Pages

Sri Maha Lakshmi swaroopam Bilwa vruksham

సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి మాతే.. బిల్వ వృక్షం..


మొదట శ్రీ మహావిష్ణువు హృదయంలో శివునికి మాత్రమే స్థానం ఉండేది. .. పాలకడలిలో ఉద్భవించిన తర్వాత.. నాకా స్థానం కావాలని శ్రీ మహాలక్ష్మీ స్వామిని వేడుకోగా.. శివుడినే ప్రార్థించమన్నాడు.. శ్రీ మహావిష్ణువు..


అమ్మ 1,000 సం.లకు పైగానే పరమశివుని కోసం తపస్సు చేసినా.. ఫలితం లేకపోవడంతో అమ్మ తన శరీర భాగాలను ఖండించుకుంటూ యజ్ఞంలో హవిస్సులుగా సమర్పించగా.. శివ సాక్షాత్కారం లభించింది..


అమ్మను అనుగ్రహించి.. కోరిన వరాన్నిస్తూ.. అమ్మ భక్తికి మెచ్చి.. ఆమె బలిదానానికి గుర్తుగా.. ఆ అవయవాలను బిల్వ వృక్షాలుగా మార్చి.. అవే ఎన్నటికీ నాకు ప్రీతికరమైనవిగా వరాన్నిచ్చాడు.. పరమేశ్వరుడు..


అప్పటినుంచి అమ్మ విష్ణు వక్షస్థల నివాసిని కాగా.. అమ్మకు బిల్వ వనమే నివాసం.. బిల్వ పత్రాలు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనాయి..  ఎండిపోయినా కూడా పూజకు వాడవచ్చు.. అంత పరమ పవిత్రమైనవీ బిల్వ పత్రాలు.. అంత ప్రీతికరం పరమేశ్వరునికి.. ఒక్క బిల్వపత్రం చాలు శివుణ్ని ప్రసన్నం చేసుకోడానికి.


 .......................................
శ్లో॥ బిల్వాటవీ మధ్య లసత్ సరోజే
 సహస్ర పత్రే సుఖ సన్నివిష్టామ్ ।
 అష్టాపదాంభోరుహ పాణిపద్మాం
 సువర్ణ వర్ణామ్ ప్రణమామి లక్ష్మీమ్ ॥



తాత్పర్యము : మారేడు చెట్ల తోఁట మధ్యలో వేయి దళముల పద్మమునందు సుఖముగా ఆసీనురాలైనదియు, బంగారు వన్నెతో ప్రకాశించునదియు, బంగారు కమలములను తన చేతినుండి జారవిడచుచున్నదియు నైన శ్రీ మహాలక్ష్మీ భగవతికి భక్తితో ప్రణమిల్లుచున్నాను.


ఈ బిల్వ పత్రాలు అంత పవిత్ర మైనవి , శివ కేశవులకు ఇద్దరికీ ప్రీతికరమైనవి కనుకనే తిరుమల లో శ్రీవారికి కూడా కొన్ని ప్రత్యేక మైన రోజుల్లో ఈ మారేడు దళాలను సమర్పిస్తారు.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online