్పడుచున్నది. దేహమందు కూడా తలాతలము అనబడు అధోలోకమున ఈ సర్పములు శుక్రరూపులుగా ఏర్పడుచున్నవి).............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-116,117,118.
[5/28, 7:31 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻మహాతలము క్రింద రసాతలము ఉన్నది. అచ్చట నివాతకవచులు, కాలకేయులు అనబడు దైత్యులును, దానవులును కలరు. వారి రాజ్యము పేరు హిరణ్యపురము. వారు దేవతలకు శత్రువులు. మహా సాహసము గలవారు; చాలా ప్రతాపము గలవారు. అంతర్యామి తేజస్సునకు భయపడి వారందరును యీ లోకమున దాగి పుట్టలలోని పాముల వలె ఉన్నారు. ఇంద్రుని దూతి అగు సరమాదేవి అచ్చట నుండి ఏవో మంత్రములు ఉచ్చరించుచుండును. ఆ వాక్యములకు వారందరును భయపడుచుందురు.
(నివాత కవచులు అనగా గాలి దూరని కవచము గలవారు. కాలకేయులనగా కాలగతికి లెక్కలు కట్టువారు. ఈ రెండు విధముల జీవులును తమోమయులై భూగర్భమున వసించుచున్నారు. అచ్చట సరమ అనబడు ఆమె దేవతల కుక్క, ఆమె భూగర్భ ద్వారమునందు నిలబడి అధోలోక తమోమయ జీవులు ఊర్ధ్వ లోకములకు ప్రసరింపకుండ కాపాడుచుండును. కనుక ఆమె ఇంద్రుని దూతిగా వర్ణింపబడినది. ఊర్ధ్వలోకములకు, అధోలోకములకు చరించుచుండు ప్రజ్ఞ అని అర్థము.
మన దేహముల యందు ఈమె మూలాధారము ప్రదేశము నుండి వాక్కును ఉచ్చరించుచు ప్రథమ ప్రయత్నమైన మంద్రముగా పనిచేయుచుండును. ఉచ్చరింపబడిన సంకల్ప రూపమైన ప్రయత్నము మనలను అజ్ఞాత ప్రజ్ఞ నుండి జ్ఞాత ప్రజ్ఞకు కొనితెచ్చెను. దానితో నాదము ఏర్పడి చైతన్యము వెలుగుగా ప్రస్తారము చేయబడును. తత్ఫలితముగా వైఖరీవాక్కు, అక్షర పంక్తీ, పదములు, అర్థములు మున్నగు వెలుగుల లోకములలోనికి జీవుడు మేల్కొనును. దీనికి మూలమైన భూగర్భలోకమే రసాతలము)............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-119.
[5/28, 7:31 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻రసాతలమునకు దిగువ పాతాళమున్నది. అందు నాగకులము వారందరును సంచరించుచుందురు. అచ్చట వాసుకి, శంఖుడు, కుళికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ర్టుడు, శంకచూడుడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలగు మహానాగములుండును. వారిలో ఐదు తలలు గలవారున్నారు. వారు తమ మణుల కాంతులతో పాతాళమును వెలిగించుచున్నారు.
(ఇది భూగర్భమునందలి నట్ట నడిమి భాగము. భూ పరిభ్రమణము కొరకు గిరగిర తిరుగుచున్న స్వయం వాహక శక్తులుగా ఇందలి సర్పములు పనిచేయుచుండును. వారు ఆ లోకమందలి జీవులుగానే గాక అధిదేవతలుగ కూడా ఉన్నారు. మిగిలిన లోకముల వారు వేర్వేరుగా ప్రజ్ఞల యందు మేల్కొనుచుండగా పాతాళవాసులు అంతర్యామి ప్రజ్ఞ యందు మేల్కొని ఉన్నారు. కనుకనే అచ్చటి శేషుడు అంతర్యామికి శయ్య. అచటి వాసుకి పరమేశ్వరుని కంఠహారము.
భూ పరిభ్రమణము కల్పించి భూమిని వహించుచున్నవాడు శేషుడు. ఈ పరిభ్రమణమున కాలప్రజ్ఞను ఉత్పాదించి ఆయుర్దాయములు ఏర్పరచి మృత్యువును కల్పించుచున్నవాడు వాసుకి. భూలోక వాసుల దేహములందు శేషుడు మూలాధారమునకు దిగువ కందమనబడు మూలమునకు పైన ఉండును. ఈ దేహమందలి పృథివీ తత్త్వము చెదరిపోకుండ అతడు పట్టి ఉంచుచున్నాడు. ఇతనినే తాంత్రికులును, యోగులును కుండలినీ శక్తిగా వర్ణించుచున్నారు. జీవుని రూపమున దిగివచ్చు అంతర్యామికి దేహముగా ఇతడున్నాడు కనుక పాన్పుగా పనిచేయుచున్నాడని చెప్పబడినది)...........✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-120,121.
[5/28, 7:31 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻పాతాళలోకపు అడుగున శేషుడు ఉన్నాడు. ముప్పది వేల యోజనముల వెడల్పైన తోకచుట్ట కలిగి ఉన్నాడు. అతడు విష్ణుమూర్తి యొక్క శరీరము. అతడే అనంతుడు అనబడుచున్నాడు. అతడే సంకర్షణుడు అనబడు వ్యూహముగా పనిచేయుచున్నాడు.
అతని శిరస్సున భూగోళము తెల్లని ఆవగింజ వలె నిలబడి ఉన్నది. వాని చుట్టును భయంకరములైన సర్పములు పదునొకండున్నవి. అవి రౌద్రముర్తులు లేక రుద్రమూర్తులు అనబడును. సంహారమునకై వేచి ఉండి మూడేసి కన్నులు, శిరస్సులు కలిగి శూలహస్తులై నిలబడి వారు ఆదిశేషుని కొలుచుచున్నారు. (ఆదిశేషుడును, రౌద్రమూర్తులును భూ పరిభ్రమణమునకు అధిపతులు. అందు శేషుడు స్థితికర్తగా పనిచేయగా మిగిలిన వారు ప్రళయకాలమున భూగోళమునకు సంహారకర్తలుగా పనిచేయుదురు. గమనము కారణముగనే భూమి నిలబడి ఉన్నది. గమనము కారణముగనే చివరకు విడిపోవును.)
వారందురును వినయముతో శిరస్సులు వంచి, ఆ శిరస్సులపై ఉన్న మణులతో శేషునకు నీరాజనములు సమర్పించుచుందురు..........✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-122,123,124.
[5/28, 7:31 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻సంకర్షణమూర్తియైన శేషుని చుట్టును చేరి నాగకన్యలు అనేక వాంచితార్థములు గలవారై అతని దివ్య శరీరమునకు చందనము కస్తూరి మున్నగు దివ్య సుగంధములను పూయుచుందురు. అతని దివ్య దర్శనమున వారి మనస్సులలో మన్మథావేశము కలుగుచుండును.
అభిలాషతో వారు చిరునవ్వులు వెలయించి, సిగ్గుతో శిరస్సులు వంచి చూచుచుందురు. అనంత గుణములు గల శేషుడు తన క్రోధమును ఉపసంహరించుకొని లోకములకు క్షేమము కోరుచు నడుమ నిలబడి ఉండును. సురలు, అసురులు, గంధర్వులు, విద్యాధరులు, మునులు నిరంతరము అతనిని ధ్యానము చేయుచుందురు. అతడు సంతోషాతిశయమున అర్థనిమీలిత లోచనుడై ఉండును. వినుటకు ఇంపైన గీతములు, వాద్యములు విని ఆనందించుచు పరిజనులను మిక్కిలి స్నేహముతో చూచుచుండును. అప్పుడే త్రుంపి తెచ్చిన తులసీ దళముల వాసనలతోను, పుష్పపరిమళమిలతోను కూడిన వైజయంతీ అను వనమాలను ధరించి ఉండును. దాని పరిమళములకు తేనేటీగలు మూగుచుండును.
ఆదిశేషుడు నీలవర్ణములైన అంబరములను ధరించి, హలములను దాల్చి ఉండును. ఇతడు మహేంద్రుడో, శివుడో అని జనులు పలుకుచుందురు. మోక్షము కోరినవారు వానిని పీతాంబరునిగా ధ్యానము చేయుచుందురు. ఆధ్యాత్మ విద్యను ఉపదేశించి ఆనందమునకు అడ్డుగా హృదయమునందు ఉన్న ముడిని అతడు త్రెంపును. కనుక తుంబురుడు మున్నగు మునిశ్రేష్ఠులతో కలసి నారదుడు బ్రహ్మ సభ యందు నిలబడి ఇట్లు స్తుతించుచుండును:..........✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-125.
[5/28, 7:31 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻తుంబురుడు మున్నగు మునిశ్రేష్ఠులతో కలసి నారదుడు బ్రహ్మ సభయందు నిలబడి ఇట్లు స్తుతించుచుండును: ఎవని లీలా వినోదములు ఈ జీవుల జన్మకును, సంరక్షణమునకును, లయమునకును హేతువులు అగుచుండునో, ఎవని చూపుల నుండి సత్త్వ రజస్తమస్సులు పుట్టెనో, ఎవని రూపములన్నియు తన ఏకత్వమున బహు విధములుగా లోకములను కాపాడుచుండునో అట్టి మూర్తికి నమస్కారము.
తెలియక స్మరించినను ఎవని నామము పాపములను హరించునో అట్టి సంకర్షణ మూర్తి అంతులేనివాడు. అట్టి శేషుని స్తుతించుటకు వాక్కును గాని, మనస్సునకు గాని సాధ్యమా? మా బోటి వారలు అనేక విధములుగా అనుగ్రహించుటకై ఈ శేషుడు సాత్త్వికమైన స్వభావమును పొంది ఉన్నాడు. అట్టి మూర్తికి నమస్కారము అని నారదుడు స్తుతించుచుండును.
ఇతనిని అప్రయత్నముగా స్మరించినను, బాధతో స్మరించినను సకల పాపములను తొలగించుకొని ఎవడైనను శ్రేయస్సులను పొందును. మోక్షము కోరినవారు వీనిని ఆశ్రయించి సంసారబంధములను తొలగించుకొందురు. అతని పడగల యందు భూగోళము అణు మాత్రముగా ఉండి పరిభ్రమించుచుండును. అతని మహిమలు వర్ణించుటకు వేయి నాలుకలు గల వాడైనను సమర్థుడు కాడు. అట్టి అనంతుడు పాతాళమున ఉండి సకల లోకముల హితము కొరకై భూమిని ధరించి ఉండును...........✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-126,127,128,129.
[5/28, 7:32 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 (1.పాతాళమునకు అధిదైవముగా ఆది శేషుడు వర్ణింపబడెను. ఇతనిని ధ్యానించువారు తమ తమ కోరికలను బట్టి భోగమునో మోక్షమునో పొందుదురని చెప్పబడెను. ఇచ్చట ఆదిశేషుడు నారాయణుని మూర్తి అని ప్రతిపాదింపబడెను. ఇద్దరికిని భేదము లేదు. నారాయణుడు
అంతర్యామి. అతని దేహమే శేషుడు.
2.లోకముల హితము కోరి అతడు భూమిని భరించుచుండెనని చెప్పబడినది. అనగా భౌతిక లోకము లేనిచో మిగిలిన లోకములలోని సృష్టికి స్థితి లేదు భౌతిక లోకమే సృష్టి యొక్క స్థితికి కారణము.
3.భూగర్భమున దిగువగా పాతాళమున ఉన్న శేషునకు పడగల పైన సూక్ష్మమూర్తిగా భూగోళము ఉన్నట్లు వర్ణింపబడినది. భూగర్భము నుండి చుట్టలు చుట్టుకొని వ్యాపించుచున్న శేషుని దేహము భూ పరిభ్రమణమునకు కారణము. ఈ భూపరిభ్రమణములే చుట్టలై అంతకంతకు వ్యాపించుచు భూగోళమును దాటి ఆకాశగోళము అందంతటను నిండియున్నది. కనుక అతని పడగలపై భూమి ఉన్నది. తోక చివరి భాగము పాతాళమున ఉండగా పడగల యందు మిగిలిన లోకములన్నియు అమరి ఉన్నవి. ఇతడు అంతర్యామి మొదటి అవతారము. కనుకనే ఆదిశేషుడు అనబడును. తోకయనగా సూక్ష్మము లేక అణుత్వము. పడగలనగా బ్రహ్మాండవ్యాప్తి. అణుత్వమునందు అతని తోక ఉండి బ్రహ్మండము అతని తలల యందు ఇమిడి ఉన్నది.)...........✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-128,129.
[5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

[5/28, 10:33 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻8.అతనిని సేవించు కాంతలందరును మన్మథానుభూతి పొంది సిగ్గుతో అతని వంక చూచుచున్నట్లు వర్ణింపబడినది. ఇచ్చట మన్మథుడు మకరధ్వజుడు. మకరరాశి తన పతాకముగా గలవాడు. మకరరాశి నుండి ఆరంభించు రాసులు ఉత్తరాయణమునకు ధ్వజములు. కనుక ఇందలి మన్మథానుభూతి అంతర్యామి ఎడల జీవులకు కలుగు స్పర్శానుభూతి.
9.ఒకరినొకరు స్ర్తీ పురుషులుగా చూచుచున్నను ఇతడొక్కడే అంతర్యామి పురుషుడై పరస్పరత్వము స్ర్తీత్వముగా భాసించును.
10.శేషుడు హలమును ఆయుధముగా ధరించినట్లు చెప్పబడినది. హలముతో పొలము దున్నినట్లు శేషుడు లోకములను అన్నిటిని వ్యాప్తి చేసి బీజాంకురత్వము ఏర్పరచి తన దేహస్థితియైన భౌతిక లోకమును పీఠముగా ఏర్పరచి ప్రతిష్ఠించును.
11.బలరాముడు శేషుని అవతారము కనుకనే నీలాంబరుడు, హలాయుధుడుగా వర్ణింపబడెను............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-128,129.
[5/28, 10:33 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 (1.పాతాళమునకు అధిదైవముగా ఆది శేషుడు వర్ణింపబడెను. ఇతనిని ధ్యానించువారు తమ తమ కోరికలను బట్టి భోగమునో మోక్షమునో పొందుదురని చెప్పబడెను. ఇచ్చట ఆదిశేషుడు నారాయణుని మూర్తి అని ప్రతిపాదింపబడెను. ఇద్దరికిని భేదము లేదు. నారాయణుడు
అంతర్యామి. అతని దేహమే శేషుడు.
2.లోకముల హితము కోరి అతడు భూమిని భరించుచుండెనని చెప్పబడినది. అనగా భౌతిక లోకము లేనిచో మిగిలిన లోకములలోని సృష్టికి స్థితి లేదు భౌతిక లోకమే సృష్టి యొక్క స్థితికి కారణము.
3.భూగర్భమున దిగువగా పాతాళమున ఉన్న శేషునకు పడగల పైన సూక్ష్మమూర్తిగా భూగోళము ఉన్నట్లు వర్ణింపబడినది. భూగర్భము నుండి చుట్టలు చుట్టుకొని వ్యాపించుచున్న శేషుని దేహము భూ పరిభ్రమణమునకు కారణము. ఈ భూపరిభ్రమణములే చుట్టలై అంతకంతకు వ్యాపించుచు భూగోళమును దాటి ఆకాశగోళము అందంతటను నిండియున్నది. కనుక అతని పడగలపై భూమి ఉన్నది. తోక చివరి భాగము పాతాళమున ఉండగా పడగల యందు మిగిలిన లోకములన్నియు అమరి ఉన్నవి. ఇతడు అంతర్యామి మొదటి అవతారము. కనుకనే ఆదిశేషుడు అనబడును. తోకయనగా సూక్ష్మము లేక అణుత్వము. పడగలనగా బ్రహ్మాండవ్యాప్తి. అణుత్వమునందు అతని తోక ఉండి బ్రహ్మండము అతని తలల యందు ఇమిడి ఉన్నది.)...........✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-128,129.
[5/28, 10:42 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻ఈ లోకముల యందు విష్ణుచక్రము ఎప్పుడైన ప్రవేశించినచో అచ్చటివారి స్ర్తీల గర్భములందలి సంతతి కరగి మాయమగును. (సూర్య తేజస్సు పడినపుడు మాత్రము ఈ ఖనిజాదులలో అప్పుడే ఏర్పడుచున్న జీవులు మాయమై కేవలము ఖనిజములు మాత్రము మిగులును). అతలము అను లోకమున మయుని కుమారుడైన బలాసురుడు విహారము చేయుచుండును. అతడు తన వశమందున్న తొంబది ఆరు మాయలను ప్రవర్తింపజేసి జీవులను వినోదింపజేయుచుండును. (తొంబరి ఆరు విధములైన జాతులను అతల జీవులుగా పుట్టించి ఖనిజముల సమ్మేళనమున ప్రకాశింపజేసి సంతోషపెట్టుచుండున).
ఆ మాయ అప్పుడప్పుడు భూమి పై భాగమున కూడా ప్రసరించుచుండును. బలాసురుడు ఆవులింత చేసినప్పుడెల్ల దాని మాయ ఈ భూమిపైన ఉన్న జీవుల మనస్సుల మీద సోకుచుండును. అట్లు సోకిన ప్రదేశము నుండి పుట్టిన స్ర్తీలే వ్యభిచారిణులు, కామాంధులు, ప్రతి పురుషుని యందును మనసు చలించువారుగను పుట్టుచున్నారు. (దేహబద్ధులైన నరుల యందు ఇది దోషము. భూమిపైన ఉన్న జంతువులకు వృక్షములకు ఋతువు కానపుడు కామము లేదు కనుక ఈ మాయ సోకదు).
అతలము నందు విహరించుచున్న స్ర్తీలు పురుషులకు బంగారముతో, పాదరసముతో రసఘటికలు చేసి ఇచ్చి రససిద్ధులను చేయుదురు. ఆ పురుషులు తమ స్వార్థము అనుకొని భ్రమపడి వారు కోరిన విహారములను కలుగజేయుచుందురు. (స్ర్తీ-పురుషులకు భావ భేదమే గాని దేహ భేదము లేనందున స్ర్తీ స్పర్శయే పురుషులకు విహార సామర్థ్యమును కలుగజేయును)..............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-108,109,110.
[5/28, 10:42 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻ఈ లోకముల యందు మయునిచే నిర్మింపబడిన పట్టణములున్నవి. అందు రత్నములు తాపి నిర్మించిన ప్రాకారములు, భవనములు, గోపురములు, సభాంగణములు, చైతన్యములు గూడా గలవు. వాని యందును, నాలుగు బాటలు కలిసిన తావుల లతా గృహములందును అసురులు మున్నగు జాతుల జంటలు విహరించుచుందురు. వారు తమ పరిసరముల యందు చిలుకలను, కోకిలలను, గోరువంకలు మొదలగు పిట్టలను కృత్రిమముగా కల్పించి విహరింపజేయుదురు. ఇన్నిటితో గూడిన గృహములను, ప్రాంగణములను గూడా ఎప్పటికప్పుడు కల్పించుకొనుచున్నారు. సుగంధ పుష్పములు, ఫలములు శోభిల్లుచుండును. లతలను అల్లుకొనిన వృక్షములు వధూవరాలింగనములను సూచించుచుండును.
మనస్సునకు, ఇంద్రియములకును ఉత్సాహము కల్గించునట్లు నీటి పక్షుల జంటలు విహరించుచున్న కోనేళ్ళున్నవి. అందు రంగుల చేపలు ఈదుచుండును. వానిచే కదలింపబడిన కలువలు తమ్మిపూల పరిమళములను గుప్పుమనిపించుచుండును. ఈ కోనేళ్ళ సమీపమున ఉద్యానములను కల్పించి గృహములను సాధించి నివాసమున్నవారు పొందునట్టి విహారానందము భూలోక, స్వర్గలోక వాసులకు తెలియదు. అచ్చట అహోరాత్రముల విభాగములేదు. మహాసర్ప నాయకులైన శేషుడు మున్నగువారి శిరోమణుల కాంతులు అంధకారము లేకుండా కాపాడుచుండును. ఎల్లప్పుడును పగటివేళ వలెనే ఉండును. ఆ లోకమునందు గల జనులందరు దివ్యములైన ఓషధులను, పాదరసము మున్నగు ఖనిజములను, వానితో ఏర్పడిన రసాయనములను అన్నపానీయములుగ సేవింతురు. కనుక వారికి మానసిక, శారీరక వ్యాధులు గాని, ముడుతలు పడు దేహములు గాని, నరసిపోవు కేశములు కానీ ఉండవు.
ప్రత్యేక దేహబద్ధత లేకుండుటచే ముసలితనము గాని, రంగులు మారుట గాని ఉండదు. చెమట, దేహ దుర్గంధము సంభవింపవు. వారు శుభమయులైన మూర్తులై దేనికిని భయపడక ఎల్లప్పుడును సుఖపడుచునే ఉందురు. ఒక విష్ణుచక్రమన్నచో మాత్రము వారికి భయము. (విష్ణుభక్తులని సూచన. ఇచ్చట విష్ణువనగా మనము దేవాలయమున చూచు విగ్రహము కాని, చిత్ర పటములలోని విష్ణువు బొమ్మ కాని కాదు. సర్వవ్యాపియైన అంతర్యామిని గూర్చి నిరంతరము భావింతురని అర్థము).............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-106,107.
[5/28, 10:42 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 వితలము అను లోకమున పార్వతీపతి యైన శివుడు వేడుకతో విహరించుచుండును. తన పరివారమైన భూతగణములతో సంచరించుచుండును. బ్రహ్మ సృష్టిని అభివృద్ధి చేయుట కొరకై అంబికతో విహరించుచుండును.
ఆ విహారము వలన హాటకి అను శక్తి పుట్టినది. ఆమె నిప్పును, గాలిని భక్షించి మరల అచ్చటనే ఉమియు చుండును. తత్ఫలితముగా హాటక అను పేర సువర్ణము పుట్టినది. దానిని జనులందరు భూషణములకై వినియోగించుచున్నారు. ప్రకృతి పురుషుల సంయోగమున అగ్ని వాయువు పనిచేసిన భూమి లోపలి పొరలలో బంగారుము ఏర్పడుచున్నది.
సుతల అను లోకమున బలి చక్రవర్తి నివసించుచుండును. అతడు మహా పుణ్యాత్ముడు. అతని నుండి స్వర్గ సంపదలు అపహరించి ఇంద్రునికి ఒసగి సంతోషపెట్టుటకై విష్ణుమూర్తి అదితి గర్భమున వామనుడై పుట్టెను. త్రివిక్రముడై మూడు లొకములు ఆక్రమించెను. అయినను బలి బాధపడలేదు. కనుక విష్ణుమూర్తి స్వయముగా అతనికి ఇంద్రత్వమొసగెను. ఇతడు ఎప్పుడును పుణ్యకర్మలు ఆచరించుచుండును. శ్రీహరి పాద పద్మములు అర్చించు అభిలాష విడువకుండును..............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-111,112.
ఓంవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినై నమ:
🌷ఓం నమో వేంకటేశా య ...ఓం నమో నారాయణా య ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే🌹🌷
🙏🌹కార్తీకమాసం ..కార్తీకపురాణం గురించి కొన్ని విషయాలు 🙏🌹
ఆచరించాల్సినవి ఎన్నో ఉంటాయి ..కొందరికి అవకాశం ఉంటుంది ...కొందరికి ఉండకపోవచ్చు
ఎవరైనా సరే భక్తి ప్రధానం ...మనస్సు ఒక్క క్షణం దేవుని పాదాలపై ఉంచి ఒక్క పువ్వు ఒక్క తులసీదళం వుంచినా చాలు ...ఈ ఆచారాలన్నీ మనస్సుని కట్టడిచేయడానికి ...ఒక విధి విధానం కోసమే .....కానీ .భగవంతుడి దర్శనం పొందాలంటే ఆయన దయ మనపై కురవాలంటే..కావల్సింది మంచిమనస్సు...సేవ ..భగవంతుని కోసం పడే తపన
ఆడంబర త్త్వంకాని భక్తి ..అచంచలమైన భక్తి ....మీకు వీలుగా చూసుకొని ..భగవంతుని ప్రార్ధించండి ...
ఒక ఆచారం...పా టించ లేదని ..ఏదో లోపం జరిగింది అని ఎప్పుడూ భయపడకండి ......భక్తి తో ఉండండి ఏదైనా ఉంటే చెంపలు వేసుకొని తప్పులు క్షమించమని అడగండి ...చాలు
ఇక
*కార్తీకమాసం ...కార్తీక పురాణం గురించి తెలుసుకుందాం
స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి
వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను
ప్రసాదించే మహిమాన్వితమైన మాసం "కార్తీకమాసం'. చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం
ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా
నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి "కార్తీకమాసం" అని పేరు
వచ్చింది.
"న కార్తీక నమో మాసః
న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్"
అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే "కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు.
శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో
సమానమైన తీర్థము లేదు." అని అర్ధం.i
కార్తీకమాసం శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీకమాసంలో
ప్రతీరోజూ తెల్లవారుఝూముననే స్నానమాచరించవలెను.అప్పుడే అది కార్తీక
స్నానమవుతుంది. నిత్యం దీపాన్ని వెలిగించినా, ఆరాధించినా, దీపమును
కార్తీకమాసంలో వెలిగించడం, నదిలో దీపాలను వదలడం , ఆకాశ దీపాలను వెలిగించడం,
దీపదానం చేయడం వంటి ఆచారాలను పాటించవలేను. కార్తీకమాసమంతా ఇంటి ముందు
ద్వారానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించవలెను. అట్లే సాయంత్ర సమయంలో
శివాలయాల్లో గానీ వైష్ణవాలయాల్లోగానీ గోపురద్వారం వద్దగానీ, దేవుని
సన్నిదానంలోగానీ ఆలయప్రాంగణంలోగానీ దీపాలు వెలిగించిన వారికి సర్వపాపములు
హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం. ఇతరులు వెలిగించిన దీపం
ఆరిపోకుండా చూడడం కూడ పుణ్యప్రదమే!
కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమినాడుగాని లేక ఇతర దినాల్లో అయినా సాయంసమయాలలో
శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను ఉంఛి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవునెయ్యితో
దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వులనూనెతోగానీ,కొబ్బరినూనెతోగానీ,
నెయ్యితోగాని, అవిశనూనెతోగానీ, ఇప్పనూనెతోగానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా
దీపమును వెలిగించవలెను. అంతే కాకుండా కార్తీకమాసంలో దీపదానం చేయాలని
శాస్త్రవచనం. కార్తీకమాసంలొ ముప్పై రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధద్వాదశి,
చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్ర వచనం. ఈ విధంగా
కార్తీకమాసంలో దీపాలను వెలిగించడం , దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా
రాళ్ళూ, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.
*🌴కార్తీకపురాణం
*🌻. కార్తీక మాసం విశేషం🌻*
ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… ”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను, వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..” అని కోరారు.
శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… ”ఓ పునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో, పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి” అని చెప్పసాగాడు.
పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో ”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి, మానవులంతా కులమత తారతమ్యం లేకుండా, వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి” అని కోరింది.
అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు ”దేవీ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు….” అని ఆ దిశగా చూపించాడు.
మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి, ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు ”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి?” అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు ”జనక మహారాజ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన, సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను” అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు.
దీనికి జనకుడు ”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ, ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పదనమేమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా?” అని ప్రార్థించారు.
వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి ”రాజ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….” అని చెప్పసాగాడు.i
🌻. కార్తీక వ్రతవిధానం 🌻
”ఓ జనక మహారాజా! ఎవరైనా, ఏ వయసువారైనా పేద-ధనిక, తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి, దానధర్మాలు, దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి ప్రారంభించాలి” అని వివరించారు.
వ్రతవిధానం గురించి చెబుతూ… ”ఓ రాజా! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, నదికిపోయి, స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారయణ, పరమేశ్వరులకు, బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి, సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి, పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరీ, తుంగభద్ర, యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని, శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి, నిత్యధూప, దీప, నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి, భగవంతునికి సమర్పించి, తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి, వారికి ప్రసాదం పెట్టి, తన ఇంటివద్దగానీ, దేవాలయంలోగానీ, రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి
ఆ సాయంకాలం
సంధ్యావందనం చేసి, విశాలయంలోగానీ, విష్ణు ఆలయంలోగానీ, తులసికోట వద్దగానీ, దీపారాధన చేసి, శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి, స్వామికి నివేదించాలి. అందరికీ పంచి, తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గతంలో, గతజన్మలో చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడనివారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.
🙏🌷ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యం.....ఓం నమః శివాయ 🌷🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹ఓం నమో వే0కటేశాయ ....ఓం నమో నారాయణా య ..🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🌹అందరికిప్లవ నామ స0వత్సరదీపావళి శుభాకాంక్షలు 🙏🌷
🙏🌷 మిత్రులు పెద్దలు అందరికి దీపావళి శుభాకాంక్షలు🙏🌷
🪔 మన జీవితం లో 'అంధకారం'... అనేది మన 'అఙ్ఙానముకు' మరియు మన 'నిరాశకు' చిహ్నం..
అలాగే..
🪔 వెలుగు అనేది మన 'ఙ్ఞానానికి' మరియు మన జీవితంలో 'ఆనందానికి' చిహ్నం.
🪔 అఙ్ఞానమనే చీకటి నుంచి... ఙ్ఞానమనే వెలుగులోకి ప్రయాణించడమే ‘దీపావళి’ పండుగలోని అంతరార్ధం.
🪔 *‘దీప’ అంటే దీపము....‘ఆవళి’ అంటే వరుస...
దీప + ఆవళి అంటే.. దీపాల వరుస అని అర్ధం...
🪔 దీపం ఐశ్వర్యం అయితే... అంధకారం దారిద్ర్యం .... దరిద్రాన్ని పారద్రోలి, ఐశ్వర్య మార్గంలోకి ప్రయాణిచడమే ‘దీపావళి’ పండుగ...
🪔 ‘దీపం’ త్రిమూర్తి స్వరూపం. దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి.
‘ఎర్రని’ కాంతి బ్రహ్మదేవునికి..,
‘నీలి’ కాంతి శ్రీమహావిష్ణువుకి..
‘తెల్లని’ కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు.
సాజ్యం త్రివర్తి సంయుక్తం - వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం - త్రైలోక్య తిమిరాపహం
భక్త్యా దీపం ప్రయచ్ఛామి - దేవాయ పరమాత్మనే
త్రాహిమాన్నరకాద్ఘోరాత్ - దివ్య జ్యోతిర్నమోస్తుతే
🪔 ఏ దీపమైనా మూడు వత్తులు వేసి వెలిగించాలి గానీ.. ఒక వత్తు దీపం.... రెండు వత్తుల దీపాలు... వెలిగించరాదు.
‘మూడు వత్తుల దీపం.. గృహానికి శుభాలు చేకూరుస్తుంది...
ముల్లోకాలలోని అంథకారాన్ని పారద్రోలి లక్ష్మీ నిలయంలా చేస్తుంది. నరకం నుంచి రక్షిస్తుంది.
🪔 దీపం సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం. అటువంటి దీపాన్ని... ఆవు నేతితోగానీ.. నువ్వుల నూనెతోగానీ... భక్తిగా వెలిగించాలి...
మరెంతో భక్తిగా నమస్కరించాలి అని పై శ్లోకం అర్థం.
🪔 దీపం - లక్ష్మీ స్వరూపం.
దీపం ఉన్నచోట సర్వసంపదలు తాండవిస్తాయి... ఆనందాలు వెల్లివిరుస్తాయి... సుఖ, సంతోషాలు చోటు చేసు కుంటాయి..
అందుకే నిరంతరం మన పూజామందిరంలో దీపం వెలుగుతూండాలనే నియమం పెట్టారు...
🪔 దీపం.. విజయానికి చిహ్నం...
అందుకే పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే సైనికులకు, రాజులకూ విజయతిలకం దిద్ది విజయహారతులిచ్చి పంపేవారు...
🪔 నిజానికి ‘దీపాన్ని’ మట్టి ప్రమిదలోనే
వెలిగించాలి... మట్టి.., ఉష్ణాన్ని తనలో లీనం చేసుకుంటుంది. అందుకే ఎంతసేపు వెలిగినా మట్టి ప్రమిద వేడెక్కదు.
💫 మనం ఆర్భాటం కొద్దీ ఉపయోగించే వెండి, ఇత్తడి, రాగి, కంచు ప్రమిదలు.. దీపం వెలిగించిన కొద్దిసేపటికే వేడెక్కి పోతాయి.. ఆ వేడిని భూమాత భరించలేదు.. కనుకనే వట్టి నేలపైన దీపం వెలిగించరాదు.
🪔 ప్రమిదలో ప్రమిద వేసి మూడు వత్తుల దీపం వెలిగించాలి.
✅ ఇది సాంప్రదాయం.
✅👉 మానవదేహం మట్టి
నిర్మితం. అందుకే మనం ఎంత నలుగు పెట్టుకుని రుద్దినా., ఎన్ని సబ్బులు అరగదీసినా., ఎన్ని షాంపూలతో స్నానం చేసి వచ్చినా.., మన దేహంపై ఎక్కడ రుద్దినా కాస్తో కూస్తో మట్టి రాలుతుంది. గమనించండి.
🪔 ఈ మానవదేహం ఓ మట్టి ప్రమిద. ఈ ప్రమిదలో జ్యోతి రూపంతో భాసిల్లేవాడే ‘పరమాత్మ
💫 ఇక.. అగ్నిదేవుని రూపమే ఈ దీపం. మన హైందవధర్మానికి మూలస్తంభాలు నాలుగు వేదాలు. అందులో తొలివేదం.. ‘ఋగ్వేదం’.
‘అగ్నిమీళే పురోహితం యఙ్ఞస్య దేవమృత్విజమ్ హోతారం రత్నధాతమమ్’
ఇది ఋగ్వేదంలోని తొలి ఋక్కు. ఈ ఋక్కుతోనే వేదం ప్రారంభమవుతుంది. అంటే...
🪔 తొలిసారిగా కీర్తించబడిన తొలి దేవుడు ‘అగ్ని’. అంటే ‘జ్యోతి స్వరూపం’. ఈ జ్యోతి స్వరూపమే పురహితాన్ని కోరే తొలి పురోహితుడు.. ఋత్విక్కుడూను.
🪔 మన జీవితంలోని మంచి, చెడులలో మనకు తోడుగా ఉంటూ, మార్గ దర్శకత్వం వహించేది ఈ జ్యోతి ఒక్కటే. కనుక ఆ ‘జ్యోతి' ని ఉపాసించడం., ఆరాధించచడం మన ధర్మం.
🪔 నరకాసుర సంహారంతో సకల లోకాలు కష్టాల అంథకారంలోంచి సంతోషమనే వెలుగులోకి వచ్చాయి. అందుకే నరకచతుర్దశి నుంచే.. మన సుఖ, సంతోషాలను వ్యక్తం చేయడానికి నిదర్శనంగా దీపాలు వెలిగించాలి.
ఆ వెలుగులో.... మన జీవితం.. మన కుటుంబం... మన నవసామాజిక సమాజం పయనించాలి.
ఈ దీపావళి పండుగ రోజున మీకు.. మీ కుటుంబానికి... సకల దేవతల ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ... దీపావళి శుభాకాంక్షలు..
ఈ "దీపావళి" పండుగను
మీరు కుటుంబసభ్యులతో వెల్లివిరిసే దీపకాంతుల నడుమ
ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనీ,
శ్రీ లక్ష్మీ మాత మీకు
సకలశుభసంపదలనూ
ఆరోగ్య,ఐశ్వర్యాలను
ప్రసాదించాలని
మనసారా ఆకాంక్షిస్తున్నాము🌹🙏సేకరణ...
🙏🌹 శ్రీ లంక లో సీతమ్మ వారు కూర్చున్న రాయు🌹🙏
దీపావళి పర్వ దినాన శ్రీలంకలో సీతమ్మవారు కూర్చొన్న రాతిని అక్కడి ప్రభుత్వం అయోధ్య లోని రామ మందిర నిర్మాణానికి ఇచ్చేందుకు అయోధ్య లో సీఎం ఆదిత్యనాధ్ కు బహుకరించేందుకు వచ్చిన దృశ్యం
జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ....జయ జయ రామ్ జానకిరామ్ పావన రామ్ పట్టాభి రామ్ ఓం నమో వేంకటేశా య🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 ,
🌝15part నిరీక్షణ. కథానిక .......short story NI RIKSHN A. Last part🌝
Part 15
కాలం అలా అలా తిరిగిపోతోంది ...పిన్ని గారి ఇంట్లోనే కాలం గడుపుతోంది అరుణకుమారి ...ఉత్తరాలు ద్వారా ..తల్లి కూతుళ్ళు ..వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకొని కాస్తంత ఉపశమనం ..తో హాయిగా గాలి పీల్చు కుంటున్నారు ...తాను ఇక్కడ కూడా ఖాళీ గా ఉండకుండా పిన్ని బాబాయి సహాయం తో తనకు ఎంతో ఇష్టం అయిన చదువుని కొనసాగించేలా ..వాళ్ళు ఎన్నో ఏర్పాట్లు చేశారు ...అందుకే ..ఇంట్లో ఉండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాను ....అమ్మా... నన్ను, పిన్ని ..బాబాయి ఇక్కడ బాగా చూసుకుంటున్నారు ..ఏది ఏమైనా మన0 సేఫ్ జోన్ లో ఉన్నాము ..చాలా సంతోషం గా ఉంది అమ్మా ..నేను ప్రస్తుతం ఇక్కడ చెల్లెలు కు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ..సీటు వచ్చింది ..చెల్లెలు కు సహాయం గా వెళ్ళు అని పంపిస్తున్నారు ...అక్కడికి వచ్చిన తరువాత నీ దగ్గరకు వస్తాను ..అమ్మా ...ఎప్పుడా .అమ్మని చూస్తాను ..అని నాలో కూడా తొందర పెరిగిపోతోంది ....అక్కడ రాగానే తక్షణమే నిన్ను కలుసుకుంటాను ..అంటూ.. కూతురు అరుణ తల్లికి ఉత్తరాలు వ్రాస్తోంది ....అమ్మాయి ని జాగ్రత్తగా ఇంత కాలం కనిపెట్టుకొని ఉన్నందుకు ..మీకు ఎంతో ఋణ పడిపోయాను ..అని అక్క ఉత్తరంలో వ్రాయడం ...అంతంత మాటలు వద్దు అక్కా అని చెల్లెలు వ్రాయడం ..ఇలా అరుణకుమారి వాళ్ళ అమ్మ ..పిన్ని లు కూడా ఉత్తరాలలో వ్రాసేసుకుంటున్నారు .....
**. **. **. **
వెంటనే వచ్చేస్తున్నాను ..రాగానే కలుస్తాను అని చెప్పింది .నెలలు గడిచిపోతున్నా ..మనిషి ఇంత వరకు పత్తా లేదు ..ఏమిటి ఆలోచనల్లో పడిపోయింది అరుణకుమారి తల్లి ..చాలా కాలం అయిపోయింది ..అమ్మాయిని ఎప్పుడు...ఎప్పుడు చూస్తానా ..అనే ఆరాట పడిపోతుంది ...ఆందోళన అపి పట్టుకోలేక కొడుకు కిరణ్ కి మొత్తం చెప్పింది ...తల్లి ...అవునమ్మా ..నాకు ఎప్పుడో తెలుసు చెల్లి.. పిన్ని ఇంట్లో ఉంది ..కంగారుపడవద్దు అని చెప్పాను ..నువ్వు వింటేనా ..నేను వెతక్కుండా ఎందుకు వున్నాను ..నాకు మాత్రం బాధ ఉండదా ..ఎక్కడో అక్కడ ప్రశాంతం గా ఉంది ..అని నేను తెలుసుకొనే ఆగాను ..ఇక్కడ మనం కొంత పనులనుంచి బయట పడగానే ..ఇద్దరం వెళ్ళి తీసుకొని వద్దాం ..మా మామయ్య గారు కూడా ఒక మంచి సంభ0ధం వెతికి పెండ్లి కూడా చేద్దాం ..ఆందోళన పడవద్దు అని ..నాకు గట్టిగా చెప్పారు ..అలానే మన ఊరు కూడా వెళ్లి ..మనకు తెల్సిన వారి సహాయంతో మ న పొలాలు మనకు చెందేటట్లు కృషి చేద్దాం అనికూడా మామయ్య గారు చెప్పారు ..ఇక ఒక్కోక్కటి చేసుకొందాం ..అలా చెప్పుకుంటూ పోతున్నాడు ..కిరణ్ ..అదేరా అస్సలు ఇక్కడ యూనివర్సిటీ లో మీ పిన్ని కూతురు చదువుకుంటూ0ది. హెల్ప్ గా హాస్టల్ లో కొద్దిరోజులు ఉండటానికి ఇక్కడ కు వస్తానంది ..మన అడ్రెస్ ..నీ పెళ్లి విషయాలు ..ఊళ్ళో వచ్చిన తగాదాలు వల్ల కలుసుకోలేక పోయాము ఏమి అనుకోవద్దు ఇలా అన్నీ విషయాలు వివరించి వ్రాశాను ...వాళ్ళు కూడా ముందు మనం అందరం గోడవల్లో లేకుండా ప్రశాంతంగా ఉన్నందుకు చాలా సంతోషించు తున్నట్లు ఉత్తరాలు వ్రాశారు నువ్వు కూడా చదివావు గా ..అలా చెప్పుకుపోతుంది కిరణ్ తల్లి ...సరేనమ్మా ...రానీ ..ఇక్కడ అడ్రసు ప్రకారం మన0 వెళ్లి చెల్లిని కలుసుకుందాం ..ఇంటికి తీసుకువద్దాం ..ఓకే నా.. నువ్వు టెన్షన్ పడవద్దు ...ప్రశాంతం గా అన్ని పనులు చక్కబెడదాం ..ఓదార్చి నట్టు చెబుతున్నాడు కిరణ్ .
అలా కొద్దీ రోజుల తేడా తో అరుణ కుమారి యూనివర్సిటీ చేరుకోవడం ..హాస్టల్ లో ఉండటం ..ఒకరోజు శివ నారాయణ కు సన్మానం జరుగుతుంటే ఆ సభ లో పాలుగోవడం ...అన్ని జరిగిపోయాయి ...ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న శివనారాయణ దర్శనం అవడం ..దగ్గరనుంచి చూడటం ..ఆ సభ లో పాలుగోవడం .అన్నీ పూర్తి అయిపోయి ప్రస్తుతం ..పిన్ని కూతురి హా స్టల్ రూ0 లో ఉంది ..ఆ జ్ఞాపకాలతో సతమతం అయి ..దీనంగా ఉంది ..దుప్పటి ముసుకు పెట్టుకొని ఘోరంగా కళ్లనీళ్లు పెట్టుకుంటూ ఉంటే ....పిన్నికూతురు కల్గించుకొని ..ఊరడిస్తున్నట్లుగా ..మాట్లాడి ..అస్సలు ఎందుకు ఇంతలా ఏ డుస్తున్నావు అక్కా అని అడిగింది ..మనస్సు విప్పి చెబితే ..నాకు ఏదైనా ఒక ఆలోచన తడితే చెప్తా కనీసం బైటకు చెప్పుకుంటే నీకు మనస్సు తేలిక పడుతుంది ..అని చాలాసేపు అస్సలు విషయం తెలుసుకోవడానికి నానా తంటాలు పడింది పిన్నికూతురు
అప్పుడు మొదలు పెట్టి తన కాలేజి జీవితం గురించి ...చెప్పడం ప్రారంభించింది ...
అలా. చెపుతూనే ఉంది ....శివనారాయణ ..తాను పక్క పక్క ఊరివాళ్ళు అవడం
పైగా ..వాళ్ళ కుటుంబం .అరుణా వాళ్ళ . స్వంత దేవాలయంలో అర్చకకుటుంబ0
గా రావడం ....ఇద్దరూ కల్సి చదువుకోవడం ..అరుణ వాళ్ళ నాన్నగారు అరుణ ని కాలేజి లో చేర్చి ...శివనారాయణ ని తోడుగా ఉండమని ప్రోత్సహించడం ..ఏ నాడు కూడా అమర్యాదగా ప్రవర్తించని ..అతగాడి నైజం ..ఇలా ఎన్నో విషయాలు
మంచి అనుభూతిగా చెప్పుకుంటూ పోతుంది ..అరుణకుమారి ...... మధ్యలో మధ్య లో ..ఏదో ఒక పని చేసుకుంటూ అలా మాట్లాడుకుంటున్నారు ..అయినా ఇంకే శివనారాయణ లే..మ్మా. ఆయన పక్కన ఓ విదేశీ ఆమె ఉంది గా పెళ్ళిఅయ్యిఉంటుంది వ్యుద్యోగం ..కాస్తంత సుఖపడుతున్నాడులే ..కానీ అది మ0చిదే గా ..కొంచం కోపంగా విసుగ్గా ఆడిపోసుకుంటున్నట్లు గా అంటుంది అరుణ ....నాకు డిన్నర్ వద్దు ...తినాలని లేదు . అని అరుణ చెబుతూన్నా బలవంతం గా పెరుగు అన్నం కొద్దీ గా తినిపించింది ఎలానో అలా....కాస్తంత దారిలో పడుతుంది లే అనుకుంటుంది ...ఆమె చెల్లెలు ...ఇక రాత్రి వేళ ..పున్నమి వెన్నెల ఇరగ కాస్తుంది కో0చెం చల్లగాలి కూడా వేస్తుంది ..అడవి మల్లెల గుబాలి0పులు...హాస్టల్ నిండా సువాసనలు ని0పేస్తున్నాయు ....ఎటు చూసినా ఆకుపచ్చగా ..మధ్యలో అక్కడ అక్కడ పూల గుత్తుల చెట్లు ...ఆ పక్కన పెద్ద కొండలు ..వెన్నెలో అందాలు ఇంకాస్త ఇనుమడిస్తున్నాయు. మంచాలపై దుప్పటి కప్పుకొని మాట్లాడు కొంటున్నారు ..టైం పెద్దగా అవలేదు ...ఇంతలో వార్డెన్ .నడుస్తున్న బూట్లు చప్పుడు .ఇద్దరు ..ముగ్గురు మాటలు పెద్దగా వినిపిస్తున్నాయి ....సార్ ఇదే రూమ్ నె0బర్ లో వుంటున్నారు ..అంటూ తలుపు కొడుతున్నారు ..మేడమ్ మేడమ్ అంటూ ..వెంటనే వచ్చి తలుపు తీసింది ...అరుణకుమారి ఏది అని పిలుస్తూ ..నేను శివ నారాయణ స్నేహితుడిని రాఘవులు ని ..వాడు అరుణ కుమారుని చూడటానికి వచ్చాడు ....పెద్దగా సంతోషంగా చెప్పాడు రాఘవులు ...అటుతిరిగి నిలబడింది
ఇంకే అతగాడు బాగుంటే చాలు ..మధ్యలో.నేను ఎందుకు ..లే ..నేను ఇక్కడ లేను అని చెప్పు ....చీర పమిటే నిండుగా కప్పుకొని మాట్లాడుతూంది అరుణ కుమారి ...ఆ మాటలు విన్న శివ నారాయణ ..సరే అమ్మయు గారు ..మీరు లేకపోతే నేను కూడా లేను ..కానీ ఇంత కాలం నేను ఎవ్వరి కోసం ఎంతగా తపస్సు చేశానో మీకే0 తెలుస్తుంది ...మీరు తప్పించుకొని పోయునప్పుడు ఆ రాత్రి మీ మనుషులు వచ్చి మమ్మల్ని ..నన్ను టార్చర్ పెట్టారు ..ఆయునా ఒక రాత్రి వేళ మా ఇంట్లోకి వస్తారు అని తెలిసి తలుపులు తీసి పెట్టి కిర్టీలోనుంచి మీ రాక కోసం ఎదురు చూశాను ..తెల్లవారి అడవి అంతా గాలించాను ..మీరు ఏమైపోయారో అని చాలాకాలం వెతికి వెతికి అలసిపోయాను ...ఇంతలా వెతుక్కుంటూ వస్తే ఇదేనా మేడమ్ మీరు అర్థం చేసుకుంది ..కృష్ణ కుమారి గారు సారి అరుణకుమారి గారు ....ఒక్కసారి మిమ్మల్ని చూసి వెళదామని వచ్చాను ..నా అన్నవాళ్ళు ఎవరూ లేరు ..నాకు మీరు .ఈ రాఘవ గాడు ఉన్నారని వెతుక్కుంటూ వచ్చాను ....మరి మీకే ఇష్టం లేనప్పుడు .మిమ్మల్ని బలవంత పెట్టలేను ..బహుశా ఇక మన0 కలుసుకోవడం కష్టం ..నేను నా దేశం వెళ్లిపోతున్నాను ...బై బై అమ్మాయి గారు ..జీవితంలో అందరూ దూరం అయిపోయారు అని బాధ పడేవాడ్ని మీకోసం మిమ్మల్ని ఒక్కసారి చూడాలని కలుసుకొని మాట్లాడుకోవాలని ఇంతకాలం బ్రతికి వున్నాను ... .ఏది ఏమైనా మీరు మంచిగా ఉంటే చాలు ....సంతోషంగా వెళ్లిపోతాను ...అంటూబైటకువచ్చి .. వెనుతిరిగాడు ..రాఘవులు కన్నీళ్లు పెట్టుకున్నాడు ..చూడమ్మా వాడు పెళ్లికూడా చేసుకోలేదు ..వాడికి దీనిమీద కోరిక కూడా లేదు..అనుకున్న చదువు ..అదీ నీ కలగా ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు ..వాడి అదృష్టమేమో నువ్వు కష్టపడకుండానే ..మాకు కనిపించావు నేను వాడికి అడ్రస్ చెప్పి పట్టుకొచ్చాను..నువ్వు కూడా పెళ్లికాకుండా ఉండి పోయావని నీ గురించి మొత్తం సేకరించాము .. ..వాడ్ని ఎలా ఆయునా పెళ్ళి చేసుకోమ్మా ..వాడికి జీవితం అంతా తోడుగా ఉండి సుఖపెట్టమ్మా ..ఇన్నాళ్లు కష్టాల కడలిలోనే ఉండిపోయాడు ..ఆదుకోమ్మా ..అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ బాధ పడుతూ వున్నాడు రాఘవులు .. ఇంతలో తాను కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ బొంగురు గొంతు తో బైటకు వచ్చి పిలూస్తుంది .అరుణ కుమారి .....ఒరేయ్ శివా ...అని కేక వేశాడురాఘవులు ..వెనక్కి తిరిగి చూశాడు శివ నారాయణ పరుగున ఆమె రూమ్ వైపుకు వస్తున్నాడు ..లోపలికి దారి తీస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది అరుణ ...గబ గబా రూ0 లోకి దూకి క్రింద నుంచి లేపి పట్టుకున్నాడు ...కొద్దిసేపటి తరువాత గట్టిగా కౌగిలించుకొంది శివనారాయణ నాకు చెప్పకుండానే పరిశోధనలు చేసి అంతర్జాతీయి శాస్త్రవేత్త వి అయ్యావా ..మరి ఇద్దరం కలిసి చేద్దా0 అంటే వినలేదు ..అని కొంచం బాధగా అనేస్తుంది ..అరుణకుమారి ..ఎం చేయమంటావు ..పరిస్థితులు అనుకూలించలేదు ...ఇప్పడు కల్సి చేద్దాం ఏముంది ..అన్నాడు మెల్లగా నవ్వుతూ శివనారాయణ ...నన్ను క్షమించు ఇందాక ఏదేదో మాట్లాడాను ...పర్వాలేదు ఇటు కూర్చో ..ఇద్దరూ ఎదురు ఎదురు మాట్లాడుకొంటూ కూర్చున్నారు ..మళ్ళీ బయట శబ్దం ..ఒక విదేశీయురాలు ..ఆమె తో ఒక గ్రూప్ జనం రూ0 లోకి వచ్చారు ..బాగుందమ్మా ...మేము డిన్నర్ చేసి వస్తామంటే మాకు చెప్పకుండా ..నీ దగ్గరికి వచ్చేశాడు శివగారు ....బాగుంది మొత్తానికి మిమ్మల్ని కలుసుకున్నారు ..మేమంతా ..ఆయన శిష్యులం ..అక్కడ యూ.ఎస్ లో వారి దగ్గర పరిశోధన చేస్తున్నాము ...అక్కడ ఏ సభ లో అయినా నీ పేరే జప0 చేస్తున్నారమ్మా .....నువ్వు లేకపోయినా ..కనిపించకపోయినా డిప్రెషన్ లోకి పోతున్నారు ..ఇంత మేధావి ఏమైపోతాడో అని కాపలా కాస్తూ వెంట తిరుగుతూ ఉన్నాం ..హమ్మయ్య ఇప్పటికి మా మనస్సు కుదుట పడింది ...అందరూ నవ్వుకున్నారు ...లేచి బైటకు నడుస్తున్నారు ..శివ నారాయణ మాత్రం తన కోటు తీసి అరుణ కి కప్పాడు ..బాగుంది కృష్ణకుమారి గారు ..వెరీబ్యూ టిఫుల్ ..ఉంచండి .వెంటనే పెద్దగా ఏడుస్తూ కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ శివ నారాయణ గుండెల పై వాలిపోయుంది దగ్గరకు తీసుకొని ..ఓదార్చాడు.రేపు వస్తాం బయటకు వెళ్లి అన్ని విషయాలు మాట్లాడుకుందాం ...బై చెప్పి కొత్త తేజస్సు తో ..రెట్టించిన ఉత్సాహం తో బైటకు నడిచాడు ..శివ నారాయణ ..అక్కా.. నువ్వు లక్కీ ....కొంటెగా నవ్వుతో0ది..ఇంతకాలంనీ ..నిరీక్షణ ఫలించింది. ..అవునమ్మా ..దేవుని దయతో ..మళ్ళీ కలుసుకోగలిగాము .రేపు ..అమ్మా వాళ్ళ దగ్గరికి వెళదాం ..అన్నివిషయలు ..మాట్లాడుకుందాము ...ఇక పడుకో ...చెల్లెమ్మా ..అంటూ తనివితీరా మనస్సు పూర్తిగా నవ్వేస్తుంది ..అరుణకుమారి ..
(The End................శుభం ............
Blog Archive
-
▼
2021
(189)
-
▼
November
(21)
- 🌹కార్తీమాసం లో తిరుమల తిరుపతి క్షేత్రములోనికపిలతీ...
- 🙏🌹శ్రీ వేంకటేశ్వర స్వామివారి పై బొమ్మల తో కూడిన ...
- 🌹🌹🙏శ్రీమద్భాగవతము... ఆ శ్రీమహావిష్ణుకథా మృతం సే...
- 🌷🙏శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి అనుభవాలు 🌷🙏
- 🌝😀ఈ లింక్ లో నేటి రాజకీయ ఉంది ..ఆ మసాలా చూద్దాం ...
- 🙏🌹 శ్రీమద్ భాగవతం ..ఇ. కే ..ఎక్కిరాల కృష్ణమాచా...
- 🌷🌷🌷చిన్న జీయర్ వారికి సీఎం జగనరెడ్డి గారి పాదాభ...
- 🌷🙏కార్తీకపౌర్ణమి ...శివకేశవుల ఆరాధనా విశేషాలు🌷...
- 🌷🙏Personality development...selfmotivation🙏🌷
- 🌷🌷🌷🙏ద్వాదశినాడు జరుపుకొనే ఉసిరి....తులసి శ్రీ ...
- 🌷🙏చిన్న జీయర్ స్వామి వారి మాటల్లోశ్రీవైష్ణవమతం p...
- 🌹🙏 చిన్న జీయర్ స్వామివారి మాటల్లో శ్రీవైష్ణవమ...
- 🙏🙏🌷నాగదేవతఆదిశేషుని దయ ....భాగవత ములో ఇంకా ఇలా...
- 🌹🌹నాగుల చవితి శుభాకాంక్షలు ....పండుగ గురించి కొన...
- 🌺🙏నాగుల చవితి శుభాకాంక్షలు ..శేషుని ..మరియు ఇంకా...
- 🙏🌹కార్తీకమాసం ..కార్తీకపురాణం గురించి కొన్ని విష...
- 🙏🙏🌹ప్లవ నామ సంవత్సర దీపావళి శుభాకాంక్షలు 🌹🙏
- ప్లవ నామ సంవత్సర దీపావళి శుభాకాంక్షలు
- 🙏🌹అందరికిప్లవ నామ స0వత్సరదీపావళి శుభాకాంక్షలు 🙏🌷
- 🙏🌹 శ్రీ లంక లో సీతమ్మ వారు కూర్చున్న రాయు🌹🙏
- 🌝15part నిరీక్షణ. కథానిక .......short story ...
-
▼
November
(21)
Followers
About Me
- Dr.M muralikrishna